ఎస్పీ ఎదుట ఐదుగురు మావోయిస్టుల లొంగుబాటు | Five Maoists Surrender Before SP Of Alluri District | Sakshi
Sakshi News home page

ఎస్పీ ఎదుట ఐదుగురు మావోయిస్టుల లొంగుబాటు

Apr 9 2026 8:29 PM | Updated on Apr 9 2026 9:07 PM

Five Maoists Surrender Before SP Of Alluri District

విశాఖ : మరో ఐదుగురు మావోయిస్టులు లొంగుపోయారు. ఇప్పటికే మావోయిస్టులు భారీ సంఖ్యలో లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి రాగా, తాజాగా మరో ఐదుగురు మావోయిస్టులు లొంగిపోయారు. చత్తీస్‌ఘడ్‌ క్యాడర్‌కు చెందిన ఐదుగురు మావోయిస్టులు అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. 

గతేడాది కర్రెగుట్టలో జరిగిన ఎదురుకాల్పుల్లో తప్పించుకున్న ఈ  మావోయిస్టులు.. తాజాగా అడవుల్ని  వదిలి బయటకొచ్చేశారు. దీనికి సంబంధించిన వివరాలు జిల్లా ఎస్పీ అమిత్‌ బర్ధర్‌ వెల్లడించారు. వీరిపై రూ. లక్ష నుంచి రూ. 8 లక్షల వరకూ రివార్డు ఉన్నట్లు  ఎస్పీ తెలిపారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement