షాద్‌నగర్ విద్యార్థిని సత్తా.. సివిల్ సర్వీసెస్‌లో 627 ర్యాంక్ | Shadnagar Bakery Owner Daughter Indrarchita Secures 627 Rank In UPSC Civil Services, Check Story About Her | Sakshi
Sakshi News home page

షాద్‌నగర్ విద్యార్థిని సత్తా.. సివిల్ సర్వీసెస్‌లో 627 ర్యాంక్

Mar 7 2026 11:31 AM | Updated on Mar 7 2026 11:45 AM

shadnagar girl indrarchita secures 627 rank in upsc civil services

రంగారెడ్డి జిల్లా: పట్టువదలకుండా శ్రమించింది. చదువుపైనే దృష్టి సారించింది. చివరికి అనుకున్న లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చి అందరికీ ఆదర్శంగా నిలిచింది. దేశంలోనే అత్యున్నత సర్వీస్‌గా భావించే సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాల్లో జాతీయ స్థాయిలో షాద్‌నగర్‌ విద్యార్థిని సత్తా చాటింది. 

గత ఏడాదికంటే మెరుగ్గా.. 
షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన రాఘవేందర్‌ పదుకొనె, మమత దంపతులకు ముగ్గురు సంతానం. వారిలో చిన్న కూతురు ఇంద్రార్చిత. తండ్రి షాద్‌నగర్‌లో బేకరీ నిర్వహిస్తున్నాడు. ఇంద్రార్చిత  అఖిత భారత సర్వీస్‌ నియామకాలకు సంబంధించి యూపీఎస్సీ నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్ పరీక్షల్లో సత్తా చాటింది. శుక్రవారం  విడుదల చేసిన ఫలితాల్లో ఆమె 627 ర్యాంకు సాధించింది. గతేడాది నిర్వహించిన పరీక్షల్లో 735 ర్యాంకు సాధించింది. తిరిగి ఈ ఏడాది పరీక్ష రాసి గతంలో కంటే మెరుగైన ర్యాంకు సాధించింది.  

ఇదీ అక్షరయాత్ర 
ఇంద్రార్చిత షాద్‌నగర్‌లో ఉన్న హెరిటేజ్‌ వ్యాలీ పాఠశాలలో 1 నుండి 10వ తరగతి వరకు అభ్యసించింది. తర్వాత హైదరాబాద్‌లోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఉమెన్‌లో ఇంటర్, డిగ్రీ పూర్తి చేసింది. అనంతరం ఇగ్నో యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ పూర్తి చేసింది. పబ్లిక్‌ సరీ్వస్‌పై ఆసక్తి పెంచుకున్న ఆమె ఢిల్లీ వెళ్లి కోచింగ్‌ తీసుకొని సివిల్స్‌కు సిద్ధమైంది. సివిల్స్‌ ర్యాంకు సాధించడంతో పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement