తెలుగు రాష్ట్రాల్లో అగ్రస్థానం.. సివిల్స్‌లో సృజన సత్తా | Singareni Employee Daughter Srujana Gets 55th Rank In Civils Results | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో అగ్రస్థానం.. సివిల్స్‌లో సృజన సత్తా

Mar 7 2026 11:43 AM | Updated on Mar 7 2026 12:00 PM

Singareni Employee Daughter Srujana Gets 55th Rank In Civils Results

ఇటీవల గ్రూప్‌ – వన్‌లో డీఎస్పీగా ఎంపికై శిక్షణ తీసుకుంటూనే.. 

 సివిల్స్‌ ఆలిండియా 55వ ర్యాంక్‌ సాధించిన గుడెల్లి సృజన 

తెలుగు రాష్ట్రాల నుంచి టాప్‌  ర్యాంకర్‌ పెద్దపల్లివాసే 

సంబురాల్లో తల్లిదండ్రులు వెలువెత్తిన అభినందనలు  

సాక్షి పెద్దపల్లి: తన లక్ష్యం సివిల్స్‌.. ఐదుసార్లు ప్రయత్నించి విఫలమైనా కలత చెందకుండా, ధైర్యం, పట్టుదల తో ముందుడుగు వేసి ఆరోప్రయత్నంలో రాష్ట్రంలో నే ఫస్ట్‌ర్యాంకుతో సత్తాచాటారు సింగరేణి కార్మికుడి కూమార్తె గుడెల్లి సృజన. యూనియన్‌ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ శుక్రవారం విడుదల చేసిన సివిల్స్‌ ఫలితా ల్లో జాతీయ స్థాయిలో 55వ ర్యాంక్, తెలుగు రాష్ట్రా ల్లో ఫస్ట్‌ర్యాంకర్‌గా అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. దీంతో పెద్దపల్లి జిల్లా పేరు రాష్ట్రవ్యాప్తంగా మార్మోగుతోంది. 

రెండు ఉద్యోగాలు సాధించి.. 
పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన గుడెల్లి రాజేశం – రాణి దంపతుల కూమార్తె సృజన ఆర్నెల్ల వ్యవధిలోనే రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి జౌరా అనిపించారు. సింగరేణి ఆర్జీ –3 ఏరియా ఓసీపీ – వన్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రాజేశం – రాణి దంపతుల ప్రోత్సాహంతో ఆమె రాష్ట్రస్థాయిలో టాపర్‌గా నిలిచి శెభాష్‌ అనిపించుకున్నారు. ఫలితాల అనంతరం సృజనతోపాటు ఆమె తల్లితండ్రులకు సింగరేణి అధికారులు, కారి్మక సంఘం నాయకులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. 

టీసీఎస్‌లో జాబ్‌ వచి్చనా.. సివిల్స్‌ వైపే మెగ్గు 
సృజన రామగిరి మండలంలో స్థానికంగా ఉన్న వాణి సెకండరీ పాఠశాలలో ఎల్‌కేజీ నుంచి టెన్త్‌ వరకు చదివారు. 2012–2014 వరకు మియాపూర్‌లోని శ్రీచైతన్యలో ఇంటర్‌ పూర్తిచేశారు. మంథని జేఎనీ్టయూలో 2014–18 వరకు బీటెక్‌లో సీఈసీ పూర్తి చేశారు. అప్పటి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ను చూసి ఐఏఎస్‌ ఆఫీసర్‌ను కావాలని కలలుగన్న సృజన.. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో టీసీఎస్‌లో జాబ్‌ వచి్చనా.. అందు లో చేరకుండా సివిల్స్‌ ప్రిపరేషన్‌ వైపే మొగ్గు చూ పారు. 

ఇందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం తోడైంది. దీంతో 2018లో ఢిల్లీలోని ప్రముఖ వాజీరావు ఐఏఎస్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరి శిక్షణ తీసుకున్నారు. ఈక్రమంలో వరుసగా ఐదుసార్లు పరాజయం పాలైనా ఏమాత్రం వెరవలేదు. పట్టుదలగా చదవి విజయం సొంతం చేసుకున్నారు. గతేడాది సివిల్స్‌ ఇంటర్వ్యూ వరకు వెళ్లి వెనక్కి వచ్చినా.. నిరాశ చెందక ప్రిపరేషన్‌ కొనసాగించారు. ఈక్రమంలోనే తెలంగాణ గ్రూప్‌ – వన్‌ పరీక్షలు రాసి 35వ ర్యాంక్‌తో డీఎస్పీ జాబ్‌ సాధించారు. డీఎస్పీ శిక్షణ తీసుకుంటూనే సివిల్స్‌కి సన్నద్ధమయ్యారు. అదనపు డీజీపీ మహేశ్‌ ఎం.భగవత్‌ సలహాలతో ఈసారి ఏకంగా ఆలిండియా 55వ ర్యాంకు సాధించి జిల్లాపేరును అగ్రస్థానంలో నిలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement