సీఎం రేవంత్‌ సమక్షంలో లొంగిపోనున్న మావోయిస్టులు.. గణపతిపై క్లారిటీ? | Huge Number Of Maoists Surrender Before Telangana CM Revanth Reddy, Check More Details | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌ సమక్షంలో లొంగిపోనున్న మావోయిస్టులు.. గణపతిపై క్లారిటీ?

Mar 7 2026 10:45 AM | Updated on Mar 7 2026 11:21 AM

Huge Number of Maoists Surrender In Telangana

సాక్షి, హైదరాబాద్‌: మావోయిస్టుల ఉద్యమం చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో మావోయిస్టులకు భారీ షాక్‌ తగిలింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఎదుట భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోనున్నారు. 100 మంది పీఎల్‌జీఏ మావోయిస్టులు లొంగిపోతున్నట్టు సమాచారం. దేవ్‌జీకి చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తం సరెండర్‌ కానున్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించనున్నారు. సీఎం సమక్షంలో ఆయుధాలతో సహా మావోయిస్టులు లొంగిపోనున్నారు. ఈ సందర్బంగా బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడతారు. మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటుపై సీఎం రేవంత్‌ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. లొంగిపోతున్న వారిలో పీఎల్‌జీఏ బెటాలియన్‌ కంపెనీ కమాండర్‌ కొరసా లక్కు, ఉకి కల్లు, చలసాని నవత, అరుణ, సుధాకర్‌ ఉన్నట్టు తెలుస్తోంది. 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement