భారత్‌లో పర్యటిస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. హైదరాబాద్ హౌస్‌లో 23వ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు కూడా. డిసెంబర్ 2021 అనంతరం తొలిసారిగా ఈ శిఖరాగ్ర సమావేశానికి భారతదేశంలో ఉన్నారు పుతిన్. ప్రధాని మోదీ ఆయనకు రష్యన్ ఎడిషన్‌తో కూడిన భగవద్గీతను గిఫ్ట్‌గా ఇచ్చారు కూడా. అలాగే గత శుక్రవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో కేంద్ర మంత్రులు, దౌత్యవేత్తలకు గ్రాండ్‌గా విందు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సమావేశ ముగిసింది. అయితే ఆ విందు చాలా ప్రత్యేకతను సంతరించుకుంది కూడా. ఈ నేపథ్యంలో మెనూలో వడ్డించిన వంటకాలేంటి..వాటి ప్రత్యేకతలు గురించి తెలుసుకుందామా..!.
మోనూ మొత్తం శాకాహార వంటకాలే ఉన్నాయి.భారతదేశం అంతటా ఉన్న ప్రాంతీయ వంటకాల జాబితాను అందించారు. ఈ జాబితాలో పశ్చిమబెంగాల్ నుంచి గుర్‌సందేశ్, ఉత్తర భారతదేశం నుంచి పసుపు పప్పు తడ్కా, దక్షిణ ప్రాంతాల నుంచి మురుక్కు టిబెట్, నేపాల్ సరిహద్దుల నుంచి జోల్ మోమో, జమ్మూ కశ్మీర్ నుంచి గుచ్చిడూన్ చెటిన్(వాల్నట్ చట్నీతో వడ్డించే స్టఫ్డ్ మోరెల్ పుట్టగొడుగులు) ఉన్నాయి.
ఈ రెసిపీలో గుచ్చి పుట్టగొడుగుల వంటకం అత్యంత స్పెషల్. అంత సులభంగా వండుకునే అవకాశం ఉండదే. అలాగే ఎప్పుడు పడితే అప్పుడ తినలేం కూడా.
ఎందువల్ల అంటే..
ఈ కాశ్మీరీ వంటకం దాని మూలం కారణంగానే అని చెప్పొచ్చు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో అరుదుగా లభించే పుట్టగొడుగులివి. అందువల్లే ఇది కిలో దాదాపు రూ. 35 వేలు నుంచి రూ. 40 వేలు వరకు పలుకుతుంది. ఇవి అడవిలోనే లభిస్తాయి. వీటిని ప్రత్యేకంగా పెంచడం సాధ్యం కాదు. వీటికి ఒక విధమైన నేల రకం, నిర్ధిష్ట ఉష్ణోగ్రత అవసరం. హిమపాతం సీజన్ ముగిసిన వెంటనే వసంతకాలం సమయానికి హిమాలయ ప్రాంతంలో ఇవి దర్శనమిస్తాయి.
అనుకోని అటవీ మంటల తర్వాత కూడా వీటిన సాగు చేయొచ్చట. అదే దీనిలో స్పెషాలిటీ అట. ఈ ప్రత్యేకత కలిగిన గుచ్చి పుట్టగొడుగులను కనిపెట్టడం కూడా సవాలట. కొన్ని వారాలపాటు మాత్రమే సాగయ్యే ఈ పుట్టగొడుగును అన్వేషించడం ఓ టాస్క్‌లా ఉంటుందట. అదీగాక పాకశాస్త్రంలో వీటికి ఉన్న టేస్టే వేరేలెవెల్ అట. పైగా సంప్రదాయ వైద్యలో ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రజలు విరివిగా వినయోగించడంతో వీటికి అధిక డిమాండ్ ఉందట. ప్రపంచంలో అత్యంత ఖరీదైన పుట్టగొడుగులగా ఇవి ప్రసిద్ధిగాంచినవి.
ఈ మష్రూమ్‌తో చేసే వంటకాలు..
గుచ్చి పులావ్, యాఖ్ని, రోగంజోష్, వంటి శాకాహార వంటకాలను చేస్తారుట. పైగా మాంసానికి ప్రత్యామ్నాయ వంటకంగా ఆస్వాదిస్తారట ఆహారప్రియులు. అంత ప్రత్యేకతలు కలిగిన ఖరీదైన పుట్టగొడుగులు కావడంతోనే ఈ గుచ్చి డూన్ చెటిన్ రాష్ట్రపతి భవన్‌లో వ్లాదిమిర్ పుతిన్ విందు కోసం మెనూలో స్పెషల్‌గా ఏర్పాటు చేశారట.
(చదవండి: దోసెల రెస్టారెంట్ కోసం..టెక్ ఉద్యోగాన్ని వదిలేశాడు! కట్‌చేస్తే..)


