breaking news
Maoists
-
లొంగుబాట్లు.. ప్రమాదాలు.. విచారణలు
తెలంగాణలో ఈ ఏడాది కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న మావోయిస్టుల ఉద్యమానికి ఓవైపు కోలుకోలేని ఎదురుదెబ్బ తగలగా మరోవైపు గతంలో ఎన్నడూ చూడని తరహాలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాలు, దుర్ఘటనలు అంతులేని విషాదం నింపాయి. ఇక ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ–కారు రేసు కేసులు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించాయి. మరోవైపు రూ. వందల కోట్లు వెనకేసిన భారీ అవినీతి తిమింగలాల ఉదంతాలు కూడా ఈ ఏడాదే బట్టబయలయ్యాయి. అలాగే పోలీసు బృందాలు ‘డేగ’ కళ్లతో నిఘా వేసి మత్తు ముఠాల భరతం పట్టాయి. మొత్తంగా 2025లో జరిగిన ప్రధాన నేర, విషాద ఘటనలపై సింహావలోకనం ఇది. – సాక్షి, హైదరాబాద్వరుస ఎన్కౌంటర్లతో మావోల లొంగు‘బాట’మే: మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మరణించాడు.నవంబర్: మావోయిస్టు కీలక కమాండర్, సెంట్రల్ కమిటీ సభ్యుడు మడావి హిడ్మా ఏపీ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందాడు.సెప్టెంబర్13: సుజాత అలియాస్ కల్పన, మైనక్క తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు.అక్టోబర్: మల్లోజుల వేణుగోపాల్‌రావు అలియాస్ భూపతి మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోగా పుల్లారి ప్రసాద్‌రావు అలియాస్ చంద్రన్న తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.డిసెంబర్: సెంట్రల్ కమిటీ సభ్యుడు గణేశ్ ఉయికే ఒడిశాలో జరిగిన ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయాడు.» మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు సహా వివిధ సందర్భాల్లో కలిపి ఈ ఏడాది తెలంగాణ పోలీసుల ఎదుట మొత్తం 509 మంది మావోయిస్టులు లొంగిపోయారు.» రాష్ట్రానికి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి (అలియాస్ దేవ్‌జీ) లొంగిపోయేందుకు కేంద్ర హోంశాఖతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.కాకరేపిన రాజకీయ పరిణామాలు..» గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్నట్లుగా వెలుగు లోకి వచ్చిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతూ వచ్చింది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు పోలీసుల ఎదుట లొంగిపోవడం, కోర్టు అనుమ తితో పోలీసులు ఆయన్ను విచారించడం చకచకా జరిగిపోయాయి. కేసు తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం కీలక పరిణామం.వెలుగులోకి భారీ అవినీతి అనకొండలు...ఏప్రిల్ 26: కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ హరిరామ్ అక్రమార్జనపై ఏసీబీ సోదాలు చేసి అరెస్టు చేసింది. హరిరామ్ అక్రమాస్తుల విలువ రూ. 100 కోట్లకుపైనే ఉంటుందనే అంచనా ఉంది.జూన్ 11: సాగునీటి శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)గా పనిచేసిన నూనె శ్రీధర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు సోదాల్లో భారీ ఆస్తులు గుర్తించారు. మొత్తంగా రూ. 200 కోట్ల వరకు అక్రమార్జన సొమ్ము పోగేసినట్లు ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు.జూలై 15: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన మాజీ ఈఎన్సీ సి. మురళీధర్‌రావుపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి ఏకకాలంలో 11 ప్రాంతాల్లో సోదాలు చేశారు. మురళీధర్‌రావు అక్రమార్జన రూ. 450 కోట్లకు పైనే ఉంటుందని అధికారులు అంచనా వేశారు.డిసెంబర్ 23: మహబూబ్‌నగర్ జిల్లాలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్‌గా పనిచేస్తున్న ముడ్ కిషన్ అక్రమార్జనపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. ఆయన వద్ద మొత్తం రూ. 200 కోట్లకుపైగా అక్రమాస్తులను గుర్తించారు.సెప్టెంబర్: టీజీ ఎస్పీడీసీఎల్లో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అంబేడ్కర్ ఎరుగుపై అవినీతి ఆరోపణలతో ఏసీబీ సోదాలు చేపట్టారు. నెలకు రూ. 75,800 వేతనం ఉన్న ఆయన వద్ద ఇప్పటివరకు గుర్తించిన అక్రమాస్తుల మార్కెట్ విలువ రూ. 100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేసింది.డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక బలగం..జూన్ 26: డ్రగ్స్ కట్టడికి కీలక ముందడుగు పడింది. ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ (ఈగల్) ఫోర్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ‘ఈగల్’ అధికారులు రాష్ట్ర, అంతర్రాష్ట్ర పరిధిలో డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాల కట్టడితోపాటు నైజీరియన్ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేస్తూ వస్తున్నారు. గత 3 నెలల్లో మూడు ఆపరే షన్లు నిర్వహించి 132 మందిని అరెస్ట్ చేశారు. ఇటీవల ఢిల్లీలో చేపట్టిన భారీ ఆపరేషన్‌లో నైజీరియన్ల అరెస్టుతో తెలంగాణ ‘ఈగల్’ జాతీయ స్థాయిలో పేరు పొందింది.దుర్ఘటనల్లో మృత్యుకేళి..ఫిబ్రవరి 22: నాగర్‌కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టులో నిర్మాణంలో ఉన్న సొరంగం పైకప్పు కుప్పకూలడంతో ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు సాంకేతిక సిబ్బంది, నలుగురు కార్మికులతో కలిపి మొత్తం 8 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా ప్రయత్నించినా... ఎన్డీఆర్ఎఫ్, సైన్యం, నౌకాదళం సహా 20కిపైగా ఏజెన్సీలు రంగంలోకి దిగినా కాపాడలేకపోయాయి.మే 18: హైదరాబాద్ గుల్జార్ హౌస్‌లోని ఒక భవనంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబంలోని 17 మంది సజీవదహనమయ్యారు.జూన్ 30: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడులో ఏకంగా 46 మంది మృతిచెందారు. మరో 33 మందికిపైగా గాయపడ్డారు.అక్టోబర్ 25: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ బస్సు అగ్నిప్రమాదానికి గురవడంతో 19 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు.నవంబర్ 3: చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సును కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టి దానిపై ఒరిగిపోవడంతో 19 మంది కంకరలో కూరుకుపోయి సజీవదహన మయ్యారు. మరో 27 మంది గాయాలపాలయ్యారు.నవంబర్ 17: హైదరాబాద్‌కు చెందిన ముస్లింలు ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా నుంచి మదీనాకు బస్సులో వెళ్తుండగా డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 45 మంది పాతబస్తీవాసులు మరణించారు. వారిలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది సభ్యులున్నారు. -
చారిత్రాత్మక విజయం : మార్చి 31 నాటికి నక్సలిజం అంతం
సాక్షి, హైదరాబాద్: నిషేధిత మావోయిస్ట్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో జరిగిన భారీ ఎన్ కౌంటర్లో ఒడిశా ఇన్ఛార్జ్ గణేష్ ఉయికే (69) సహా ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. గురువారం ఉదయం కంధమాల్-గంజాం జిల్లా సరిహద్దులోని దట్టమైన రాంపా అటవీ ప్రాంతంలో ఒడిశా పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజి), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) మరియు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్)లతో కూడిన ఉమ్మడి భద్రతా దళంతో జరిగిన ఎన్‌కౌంటర్‌గణేష్ ఉయికేతో పాటు ఇద్దరు మహిళా మావోయిస్టులు సహా మొత్తం నలుగురి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఈ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పందించారు. గణేష్ ఉయికే మృతిని ధృవీకరించిరిన అమిత్‌షా 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలిస్తాం అంటూ హోం మంత్రి ట్వీట్ చేశారు. ‘‘నక్సల్ రహిత భారత్ దిశగా ఒక ముఖ్యమైన మైలురాయి"గా హోంమంత్రి అభివర్ణించారు. అటు ఇది మన దళాలకు చారిత్రాత్మక విజయం. రూ. 1.1 కోట్ల రివార్డు ఉన్న నాయకుడి నిర్మూలనతో ఈ ప్రాంతంలోని మావోయిస్టుల నడ్డి విరిచినట్టేనని ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్న ఒక సీనియర్ అధికారి తెలిపారు. కాగా ఈ ఆపరేషన్ భారత ప్రభుత్వాన్ని మార్చి 2026 నాటికి మావోయిస్టు రహిత దేశాన్ని చేయాలనే తన లక్ష్యానికి దగ్గరి చేస్తోంది. ఈ ఏడాది మే నెలలో జనరల్ సెక్రటరీ బసవరాజ్,నవంబర్‌లో కమాండర్ హిడ్మాలను మట్టు బెట్టడంతో కేంద్ర కమిటీ కుప్పకూలింది. అటు అగ్ర మావోయిస్టు నాయకులతోపాటు లొంగిపోతున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది.జిరామ్ ఘాటి మాస్టర్ మైండ్ 2013లో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన జిరామ్ ఘాటి మారణకాండ వెనుక గణేష్ ఉయికే ప్రధాన సూత్రధారి. ఈ ఘటనలో అనేక మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరణించారు. అంతేకాదు అనేక హై ప్రొఫైల్ మావోయిస్టు దాడులలో ఆయనదే కీలక పాత్రం నమ్ముతారు. గతమూడేళ్లుగా గణేష్ ఒడిశాలోని కంధమాల్ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తూ, గెరిల్లా కార్యకలాపాలను సమన్వయం చేస్తూ, మావోయిస్టు నెట్‌వర్క్‌లను బలోపేతం చేస్తున్నాడు. -
భారీ ఎన్కౌంటర్.. మావోయిస్టులకు ఎదురుదెబ్బ
భువనేశ్వర్: మావోయిస్టులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశాలో తాజాగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో తెలుగు మావోయిస్టు కమాండర్, ఒడిశా రాష్ట్ర కమిటీ ఇన్చార్జ్ గణేష్ మృతి చెందాడు. కాగా, గణేష్‌పై రూ.25 లక్షల రివార్డు కూడా ఉండటం గమనార్హం. వివరాల ప్రకారం.. ఒడిశాలోని కందమాల్ జిల్లా బెల్‌ధర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మా అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. అయితే, ఈ కాల్పుల్లో రాష్ట్ర కమిటీ ఇన్చార్జ్ గణేష్ మృతి చెందాడు. కాగా, గణేష్ స్వస్థలం నల్లగొండ జిల్లాలోని పుల్లెమ్ల గ్రామం. గణేష్‌పై రూ.25 లక్షల రివార్డు ఉంది. గతంలో తెలంగాణ ప్రభుత్వం గణేష్‌పై ఈ రివార్డు ప్రకటించింది. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. కాగా గణేశ్ అలియాస్ హనుమంతు ఎన్‌కౌంటర్‌ను స్పెషల్ ఆపరేషన్స్ ఏడీజీపీ సందీప్ పాండా ధృవీకరించారు. కంధమల్ - గంజాం పరిధి రాంభా అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయని తెలిపారు. ఘటనా స్థలంలో 2 ఇన్సాస్ లు, ఒక 303 రైఫిల్‌లను స్వాధీనం చేసుకున్నారు. 2 సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ టీంలతో కలిసి ఒరిస్సా స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ 20 పోలీసు బృందాల జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి. గతంలో ఛత్తీస్ ఘడ్ లో హన్మంతు పనిచేశారు. 3 ఏళ్ల క్రితం కేరళ, తమిళనాడులోని పశ్చిమ కనుమల్లో దళాల ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా గణేష్ కదలికలను భద్రతా బలగాలు తెలుసుకున్నాయి. ఎస్ఓజీ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ ఎన్కౌంటర్ జరిగింది. -
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ..22 మంది లొంగుబాటు
వరుస దెబ్బలతో అట్టుడుకుతున్న మావోయిస్టు పార్టీకి ఏవోబీలో మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 22మంది నక్సల్స్ లొంగిపోయారు. ఒడిశా మల్కాన్ గిరి జిల్లాలో ఆ రాష్ట్ర డీజీపీ ఎదుట ఈ లొంగుబాటు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మావోయిస్టుల వద్ద ఉన్న 14 ల్యాండ్మైన్లను పోలీసులకు అప్పగించారు. వీరందరిపై రూ.2.18కోట్ల రివార్డు ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు.మార్చి 2026 నాటికి దేశంలో నక్సలైట్లను లేకుండా చేస్తానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సాయుధబలగాలు ఆపరేషన్ కగార్, ఆపరేషన్ కర్రెగుట్ట పేరుతో నక్సల్స్‌పై విరుచుకపడుతున్నాయి. దీంతో పెద్దఎత్తున మావోయుస్టులు ఎన్కౌంటర్లలో మరణిస్తున్నారు. అంతే స్థాయిలో పోలీసులు ఎదుట లొంగిపోతున్నారు.ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ భవితత్వంపై నీలినీడలు కమ్ముకున్నాయి. -
మార్చి తర్వాత కూడా ‘ఆపరేషన్స్’ ఆగవు..
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చి 31 తర్వాత భద్రతా బలగాల ఆపరేషన్లు తగ్గుముఖం పడతాయని మావోయిస్టు పార్టీ నాయకత్వం కేడర్‌ను తప్పుదారి పట్టిస్తోందని డీజీపీ బి.శివధర్‌రెడ్డి చెప్పారు. అయితే మార్చి తర్వాత కూడా మావోయిస్టులపై భద్రత బలగాల ఆపరేషన్లు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మావోయిస్టు పార్టీలో అజ్ఞాతంగా పనిచేస్తున్న మిగిలిన వారు సైతం ఎదుట లొంగిపోవాలని ప్రభుత్వం, పోలీసుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. మావోయిస్టు పార్టీ కొమురంభీం ఆసిఫాబాద్–మంచిర్యాల డివిజనల్ కమిటీ కార్యదర్శి ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్, పార్టీ సభ్యుడు చెందిన కనికారపు ప్రభంజన్ (మంచిర్యాల జిల్లా) సహా మొత్తం 41 మంది మావోయిస్టులు శుక్రవారం డీజీపీ ఎదుట ఆయుధాలతో లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడుతూ... లొంగిపోయిన మావోయిస్టులపై ఉన్న రివార్డు మొత్తం రూ.1,46,30,000 వారి పేర్లపై బ్యాంకు ఖాతాలు తెరిచిన తర్వాత డీడీ రూపంలో అందిస్తామన్నారు. ప్రస్తుతం తక్షణ సాయం కింద రూ.25వేలు ఇస్తామని, పునరావాసం కింద ప్రభుత్వం నుంచి సాయం అందిస్తామని వెల్లడించారు. మీడియా సమావేశంలో ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ విజయ్‌కుమార్, శాంతిభద్రతల అడిషనల్ డీజీ మహేశ్‌భగవత్, ఎస్ఐబీ చీఫ్, ఐజీ సుమతి, ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ పాల్గొన్నారు.నాయకత్వంపై నమ్మకం లేకనే..భద్రతా బలగాల నుంచి రక్షణ పొందేందుకు మావోయిస్టు నాయకత్వం కేడర్‌ను వారి ఇష్టాలతో సంబంధం లేకుండా కొత్త ప్రాంతాలకు పంపడంతో వారు నిత్యావసర వస్తువులు కూడా అందుబాటులో లేక ఇబ్బందిపడుతున్నారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా ఆచరించే విధానాలకు, వాస్తవ పరిస్థితులకు మధ్య పెరుగుతున్న అంతరం కారణంగా నాయకత్వంపై నమ్మకం పోతోందని, సిద్ధాంతపరమైన భేదాభిప్రాయాలు కూడా లొంగుబాట్లకు కారణమని చెప్పారు. భద్రత బలగాల నుంచి నిరంతర ఒత్తిడి, క్షీణిస్తున్న ఆరోగ్య పరిస్థితి కూడా కారణాలుగా చెప్పారు. మావోయిస్టు పార్టీలో తెలంగాణ ప్రాంతానికి చెందిన 54 మంది ఇంకా వివిధ రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నట్టు తెలిపారు. మావోయిస్టు కేంద్ర కమిటీలో ప్రస్తుతం ఏడుగురు సభ్యులు ఉండగా వీరిలో ఐదుగురు తెలంగాణ ప్రాంతానికి చెందినవారన్నారు. స్టేట్ కమిటీలో 8 మంది, డివిజనల్ కమిటీ సభ్యులు 13 మంది, ఏరియా కమిటీ సభ్యులు 16 మంది, 12 మంది సభ్యులు ఉన్నట్టు తెలిపారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కమిటీలో మొత్తం 36 మందిలో ఆరుగురు తెలంగాణ వారుండగా, 30 మంది ఇతర రాష్ట్రాల సభ్యులు ఉన్నట్టు తెలిపారు. వారంతా చిన్నచిన్న గ్రూపులుగా విడిపోయి తిరుగుతున్నట్టు తెలిపారు. అప్పగించిన ఆయుధాలివీ..ఒక ఇన్సాన్ ఎల్ఎంజీ, మూడు ఏకే–47 రైఫిళ్లు, 5 ఎస్ఎల్ఆర్ రైఫిళ్లు, 7 ఇన్సాస్ రైఫిళ్లు, ఒక బీజీఎల్ గన్, నాలుగు 303 రైఫిళ్లు, ఒక సింగిల్‌షాట్ రైఫిల్, రెండు ఎయిర్ గన్స్‌తోపాటు 42 మ్యాగజైన్లు, 733 బుల్లెట్లు, 8 షెల్స్ పోలీసులకు అప్పగించారు. సాజిద్ ఆరుసార్లు హైదరాబాద్‌కు..ఇటీవల ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కాల్పులు జరిపిన ఉగ్రవాది సాజిద్ అక్రమ్ 1998లో ఉద్యోగం కోసం హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలి యాకు వెళ్లాడని, అక్కడే యూరోపియన్ యువతిని వివాహం చేసుకున్నట్టు డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. దేశాన్ని విడిచి వెళ్లిన 27 ఏళ్లలో అతడు ఆరుసార్లు భారత్‌కు వచ్చి వెళ్లినట్టు ఆధారాలున్నాయని తెలిపారు. 2000 అక్టోబర్‌లో భార్యతో కలిసి తొలిసారి వచ్చాడని, రెండోసారి 2004లో, మూడోసారి ఫిబ్రవరి 2009లో అతడి తండ్రి మృతిచెందిన నెల రోజులకు, నాల్గోసారి జూలై 2012లో ఆస్తుల తగాదాల పరిష్కారం కోసం, ఐదోసారి మార్చి 2016లో కుటుంబ సభ్యులతో ఆస్తుల సెటిల్మెంట్ కోసం, చివరగా 2022 జూలైలో తన తల్లిని, సోదరిని చూసేందుకు హైదరాబాద్‌కు వచ్చినట్టు తెలిపారు. అతడు హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఎలాంటి ఉగ్రచర్యలకు పాల్పడలేదని చెప్పారు. -
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ
-
నిఘా నీడలో నిజాల వేట
దండకారణ్యం నుంచి సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కల్లోలిత ప్రాంతమైన దండకారణ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులను బయటి ప్రపంచానికి చెప్పేందుకు జర్నలిస్టులు ఒంటరిగా వెళ్లే పరిస్థితులు లేవు. ముఖ్యంగా తెలుగు మీడియా జర్నలిస్టులైతే జట్టుగా వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. హిడ్మా మరణం తర్వాత సర్వత్రా ఆసక్తి నెలకొన్నందున.. అక్కడి అంశాలను బయటి ప్రపంచానికి తెలియజేసేందుకు తెలుగు జర్నలిస్టుల బృందం ఇటీవల వెళ్లింది. తెలంగాణ సరిహద్దు నుంచి పువ్వర్తికి వెళ్లాలంటే కనీసం 11 సీఆర్పీఎఫ్ క్యాంపులను దాటాల్సిందే. ఈక్రమాన మీడియా బృందం ఓ క్యాంపు దాటుతుండగా సాయుధ జవాన్లు ఆపేశారు. పేరు, సంస్థ, ఫోన్ నంబర్, ఇన్‌టైం వివరాలతో పాటు ఫొటోలు తీసుకుని పంపించారు. మీడియా బృందం పువ్వర్తికి చేరుకునేసరికి తెలుగు మాట్లాడే ఓ సీఆర్పీఎఫ్ జవాన్ అక్కడికి వచ్చాడు. ‘ఇది మావోయిస్టు ప్రభావిత ప్రాంతం. ఇక్కడ పరిస్థితులు బాగాలేవు. మీకేమైనా ఇబ్బందులు వస్తాయి. అందుకే మీ బాగోగులు చూడటానికి వచ్చాను’ అంటూ తనను పరిచయం చేసుకున్నాడు. అక్కడ మీడియా బాధ్యులు ఎవరెవరిని కలుస్తున్నారు, ఎలాంటి ఇంటర్వ్యూలు చేస్తున్నారనే విషయాలను సదరు జవాన్ ఎప్పటికప్పుడు తన ఫోన్లో బంధించాడు.అన్నల అడవిలో..హిడ్మా తల్లి పువ్వర్తి నుంచి ఐదు కిలోమీటర్ల దూరాన ఓయ్పారా అనే గ్రామంలో ఉందని తెలియడంతో.. మీడియా బృందం అక్కడికి పయనమైంది. గ్రామం నుంచి కొద్ది దూరం వెళ్లాక వాగు ఎదురై.. అక్కడితో ఇటీవల సర్కార్ వేసిన రోడ్డు ముగిసింది. జర్నలిస్టులు వాగు దాటుకుని ముందుకు వెళ్తుంటే, జవాన్ అక్కడే ఆగిపోయాడు.‘ఇక్కడి నుంచి నేను ముందుకు రాలేను. మీరు వెళ్లి ఇంటర్వ్యూ తీసుకుని త్వరగా వచ్చేయండి’ అని చెప్పాడు. జర్నలిస్టుల బృందం ఓయ్‌పారాకు చేరేసరికి సీఆర్పీఎఫ్ జవాన్ నుంచి మిస్డ్ కాల్స్ ఉన్నాయి. తిరిగి ఫోన్ చేస్తే ‘మిమ్నల్ని ఫాలో అవుతూ అడవిలోకి వచ్చాను, కానీ ఇక్కడ కాలి బాటలు పాయలుగా విడిపోయి ఉన్నాయి, ఏ దారిలో ముందుకు రావాలి’ అని అడిగాడు.ముప్పిరిగొన్న సందేహాలుజర్నలిస్టుల బాగోగులు కోసమని వచ్చిన జవాన్.. అన్నల అడవిలో’ తప్పిపోతే పరిస్థితి ఏంటనే సందేహాలు రావడంతో అందరూ వెనక్కి వెళ్లారు. ఏడు నిమిషాల ప్రయాణం తర్వాత ఆయన కనిపించగా అప్పటికే మరో ఆరు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అతడిని ఓయ్‌పారాకు తీసుకొచ్చేసరికి హిడ్మా తల్లి పొలం పనుల కోసం వెళ్లినట్టు తెలిసింది. హిడ్మా తల్లి ఉంటున్న ఇంటి ఫొటోలను ఆ జవాన్ తీసుకున్నాడు. ‘ఆలస్యం అయ్యేలా ఉంది. నేను ఇక్కడ ఎక్కువ సేపు ఉండడం అంత మంచిది కాదు. త్వరగా వచ్చేయండి’ అంటూ వెళ్లిపోయాడు. ఆయన క్షేమంగా వెళ్లాడా, లేదా అని ఫోన్ చేయాలని భావించినా.. ఆయన కదలికలను బయటపెట్టినట్లవుతుందనే భావనతో జర్నలిస్టులంతా వెనక్కి తగ్గారు.డ్రోన్ నిఘా..హిడ్మా తల్లి కోసం నిరీక్షిస్తుండగా జుమ్... అంటూ శబ్దం వినిపించింది. జర్నలిస్టుల బృందం ఉన్న పాకపై డ్రోన్ ఎగురుతోందని అర్థమైంది. కొద్ది సేపటి తర్వాత శబ్దం ఆగిపోయింది. అంతకు ముందు మాట్లాడిన జవాన్ మాటల ఆధారంగా.. ‘ఆ రోజు లంచ్ కోసం జర్నలిస్టులు ఏ గ్రామంలో వాకబు చేశారు, ఎలాంటి వార్తలు, ఏ తరహాలో అందిస్తున్నారు’ అనే విషయాలపై వారికి పక్కా సమాచారం ఉందనేది అర్థమైంది. అంతేకాదు దండకారణ్యంలోకి వచ్చి వెళ్లే తెలుగు వాళ్ల వివరాలు తెలుసుకునేందుకు ప్రతీ సీఆర్పీఎఫ్ క్యాంపులో ప్రత్యేకంగా తెలుగు మాట్లాడే జవాన్లు ఉంటారని తెలిసొచ్చింది. ఓ వైపు ప్రభుత్వ పారా మిలిటరీ నిఘా ఇలా ఉంటే.. మరోవైపు అసలు ఆనవాళ్లే గుర్తించలేనంతగా మావో మద్దతుదారులు జర్నలిస్టు బృందంపై కన్నేసి ఉంచారు. ఆ నిఘా నీడలో సంచరిస్తూ హిడ్మా తల్లిని కలిసిన బృందం ఆమె బాగోగులు తెలుసుకుంది. -
ఏజెన్సీలో బలగాలకు చిక్కిన మావోయిస్టులు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన డీవీసీఎం(డివిజన్ కమిటీ) ఇన్‌చార్జ్‌తో సహా మొత్తం 16 మంది మావోయిస్టులు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో పోలీసు బలగాలకు చిక్కినట్టు సమాచారం. కొద్దిరోజుల క్రితం సిర్పూర్ యూ మండలం బాబ్జిపేట, కకర్బుడ్డి ఏజెన్సీ ప్రాంతంలోకి వచ్చిన కామారెడ్డి జిల్లాకు చెందిన డీవీసీఎం ఎర్రగొల్ల రవితో మరో ఇద్దరు డీవీసీఎం కేడర్‌తోపాటు 16 మంది పోలీసుల అదుపులో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. వీరిని ఏకే 47, ఇన్సాస్ రైఫిల్ వంటి ఆయుధాలతో సహా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిసింది. దీనిపై పోలీసులు మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయడం లేదు. మొదటగా రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడె చొక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నట్టు ప్రచారం జరిగింది. అయితే పట్టుబడిన వారిలో ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చినవారు ఉన్నారు. వీరిలో 9 మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్టు తెలిసింది. నిఘా వర్గాల సమాచారంతో కొద్ది రోజులుగా ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి, సిర్పూర్ యూ ఏజెన్సీ ప్రాంతంలో స్థానిక పోలీసులతో కలసి భద్రతా బలగాలు ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో మావోల కదలికలు గుర్తించి దాడి చేసి అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లో తీవ్ర నిర్బంధ పరిస్థితులు ఏర్పడడంతో సేఫ్ జోన్‌గా భావించి వీరంతా ఏజెన్సీకి వచ్చారా, లేక పోలీసులకు లొంగుబాటులో ఇది ఓ భాగమా? ఇంకా ఏదైనా కారణమా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న వారికి హాని తలపెట్టకుండా కోర్టులో ప్రవేశపెట్టాలని రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికాపంత్ను ఈ విషయంపై ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా, ఎలాంటి సమాచారమున్నా, పై అధికారులే వెల్లడించే అవకాశముందన్నారు. -
పోలీసుల అదుపులో మావోయిస్టు కీలకనేత
ఆసిఫాబాద్: మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత బడే చొక్కారావు ఆసిఫాబాద్‌లో పోలీసులకు పట్టుబడ్డారు. ఆయనతో పాటు సిర్పూర్లో మరో 15మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డవారిలో 9మంది మహిళలు కాగా ఆరుగురు పురుషులు ఉన్నారు. అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను పోలీసులు హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. మావోయుస్టులపై కేంద్రం కన్నెర్రజేసింది. 2026 మార్చి 31లోపు దేశంలో నక్సలిజం లేకుండా చేస్తానని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించడంతో సాయుదబలగాలు వారిపై విరుచుకపడుతున్నాయి. అయితే ఇప్పటికే పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఎన్కౌంటర్లలో ప్రాణాలు వదిలారు. అంతేకాకుండా ఆపార్టీ కీలక నేతలు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆ పార్టీకి చెందిన కీలక నేత బడే చొక్కారావు పోలీసులకు చిక్కడంతో ఆపార్టీకి దెబ్బమీద దెబ్బ తాకినట్లయింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
ఛత్తీస్‌గఢ్: మరో 10 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్‌గఢ్: మరో 10 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సుక్మా పోలీసుల ఎదుట లొంగిపోయిన వారిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. మావోయిస్టులపై రూ.33 లక్షల చొప్పున రివార్డ్ ఉంది. ఈ ఏడాది జిల్లాలో మొత్తం 263 మంది మావోయిస్టులు హింసను విడిచిపెట్టారని పోలీసు అధికారులు తెలిపారు. పూనా మార్గెం పునరావాస, సామాజిక సమ్మిళితం కార్యక్రమంలో భాగంగా మావోయిస్టులు లొంగిపోయారని అధికారులు వెల్లడించారు.లొంగిపోయిన మావోయిస్టులు ఏకే-47 తుపాకీ, రెండు సెల్ఫ్-లోడింగ్ రైఫిల్స్(SLRs), ఒక స్టెన్‌గన్, ఒక బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్ (BGL)ను అప్పగించారు. గత 11 నెలల్లో కనీసం 1,514 మంది మావోయిస్టులు బస్తర్ ప్రాంతంలో ఆయుధాలను వదిలేశారని బస్తర్ ఐజీ సుందరరాజ్ పట్టీలింగం తెలిపారు. గత రెండు సంవత్సరాల్లో ఛత్తీస్‌గఢ్‌లో సుమారు 2,400 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు.కాగా, ఈ నెల (డిసెంబర్ 8)న ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో గల ఖైరాగఢ్ ప్రాంతంలో పలువురు మావోయిస్టులు తమ ఆయుధాలతో సహా పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఎంఎంసీ(మధ్యప్రదేశ్-మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్) జోన్లో చురుకుగా పనిచేసిన మావోయిస్టు కమాండర్ రామ్‌ధేర్ మజ్జీ తన 12 మంది సహచరులతో సహా పోలీసుల సమక్షంలో లొంగిపోయాడు. -
కేజీ ఉల్లిగడ్డలు రూ.25
సాక్షి ప్రతినిధి, భద్రాద్రికొత్తగూడెం : ఓ వైపు వరుస లొంగుబాట్లతో పార్టీ బలహీనపడుతున్నా.. మావోయిస్టుల్లోని ఒక వర్గం సాయుధ పోరాట పంథానే కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ బలగాల నుంచి తమ కార్యకలాపాలను రహస్యంగా ఉంచడంపై దృష్టి సారించింది. ఈ మేరకు కొత్తరకం కోడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నట్టుగా తెలుస్తోంది. నిర్బంధంతో బృందాల మధ్య తెగిన సంబంధాలు శాంతిచర్చల ప్రస్తావన మొదలైనప్పటి నుంచి మావోయిస్టుల నుంచి తరచూ వినిపిస్తున్న మాట కమ్యూనికేషన్ గ్యాప్. ‘మా మధ్య కమ్యూనికేషన్ సంబంధాలు తెగిపోయాయి. కలిసి మాట్లాడుకునేందుకు అవకాశం ఇవ్వండి. ఒకసారి మాలో మేం చర్చించుకొని సాయుధ పోరాట విరమణ, లొంగుబాట్లపై సామూహిక నిర్ణయం తీసుకుంటాం’అని మావోయిస్టులు కోరుతున్నారు. ఏప్రిల్‌లో రూపేశ్ అలియాస్ తక్కెళ్లపల్లి వాసుదేవరావు దగ్గర నుంచి నిన్నటి అనంత్ వరకు అందరూ ఇదే డిమాండ్ చేశారు.కానీ ప్రభుత్వం ససేమిరా అనడంతో ఎవరికి వారే లొంగిపోతున్నారు. అయితే ఇప్పటికీ మావోయిస్టు పార్టీలో సాయుధ పోరాట పంథా కొనసాగిస్తామంటున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారు పోలీసుల కన్నుగప్పి అంతర్గత సమాచారం చేరవేసుకునేందుకు తమ కమ్యూనికేషన్ విభాగంలో కొత్తకోడ్ లాంగ్వేజ్ రూపొందించుకున్నారు. ఇటీవల బీజాపూర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో లభ్యమైన డాక్యుమెంట్లలో ఈ విషయం బయటపడింది.భద్రతా దళాల సమాచారం? రహస్య జీవితం, అజ్ఞాత విధానంలో పనిచేసే సంస్థలు ప్రభుత్వ / శత్రు నిఘా వర్గాలకు చిక్కకుండా కోడ్ లాంగ్వేజ్‌లో సమాచారం చేరవేసుకుంటాయి. అందులో భాగంగా వాడుకలో ఉండే వివిధ ప్రాంతాలు, పండ్లు, కూరగాయలు, సముద్రాలు, నదులకు సైతం కోడ్ లాంగ్వేజ్‌లో పేర్లు ఉన్నాయి. వివిధ నంబర్లకు కూడా ఇలాగే నిత్య జీవితంలో కనిపించే వస్తువులు, ప్రదేశాల పేర్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఉల్లిపాయలకు సంబంధించిన కోడ్ నేమ్ 201గా ఉంది. యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్‌లో భాగంగా దండకారణ్యంలో సీఆర్పీఎఫ్, కోబ్రా, ఐటీబీపీ, బీఎస్ఎఫ్ తదితర పేర్లతో భద్రతా దళాలు క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాయి. వీటికి బెటాలియన్ల వారీగా నంబర్లు కేటాయించి, అక్కడి నుంచి కంపెనీల వారీగా ప్రతీ ఐదు కిలోమీటర్లకు ఒకటి వంతున ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ క్యాంపులను నెలకొల్పుతున్నాయి.ఈ క్రమంలో బీజాపూర్, సుక్మా జిల్లాల్లో కూంబింగ్ ఆపరేషన్లు చేపట్టే ఒక బెటాలియన్‌ను ఉల్లిగడ్డగా పేర్కొంటూ నక్సలైట్లు కొత్త కోడ్ లాంగ్వేజ్ రూపొందించుకున్నట్టు తెలుస్తోంది. దాని ఆధారంగా శత్రువుల (భద్రతా దళాల) కదలికలను అంచనా వేస్తూ తమ వ్యూహాలకు పదును పెట్టే పనిచేస్తున్నట్టు యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్‌లో ఉన్న ప్రభుత్వ విభాగాలు అనుమానిస్తున్నాయి. ఆ ధరకైతే వెనక్కే ఈ నెల 3వ తేదీన బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 18 మంది మావోయి స్టులు, ముగ్గురు జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. ఘటనాస్థలి నుంచి మావోయిస్టులకు సంబంధించిన సామగ్రిని భద్రతా బలగాలు స్వా«దీనం చేసుకున్నాయి. ఇందులో విప్లవ సాహిత్యం, నిత్యావసర వస్తువులు, డైరీలు, నోట్ పుస్తకాలు ఉన్నాయి. అందులోని ఒక నోట్‌బుక్‌లో రాసి ఉన్న విషయాలు అసాధారణంగా కనిపించాయి. గోండు భాషలో కేజీ ఉల్లిపాయలు రూ.25 నుంచి మొదలుపెట్టి రూ.30 వరకు రాసుకుంటూ పోయారు. వేర్వేరు ధరలకు వేర్వేరు అర్థాలు రాసుకొచ్చారు. కేజీ రూ.25 అయితే తీసుకురావొచ్చని, రూ.26 అయితే అక్కడే ఉంచాలని, రూ.27 అయితే వెనక్కి ఇవ్వాలని ఇలా ఒక్కో ధరకు ఒక్కో అర్థం రాసి ఉంది. దీనిపై అనుమానం వచి్చన భద్రతాదళాలు ఇదేమైనా కోడ్ లాంగ్వేజ్ కావొచ్చేమోనని ఆరా తీశారు. -
లొంగిపోయిన మావోయిస్టు దంపతులు
పాడేరు: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాకు చెందిన మావోయిస్టు దంపతులు ఆదివారం పాడేరులో ఎస్పీ అమిత్‌బర్దర్ ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు. ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.. మావోయిస్టు పార్టీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు (ఎస్‌జెడ్‌సీఎం) దిరిదో విజ్జల్ అలియాస్ జైలాల్, అతని భార్య అయిన డివిజనల్ కమిటీ సభ్యురాలు (డీవీసీఎం) మడవి మంగ అలియాస్ విమల/భీమే లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ సిద్ధాంతాల పట్ల విసుగు చెందడంతోపాటు మావోయిçస్టులకు పట్టున్న ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్ పెరగడం, కొత్త పోలీస్ క్యాంపులు పెట్టడం, మావోయిస్టు పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గిపోవడం, ఇటీవల కాలంలో వరుస ఎన్కౌంటర్లు, మావోయిస్టు పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారడం తదితర కారణాలతో జనజీవన స్రవంతిలోకి వచ్చి స్వేచ్ఛా జీవితం గడిపేందుకు వారిద్దరూ లొంగిపోయారని చెప్పారు. బాలల సంఘంలో చేరి.. బ్యాంక్ దోపిడీ చేసి.. దిరిదో విజ్జల్ ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా గగనపల్లి పంచాయతీ బోడెగుబ్బల్ గ్రామానికి చెందినవారు. 1994లో మావోయిస్టు పార్టీ బాలల సంఘంలో సభ్యుడిగా చేరారు. దక్షిణ బస్తర్, పశ్చిమ బస్తర్, జాతీయ పార్క్ ప్రాంతం, కుంటా, ఏవోబీ కటాఫ్ ఏరియా, గడ్చిరోలి, దర్భా ప్రాంతాల్లో మావోయిస్టు సభ్యుడిగా ఏసీఎం, పీపీసీఎం, ఎల్వోఎస్ కమాండర్, సెక్షన్ కమాండర్, కంపెనీ కమాండర్, సైనిక ఇన్చార్జిగా వివిధ విభాగాల్లో ఏకంగా 24 ఏళ్లు మావోయిస్టు పార్టీలో పని చేశారు. ఏడు క్యాంప్ దాడులతో పాటు మరో ఏడు అంబు ష్, రెండు ఎదురు కాల్పుల్లో విజ్జల్ పాల్గొన్నారు. బ్యాంకు దోపిడీ, ఐఈడీ పేల్చిన ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. ఇతనిపై ఆంధ్రప్రదేశ్‌లో రూ.8 లక్షలు, ఛత్తీస్‌గఢ్‌లో రూ.20 లక్షల రివార్డు ఉన్నాయి. విప్లవ గీతాలకు ఆకర్షితురాలై.. మావోయిస్ట్ డివిజనల్ కమిటీ సభ్యురాలైన మడవి గంగి ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పుల్పాగిడే గ్రామానికి చెందినవారు. ఆమె 2006లో విప్లవ గీతాలకు ఆకర్షితురాలై మావోయిస్టు పార్టీలో చేరారు. 20 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో కుంటా, బడేసత్తి, కెర్లపాల్, జగర్లొండ, మలెంగర్ ప్రాంతాల్లో పార్టీ సభ్యురాలిగా, ఎల్వోఎస్ కమాండర్‌గా ఏసీఎంగా, ప్రాంత కమిటీ కార్యదర్శిగా, ఏసీ కార్యదర్శిగా ఏసీఎస్ ఇన్చార్జిగా, మలెంగర్ ఏసీఎస్ ఇన్చార్జిగా పని చేశారు. ఏడు ఎదురు కాల్పులతో పాటు అనేక హింసాత్మక ఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. గంగిపై రూ.8 లక్షల రివార్డు ఉంది.పునరావాసం కల్పిస్తాం: ఎస్పీ లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని రాయితీలు అందేలా చూస్తామని ఎస్పీ అమిత్‌బర్దర్ చెప్పారు. ఇద్దరికీ పునరావాస సౌకర్యాలు కల్పిస్తామని, వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి మార్గం చూపిస్తామన్నారు. లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్న మావోయిస్టులు బంధుమిత్రుల ద్వారా సమీప పోలీస్ స్టేషన్, జిల్లా పోలీసు ఉన్నతాధికారుల వద్ద నేరుగా వచ్చి లొంగిపోవచ్చని సూచించారు.హిడ్మా ఎన్‌కౌంటర్‌పై తప్పుడు ప్రచారంమావోయిస్టు అగ్రనేత మడవి హిడ్మాతో పాటు మరికొందరిని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో బూటకపు ఎన్కౌంటర్ చేశారని మావోయిస్టు లేఖ ద్వారా ప్రశ్నించారని.. దీనిపై మీ స్పందన ఏమిటని విలేకరులు ఎస్పీ అమిత్‌బర్దర్‌ను ప్రశి్నంచారు. దీనిపై ఆయన మాట్లాడుతూ మావోయిస్టులది ఆధారాలు లేని ఆరోపణలని, వారిది పూర్తిగా తప్పుడు ప్రచారమన్నారు. వాటిపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. -
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో బుధవారం పోలీస్ బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు, ముగ్గురు డీఆర్జీ జవాన్లు మృతి చెందారు. మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ పట్టిలింగం కథనం ప్రకారం.. బీజాపూర్–దంతెవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతం బైరంగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశ్కుతుల్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో రెండు జిల్లాలకు చెందిన డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా, సీఆర్పీఎఫ్ బలగాలు మంగళవారం సాయంత్రం నుంచి కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం కేశ్కుతుల్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మెరుపుదాడికి (అంబుష్) దిగారు. పోలీసు బలగాలపై కాల్పులు జరపడంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఇప్పటివరకు 12 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. అయితే వారు ఏయే ప్రాంతాలకు చెందిన వారనేది గుర్తించాల్సి ఉంది. బీజాపూర్ జిల్లాకు చెందిన ముగ్గురు జవాన్లు మోనూ వాడాది (హెడ్ కానిస్టేబుల్), దుకారు గోండే, రమేష్ సోధీ ఎదురుకాల్పుల్లో మృతి చెందారు. సోమ్‌దేవ్ యాదవ్‌తో పాటు మరో జవాన్ గాయపడ్డారు. వీరిని బీజాపూర్ జిల్లా కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎదురు కాల్పుల్లో పలువురు మావోయిస్టులు తప్పించుకోగా కూంబింగ్ మరింత ముమ్మరం చేసినట్లు బస్తర్ ఐజీ తెలిపారు. సంఘటనా ప్రాంతం నుంచి ఎస్ఎల్ఆర్, ఇన్సాస్ రైఫిల్, త్రీనాట్ త్రీ రైఫిల్, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఇప్పటివరకు 275 మంది ఎన్కౌంటర్జిల్లాలో యాంటీ నక్సల్ ఆపరేషన్ ఇంకా కొనసాగు తోందని ఐజీ తెలిపారు. తాజా ఎన్‌కౌంటర్‌తో కలిపి ఈ ఏడాది ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో 275 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్, దంతెవాడ సహా ఏడు జిల్లాలతో కూడిన ఒక్క బస్తర్ డివిజన్‌లోనే 246 మంది మరణించారు. -
ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్ కౌంటర్
-
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. 37 మంది లొంగుబాటు
దంతెవాడ: మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ బస్తర్ రీజియన్ దంతెవాడ జిల్లాలో ఇవాళ (ఆదివారం, నవంబర్ 30) 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 27 మందిపై మొత్తం రూ.65 లక్షల రివార్డు ఉండగా.. ఛత్తీస్‌గఢ్ సర్కార్ అమలు చేస్తున్న ‘పూనా మర్గం’ ప్రచారానికి ఆకర్షితులై వారు లొంగిపోయినట్లు పోలీసు అధికారులు తెలిపారు. వీరిలో 12 మంది మహిళలు కూడా ఉన్నారు. మావోయిస్టులు హింసను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని దంతేవాడ పోలీసులు పిలుపునిచ్చారు. తాము హింసామార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ పునరావాస విధానంపై తమకు పూర్తి నమ్మకం ఉందన్న మావోయిస్టులు.. దంతెవాడలోని డీఆర్జీ కార్యాలయంలో అధికారుల సమక్షంలో వారు లొంగిపోయారు. వారి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.2024-25లో జరిగిన ఆపరేషన్లు, ఎదురుకాల్పులు.. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పునరావాస ప్రయోజనాలతో మావోయిస్టులను హింసను విడిచిపెట్టేలా చేశాయని ఎస్పీ రాయ్ తెలిపారు. గత 20 నెలల్లో దంతేవాడలో 508 మంది మావోయిస్టులు, అందులో 165 మంది లొంగిపోయారని రాయ్ చెప్పారు. -
అనంత్ కుటుంబమంతా అన్నల్లోనే..
కోరుట్ల/కథలాపూర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా పశ్చిమ డివిజన్లోని కథలాపూర్ మండలంలో మారుమూల గ్రామం చింతకుంట.. ఈ ఊరు మొదటి నుంచీ నక్సల్ ప్రభావిత గ్రామం. పదుల సంఖ్యలో అజ్ఞాతంలో పనిచేసిన మావోయిస్టులు ఉన్నారు. వీరిలో కొంత మంది చనిపోగా, మరి కొంతమంది లొంగిపోయి సాధారణ జీవనం గడుపుతున్నారు. ఈ గ్రామానికి చెందిన దంపతులు మ్యాకల సాయబు, గంగలక్ష్మిలకు ఇద్దరు కుమారులు, ముగ్గురు ఆడపిల్లలు. ఇద్దరు కుమారుల్లో మొదటివాడే ఎంఎంసీ ప్రతినిధి మ్యాకల అనంత్ అలియాస్ వినోద్ అలియాస్ వికాస్. సాయబు కుటుంబం మొత్తం మావోయిస్టుల సానుభూతి పరులుగా ఉన్నట్లు గుర్తింపు పొందడం గమనార్హం. బీడీ.. నేత కార్మిక సంఘం నేపథ్యంసాయబు, గంగలక్ష్మి దంపతులు ఉపాధి కోసం 1970లో ముంబైకి వలస వెళ్లినట్లు సమాచారం. అక్కడ వీరు బీడీ, నేత కారి్మక సంఘం నాయకులుగా చలామణి అయినట్లు తెలిసింది. ఆ సమయంలో వీరికి కమ్యూనిస్టులతో సంబంధాలు ఏర్పడ్డాయి. మళ్లీ 1980–90 దశకంలో ముంబై నుంచి తమ స్వగ్రామం చింతకుంటకు వచ్చారు. అప్పుడు ఈ ప్రాంతంలో పీపుల్స్‌వార్ ప్రాబల్యం తీవ్రం అవుతుండగా, నాటి చిన్నన్న దళంతో వీరు సంబంధాలు కొనసాగించినట్లు సమాచారం. వామపక్ష భావజాలం ఉన్న సాయబు దంపతులు పీపుల్స్‌వార్ సానుభూతిపరులుగా వ్యవహరించి, కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిసింది. 1990– 95లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నక్సలైట్లపై పోలీసుల నిర్బంధం తీవ్రం కావటంతో సాయబు కుటుంబం మళ్లీ ముంబైకి వలస వెళ్లింది. అక్కడ వీరు మావోయిస్టుల డెన్ కీపర్‌గా చాలా ఏళ్లు పనిచేసినట్లు సమాచారం. ఈ క్రమంలో 2002లో కరీంనగర్ ఎస్పీగా ప్రవీణ్‌కుమార్ ఉన్నప్పు డు ఈ కుటుంబంపై నిర్బంధం పెరగడంతో ముంబై నుంచి కరీంనగర్ వచ్చి సాయబు, గంగలక్ష్మితో పాటు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు లొంగిపోయారు. మరో కూతురు అప్పటికే అనారోగ్యంతో చనిపోయినట్లు సమాచారం. కాగా, వీరు కరీంనగర్లో పోలీసులకు లొంగిపోవడానికి ముందుగానే పెద్ద కుమారుడు మ్యాకల అనంత్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. లొంగుబాటు అనంతరం సాయబు దంపతులు చింతకుంటలోనే ఉండిపోగా, చిన్న కుమా రుడు, ఇద్దరు కూతుళ్లు ముంబైలో సాధారణ జీవనం గడుపుతున్నారు. 2019లో సాయబు అనారోగ్యంతో చనిపోగా గంగలక్ష్మి (68) ప్రస్తుతం ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. పదో తరగతిలోనే.. ముంబైలోనే పుట్టి పెరిగిన మ్యాకల అనంత్ అక్కడే హిందీ మీడియంలో పదో తరగతి చదువుతున్న సమయంలో తల్లిదండ్రుల ప్రభావంతో 15 ఏళ్ల వయసులోనే మావోయిస్టుల్లోకి వెళ్లిపోయినట్లు సమాచారం. అప్పటి నుంచి మావోయిస్టుల్లో వికాస్, వినోద్, నవజ్యోత్ వంటి పేర్లతో వివిధ హోదాల్లో కొనసాగిన అనంత్ ప్రస్తుతం ఎంఎంసీ జోన్ ప్రతినిధిగా వ్యవహరిస్తూ శుక్రవారం రాత్రి మహారాష్ట్రలోని గోండియా జిల్లా దారేక్ష పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈయనతో పాటు అంగరక్షకులు, దళ సభ్యులు కూడా లొంగిపోయారు. వీరిలో జగిత్యాల జిల్లా రాయికల్ మండలం సింగరావ్పేటకు చెందిన బత్తుల కాశీరామ్ కూడా ఉండటం గమనార్హం. కాగా, అనంత్‌పై రూ.60 లక్షల రివార్డు ఉన్నట్లు సమాచారం. -
ఎన్ కౌంటర్ భయం.. లొంగిపోయిన కీలక మావోయిస్టులు
-
ఆయుధాల విరమణపై మావోయిస్టుల కీలక ప్రకటన
-
అజ్ఞాతం వీడి లొంగిపొండి
సాక్షి, హైదరాబాద్: ‘అజ్ఞాతం వీడి బయటకు రండి. మీకు ఎలాంటి సమస్యలు ఉండవు. మీరు ఏ రకంగా బయటకు వస్తారన్నది మీ ఇష్టం. మీడియా ద్వారానా, మీకు తెలిసిన రాజకీయ నాయకుల ద్వారానా లేక ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానా అనేది మీ ఇష్టం. మీపై ఎలాంటి వేధింపులు లేకుండా చూస్తాం’అని డీజీపీ బి.శివధర్‌రెడ్డి మావోయిస్టులకు పిలుపునిచ్చారు. మావోయిస్టుల లొంగుబాటు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని.. సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేశారని చెప్పారు. మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు, భద్రాచలం–కొత్తగూడెం–అల్లూరి సీతారామరాజు జిల్లా డివిజినల్ కమిటీ కార్యదర్శి కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ సహా 37 మంది మావోయిస్టులు డీజీపీ ఎదుట లొంగిపోయారు. వారిలో 25 మంది మహిళలు, 12 మంది పురుషులు ఉన్నారు. తమ వద్ద ఉన్న ఒక ఏకే–47, రెండు ఎస్ఎల్ఆర్లు, నాలుగు .303 రైఫిళ్లు, ఒక జీ3 తుపాకీతోపాటు వివిధ కాలిబర్లకు చెందిన 346 తూటాలను పోలీసులకు అప్పగించారు.ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ విజయ్‌కుమార్, ఎస్ఐబీ చీఫ్, ఐజీ సుమతితో కలిసి డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడారు. అంతర్గత విభేదాలు, కూంబింగ్‌లతో పెరిగిన ఒత్తిడి, అనారోగ్య కారణాలతో మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ వివరించారు. లొంగిపోయిన మావోయిస్టులపై ఉన్న రివార్డు మొత్తం రూ. కోటీ 41 లక్షల 5 వేలను డీడీ రూపంలో వారికి అందజేశారు.రాష్ట్రానికి చెందిన మావోయిస్టులకు ప్రభుత్వపరంగా సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వారికి తక్షణ సాయం కింద రూ. 25 వేల చొప్పున అందించారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు మొత్తం 465 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారని డీజీపీ తెలిపారు. మీరు కూడా లొంగిపోండి.. తెలంగాణకు చెందిన 59 మంది మావోయిస్టులు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని డీజీపీ తెలిపారు. వారిలో ఐదుగురు కేంద్ర కమిటీ సభ్యులు ముప్పాళ లక్ష్మణరావు అలియాస్ గణపతి, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, పాక హనుమంతు అలియాస్ గణేశ్, పసునూరి నరహరి కాగా, వివిధ రాష్ట్రాల్లో స్టేట్ కమిటీ సభ్యుల స్థాయిలో 10 మంది ఉన్నట్లు చెప్పారు. వారిలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు ఈరెడ్డి పవనానందరెడ్డి, డీకేజెడ్‌సీ మెంబర్‌గా జోడే రత్నాభాయ్ అలియాస్ సుజాత, డీకేజెడ్‌సీ సభ్యుడు లోకేటి చందర్ అలియాస్ ప్రభాకర్, డీకేజెడ్‌సీ కమ్యూనికేషన్ వింగ్ ఇన్చార్జి శేఖర్ అలియాస్ మంటూ, తెలంగాణ స్టేట్ కమిటీ ఇన్చార్జి బడే చుక్కారావు అలియాస్ దామోదర్, స్టేట్ కమిటీ సభ్యులుగా కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్, ముప్పిటి సాంబయ్య అలియాస్ సుదర్శన్, మేకల మనోజ్ అలియాస్ వినోద్, కర్రా వెంకట్‌రెడ్డి, గంగిటి సత్యనారాయణరెడ్డి అలియాస్ విజయ్‌లు ఉన్నట్లు డీజీపీ తెలిపారు. వారంతా లొంగిపోవాలని సూచించారు. అనారోగ్యంతోనే లొంగిపోయాం మారుతున్న పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీ లో ఉండి పనిచేయడం కష్టంగా మారడంతోపాటు అనారోగ్య సమస్యలతోనే బయటకు వచ్చామని కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్, ముచ్చకి సోమడా మీడియాకు తెలిపారు. పార్టీ అనుమతితోనే పోలీసుల ఎదుట సరెండర్ అయ్యామన్నారు. మిగిలిన వారిని సైతం జనజీవన స్రవంతిలోకి రావాలని కోరారు. అయితే ప్రస్తుతం మావోయిస్టు పార్టీ నాయకుడు ఎవరనేది తమకు తెలియదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. లొంగిపోయింది వీరే.. » కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ (తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు, భద్రాచలం–కొత్తగూడెం–అల్లూరి సీతారామరాజు జిల్లా డివిజనల్ కమిటీ కార్యదర్శి) » అప్పాసి నారాయణ అలియాస్ రమేశ్ (రాష్ట్ర కమిటీ సభ్యుడు) » ముచ్చకి సోమడా అలియాస్ ఎర్ర (దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీరాష్ట్ర కమిటీ సభ్యుడు) » తెలంగాణ రాష్ట్ర కమిటీ ఖమ్మం డివిజినల్ కమిటీ సభ్యులు 9 మంది » సౌత్–బస్తర్ డివిజినల్ కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఒకరు, » డివిజినల్ కమిటీ సభ్యులు ఇద్దరు » ఏరియా కమిటీ సభ్యులు ఏడుగురు » దళ సభ్యులు 13 మంది » ఎల్జీఏ బెటాలియన్‌కు చెందిన డివిజినల్ కమిటీ సభ్యుడు ఒకరు » ఏరియా కమిటీ సభ్యుడు ఒకరు -
తెలంగాణ DGP ముందు లొంగిపోనున్న మావోయిస్టు అగ్రనేతలు
-
అగ్రనేతలతో సహా లొంగిపోనున్న 37 మంది మావోయిస్టులు
సాక్షి, హైదరాబాద్: కీలక నేతల లొంగుబాటు.. అగ్రనేతల ఎన్కౌంటర్లతో కకావికలం అవుతున్న మావోయిస్టు పార్టీకి మరో భారీదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ ఎదుట ఇవాళ(నవంబర్ 22, శనివారం) భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. వీళ్లలో ముఖ్యనేతలతో పాటు కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు 37 మంది దాకా ఉన్నట్లు సమాచారం. ఆపరేషన్ కగార్తో మావోయిజం తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. ఈ క్రమంలోనే మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని.. అభివృద్ధిలో భాగం కావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. మావోయిస్టు అగ్రనేత ఆజాద్‌తో పాటు కీలక సభ్యులు రమేష్, అప్పాసి నారాయణ, ఎర్రాలు లొంగిపోతారని తెలుస్తోంది. వీళ్లిద్దరితో పాటు 20 మంది దాకా డివిజన్ ఏరియా కమిటీ సభ్యులు ఆయుధాలతో సహా లొంగిపోనున్నారు. అజాద్ 1995 నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. ఉద్యమంలో పురోగమించే అవకాశం లేదని గ్రహించిన నేపథ్యంలోనే ఈ దిశగా అడుగులేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఏడాదిలో.. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజ్ కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, బాలకృష్ణ, గణేశ్, కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణరెడ్డి, హిడ్మా వరుస ఎన్కౌంటర్లలో మృతి చెందారు. పార్టీకి ఎదురవుతున్న గడ్డు పరిస్థితుల నేపథ్యంలో అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న లొంగిపోయారు. ఇక.. అనారోగ్య కారణాలతో చంద్రన్న, బండి ప్రకాశ్ ఆయుధాలు వీడారు. మరో నలుగురు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు, పదుల సంఖ్యలో పార్టీ క్యాడర్ లొంగిపోయే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. మధ్యాహ్నాం డీజీపీ శివధర్‌రెడ్డి మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.ప్రజాప్రతినిధులు బయట తిరగొద్దు!అల్లూరి: మారుడుమిల్లి ఎన్కౌంటర్ల నేపథ్యంతో రేపు ఏజెన్సీ బంద్, నిరసనలకు మావోయిస్టులు పిలుపు ఇచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. రంపచోడవరం వ్యాప్తంగా ఆంక్షలు విధించి.. క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులను ఏజెన్సీల్లో పర్యటించొద్దని.. వీళైతే మైదానాల్లోకి వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. ఈ నెల 18, 19వ తేదీల్లో జరిగిన ఎన్కౌంటర్లలో 13 మంది మావోయిస్టులు మరణించారు. -
దేవ్‌జీ, రాజారెడ్డి.. పోలీసుల అక్రమంగా నిర్భంధం?
సాక్షి, అమరావతి: మావోయిస్టు పార్టీ అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డిలను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, వారిని కోర్టుముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దేవ్‌జీ సోదరుడు తిప్పిరి గంగాధర్, రాజిరెడ్డి కుమార్తె స్నేహలత హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ తుహిన్‌కుమార్ గేదెల ధర్మాసనం గురువారం విచారణ జరిపింది.పిటిషనర్ల న్యాయవాది యు.జైభీమారావు వాదనలు వినిపిస్తూ.. ఈ నెల 18న పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు మృతి చెందారన్నారు. ఇదే సమయంలో దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డిలను పోలీసులు నిర్బంధించారని చెప్పారు. వారిని కోర్టుముందు ప్రవేశపెట్టేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) తిరుమణి విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ.. దేవ్‌జీ, రాజారెడ్డి పోలీసుల అదుపులో లేరని చెప్పారు. అరెస్ట్ చేసిన 50 మంది మావోయిస్టులను పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారని నివేదించారు. దేవ్‌జీ, రాజారెడ్డిలను అక్రమంగా నిర్బంధించారన్న వాదనలో వాస్తవం లేదన్నారు. పోలీసుల అదుపులో ఉన్నారనేందుకు ఆధారాలేమున్నాయి? ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. దేవ్‌జీ, రాజారెడ్డి పోలీసుల అక్రమ నిర్బంధంలో ఉన్నారనేందుకు ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించింది. ఏ ఆధారాలతో వారు పోలీసుల అదుపులో ఉన్నారని చెబుతున్నారని ప్రశ్నించింది. ఇలాంటి వ్యవహారాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోవాలంటే.. అక్రమ నిర్బంధంపై ప్రాథమిక ఆధారాలుండాలని స్పష్టం చేసింది. ప్రాథమిక ఆధారాలు లేనప్పుడు తాము చేయగలిగిందీ ఏమీ లేదని పేర్కొంది. పిటిషనర్ల న్యాయవాది జైభీమారావు స్పందిస్తూ.. దేవ్‌జీ, రాజారెడ్డిల సెక్యూరిటీ గార్డులను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. ఎన్కౌంటర్ తరువాత పోలీసులు మీడియాతో మాట్లాడుతూ 9 మంది కీలకనేతలు తమ ఆ«దీనంలో ఉన్నట్లు చెప్పారని, ఆ వీడియోను కోర్టు ముందుంచుతామని చెప్పారు. దీంతో ధర్మాసనం.. దేవ్‌జీ, రాజారెడ్డి పోలీసుల అదుపులో ఉన్నారనేందుకు ఆధారాలను తమ ముందుంచాలని పిటిషనర్ల న్యాయవాదికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను శుక్రవారానికి (నేటికి) వాయిదా వేసింది. -
‘ఆపరేషన్ సంభవ్’ ఆగదు
రంపచోడవరం(అల్లూరి సీతారామరాజు జిల్లా): రాష్ట్రంలో 2026 మార్చి నాటికి మావోయిస్టులు లేకుండా చేయడమే లక్ష్యంగా ఏపీ పోలీసు శాఖ పని చేస్తున్నట్లు డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా చెప్పారు. మావోయిస్టుల ఏరివేతకు ‘ఆపరేషన్ సంభవ్’ కొనసాగుతుందని స్పష్టంచేశారు. మావోయిస్టుల వైపు వెళ్లే ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకుంటామని హెచ్చరించారు. మావోయిస్టు నాయకులు దేవ్‌జీ, మల్ల రాజారెడ్డి పోలీసుల అదుపులో లేరని చెప్పారు. డీజీపీ గురువారం రంపచోడవరంలో పర్యటించారు. అనంతరం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడుతూ... వరుసగా రెండు రోజులపాటు జరిగిన ఎన్కౌంటర్లలో 13 మంది మావోయిస్టులు మృతిచెందారని తెలిపారు. ఈ ఎన్కౌంటర్లలో మావోయిస్టు పార్టీ కీలక నేతలు హిడ్మా, టెక్ శంకర్ వంటి వారు మరణించారని చెప్పారు. ఘటనాస్థలాల్లో అధిక సంఖ్యలో ఆయుధాలు లభ్యమయ్యాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరిపిన సెర్చ్ ఆపరేషన్‌లో 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు, రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం సమన్వయంతో పనిచేయడం వల్ల మంచి ఫలితం వచ్చిందన్నారు. 2026 మార్చి నాటికి నక్సల్స్ రహిత ఆంధ్రప్రదేశ్‌గా మార్చడమే పోలీస్ శాఖ అంతిమ లక్ష్యమని డీజీపీ చెప్పారు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ కీలక నేతలు మృతిచెందారని, అప్పుడే మావోయిస్టులు ఉద్యమాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని కోరామని పేర్కొన్నారు.హెలికాప్టర్ నుంచి అటవీ ప్రాంతంలో పరిశీలన విశాఖపట్నం నుంచి హెలికాప్టర్లో వచ్చిన డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా తొలుత మారేడుమిల్లి అటవీ ప్రాంతాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. గతంలో మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న గుర్తేడు, పాతకోటతోపాటు తాజాగా మావోయిస్టుల ఎన్కౌంటర్ జరిగిన జీఎం వలస అటవీ ప్రాంతాన్ని హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. -
జనజీవనంలో కలుస్తామంటే అవకాశమివ్వలేదు
సాక్షి, హైదరాబాద్: ప్రజా జీవితంలో కలుస్తామని ముందుకొచ్చే మావోయిస్టులకు ఆ అవకాశం కల్పించకుండా, వారిని పట్టుకుని చంపేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య దేశంలో చంపడం ఒక్కటే మార్గం కాదని, జన జీవన స్రవంతిలో కలుస్తామని చెప్పిన వారిని కూడా పట్టుకుని చంపడం ఏం పద్ధతి అని మండిపడ్డారు. ‘బీజేపీ ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్ల ద్వారా మావోయిస్టులను చంపడాన్ని నిరసిస్తూ సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ఏ కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వామపక్ష, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పౌరహక్కుల నాయకులు, మేధావులు పాల్గొన్నారు. మహేశ్ గౌడ్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను అందరూ వ్యతిరేకించాలని, ఇటువంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. హిడ్మా, కేశవరావు, తిరుపతి వంటి వారిని నాయకులుగా గుర్తిస్తామని, వారు ఎంచుకున్న పద్ధతి ప్రభుత్వాలకు నచ్చకపోయినప్పటికీ, వారు జీవితాంతం ప్రజల కోసం పాటుపడ్డారని గుర్తు చేశారు. మావోయిస్టు నాయకులను హత్య చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌పై అంబేడ్కర్ విగ్రహం వద్ద అఖిలపక్ష పార్టీల ధర్నా, సంతకాల సేకరణ నిర్వహించాలని ఈ సమావేశం నిర్ణయించింది. నరరూప రాక్షసుల్లా కేంద్ర ప్రభుత్వ పెద్దలు: కూనంనేని ఎన్కౌంటర్ల పేరుతో కాల్చి చంపిన మావోయిస్టుల మృతదేహాలకు న్యాయమూర్తి, కుటుంబ సభ్యుల సమక్షంలో శవ పరీక్షలు నిర్వహించాలని, దీనిని వీడియో తీయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ ఎన్కౌంటర్లలో పాల్గొన్న పోలీసులపైన కూడా కేసు నమోదు చేసి విచారించాలని జాతీయ కమిషన్ మార్గదర్శకాలు ఉన్నాయని, దీనిని కేంద్రం పాటించడం లేదన్నారు. సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ కేంద్రాన్ని, ప్రధాని మోదీని, బీజేపీని ప్రశ్నించే ప్రతి ఒక్కరిపైనా కేంద్రం దాడి చేస్తోందన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. అడవుల్లోని వనరులను కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు ప్రకృతిని విధ్వంసం చేస్తూ, అడ్డుగా ఉన్న మనుషులను చంపేస్తున్నారని ఆరోపించారు.జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ బూటకపు ఎన్కౌంటర్లు ప్రభుత్వం మానుకోవాలని, మావోయిస్టులతో చర్చలు జరిపి, సమస్యను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అరుణోదయ విమలక్క, వివిధ పార్టీల నేతలు హన్మెశ్, చలపతిరావు, రమేశ్ రాజా, భాస్కర్ పాల్గొన్నారు. -
మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ ఎక్కడ?
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో పెద్దఎత్తున మావోయిస్టులు పట్టుబడిన వైనం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. కనీవినీ ఎరుగని రీతిలో విజయవాడ సమీపంలోని కానూరులో 28 మంది, ప్రసాదంపాడులో నలుగురితో కలిపి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 50 మంది మావోలు ఎలాంటి ప్రతిఘటన, ఎదురు కాల్పులు లేకుండా పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. పట్టుబడిన తీరు చూస్తే లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే పోలీసులు వారిని అరెస్టు చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.పట్టుబడిన వారంతా ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చారని పోలీసులు చెబుతున్నా.. అక్కడ నుంచి ఇక్కడికి ఎలా వచ్చారనేది చెప్పడంలేదు. మావోయిస్టులు వచ్చిన సమాచారం ముందే తెలుసని, అప్పటినుంచి వారిపై నిఘా పెట్టామని, వారి ఆలోచనలు, కార్యకలాపాలను గమనించామని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ విషయం తెలిసినప్పుడు వారు ఎలా వచ్చారనే విషయం కూడా పోలీసులకు తెలియకుండా ఉంటుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేవ్‌జీ దొరకలేదట! మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ సెక్యూరిటీ వింగ్‌కు చెందిన 9 మంది మావోయిస్టులు పట్టుబడినట్టు ప్రకటించిన పోలీసులు.. దేవ్‌జీ ఏమయ్యారు, ఎక్కడున్నారనే ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వడం లేదు. దేవ్‌జీ తమ అదుపులో మాత్రం లేరని చెబుతున్నారు. అయితే, దేవ్‌జీ పోలీసుల అదుపులోనే ఉన్నారని హక్కుల నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు వచ్చినట్టు.. ఎలా పట్టుబడినట్టు? మావోయిస్టు అగ్రనేత హిడ్మా భద్రతను పర్యవేక్షించే కీలక సభ్యురాలితో పాటు అదే విభాగానికి చెందిన 28 మంది సభ్యులు విజయవాడలో పోలీసులకు పట్టుబడిన వారిలో ఉన్నారు. మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు హతం కాగానే.. రాష్ట్రంలో ఐదు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరిపి 50 మంది మావోయిస్టులను పట్టుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. లొంగిపోయిన మావోయిస్టుల సమాచారం మేరకు వీరంతా ఎన్‌కౌంటర్‌కు ముందుగానే పోలీసులకు పట్టుబడ్డారా అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. వీరంతా బృందాలుగా విడిపోయి వేర్వేరు ప్రాంతాలకు ఎందుకు వచ్చారు? ఇంచుమించు అంతా ఒకే సమయంలో ఎలా పట్టుబడి ఉంటారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. -
మావోయిస్టులూ... లొంగిపోండి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మావోయిస్టులు లొంగిపోవడం మంచిదని, లేకపోతే చర్యలు తప్పవని ఏపీ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేశ్‌చంద్ర లడ్హా హెచ్చరించారు. విజయవాడలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు హిడ్మా, మరో ఐదుగురు మృతిచెందారని చెప్పారు. ఘటనాస్థలంలో లభించిన సమాచారంతో ఎక్కడెక్కడ మావోయిస్టులు ఉన్నారనే విషయంపై వెంటనే దృష్టి పెట్టామని వెల్లడించారు. ఆ తర్వాత పక్కా సమాచారంతో ఎన్టీఆర్, కృష్ణా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామని వివరించారు. హిడ్మా దళానికి చెందిన 27 మందితోపాటు సౌత్ బస్తర్ ఏరియా కమిటీ, స్థానిక కేడర్‌తో సహా అరెస్టయిన వారందరూ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వారని చెప్పారు.మావోయిస్టు కీలక నేత దేవ్‌జీ లొంగిపోలేదని తెలిపారు. ఎక్కడా ఎవరికీ ప్రమాదం జరగకుండా ఆపరేషన్ పూర్తి చేశామన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇంతమంది మావోయిస్టులను పట్టుకోవడం తొలిసారి అని వివరించారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్ తర్వాత కొందరు మావోయిస్టులు పారిపోయారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయన్నారు. షెల్టర్ కోసమే వచ్చారు... ఇటీవల తెలంగాణలో కొంతమంది మావోయిస్టులు సరెండర్ అయ్యారని, వారి ద్వారా సమాచారం వెళితే ఇబ్బందులు ఉంటాయని మావోయిస్టులు భావించారని లడ్హా తెలిపారు. అదేవిధంగా ఛత్తీస్‌గఢ్‌లో చాలాచోట్ల ముమ్మరంగా దాడులు జరుగుతున్నాయన్నారు. అందుకే కొన్ని రోజులు షెల్టర్ తీసుకునేందుకు ఏపీని ఎంచుకున్నారని చెప్పారు. మళ్లీ సమయం చూసి తమ ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. అయితే, మావోయిస్టుల కదలికలపై నిఘా వర్గాల నుంచి పోలీసులకు సమాచారం ఉందని, వారి ప్రణాళికలపై మాత్రం సమాచారం లేదన్నారు. మావోయిస్టుల ప్లాన్ ఎమిటి? కానూరులో ఎందుకు ఉన్నారు? వారికి ఎవరు షెల్టర్ ఇచ్చారు? అసలు ఇక్కడికి ఎలా వచ్చారు? అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. జర్నలిస్టులకు హిడ్మా లేఖ రాయడం గురించి తమకు తెలియదన్నారు. ఎదురు కాల్పుల్లోనే హిడ్మా మృతిచెందారని, పట్టుకుని చంపారనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అప్రమత్తంగా ఉండాలని ఏజెన్సీలోని ప్రజాప్రతినిధులకు సూచించినట్లు తెలిపారు.మారేడుమిల్లి ప్రాంతంలో మరో ఎన్కౌంటర్..మారేడుమిల్లి ఏజెన్సీ ఏరియాలో మంగళవారం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి 5 కిలో మీటర్ల దూరంలోనే బుధవారం ఉదయం 7 గంటలకు మరోసారి భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు లడ్హా తెలిపారు. ఈ ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారని, వారిలో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారన్నారు. చనిపోయినవారిలో జోగారావు అలియాస్ టెక్ శంకర్ ఒక్కరినే గుర్తించామన్నారు. శ్రీకాకుళానికి చెందిన జోగారావు పదేళ్లుగా మావోయిస్టు పారీ్టలో కొనసాగుతున్నారని తెలిపారు.ఆయుధాలు, రూ.12.72లక్షల నగదు స్వాధీనంఅరెస్ట్ చేసిన మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఒక పిస్టల్, రెండు రివాల్వర్లు, రెండు డీబీబీఎల్ఎస్, 31 దేశీయ తయారీ తుపాకులు, చెక్కతో తయారు చేసిన 8ఎంఎం తపంచాలు ఉన్నాయి. వాటితోపాటుగా 302 రౌండ్ల బుల్లెట్లు, రెండు మేగజైన్లు తూటలు, నాలుగు కత్తులు, కోర్డిటెక్స్ వైర్ 750 గ్రాములు, రూ.12.72 లక్షల నగదుతోపాటుగా 64 మెమొరీ కార్డులను, ఒక రేడియో సెట్‌ను స్వా«దీనం చేసుకున్నారు. విజయవాడకు మావోయిస్టులు ఏలూరు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అరెస్ట్ చేసిన 50 మంది మావోయిస్టులను భారీ భద్రత మధ్య విజయవాడలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు తరలించారు. వీరిలో మావోయిస్టు పార్టీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు ముగ్గురు, డివిజనల్ కమిటీ సభ్యులు ఐదుగురు, ఏరియా కమిటీ సభ్యులు 19 మంది, పార్టీ సభ్యులు 23 మంది ఉన్నారు. వారి నుంచి స్వా«దీనం చేసుకున్న రైఫిల్స్, పిస్టల్స్, డిటోనేటర్లు, మేగజైన్స్, మొబైల్స్, సిమ్ కార్డులు, పెన్ డ్రైవ్‌లు, విప్లవ సాహిత్యం, హిడ్మా ఫొటోలను కూడా విజయవాడ తీసుకొచ్చారు. మీడియా సమావేశం అనంతరం మళ్లీ ఏ జిల్లాలో దొరికిన మావోయిస్టులను ఆ జిల్లాకు తరలించారు. మీడియా సమావేశంలో ఎస్ఐబీ ఐజీ పీహెచ్డీ రామకృష్ణ, ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్, ఐదు జిల్లాల ఎస్పీలు విద్యాసాగర్ నాయుడు, ప్రతాప్ శివకిశోర్, రాహుల్‌మీనా, బిందుమాదవ్, విజయవాడ సీపీ రాజశేఖరబాబు, డీసీపీలు కేజీవీ సరిత, కృష్ణప్రసన్న, లక్ష్మీనారాయణ ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.అరెస్ట్ చేసిన మావోయిస్టుల వివరాలు కృష్ణా జిల్లాలో...1) ఉద్దె రఘు (స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు) 2) మదకం దివాకర్ అలియాస్ మిట్టు (ఏరియా కమిటీ సభ్యుడు) 3) వెట్టి నందె (ఏరియా కమిటీ సభ్యుడు) 4) ఓయం సంబట్టి అలియాస్ సమిత (ఏరియా కమిటీ సభ్యురాలు) 5) కొర్సా సోమ్ల్ అలియాస్ పరిమిళ (ఏరియా కమిటీ సభ్యురాలు) 6) కుంజం రాంబు (పార్టీ సభ్యుడు), 7) దొడి నీలేష్ (పార్టీ సభ్యుడు) 8) మదకం గంగి (పార్టీ సభ్యులు) 9) హేమల్ల రమే (పార్టీ సభ్యులు) 10) మదకం హైమ (పార్టీ సభ్యులు) 11) సోడి అర్జున్ అలియాస్ సంజు (పార్టీ సభ్యులు) 12) కర్టం బండి (పార్టీ సభ్యులు) 13) మదకం బుజ్జి అలియాస్ మంగ్లీ (పార్టీ సభ్యురాలు) 14) మదకం నవ్య అలియాస్ యుగి (పార్టీ సభ్యురాలు) 15) మండ్వీ లక్ష్మి (పార్టీ సభ్యురాలు) 16) మదకం పుజీ అలియాస్ రితిక (పార్టీ సభ్యురాలు) 17) హేమ్ల హిడ్మీ అలియాస్ నిర్మల (పార్టీ సభ్యురాలు) 18) పుణెం ఇష్టు అలియాస్ సరీనా (పార్టీ సభ్యులు) 19) మదకం హంగు అలియాస్ రోహన్ (పార్టీ సభ్యులు) 20) పుల్సు లక్ష్మణ్ (పార్టీ సభ్యులు)21) మడ్వీ జోగి (పార్టీ సభ్యులు)22) తాతి లక్ష్మి (పార్టీ సభ్యురాలు) 23) నుప్పు కోసి (పార్టీ సభ్యురాలు)24) ఓయం జ్యోతి (పార్టీ సభ్యురాలు) 25) కోర్స శాంతి (పార్టీ సభ్యురాలు) 26) కుంజం భీమి (పార్టీ సభ్యురాలు)27) ఎం.జోగి (పార్టీ సభ్యులు)28) మడ్వీ మహిణి (పార్టీ సభ్యురాలు)ఏలూరు జిల్లాలో...1) సోదె లచ్చు అలియాస్ గోపాల్ (స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు) 2) సోదె లక్మా అలియాస్ భీమ (డివిజనల్ కమిటీ సభ్యుడు) 3) గంగి లక్ష్మి అలియాస్ మాదే (డివిజనల్ కమిటీ సభ్యుడు) 4) వెంటి వెంకట్ (ఏరియా కమిటీ సభ్యుడు) 5) మదకం వాగా (ఏరియా కమిటీ సభ్యుడు) 6) కశ్యప్ భీమా అలియాస్ యోగేష్ (ఏరియా కమిటీ సభ్యుడు) 7) పుడియం ఆనంద్ అలియాస్ దన్ను (ఏరియా కమిటీ సభ్యుడు) 8) మదకం లక్ష్మణ్ అలియాస్ కోసా (ఏరియా కమిటీ సభ్యుడు) 9) కుంజం బుజ్జి (ఏరియా కమిటీ సభ్యుడు) 10) తాతీ కమల (ఏరియా కమిటీ సభ్యురాలు) 11) దాది ఆద్మా అలియస్ మల్లేష్ (ఏరియా కమిటీ సభ్యుడు) 12) మడ్వీ జోగా (ఏరియా కమిటీ సభ్యుడు) 13) మడ్వీ సునీత, 14) కుంజం నందిని (ఏరియా కమిటీ సభ్యులు) 15) బాడిశ రాజు (ఏరియా కమిటీ సభ్యుడు)ఎన్టీఆర్ జిల్లాలో..1) పోడియం రెన్గు (స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు) 2) సోడి మనల్ల (డివిజనల్ కమిటీ సభ్యుడు) 3) మదకం మదన్ అలియాస్ మధన్న (డివిజన్ కమిటీ సభ్యుడు ) 4) సోడి మంగీ (ఏరియా కమిటీ సభ్యురాలు) కాకినాడ జిల్లాలో... 1) పోట్టం కాంతి (ఏరియా కమిటీ సభ్యురాలు) 2) మడ్వీ కోసి (ఏరియా కమిటీ సభ్యురాలు) డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో... 1) మడ్వీ హంధా (డివిజనల్ కమిటీ సభ్యులు) -
46 మంది మావోయిస్టులకు రిమాండ్
విజయవాడలీగల్/ఏలూరు టౌన్/కాకినాడ లీగల్: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం పట్టుబడిన మావోయిస్టులను బుధవారం పోలీసులు కోర్టుల్లో హాజరుపరిచారు. వీరిలో 46 మందికి న్యాయమూర్తులు రిమాండ్ విధించారు. విజయవాడ కానూరులోని న్యూఆటోనగర్‌లో 28 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్టు ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్హా తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి(దేవ్‌జీ)కి చెందిన బృంద సభ్యులు, హిడ్మా బృంద సభ్యులు న్యూఆటోనగర్‌లో మకాం వేసినట్లు తెలిపారు. వీరిని బుధవారం ఉదయం 11 గంటల సమయంలో విజయవాడలోని న్యాయస్ధానాలలో పోలీసులు హాజరుపరిచారు. వీరిలో నలుగురి వయస్సు ధ్రువీకరణ పత్రాలు లేనందున, వారి వయస్సును ధ్రువీకరించాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. మిగిలిన 20 మంది మహిళలు, నలుగురు పురుషులకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. వీరిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ ప్రసాదంపాడులో పట్టుబడిన నలుగురు మావోయిస్టులకు న్యాయమూర్తి 3వ తేదీ వరకు రిమాండ్ విధించారు. వారిని నెల్లూరు జైలుకు తరలించారు. కాకినాడ జిల్లాలో ఇద్దరు మహిళా మావోయిస్టులకు.. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం కొప్పవరంలో పట్టుబడ్డ ఇద్దరు మహిళా మావోయిస్టులకు బుధవారం కోర్టు రిమాండ్ విధించింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా, పోటకపల్లి ప్రాంతానికి చెందిన మాధవి కొసి అలియాస్ అనూష, పొటెం క్రాంతి అలియాస్ అంకితను కాకినాడ ఐదో అదనపు జ్యుడీíÙయల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా డిసెంబర్ 3వ తేదీ వరకు రిమాండ్ విధించారు. వారిని కాకినాడ స్పెషల్ సబ్‌జైలుకు తీసుకువెళ్లాలని మేజిస్ట్రేట్ షేక్ షిరిన్ ఆదేశాలు ఇచ్చారు. అయితే కాకినాడ స్పెషల్ సబ్‌జైలులో మహిళ మావోయిస్టులు ఉండడానికి ప్రత్యేక గది లేకపోవడంతో రాజమõßహేంద్రవరం సెంట్రల్ జైలుకు పంపించారు. కోనసీమ జిల్లా రావులపాలెంలో పట్టుబడిన సరోజ్ మడవిని కొత్తపేట కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైల్‌కి తరలించారు. ఏలూరులో 15 మందికి ఏలూరు గ్రీన్ సిటీలోని ఒక ఇంట్లో మంగళవారం పట్టుబడిన 15మంది మావోయిస్టులను ఏలూరు జిల్లాకోర్టు ప్రాంగణంలోని స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం మావోయిస్టులను పోలీస్ బలగాలతో కట్టుదిట్టమైన భద్రతతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. తొలుత బుధవారం ఉదయం 15 మంది మావోయిస్టులను ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్ పర్యవేక్షణలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య పోలీస్ ఉన్నతాధికారులు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశానికి విజయవాడ తరలించారు. అనంతరం విజయవాడ నుంచి పోలీస్ భద్రత నడుమ ఏలూరు మహిళా పోలీస్‌స్టేషన్‌కు ఉదయం 10.30 గంటలకు తీసుకువచ్చారు. భద్రతా కారణాల దృష్ట్యా ఏలూరు జీజీహెచ్ వైద్య నిపుణులను మహిళాస్టేషన్‌కు తీసుకువచ్చి అక్కడే మావోయిస్టులకు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. హిడ్మా గ్రూపులోని కీలక నేతలే ఏలూరు జిల్లా పోలీసులకు పట్టుబడిన 15 మంది మావోయిస్టులు చత్తీస్ఘడ్ రాష్ట్రానికి చెందినవారు. వీరంతా సుఖ్మా, బీజాపూర్ జిల్లాలకు చెందినవారు. మోస్ట్‌వాంటెడ్ హిడ్మా గ్రూప్‌లో కీలక నేతలుగా పోలీస్ అధికారులు పేర్కొంటున్నారు. లచ్చు.. పాత్ర హెచ్చు.. చత్తీస్ఘడ్ సుఖ్మా జిల్లాకు చెందిన లచ్చు అలియాస్ గోపాల్‌ను మావోయిస్ట్ కీలక నాయకుడిగా పోలీస్ అధికారులు చెబుతున్నారు. లచ్చు మావోయిస్ట్ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడుగా, సౌత్ బస్తర్ డీవీసీలో పనిచేస్తాడనీ, ఆయుధాల తయారీ, వినియోగంలో నిపుణుడని సమాచారం. హిడ్మా చేసిన అనేక కీలకమైన దాడుల్లో లచ్చు కీలక పాత్ర పోషించేవాడని తెలిసింది. పలు భాషలు సైతం మాట్లాడే నైపుణ్యం అతడి సొంతం. పట్టుబడిన మావోయిస్టుల్లో వెట్టి వెంకట్ అనే వ్యక్తి గోపాల్‌కు అసిస్టెంట్‌గా ఉండేవారు. డీవీసీ సభ్యుడు మడకం వగ ప్రెస్‌కమిటీ ఇన్చార్జ్గా ఉన్నారు. జాగరకొండ ఏరియా దళ సభ్యుడు బడిస రాజు లక్మాకు గార్డ్‌గా పనిచేస్తున్నారు. భారీగా ఆయుధాలు ఏలూరులో మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలు, నగదును ఏలూరు జిల్లా పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. రివాల్వర్స్–2, డబుల్ బ్యారెల్ బోర్ గన్–1, కంట్రీమేడ్ సింగిల్ బ్యారెల్ గన్స్–11, తపంచా –1, 132 రౌండ్ల బుల్లెట్స్, రూ.2.80 లక్షల నగదును పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. -
జనారణ్యంలో విప్లవ స్లో‘గన్’!
రామవరప్పాడు/పటమట(విజయవాడతూర్పు): విజయవాడలో మావోయిస్టు కదలికలు స్థానికంగా కలకలం రేపింది. భవన నిర్మాణ కార్మికులుగా, ఆటోనగర్‌లో రోజువారీ కూలీగా పనిచేసుకుంటూ బతుకుతామని చెప్పి నగరానికి కొంచెం దూరంగా ఉండే ఇళ్లను ఎంపిక చేసుకుని ఇళ్లను అద్దెకు తీసుకుని ఉండటం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఆయా ప్రాంతాల్లో ఒక్కసారిగా ఆక్టోపస్, టాస్క్‌ఫోర్స్, ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్యూరోలతోపాటు స్థానికపోలీసులు రావటంతో ప్రసాదంపాడు ఉలికిపాటుకు గురైయ్యింది. ఆపరేషన్ కగార్ తర్వాత.. ఛత్తీస్‌గఢ్‌లో ఆపరేషన్ కగార్ తర్వాత దండకారణ్యంలో మావోయిస్టుల కదలికలకు చెక్ పడింది. దీంతో మావోయిస్టులు భారీగా నగరాల్లోకి వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా, పాలమడుగు గ్రామానికి చెందిన పొడియా బీమా, బీజాపూర్ జిల్లా గోండిగూడా గ్రామానికి చెందిన మడకం లఖ్మ, బీజాపూర్ జిల్లాకు చెందిన మడవి చిన్మయి, సుక్మా జిల్లాకు చెందిన చోడిమంగీ విజయవాడ రూరల్ మండలంలోని ప్రసాదంపాడు ఎస్ఈఆర్ సెంటర్ దాటాక రైల్వేట్రాక్ అవతలివైపు దూరంగా ఉన్న ఓ రెండంతస్తుల భవనాన్ని రెండు నెలల క్రితం అద్దెకు తీసుకున్నారు. మాయమాటలతో నమ్మించి.. తమది నగరంలోని అజిత్‌సింగ్‌నగర్ ప్రాంతమని, తమ చెల్లికి, ఆమె భర్త్తకు విభేదాలు వచ్చాయని, దీనిపై పెద్దల సమక్షంలో పంచాయితీ నడుస్తుందని, కొంతకాలం విడిగా ఉండడం ఆ వివాదం ముగిసేవరకు ఉంటామని ఇంటి యజమానికి మావోలు నలుగురూ మాయమాటలు చెప్పా రు. ఇంటికి సంబందించి రెండు నెలల అడ్వాన్స్ ఇచ్చారు. నెలనెలా అద్దెను కూడా సక్రమంగానే చెల్లించారు. ఆ మావోయిస్టుల్లో ఒక మహిళ మాత్రం ఇంటి నుంచి బయటకు రావటం, ఎవరితో మాట్లాడకపోవటంతో ఇటీవల ఇంటి యజమానికి అనుమానం వచ్చింది. ఇల్లు ఖాళీ చేయాలని పట్టుబట్టాడు. దీంతో పొడియా భీమా, మడకం లఖ్మ తమ చెల్లెలి వివాదం సద్దుమణుగుతుందని, త్వరలోనే ఇక్కడి నుంచి వెళ్లిపోతామని యజమానిని బతిమలాడాడు. సోమవారం పోలీసులు తమ ఇంటి ముందు మోహరించటంతో అవాక్కవడం యజమాని వంతైంది. వీరివద్ద మారణాయుదాలు కూడా లభ్యం కావడంతో స్థానికుల్లో కలవరం మొదలైంది. తరచూ వచ్చేది ఎవరు..? మావోయిస్టులు మకాం చేసిన ఇంటికి రెండు రోజులకు ఓసారి ముగ్గురు సభ్యులు వచ్చి రహస్యమంతనాలు చేసేవా రు. వారంలో రెండుసార్లు తప్పకుండా వచ్చేవారని స్థానికు లు తెలిపారు. వీరు వచ్చేటప్పుడు ఇక్కడ ఉన్న వారికి భోజ న క్యారేజీలు తీసుకువచ్చేవారు. ఇంటి యజమానితో వారు బంధువులని చెప్పి మభ్యపెట్టారు. వీరు రాని సమయంలో తరచూ ఆన్లైన్లో ఆహారాన్ని ఆర్డర్ పెట్టుకునేవారని, ఎవరితోనూ మాట్లాడేవారు కాదని స్థానికులు తెలిపారు. -
విజయవాడ కోర్టుకు 28 మంది మావోయిస్టులు
-
Bandi Sanjay: మా లక్ష్యం మావోయిస్టుల అణచివేతే..!
-
మావోయిస్టుల ఎన్కౌంటర్.. హరగోపాల్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఎన్కౌంటర్ల పేరుతో కేంద్ర ప్రభుత్వం చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. కేంద్రం శాంతి చర్చలు జరిపితే ప్రాణ నష్టం ఉండదన్నారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలతో చర్చలు జరిపితే తప్పేంటి? అని ప్రశ్నించారు.ఆపరేషన్ కగార్ కారణంగా మావోయిస్టులు నేతలు చనిపోతున్నారు. తాజాగా ఎన్కౌంటర్ మావోయిస్టు అగ్రనేత హిడ్మా కూడా మరణించారు. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ హరగోపాల్ తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘మావోయిస్టులు శాంతి చర్యలకు సిద్ధమని ప్రకటించారు కదా. అయినా కేంద్రం డెడ్‌లైన్ పెట్టి మరీ ఎలిమినేట్ చేస్తామంటోంది. ఎన్కౌంటర్ల బదులుగా ఏకపక్ష కాల్పులు జరుగుతున్నాయి. కేంద్రం శాంతి చర్చలు జరిపితే ప్రాణ నష్టం ఉండదు. అడవులను కార్పొరేట్ శక్తుల వశం చేసే ప్రయత్నం జరుగుతోంది. సంపదను కార్పొరేట్లకు పంచడమే ఈ అభివృద్ధి నమూనా.ఎన్కౌంటర్ల పేరుతో ప్రభుత్వం చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది. ఇది ఇలాగే కొనసాగితే ప్రభుత్వంపై విశ్వసనీయత తగ్గుతుంది. అదే జరిగితే శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్‌లా తయారవుతాం. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ప్రజాస్వామ్యం బతికి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలతో చర్చలు జరిపితే తప్పేంటి?. ఎన్కౌంటర్ల పేరుతో ప్రభుత్వం చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది. ఆదివాసీల కోసం వచ్చిన చట్టాలనీ ఏమైపోయాయి. ఆయుధాలు పట్టుకోవద్దని చట్టంలో నిబంధన ఉంది. ప్రభుత్వం కూడా చట్టానికి లోబడే ఆయుధం వాడాలి కదా? అని ప్రశ్నించారు. -
లొంగి పోవాలనుకుంటే.. నాకు ఫోన్ చేయండి
-
మావోయిస్టులు పట్టుబడిన ఇంటి నుంచి సాక్షి సంచలన రిపోర్ట్
-
కథ ముగిసింది.. శ్రీలంక పారిపోతూ పోలీసులకు బుక్కయ్యాడు
-
హిడ్మా.. ఎన్‌కౌంటర్‌కు ముందు ఏం జరిగింది?
సాక్షి, అమరావతి: ఆపరేషన్ కగార్ కారణంగా ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు మృతి చెందుతున్నారు. మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు మాద్వి హిడ్మా మృతి చెందారు. దీంతో, మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అయితే, తాజాగా హిడ్మా.. ఓ జర్నలిస్టుకు రాసిన లేఖ తాజాగా బయటకు వచ్చింది. అందులో కీలక విషయాలను వెల్లడించారు.మావోయిస్టు కీలక నేత హిడ్మా.. గత కొన్ని రోజులుగా లొంగిపోయే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ఈ మేరకు తన ఆలోచనలు, నిర్ణయాలపై బస్తర్‌లో ఉన్న ఒక జర్నలిస్ట్‌కు హిడ్మా లేఖ రాశారు. తన చివరి లేఖలో ఆయుధాలు విడిచేందుకు ఆలోచిస్తున్నట్టు పేర్కొన్నాడు. ఆంధ్రప్రదేశ్‌కు రావాలని నవంబర్ 10న జర్నలిస్ట్‌కు రాసిన లేఖలో పేర్కొన్నాడు. ‘ఎక్కడ లొంగిపోవాలన్నది నిర్ణయించాల్సి ఉంది.. మా భద్రతకు హామీ ఇస్తే లొంగిపోయేందుకు సిద్ధం.. త్వరలో హిందీతో పాటు తెలుగులోనూ ఆడియో మెసేజ్ పంపుతాం.. ఆయుధాలు విడిచే ముందు కొన్ని అంశాలపై చర్చించాల్సి ఉంది’ అని లేఖలో రాసుకొచ్చాడు.ఇదిలా ఉండగా, హిడ్మా లేఖపై తాజాగా ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా స్పందిస్తూ.. హిడ్మా లేఖ రాసిన విషయం మాకు తెలియదు. హిడ్మా ఎన్కౌంటర్లోనే చనిపోయాడు. అతడిని పట్టుకుని చంపామనేది అసత్యం. లొంగిపోయేందుకు వచ్చిన ఎవరినీ ఎన్కౌంటర్ చేయలేదు. ఎన్కౌంటర్ భయం ఉంటే మీడియా ద్వారా లొంగిపోవచ్చు. మావోయిస్టులు లొంగిపోవాలి’ అని సూచించారు. -
మావోయిస్టులు లొంగిపోవాలని కోరుతున్నా: మల్లోజుల
సాక్షి, హైదరాబాద్: ఆపరేషన్ కగార్ కారణంగా మావోయిస్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఇప్పటికే పలువురు మావోయిస్టు కీలక నేతలు మృతి చెందారు. ఈ నేపథ్యంలో మాజీ మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.మావోయిస్టు నేత హిడ్మా ఎన్కౌంటర్ నేపథ్యంలో తాజాగా మల్లోజుల వేణుగోపాల్ స్పందిస్తూ మావోయిస్టులు ఆయుధాలు వీడాలని వీడియో సందేశం పంపిచారు. ఈ సందర్బంగా మల్లోజుల.. మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఎన్కౌంటర్లో మావోయిస్టులు చనిపోతున్నారు. ఎన్కౌంటర్లో హిడ్మాతో పాటు పలువురి ప్రాణాలు పోయాయి. దేశంలో పరిస్థితులు మారాయి.. మనం కూడా మారాలి. మావోయిస్టులు లొంగిపోవాలని కోరుతున్నాను. లొంగిపోవాలనుకునే మావోయిస్టులు తను ఫోన్ చేయాలన్నారు. ఈ సందర్భంగా తన ఫోన్ 88560 38533 ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ‘ఆపరేషన్ కగార్’తో కకావికలమైన మావోయిస్టు పార్టీకి చివరి ఆశ కూడా ఆవిరైంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మాడ్వి హిడ్మా ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టు ఉద్యమం వెన్నెముక విరిగిపోయింది. పార్టీని దశాబ్దాలపాటు నడిపిన గణపతి పక్కకు తప్పుకోవడం.. అనంతరం ఉద్యమాన్ని దూకుడుగా నడిపించిన పార్టీ ప్రధాన కార్యదర్శి, సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మృతి చెందడంతో ఇక మిగిలిన ఒకే ఒక ఆశా కిరణం హిడ్మానే. నంబాల కేశవరావు అనంతరం తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీని పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసినా, పార్టీని దూకుడుగా నడిపించే క్రియాశీల బాధ్యత హిడ్మాకే అప్పగించారు. మిలటరీ ఆపరేషన్స్‌లో దిట్ట కావడంతోపాటు గిరిజనుడైన అతనికి దండకారణ్యంపై పూర్తి పట్టుంది. స్థానిక గిరిజనుల్లో విశేష ఆదరణ ఉంది.బతికుంటే తదుపరి సుప్రీం కమాండరే.. ఆపరేషన్ కగార్తో తుడిచి పెట్టుకుపోతున్న మావోయిస్టు పార్టీ హిడ్మాపైనే భవిష్యత్ ఆశలు పెట్టుకుంది. ఛత్తీస్‌గఢ్‌తోపాటు ఒడిశా, మహారాష్ట్రల్లోని గిరిజన ప్రాంతాలు ఆయనకు కొట్టినపిండి. మిలటరీ ఆపరేషన్స్ నిర్వహణపై నిర్ణయం, వ్యూహం, కార్యాచరణ అంతా హిడ్మానే చూసుకుంటారని చెబుతున్నారు. అంటే పార్టీ తర్వాత సుప్రీం కమాండర్ హిడ్మానేనని మావోయిస్టు పార్టీ స్పష్టమైన సంకేతం ఇచ్చింది. మావోయిస్టు పార్టీకి గణపతి, నంబాల కేశవరావు, దేవ్ జీ వరుసగా ముగ్గురు తెలుగు వారు ప్రధాన కార్యదర్శులు అయ్యారు. తర్వాత హిడ్మా పార్టీ సుప్రీం కమాండర్ అయ్యుంటే.. తొలిసారి తెలుగేతర మావోయిస్టు, అందులోనూ గిరిజనుడు మొదటిసారి పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యేవాడని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు హిడ్మా ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టు పార్టీ ఇక పూర్తిగా కొడిగట్టడం ఖాయమని పరిశీలకులు చెబుతున్నారు. -
ఇది పక్కా ప్లాన్.. త్వరలో మరో ఎన్ కౌంటర్..
-
అల్లూరి ఏజెన్సీలో భారీ ఎన్కౌంటర్.. మృతుల వివరాలు ఇవే..
సాక్షి, అల్లూరి జిల్లా: ఏపీలో మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్టు తెలిసింది.వివరాల ప్రకారం.. అల్లూరి జిల్లాలోని ఏజెన్సీలో మావోయిస్టులు ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. బుధవారం ఉదయం మారేడుమిల్లి మండలం జీఎంవలస సమీపంలో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బుధవారం ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో శ్రీకాకుళానికి చెందిన ఆంధ్ర, ఒడిస్సా ఇంఛార్జ్ జోగారావు అలియాస్ టెక్ శంకర్ మృతి చెందారు. వెపన్స్ డీలింగ్‌లో శంకర్‌ది కీలక పాత్ర. మృతుల్లో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ఇక.. ఈ ఎన్‌కౌంటర్‌ను ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా మీడియా సమావేశం సందర్బంగా ధృవీకరించారు. ఏడుగురు మృతులు వీరే..1. మెట్టూరి జోగా రావు @ టెక్ శంకర్ @ శంకర్.. బతుపురం (v), వజ్రపు కొత్తూరు (M), శ్రీకాకుళం. SZCM, ఇంఛార్జ్ AOB2. జ్యోతి @ సరిత, DVCM, (గతంలో నంబాల కేశవ రావు @ BR దాదా మాజీ మావోయిస్టు చీఫ్‌కి గార్డ్ కమాండర్‌గా పనిచేశారు) 32 సంవత్సరాలు, n/o బూర్గులంక ప్రాంతం (కిస్టారం ప్రాంతం), సుక్మా జిల్లా.3. సురేష్ @ రమేష్, ACM (గతంలో జగరగొండ LOS, SBT DVC & ఎర్రా SZCM కమ్యూనికేషన్ టీమ్‌లో పనిచేశారు).4. లోకేష్ @ గణేష్, ACM (గతంలో జగరగొండ ఏరియా మిలీషియా కమాండర్, SBT DVC & కటకం సుదర్శన్ @ ఆనంద్ దాదాకు గార్డుగా పనిచేశారు).5. సైను @ వాసు, ACM (గతంలో జగరకొండ LOS, SBT DVC యొక్క Dy. కమాండర్‌గా పనిచేశారు).6. అనిత, ACM (గతంలో జగరగొండ LOS, SBT DVCలో పనిచేశారు).7. షమ్మీ ACM (గతంలో జగరగొండ LOS, SBT DVCలో పనిచేశారు).. -
తెలంగాణలో సరెండర్.. ఏపీలో మావోయిస్టుల షెల్టర్ : ఏడీజీ లడ్డా
సాక్షి, విజయవాడ: ఆపరేషన్ కగార్ ఒత్తిడితోనే మావోయిస్టులు అడవిని వీడుతున్నారని ఏపీ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. మావోయిస్టుల కదలికలపై రెండు నెలలుగా మానిటరింగ్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఎన్కౌంటర్ సమయంలో తప్పించుకున్న వారి కోసం కూంబింగ్ కొనసాగుతోందని పేర్కొన్నారు.ఏపీలో పట్టుబడిన మావోయిస్టులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా మాట్లాడుతూ.. భద్రతా బలగాలు చారిత్రక విజయం సాధించాయి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆపరేషన్ పూర్తి చేశాం. ఆపరేషన్‌లో పాల్గొన్న భద్రతా బలగాలకు అభినందనలు. మావోయిస్టుల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాం. ఎన్కౌంటర్ సమయంలో కొంత మంది మావోయిస్టులు తప్పించుకున్నారు. తప్పించుకున్న వారి కోసం కూంబింగ్ కొనసాగుతోంది. నిన్న ఉదయం అల్లూరి జిల్లాలో ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా చనిపోయాడు. రాష్ట్రవ్యాప్తంగా 50 మంది మావోయిస్టులను అరెస్ట్‌చేశాం. కాకినాడలో మరో ఇద్దరిని, కోనసీమలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టుల కదలికలపై రెండు నెలలుగా మానిటరింగ్ చేస్తున్నాం. ఆపరేషన్ కగార్ ఒత్తిడితోనే మావోయిస్టులు అడవిని వీడుతున్నారు.ప్లాన్ ప్రకారమే ఆపరేషన్.. ఛత్తీస్‌ఘడ్ నుంచి ఏపీకి రావాలని మావోయిస్టులు ప్రయత్నం చేస్తున్నారు. నిఘా వర్గాలు వారి కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నవంబరు 17న కీలకమైన ఆపరేషన్ చేపట్టాం. నిన్న మారేడుమిల్లిలో హిడ్మా, మరో ఐదుగురు ఎన్ కౌంటర్లో చనిపోయారు. వాళ్ల నుంచి సేకరించిన సమాచారంతో ఎక్కడెక్కడ మావోయిస్టులు ఉన్నారని దృష్టి పెట్టాం. ఎన్టీఆర్, కృష్ణా, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల నుంచి యాభై మంది మావోయిస్టులను పట్టుకున్నాం. ఎక్కడా ఎవరికీ ప్రమాదం జరగకుండా ఆపరేషన్ పూర్తి చేశాం. రాష్ట్ర చరిత్రలో ఇంతమంది కీలక వ్యక్తులను పట్టుకోవడం ఇదే ప్రథమం. కేంద్ర, రాష్ట్ర, ఏరియా, కమిటీ సభ్యులు, ఫ్లాటూన్ టీంలను పట్టుకున్నాం. వెపన్స్ 45, 272 రౌండ్స్, రెండు మ్యాగజైన్, 750 గ్రాముల వైర్, ఇతర సామాగ్రిని పట్టుకున్నాం. మా ఫీల్డ్ సిబ్బంది ప్రణాళిక ప్రకారం ఆపరేషన్ పూర్తి చేశారు. మా ఇంటెలిజెన్స్ విభాగం ఈ విషయంలో బాగా పని చేసింది. మాకు ముందే సమాచారం వచ్చినా.. వారి పై నిఘా పెట్టాం. వారి ఆలోచనలు, కార్యకలాపాలను గమనించాం. అన్నీ సెట్ చేసుకున్నాక ఒకేసారి వారందరినీ పట్టుకున్నాం.వచ్చే ఏడాది మార్చి నాటికి ఆపరేషన్ కగార్ పూర్తి.. తెలంగాణలో కొంతమంది ఇటీవల సరెండర్ అయ్యారు. వాళ్ల ద్వారా సమాచారం వెళితే ఇబ్బందులు ఉంటాయని భావించారు. అందుకే కొన్ని రోజులు షెల్టర్ తీసుకునేందుకు ఏపీలో పలు ప్రాంతాలను ఎంచుకున్నారు. మళ్లీ సమయం చూసి వాళ్ల ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వారి మూవ్మెంట్, ప్లాన్లపై ఇతర సమాచారం లేదు. హిడ్మాను పట్టుకున్నాక చంపామనే ప్రచారంలో నిజం లేదు. వచ్చ ఏడాది మార్చినాటికి ఆపరేషన్ కగార్ పూర్తి చేస్తాం. మావోయిస్టుల కదలికలపై అనేక మార్గాల ద్వారా సమాచారం వస్తోంది. అనుమానితులపై నిఘా ఉంచాం. ఈరోజు కూడా ఏజెన్సీలో నక్సల్, పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. ఆరు, ఏడుగురు చనిపోయారని సమాచారం ఉంది. ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉందన్నారు. మావోయిస్టులు లొంగిపోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. లొంగిపోతే ప్రభుత్వం నుంచి రివార్డు ఇస్తాం’ అని చెప్పారు. -
కాసేపట్లో విజయవాడ కోర్టుకు మావోయిస్టులు
మావోయిస్టుల అరెస్ట్ అప్డేట్స్.. విజయవాడ:50 మంది మావోయిస్టులను విజయవాడ కోర్టులో హాజరు పరచనున్న పోలీసులు.ప్రత్యేక అనుమతితో ఐదు జిల్లాల పరిధిలో అరెస్టయిన మావోయిస్టులను విజయవాడ కోర్టుకు తరలింపు.మావోయిస్టులందరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు.మరికొద్ది సేపట్లో భారీ భద్రత నడుమ మావోయిస్టులను కోర్టుకు తరలించనున్న పోలీసులుమీడియా ముందుకు మావోయిస్టులుఏపీలో నిన్న పట్టుబడిన 50 మంది మావోయిస్టులను పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. కాసేపటి క్రితమే ఏపీలో పట్టుబడిన 50 మంది మావోయిస్టులను విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు పోలీసులు తరలించారు. భారీ భద్రత నడుమ మావోయిస్టులను ఏలూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల నుంచి కమాండ్ కంట్రోల్ రూమ్‌కు తీసుకెళ్లారు. ఈ క్రమంలో కమాండ్ కంట్రోల్ రూమ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న రైఫిల్స్, పిస్టల్స్, డిటోనేటర్లు, మ్యాగ్జైన్లు, మొబైల్స్, సిమ్ కార్డులు, పెన్ డ్రైవ్స్, విప్లవ సాహిత్యం, హిడ్మా ఫొటోలను స్వాధీనం చేసుకుని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు తరలించిన పోలీసులు. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో ఏపీలో హైఅలర్ట్ కొనసాగుతోంది. నిఘా వర్గాలు అలర్ట్..ఇదిలా ఉండగా.. అల్లూరి జిల్లాలోని దండకారణ్యంలో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఏజెన్సీలో హై అలర్ట్ జారీ చేశారు. మావోయిస్టులు అడవిని వీడుతున్న నేపథ్యంలో అర్బన్ ప్రాంతాల్లోనూ నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. విజయవాడ, ఏలూరు సహా పలు ప్రాంతాల్లో మావోయిస్టులు తలదాచుకోవడంతో బలగాలు అప్రమత్తమయ్యాయి. ఏజెన్సీకి సమీపంలో ఉన్న ప్రాంతాల్లోకి మావోయిస్టులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాలపై ఫోకస్ పెట్టారు. -
పక్కా ప్లాన్‌తోనే..!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: హిడ్మా, మరో మావోయిస్టు నేత దేవ్‌జీ లక్ష్యంగా గత నెల రోజులుగా భద్రతా దళాలు యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్‌లోనే తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఉన్న కర్రెగుట్టల దగ్గర మావోయిస్టులు సమావేశమయ్యారు. ఈ సమయంలో పెరిగిన నిర్బంధం కారణంగా అజ్ఞాత జీవితం కష్టమనే అభిప్రాయానికి వచ్చిన హిడ్మా టీమ్‌లోని కొందరు కీలక నేతలు లొంగుబాటు ప్రతిపాదనను తెరమీదకు తెచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు తమకు ఉన్న కాంటాక్ట్‌ల ద్వారా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.కొందరు కీలక సభ్యులు గ్రేహౌండ్స్‌తో టచ్‌లోకి వెళ్లారని తెలుస్తోంది. వీరి ద్వారానే హిడ్మాను కూడా లొంగిపొమ్మంటూ పోలీసులు, ప్రభుత్వ వర్గాలు రాయబారం పంపినట్టు సమాచారం. ఈ క్రమంలో హిడ్మా దండకారణ్యం విడిచిపెట్టినట్టు సందేహం కలిగిన వెంటనే ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం విజయ్‌శర్మ పువర్తికి వెళ్లి హిడ్మా తల్లిని కలిశారు. లొంగిపోవాలంటూ ఆమె ద్వారా హిడ్మాకు సందేశం పంపారు. ‘ఎక్కడున్నావ్ బిడ్డా సజీవంగా ఇంటికి రా.. ఇక్కడే కష్టపడి బతుకుదాం.. కలో గంజో తాగుతూ జీవిద్దాం.. నువ్వు ఎక్కడున్నావో ఇంటికి వచ్చేయ్.. ఎక్కడున్నావో చెప్పు నేనైనా వస్తా... రెండూ లేదంటే నేనే నిన్ను వెదుక్కుంటూ అడవి బాట పడతా..’అంటూ ఆమె ద్వారా పంపిన సందేశం హిడ్మాకు చేరిందో, లేదో కానీ వారంలోగానే ఆయన ఎన్కౌంటర్ జరగడం గమనార్హం.దేశం దాటేందుకు ప్రయత్నం!లొంగుబాటు ప్రతిపాదనపై హిడ్మా ఆచితూచి వ్యవహరించినట్టు తెలుస్తోంది. ఆ ప్రతిపాదనలను ఏకపక్షంగా తిరస్కరించకుండా.. అలాగని వెంటనే ఒప్పుకోకుండా జనవరి వరకు వేచి చూసే ధోరణి అవలంభించాలని నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ వ్యూహాన్ని అమలు చేయడం ద్వారా దండకారణ్యం సరిహద్దుల్లో పోలీసు వర్గాలతో వైరాన్ని తగ్గించుకునే ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు చర్చల ప్రక్రియను కొనసాగిస్తూనే సముద్ర మార్గం గుండా దేశం దాటి సేఫ్ జోన్‌కు వెళ్లేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. మరోవైపు హిడ్మా అనుచరవర్గం కాంటాక్ట్‌లోకి వచ్చిన తర్వాత పోలీస్ వర్గాలు సైతం అప్రమత్తంగా వ్యవహరించాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముందు వెళ్లిన దళాలు సురక్షితంగా వెళ్లేలా చేసి..రెండు వారాల కిందట కర్రెగుట్టల పరిసరాలను విడిచిన హిడ్మా బృందం చిన్న జట్లుగా విడిపోయి తెలంగాణలోకి వచ్చేందుకు ప్రయత్నించగా.. ఇక్కడ నిఘా ఎక్కువగా ఉండడం, ఆదివాసీ గ్రామాల్లో ఉండే జనాలకు జియో ట్యాగింగ్ చేయడంతో స్థానికులను కలవడం కష్టంగా మారింది. దీంతో ఒడిశా మీదుగా ఏపీలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. మరోవైపు మావోల కదలికలపై నిఘా వేసిన బలగాలు అనువైన సమయం కోసం ఓపిగ్గా వేచి చూశాయి. ప్లాన్ ప్రకారం ముందుగా వెళ్లిన బ్యాచ్‌లకు సేఫ్ ప్యాసేజ్ ఇచ్చాయి. దీంతో నమ్మకం కుదిరిన హిడ్మా తన బృందంతో ఏపీలోకి వచ్చారు. ఆ తర్వాత పక్కా సమాచారంతో పోలీసులు చుట్టుముట్టగా ఎదురుకాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఆజాద్ ఎక్కడ?అల్లూరి సీతారామరాజు – భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల డివిజన్ కార్యదర్శిగా ఉన్న కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్‌తో పాటు మరో ఐదుగురు మావోయిస్టులు పోలీసుల అదుపులో ఉన్నారనే ప్రచారం గడిచిన నాలుగు రోజులుగా కొనసాగుతోంది. ఈ సమయంలోనే ఆజాద్ పర్యవేక్షణలో ఉన్న అల్లూరి జిల్లాలోకి హిడ్మా తన బృందంతో చేరుకోవడమనేది కాకతాళీయంగా జరిగిందా లేక పోలీసులు పన్నిన వ్యూహంలో భాగమా అనే చర్చ జరుగుతోంది. -
హిడ్మా ఎన్కౌంటర్.. ‘మోస్ట్ వాంటెడ్’ మృతి
రంపచోడవరం,సాక్షి, అమరావతి: వరుసగా పలువురు అగ్రనేతల ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో విలవిలలాడుతున్న మావోయిస్టులకు కోలుకోలేని భారీ ఎదురుదెబ్బ తగిలింది! రంపచోడవరం అడవుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు, గెరిల్లా దాడుల వ్యూహకర్త మడివి హిడ్మా మృతి చెందినట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఇన్చార్జ్హిడ్మాతో పాటు ఆయన భార్య మడకం రాజే అలియాస్ రాజక్క, మరో నలుగురు మావోయిస్టులు దేవ్, లక్మల్ అలియాస్ చైతు, మల్ల అలియాస్ మల్లలు, కమ్లూ అలియాస్ కమలేశ్ ఎన్కౌంటర్లో చనిపోయినట్లు వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం నెల్లూరు–ఇజ్జలూరు మధ్య అటవీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున 6 నుంచి ఏడు గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. నిఘా వర్గాల సమాచారంతో ఏవోబీ సరిహద్దుల్లో వారం రోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడటంతో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఓ ప్రకటనలో తెలిపారు. ఘటన వివరాలను ఇంటెలిజెన్స్ అదనపు డీజీ మహేశ్ చంద్ర లడ్హా, ఎస్పీ అమిత్‌బర్దర్ రంపచోడవరం పోలీస్ స్టేషన్ వద్ద మీడియాకు వెల్లడించారు. సమావేశంలో రంపచోడవరం ఓఎస్డీ పంకజ్‌కుమార్ మీనా, సీఆర్పీఎఫ్ కమాండెంట్ ధర్మప్రకాశ్ పాల్గొన్నారు. ఎన్కౌంటర్ ప్రాంతంలో రెండు ఏకే 47 రైఫిల్స్, పిస్తోలు, రివాల్వర్, సింగిల్ బ్యారెల్ గన్‌తోపాటు 28 రౌండ్ల ఏకే 47 రైఫిల్స్ బుల్లెట్లు, 5 రౌండ్ల పిస్తోలు బుల్లెట్లు, ఖాళీ ఏకే 47, పిస్తోలు షెల్స్‌ను స్వా«దీనం చేసుకున్నట్లు లడ్హా తెలిపారు. వీటితోపాటు ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, 150 నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, 25 మీటర్ల ఫ్యూజ్ వైర్, ఎలక్ట్రికల్ వైర్ బండిల్, ఏడు కిట్ బ్యాగులను కూడా స్వాదీనం చేసుకున్నామన్నారు. మరి కొందరు మావోయిస్టులు తప్పించుకున్నట్లు భావిస్తున్నామని, వారి కోసం భద్రతా బలగాల కూంబింగ్ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. వారి వివరాలను కుటుంబ సభ్యులకు తెలియచేశారు. పోలీసుల కథనం ప్రకారం ఘటన వివరాలివీ.. అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో స్వాధీనం చేసుకున్న ఆయుధాలను పరిశీలిస్తున్న అడిషనల్ డీజీపీ నిఘా పక్కా సమాచారంతో.. ఛత్తీస్‌గఢ్‌లో విస్తృతంగా జరుగుతున్న పోలీస్ కూంబింగ్‌తో కొందరు మావోయిస్టులు ఆంధ్రాలోని మైదాన ప్రాంతం షెల్టర్ జోన్‌కు చేరుకోగా మరికొందరు అటవీ ప్రాంతంలోనే ఉన్నారు. గత రెండుమూడు రోజులుగా మావోయిస్టుల కదలికలపై నిఘా విభాగం నుంచి కచ్చితమైన సమాచారం రావడంతో అల్లూరి జిల్లాలో పోలీసులు ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో తారసపడిన మావోయిస్టులతో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. సెర్చ్ ఆపరేషన్‌లో ఘటనా స్థలం వద్ద ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా గాలింపు చేపట్టి సుమారు 31 మంది మావోయిస్టులను అరెస్టు చేయగా మరో 30 మంది కోసం గాలిస్తున్నారు. కాగా మారేడుమిల్లి అటవీప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ బూటకమని పౌరహక్కుల సంఘం ఆరోపించింది. విజయవాడ కానూరులోని న్యూ ఆటోనగర్‌లో మావోయిస్టులు ఉన్న భవనంలోకి ప్రవేశిస్తున్న బలగాలు ఆదివాసీ నేత.. గెరిల్లా యుద్ధతంత్రం.. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన మడివి హిడ్మా 16 ఏళ్ల వయసులోనే మావోయిస్టు పార్టీలో చేరి అతి తక్కువ సమయంలోనే అగ్రనేతగా ఎదిగాడు. ఆదివాసీ వర్గానికి చెందిన హిడ్మాకు పలు భాషల్లో మంచి పట్టుంది. మావోయిస్టు అగ్రనేత రామన్న సారథ్యంలో గెరిల్లా యుద్ధతంత్రంలో హిడ్మా ఆరితేరారు. 2019లో రామన్న మృతి అనంతరం కమాండర్‌గా బాధ్యతలు చేపట్టి గెరిల్లా పోరుతో మెరుపు దాడులకు దిగి మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేరాడు. పలు దాడులను స్వయంగా పర్యవేక్షించాడు. హిడ్మా నేతృత్వంలో 2010 ఏప్రిల్‌లో చింతల్నార్ వద్ద మావోయిస్టులు జరిపిన దాడిలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు భావిస్తున్నారు. 2013లో దర్భా ఘాట్‌లో కాంగ్రెస్ నేతల కాన్వాయ్‌పై మావోయిస్టులు జరిపిన దాడిలో 30 మంది చనిపోగా.. 2017 బుర్కాపాల్ వద్ద మరోసారి మావోయిస్టుల దాడిలో 24 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. ఈ హింసాత్మక ఘటనల వెనకహిడ్మా కీలకంగా వ్యవహరించినట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. హిడ్మాను లొంగుబాట పట్టించేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ అధికారులు పూవర్తిలో ఉంటున్న ఆయన తల్లి ద్వారా తీవ్రంగా ప్రయత్నించారు. కర్రె గుట్టల్లో తృటిలో తప్పించుకుని.. ఛత్తీస్‌గఢ్‌లో ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేత ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఎన్కౌంటర్లో మృతి చెందారు. కొద్ది నెలల క్రితం హిడ్మా టార్గెట్‌గా కర్రె గుట్టలను చుట్టుముట్టిన పోలీసులు నాలుగు రోజులపాటు భారీ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఘటన నుంచి తృటిలో తప్పించుకున్న హిడ్మా తాజాగా ఎన్కౌంటర్లో మృతి చెందడం గమనార్హం. -
చలపతితో మొదలు నంబాల, హిడ్మాతో ముగింపు!
మావోయిస్టు పార్టీని, ఆ ఉద్యమాన్ని పూర్తిగా అణచివేసేందుకు ఆపరేషన్ కగార్(Operation Kagaar) చేపట్టింది అమిత్ షా నేతృత్వంలోని కేంద్ర హోం శాఖ. ఇందుకోసం 2026 మార్చిని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే.. ఈ ఏడాది కాలంగా జరిగిన ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు.. ఇతరత్రా పరిణామాలు ఆ లక్ష్యానికి భద్రతా బలగాలను చేరువే చేశాయి. కేంద్ర హోం శాఖ గణాంకాలు పరిశీలిస్తే.. గత పదేళ్లలో మావోయిస్టు ఉద్యమం తీవ్రంగా క్షీణించింది కూడా. ఈ ఏడాది జనవరిలో ఛత్తీస్‌గఢ్-ఒడిశా-తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఆపరేషన్ కగార్ మొదలయ్యాక.. ఆ పార్టీకి వరుస గట్టి దెబ్బలు తగలడం మొదలైంది. మావోయిస్టు ఒడిశా రాష్ట్ర కమిటీ చీఫ్ చలపతి (రామచంద్ర రెడ్డి అలియాస్ ప్రతాప్)తోసహా 13 మంది మావోయిస్టులు 2025 జనవరి 21న ఛత్తీస్‌గఢ్–ఒడిశా సరిహద్దులోని జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్‌తో ఒడిషాలో మావోయిస్టు ఉద్యమం శకం ముగిసింది. అయితే.. ఈ ఎన్‌కౌంటరే కగార్‌కు ప్రారంభ సంకేతంగా మారింది. ఇక్కడి నుంచే.. కేంద్రం చేపట్టిన విస్తృత వ్యూహాత్మక చర్యలు మావోయిస్టు ఉద్యమాన్ని తీవ్రంగా దెబ్బతీస్తూ వచ్చాయి.ఆపరేషన్ కగార్ (Operation Kagaar)లో భాగంగా.. 1 లక్షకు పైగా భద్రతా సిబ్బంది, డ్రోన్లు, AI ఆధారిత నిఘా పరికరాలను దట్టమైన అడవుల్లో వినియోగించాయి భద్రతా బలగాలు. ఈ వ్యూహాత్మక చర్యలు వల్ల మావోయిస్టులు చెల్లాచెదురయ్యారు. ఈ క్రమంలో భారీ ఎన్కౌంటర్లు, సామూహిక లొంగుబాట్లు.. ఇంకోవైపు మావోయిస్టు పార్టీలో నాయకత్వ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈలోపు..అబూజ్మడ్ అడవుల్లో మే 21వ తేదీన నంబాల కేశవరావు (బస్వరాజ్) ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. నంబాలతో పాటు ఆ ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులతో పాటు హతమయ్యారు. ఈ ఎన్కౌంటర్ మావోయిస్టు ఉద్యమానికి వ్యూహాత్మకంగా పెద్ద దెబ్బ అయ్యింది. ఇక్కడి నుంచి మావోయిస్టు కార్యకలాపాలు తగ్గుముఖం పట్టసాగాయి. ఆ వెంటనే మల్లోజుల వెంకటరావు (సోను), ఆశన్న వంటి కీలక నేతలు సరెండర్ కావడం.. ఇంటెలిజెన్స్ ఆధారంగా కూంబింగ్ ఆపరేషన్లు పెరగడం వల్ల ఉద్యమం లోపల భయాందోళనలు పెరిగాయి. సెంట్రల్‌పై కమిటీ లొంగిపోయిన సభ్యుల ఆరోపణలు.. వాళ్లను ఉద్యమ ద్రోహులుగా సెంట్రల్ కమిటీ ప్రకటించడం.. ఇలా మావోయిస్టు ఉద్యమం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లింది. గత రెండేళ్లలో వివిధ ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టుల సంఖ్య 430 మంది. లొంగిపోయిన వాళ్లు 1,500 మంది. ఈ మధ్యకాలంలో కేంద్ర కమిటీ సభ్యులే లొంగిపోతుండగా.. చేసేదేం లేక కింది స్థాయిలో కేడర్ కూడా పార్టీని వీడుతూ వచ్చింది. ప్రస్తుతం పార్టీలో కేవలం 12మంది కేంద్ర కమిటీ సభ్యులు మాత్రమే మిగిలినట్లు తెలుస్తోంది. ఇందులో ఓ విశేషం ఉంది. ఆ పన్నెండు మందిలో.. 8 మంది రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలే ఉన్నారు. హనుమంతు, గణపతి, తిరుపతి, చంద్రన్న, సంగం వీళ్లంతా ఇక్కడి వాళ్లే. ఇక కీలకంగా ఉన్న ఒకే ఒక్కడు మడావి హిడ్మా. ఆయన కోసం స్పెషల్ ఆపరేషన్ ఏడాది కాలంగా ఉదృతంగా సాగింది. ఆయన ‘లెక్క తేలిస్తే’.. మావోయిస్టు పార్టీ అధ్యాయం ముగిసినట్లేనని కేంద్ర హోం శాఖ బలంగా భావించింది కూడా. ఇప్పుడు అది కూడా జరగడంతో ఆపరేషన్ కగార్ దాదాపుగా ముగిసినట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు.


