సాక్షి, హైదరాబాద్ : గతంలో మహిళలపై వేదింపులు పట్టణాలకే పరిమితమయ్యేవని కానీ ప్రస్తుత రోజుల్లో వాటి పరిధి పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జేఎన్‌టీయూ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన "స్టాండ్ విత్ హర్" కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సోషల్ మీడియా కారణంగానే మహిళలపై వేదింపులు పెరిగాయని సీఎం అన్నారు.
నారీమణుల భద్రత కోసం కేవలం చట్టాలు చేయడం మాత్రమే కాదని వాటిని అమలు చేసి తీరాలని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో అన్ని పథకాలు మహిళల పేరు మీదే అమలు చేస్తున్నామన్నారు. మహిళ సంఘాల ద్వారా ఆర్టీసీలో 1000 బస్సులు నడుపుతున్నామని రాష్ట్రం అభివృద్ధిలో దూసుకపోతుందని తెలిపారు.
మహిళల భద్రత కోసం పురుషులు ముందుకు రావాలనే సందేశంతో తెలంగాణ పోలీస్ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. "స్టాండ్ విత్ హర్" ప్రోగ్రామ్‌కి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు, డీజీపీ శివధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


