న్యాయవ్యవస్థపై అవినీతి పాఠం.. ‘సుప్రీం’ సీరియస్ | Supreme Court serious about the lesson of judicial corruption | Sakshi
Sakshi News home page

న్యాయవ్యవస్థపై అవినీతి పాఠం.. ‘సుప్రీం’ సీరియస్

Feb 26 2026 11:45 AM | Updated on Feb 26 2026 3:20 PM

Supreme Court serious about the lesson of judicial corruption

ఢిల్లీ: ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో న్యాయవ్యవస్థపై అవినీతి పాఠం ఉండటంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సుమోటోగా కేసు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం న్యాయవ్యవస్థపై దాడి జరుగుతోందని వ్యాఖ్యానించింది. న్యాయవ్యవస్థ అవినీతిమయమని బోధిస్తున్నారా ? అని సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పుస్తకంలోని ఆ చాప్టర్ ను ఉపసంహరించినా పుస్తకాలు ఆన్లైన్, మార్కెట్లోనే ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. ఈ విచారణ నేపధ్యంలో ఎన్సీఈఆర్టీ క్షమాపణలు తెలిపింది. కేంద్ర విద్యాశాఖ సెక్రటరీ, ఎన్సీఈఆర్టీ చైర్మన్‌లకు ధర్మాసనం  షోకాజ్  నోటీస్ జారీ చేసింది. దానిలో కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని  కోరింది. ఈ చాప్టర్‌కి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, కేంద్ర , రాష్ట్ర విద్యాశాఖలు సమన్వయంతో వ్యవహరించి సర్క్యులేషన్ లో ఉన్న పుస్తకాలను సీజ్ చేయాలని తెలిపింది.

ఫిజికల్, డిజిటల్  ప్లాట్ ఫామ్ లలో ఈ   పాఠాన్ని తొలగించాలని, ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దీనికి వ్యక్తిగతంగా  బాధ్యత తీసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. అన్ని రాష్ట్రాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఈ ఆదేశాలను  అమలు చేయాలి, అఫిడవిట్ దాఖలు చేయాలి. ఈ వివాదాస్పద కంటెంట్ ను తయారు చేసిన రచయితల పేర్లను, వివరాలు ఇవ్వాలని ధర్మాసనం కోరింది. న్యాయవ్యవస్థ పై దాడి జరుగుతోందని వ్యాఖ్యానించింది. 

న్యాయవ్యవస్థపై అభ్యంతరకర పాఠంపై సుప్రీంకోర్టు సీరియస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement