కర్రెగుట్టలో పేలిన మందుపాతర.. ! | IED Blast In Karre Gutta Kagar Operation 2 | Sakshi
Sakshi News home page

కర్రెగుట్టలో పేలిన మందుపాతర.. !

Feb 20 2026 6:11 PM | Updated on Feb 20 2026 6:22 PM

IED Blast In Karre Gutta Kagar Operation 2

ములుగు:  మావోయిస్టుల వేరివేతలో భాగంగా కగార్‌ ఆపరేషన్‌-2 చేపట్టిన సీఆర్పీఎఫ్‌కు భారీ ప్రమాదం తప్పింది. కర్రెగుట్టలో కగార్‌-2 ఆపరేషన్‌లో భాగంగా మందుపాతర పేలింది. కర్రెగుట్టలో అమర్చిఉన్న మందుపాతరపై  ఓ జవాన్‌ కాలి వేయడంతో అది ఒక్కసారిగా పేలింది. దాంతో తీవ్ర గాయాలైన జవాన్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  గాయపడ్డ జవాన్‌ను హెలికాప్టర్‌లో హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు. 

సెర్చ్ ఆపరేషన్ చేస్తుండగా మందుపాతర పేలింది. ఈ ఘటనలో 39  బెటాలియన్‌కు చెందిన జవాన్‌ గాయపడ్డారు. గాయపడ్డ జవాన్‌ను నవజీత్‌ పటాకుగా గుర్తించారు. ఈరోజు(గురువారం, ఫిబ్రవరి 20వ తేదీ) ఉదయం నుంచి 11 ఐఈడీ(మందుపాతరలు) లను గుర్తించి నిర్వీర్యం చేశాయి సీఆర్పీఎఫ్‌ బృందాలు. 

కాగా,  తెలంగాణ–ఛత్తీస్‌గడ్ సరిహద్దు ప్రాంతంలోని కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో నిన్న(గురువారం, ఫిబ్రవరి 19వ తేదీ)భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో పలువురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.  వీరిలో అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది.  ఐదుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోగా, అందులో కీలక నేతలు ఉన్నట్లు సమాచారం.  మృతిచెందిన వారిలో అగ్రనేత దేవ్‌జీ  ఉన్నట్లు తెలుస్తోంది.

కర్రెగుట్టలో ఆపరేషన్‌-2లో భాగంగా 5 వేల మంది సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో కూంబింగ్‌ చేపట్టారు. మావోయిస్ట్‌ అగ్రనేతలే టార్గెట్‌గా ఆపరేషన్‌-2 కగార్‌ సాగుతోంది. మావోయిస్టు అగ్రనేతలు దేవ్‌జీ, సోది కోసం కూంబింగ్ చేపట్టగా.. మరో వైపు లొంగుబాటుకు అగ్రనేతలు సిద్ధమవుతున్నారు. ఇంకా 40 రోజులే ఆపరేషన్‌ కగార్‌ డెడ్‌లైన్‌ మిగిలి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement