ఒకప్పుడు... ‘సివిల్ సర్వీసెస్ పరీక్షలలో మహిళలు’ అనేమాట ఊహకు అందేది కాదు. ఇప్పుడు... ఆర్థిక, సామాజిక పరిమితులను అధిగమిస్తూ సివిల్స్ లో సత్తా చాటుతున్నారు...
⇒ 24 - 35%: ఇండియన్ సివిల్ సర్వీసెస్‌లో మహిళలప్రాతినిధ్యం 2019లో 24 శాతం ఉండగా 2023లో 35 శాతానికి పెరిగింది.
⇒ 41%: 2023 ఐఏఎస్ బ్యాచ్‌లో రికార్డ్ స్థాయిలో 41 శాతం మంది మహిళలు ఉన్నారు.
⇒ 18%: అత్యున్నత స్థాయి పదవుల విషయానికి వస్తే, కేంద్రస్థాయి కార్యదర్శులలో 18 శాతం మంది మహిళలు ఉన్నారు.
అసామాన్య విజేతలు
ఆర్థిక, ఆరోగ్య పరిమితులు ఆశయ సాధనకు అడ్డుకాదని నిరూపించారు యూపీఎస్‌సీ–2026 పరీక్షలో విజయం సాధించిన ఎంతోమంది మహిళలు.
⇒ డాక్టర్ కావాలని కలలు కన్న కేరళంలోని కోజికోడ్‌కు చెందిన అథిరా మగతన్ రోడ్డు ప్రమాదానికి గురై శరీరమంతా చచ్చుబడి΄ోయింది. రెండు సంవత్సరాలు జ్ఞాపకశక్తిని కోల్పోయింది. జ్ఞాపకశక్తి తిరిగి వచ్చిన తరవాత చదువుకోవాలనే సంకల్ప బలం పెరిగింది... దాని ఫలితమే సివిల్స్‌లో ఆమె 483 ర్యాంక్.
⇒ పెద్దపల్లి జిల్లాకు చెందిన గుడెల్లి సృజన 55వ ర్యాంకు సాధించింది. ఆమె తండ్రి సింగరేణి కార్మికుడు.
⇒ పాటియాలాలోని సభాకు చెందిన సిమ్రాన్‌దీప్ కౌర్ యూపీఎస్‌సీలో ఆల్ ఇండియా ర్యాంక్ 15 సాధించింది. కౌర్ తండ్రి సామాన్య రైతు.
⇒ కేరళలోని నెయ్యట్టింకరకు చెందిన ఎఎస్ శ్రీజ చిన్న స్టడీ రూమ్‌లో సంస్కృతం నుంచి ఆంగ్లం వరకు ఎన్నో స్ఫూర్తిదాయకమైన కొటేషన్‌లు కనిపిస్తాయి. తాను మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించడానికి ఆ కొటేషన్‌లు ఎంతో బలాన్ని ఇచ్చాయి. తండ్రి కన్‌స్ట్రక్షన్ వర్కర్. తల్లి సాధారణ గృహిణి.
⇒ గుజరాత్‌లోని కాండ్లా పట్టణానికి చెందిన ఆస్తా జైన్ ఆల్ ఇండియా ర్యాంక్ 9 సాధించింది. ఆమె తండ్రి లక్ష్మీనారాయణ్ ఆలయం సమీపంలో చిన్న మిఠాయి దుకాణం నడుపుతున్నాడు. ∙పంజాబ్‌లోని చిన్న గ్రామానికి చెందిన సిమ్రాన్‌దీప్ కౌర్ మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా స్థాయిలో 51 వ ర్యాంక్ సాధించింది. ఆమె తండ్రి జస్వీందర్‌సింగ్ పంజాబ్ స్టేట్ పవర్ కార్పోరేషన్ లిమిటెడ్‌లో లైన్‌మన్‌గా పనిచేస్తున్నారు. తల్లి స్వరణ్ కౌర్ గృహిణి.
⇒ మధురైకి చెందిన రాజేశ్వరీ సువే డిప్యూటీ కలెక్టర్ గా పనిచేసేది. అయినా ఆమె సంతృప్తి పడలేదు. తాజాగా యూసీఎస్‌సీలో కూడా సత్తా చాటింది. మొదటి అయిదు ర్యాంకులలో రాజేశ్వరీ ఏకైక మహిళా టాపర్.


