Mahabubabad
-
బొమ్మలపెండ్లి
మేము గీసిన చిత్రాలు..పేరు: ముద్ద నక్షత్ర పాఠశాల : న్యూఇరా, 6వ తరగతి గ్రామం: బయ్యారం(బాలగేయం)చిన్ని చిన్ని బొమ్మలకు పెండ్లండి మీరంతా రారండి రారండి కొబ్బరాకు పందిరి వేసినాము పందిరికి తోరణాలు కట్టినాము రంగు రంగుల పూలన్నీ మాలకట్టి పందిరికి ముస్తాబు చేసినాము అదిగదిగో వచ్చింది బుజ్జిబొమ్మ పెండ్లి బొట్టు పెట్టుకొని నవ్వింది పట్టుచీర కట్టుకొని మురిసింది పూలజడ వేసుకొని మెరిసింది చిట్టి చిట్టి పీటపై కూర్చుంది బిడియంతో తలవంచి చూసింది పట్టుపంచె పెళ్లికొడుకు వచ్చాడు తాళి కట్టి తలంబ్రాలు పోసినాడు మేళాలు తాళాలు మోగాయి పిల్లలంతా చప్పట్లు కొట్టారు బుజ్జిబుజ్జి బొమ్మల పెండ్లండి ఎంతెంతో ఘనముగా జరిగింది. పద్మ త్రిపురారి, తెలుగు పండిట్, జనగామ -
ముగిసిన జిల్లాస్థాయి చదరంగం పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ జిల్లా చదరంగం సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి అండర్– 11 చదరంగం పోటీలు ఆదివారం ముగిశాయి. బాలుర విభాగంలో అద్విత్ అనిశెట్టి, శ్రేయాన్ రామ్ శివరాత్రి, జక్కం గౌరిక్సాయి, రేయాన్స్రాయ్, బాలికల విభాగంలో సాన్విక పెన్డ్రు, ఆద్య అనిశెట్టి, బెగావత్ రీతిక, ధరావత్ ఆరుషి విజేతలుగా నిలిచారు. మాస్టర్జీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఏఓ నాగరాజు హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్నారులు చదరంగంలో జిల్లా, రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించి తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని సూచించారు. నిర్వహణ కార్యదర్శి కన్నా మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 40 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. గెలుపొందిన క్రీడాకారులు జూన్ 19, 20, 21న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్బిటర్స్ ప్రేమ్‌సాగర్, రజనీకాంత్, పవన్ తదితరులు పాల్గొన్నారు. -
బీరు సీసా, కత్తులతో దాడి..
● ముగ్గురికి గాయాలుహసన్పర్తి : బీరుసీసాలు, కత్తితో దాడి చేసిన ఘ టనలో ముగ్గురికి గాయాలయ్యాయి. హసన్‌పర్తి మండలం వంగపహాడ్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హసన్‌పర్తి మండలం వంగపహాడ్లో మూడురోజులుగా బీర న్న ఉత్సవాలు సాగుతున్నాయి. ఈక్రమంలో ఆది వారం రాత్రి గ్రామానికి చెందిన రుషికేషన్పై అదే ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు రాకేశ్ బీరు సీసా, కత్తులతో దాడి చేశాడు. అడ్డు వచ్చిన రుషికేశ్ తండ్రి కుమారస్వామి, మామ భిక్షపతిపై కూడా దాడి చేయగా స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా, క్షతగాత్రులను నగరంలో ని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వ్యక్తిగత కక్షలతో దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సైబర్ మోసం.. మహబూబాబాద్ రూరల్ : ఫోన్ పే స్కానర్ పనిచేయడం లేదని ఓ గుర్తుతెలియని వ్యక్తి చెప్పిన మా టలు నమ్మిన ఓ గృహిణి.. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. మహబూబాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన గృహిణికి జరిగిన ఈ మోసం వివరాలను రూరల్ ఎస్సై పి.రాజు ఆదివారం వెల్ల డించారు. మహబూబాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన గృహిణికి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉంది. తన బ్యాంకు ఖాతాకు సంబంధించి ఆమె ఫోన్ పే వినియోగిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీన ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి తన ఫోన్ పే స్కానర్ పనిచేయడంలేదని చెప్పడంతో పాటు మరో వ్యక్తి సెల్ నంబర్ చెప్పి ఫోన్ పే ద్వారా రూ.8,860 పంపమని చెప్పగా బాధితురాలు పంపింది. మరోసారి రూ.8,860, రూ.17,720, రూ.8,860 ఇలా మొత్తం నాలుగు దఫాలుగా రూ.44, 300 పంపింది. ఆ తర్వాత కూడా నేరగాళ్లు మరోసారి డబ్బు పంపమని కోరగా బాధితులు ప్రశ్నించింది. దీంతో గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. దీంతో మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు వెంటనే సైబర్ క్రైమ్ నంబర్ 1930 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. అదేవిధంగా మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పిచ్చుకల దాహార్తి తీరుసున్నా..
నా పేరు బొగ్గారపు సహర్షిత్. నేను పాలకుర్తిలో ఉంటా. రోజురోజుకూ పెరుగుతున్న ఎండల నేపథ్యంలో పిచ్చుకలు దాహార్తి తీర్చుకోవడానికి వృథా ప్లాస్టిక్ బాటిల్‌ను నీటి తొట్టిగా మార్చి ప్రతీ రోజు నీరు పోస్తున్నా. పిచ్చుకలు వచ్చి నీరు తాగుతుంటే మా నాన్న నాగరాజు, అమ్మ దివ్య జ్యోతి నన్ను అభినందిస్తున్నారు. దీంతో నాకు చాలా ఆనందం కలుగుతోంది. అలాగే, ఖాళీ సమయంలో పర్యావరణ ప్రకృతిని చిత్రాలు గీస్తూ మా చెల్లి శ్రీహర్షిణితో కూడా గీయిస్తున్నా. చెస్, క్యారం ఆటలు నేర్పిస్తున్నా. ఇంట్లో అమ్మ చెప్పే కథలు వింటూ కాలక్షేపం చేస్తున్నా. –జనగామ -
అంత్య పుష్కరాలకు సీఎం రేవంత్‌కు ఆహ్వానం
కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈనెల 21నుంచి జూన్ 1వ తేదీ వరకు జరగనున్న సరస్వతీనది అంత్యపుష్కరాలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, కమిషనర్ ఎం. హనుమంతరావు ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఆహ్వాన పత్రిక అందజేశారు. సోమవారం గవర్నర్ శివప్రతాప్శుక్లాకు ఆహ్వాన పత్రిక అందజేస్తారని ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆర్జేసీ రామకృష్ణారావు, ఆలయ ఈఓ మహేశ్, ఉపప్రధాన అర్చకులు ఫణీంద్రశర్మ, వేదపారయనదార్ వైకుంఠ పాండా, జూనియర్ అసిస్టెంట్ దూది శ్రీనివాస్ పాల్గొన్నారు. -
టీజీ ఎప్‌సెట్‌లో ‘ఎస్ఆర్’ విద్యార్థుల ప్రతిభ
విద్యారణ్యపురి: టీజీ ఎప్‌సెట్–2026 ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ ఎ.వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి తెలిపారు. టీజీ ఎప్‌సెట్ బైపీసీ విభాగం రాష్ట్రస్థాయిలో వి.సాహ్యు 14వ ర్యాంకు సాధించారని వారు పేర్కొన్నారు. అదేవిధంగా కె.జీవన్ కుమార్ 91వ ర్యాంకు, కె.ఆశ్రిత 262వ ర్యాంకు, ఆర్.శ్రావణి 298వ ర్యాంకు సాధించారని వివరించారు. ఎంపీసీ విభాగంలో జి.యువన్‌చంద్ర 299వ సాధించారని వారు తెలిపారు. అలాగే, టీజీఎప్‌సెట్‌లో జె.శ్వేత 351వ ర్యాంకు, జె.గురుమోహన్‌చరణ్ 369వ ర్యాంకు, ఎన్.అవినాష్ 408వ ర్యాంకు, ఎన్.శివకల్యాణి 413వ ర్యాంకు, పి.సంజన 414వ ర్యాంకు, వై.సాత్విక్ 476వ ర్యాంకు, ఆర్.నిరూప్‌రెడ్డి 515వ ర్యాంకు, కె.జాహ్నవి 610వ ర్యాంకు, సి.హెచ్ అర్నవ్ 628వ ర్యాంకు, కె.ధీరజ్ 654వ ర్యాంకు సాధించారని వివరించారు. భవిష్యత్‌లో మరింత అత్యుత్తమైన ర్యాంకులు సాధించేలా తీర్చిదిద్దుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. గత 50 ఏళ్లలో పటిష్టమైన ప్రణాళికతో హైస్కూల్, జూనియర్ కాలేజీ, ఎంసెట్, ఐఐటీల్లో విద్యనందిస్తూ రాష్ట్ర, జాతీయస్థాయి పోటీపరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని చెప్పారు. ఈఏడాది జేఈఈ మెయిన్–2026లో ఉత్తమ ఫలితాలు సాధించారని వారు తెలిపారు. ‘రెజోనెన్స్’ విద్యార్థుల సత్తా.. హన్మకొండ: టీజీఎప్‌సెట్‌లో వరంగల్‌లోని రెజోనెన్స్ విద్యా సంస్థల విద్యార్థులు సత్తా చాటారు. ఆదివారం తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ టీజీ ఎప్‌సెట్ ఫలితాలు విడుదల చేసింది. ఇందులో తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని రెజోనెన్స్ విద్యా సంస్థల చైర్మన్ లెక్కల రాజిరెడ్డి తెలిపారు. డి.స్నితిక 753వ ర్యాంకు, సి.హెచ్.భువనేశ్వరి 878, డి.సంజన 925, ఎ.రితిక 982వ ర్యాంకు సాధించిందని వివరించారు. వీరు రాష్ట్రంలోని ఉన్నత శ్రేణి కళాశాలల్లో ప్రవేశాలు పొందబోతున్నారన్నారు. వీరితో పాటు 291 మంది విద్యార్థులు 10 వేలలోపు ర్యాంకులు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. డైరెక్టర్లు లెక్కల మహేందర్ రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి, సీఏఓ లెక్కల రమ్య, డీన్ బి.ఎస్.గోపాల్ రావు, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. ‘శివాని’ విద్యార్థుల విజయకేతనం హసన్‌పర్తి: టీజీఎప్‌సెట్–2026 ఫలితాల్లో శివాని కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. కళాశాలకు చెదిన బి. స్వామి (150 ర్యాంకు), ఎన్.చరణ్య(2,426 ర్యాంక్),కె.సౌందర్య(3,649 ర్యాంకు),ఎ.నవ్య(4,435 ర్యాంక్),ఎ. రత్యా(4,838 ర్యాంకు), జి. పూజిత(5744ర్యాంక్),పి. యశస్విని(6475 ర్యాంక్),ఇ. శ్రీశాంతి వర్మ(6863 ర్యాంక్),ఎం. ఐశ్వర్య (7,166 ర్యాంకు),ఇ. క్రిష్ణజా(7,840 ర్యాంకు),బి.అంజన శ్రీ (8,548 ర్యాంకు),ఎన్.జశ్వంత్ (9,018 ర్యాంకు),డి.సాయి కార్తీకేయ(9,114 ర్యాంకు), సి.హెచ్. అన్వేష్ (1,0318 ర్యాంకు),పి. సహస్ర శ్రీ(1,0997 ర్యాంకు) సాఽధించినట్లు శివాని కళాశాల కరస్పాండెంట్ తాళ్లపల్లి స్వామి తెలిపారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్ తాళ్లపల్లి స్వామి, కళాశాల ప్రిన్సిపాళ్లు జి. సురేందర్‌రెడ్డి ,వి. చంద్రమోహన్, డైరెక్టర్లు టి.రాజు, ఎన్. రమేష్, ఎ. మురళీధర్, వి. సురేశ్, ఎస్.సంతోష్‌రెడ్డి అభినందించారు. ‘ఇన్స్పైర్’ విద్యార్థుల ప్రభంజనం హసన్‌పర్తి : టీజీఎప్‌సెట్ ఫలితాల్లో హనుమకొండజిల్లా హసన్‌పర్తి మండలం ఎర్రగట్టుగుట్ట క్రాస్‌లోని ఇన్స్పైర్ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృషించారు. కళాశాలకు చెందిన పి. యోగి రాజ్ (1,190 ర్యాంకు), పి.సాయిప్రియ (6,994ర్యాంకు),ఎస్.అర్చన(8,389ర్యాంకు),టి. సాయి శ్రేష్టిత(9,614ర్యాంకు)సాధించినట్లు కళాశాల చైర్మన్ తీగల భరత్‌గౌడ్ తెలిపారు. ఈసందర్భంగా అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్ తీగల భరత్‌గౌడ్, ప్రిన్సిపాల్ సుంకరి శ్రీరాంరెడ్డి, డైరెక్టర్లు తీగల రాజ్‌కుమార్, కోటిచింతల మమతకుమారి, లాడే శివ అభినందించారు. -
వడదెబ్బతో మాజీ ఎంపీటీసీ మృతి
గీసుకొండ: వడదెబ్బతో వరంగల్ జిల్లా గీసుకొండ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ సభ్యురాలు దౌడు కోమల(60) ఆదివారం మృతి చెందారు. ఎండలో బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన ఆమె కింద పడి అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో మృతి చెందినట్లు ఆమె కుమారుడు భరత్ తెలిపారు. కోమల 2019–2024 మధ్య కాలంలో ఎంపీటీసీగా పని చేశారు. ఆమెకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కోమల మృతిపై గ్రామస్తులు, పలువురు కాంగ్రెస్ నాయకులు సంతాపం తెలిపారు. చెరువులో పడి వ్యక్తి .. గీసుకొండ: గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ మొగిలిచర్లలో చెరువులో పడి అదే గ్రామానికి చెందిన అల్లం మహేశ్వర్(42) అనే వ్యక్తి మృతి చెందాడు. గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ కథనం ప్రకారం.. కూలి పని చేసే మహేశ్యర్ ఆదివారం మధ్యాహ్నం కాలకృత్యాలు తీర్చుకోవడానికి చెరువు వైపునకు వెళ్లాడు. ఈ క్రమంలో కాలు జారి చెరువులో పడి నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందాడు. మృతుడి భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. -
రైతన్నా.. రంగు తెలుసుకో!
ఖిలా వరంగల్: పంటల్లో చీడపీడల నివారణకు రైతులు వివిధ రకాల పురుగు మందులు వినియోగిస్తుంటారు. మందు డబ్బాలపై పలు రంగుల స్టిక్కర్ల గుర్తులు ఉంటాయి. మందు ఎంత విషపూరితమో ఆ రంగులు సూచిస్తాయి. చాలామంది వీటిని గమనించకుండా పిచికారీ చేసి అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పటికై నా రైతులు మందు డబ్బాలపై ఎరుపు, నీలం, ఆకుపచ్చ, పుసుపు రంగులను చూసి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు, వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఎరుపు (అత్యంత ప్రమాదకరం) డబ్బా లేదా కవర్‌పై ఎరుపు రంగు, దానిపై ఎముకలు, పుర్రె గుర్తులు ఉంటే అత్యంత విష పూరితమైన ముందుగా పరిగణిస్తారు. ఇది శరీరంలోకి ఏ విధంగా వెళ్లినా ప్రాణాపాయం తప్పదు. నీలం (మధ్యస్థ ప్రమాదం) ఈ రకమైన మందులు మధ్యస్థ విషపూరిత స్థాయిని సూచిస్తాయి. డబ్బాలపై డేంజర్ అని రాసి ఉంటుంది. వీటిని పిల్లలు, పెంపుడు జంతువులకు దూరంగా ఉంచాలి. ఆకుపచ్చ (తక్కువ ప్రమాదకరం) వీటి విష తీవ్రత పైన పేర్కొన్న మూడింటి కంటే తక్కువ ఉంటుంది. ప్రమాదకరం (హెచ్చరిక) అని రాసి ఉంటుంది. తక్కువ ప్రమాదకరమైనా సురక్షితమైన పద్ధతిలోనే ఈ మందులను వినియోగించాలి. పసుపు (ఎక్కువ విషపూరితం) ఈ పసుపు రంగు మందు కూడా ఎక్కువ విషపూరితమైనదే. వీటిపై పాయిజన్ అని రాసి ఉంటుంది. పీల్చినా, చర్మంపై పడినా తీవ్రమైన అనారోగ్యం కలిగించే అవకాశం ఉంది. విష తీవ్రతను ఇలా గుర్తించండి డబ్బా కలర్ బట్టి మందు తీవ్రత పిచికారీలో జాగ్రత్తలు తీసుకోవాలి వైద్యులు, వ్యవసాయాధికారుల సూచన -
ఆగిన అన్నదాత గుండె
● ధాన్యం కొనుగోలు కేంద్రంలో అస్వస్థతకు గురై మృతి ● అలంకానిపేటలో ఘటన నెక్కొండ: రైతు కష్టానికి విలువ లేదు.. పండించిన పంటను తీసుకునే నాథుడు లేడు.. రోజులకొద్ది రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. నిర్వాహకుల పట్టింపులేమితో రైతులు ఆందోళనలకు గురై ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతు గుండె ఆగిన సంఘటన ఆదివారం జరిగింది. గ్రామస్తులు, తోటి రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గాజుల పెద్ద వెంకటేశ్వర్ (65) యాసంగి పంటగా నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న, మూడు ఎకరాల్లో వరి సాగు చేశాడు. నెక్కొండ మక్కల కొనుగోలు కేంద్రంలో ఇబ్బందులు వస్తున్నాయని తెలియడంతో సంగెం మండలం కాపులకనపర్తి కొనుగోలు కేంద్రానికి 15 రోజుల క్రితం 100 క్వింటాళ్ల మక్కలు తీసుకెళ్లాడు. అలాగే, గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రానికి నాలుగు రోజుల క్రితం 60 క్వింటాళ్ల ధాన్యం తీసుకెళ్లాడు. ఇలా రోజుల తరబడి రెండు చోట్ల రైతు పెద్ద వెంకటేశ్వర్ పంటలను అమ్మేందుకు పడరానిపాట్లు పడుతున్నాడు. ఉదయం కొనుగోలు కేంద్రానికి వచ్చి ధాన్యం ఆరబెడుతుండగా గుండెలో నొప్పి అంటూ అస్వస్థతకు గురయ్యాడు. తోటి రైతులు వెంటనే అప్రమత్తమై సీపీఆర్ చేశారు. చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మృతువాత పడ్డాడు. మృతుడికి భార్య నాగలక్ష్మి, కుమారులు వేణు, విజయ్, కుమార్తె కర్ణ ఉన్నారు. రైతు కుటుంబానికి నష్టపరిహారం అందించాలని స్థానికులు కోరుతున్నారు. -
నాణ్యతాప్రమాణాలతోనే న్యాక్ గుర్తింపు
● కేయూ వీసీ ఆచార్య కె. ప్రతాప్‌రెడ్డి కేయూ క్యాంపస్: ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలతోనే న్యాక్ గుర్తింపు లభిస్తుందని కాకతీయ యూనివర్సిటీ కె.ప్రతాప్‌రెడ్డి అన్నారు. కాకతీయ యూనివర్సిటీలోని ఐక్యూఏసీ ఆధ్వర్యంలో ‘ఉన్నత విద్యలో నాణ్యత హామీ, న్యాక్ గుర్తింపు’ అనే అంశంపై గూగుల్‌మీట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హైదరాబాద్ నుంచి హాజరై మాట్లాడారు. ఉన్నత విద్యాసంస్థల అభివృద్ధి, నాణ్యతాప్రమాణాల సాధనలో న్యాక్ గుర్తింపు అనేది అత్యంత కీలకమన్నారు. నూతన న్యాక్ మూల్యాంకన విధానం, పారదర్శకత, జవాబుదారీతనం, ఫలితాధారిత విశ్లేషణకు అధిక ప్రాధాన్యమిస్తుందన్నారు. పరిపాలనా ప్రక్రియగా కాకుండా నిరంతర పురోగతికి దోహదపడే సాధనంగా భావించాలని సూచించారు. కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం మాట్లాడుతూ న్యాక్ గుర్తింపు సాధనలో ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రధానవక్త ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఓఎస్డీ ఆచార్య ఆర్‌వీఎస్‌ఎస్‌ఎన్ రవికుమార్ న్యాక్ గుర్తింపు ప్రక్రియలో ఎదురయ్యే సవాళ్లను వివరించారు. డేటా సేకరణ కేంద్రాల ఏర్పాటు, ప్రతి అధ్యాపకుడికి వ్యక్తిగత వెబ్‌పేజీల రూపకల్పన, పేటెంట్లు, పరిశోధనా ప్రచురణలు, స్వయం పోర్టల్ వినియోగం, పూర్వవిద్యార్థుల భాగస్వామ్యం వంటి అంశాలను తెలిపారు. కేయూ ఐక్యూఏసీ డైరెక్టర్ ఆచార్య నర్సింహాచారి కార్యక్రమ లక్ష్యాలు, కాకతీయ యూనివర్సిటీ నాణ్యతాభివృద్ధిలో న్యాక్ గుర్తింపు, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రాముఖ్యత గురించి చెప్పారు. కేయూ ఓఎస్డీ ఆచార్య బి. వెంకట్రాంరెడ్డి మాట్లాడారు. యూనివర్సిటీలోని పలు విభాగాల అధిపతులు, యూనివర్సిటీ కళాశాలల ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధులకు భరోసా..
● న్యాయ సేవల కేంద్రానికి పెరుగుతున్న దరఖాస్తులు ● సమస్యల పరిష్కారంతో సీనియర్ సిటిజన్ల హర్షం మహబూబాబాద్: జిల్లాలోని సీనియర్ సిటిజన్ల కోర్టు కేసుల పరిష్కారం కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ సేవల కేంద్రానికి మంచి స్పందన వస్తోంది. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా న్యాయ సేవల కేంద్రంలో దరఖాస్తులు పెరుగుతున్నాయి. కాగా, సమస్యల పరిష్కారంతో దరఖాస్తుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరేట్లో న్యాయ సేవల కేంద్రం.. 2025 నవంబర్ 24వ తేదీన కలెక్టరేట్లో న్యాయ సేవల కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణిలో సీనియర్ సిటిజన్ల నుంచి కోర్టు కేసుల దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు న్యాయ సేవల కేంద్రంలో పారా లీగల్ వలంటీరు అందుబాటులో ఉండి న్యాయ సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఐదు నెలల్లో కేంద్రానికి వందకుపై దరఖాస్తులు వచ్చాయి. తీసుకున్న దరఖాస్తుపై స్పందిస్తూ పూర్తి వివరాలు తీసుకుని ప్రభుత్వ న్యాయవాది ద్వారా నోటీసులు ఇచ్చి న్యాయం చేస్తున్నారు. ప్రధానంగా వృద్ధ దంపతుల మెయింటెనెన్స్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ఈమేరకు వారికి న్యాయం జరిగేలా చూస్తున్నారు. నా కొడుకులు ఇబ్బంది పెడుతున్నారు.. నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక్కొక్కరికి మూడు ఎకరాల చొప్పున ఇచ్చాను. నాకు ఎకరం 10గంటల భూమి ఉంది. దానిని అమ్ముకునే విషయంలో ఇబ్బందులు పెడుతున్నారు. నన్ను సక్రమంగా చూసుకోకపోగా ఇబ్బంది పెడుతున్నారు. కేసు వేసి న్యాయం చేయాలని అన్ని పత్రాలను కేంద్రంలో ఇచ్చాను. –బోనగిరి చిన్న రాములు, ఉప్పరపల్లి, కేసముద్రం -
పాఠ్య పుస్తకాలొచ్చాయ్
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్య పుస్తకాలను సరఫరా చేసింది. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. కాగా, అప్పటి వరకు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉండనున్నాయి. ఇదిలా ఉండగా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెంచేందుకు టీచర్లు కృషి చేస్తున్నారు. పాఠశాలల పునఃప్రారంభం.. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. కాగా ప్రతీ విద్యార్థికి సమయానికి పుస్తకాలను అందజేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈమేరకు జిల్లాకు 2,86,290 పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయి. గత విద్యా సంవత్సరం మాదిరిగానే ప్రస్తుతం కూడా పాఠ్యపుస్తకాలపై సీరియల్ నంబర్లు ముద్రించి విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. విద్యార్థుల ఆధార్‌కార్డు నంబర్‌ను అనుసంధానం చేసుకుని, పుస్తకంపై ఉన్న సీరియల్ నంబర్‌ను రిజిస్టర్లో నమోదు చేసుకుని, ఆధార్‌కార్డు, సీరియల్ నంబర్‌ను ఆన్లైన్లో పొందుపరుస్తారు. అలాగే జూన్ 4నుంచి జూన్ 12వ తేదీ వరకు బడిబాట నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రతీ పాఠశాలకు రూ.వెయ్యి చొప్పున నిధులు ఇచ్చేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మండలాల వారీగా పాఠ్యపుస్తకాలు పంపిణీ.. జిల్లావ్యాప్తంగా 18 మండలాలు ఉన్నాయి. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1,00090 మంది విద్యార్థులు ఉన్నారు. కాగా, ఆయా మండలాల ప్రభుత్వ పాఠశాలలకు ఆర్టీసీ కార్గో బస్సుల ద్వారా పాఠ్య పుస్తకాలు తరలిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూమీడియం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందజేస్తారు. సకాలంలో విద్యార్థులకు అందజేస్తాం ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాఠశాలల్లో నూతన అడ్మిషన్ల కోసం తమవంతు బాధ్యతగా తీసుకుని విద్యార్థులను చేర్పించాలి. ఆర్టీసీ కార్గో బస్సుల ద్వారా ప్రతీ మండలానికి పుస్తకాలను రవాణా చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశం పొందిన ప్రతీ విద్యార్థికి పాఠ్యపుస్తకాలను సకాలంలో అందజేస్తాం. ఇప్పటికే జిల్లాకు పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయి. – సత్యనారాయణమూర్తి, జిల్లా విద్యాశాఖ అధికారిజిల్లాకు చేరిన 2,86,290 పాఠ్యపుస్తకాలు 73శాతం మాత్రమే రాక ప్రభుత్వ పాఠశాలల్లో 1,00,090 మంది విద్యార్థులు జూన్ 12న బడుల పునఃప్రారంభంమండలం పాఠశాలలు విద్యార్థులు బయ్యారం 84 4,089 చిన్నగూడూరు 13 1,126 దంతాలపల్లి 31 3,500 డోర్నకల్ 55 6,970 గంగారం 34 1,010 గార్ల 60 3,527 గూడూరు 93 5731 ఇనుగుర్తి 23 1,673 కేసముద్రం 67 6,801 కొత్తగూడ 61 3,611 కురవి 60 4,948 మానుకోట 140 23,782 మరిపెడ 84 9,276 నర్సింహులపేట 44 2,762 నెల్లికుదురు 54 3,288 పెద్దవంగర 31 2080 సీరోలు 27 1,724 తొర్రూరు 71 14,192 మొత్తం 1,032 1,00,090 -
ముదిరిన ముసలం
సోమవారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2026సాక్షి, మహబూబాబాద్: జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఏడాదిపాటు పాలకవర్గాలు లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. అయితే పాలక వర్గాల ఏర్పా టు తర్వాత కూడా ఒక్క అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నతీరుగా పాలన సాగుతోంది. పాలక మండలి, చైర్మన్లు, కమిషనర్లు, ఉద్యోగుల మధ్య సమన్వయం కొరవడింది. ఈ వివాదం చివరకు ఎమ్మెల్యేలు, పార్టీ పెద్దల వద్దకు వెళ్లింది. కమిషనర్లపై ఆరోపణలు.. జిల్లాలోని మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్, కేసముద్రం మున్సిపాలిటీల్లోని పలువురు చైర్మన్లు, కౌన్సిలర్లు కమిషనర్లపై ఆరోపణలు చేసినట్లు తెలిసింది. మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ తీరుపై చైర్మన్ అసహనం వ్యక్తం చేయడం, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పనిలో జాప్యం, అందరిని కలుపుకునిపోకపోవడంతో తరచూ వివాదాలు వస్తున్నాయని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. డోర్నకల్, మరిపెడ మున్సిపల్ కమిషనర్లు కుర్చీలకే పరిమితమై ఉంటున్నారని, పట్టణాల్లో సమస్యలను పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. తొర్రూరు మున్సిపల్ కమిషనర్ తమను లెక్క చేయడం లేదని కౌన్సిలర్లు ఆరోపణలు చేస్తున్నారు. ఉద్యోగులను చిన్నచూపు చూడటం, విధుల్లో నుంచి తొలగించడం వంటి సంఘటనలతో మున్సిపాలిటీ వివాదాలకు నిలయంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. కేసముద్రం మున్సిపాలిటీ సభ్యులను సమన్వయం చేయాల్సిన కమిషనర్ ఏకపక్షంగా ఉంటున్నారని, తీర్మానాలు చేసే విషయంలో కూడా తమను లెక్కలోకి తీసుకోవడం లేదని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కొత్తవారిలో దూకుడు.. మున్సిపాలిటీల్లో కొత్తగా ఎన్నికై న కొందరు కౌన్సిలర్లు, పలువురు చైర్మన్ల దూకుడు స్వభావంతో సమస్యలు వస్తున్నాయనే చర్చ జరుగుతోంది. వార్డుల్లోని పనులు, భవన నిర్మాణాల అనుమతులు, ఇతర సమస్యల పరి ష్కారం కోసం వార్డు సభ్యులు కమిషనర్లు, ఉద్యోగులపట్ల దురుసుగా ప్రవర్తించడ ం, చైర్మన్లకు బదులు కుటుంబ సభ్యులు పెత్తనం చెలా యించడం ఇబ్బందిగా ఉందని ఉద్యోగులు అంటున్నా రు. కొందరు కౌన్సిలర్లు వివాదాల్లో తలదూర్చడం, వాటిని ఉద్యోగులకు ఆపాదించి తాము అనుకున్నట్లు చేయాలని ఒత్తిడి తెస్తున్నారని విమర్శలు ఉన్నాయి. మున్సిపాలిటీల్లో పాలకమండలి, ఉద్యోగుల మధ్య సమన్వయ లోపం మాట వినడం లేదని చైర్మన్ల గగ్గోలు చైర్మన్ల పెత్తనం ఎక్కువైందని ఉద్యోగుల అసహనం ఎమ్మెల్యేల వద్దకు వెళ్లిన వివాదం ఎమ్మెల్యేల వద్దకు వివాదాలు.. మున్సిపాలిటీల్లో చోటుచేసుకున్న సంఘటనలపై కౌన్సిలర్లు, చైర్మన్లు స్థానిక ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నట్లు తెలిసింది. కమిషనర్, ఉద్యోగులు తమను లెక్క చేయడం లేదు.. ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నారు. ఇలా అయితే తమకే కాకుండా పార్టీకి కూడా చెడ్డపేరు వస్తుందని చెప్పినట్లు సమాచారం. పద్ధతి మార్చుకొమని చెప్పండి.. లేకపోతే కొత్తవారిని నియమించమని కోరినట్లు తెలిసింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యేలు మున్సిపల్ కమిషనర్లు, ఉద్యోగులను పిలిపించి మాట్లాడినట్లు తెలిసింది. ప్రజాప్రతినిధులను గౌరవించాలని, మీ పరిధిలో ఉన్న పనులు వెంటనే చేయాలని, పూర్తికాని పనులపై ఒత్తిడి తెస్తే నాకు చెప్పండి అని ఇరువర్గాలకు చెప్పినట్లు సమాచారం. సమన్వయంతో, ప్రవర్తన మార్చుకొని అందరూ కుటుంబంలా ఉండాలని హితవు పలికినట్లు తెలిసింది. -
ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలను నిలిపివేయాలి
● 20న మెడికల్ షాపుల బంద్ నెహ్రూసెంటర్: ఆన్లైన్ ద్వారా జరుగుతున్న మెడిసిన్ విక్రయాలను నిలిపివేయాలని ఈ నెల 20న మెడికల్ షాపుల సమ్మె నిర్వహిస్తున్నట్లు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పేరాల సంపత్‌రావు తెలిపారు. సమ్మె పోస్టర్లను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆన్లైన్ ద్వారా జరుగుతున్న నకిలీ, మోసపూరిత మందుల విక్రయాలను అరికట్టాలని డిమా ండ్ చేశారు. భారీ డిస్కౌంట్ పేరుతో ప్రజలను ఆకర్షిస్తూ కొన్ని ఆన్లైన్ సేవలు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. అర్హత కలిగిన ఫార్మసిస్టులు లేకుండా మందుల విక్రయం జరగడం ఆరోగ్యానికి ప్రమాదకరమన్నారు. సమ్మెలో దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల నిర్వాహకులు పాల్గొంటున్నారని, అత్యవసర సేవలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు అవసరమైన మందులను ముందుగానే కొనుగోలు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సోమ పురుషోత్తం, బెజగం రాజు, రంగారెడ్డి, రామకృష్ణారావు, మురళి, రవి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులపైనే విద్యార్థుల భవిష్యత్
● ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు మహబూబాబాద్: ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపైనే విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉంటుందని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో ఆదివారం విద్యావారోత్సవాల్లో భాగంగా పది తరగతి, ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి డీఈఓ సత్యనారాయణమూర్తి అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ రవీందర్రావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యతోనే ఉన్నతస్థాయికి ఎదుగుతామని, సమాజంలో గౌరవం ఉంటుందన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాలన్నారు. అంకితభావంతో పని చేసి విద్యాభివృద్ధికి పాటుపడాలన్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ.. విద్యాభివృద్ధికి ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ గుగులోత్ జ్యోతి, కౌన్సిలర్ నీరుటి హైమా, డీఐఈఓ మదార్ పాల్గొన్నారు. -
బదిలీల భయం!
● ఎంజీఎంలో పాతుకుపోయిన ఉద్యోగులు ● స్థానచలనం తప్పదా? ● ఉన్నతాధికారి పోస్టుకు డిమాండ్ కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఉన్నతాధికారి నుంచి జూనియర్ అసిస్టెంట్ వరకు బది లీల ఫీవర్ పట్టుకుంది. ప్రభుత్వం బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జాయినింగ్ పీరియడ్ లెక్కలు వేసుకుంటూ సర్వీస్ బుక్‌లతో కుస్తీ పడుతున్నారు. డీఎంఈ కార్యాలయంలో పలుకుబడి ఉపయోగించుకుంటూ బదీలీల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొంతమంది యూనియన్ పేరు చెప్పుకుంటూ ఆఫీస్ బేరర్లుగా బదిలీల నుంచి మినహాయింపు, కోరుకున్న చోటకు వెళ్లేందుకు ఎవరికి వారే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 40 శాతం ఉద్యోగులకు బదిలీలకు అవకాశం ఉండడంతో నాలుగేళ్ల సర్వీస్ దాటిన వారందరికీ బదిలీల గండం ఏర్పడింది. ఇక్కడే తిష్ట.. ఎంజీఎంలో కొంతమంది ఉద్యోగులు బదిలీల నుంచి తప్పించుకుంటున్నారు. ప్రమోషన్లు సైతం వదులకుని ఇక్కడే తిష్ట వేస్తున్నట్లు తెలుస్తోంది. జూని యర్ అసిస్టెంట్ క్యాడర్లో ఉన్న ఉద్యోగులు అకౌంట్ టెస్ట్ పాస్ కాకపోవడం వల్ల ఎంజీఎంలోనే విధులు నిర్వహిస్తున్నారు. ఓ ఉద్యోగి అయితే జాయినింగ్ నుంచి ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు. దా దాపు మూడు దశాబ్దాల నుంచి పని చేస్తున్నా మళ్లీ బదిలీ నుంచి మినహాయింపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా, మినిస్టీరియల్ విభాగం నుంచి ఐదుగురు ఉద్యోగులు బది లీలు సిద్ధంగా ఉన్నారు. ఇక పెద్దాస్పత్రి పెద్ద పోస్ట్ అయిన సూపరింటెండెంట్ పోస్ట్ కోసం ఎంజీఎంలో పనిచేసిన ఉన్నతాధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్‌లో ఎంజీఎం ఆస్పత్రిని 24 అంతస్తుల భవనంలోకి మార్చే అవకాశం ఉండడంతో పెద్ద పోస్టు కోసం భారీగా పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. రావాలన్నా.. పోవాలన్నా భయమే! ఎంజీఎంలో పనిచేస్తున్నవారు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు జంకుతుండగా, ఇతర జిల్లాల్లోని అధికా రుల్లో కొందరు ఎంజీఎం అంటే వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆస్పత్రిలో గతంలో జరిగిన అవకతవకలపై తరచూ పత్రికల్లో రావడంతో వామ్మో, ఎంజీఎం మాకొద్దు అంటూ ఇక్కడ ఉ ద్యోగం చేయడానికి జంకుతున్నట్లు తెలుస్తోంది. ప్ర స్తుతం ఎంజీఎంలో సూపరింటెండెంట్‌గా పని చే స్తున్న డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి మంచిర్యాలలో సూపరింటెండెంట్ పోస్టులో ఉండగా, ఎంజీఎంలో ఇన్చార్జ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నా రు. డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి బదిలీపై ఇతర ఆస్పత్రికి వెళ్లి, తిరిగి ఎంజీఎంలో ఇన్చార్జ్గా కొనసాగడానికి ప్రత్యేక ఆర్డర్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే.. ఈ పోస్టు కోసం ఎంజీఎంలోనే సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించిన చంద్రశేఖర్, గోపాల్‌రావు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న డాక్టర్ సంధ్య కేఎంసీతో పాటు కాళోజీ యూనివర్సిటీలో కూడా పనిచేశారు. అయి తే ఆమె బదిలీ కావడానికి అవకాశం ఉన్నప్పటికీ తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ నుంచి ఆఫీస్ బేరర్ లెటర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈపోస్టు కోసం మహబూబాబాద్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్ శ్రీనివాస్ కూడా తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. -
వీరన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు
కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు క్యూలో బారులుదీరారు. మొక్కులు చెల్లించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. సర్కారు నిర్లక్ష్యంతో ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతొర్రూరు: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లె కుమార్, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకుడు కొలుపుల శంకర్ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం డివిజన్ కేంద్రంలోని ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలను బీజేపీ నాయకులు సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి రోజుల తరబడి ఎదురుచూస్తున్నారని, కాంటాలు ఆలస్యం చేయడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. లారీలు, గన్నీ సంచుల కొరత తీర్చి కొనుగోళ్ల వేగం పెంచాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ అర్బన్ అధ్యక్షుడు పైండ్ల రాజేష్, నాయకులు నడిగడ్డ సందీప్, అలిసేరి రవిబాబు, మంగళపల్లి యాకయ్య, గంధం రాజు, సాయి ముఖేష్, విజయ్‌కుమార్, భరత్, నవీన్ పాల్గొన్నారు. వీఆర్ఏ వారసుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా యాకయ్య పెద్దవంగర: వీఆర్ఏ వారసుల సంఘం జిల్లా నూతన కమిటీ అధ్యక్షుడిగా మండలానికి చెందిన నీరటి యాకయ్య ఏకగ్రీవంగా ఎన్ని కయ్యారు. మండలంలోని కొరిపల్లి గ్రామానికి చెందిన ఆయన 10 ఏళ్లుగా వీఆర్ఏగా విధులు నిర్వర్తిస్తున్నాడు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వివిధ మండలాల వీఆర్ఏల సమక్షంలో ఈ ఎన్నిక చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న వీఆర్ఏ వారసుల ఉద్యోగాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. ఉద్యోగాలు వచ్చే వరకు వీఆర్ఏ వారసుల తరఫున నిరంతరం పోరాటం కొనసాగిస్తానని తెలిపారు. గోదావరిలో ప్రముఖులకు దారి కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. వీవీఐపీల కోసం సరస్వతీఘాటు తీరం నుంచి త్రివేణి సంగమంలోని నీటి వరకు వెళ్లడానికి బారికేడ్లు ఏర్పాటు చేసి మధ్యలో మట్టిరోడ్డు వేశారు. దానిపైన మ్యాట్లు రానున్నాయి. అక్కడే కంటెయినర్లు ఏర్పాటు చేస్తున్నారు. బయో టాయిలెట్లు, జల్లు స్నానాలకు ఏర్పాటు చేస్తున్నారు. కుడి, ఎడమ వైపున సాధారణ భక్తులు స్నానాలకు వెళ్లేందుకు షమియానాలు, మ్యాట్లు వేయనున్నారు. తీరం నుంచి రెండు ద్వారాల ద్వారా భక్తులు తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు చేపట్టారు. 15 చెక్‌పోస్టుల ఏర్పాటు సరస్వతీనది అంత్యపుష్కరాలకు పలు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తారనే అధికారుల అంచనాతో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు వివిధ మార్గాల వద్ద 15 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. 21 నుంచి వన్‌వే అమలులోకి రావడంతో చెక్‌పోస్టుల వద్ద ట్రాఫిక్ ఆంక్షలు ప్రారంభం కానున్నాయి. శివ కల్యాణ మండపంలో హోమాలు ఈనెల 21నుంచి జూన్ 1వ తేదీ వరకు పన్నెండు రోజుల పాటు హోమాలు నిర్వహించడానికి దేవాదాయశాఖ శివ కల్యాణ మండపంలో ఏర్పాట్లు చేస్తుంది. హోమాల కోసం భారీ మంచుకొండల మాదిరిగా డెకరేషన్ సెట్టింగులు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా అచలాపురానికి చెందిన వేదపండితులు హోమాది పూజలు నిర్వహించనున్నారు. చివరి మూడు రోజులు రుద్రయాగం నిర్వహించడానికి శృంగేరి పీఠం నుంచి వేదపండితుల ఆధ్వర్యంలో నిర్వహిస్తారని ఆలయ వర్గాలు తెలిపాయి. -
పసిగట్టి.. పట్టించి
వాసన ద్వారా గంజాయి, డ్రగ్స్‌ను పట్టిస్తున్న జాగిలాలు‘కొద్దిరోజుల క్రితం కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో గంజాయి రవాణా అవుతుందనే సమాచారం మానుకోట పోలీసులకు అందింది. అప్రమత్తమైన పోలీసులు శిక్షణ ఇచ్చిన జాగిలాన్ని తీసుకొని ఖమ్మం రైల్వేస్టేషన్లో ఆ రైలు ఎక్కి తనిఖీ చేసుకుంటూ వచ్చారు. ఒక డబ్బాలో ఉన్న సీటుపై పెట్టిన బ్యాగును పసిగట్టిన జాగిలం ట్రైనర్‌కు సంకేతాలు ఇచ్చింది. దీంతో తనిఖీ బృందం బ్యాగు ను విప్పి చూడగా.. అందులో 10కిలోల గంజాయి ప్యాకెట్ బయట పడింది.’సాక్షి, మహబూబాబాద్: గతంలో పోలీసు జాగిలా లను దొంగలు, హత్యచేసిన వారిని గుర్తించడం కోసం వినియోగించేవారు. మారిన కాలం, సాంకేతికత ఆధారంగా ఇప్పుడు జాగిలాల ద్వారా ఎక్స్‌ప్లోజివ్(పేలుడు పదార్థాలు)లను గుర్తించి నిర్వీర్యం చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్, నార్కోటిక్స్ రవాణా, వినియోగం గుట్టు రట్టు చేసేందుకు జాగిలాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి జిల్లాలకు పంపించారు. అనుమానం వచ్చిన చోటుకు జాగిలాన్ని తీసుకెళ్తే వాసన పసిగట్టి.. గుట్టు రట్టు చేయడం సులభతరం అవుతోంది. జిల్లాకు ఆరు జాగిలాలు.. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు, అక్రమ రవాణా, మత్తు పదార్థాలు, మందు పాతరలు, బాంబుల బెదిరింపులు మొదలైన సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు వాటిని ఛేదించేలా జాగి లాలను సిద్ధం చేశారు. ఇందుకోసం జిల్లాకు ఆరు జాగిలాలు, వాటి ట్రైనర్స్ సిద్ధంగా ఉన్నారు. ఇందులో ఒక జాగిలం నేరస్తుల వస్తువులు, వస్త్రాలు, రక్తపు మరకలు, ఇతర ఆనవాళ్ల వాసన చూసి నేరస్తుల కదలికలను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. నాలుగు జాగిలాలకు మందు పాతరలు, పేలుడు పదార్థాలు, బాంబులను పసిగట్టేందుకు శిక్షణ ఇచ్చారు. మిగిలిన ఒక జాగిలానికి నార్కోటిక్స్ శిక్షణ ఇచ్చారు. ఇది గంజాయి, కొకై న్, ఇతర డ్రగ్స్‌ను గుర్తించడానికి దోహదపడుతోంది. ఇతరులకు ఇబ్బంది లేకుండా.. పోలీసుల తనిఖీలు చేయాల్సి వచ్చినప్పుడు.. ఎవరు మంచివారో..ఎవరు నేరస్తులో ముందే తెలియదు. దీంతో అందరిని తనిఖీలు చేస్తే మంచి వారు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అలాగని తనిఖీ చేయకుంటే.. వాళ్లే నేరస్తులు అయ్యే అవకాశం ఉండొచ్చు. ఇటువంటి పరిస్థితిలో జాగిలాన్ని రంగంలోకి దింపి నేరస్తులను పట్టుకుంటున్నారు జిల్లా పోలీసులు. ప్రధానంగా జిల్లాలో గంజాయి సాగు, రవాణా, వినియోగం ఎక్కువగా ఉందనే నివేదికలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో వాటిపై ఉక్కుపాదం మోపేందుకు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, అనుమానిత ప్రాంతాలు, కొరియర్ సెంటర్లు, కిళ్లీ కొట్లు మొదలైన ప్రాంతాలకు జాగిలాన్ని పంపించి తనిఖీలు చేయడం.. వాసన పసిగట్టిన జాగిలం అక్రమ రవాణా గుట్టు రట్టు చేయడం సులభం అవుతోంది. అదే విధంగా వినియోగించిన వారిని కూడా పసిగట్టడం.. యువత గంజాయిని వినియోగించే ప్రాంతాలను గుర్తించేందుకు జాగిలాలు ఉపయోగపడుతున్నాయి. గంజాయి నిర్మూలనలో భాగమే.. మానుకోటను మత్తు పదార్థాలు వినియోగం లేని జిల్లాగా మార్చాలన్నదే పోలీసుల లక్ష్యం. ఇందుకోసం ఇప్పటికే ప్రజలను చైతన్య పరుస్తున్నాం. అయినా పూర్తి స్థాయిలో గంజాయి నిర్మూలన కావడం లేదు. జిల్లాలో శిక్షణ పొందిన జాగిలాలతో మత్తు పదార్థాల రవాణా గుట్టు రట్టు చేసే పనిలో ఉన్నారు. ఏ మూలన దాచిపెట్టినా పసిగట్టి పట్టిస్తుంది. ప్రజలు సమాచారం ఇస్తే చాలు.. అంతా మేం చూసుకుంటాం. – శబరీష్, ఎస్పీ మత్తుపదార్థాల అక్రమ రవాణా అడ్డుకట్టకు ప్రత్యేక శిక్షణ జనసంచార ప్రాంతాలు, చెక్‌పోస్టులు, రైల్వేస్టేషన్ల వద్ద తనిఖీలు ఇతరులకు ఇబ్బందులు లేకుండా ఛేదన -
కేయూలో రాష్ట్రస్థాయి హ్యాకథాన్
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి.. రూసానోడల్ అధికారి ఆర్. మల్లికార్జున్‌రెడ్డితో కలిసి శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఐటీ శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేయూలోని కెహబ్, హైదరాబాద్‌లోని టిహబ్‌తో కుదిరిన అవగాహన ఒప్పందం (ఎంఓయూ) గురించి మంత్రికి వివరించారు. అలాగే, ఈఏడాది జూలైలో కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి హ్యాకథాన్ నిర్వహణ కార్యాచరణను వివరించి ఆహ్వానించారు. ఇందుకు మంత్రి అంగీకారం తెలిపారు. తెలంగాణ యువతలో ఆవిష్కరణ, ఇంక్యూబేషన్, స్టార్టప్ సంస్కృతి, పారిశ్రామిక నైపుణ్యాల అభివృద్ధికి కాకతీయ యూనివర్సిటీ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని మంత్రి తెలిపారని వీసీ పేర్కొన్నారు. హైదరాబాద్ తర్వాత రెండో స్థాయి నగరాల్లో స్టార్టప్ కార్యాకలాపాలకు వరంగల్ కేంద్రంగా ఎదగాలని, కెహబ్ తెలంగాణ ఆవిష్కరణలకు ప్రముఖ కేంద్రంగా రూపుదిద్దుకోవాలని మంత్రి ఆకాంక్షించారని వీసీ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. మంత్రి శ్రీధర్‌బాబును ఆహ్వానించిన వీసీ కె. ప్రతాప్‌రెడ్డి -
డెంగీ నిర్మూలనకు అవగాహన కల్పించాలి
● డీఎంహెచ్ఓ రవిరాథోడ్ నెహ్రూసెంటర్: క్షేత్రస్థాయిలో డెంగీ వ్యాధి నిర్మూలనకు వైద్య సిబ్బంది విస్తృతంగా అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ రవి రాథోడ్ సూచించారు. జాతీయ డెంగీ నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. డెంగీ ప్రజారోగ్యానికి పెను సమస్యగా మారిందని, ప్రజలు, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా కృషి చేస్తేనే నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. డెంగీకి ఇప్పటివరకు కచ్చితమైన ఔషధం, టీకా అందుబాటులో లేవని, రక్షణ చర్యలు పాటిస్తేనే మేలు అన్నారు. డెంగీ సోకిన వారిని కుట్టిన దోమలు ఇతరులను కుట్టినప్పుడు వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. డెంగీ బారిన పడినవారు తప్పనిసరిగా దోమ తెరల్లోనే నిద్రించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ సుధీర్ రెడ్డి, జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, డీపీఎంఓ వాల్య, సబ్ యూనిట్ ఆఫీసర్ గోపిచంద్, ఎంపీహెచ్ఈఓ తోట శ్రీనివాస్, హెల్త్ సూపర్వైజర్ ఫహీముద్దీన్, కౌన్సిలర్ రమేష్ పాల్గొన్నారు. -
విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
● డీఈఓ సత్యనారాయణమూర్తి తొర్రూరు: విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకోవాలని డీఈఓ సత్యనారాయణమూర్తి అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా శనివారం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ‘ఆర్ట్, క్రాఫ్ట్–కల్చరల్ డే’ కార్యక్రమం నిర్వహించారు. హెచ్ఎం జెల్ల లక్ష్మీనారాయణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో డీఈఓ మాట్లాడుతూ.. నైపుణ్యాలు పెంపొందించుకోవడం ద్వారా అవకాశాలు లభిస్తాయన్నారు. విద్యతో పాటు ఇతర అంశాలపై పట్టు సాధించాలన్నారు. సంస్కృతి, కళలపై ఆసక్తి అవసరమన్నారు. నాణ్యమైన బోధన, మెరుగైన మౌలిక సదుపాయాలు, డిజిటల్ లెర్నింగ్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం బలోపేతం చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఏసీజీఈ శ్రీరాములు, ఏఎస్సీ సంతోష్, ఎంఈఓ బుచ్చయ్య, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మిరియాల సతీష్‌రెడ్డి, హెచ్ఎంలు వెంకటేశ్వర్లు, శ్రీనుబాబు, వీరన్న తదితరులు పాల్గొన్నారు. -
విద్య, వైద్యరంగాల్లోనూ ఏఐ కీలకపాత్ర
కేయూ క్యాంపస్: విద్య, వైద్యరంగాల్లోనూ కృత్రిమ మేధస్సు(ఏఐ) కీలక పాత్ర పోషిస్తుందని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వి. రామచంద్రం అన్నారు. శనివారం కాకతీయ యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో సెనెట్హాల్లో రీజనల్ స్థాయి ఏఐ కాన్క్లేవ్ –2026 పై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కృత్రిమ మేధస్సు విద్య, వైద్యం, వ్యవసాయం, పాలన, తదితర రంగాల్లో విప్లవాత్మ మార్పులు తీసుకొస్తుందన్నారు. ముఖ్యంగా వ్యాధుల నివారణలో సీఎన్ఎన్, ఆర్ఎన్ఎన్ , ఎల్ఎస్టీఎం వంటి డిప్ లెర్నింగ్ విధానాలు కీలకంగా మారాయని తెలిపారు. ఏఐ వినియోగంలో నైతికత, పారదర్శకత, సామాజిక బాధ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఆ కంప్యూటర్ సైన్స్ విభాగం అధిపతి , కేయూ పాలకమండలి సభ్యురాలు బి. రమ మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు భవిష్యత్‌లో విస్తృత ఉద్యోగావకాశాలను సృష్టించనున్నదన్నారు. విద్యార్థులు , అధ్యాపకులు ఏఐకి సంబంధించిన నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐ శక్తివంతమైన సాధనం.. ఈ సదస్సులో ప్రధానవక్తగా వరంగల్ నిట్ ఆచార్యుడు రామలింగస్వామి మాట్లాడుతూ ప్రగతిశీల తెలంగాణ కోసం విద్య, ఆవిష్కరణలు, పరిశోధన అభివృద్ధి చెందుతున్న సాంకేతక రంగాలను భవిష్యత్‌లో మలచడంలో కృత్రిమ మేధస్సు శక్తివంతమైన సాధనమన్నారు. కృత్రిమ మేధస్సు అధ్యాపకులకు ప్రత్యామ్నాయం కాదన్నారు. బోధనను మరింత శక్తివంతంగా చేసే సాధనని అభిప్రాయపడ్డారు. సదస్సులో కేయూ ఓఎస్డీ బి. వెంకట్రామ్రెడ్డి, కేయూ ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాళ్లు ఎన్. రమణ, కె. భిక్షాలు మాట్లాడారు. కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం -
శరీరదాన అంగీకారం అభినందనీయం
కాశిబుగ్గ: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 36 మంది తమ కుటుంబ సభ్యుల సహకారంతో శరీరదానం చేస్తామని అంగీకారం తెలుపుతూ హామీ పత్రాలు అందజేశారు. శనివారం తెలంగాణ నేత్ర అవయవ శరీరదాతల అసోసియేషన్ ద్వారా కేఎంసీ ప్రిన్సిపాల్ సంధ్య, అనాటమీ హెచ్ఓడీ శశికాంతకు ఆ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సంధ్య మాట్లాడుతూ కుటుంబ సభ్యుల సమక్షంలో తమ మరణాంతరం శరీరదానం చేస్తామని అంగీకార పత్రాలు ఇవ్వడం అభినందనీయమన్నారు. శరీరదాతల ఆలోచన విధానం ఇతరులకు స్ఫూర్తిగా ఉంటుందన్నారు. శరీర దానం చేయడానికి ముందుకు వచ్చేవారు 8790548706, 9490133650 నంబర్లను సంప్రందించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షురాలు పద్మ, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కె.మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు పి.వేణు, అనాటమీ సిబ్బంది ప్రేమ్‌కుమార్, యాదగిరి పాల్గొన్నారు. కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య -
పెట్రో ధరలు తగ్గించాలి
మహబూబాబాద్: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని సీపీఐ జిల్లా కార్యదర్శ బి.విజయసారథి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో శనివారం సీపీఐ ఆధ్వర్యంలో దిచక్రవాహనాలకు తాళ్లు కట్టి లాగడంతో పాటు రిక్షాలపై గ్యాస్ సిలిండర్లు పెట్టి వినూత్నంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా విజయసారథి మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెంచి పేదలపై తీవ్రభారం మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన చట్టాలు చేస్తూ దేఽశ ప్రజలపై సవతితల్లి ప్రేమ చూపిస్తుందని ఆరోపించారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో రైతులు, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరలు తగ్గించకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయ్‌సారథి రెడ్డి, నాయకులు రేషపల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, పాండురంగాచారి, సాంబలక్ష్మి, ఉప్పలయ్య, శ్రావణ్, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. -
చేతిపంపులకు మరమ్మతు
డోర్నకల్: మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో శనివారం చేతిపంపులకు సిబ్బంది మరమ్మతు పనులు చేపట్టారు. ఇటీవల నిర్వహించిన ‘సాక్షి ఫోన్ ఇన్ ’కార్యక్రమంలో భాగంగా చెడిపోయిన చేతిపంపులకు మరమ్మతు చేయించాలని మున్సిపల్ చైర్పర్సన్ రాజకుమారికి స్థానికులు మొర పెట్టుకున్నారు. దీనిపై స్పందించిన ఆమె చేతి పంపులకు వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. బ్రాహ్మణకుంట, శాంతినగర్, పాతడోర్నకల్, బాపూజీనగర్ తదితర ప్రాంతాల్లోని చేతిపంపులకు మరమ్మతులు చేయడంతో పాటు బోర్లలో ఫ్లషింగ్ పనులు నిర్వహించారు.19న ఎకై ్సజ్ వాహనాల వేలంమహబూబాబాద్ రూరల్: గుడుంబా, బెల్లం సరఫరా చేస్తూ వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు ఈనెల 19న ఉదయం 11గంటలకు మహబూబాబాద్ ఎకై ్సజ్ స్టేషన్ ఆవరణలో బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నామని ఎకై ్సజ్ సీఐ చిరంజీవి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎకై ్సజ్ శాఖ వరంగల్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు, జిల్లా అధికారి కిరణ్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న వాహనాల వేలంపాటలో పాల్గొనే వారు పూర్తి వివరాల కోసం మహబూబాబాద్ ఎకై ్సజ్ స్టేషన్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. వాహన ధరలో 50 శాతం డిపాజిట్ చేయాల్సి ఉంటుందని, వేలంపాటలో ఏర్పాటు చేసిన వాహనాల వివరాలు మహబూబాబాద్ స్టేషన్ ఆవరణలో నోటీసు బోర్డుపై ఉన్నాయని తెలిపారు. అత్యవసర సేవలందించడమే లక్ష్యంగూడూరు: ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన 108, 102 వాహనాలు ప్రజలకు అత్యవసర సేవలు అందిస్తున్నాయని ప్రోగ్రాం మేనేజర్ నజీరుద్దీన్, జిల్లా మేనేజర్ బత్తిని మహేష్‌గౌడ్ అన్నారు. మండల కేంద్రంలో శనివారం 108, 102 వాహనాలను వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంబులెన్స్‌లో ఉన్న పలు రికార్డులను, వారు అందించిన ఉచిత సేవ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఏ సమయంలోనైనా ప్రజల నుంచి ఫోన్ రాగానే సేవలందించడానికి సిద్ధంగా వెళ్లాలని సూచించారు. ఎలాంటి నిర్లక్ష్యం చేసినా సహించేది లేదన్నారు. కార్యక్రమంలో ఈఎంటీలు హన్మంతు, సుప్రియ, పైలెట్లు అనిల్, ప్రశాంత్, షేక్ మహబూబ్‌పాషా పాల్గొన్నారు. నీట్ పేపర్ లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలిమహబూబబాబాద్ అర్బన్: నీట్ పేపర్ లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఏస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వెలుగు శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో ఏఐఏస్ఎఫ్ జిల్లా నాయకులు నీట్ విడుదల చేసిన ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వెలుగు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. 2026–నీట్ పేపర్ లీకేజీ అంత్యత దారుణమని, 23 లక్షలకు పైగా విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటమాడిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలన్నారు. పరీక్షలను సరిగా నిర్వహించలేని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి మేక వెంకటేష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు సీలువేరు వికాస్, వరుణ్‌కుమార్, కల్యాణ్, నవీన్, హర్షవర్ధన్‌రెడ్డి, సాయి, విశాల్, హాసన్, దీపిక, కీర్తి, దివ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆక్సిజన్ అందకే చేపలు మృత్యువాత
● నీటి కాలుష్యం తోడై రూ.30 లక్షల నష్టం కాశిబుగ్గ: వరంగల్ దేశాయిపేటలోని చిన్న వడ్డేపల్లి చెరువులో ఆక్సిజన్ అందకే ఇటీవల రూ.30 లక్షల విలువైన చేపలు మృత్యువాత పడినట్లు అధికారులు చెబుతున్నారు. వేసవి తీవ్రత, నీటిశాతం తక్కువ కావడం, దీనికి తోడు చెరువులోని నీరు కలుషితం కావడంతోనే చేపలు చనిపోయినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. మత్స్యకారులు వేసవిని దృష్టిలో ఉంచుకుని ముందుగానే చేపలు పట్టుకుంటే నష్టం జరిగేది కాదని జిల్లా మత్యశాఖ అధికారి శ్రీపతి తెలిపారు. చెరువు పరిధిలో దేశాయిపేట, కాశిబుగ్గ, మట్టెవాడ పరిధిలో 200 మంది మత్స్యకారులు ఉన్నట్లు పేర్కొన్నారు. మండలంలో 711 చెరువులు ఉన్నాయని, చిన్న వడ్డేపల్లి చెరువులో పరిధిలో కూడా ఆరు ఉన్నాయని వివరించారు. ఈ చెరువుల్లోని చేపలకు ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు. అయినా చిన్నవడ్డేపల్లి చెరువులోని నీటి పరిస్థితి తెలుసుకోవడానికి వరంగల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎన్విరాన్మెంట్ శాస్త్రవేత్త శనివారం మూడు చోట్ల శ్యాంపిల్స్ సేకరించి తీసుకెళ్లారని చెప్పారు. దీని నివేదిక ఆధారంగా వాస్తవాలు తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు. -
సాంస్కృతిక సంబురాలు..
హన్మకొండ చౌరస్తా : ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం హనుమకొండ ప్రభుత్వ పాఠశాల ఆవరణలోని జిల్లా బాలభవన్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బాలభవన్ సూపరింటెండెంట్ డి. ఝాన్సీ , మృదంగం ఇన్‌స్ట్రక్టర్ల నేతృత్వంలో పిల్లలకు కళలు, చేతపనులు, సాంస్కృతిక అంశాల్లో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలు గీసిన చిత్రలేఖనం, గణపతి ప్రార్థన, కోలాటం, బృంద నృత్యం, మృదంగ వాయిద్య ప్రదర్శన ఆకట్టుకుంది. జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక విద్యా వారోత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్లు ఝాన్సీ తెలిపారు. -
మహాభారతం, రామాయణం వింటున్న..
నా పేరు కూర హర్షిత్. నేను వేసవి సెలవుల్లో హైదరాబాద్ నుంచి జనగామలోని మా అమ్మమ్మ, తాతయ్య తాటిపల్లి సుజాత, ఉమాపతి ఇంటికి వచ్చా. సెలవుల్లో రోజూ తాతయ్యతో కలిసి ఈత నేర్చుకోవడానికి స్విమ్మింగ్ ఫూల్ వెళ్తున్నా. ఇంటి వద్ద అమ్మమ్మ మహాభారతం, రామాయణ ఇతిహాసాల ముఖ్య అంశాలు, చిన్న కథలు చెబుతూ నాతో మళ్లీ చెప్పిస్తున్నారు. తీరిక సమయంలో డ్రాయింగ్ వేస్తున్నా. తాతయ్యతో కలిసి ఆటలాడుతూ కాలక్షేపం చేస్తున్నా. ఈ వేసవిలో మన సంప్రదాయాలను ఎన్నో నేర్చుకుంటున్నా. –జనగామ -
పొదుపు.. భవిష్యత్ మదుపు!
ఖిలా వరంగల్: అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా దేశంలో విదేశీ మాదకద్రవ్య వినియోగం తగ్గించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దిగుమతి చేసుకున్న బంగారం, ఎరువులు, ఇంధనం, వంట నూనె, ఇతర సరుకుల వాడకం విషయంలో పొదుపు పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ వీటి వినియోగం ఎక్కువగా పెరిగింది. ఇదేపరిస్థితి కొనసాగితే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పేలా లేవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రధాని సూచనను మన ఇంటినుంచే ఆచరిద్దాం. దీనివల్ల వ్యక్తిగత ప్రయోజనంతో పాటు దేశానికి మేలు జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో ప్రధాన ఖర్చులు.. ఆదాపై ఈ ఆదివారం ‘సాక్షి’ సండే స్పెషల్.. నూనె వాడకమూ ఎక్కువే.. ఇళ్లలో వంటలకు వాడే నూనెకు భారీగా వెచ్చిస్తున్నారు. నలుగురు కుటుంబ సభ్యులున్న ఇంటిలో నెలకు నగటున ఐదు లీటర్లు వాడుతున్నారు. నెల రోజులకు ఇప్పటికీ చూస్తే ఒక్కో ప్యాకెట్‌కు రూ.25కు పైగా ధరలు పెరిగాయి. అతిగా వంట నూనె వాడితే శరీరానికి విటమిన్లు, మంచి కొవ్వు, కేలరీలు అందవు. హార్మోన్ల అసమతుల్యతతో ఎక్కువ మంది ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధుల బారినపడుతున్నా వినియోగం తగ్గించడం లేదు. ఉమ్మడి జిల్లాలో సుమారు 38.20 లక్షల కుటుంబాలు ఉండగా నెలకు 1.90 కోట్ల లీటర్ల నూనె వాడుతున్నట్లు అంచనా. ప్రధాని పిలుపు మేరకు అందులో 10 శాతం తగ్గించినా 19 లక్షల లీటర్లు ఆదా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. బంగారం చూసుకుని కొందాం.. వివాహాలు, ఇతర శుభకార్యాలకు స్వర్ణాభరణాలు కొనడం అలవాటుగా మారింది. ఈ విషయంలో నియంత్రణ పాటిస్తే కచ్చితంగా ప్రయోజనం కలుగుతుంది. ప్రధానంగా వరంగల్ నగరంలో 210కుపైగా షాపులు, మిగిలిన జిల్లాల్లో మరో 200 షాపులు ఉన్నాయి. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా సగటున రోజుకు 6 కిలోల బంగారు నగల అమ్మకాలు సాగుతున్నట్లు వ్యాపారుల అంచనా. ఈ విషయంలో కొంత పొదుపు పాటించాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ధరలు పెరగడంతో 80 శాతం కొనుగోళ్లు తగ్గిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇంధనం ఆదా చేద్దామా.. పశ్చిమాసియా పరిణామాలు ఇంధన వినియోగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు తమ కాన్వాయిలో వాహనాలను తగ్గించుకునేలా తీసుకున్న నిర్ణయం స్ఫూర్తిగా నిలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో 7,82,314 వాహనాలు ఉన్నాయి. దీంతో సగటున నెలకు 19 లక్షల లీటర్ల పెట్రోల్, 7 లక్షల లీటర్ల డీజిల్ వినియోగమవుతోంది. ఒక ద్విచక్రవాహనం ఇంధనం కోసం సగటున నెలకు రూ.మూడు వేలు వెచ్చించాల్సి వస్తోంది. ఇది ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబం.. నెలవారీ నిత్యావసర సరుకుల కొనుగోలుకు సమానంగా ఉంటుంది. ఖరీదైన వాహనాలను విని యోగిస్తే ఇంధన వ్యయం ఎక్కువ. బైక్‌లపై వెళ్లడం కంటే కాలినడకన, సైకిళ్ల మీద వెళ్తే కొంత ఇంధనాన్ని ఆదా చేసినట్లే. ఎరువుల మోతాదు మించొద్దు.. పంటలకు మోతాదుకు మించి ఎరువులు వాడుతున్నారు. అధికారుల సిఫార్సు మేరకు ఎకరాకు మూడు దశల్లో 75 కిలోల యూరియా వినియోగించాల్సి ఉండగా.. జిల్లాలో 225 కిలోల కంటే ఎక్కువ ఉపయోగిస్తున్నట్లు వ్యవసాయ అధికారులే చెబుతున్నారు. దీంతో నేలసారం తగ్గడమే కాకుండా చీడ పీడలు వ్యాపించి సాగు వ్యయం గణనీయంగా పెరుగుతుంది. ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు సాగువుతుండగా.. నిబంధనల ప్రకారం 41 వేల మెట్రిక్ టన్నుల యూరియా వేయాలి. ఈ ప్రకారం రసాయన ఎరువులు వేస్తే విదేశీమారక ద్రవ్యం వినియోగం తగ్గడంతో పాటు సాగుపరంగా ఎదురయ్యే ఇబ్బందులూ తీరుతాయి. ప్రధాని మోదీ సూచనను మన ఇంటి నుంచే ఆచరిద్దాం..విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడానికి పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలి. ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వాలి. – ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపు వంట నూనెల వాడకం తగ్గిస్తే.. ఇంటి ఖర్చులో అధిక ఆదా అవసరమైతేనే బైక్, కారు.. కాలినడక ఆరోగ్యానికి మంచిది దిగుమతి వస్తువుల వినియోగాన్ని తగ్గిస్తే మేలు -
బైక్‌ను ఢీకొన్న ట్రాక్టర్..
మరిపెడ రూరల్ : బైక్‌ను ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ కార్పెంటర్ మృతి చెందాడు. ఈ ఘటన మహబూ బాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచర్లలో సూర్యాపేట–మహబూబాబాద్ 365 జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం కొప్పొల్ గ్రామానికి చెందిన పర్వతం నరేశ్ (36) మరిపెడలో కార్పెంటర్ షాపు నిర్వహిస్తున్నాడు.శనివారం సాయంత్రం పని ముగించుకుని బైక్‌పై స్వగ్రామం వెళ్తున్నాడు. ఈ క్రమంలో తానంచర్ల గ్రామంలోని గంగభవాని ఆలయ రహదారి నుంచి మొక్కజొన్న లోడ్‌తో హైవే మీదికి వచ్చిన ట్రాక్టర్.. బైక్‌ను ఎదురుగా ఢీకొంది. దీంతో ద్విచక్రవాహనంతోపాటు నరేశ్ ట్రాక్టర్ ట్రాలీ కింద ఇరుక్కుకోవడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గండ్రాతి సతీశ్ తెలిపారు. నర్మెట(తరిగొప్పుల) : రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం జనగామ జిల్లా తరిగొప్పుల మండలం సోలీపురంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అల్ద రాంచరణ్ (16) తల్లి తారమ్మ, అక్క సాత్విక, మేనకోడలు ప్రియాన్షి, అల్లుడు రిషిని తీసుకుని బైక్‌పై అమ్మమ్మగారిల్లు కూటిగల్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం కూటిగల్‌కు చెందిన సిరిగిరి రాహుల్ మిత్రుడితో కలిసి బైక్‌పై ఎదురుగా వచ్చి సోలీపురం కట్టమైసమ్మ గుడి సమీపంలో రాంచరణ్ వాహనాన్ని ఢీకొన్నాడు. దీంతో రాంచరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. తారమ్మ, సాత్విక, ప్రియాన్షి, రిషి, రాహుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుడి పెద్దనాన్న కుమారుడు హరీశ్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై గుగులోత్ శ్రీదేవి తెలిపారు.● కార్పెంటర్ మృతి..తానంచర్లలో ఘటన ● మృతుడు సూర్యాపేట జిల్లా వాసి -
ఉద్యాన పంటల సాగు లాభదాయకం
నెల్లికుదురు: ఆయిల్ పామ్, ఉద్యాన పంటల సాగు లాభదాయకమని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి జినుగు మరియన్న సూచించారు. శనివారం మండల కేంద్రానికి చెందిన మహిళా రైతు పి.సరస్వతి మల్బరీ పంట క్షేత్రపర్యటన చేశారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు, ప్రభుత్వం సబ్సిడీ అందించే పంటలు ఆయిల్ పామ్, ఉద్యాన, కూరగాయలు, పండ్లు, పూలు, మల్బరీ, పుట్టగొడుగులు, తేనెటీగల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించామని, ఎరువులు, పురుగు మందులు అవసరం లేని మల్బరీ సాగుతో ఎకరానికి రూ.2లక్షల వరకు ఆదాయం వస్తుందని తెలిపారు. క సెరీకల్చర్ అధికారి రాజయ్య, రైతు జనార్దన్ పాల్గొన్నారు. -
వారికి ఎదురుచూపులే..!
హన్మకొండ: తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్‌లోకి వెళ్లేందుకు ఆప్షన్లు ఇచ్చిన వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. ఈ నెల 13న బదిలీ నియామకాలు చేపట్టనున్నట్లు మార్గదర్శకాల్లో పొందుపరిచినా ఆచరణలో రాష్ట్ర ఇంధన శాఖ, టీజీ ఆర్పీడీసీఎల్ యాజమాన్యం వైఫల్యం చెందిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆప్షన్ ఇచ్చిన అధికారులు, ఉద్యోగుల్లో ఆందోళన, ఉత్కంఠ నెలకొంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 8వ తేదీలోపు రాష్ట్రంలోని నాలుగు విద్యుత్ సంస్థలు.. టీజీ జెన్కో, టీజీ ట్రాన్స్‌కో, టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్ నుంచి ఇంజనీర్లు, పర్సనల్ విభాగం అధికారులు, అకౌంట్స్ విభాగం అధికారులు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఉద్యోగులు రైతు డిస్కంకు వెళ్లేందుకు ఆప్షన్ ఇచ్చారు. ఇందులో ఒక్క టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి 1,252 మంది ఆప్షన్ ఇచ్చారు. ఆప్షన్లో పొందుపరిచిన వివరాలు సరైనావా కాదా అని ఈ నెల 12న వెరిఫికేషన్ చేసి తుది జాబితాను ఆయా సర్కిల్లు ఆర్పీడీసీఎల్కు పంపాయి. అధికారిక షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13న బదిలీ నియామకాలు చేపట్టాల్సి ఉండగా, అనూహ్యంగా ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. 15న మాతృ సంస్థ నుంచి రిలీవ్ అయి 18న ఆర్పీడీసీఎల్లో రిపోర్టు చేయాలి. 19న ఆర్పీడీసీఎల్ పరిధిలో పోస్టింగ్‌లు ఇవ్వాలి. 25న పోస్టింగ్ పొందిన స్థానంలో జాయిన్ కావాలి. అయితే ఇప్పటి వరకు బదిలీ నియామకాలు చేపట్టలేదు. ఇది మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది. బదిలీ నియామకాల అమలుపై మల్లగుల్లాలు.. బదిలీ నియామకాల అమలుపై ఇంధన శాఖ, టీజీఆర్పీడీసీఎల్ మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వారిని పలు సందేహాల వెంటాడుతున్నాయి. ఇంజనీర్స్ అసోసియేషన్లు, ఉద్యోగ సంఘాల నుంచి పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వీటిని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి దృష్టికి అసోసియేషన్లు, సంఘాలు తీసుకెళ్లాయి. పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తుది నిర్ణయంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. భవిష్యత్‌లో ఎలాంటి సమస్య తలెత్తకుండా బదిలీ నియామకాలు చేపట్టాలనే ఆలోచనలో ఆర్పీడీఎల్ యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తుంది. పోస్టుల భర్తీ, సీనియార్టీ లెక్కింపు వంటి అంశాలపై పీటముడి రాష్ట్రంలో ప్రస్తుతమున్న నాలుగు విద్యుత్ సంస్థల నుంచి ఆసక్తి కలిగిన అధికారులు, ఉద్యోగుల నుంచి టీజీ ఆర్పీడీసీఎల్ ఆప్షన్లు కోరిన విషయం విధితమే. అయితే ఇక్కడ ఓ చిక్కు వచ్చింది. నాలుగు విద్యుత్ సంస్థల నుంచి అధికారులు, ఉద్యోగులను ఏ నిష్పత్తిలో, ఏ కంపెనీ నుంచి ఎంత మంది చొప్పున తీసుకోవాలి? రిజర్వేషన్ రోస్టర్ అమలు... పోస్టుల భర్తీ, సీనియార్టీ లెక్కింపు వంటి అంశాలపై పీటముడి వీడడం లేదు. ఆప్షన్ ఇచ్చిన వారిలో రిజర్వేషన్ రోస్టర్ అమలు మేరకు ఆ కేటగిరీ ఉద్యోగులు అందుబాటులో లేకపోతే ఏం చేయాలనే సందిగ్ధతలో ఇంధన శాఖ, టీజీ ఆర్పీడీసీఎల్ యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా సంస్థల నుంచి ఆప్షన్లు రావడంతో సీనియార్టీ లెక్కింపు కూడా సమస్యగా మారనుంది. ఈ నేపథ్యంలో బదిలీ నియామకాల ప్రక్రియపై అనిశ్చితి కొనసాగుతోంది. అధికారుల నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు ఉద్యోగుల్లో ఉత్కంఠ పరిస్థితి కనిపిస్తోంది.ఆర్పీడీసీఎల్ వెళ్లడానికి ఈనెల 8న ఆప్షన్లు, 12న వెరిఫికేషన్ ప్రక్రియలు పూర్తి 13న బదిలీ నియామకాలు చేపట్టాల్సి ఉండగా కాలయాపన సాగుతున్న ప్రక్రియ.. బదిలీలపై పలు సందేహాలు ఎటూ తేల్చుకోలేకపోతున్న ఇంధన శాఖ, ఆర్పీడీసీఎల్ కొనసాగుతున్న అనిశ్చితి ఆందోళనలో అధికారులు, ఉద్యోగులు -
బంగారం కొనలేకపోతున్నాం..
ె పెరిగిన ధరల దృష్ట్యా సామాన్య, మధ్య తరగతి మహిళలం బంగారం కొనలేక పోతున్నాం. వివాహ సమయాల్లో పుట్టింటి కానుకగా అందించిన ఆభరణాలతో సరిపెట్టుకుంటున్నాం. ప్రధాని మోదీ హైదరాబాద్‌లో ప్రకటించిన విధంగా ఏడాది వరకు బంగారాన్ని కొనకుండా వేచిచూస్తాం. దీంతోనైనా దేశానికి మేలు కలగడంతోపాటు ధరలు దిగివస్తాయని ఆశిస్తున్నా. – గోనె లత, కరీమాబాద్ రోడ్డు వరంగల్ అవసరమైతేనే బైక్ తీస్తున్నా.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయి. సామాన్యులపై భారం పడింది. ఏ చిన్న పనికి కూడా వాహనంపై వెెళ్లడమే ప్రజలకు అలవాటుగా మారింది. పెరిగిన ధరలను చూస్తే చిన్న పనులకు బైక్, కారు రోడ్డు ఎక్కించడం సామాన్యులకు భారమే. అత్యవసరం అనుకుంటేనే కారు, బైక్ తీయాలని సూచిస్తున్నా. ఇంటి నుంచి ఎక్కడికై నా సైకిల్ మీద లేదా నడిచి వెళ్తున్నా. దీంతో నాకు ఆరోగ్యంతోపాటు డబ్బులు ఆదా అవుతున్నాయి. – మచ్చిక రాజు, వరంగల్ సేంద్రియ పద్ధతి పాటిస్తున్నాం.. సేంద్రియ సాగు విధానాన్ని పాటిస్తున్నాం. తప్పని పరిస్థితుల్లో యూరియాను పంటలకు వాడుతున్నాం. నూతన పద్ధతులు ఎన్ని పాటించినా ఎకరాకు ఒక బస్తా యూరియా వేస్తే పచ్చదనంతోపాటు పంట ఎదుగుదల కనిపిస్తుంది. అధికారులు ప్రత్యేక చొరవ చూపి ఖరీఫ్ సీజన్లో యూరియా కొరత లేకుండా చూడాలి. – పులి మంజుల, మహిళా రైతు, లింగగిరి -
ప్రేమోన్మాది ఘాతుకం
జడ్చర్ల: ప్రేమించడం లేదని ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో శనివారం పట్టపగలు గుర్తు తెలియని ఓ యువకుడు (30) యువతిని కత్తితో విచక్షణారహితంగా తల, మెడపై పొడవడంతోపాటు గొంతు కోయడంతో యువతి అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలి మృత్యువాత పడింది. వివరాలు ఇలా.. బాదేపల్లి పట్టణంలోని ఎర్రసత్యం కాలనీకి చెందిన వైష్ణవి (23) పోలేపల్లి సెజ్‌లోని ఎస్వీకేఎం స్కూల్లో రిసెప్షనిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తోంది.శనివారం విధులు ముగించుకొని సాయంత్రం 5.30 గంటల సమయంలో కాలనీలో నడుచుకుంటూ ఇంటికి వెళుతున్న సమయంలో గుర్తు తెలియని ఓ యువకుడు యువతిని వెంటాడి తన వెంట తెచ్చుకున్న కూరగాయలు కోసే కత్తితో దాడి చేశాడు. ఆ యువకుడు పారిపోతున్న సమయంలో స్థానికులు గమనించి వెంటాడి పట్టుకుని కాళ్లు చేతులు తాళ్లతో కట్టి వేసి చితకబాదారు. రాళ్లతో తలపై దాడి చేయడంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడకు వచి్చన 108 అంబులెన్స్‌లో యువతిని వైద్యచికిత్స కోసం జడ్చర్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు.అయితే అప్పటికే యువతి మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. అయితే దాడికి పాల్పడిన యువకుడిని రక్షించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తుండగా స్థానికులు పోలీసులను దరిచేరకుండా అడ్డుకున్నారు. తోపులాటలు, వాగ్వివాదం, కేకలు చోటు చేసుకున్నాయి. చివరకు తీవ్రంగా గాయపడిన యువకుడిని పోలీస్ వాహనంలో జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి తరలించారు. అయితే యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో పాటు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో యువకుడి వివరాలు లభ్యం కాని పరిస్థితి ఏర్పడింది. కాగా నిందితుడు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. మరో రెండు నెలల్లో పెళ్లి.. ఎర్రసత్యం కాలనీలో నివాసం ఉంటున్న రాంచంద్రయ్యకు భార్య శ్రీలత, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో హతురాలు వైష్ణవి పెద్ద కూతురు. ఈమెకు ఇటీవల పెళ్లి నిశ్చయమైందని కుటుంబ సభ్యులు తెలిపారు. వచ్చే నెలలో నిశ్చితార్థం, మరో రెండు నెలల్లో వివాహం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈలోగా ఈ దారుణం జరిగిందని వారు కన్నీటిపర్యంతం అయ్యారు. మరో వంద అడుగులు వేసి ఉంటే తమ ఇంట్లోకి వచ్చేదని, ఇంతలోనే దారుణ హత్యకు గురైనట్లు వారు పేర్కొన్నారు.దాడి చేసిన యువకుడు ఎవరో తమకు తెలియదని, అతడిని ఎప్పుడూ చూడలేదని తెలిపారు. హత్య చేసి పారిపోతుండగా యువకుడిని పట్టుకున్న స్థానికులు అతని గురించి ఆరా తీశారు. రెండేళ్లుగా ప్రేమ పేరుతో తనను మోసం చేసిందని, తన డబ్బులు తీసుకుందని నిందితుడు పేర్కొ న్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ మేరకు కేసు నమో దు చేసుకు ని దర్యాప్తు చేస్తున్నామని సీఐ కమలాకర్ తెలిపారు. యువకుడి వివరాలు ఇంకా తెలియలేదని చెప్పారు. -
రైల్వే స్టేషన్ తనిఖీ
డోర్నకల్: డోర్నకల్ రైల్వే స్టేషన్‌ను శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే అడిషనల్ డివిజనల్ మేనేజర్(ఆపరేషన్స్) సంజీవ్కుమర్ తనిఖీ చేశారు. స్టేషన్‌లోని ప్లాట్‌ఫారాలు, గూడ్స్ యార్డు, ఒకటో నంబర్ ప్లాట్‌ఫారంపై నూతనంగా నిర్మించిన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, బుకింగ్ కౌంటర్‌ను తనిఖీ చేశారు. అనంతరం డోర్నకల్, ఖమ్మం మార్గంలో జరుగుతున్న మూడో లైన్ నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో సీనియర్ డీఎస్ఓ సురేష్, డీఆర్‌యూసీసీ సభ్యులు లచ్చిరాంనాయక్, ఖాదర్, ఆర్పీఎఫ్ ఎస్సై నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రన్నింగ్ స్టాఫ్ సమస్యలు పరిష్కరించాలి.. డోర్నకల్ రైల్వే జంక్షన్ పరిధిలోని రన్నింగ్ స్టాఫ్ ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు కోరారు. జంక్షన్ పరిధిలో శుక్రవారం పర్యటించిన ఏడీఆర్ఎం(ఆపరేషన్స్) ఏ.సంజీవ్‌కుమార్‌ను మజ్దూర్ నాయకులు కలిసి వినతిపత్రం సమర్పించారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని వారు కోరగా ఏడీఆర్ఎం సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో మజ్దూర్ యూనియన్ బ్రాంచ్ సెక్రటరీ అంజయ్య, అసిస్టెంట్ సెక్రటరీ కరణ్‌సింగ్, వైస్ చైర్మన్ సుందరయ్య, సుమన్, రాములు, కృష్ణ, గణేశ్ తదితరులు పాల్గొన్నారు. పైపులైన్‌కు మరమ్మతుడోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీలోని పంపుబావితండా ప్రాంతంలో పగిలిన పైపులైన్‌కు యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టారు. ‘సాక్షి ఫోన్ ఇన్’ కార్యక్రమం ద్వారా తమ దృిష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించే విధంగా మున్సిపల్ చైర్పర్సన్ కొండేటి రాజకుమారి చర్యలు చేపడుతున్నారు. 6వ వార్డు పరిధిలో పగిలిన పైపులైన్‌కు మున్సిపల్ సిబ్బంది మరమ్మతు పనులు చేపట్టారు. మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యం మహబూబాబాద్ రూరల్: జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని ఎస్పీ శబరీష్ పేర్కొన్నారు. ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు డీఎస్పీ తిరుపతిరావు పర్యవేక్షణలో మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు శుక్రవారం విస్తృ త తనిఖీలు నిర్వహించారు. ప్రత్యేక శిక్షణ పొందిన జాగిలంతో కూడిన జిల్లా డాగ్ స్క్వాడ్ సిబ్బంది సహకారంతో టౌన్ పోలీసులు పట్టణంలోని క్రాంతి, నవత, శ్రీరామదాసు మోటారు, వాహనాలు, వస్తువుల రవాణా, అమెజాన్, డెలివరీ నౌ, ఫ్లిప్‌కార్ట్, ఆర్టీసీ బస్టాండ్ పార్సిల్ కార్యాలయాల్లో టౌన్ ఎస్సై రాంచరణ్ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. -
విద్యుత్ షాక్‌తో బాలుడి మృతి
పర్వతగిరి: మామిడితోటలో కాయలు కోస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో బాలుడు మృత్యువాతపడిన ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం సేట్రాంతండాకు చెందిన నేనావత్ సంతోష్(15) ఇటీవల పదో తరగతి పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యాడు. ఇదిలాఉండగా.. అదేజిల్లా మద్దిరాల మండలానికి చెందిన సురేష్ అనే వ్యక్తి పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన సంపెల్లి వెంకటేశ్వర్రావు మామిడితోట లీజుకు తీసుకుని సంతోష్‌ను మామిడి కాయలు కోసేందుకు తీసుకొచ్చాడు. శుక్రవారం మామిడి కాయలు కోసే క్రమంలో 11కేవీ విద్యుత్ వైర్లు తగిలి సంతోష్ కిందపడిపోయాడు. గమనించిన స్థానికులు వర్ధన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మామిడితోట మధ్యలో నుంచి 11కేవీ విద్యుత్ వైర్లు ఉన్నప్పటికీ చెట్లకొమ్మలు తొలగించడంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు ఎల్సీ తీసుకోకుండా తోట యజమాని, కౌలుదారు మామిడి కాయలు కోయించడంతో బాలుడు మృతి చెందాడు. బంధువుల ఆందోళన.. వర్ధన్నపేటలోని మార్చురీ వద్ద మృతుడి తల్లిదండ్రులు విజయ రాజు శోకసంద్రంలో మునిగిపోగా.. బంధువులు మార్చురీ వద్ద ఆందోళన చేపట్టారు. తగిన న్యాయం చేస్తామని పర్వతగిరి సీఐ రాజగోపాల్ వారికి నచ్చజెప్పినా వారువినలేదు. బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండా అడ్డుకున్నారు. కాగా మృతుడికి అక్క రాజేశ్వరి, తల్లిదండ్రులు ఉన్నారు.● మామిడి కాయలు కోస్తుండగా ప్రమాదం ● మృతుడు సూర్యాపేట జిల్లా వాసి -
ఎస్పీని కలిసిన మాజీ మంత్రి
మహబూబాబాద్ రూరల్ : మానుకోట పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ శబరీష్‌ను మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ ఆంగోత్ బిందు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్పీ శబరీష్ హెల్మెట్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమ్నారు. హెల్మెట్ ధరించడం వల్ల ద్విచక్రవాహనదారులతో పాటు వారి కుటుంబానికి కూడా రక్షణ ఇస్తుందన్నారు. అదే విధంగా మాదకద్రవ్యాల (గంజాయి) వాడకం వల్ల కలిగే నష్టాలు, వాటి నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పించడం చాలా అవసరమన్నారు. ప్రస్తుత తరం విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ, తమ భవిష్యత్‌ను కాపాడుకోనే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్పీని వారు కోరారు. -
పోలీసులు అంకితభావంతో పని చేయాలి
మామునూరు: విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా అధికారులు, పోలీసులు అంకిత భావంతో పనిచేయాలని రాష్ట్ర టీజీఎస్పీ బెటాలియన్ల డీఐజీ వి.వి.రమణారెడ్డి సూచించారు. మామునూరులోని నాలుగో బెటాలియన్‌ను శుక్రవారం రమణారెడ్డి సందర్శించారు. బెటాలియన్ గేట్ వద్ద డీఐజీకి కమాండెంట్ శివప్రసాద్‌రెడ్డి ఘన స్వాగతం పలికి పుష్పగుచ్ఛం అందజేసి ఆహ్వానించారు. అనంత రం పోలీసుల నుంచి డీఐజీ గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత మెటార్ ట్రాన్స్‌ఫోర్ట్, యూనిట్ హాస్పటల్, పెట్రోల్ బంక్, క్వార్టర్ మాస్టర్ ఆఫీసులను తనిఖీ చేసి నిర్వాహణలో ఎదురయ్యే ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నిర్లక్ష్యానికి తావు లేకుండా విధి నిర్వాహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం అమ్మవారిపేటలోని టీజీ ఎస్పీ బెటాలియన్ ఫైరింగ్ రేంజ్‌ను ఆయన పరిశీలించారు. ఫైరింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, నూతన సాంకేతికతతో ఉపయోగించుకోవాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఏసీ మూర్తు జారెహమాన్, బాలయ్య, రాజేందర్, ఆర్ఐలు, ఆర్ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. టీజీ ఎస్పీ బెటాలియన్ డీఐజీ వి.వి రమణారెడ్డి టీజీఎస్పీ బెటాలియన్ సందర్శన -
గోదాములకు మక్కల తరలింపు
మహబూబాబాద్ రూరల్: ప్రభుత్వ సూచనలు, కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు షెడ్లలో ఉన్న మక్కల బస్తాలను ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ పురుషోత్తం శుక్రవారం గోదాముల్లోకి తరలింపజేశారు. షెడ్లలో సుమారు 30 వేల బస్తాల మక్కలు ఉండగా హమాలీలు, కూలీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి లారీలు, ట్రాక్టర్ల ద్వారా గోదాముల్లో నిలువచేసే ప్రక్రియను మొదలుపెట్టారు. మొదటిరోజు సుమారు మూడు వేల బస్తాల వరకు గోదాముల్లోకి తరలించగా.. రెండు, మూడు రోజుల్లో మిగిలిన బస్తాలను తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ కార్యదర్శి సుజన్ బాబు, పీఏసీఎస్ కార్యదర్శి ప్రమోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
స్మారక స్తూపం కూల్చివేత
హసన్‌పర్తి: హసన్‌పర్తి మండలం చింతగట్టులో మావోయిస్ట్ నేత బూర రాకేష్ పేర నిర్మిస్తున్న స్మారక స్తూపాన్ని పోలీసులు శుక్రవారం కూల్చివేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏడాది క్రితం ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో చింతగట్టుకు చెందిన మావోయిస్ట్ కీలక నేత బూర రాకేష్ మృతిచెందాడు. కుటుంబసభ్యులకు పార్ధివదేహాన్ని సైతం అప్పగించలేదు. దీంతో అతని జ్ఞాపకార్థం స్తూపం నిర్మించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. వర్ధంతి సందర్భంగా స్తూపం ఏర్పాటు చేయాలని భావించినా.. పోలీసుల ఒత్తిడితో కుటుంబసభ్యులు వెనక్కి తగ్గారు. అనంతరం శుక్రవారం చింతగట్టులోని తమ ఇంటి ఎదుట స్తూపం నిర్మాణ పనులు ప్రారంభించారు. సమాచారం అందుకున్న కాకతీయ యూనివర్సిటీ పోలీసులు జేసీబీ సాయంతో నిర్మాణంలో ఉన్న స్తూపాన్ని కూల్చివేశారు. రాకేష్ తల్లిదండ్రులు స్వరూప, బూర బాబు, సోదరుడు బూర రంజిత్, వదిన బూర రేఖతో పాటు నిర్మాణ పనులు చేపడుతున్న ముగ్గురు మేసీ్త్రలను కూడా అరెస్ట్ చేశారు. మధ్యాహ్నం 3గంటల వరకు పోలీస్‌స్టేషన్‌లో ఉంచిన తర్వాత సాయంత్రం తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. మావోయిస్టు రాకేష్ పేరిట స్తూపం నిర్మాణం మేసీ్త్రలను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు -
పుస్తక పఠనంతోనే జ్ఞాన సంపద
కేసముద్రం: పుస్తక పఠనం అత్యంత అవసరమని, దీంతో జ్ఞాన సంపద పొందవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక విద్యావారోత్సవాల్లో భాగంగా ఐదోరోజు శుక్రవా రం గ్రంథాలయ దినోత్సవ కార్యక్రమాన్ని కేసముద్రంస్టేషన్ జెడ్పీహైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడారు. లక్ష్యసాధనకు పుస్తక పఠనం అవసరమన్నారు. సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలని, ఎక్కువగా పుస్తకాల పఠనం, పేపర్ రీడింగ్‌ను అలవాటు చేసుకోవాలన్నారు. అనంతరం ప్రజాప్రతినిధులను ఆయన ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బానోత్ సునీతవెంకన్న, ఆర్టీఏ మెంబర్ రావుల మురళి, ఏసీజీఈ మందుల శ్రీరాములు, డీఎస్ఓ అప్పారావు, ఏఎస్సీ సంతోష్, ఎంఈఓ కాలేరు యాదగిరి, తహసీల్దార్ వివేక్, మార్కెట్ డైరెక్టర్ ఎండి.అయూబ్‌ఖాన్, హెచ్ఎంలు రాజు, నరేందర్, ఏఏపీసీ చైర్పర్సన్ మంజుల, కౌన్సిలర్లు కనుకుల సుభద్ర, వల్లందాసు ఉమ, అరుణ, వీరేష్ తదితరులు పాల్గొన్నారు. డీఈఓ సత్యనారాయణమూర్తి -
మొండిచెయ్యి
నామినేటెడ్ పదవుల్లో దక్కని చోటుసాక్షి, మహబూబాబాద్: కాంగ్రెస్ పార్టీకోసం పనిచేసి.. నామినేటెడ్ పదవులు వస్తాయని భావించిన నాయకులకు నిరాశ మిగిలింది. గిరిజన జనాభా ఎక్కువ ఉండడంతో ఎస్టీ రిజర్వేషన్ కేటాయింపులే ఎక్కువగా ఉంటాయి. దీంతో నామినేటెడ్ పదవులపై ఆశ పెట్టుకున్నవారికి రాష్ట్ర అధినాయకత్వం శ్రీమొండిచెయ్యిశ్రీ చూపింది. కాగా, చివరి ప్రయత్నంగా పీఏసీఎస్, మిగిలిన రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ పదవులు కల్పించాలని నేతలను కోరుతున్నారు. కొందరికే అవకాశం.. పోస్టులు తక్కువ.. నాయకులు ఎక్కువగా ఉన్న జిల్లా కావడంతో నామినేటెడ్ పోస్టులే దిక్కుగా మారాయి. మహబూబాబాద్, డోర్నకల్ నుంచి ఎమ్మెల్యే టికెట్‌కోసం ప్రయత్నించిన ఎల్‌హెచ్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు తేజావత్ బెల్లయ్య నాయక్ ట్రైకార్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. అదే విధంగా డోర్నకల్ నియోజకవర్గం నుంచి చివరి వరకు టికెట్ వస్తుందని ఆశపడిన నెహ్రూనాయక్ టికెట్ రాక నిరాశతో ఉన్న పరిస్థితిలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యుడిగా నియమితుడయ్యాడు. అదే విధంగా అనూహ్యంగా మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ సతీమణి ఉమకు జిల్లా కాంగ్రెస్ పగ్గాలు అప్పగించారు. వీరితోపాటు ఇటీవల ప్రకటించిన జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్‌గా వెన్నం శ్రీకాంత్ రెడ్డిని నియమించారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నూనావత్ రాధను నియమించారు. అదే విధంగా రాష్ట్ర రోడ్డు ట్రాన్స్పోర్ట్ అథారిటీ కమిటీ సభ్యుడిగా రావుల మురళి నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్నారు. వీరితోపాటు మానుకోట తొర్రూరు, కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్ల నియామకం చేపట్టారు. ఆశించి భంగపడి.. ముఖ్యమైన పదవులు ఎస్టీ రిజర్వేషన్ కావడంతో ఎంతోకాలంగా నామినేటెడ్ పదవులనే నమ్ముకొని ఉన్న కొందరు నాయకులకు భంగపాటే మిగిలింది. ప్రధానంగా మహబూబాబాద్ పట్టణంలోని పలు వురు నాయకులు నామినేటెడ్ పదవులు వస్తాయని భావించారు. పార్టీలోని పదవులు వస్తాయని ముందు భావించినా అదీ రాలేదు. తర్వాత కార్పొరేషన్ పదవుల్లో మొండిచెయ్యి చూపారు. పార్టీలోని ప్రధా న నాయకుల అనుచరులుగా చెలామణి అవుతూ అంతా ఆర్భాటం చేసినా.. పదవులు దక్కలేదు. అ యితే ఇందుకు కారణాలు ఒకరు ఒకరికి దగ్గర అంటే.. మరొకరు మరొకరికి దగ్గరగా ఉండడంతోనే పదవులు రాలేదనే విమర్శలు ఉన్నాయి. అలాగే డోర్నకల్, పాలకుర్తి, ఇల్లెందు, ములుగు నియోజకవర్గాల్లోని నాయకులు కూడా పదవులు వస్తాయని భావించినా వర్గపోరుతో వెనుకబడిపోయారు. భవిష్యత్‌పై ఆశలు ప్రతీసారి పదవులు వస్తాయని భావించిన నాయకులకు భంగపాటు తప్పడం లేదు. దీంతో చివరి ప్రయత్నంగా పీఏసీఎస్ చైర్మన్లు, దేవాలయాల చైర్మన్లతోపాటు, రాష్ట్ర స్థాయిలో వివిధ విభాగాల కార్పొరేషన్ల డైరెక్టర్ల పదవు లపై ఆశగా ఉన్నారు. వీటితోపాటు జనరల్ రిజర్వు అయిన జిల్లా పరిషత్ చైర్మన్ పదవికోసం పార్టీలోని సీనియర్ నాయకులు, వారి వారసులు ఎదురు చూస్తున్నారు. అయి తే అవి ఎప్పుడు భర్తీ చేస్తారో.. వీరి ఆశలు ఎప్పుడు చిగురిస్తాయో.. అసలు పదవులు వస్తాయో.. రావో అనే చర్చ జరుగుతోంది. ఆశపడి భంగపడిన పలువురుజిల్లా కాంగ్రెస్ నాయకులు పీఏసీఎస్, రాష్ట్రస్థాయి డైరెక్టర్ పోస్టులపై ఆశలు -
వాన గుబులు.. కర్షకుల దిగులు!
తొర్రూరు: ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులను ఆరబెట్టుకోవడానికి, వర్షాల నుంచి కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఎప్పుడు వర్షం వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో అకాల వర్షాల నుంచి పంట ఉత్పత్తులను కాపాడుకునేందుకు టార్పాలిన్లు రైతులకు ఇప్పుడు అత్యవసరం. దీంతో గతంలో ప్రభుత్వం 50 శాతం సబ్సిడీపై రైతులకు సరఫరా సరఫరా చేసేది. కానీ గత ఏడేళ్లుగా ప్రభుత్వం టార్పాలిన్ల పంపిణీని నిలిపివేసింది. మార్కెట్లో టార్పాలిన్ల ధరలు అధికంగా ఉండటంతో కొనలేక రైతులు అద్దెకు తెచ్చుకుంటూ పంటను కాపాడుకుంటున్నారు. 2018 నుంచి నిలిచిన సరఫరా.. వర్షాలు, ప్రకృతి విపత్తుల నుంచి పంటలను రక్షించుకోవడానికి వ్యవసాయ శాఖ గతంలో సబ్సిడీపై టార్పాలిన్లు అందించేది. కానీ గత ఏడేళ్లుగా ఒక్క టార్పాలిన్ కూడా రైతులకు సబ్సిడీ కింద అందడం లేదు. వ్యవసాయశాఖకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వంతో కంపెనీలు ఒప్పందం చేసుకుని గతంలో టార్పాలిన్లు అందిస్తుండేది. మండలాల వారీగా వ్యవసాయాధికారులు ఇచ్చే ఇండెంట్‌ను బట్టి సరఫరా జరిగేది. రైతులు డీడీ, పాస్ బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు అందించి టార్పాలిన్లు కొనుగోలు చేసేవారు. మార్కెట్లో రూ.2,500కు లభించే టార్పాలిన్లను 50 శాతం సబ్సిడీతో రూ.1,250కే అందించేలా ఏర్పాట్లు చేశారు. రవాణా చార్జీలతో కలిపి రూ.1,300 నుంచి రూ.1,500 వరకు రైతులకు అందించేవారు. స్థానిక వ్యవసాయాధికారులు రైతుల వివరాలను కంపెనీలకు ఇస్తారు. ఆ సమాచారం ద్వారా 50 శాతం నిధులు సబ్సిడీ నిధులు కంపెనీలకు సర్కారు చెల్లించేది. ఆ ప్రకారం 2018 వరకు టార్పాలిన్లను అందించారు. గత ఏడేళ్లుగా ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో కంపెనీలు ముందస్తుగా ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. పాతవి చిరిగిపోవడంతో కొత్తవి కొనాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా ప్రస్తుతం రైతులను అకాల వర్షాలు గుబులు పుట్టిస్తున్నాయి. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో రైతుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు కొనుగోలు కేంద్రాలకు టార్పాలిన్లను సరఫరా చేసి భరోసా కల్పించాలని కోరుతున్నారు. ●కొనాలంటే అప్పు చేయాల్సిందే..రెండెకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. కల్లాలు లేకపోవడంతో పంట ఆరబోసుకోవడం సమస్యగా మారింది. కొన్నేళ్లుగా ప్రభుత్వం టార్పాలిన్లు అందించకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో మాదిరిగా రాయితీపై సరఫరా చేసి ఆదుకోవాలి. లేదంటే అప్పు చేసి కొనుగోలు చేయడం భారంగా మారుతుంది. – బానోతు పాపాలాల్, మక్క రైతు, హచ్చుతండా రాయితీపై అందించి ఆదుకోవాలియంత్రంతో కోసిన వరి ధాన్యాన్ని వారం రోజుల పాటు కల్లంలో ఆరబెట్టి తేమశాతం తగ్గించాల్సి ఉంటుంది. ఆ సమయంలో టార్పాలిన్లు లేక ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం రాయితీపై పరదాలు ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది. బయట కొనుగోలు చేసేవి నాసిరకంగా ఉంటున్నాయి. – శామకూరి ఐలయ్య, రైతు, తొర్రూరుటార్పాలిన్లు లేక రైతుల ఆందోళన ఏడేళ్లుగా సబ్సిడీపై అందించని వైనం బహిరంగ మార్కెట్లో అధిక ధరలు కొనలేక అద్దెకు తెచ్చుకుంటున్న అన్నదాతలు -
అమ్మచెప్పిన కథ
మంచి స్నేహం జనగామ: ఒక కాల్వ ఒడ్డున ఒక చీమల పుట్ట ఉండేది. ఆ పుట్టలో ఎన్నో చీమలు నివాసం ఉండేవి. ఒక పావురం దాహం తీర్చుకోడానికి కాల్వ దగ్గరకు ప్రతీ రోజు వచ్చేది. చీమలు ఆ పావురంతో స్నేహం చేయడం మొదలు పెట్టాయి. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఆ సంవత్సరం వర్షాలు బాగా కురిశాయి. చెరువులు, నదులు పొంగి పొర్ల సాగాయి. చీమల పుట్ట దగ్గరలో ఉన్న కాల్వ నిండా నీళ్లు వచ్చాయి. వర్షాలు ఇంకా తగ్గలేదు. రోజురోజుకూ కాల్వ నీటిమట్టం పెరిగిపోసాగింది. చీమల పుట్ట నీటిలో మునిగిపోతుంది. ఇది గమనించిన పావురం.. చీమలను కాపాడి ఒడ్డుకు చేరుస్తుంది. ఆతర్వాత అక్కడే ఉన్న చెట్టుకు పావురం గూడు కట్టుకోగా, చీమలు మరో పుట్టను ఏర్పాటు చేసుకుని స్నేహాన్ని కొనసాగిస్తాయి. నీతి: ఒక మంచి స్నేహం చేస్తే కష్టకాలంలో ఎలాంటి సహాయం దొరుకుతుందో ఈకథ ద్వారా తెలుసుకోవచ్చు. – శ్రీనిత్య, 8వ తరగతి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నర్మెట -
ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారించాలి
భానుపురి (సూర్యాపేట) : స్థానికంగా అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకుంటూ, ఆదాయ వనరులను పెంచుకునే దిశగా స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచించారు. అనవసర వ్యయాన్ని తగ్గించుకొని, ఆదాయ వనరుల ద్వారా రాబడిని పెంచుకున్నప్పుడే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందన్నారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్లో.. తూర్పు తెలంగాణ జిల్లాల స్థానిక సంస్థల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, అధికారులతో రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శి కాత్యాయని దేవి, సభ్యురాలు సుజానాయాదవ్, సభ్యుడు ఎస్.సుధీర్‌రెడ్డితో కలిసి చైర్మన్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ.. ఆదాయ వనరులు అభివృద్ధి చేసుకుని, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం శాసీ్త్రయ దృక్పథంతో పనిచేయాలన్నారు. అన్ని గ్రామపంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో ప్రతీ నివాస గృహానికి రక్షిత మంచినీరు సరఫరా, పారిశుద్ధ్యం నిర్వహణ పక్కాగా కొనసాగేలా స్థానిక సంస్థలు పర్యవేక్షణ చేయాలన్నారు. నిధుల కోసం పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పైనే ఆధారపడకుండా స్థానికంగా ఆదాయం సమకూర్చే అన్ని వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పన్ను వసూళ్లు, ప్రకటనలపై వచ్చే రాబడి, వృత్తి పన్ను, వ్యాపార వాణిజ్య సముదాయాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించి నిర్ణీత రుసుము వసూలు చేస్తూ స్థానిక సంస్థలు ఆర్థిక పరిపుష్టి సాధించేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్‌తో పాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల అదనపు కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలు, డీపీఓలు, ఎంపీడీఓలు, నగర మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూర్యాపేటలో స్థానిక సంస్థల ప్రాంతీయ సదస్సు -
కళలపై లోతైన అధ్యయనం చేయాలి
హన్మకొండ కల్చరల్: కళలపై పరిశోధకులు, లోతైన అధ్యాయనం చేయాలని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య వెలుదండ నిత్యానందరావు అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వరంగల్ హంటర్ రోడ్డులోని తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠంలో సాహిత్య, కళాత్మక సదస్సు నిర్వహించారు. వీసీ నిత్యానందరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ప్రముఖ సాహితీవేత్త గన్నమరాజు గిరిజామనోహర బాబు, తెలుగు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు, ప్రజాపాలన నోడల్ అధికారి, విశ్వవిద్యాలయం ఆచార్యులు బి.హెచ్ పద్మప్రియ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజామనోహర్ బాబు మాట్లాడుతూ.. భాష, అలంకారాలు, పద ప్రయోగం, వాక్య నిర్మాణం వంటి అంశాలను వివరించారు. వీసీ నిత్యానందరావు మాట్లాడుతూ.. తెలుగు విశ్వవిద్యాలయం అభివృద్ధికి కృషి జరుగుతోందని పరిశోధనా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. వరంగల్ జానపద గిరిజన విజ్ఞాన పీఠం ఆస్థిత్వాన్ని కాపాడే దిశగా అభివృద్ధి చేస్తామని అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు మాట్లాడుతూ.. వీసీ ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. పరిశోధన పత్రాలను సమర్పించే పరిశోధక విద్యార్థులు నాణ్యమైన విషయ విజ్ఞానాన్ని సేకరించి భవిష్యత్ తరాలకు అందించాలని సూచించారు. జానపద గిరిజన విజ్ఞాన పిఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న మాట్లాడుతూ విశ్వవిద్యాలయ వీసీ, రిజిస్ట్రార్లు పీఠానికి తగిన సదుపాయాలు కల్పించారని తెలిపారు. అంతకుముందు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహిహీత డాక్టర్ ఎండీ రాజ్‌మహ్మద్ పీఠం లైబ్రరీకి 216 పుస్తకాలు ఉచితంగా అందజేయగా.. అతన్ని సన్మానించారు. విశ్వవిద్యాలయ పరిశోధక విద్యార్థులు పత్ర సమర్పణ చేయగా.. విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. సదసుసలో కవుల రామాచంద్రమౌళి, వల్పపైడి, పరీక్షల నియంత్రణాధికారి ఆదిలక్ష్మి, అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ వనజా ఉదయ్, డాక్టర్ రత్నశ్రీ డిప్యూటీ రిజిస్ట్రార్ బాలోజినాయక్, ఏఆర్ శ్రీకాంత్, సూపరింటెండెంట్ రంగారావు, జూనియర్ అసిస్టెంట్ అమీర్ అలీఖాన్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు శ్రీమంతుల దామోదర్, బాసాని సురేష్, చూరేపలి రవికుమార్, అబ్బు గోపాల్‌రెడ్డి, గంపా సతీష్ పాల్గొన్నారు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వీసీ నిత్యానందరావు వరంగల్ జానపద గిరిజన విజ్ఞాన పీఠంలో సాహిత్య, కళాత్మక సదస్సు -
థియేటర్ ఆర్ట్స్ డిపార్టుమెంట్‌ను ఏర్పాటుచేయాలి
కేయూ క్యాంపస్: కళాకారులు, కళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, కాకతీయ యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ విభాగం ఏర్పాటు చేయాలని మహబూబాబాద్ మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. చేతన కళావేదిక ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కాకతీయ యూనివర్సిటీలోని ఎస్డీఎల్సీఈ గ్రౌండ్లో నిర్వహించిన కాకతీయ కళల జాతర కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కాకతీయులు ఆనాడు ప్రజలకు సుపరిపాలనతోపాటు కళలు, అద్భుతమైన శిల్పకళ, నృత్యాలు, సంగీతానికి ఎంతో ప్రాధాన్యమిచ్చారని తెలిపారు. ముఖ్యంగా పేరిణీ నృత్యం కాకతీయుల కాలంలో విలసిల్లిన నృత్యప్రదర్శన అని గుర్తు చేశారు. కాకతీయల కాలంలో తవ్వించిన గొలుసుకట్టు చెరువులు నేటికీ ఉపయోగపడుతున్నాయని తెలిపారు. కాకతీయ యూనివర్సిటీలో కాకతీయుల కళా జాతర నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. కళాకారులకు కళలపై అభిరుచి కలగాలంటే థియేటర్ ఆర్ట్స్ సబ్జెక్టుగా యూనివర్సిటీలో విభాగం ఏర్పాటుచేయాలని అందుకు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. జాతీయ స్థాయి పార్టీలో ఉన్నందున విభాగం ఏర్పాటు జరిగేలా తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. థియేటర్ ఆర్ట్స్ విభాగం ఏర్పాటుచేస్తే ఎంతో మంది కళాకారులు తయారవుతారన్నారు. కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి సభ్యుడు డాక్టర్ చిర్ర రాజు మాట్లాడుతూ.. కాకతీయు కాలంనాటి శిల్పకళ అద్భుతమైందన్నారు. కాగా పేరిణీ నృత్యంతోపాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతలను అలరించాయి. బీజేపీ నాయకురాలు రావు పద్మ, జబర్దస్త్ ఫేమ్ వెంకీ, రాజమౌళి, లక్ష్మణాచారి, బోలేశావలి, చేతన కళావేదిక కన్వీనర్ నాగేశ్వర్రావు, బాధ్యులు శ్యామ్, దేవేందర్, కళాకారులు, తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ సీతారాంనాయక్ కేయూలో ఘనంగా కాకతీయ కళల జాతర అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు -
టైలరింగ్ కోర్సులో శిక్షణ
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్ల అందజేతసాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు టైలరింగ్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు మెథడ్ ఆఫ్ కట్టింగ్, మెథడ్ ఆఫ్ స్ట్రిచ్చింగ్, జుబ్బా, పెట్టికోట్, సారీ పెట్టికోట్, ప్లాజా, ఫ్రాక్, అంబ్రెల్లా ఫ్రాక్, వీ షేప్ ఫ్రాక్, స్లీవ్లేస్ ఫ్రాక్, అంబ్రెల్లా టాప్, క్రాస్ కట్ బ్లౌజ్, ఫిష్ అంబ్రెల్లా టాప్, కట్స్ టాప్, సాదా బ్లౌజ్, ప్రిన్స్కట్ బ్లౌజ్, కటోరి బ్లౌజ్, నార్మల్ బాటమ్, ఫ్రంట్ కుచ్చుల బాటమ్, సైడ్ కుచ్చుల బాటమ్.రిజిస్ట్రేషన్ ఫీజు : రూ.2,500/-వర్క్‌షాపు షెడ్యూల్ తేదీలు: 22–05–2026 నుంచి 21–06–2026 వరకు శిక్షణ సమయం : ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రిజిస్ట్రేషన్, శిక్షణ స్థలం వివరాలు : రేష్మా బోటిక్, ఇంటినంబర్: 10 –10– 34, మైసమ్మ వీధి, గిర్మాజీపేట, వరంగల్. ఫోన్ నంబర్ : 95330 12727, 95055 14424 -
లారీల ఆలస్యం.. పేరుకుపోయిన ధాన్యం
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలు సకాలంలో రాకపోవడంతో కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలు పేరుకుపోతున్నాయి. మండలంలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి నెలకొనగా.. లారీల యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సకాలంలో లారీలను కొనుగోలు కేంద్రాలకు పంపకపోవడం వల్ల సమస్య తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. రైతుల నుంచి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వందల కొద్ది బస్తాల ధాన్యాన్ని కొనుగోలు చేసి కాంటా పెట్టారు. అయితే లారీలు రాక మిల్లులకు తరలించకుండా కనిపిస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు బతిమిలాడితే తప్ప లారీలు వచ్చే పరిస్థితి ఉండటంలేదని సమాచారం. -
కార్యవర్గం ఎన్నిక
హన్మకొండ: తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ టీజీ ఎన్పీడీసీఎల్ కంపెనీ శాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నె శశి కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్లో జరిగిన యూనియన్ టీజీ ఎన్పీడీసీఎల్ కంపెనీ శాఖ (18 సర్కిళ్ల పరిధి) జనరల్ బాడీ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు. అధ్యక్షుడిగా గుగులోతు రాందాస్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఈది వెంకటరమణ, ప్రధాన కార్యదర్శిగా రావుల రమణారెడ్డితోపాటు పలువురిని కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. -
టీజీ ఆర్పీడీసీఎల్ ఏర్పాటు వేగిరం
హన్మకొండ: తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ పూర్తి స్థాయిలో ఏర్పాటుకు పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రస్తుత విద్యుత్ సంస్థల నుంచి ఆసక్తి కలిగిన వారి నుంచి ఆప్షన్లు కోరగా ఈ నెల 8వ తేదీ నాటికి ఉద్యోగులు ఆప్షన్లు ఇచ్చారు. వీరికి బదిలీ నియామక ప్రక్రియ పూర్తి చేసి పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది. ఆస్తుల పంపిణీ వేగిరం వ్యవసాయ సర్వీస్‌లు, లిఫ్ట్ ఇరిగేషన్, మిషన్ భగీరథ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్, సీవరేజ్ బోర్డు, మున్సిపల్ వాటర్ కనెక్షన్ విత్ సఫరేట్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్‌లు టీజీ ఆర్పీడీసీఎల్లోకి వస్తాయి. ఈ మేరకు గృహ సర్వీస్‌లు వ్యవసాయ సర్వీస్‌లు కలిసి ఉన్న విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను వేరు చేయడంతోపాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల గుర్తింపు ప్రక్రియను విద్యుత్ పంపిణీ కంపెనీలు వేగిరం చేశాయి. లైసెన్స్ జారీ కావడానికి ముందే ఆస్తుల పంపిణీ పూర్తి చేయాలని టీజీ ఆర్పీడీసీఎల్, టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆస్తుల పంపిణీలో భాగంగా వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల గుర్తింపు ప్రక్రియ మొదలు పెట్టారు. సంబంధత సెక్షన్ ఏఈతోపాటు, సెక్షన్‌లోని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఉద్యోగులు వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల గుర్తింపు పనిలో బిజీ అయ్యారు. ట్రాన్స్ఫార్మర్ల నమోదుకు ప్రత్యేక యాప్ టీజీ ఆర్పీడీసీఎల్కు బదిలీ అయ్యే విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల నమోదు కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించినట్లు తెలిసింది. ఈ యాప్‌లో వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్ల ఫొటోలు ఆప్‌లోడ్ చేస్తారు. మూడు రకాల ఫొటోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫ్లింత్తో సహా ట్రాన్స్ఫార్మర్ ఫొటో, ట్రాన్స్ఫార్మర్ ఎంబోసింగ్, ట్రాన్స్ఫార్మర్ కంపెనీ నేం ప్లేట్ ఫొటోలు వేర్వేరుగా అప్లోడ్ చేయాలి. ఫీడర్ పేరు, ట్రాన్స్ఫార్మర్ కంపెనీ పేరు, ట్రాన్స్ఫార్మర్ నంబర్, కంపెనీ నంబర్, వ్యవసాయ సర్వీస్‌లు వంటి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. వ్యవసాయంతోపాటు ఇతర సర్వీస్‌లు ఒకే ట్రాన్స్ఫార్మర్పై ఉంటే వీటిని వేరు చేయాల్సిన బాధ్యత కూడా ప్రస్తుత డిస్కంలదే. వ్యవసాయ సర్వీస్‌లు వేరు చేస్తూ ప్రత్యేకంగా అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం ద్వారా వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లన్ని టీజీ ఆర్పీడీసీఎల్కి వెళ్లనున్నాయి. 25వ తేదీ వరకు గడువు వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ల గుర్తింపు ప్రక్రియ, యాప్‌లో అప్లోడ్ ఈ నెల 25లోపు పూర్తి చేయాలని మూడు డిస్కంల సీఎండీలు.. ఎస్ఈ, డీఈలు, ఏడీఈలకు సూచించారు. సరిపడా సిబ్బంది లేకపోవడంతో నిర్ణీత గడువులోగా చేయలేమని అధికారులు చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఆర్పీడీసీఎల్కు అప్షన్ కోరడంతో చాలా మంది మూడో డిస్కంకు వెళ్లేందుకు ఆప్షన్ ఇచ్చారు. వీరిని ఆ డిస్కంలోకి తీసుకుంటే మరింత ఉద్యోగుల కొరత ఏర్పడనుందని ఈ క్రమంలో గడువులోగా వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ల గుర్తింపు, యాప్‌లో అప్లోడ్ ప్రక్రియ పూర్తి కాదని డివిజన్, సబ్ డివిజన్, సెక్షన్ స్థాయి అధికారులు చెబుతున్నారు. కనీసం రెండు నుంచి మూడు వారాల సమయం పడుతుందన్నారు. మొదలైన వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ల గుర్తింపు గృహ, వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ల ప్రత్యేక ఏర్పాటు ప్రత్యేక యాప్‌లో ఫొటో సహా నమోదు ఈ నెల 25 నాటికి ప్రక్రియ పూర్తి చేసేలా కార్యాచరణ -
రోడ్డు ప్రమాదంలో ఐటీడీఏ అధికారి మృతి
ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏలో స్టాటిస్టికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మాదాసు సురేష్‌బాబు (41) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబంతో భద్రాచలంలో నివాసముంటున్న సురేష్ శుక్రవారం బంధువుల ఇంటికి వెళ్తూ భద్రాచలం సమీపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎటపాక మండలం నెల్లిపాక వద్ద గేదెలను ఢీకొని మృతి చెందినట్లు సమాచారం. భద్రాచలంలో ఐటీడీఏ ఎస్ఓగా పనిచేస్తూ ఏటూరునాగారం ఐటీడీఏకు గత ఏడాది బదిలీపై వచ్చిన సురేష్.. గిరిజనుల సమస్యపై స్పందిస్తూ వారి మన్ననలను పొందారు. సురేష్‌బాబుకు భార్య, పిల్లలు ఉన్నారు. ఏటూరునాగారం ఐటీడీఏలో ఎస్ఓగా పనిచేస్తున్న సురేష్‌బాబు -
చిందులేస్తున్న చిన్నిపాదాలు
హన్మకొండ: వేసవి సెలవుల్లో సెల్ఫోన్లు, టీవీలకు మాత్రమే పరిమితం కాకుండా తమలోని అభిరుచికి పదునుపెడుతూ నృత్యంలో శిక్షణ పొందుతున్నారు. పలువురు విద్యార్థినులు. తమ చిన్ని పాదాలతో చిందులు వేస్తూ నృత్యంలో మెలకులు నేర్చుకుంటున్నారు. హనుమకొండ హౌజింగ్ బోర్డు కాలనీలోని సెయింట్ పీటర్స్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో నృత్య గురువు రుద్రవేణు ఇస్తున్న శిక్షణకు హాజరవుతూ తమలోని టాలెంట్‌కు పదును పెడుతున్నారు ఈ చిన్నారులు. ప్రతీ రోజు ఉదయం.. భరత నాట్యం, కూచిపూడిలో శిక్షణ పొందుతున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు నృత్య గురువు రుద్రవేణు. నృత్యంలో బాలికల శిక్షణ వేసవి సెలవుల్లో చిన్నారులకు ప్రత్యేక తరగతులు -
చేపలు అమ్మేందుకు వెళ్తూ..
ఏటూరునాగారం: చేపలు విక్రయించేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం 163 జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన బాల్నె నర్సయ్య(60), గడదాసు రాంప్రసాద్ చేపలను సంచిలో వేసుకొని ద్విచక్రవాహనంపై ఏటూరునాగారం నుంచి రొయ్యూర్, శంకరాజుపల్లిలో విక్రయించేందుకు వెళ్తున్నారు. ఈక్రమంలో 163 జాతీయ రహదారి రొయ్యూర్ సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద అశోక్ అనే వ్యక్తి కారుతో బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో బాల్నె న ర్సయ్య సుమారు 10 మీటర్ల దూరంలో ఎగిరిపడడంతో త లకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. రాంప్రసాద్‌కు తీవ్ర గాయాలుకాగా.. సామాజిక ఆస్పత్రికి అక్కడ నుంచి వరంగల్‌లోని ఆస్పత్రికి తరలించారు. నర్సయ్య మృతదేహాన్ని పోలీసులు ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి కుమారుడు రాజేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మానవత్వం చాటుకున్న తహసీల్దార్ రోడ్డు ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి కన్నాయిగూడెం తహసీల్దార్ సర్వర్ కారులో వస్తూ ప్రమాదాన్ని గమనించి ఆగారు. తీవ్రంగా గాయపడిన రాంప్రసాద్‌ను తన కారులో ఎక్కించుకొని సామాజిక ఆస్పత్రికి తరలించారు. మధ్యలో 108 రావడంతో అందులోకి ఎక్కించారు.● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి ● మరొకరి పరిస్థితి విషమం -
పనులు పూర్తిచేయాలి
రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి కేసముద్రం: కేసముద్రంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన పాలిటెక్నిక్ కళాశాల, 50 పడకల ఆస్పత్రి భవన నిర్మాణం, కేసముద్రంవిలేజ్ జెడ్పీ హైస్కూల్ ప్రహరీ నిర్మాణం, రోడ్ల విస్తరణ పనులను బుధవారం ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యే మురళీనాయక్లతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి, పాలిటెక్నిక్ కాలేజీ భవన నిర్మాణ పనులకు సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించారు. నాణ్యతతో కూడిన పనులు చేయాలని, పనుల్లో జాప్యం జరగకుండా, సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ముందుగా తన సొంత గ్రామం అర్పనపల్లిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేం నరేందర్‌రెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగేశ్వర్రావు, జిల్లా అధికార ప్రతినిధి మహేందర్‌రెడ్డి, దస్రూ నాయక్, దుర్గేష్, వెంకన్న, శ్రీని వాస్‌రెడ్డి, ఉమ, రవి, నాగరాజు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సహకరించాలిమహబూబాబాద్ అర్బన్: జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి గ్రామాల్లో సర్పంచ్‌లు, పట్టణాల్లో కౌన్సిలర్లు సహకరించాలని డీఈఓ సత్యనారాయణ మూర్తి అన్నారు. మానుకోట మున్సిపల్ పరిధిలోని అనంతారం మోడల్ స్కూల్లో బుధవారం సర్పంచ్‌లు, వార్డు కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులకు విద్యావారోత్సవాల్లో భాగంగా వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ బడులను మరింత బలోపేతం చేయడానికి సర్పంచ్ల సేవలు వినియోగించాలన్నారు. పాఠశాల విద్యాశాఖ కార్యక్రమాలు, సాధించిన విజయాలు, అమ్మ ఆదర్శ పాఠశాలల పనితీరు, పాఠశాలలో మౌలిక వసతులు, బడిబాట కార్యక్రమాలపై అవగాహన కలిగిఉండాలన్నారు. అనంతరం ఎంఈఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల చేరికలు పెరిగేలా స్థానిక ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టాలని తెలిపారు. అనంతరం సర్పంచ్‌లు, వార్డు కౌ న్సిలర్లను విద్యాశాఖ అధికారులు సన్మానించా రు. కార్యక్రమంలో హెచ్ఎంలు గిరిజ, పూజరి వీరయ్య, ఉపేందర్‌రావు, ఆరుద్ర వెంకటేశ్వ ర్లు, వార్డు కౌన్సిలర్లు రమ్య, భాస్కర్, నవీన్ పాల్గొన్నారు. -
జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి
● ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ● మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలి ● రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క మహబూబాబాద్: జిల్లాను అన్ని రంగాలత్లో అగ్రగామిగా నిలిపేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో బుధవారం ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు, తాగు నీరు, ఇందిరమ్మ ఇళ్లుతోపాటు పలు అభివృద్ధి పనులపై కలెక్టర్ స్నేహ శబరీష్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లపై మానిటరింగ్ కమిటీ, ప్రత్యేక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేయాలన్నారు. రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తొర్రూరులో డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో మున్సిపల్ ఎన్నికల సమయంలో మంత్రి శ్రీనివాస్‌రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరై ప్రారంభించని వారికి నోటీస్ ఇవ్వాలని అయినా స్పందించకుంటే రద్దు చేయాలన్నారు. జూన్‌లో రెండో విడత ఇళ్లు మంజూరు అవుతాయన్నారు. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారన తెలిపారు. అనంతరం ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో సిబ్బంది కొరత తీర్చాలని మంత్రి, రాజ్యసభ సభ్యుడిని కోరారు. డీపీఓ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తనను బదిలీ చేయాలని కోరారు. ఎంపీ పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఎమ్మెల్యే మురళీనాయక్ మాట్లాడుతూ అధికారులు అప్రమత్తంగా ఉండి ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలన్నారు. సమావేశంలో ఎస్పీ శబరీష్, మున్సిపల్ చైర్పర్సన్ గుగులోత్ జ్యోతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు షురూ మహబూబాబాద్ అర్బన్: జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి సీహెచ్.మదార్‌గౌడ్ తెలిపారు. జిల్లాలో 13 కేంద్రాల్లో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్ ప్రథమ సంవత్సరంలో మొత్తం 1,021 మంది విద్యార్థులకు 956 మంది హాజరయ్యారని తెలిపారు. ద్వితీయ సంవత్సరంలో 311 మంది విద్యార్థులకు 295 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. -
అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
● అర్థరాత్రి చెక్‌పోస్ట్ తనిఖీ చేసిన ఎస్పీ కురవి: బక్రీద్ పండుగ నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శబరీష్ అన్నారు. మంగళవారం అర్థరాత్రి కురవి చెక్ పోస్టు ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. పశువుల అక్రమ రవాణాను అరికట్టాలని, చెక్ పోస్ట్ నుంచి వెళ్లే ప్రతీ వాహనాన్ని పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలని ఆదేశించారు. పశువులను తరలిస్తున్న వాహనాలకు సంబంధించి అవసరమైన పత్రాలను పరిశీలిస్తూ అనుమానాస్పద వాహనాల పై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. సమన్వయంతో విధులు నిర్వహించాలని తెలిపారు. ప్రశాంతంగా పండుగలు జరుపుకోవాలి మహబూబాబాద్ రూరల్ : ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని ఎస్పీ శబరీష్ అన్నా రు. బక్రీద్ పండుగ సందర్భంగా గో రక్షకులు, హిందూ సంఘాల ప్రతినిధులతో మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సామాజిక మాద్యమాల్లో అసత్య ప్ర చారాలు, రెచ్చగొట్టే పోస్టులు, వదంతులు ప్రచారం చేసి శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 6 చెక్ పోస్టుల వద్ద 24 గంటలు పోలీస్ నిఘా కొనసాగుతోందని తెలిపారు. అనుమానాస్పద ఘటనలు గమనిస్తే జిల్లా కంట్రోల్ రూమ్ 87126 56999, ఎస్పీ 87126 56900, మానుకోట డీఎస్పీ 87126 56904, తొర్రూరు డీఎస్పీ 87126 56905, డయల్ 100 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. -
పేగుబంధం వదులుకుంది..! వైద్యబంధం అల్లుకుంది..!!
ఆడశిశువుకు ‘అమ్మ’ ప్రేమను పంచిన జనగామ ఎంసీహెచ్తిక్కరపు పద్మ, నరేష్ దంపతులు జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం కళ్లెం గ్రామంలో ఓ వ్యక్తి వద్ద ఇటుక తయారీ పనులు చేస్తున్నారు. నలుగురు పిల్లలు ఉన్న వీరికి మార్చి 23న ఐదో సంతానంగా చంపక్‌హిల్స్ ఎంసీహెచ్‌లో ఆడపిల్ల జన్మించింది. పుట్టుక సమయంలో పాప బరువు 1.25 కిలోలు మాత్రమే. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా ఉండడంతో వైద్యులు తక్షణ చికిత్స ప్రారంభించారు. వారం రోజుల తర్వాత పద్మ కుట్లు విప్పిన వెంటనే పాప ఆడపిల్ల కావడంతో ‘మేము సాకలేం, మీరే చూసుకోండి’ అంటూ డాక్టర్లకు చెప్పి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. అసాధారణమైన ఈ ఘటనను గమనించిన డాక్టర్ మధుసూదన్‌రెడ్డి విషయం వెంటనే చైల్డ్ వెల్ఫేర్‌శాఖకు తెలియజేశారు. అధికారులు వచ్చి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వగా, పాపను తామే పెంచుకుంటామని వారినుంచి హామీ తీసుకున్నారు. అయితే తల్లిదండ్రులు రెండు రోజులు గడవకముందే ఎవరికీ చెప్పకుండా ఆస్పత్రిలోనే పాపను వదిలేసి వెళ్లిపోయారు. వెంటనే ఆస్పత్రి రికార్డులో ఉన్న ఫోన్‌నంబర్ ఆధారంగా నరేష్‌కు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు, మీ ఊరు ఏంటి అని అడిగారు. ఒకసారి రాయలసీమ, మరోసారి ఉత్తరాంధ్ర అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు డాక్టర్లు తెలిపారు. లింగాలఘణపురం మండలం కళ్లెం గ్రామానికి వెళ్లిచూడగా వారు అక్కడినుంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు. జనగామ: నెలలు నిండకముందే 1.25 కిలోల బరువుతో పుట్టి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న పాపతో రక్తబంధం వదిలేసుకున్నారు ఆ తల్లిదండ్రులు. కానీ, ఆ పసికందును ఈ లోకంలోకి తీసుకువచ్చిన వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది మాత్రం అక్కున చేర్చుకున్నారు. రోజంతా పర్యవేక్షణ, పాల ఫీడింగ్, ప్రేమతో కూడిన సంరక్షణతో ఆ శిశువులో నెమ్మదిగా మార్పు తీసుకువచ్చారు. తల్లి దూరమైన చోట మానవత్వం వెల్లివిరిసింది. నేడు పాప బరువు 2.3 కిలోలకు చేరి ఆరోగ్యంగా మారింది. జనగామ జిల్లా చంపక్ హిల్స్ ఎంసీహెచ్ ఆస్పత్రిలో 50 రోజుల క్రితం చోటుచేసుకున్న ఘటన ఇప్పటికీ అందరినీ కదిలిస్తోంది. పేగుబంధం వదిలి వెళ్లినా.. అక్కున చేర్చుకుని పునర్జన్మనిచ్చిన ఆస్పత్రి, శిశువు కథ ఇది. అమ్మగా మారిన ఎస్ఎన్సీయూ పాపను పేగుబంధం కాదనుకున్నా.. వైద్యులు అక్కున చేర్చుకున్నారు. డాక్టర్ మధుసూదన్‌రెడ్డి పర్యవేక్షణలో పాపకు ఎస్‌ఎన్‌సీయూలో మెరుగైన వైద్యం అందిస్తూ, కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఒక్కో అనారోగ్య సమస్యకు చికిత్స చేసుకుంటూ వచ్చారు. రోజూ పాల డబ్బాతో ఫీడింగ్, అమ్మ ప్రేమ, లాలన అందిస్తూ పసిబిడ్డకు మాతృమూర్తుల్లా డాక్టర్లు, నర్సులు సంరక్షిస్తున్నారు. ఎనిమిది రోజుల వయసులో తల్లి ప్రేమ కోల్పోయిన ఈ పాపకు, ఎస్ఎన్సీయూ సిబ్బందే దేవుడిచ్చిన అమ్మలు అయ్యారు. తక్కువ బరువు నుంచి సంపూర్ణ ఆరోగ్యానికి.. 50 రోజుల చికిత్సతో పాప స్థితి రోజురోజుకూ మెరుగైందని డాక్టర్లు తెలిపారు. పాప పుట్టిన సమయంలో కిలో 250 గ్రాములు ఉండగా, ప్రస్తుత బరువు 2.300 కిలోలతో పూర్తిగా కోలుకుంది. ఎటువంటి అనారోగ్య సమస్య లేదు. బరువు 2.5 కిలోలకు చేరగానే చైల్డ్ వెల్ఫేర్ శాఖ సమన్వయంతో హనుమకొండ శిశుగృహానికి పాపను తరలించనున్నట్లు ఎంసీహెచ్ వైద్యుడు మధుసూదన్‌రెడ్డి ‘సాక్షి’కి వివరించారు.శిశువుకు అమ్మ ప్రేమను పంచుతున్న డాక్టర్, సిబ్బంది నెలలు నిండక తక్కువ బరువు, అనారోగ్య సమస్యలతో శిశువు జననం సాకలేమని వదిలివెళ్లిన తల్లిదండ్రులు.. అక్కున చేర్చుకున్న ఆస్పత్రి రక్తబంధం వదిలినా.. తల్లి ప్రేమ పంచి అన్నీ తామై చూసుకున్న వైద్యులు, సిబ్బంది 50 రోజుల్లో అద్భుతం.. బరువు పెరగడంతోపాటు సంపూర్ణ ఆరోగ్యంగా శిశువు -
మక్క రైతుల అరిగోస..
కేసముద్రం: మక్కలను అమ్ముకుందామన్న రైతులకు కష్టం తప్పడం లేదు. లారీల కొరత ఉందంటూ కేసముద్రం మార్కెట్లో మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని ఇటీవల బంద్ చేసి, డ్రా పద్ధతిలో ఎంపికై న గ్రామాలవారీగా, రైతులు తమ మక్కలను 51కేజీల చొప్పున బస్తాల్లో మక్కలను నింపుకుని, వేబ్రిడ్జిపై ట్రాక్టర్‌లోడ్ తూకం వేసి తీసుకురావాలని ఈనెల 7న అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో రైతులు తమ ఇళ్ల వద్ద, వ్యవసాయ భూముల వద్ద బస్తాలను నింపిస్తూ కాంటాలు పెట్టిస్తున్నారు. కూలీలు దొరకకపోవడంతో రైతులే నింపుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత మక్కబస్తాలను ట్రాక్టర్లో లోడ్ వేసుకుని వేబ్రిడ్జి వద్ద కాంటా పెట్టిస్తున్నారు. అయితే ఒక్కటే వేబ్రిడ్జికి కాంటా వేసేందుకు పర్మిషన్ ఇవ్వడంతో, జ్యోతిరావుపూలే సెంటర్ వరకు మక్క ట్రాక్టర్లు బారులుదీరుతున్నాయి. పైగా ఆన్లైన్లో బయోమెట్రిక్ కింద రైతులు వేలిముద్రల నమోదు, రైతుకు సంబంధించిన వివరాలను ఆన్లైన్ చేసేందుకుగాను, ఒక్కో రైతుకు 20నిమిషాలు పడుతుండటంతో కౌంటర్ వద్ద పడిగాపులు పడుతున్నారు. తీరా అన్లోడ్ చేయాలంటే గంటల తరబడిగా ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు అదనపు భారం మార్క్‌ఫెడ్ ద్వారా పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మక్కలను కొనుగోలు చేసే క్రమంలో బస్తాలు సంబంధిత అధికారులే అందించాల్సి ఉంది. అయితే కేసముద్రం మార్కెట్లో ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్‌ను బంద్ చేయడంతో, ఆయా గ్రామాల్లో రైతులే ఒక్కో బస్తాను రూ.25 నుంచి రూ.36 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. 51కేజీల చొప్పున బస్తాల్లో మక్కలను నింపడానికి, కాంటా పెట్టడానికి, ఒక్కో బస్తాకు రూ.30 నుంచి రూ.40లను కూలీలకు చెల్లిస్తున్నట్లు రైతులు తెలుపుతున్నారు. ట్రాక్టర్ కిరాయి రోజుకు రూ.1,500 నుంచి రూ.3,000 వరకు చెల్లించాల్సి వస్తుంది. పైగా వేబ్రిడ్జిపై తూకం వేసినందుకు ట్రాక్టర్ లోడ్‌కు రూ.100 చెల్లించి మార్కెట్లో ఏర్పాటు చేసిన షెడ్డు వద్ద మక్కల బస్తాలను ఆన్లోడ్ చేసేందుకు, బస్తాకు రూ.2 చెల్లిస్తున్నారు. గోస పడతానంమార్క్ఫెడ్కు మక్కలను అమ్ముకునేందుకు ఇంటివద్దనే కూలీలతో బస్తాలను నింపించి, కాంటా పెట్టించా. బస్తాకు రూ.40 ఇచ్చా ను. ట్రాక్టర్లో 197 బస్తాలను లోడ్ వేసి వేబ్రిడ్జిపై కాంటా వేసేందుకు వస్తే, గంటల తరబడిగా ఎండలో ఉన్నా. మార్క్‌ఫెడ్‌కు అమ్ముకుందామంటే ప్రస్తుతం మార్క్‌ఫెడ్ కొనట్లేదు. అప్పటి వరకు ట్రాక్టర్ కిరాయి కట్టాల్సిందే. ఇప్పటికే ట్రాక్టర్ కిరాయి రూ.5వేల వరకు అయింది. – రమేశ్, రైతు, బిచ్యానాయక్తండా దారిపొడవునా.. మక్క ట్రాక్టర్లే.. జ్యోతిరావుపూలే సెంటర్ వద్ద ఉన్న వే బ్రిడ్జిపై కాంటా వేసేందుకు అత్యధిక సంఖ్యలో మక్క ట్రాక్టర్లు బుధవారం దారిపొడవునా బారులుదీరాయి. ఒక్కసారిగా అధిక సంఖ్యలో ట్రాక్టర్లు రావడంతో సుమా రు కిలోమీటర్ మేర రోడ్డువెంట ట్రాక్టర్లే కనిపించా యి. రోడ్డుపై వరుసగా ట్రాక్టర్లు నిలిచిఉండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. తూకం కోసం వేబ్రిడ్జి వద్ద ట్రాక్టర్ల బారులు ఆన్లైన్ నమోదు కోసమూ పడిగాపులే.. -
‘పల్లా’కు పెరుగుతున్న ప్రాధాన్యం.. సీనియర్లు నియోజకవర్గాలకే..
బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం వద్ద జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ప్రాధాన్యత పెరిగింది. ఉమ్మడి వరంగల్ పార్టీ సమావేశాలు, సమీక్షలు, కేడర్ సమావేశాలు, వ్యూహాత్మక చర్చల్లో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల హనుమకొండలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరైన రైతు సంగ్రామ సదస్సుకు పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధ్యక్షత వహించారు. తాజాగా మంగళవారం కేసీఆర్ భేటీ అనంతరం నియమించిన సభ్యత్వ నమోదు ఇన్‌చార్జ్‌ల నియామకంలోనూ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. మాజీ మంత్రి సత్యవతిరాథోడ్‌కు పాత ములుగు, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల బాధ్యతలు ఇవ్వగా.. గతంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇన్చార్జ్ గా ఉన్న జనగామ, వరంగల్, హనుమకొండ జిల్లాల బాధ్యతలను పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అప్పగించారు. గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులుగా వ్యవహరించిన పలువురు సీనియర్లను సభ్యత్వ నమోదు విషయంలో నియోజకవర్గాలకే పరిమితం చేయడం పార్టీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాక్షిప్రతినిధి, వరంగల్ : అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ.. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి కేంద్రబిందువుగా నిలిచిన ఉమ్మడి వరంగల్ జిల్లాపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రామస్థాయి నుంచి నగర, డివిజన్ల వరకు విస్తృతస్థాయిలో సభ్యత్వ నమోదు చేపట్టి మళ్లీ కేడర్‌ను కదిలించే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రెండ్రోజుల కిందట ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కీలక భేటీ నిర్వహించిన పార్టీ అధినేత కేసీఆర్ సభ్యత్వ సేకరణకు ఇన్చార్జ్ లను నియమించారు. సభ్యత్వ సేకరణకు రంగంలోకి ఇన్‌చార్జ్‌లు.. పార్టీ శ్రేణులను మళ్లీ యాక్టివ్ చేయడం, కార్యకర్తల్లో నమ్మకం పెంచడం, స్థానిక నాయకత్వాన్ని సమీకరించడం లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్‌లో అధిక సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేసి రాష్ట్రానికి రాజకీయ సంకేతం ఇవ్వాలనే ఆలోచనతో పార్టీ ముందుకు సాగుతున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలకు ఇన్‌చార్జ్‌లను నియమించారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌కు గతంలోనూ ఇన్చార్జ్గా ఉన్న ములుగు, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల బాధ్యతలు అప్పగించారు. గతంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇన్చార్జ్గా ఉన్న జనగామ, వరంగల్, హనుమకొండ జిల్లాల బాధ్యతలు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి అప్పగించారు. ఎమ్మెల్సీలు తక్కళ్లపెల్లి రవీందర్ రావుని ఖమ్మం, కొత్తగూడెం, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని మేడ్చల్–మల్కాజ్గిరి, యాదాద్రి, మెట్టు శ్రీనివాస్‌ను గద్వాల్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలకు ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. గ్రామాల వారీగా లక్ష్యాలు.. సభ్యత్వ సేకరణకు ప్లాన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈసారి కేవలం పేరుకే కాకుండా డేటా ఆధారిత రాజకీయ వ్యూహంగా మలచాలని బీఆర్ఎస్ భావిస్తోంది. గత ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఓట్లు, బూత్ వారీ బలం, స్థానిక నాయకత్వ ప్రభావం ఆధారంగా గ్రామాల వారీగా సభ్యత్వ లక్ష్యాలను ఖరారు చేస్తున్నట్లు సమాచారం. ప్రతీ మండలానికి ప్రత్యేక టార్గెట్లు ఇవ్వడంతోపాటు యువత, మహిళలు, రైతులు, విద్యార్థులు, పాత కార్యకర్తలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మాజీ ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నేతలు, మండల స్థాయి నాయకులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల నిర్వహించిన రైతు సంగ్రామ సభకు వచ్చిన స్పందనతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా గ్రామస్థాయిలో మళ్లీ పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసి, భవిష్యత్ ఎన్నికలకు సిద్ధం కావాలనే లక్ష్యంతో పార్టీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్‌లో భారీ స్థాయిలో సభ్యత్వ నమోదు జరిగితే రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి కొత్త ఊపు వస్తుందనే భావన బీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. సత్యవతిరాథోడ్పల్లా రాజేశ్వర్‌రెడ్డి -
బాస్కెట్ బాల్ కేరాఫ్ మానుకోట..
మహబూబాబాద్ : మానుకోట క్రీడలకు పుట్టినిల్లు. బాస్కెట్ బాల్, ఖోఖో క్రీడలకు కేరాఫ్. ఇందులో ప్రధానంగా బాస్కెట్ క్రీడలో వేలాది మంది రాణిస్తున్నారు. దీనికి కారణం సుమారు 65 సంవత్సరా లుగా ఒకే ప్రాంగణంలో ప్రతీ రోజు శిక్షణ ఇవ్వడ మే. అయితే సమ్మర్ మాత్రం ప్రత్యేకంగా క్యాంపులా నిర్వహించి ఉచిత శిక్షణ ఇస్తున్నారు. బాస్కె ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిబిరంలో ఆ క్రీడ నేర్చుకోవడానికి విద్యార్థులు ఆ సక్తి చూపుతున్నారు. అందుకు ప్రధాన కారణం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన వారు ఉండడం, మెడిసిన్‌లో సీట్లు సాధించి పూర్తి చేసిన వారు ఉండడమే. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలోని బాస్కెట్ బాల్ కోర్టులో సుమారు 65 సంవత్సరాలుగా ఈ క్రీడలో శిక్షణ ఇస్తున్నారు. అలాగే, కరాటే, తైక్వాండో క్రీడలపై కూడా శిక్షణ ఇస్తున్నారు. ప్రతీ వేసవిలో క్రికెట్లో శిక్షణ ఇస్తున్నారు. వేల సంఖ్యలో రాష్ట్ర స్థాయి క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో కొద్ది మంది మాత్రమే ఉండగా జాతీయ స్థాయిలో సుమారు 450 క్రీడాకారులు మంది ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో మాత్రం 2వేలకుపైగా ఉన్నారని కోచ్ వెలిశాల కుమారస్వామి తెలిపారు. ఈ క్రీడ ద్వారా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందిన వారు సుమారు 40 మంది ఉన్నారు. వీరిలో కొందరు వారానికి ఒక్క రోజైన ఆ కోర్టుకు వచ్చి ప్రాక్టీస్ చేస్తారు. సమ్మర్లో వంద మందికి పైగా శిక్షణ ఈ వేసవిలో ఉదయం 5:30 నుంచి ఉదయం 8:30 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 8 గంటల వ రకు శిక్షణ ఇస్తున్నారు. ఇందులో వందమందికి పైగా శిక్షణ పొందుతున్నారు. ముందుగా వాకింగ్, వ్యాయాయం చేయించి ఆ తర్వాత బాల్‌తో ప్రాక్టీస్ చేస్తున్నారు. బాల్స్, ఇతర పరికరాలు వారే ఉచితంగా ఇస్తున్నారు. 65 సంవత్సరాలుగా ఏ ఒక్కరి దగ్గర కూడా డబ్బులు తీసుకోలేదు. 30 సంవత్సరాలుగా కోచ్ కుమారస్వామి బాస్కెట్ బాల్ కోర్టులో సుమారు 30ఏళ్లులుగా కో చ్ కుమారస్వామి ప్రతీ సంవత్సరం వందల సంఖ్యలో క్రీడాకారులను తయారు చేస్తున్నారు. వేతనం లేకున్నా రోజూ ఉదయం, సాయంత్రం కోర్టుకు వచ్చి క్రీడాకారులకు మెళకువలు నేర్పిస్తున్నారు. సీనియర్ క్రీడాకారులు సుజిత్, గోగుల యాకయ్య రోజూ బాస్కెట్ బాల్ కోర్టుకు వచ్చి క్రీడాకారులకు శిక్షణ ఇస్తూ కోచ్‌కు సపోర్టుగా ఉంటున్నారు.జాతీయ స్థాయిలో రాణిస్తున్న అండర్– 14 విభాగంలో జాతీయ స్థాయిలో రాణిస్తున్న. బాస్కెట్ బాల్లో మంచి శిక్షణ ఇవ్వడం వల్లే నేను జాతీయ స్థాయికి ఎదిుగా. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నదే నా తపన. –జి. విశ్వతేజ్రాష్ట్ర స్థాయిలో రాణించా రాష్ట్ర స్థాయిలో నాలుగు టోర్నమెంట్లో ఆడా. క్రీడతో మంచి గుర్తింపు వచ్చింది. పలు సర్టిఫికెట్లు వచ్చాయి. హ్యపీగా ఉంది. పాఠశాల వేళల్లో కాకుండా మిగతా సమయంలో మాత్రమే ఆడుతున్నా. – సీహెచ్. పునీత్ ప్రభుత్వం చేయూతనివ్వాలి ప్రభుత్వం క్రీడాకారులకు చేయూతనిచ్చి ప్రోత్సహించాలి. కోర్టులు, ఇతరత్రా ఆట స్థలాల విషయంలో నిధులు కేటాయించి క్రీడల అభివృద్ధికి కృషి చేయాలి. 65 సంవత్సరాలుగా ఉచిత శిక్షణ ఇస్తున్నాం. ప్రభుత్వం బాస్కెట్‌బాల్ కోర్టు ప్రహరీ నిర్మాణం పూర్తి చేసి అందులో సౌకర్యాలు కల్పించాలి. కోచ్‌లను కూడా గుర్తించాలి. –వెలిశాల కుమారస్వామి, కోచ్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరుస్తున్న క్రీడాకారులు ఈ క్రీడలో సుమారు 65 సంవత్సరాలుగా ఉచిత శిక్షణ ఉదయం, సాయంత్రం వేళల్లో తర్ఫీదు ఆసక్తి చూపుతున్న విద్యార్థులు -
గ్రంఽథాలయాల అభివృద్ధికి కృషి
మహబూబాబాద్: గ్రంథాలయాలు విజ్ఞాన గని అని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని , గ్రంథాలయాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి ధనసరి సీతక్క అన్నారు. జిల్లా గ్రంథాలయం సంస్థ ఎదుట బుధవారం జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్‌గా వెన్నం శ్రీకాంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి అనంతరం పదవీ బాధ్యతలను స్వీకరించారు. గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ రియాజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరై మాట్లాడారు. గ్రంథాలయాలలో ఉన్న పుస్తకాలను చదవి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. రాజ్య సభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. మానుకోట జిల్లాను ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎంపీ పోరిక బలరాంనాయక్ మాట్లాడుతూ.. విద్యపై ఆరోగ్యంపై ప్రతీ ఒక్కరు శ్రద్ధ పెట్టాలన్నారు. ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్ మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడిన వెన్నం శ్రీకాంత్‌రెడ్డి చైర్మన్ పదవి ఇచ్చి ప్రభుత్వం సముచిత స్థానం కల్పించిందన్నారు. అనంతరం చైర్మన్ వెన్నం శ్రీకాంత్‌రెడ్డిని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గుగులోత్ జ్యోతి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు భూక్యా ఉమా, నునావత్రాధా, జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి, జాన్సీరాణి, బి.అజయ్‌సారథిరెడ్డి, విజయ్సారథిరెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు. అధికారులు సమన్వయంతో పని చేయాలి కొత్తగూడ: గ్రామాల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సీతక్క సూచించారు. మండలకేంద్రంలోని రైతువేదికలో కొత్తగూడ, గంగారం మండలాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పనులను పెంచాలని సూచించారు. కూలీల పనిదినాల ఆధారంగానే గ్రామాల్లో సీసీ రోడ్లు వస్తాయని అన్నారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ చల్ల నారాయణరెడ్డి, తహసీల్దార్ రాజు, ఎంపీడీఓ మున్వర్ పాల్గొన్నారు. మంత్రి ధనసరి సీతక్క -
యువతిపై లైంగిక దాడి
● నిందితుడి అరెస్ట్, రిమాండ్ ● వివరాలు వెల్లడించిన పోలీసులు గీసుకొండ : ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం గీసుకొండ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని మనుగొండకు చెందిన తప్పురి ఉదయ్‌శంకర్ గ్రామంలోని ఓ యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. అనంతరం ఆమెను బలవంతంగా లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత సదరు యువతి వివాహం గురించి ప్రశ్నించగా ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని, ఆమె కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరించాడు. ఇటీవల అతను సదరు యువతి ఇంటిలో రాత్రి పూట చొరబడగా స్థానికులు పట్టుకుని ప్రశ్నించడంతో తాను ఆమెను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పాడు. ఆ తర్వాత యువతి కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలతో కలిసి ఇంటికి వెళ్లి పెళ్లి విషయమై మాట్లాడగా ఉదయ్‌శంకర్, అతడి తండ్రి సమ్మయ్య, అక్క అన్నపూర్ణ బెదిరించారు. ఈ విషయమై బాధితులు మంగళవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని, బుధవారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. సమావేశంలో ఎస్సై కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. యూరియా కలిపిన నీళ్లు తాగి జీవాలు మృత్యువాత కురవి : మండల కేంద్రంలోని ఓ రైతుకు చెందిన పామాయిల్ తోటలో యూరియా కలిపిన నీళ్లు తాగి 11 గొర్రెలు, ఒక పోతు మృత్యువాత పడ్డాయి. వివరాలు ఇలా ఉన్నాయి. కురవికి చెందిన తొడుసు వెంకన్న, కాట్యాల వెంకన్న అనే గొర్రెల కాపరులకు చెందిన జీవాలను మేత నిమిత్తం బుధవారం గ్రామ శివారుకు తీసుకెళ్లారు. కురవికి చెందిన కానుగంటి బాబు చెందిన పామాయిల్ తోటలో మేస్తున్నాయి. అయితే ఆ రైతు పామాయిల్ తోటకు యూరియా మందును కలిపి డ్రిప్ ద్వారా అందించేందుకు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విషయం తెలియని గొర్రెల కాపరులు ఆ తోటలో జీవాలను మేపుతున్నారు. దాహం వేయడంతో గొర్రెలు పామాయిల్ తోటలోని చెట్ల వద్ద ఉన్న నీటిని తాగాయి. దీంతో 11 జీవాలు అక్కడిక్కడడే మృత్యువాత పడ్డాయి. రూ.2లక్షల నష్టం వాటిల్లినట్లు గొర్రెల కాపరులు బోరున విలపిస్తూ తెలిపారు. పరిహారం అందజేయాలని కోరారు. -
సంక్షిప్త సమాచారం
బావిలో పడి వృద్ధుడి మృతి గూడూరు: ప్రమాదవశాత్తు వ్యవసాయబావిలో పడి ఓ వృద్ధుడు మృతిచెందిన సంఘటన మండలంలోని గణ్యచకృతండాలో బుధవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బానోతు దేశ్య (85) మంగళవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. రాత్రి వరకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు తండాలోని బంధువుల ఇళ్లలో గాలించారు. బుధవారం ఉదయం నుంచి వెతుకుతుండగా, తండాకు చెందిన ఓ రైతు వ్యవసాయ బావిలో తేలియాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న మృతుడి తండావాసులు మృతదేహాన్ని బయటికి తీయగా, బానోతు దేశ్యగా గుర్తించారు. మలవిసర్జన కోసం నీటికోసం బావి వద్దకు వెల్లిన దేశ్య ప్రమాదవశాత్తు జారి బావిలో పడి ఉంటాడని కుటుంబ సభ్యులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గిరిధర్‌రెడ్డి తెలిపారు. చికిత్స పొందుతూ ఎఫ్ఏ మృతి కొత్తగూడ: రోడ్డు ప్రమాదంలో గాయపడిన కార్లాయి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మేడ సుధాకర్(38) హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. నాలుగు రోజుల క్రితం కిష్టాపురం క్రాస్ రోడ్డు సమీపంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. మృతుడికి బార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హనుమాన్ మాలధారుల ఇరుముడి మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బేతోలు గ్రామంలో గల ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వాముల ఇరుముడిధారణ బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆంజనేయ స్వాముల ఇరుముడి కార్యక్రమంలో గ్రామానికి చెందిన ముస్లిం భక్తుడు ఖాదర్ బాబా పాల్గొని మత సామరస్యానికి ప్రతీకగా స్వాములకు సేవలు అందించారు. నూతన కార్యవర్గం ఎన్నిక ఇనుగుర్తి: ఇనుగుర్తి మండల కేంద్రలో బుధవారం నూతనంగా మండల రెడ్డి సేవా సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బొబ్బిలి మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడిగా పర్నేకేశవ రెడ్డి, కార్యదర్శిగా జొన్నగడ్డ అశోక్ రెడ్డి, బొబ్బిలి రంజిత్ రెడ్డి, కోశాధికారిగా అనుమాండ్ల యాకుబ్ రెడ్డిలను ఎన్నుకున్నారు. పరామర్శ నెల్లికుదురు: మండలంలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన పాశం దేవయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. బుధవారం మృతుడి కుటుంబాన్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ ఎంపీ మాలోతు కవిత పరామర్శించారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి, మహేందర్, అశోక్, రమేష్, వీరయ్య, మురళీ పాల్గొన్నారు. -
కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలి
మహబూబాబాద్ రూరల్: కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలని, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని, పార్టీ అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేసిన వారికి న్యాయం చేయాలని ఎస్ఎస్యూఐ పట్టణ మాజీ అధ్యక్షుడు బల్లెం చంటి అన్నాడు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీలో 2011 నుంచి అంకితభావంతో సేవలందిస్తున్న యువ నాయకుడు పెరుమాండ్ల చరణ్గౌడ్కు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లా గ్రంథాలయం వద్ద బుధవారం నిరసన తెలిపారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని టౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈసందర్భంగా చంటి మాట్లాడుతూ.. పెరుమాండ్ల చరణ్ గౌడ్ ఎన్నో సంవత్సరాలుగా ఎన్ఎస్యూఐ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం నిరంతరం పోరాడుతూ విద్యార్థి, యువజన సమస్యలపై ఉద్యమాలు నిర్వహించారన్నారు. అక్రమ అరెస్టులు చేయడం ద్వారా యువత స్వరాన్ని అణిచివేయాలని ప్రయత్నించడం సరైన విధానం కాదన్నారు. -
పిల్లల్ని చూసేందుకు వెళ్తూ తండ్రి మృతి
మహబూబాబాద్ రూరల్: వేసవి సెలవుల సందర్భంగా అమ్మమ్మ ఇంటి వద్ద ఉన్న తన పిల్లలను చూసేందుకు వెళ్తూ ఓ హమాలీ కార్మికుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ సంఘటన మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గాంధీపురం గ్రామ శివారులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కేంద్రంలోని రంగనాయకుల గుట్ట ప్రాంతానికి చెందిన మెరుగు ఉపేందర్(34)కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఉపేందర్ ఖమ్మం పట్టణంలో హమాలీ పని చేసుకుంటూ జీవించేవాడు. ఉపేందర్ అత్తగారి ఇల్లు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామం. వేసవి సెలవుల కోసం పిల్లలు అమ్మమ్మ ఇంటికి వచ్చారు. ఈక్రమంలో పిల్లలను చూడడానికి ఉపేందర్ ఖమ్మం నుంచి తన ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకొని అక్కడి నుంచి గంధంపల్లికి వెళ్తుండగా గాంధీపురం గ్రామం దాటిన తర్వాత ఎదురుగా ధాన్యం లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉపేందర్ అక్కడికక్కడే మృతిచెందాడు. రూరల్ బ్లూకోల్ట్స్ కానిస్టేబుళ్లు హుస్సేన్, బాపూజీ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పోస్ట్‌మార్టం గదికి తరలించి భద్రపరిచారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చే ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతామని రూరల్ ఎస్సై పి.రాజు తెలిపారు. -
విద్యాభివృద్ధిలో సర్పంచులదే కీలకపాత్ర
● కలెక్టర్ స్నేహశబరీష్ కురవి: విద్యాభివృద్ధిలో సర్పంచ్‌లదే కీలకపాత్ర అని కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో కురవి హైస్కూల్లో బుధవారం కురవి, సీరోలు మండలాల సర్పంచులకు ఒక రోజు శిక్షణ(ఓరిఝెంటేషన్) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యాభివృద్ధిలో స్థానిక సంస్థల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. గ్రామ పాఠశాలల బలోపేతమే గ్రామాభివృద్దికి పునాది అని స్పష్టం చేశారు. విద్యను ప్రజా ఉద్యమంగా మార్చాలని ప్రతీ గ్రామంలో పాఠశాల అభివృద్ధికి సర్పంచ్‌లు ముందుండాలన్నారు. విద్యార్థుల హాజరు, శుభ్రత, భద్రత, తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులపై గ్రామ పంచాయతీలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. డ్రాపవుట్స్‌ను నిర్మూలించడం సర్పంచుల లక్ష్యం కావాలన్నారు. ఉపాధ్యాయులు, సర్పంచులు, పాఠశాల కమిటీలు, విద్యాశాఖ అధికారుల సమన్వయంతో నాణ్యమైన విద్యను అందించగలమని తెలిపారు. కార్యక్రమంలో డీఈఓ అల్వాల సత్యనారాయణమూర్తి, ఎంఈఓలు బాలాజీనాయక్, ఇస్లావత్ లచ్చిరాంనాయక్, ఏసీజీఈ మందుల శ్రీరాములు, ఎఫ్ఏఓ బానోత్ శంకర్‌నాయక్, సీఎంఓ వంగ సురేష్, ఏఎస్సీ సంతోష్, ఎంపీడీఓలు వీరబాబు, మహ్మద్‌గౌస్, హెచ్ఎం ఎండీ వహిద్, ఆర్పీలు ప్రవీణ్, శివప్రసాద్, లింగమూర్తి, సర్పంచ్‌లు, తదితరులు పాల్గొన్నారు. -
కుటుంబ కలహాలు..
బావిలో దూకి గర్భిణి ఆత్మహత్య● కురవిలో ఘటన కురవి: కుటుంబ కలహాలతో ఓ గర్భిణి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బుధవారం రాత్రి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కాలనీ వాసుల కథనం ప్రకారం.. కురవికి చెందిన మండలి వెంకన్న, సాలమ్మ దంపతుల కూతురును అరుణ(19)ను ఏడాది క్రితం ఇదే గ్రామానికి చెందిన గుజ్జుల శ్రీను కుమారుడు మధుకి ఇచ్చి వివాహం చేశారు. ప్రస్తుతం అరుణ ఏడు నెలల గర్భిణి. అయితే దంపతులకు కొంతకాలంగా గొడవలు జరుగుతుండడంతో అరుణ తల్లిదండ్రుల ఇంటికి వచ్చి ఉంటుంది. బుధవారం అదే కాలనీలో ఉండే మృతురాలికి భర్త మధుకు గొడవ జరిగింది. ఇందులో మధు తన భార్య గాజులు పగులగొట్టి, పుస్తెల తాడు లాక్కుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన అరుణ తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. అనంతరం అక్కడి నుంచి చెంచు కాలనీకి సమీపంలో ఉన్న వ్యవసాయ బావి వద్దకు పరుగులు పెడుతుండగా మునేశ్ అనే వ్యక్తి చూశాడు. బావిలో దూకిన అరుణను రక్షించేందుకు బావిలోకి దూకాడు. ఫలితం లేకపోవడంతో బావిపైకి చేరుకుని కాలనీకి వచ్చి విషయం తెలిపాడు. దీంతో కాలనీ వాసులు బావి వద్దకు వెళ్లి వెతుకుతూ పోలీసులకు సమాచారం అందించడంతో వారు బావి వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎస్సై సతీశ్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానికుల సాయంతో అరుణ మృతదేహాన్ని బయటకు తీశారు. అప్పుల బాధతో వడ్డెగూడెంలోయువకుడు.. జఫర్‌గఢ్: అప్పుల బాధతో ఓ యువకుడు ఒంటిపై పె ట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండల కేంద్ర శివారు వడ్డెగూడెంలో చో టు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వడ్డెగూడేనికి చెందిన కుక్కల రాజేందర్ (32) రెండేళ్ల క్రితం ఇంటి నిర్మాణం కోసం ఓ ప్రైవేట్ బ్యాంకులో రూ. 10 లక్షల లోన్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఫైనాన్స్‌లో ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. ట్రాక్టర్ సరిగా నడవకపోవడంతో ఆ వాహనం కిస్తీతో పా టు హౌసింగ్ ప్రీమియం డబ్బులు నెలనెలా చెల్లించలేకపోయాడు. ఇదే విషయాన్ని కొద్ది నెలల నుంచి కుటుంబీకులకు చెబుతూ మనోవేదనకు గురయ్యేవాడు. ఈ క్రమంలో ఈ నెల 12న రాత్రి తన భార్యకు వీడియో కాల్ చేసి అప్పులు చెల్లించకలేక ఇబ్బందులు పడుతున్నానని, ఇక నేను బతకనని ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నానని ఫోన్ కట్ చేశాడు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబీకులు రాజేందర్ కోసం గాలించగా గ్రామ శివారు మాల్చగుట్ట సమీపాన కాలిన గాయాలతో స్పృహ తప్పి పడిపోయి కనిపించాడు. దీంతో వెంటనే 108లో వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామారావు తెలిపారు. -
ఉపాధి రక్షణ కోసం పోరాడాలి
మరిపెడ రూరల్: కూలీ, భూమి, ఉపాధి రక్షణ కోసం కార్మికులు నిరంతరాయంగా పోరాడాలని వ్యవసాయ కార్మిక సంఘం మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య అన్నారు. బుధవారం మరిపెడ మండలం గుండెపూడి గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం 10వ మండల మహాసభలు గుండగాని మధుసూదన్ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వీరయ్య మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు గ్రామీణ పేద మహిళలకు రూ.2500 ఇస్తామని చెప్పి నెరవేర్చలేదన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు రోజుకు కనీసం రూ.600చెల్లించాలన్నారు. హామీలు నెరవేర్చకపోతే దశలవారీగా ఉద్యమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు బాణాల రాజన్న, అనంతాచారి, భయ్య నీరజ, ఎల్లయ్య పాల్గొన్నారు. -
బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి
● రాజవరంలో ఘటన చిల్పూరు: బైక్ అదుపు తప్పిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని రాజవరంలో చోటు చేసుకుంది. కుటుంబీకులు, పోలీసు ల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీరాముల వెంకటేష్(45) డీజే సౌండ్ నిర్వహిస్తుంటాడు. మంగళవారం మండలంలోని దేశాయితండాలో బొడ్రాయి ఉత్సవాలకు డీజే పెట్టడానికి వెళ్లాడు. అదే రాత్రి 12 గంటలకు పని ముగించుకుని వస్తుండగా ఇంటి సమీపంలోనే బైక్ అదుపు తప్పి పక్కన ఉన్న ఖనీని ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య మాధవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
అమ్మమ్మ చెప్పిన కథ..
అమ్మమ్మ చెప్పిన కథ.. నారాయణ నమ్మకం..ఓ గ్రామంలో కిషన్ అనే షావుకారి ఉండేవాడు. అతడికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెల వివాహం చేసినా.. కిషన్ తన సంపాదన, నిల్వ ఉన్న డబ్బులు, బంగారం విషయం మాత్రం ఎవరికీ చెప్పేవారు కాదు. ఇలా చెప్పకుండా ఇంటిలో అటుకుపై సంచిలో డబ్బులు దాచి పెట్టాడు. ఇంతలోనే అనారోగ్యంతో చనిపోయాడు. అతడి కుమారుడు రామయ్య తండ్రి ప్రారంభించిన వ్యాపారం చేసుకుంటున్నాడు. తండ్రి వద్ద సంవత్సరాలుగా పనిచేస్తున్న నారాయణ కుమారుడి వద్ద కూడా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామ దేవతల పండుగ సందర్భంగా ఊరంతా ఇల్లు శుభ్రం చేయడం, రంగులు వేయడం పనిలో నిమగ్నమయ్యారు. రామయ్య కూడా తన ఇంటిని శుభ్రం చేసే పనిని నారాయణకు అప్పగించారు. అటుకు మీద ఉన్న పాత సంచులు, బస్తాలు, సామాన్లు తీసి శుభ్రం చేస్తూ వ్యర్థాలు ఊరు చివరన ఉన్న పాతబావిలో పడేసేవారు. ఇందులో పాత సంచి మూట కట్టి ఉండడంతో బావిలో పడేయకుండా నారాయణ దానిని విప్పి చూశాడు. అందులో నోట్ల కట్టలు, బంగారు ఆభరణాలు కనిపించాయి. దురాశకు పోకుండా ఆ మూటను తన యజమాని రామయ్యకు తిరిగి ఇచ్చేశాడు. దీనిని చూసిన రామయ్యకు కళ్లు చెదిరి పోయాయి. తన వద్ద పనిచేసే నారాయణ నిజాయతీ చూసి సంబుర పడ్డారు. అందులో నుంచి కొన్ని డబ్బులు, బంగారం నారాయణకు ఇచ్చి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. దీంతో ఆశ్చర్యపోయిన నారాయణ నేనేం చేశాను సేటు.. మీ ఇంట్లో ఉన్న మూటను మీకు ఇచ్చా..అంతే కదా అన్నాడు.. కాదు నారాయణ.. రూపాయి దొరికితే ఎవరు చూడకుండా జేబులో వేసుకునే ఈ రోజుల్లో.. లక్షల రూపాయలు, బంగారు ఆభరణాలు నాకు తిరిగి ఇచ్చావు. నీ నిజాయతీకి చేతులు జోడించి దండం పెట్టకుండా ఉండలేక పోతున్నానని మరోసారి చేతులు జోడించి దండం పెట్టాడు రామయ్య. నీతి : నిజాయతీ పరుడికి దక్కిన సముచిత గౌరవం మేకల నిక్షిత, 10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, మహబూబాబాద్ -
సోలార్ విద్యుత్ కేంద్రాలతో స్థిరమైన ఆదాయం
గూడూరు: ప్రతీ ఒక్కరు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాలను వినియోగించుకోవాలని టీజీ రెడ్కో జిల్లా మేనేజర్ గంధం రాజేందర్ అన్నారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం సర్పంచ్ వాంకుడోతు సునీతకొమ్మాలునాయక్ అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు తమ ఇళ్లపైన సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని సౌరశక్తిని విద్యుత్ శక్తిగా ఉత్పత్తి చేసుకొని లబ్ధిపొందవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం సూర్యఘర్ యోజన పథకం కింద ఒక కిలోవాట్‌కు రూ.30 వేలు, 2 కిలో వాట్స్కు రూ.60వేలు, 3 కిలో వాట్లకు రూ.70వేల వరకు సబ్సిడీ ఇస్తుందన్నారు. అలాగే రైతులు పీఎం కుసుమ్ పథకంలో వ్యవసాయ భూముల్లో సోలార్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేసుకొని స్థిరమైన ఆదాయం పొందవచ్చన్నారు. ఈ పథకంలో రైతులు సంవత్సరానికి సుమారు రూ.50 నుంచి రూ.52 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. ఈసందర్భంగా అందుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్‌శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. -
శివుడి ఆశీస్సులు ప్రజలపై ఉండాలి
మరిపెడ రూరల్: పరమశివుని ఆశీస్సుల ప్రజలపై ఉండాలని ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ అన్నారు. బుధవారం మండంలోని ఎల్లంపేటలో నూతనంగా నిర్మించిన శివాలయం, బొడ్రాయిని ఇటీవల ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే శివాలయంలోని ఉమామహేశ్వర స్వామి, గ్రామ దేవాల బొడ్రాయి అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో నాయకులు గండి వీరభద్రం, బుచ్చిబాబు, వీరన్న, జర్పుల విజయ్‌కుమార్, మనోజ్, తదితరులు పాల్గొన్నారు. ఘనంగా గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ చిన్నగూడూరు: మండల కేంద్రం శివారు ఆకేరువాగు పక్కన నూతనంగా నిర్మించిన ఆలయంలో గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురోహితులు వేదమంత్రాల నడుమ అంగరంగ వైభవంగా జరిపించారు. విగ్రహ ప్రతిష్ఠ అనంతరం డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని భక్తులతో కలిసి మహోత్సవ కార్యక్రమాన్ని తిలకించారు. డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నప్రాసాద కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ బత్తెం రమేష్, ఉపసర్పంచ్ గాడిపెల్లి జీవన్, విగ్రహదాతలు గాడిపెల్లి జగన్, గాడిపెల్లి భరత్, నాయకులు గునిగంటి కమలాకర్, పిల్లి వీరన్న, ఆలయ, యాదవ సంఘం కమిటీ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు. -
గ్రామాభివృద్ధిలో విద్యే బలమైన పునాది
పెద్దవంగర: ఏ గ్రామంలోనైతే విద్యావ్యవస్థ బలంగా ఉంటుందో, ఆ గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఎంఈఓ బుదారపు శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల్లో ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా విద్యావారోత్సవాలపై సర్పంచ్‌లకు, మండలంలోని పలు పాఠశాలల హెచ్ఎంలతో సమావేశం చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతంలో సర్పంచ్ల పాత్ర వెన్నుముక వంటిందని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని చెప్పారు. చిన్నగూడూరు: విద్యా వారోత్సవాలలో భాగంగా ఎంఈఓ రవికుమార్ అధ్యక్షతన సర్పంచ్‌లకు విద్యా కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ జయ్యారం పాఠశాల హెచ్ఎం ఉషశ్రీ హాజరయ్యారు. దంతాలపల్లి: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సర్పంచ్‌లు సహాయ సహకారాలు అందించాలని ఎంఈఓ శ్రీదేవి అన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో సర్పంచ్‌లకు నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. హెచ్ఎంలు వేణు మాధవరెడ్డి, కృష్ణయ్య మధుసూదన్, సర్పంచ్‌లు పాల్గొన్నారు. పాఠశాలల అభివృద్ధిలో సర్పంచ్‌లే కీలకం నెల్లికుదురు: ప్రభుత్వ పాఠశాలల బలోపేతంలో సర్పంచ్ల పాత్ర కీలకమని ఎంఈఓ రాందాస్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సర్పంచ్‌లకు వర్క్ షాప్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సకల సదుపాయాలు డోర్నకల్: ప్రభుత్వ పాఠశాలల్లో సకల సదుపాయాలు ఉంటాయని మున్సిపల్ చైర్పర్సన్ కొండేటి రాజకుమారిహరినాథ్ తెలిపారు. స్థానిక పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్లో విద్యా వారోత్సవాల్లో మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మాదా లావణ్యాశ్రీనివాస్, ఎంఈఓ ఆంగోత్ లక్ష్మానాయక్, హెచ్ఎం బండి నర్సింహరావు, తదితరులు పాల్గొన్నారు. బయ్యారం: ప్రభుత్వవిద్య బలోపేతానికి సర్పంచులు సహకరించాలని ఎంఈఓ లక్ష్మణ్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో విద్యావారోత్సవాల్లో ఎంఈఓ మాట్లాడారు. కార్యక్రమంలో హెచ్ఎంలు ధనుంజయ్, ఉప్పలయ్య, లింగరాజు, బయ్యారం సర్పంచ్ శాంతికిషన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్‌లు కృషి చేయాలి ఇనుగుర్తి: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ రూపారాణి అధ్యక్షతన సర్పంచులతో ప్రభుత్వ బడుల అభివృద్ధి కోసం అవగాహన సదస్సును నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ పార్థసారధి సర్పంచ్ తమ్మడపల్లి కుమార్, పీడీ ప్రణయ్, హెచ్ఎంలు పాల్గొన్నారు. విద్యార్థుల సంఖ్య పెంచాలి కేసముద్రం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని, ఇందుకు సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు కీలకపాత్ర పోషించాలని ఎంఈఓ కాలేరు యాదగిరి అన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధి కేసముద్రంవిలేజ్ జెడ్పీ హైస్కూల్లో విద్యావారోత్సవాల్లో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎంలు బండారు నరేందర్, కోట కనకయ్య, రిసోర్స్ పర్సన్స్ గనె యాదగిరి, పట్నాల స్యతనారాయణ, ఎంఐఎస్ కోఆర్డినేటర్ షేక్ ఖాదర్, సిఆర్పీలు పాల్గొన్నారు. మరిపెడ: ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని మున్సిపాలిటీ చైర్పర్సన్ వీసారపు ప్రగతిశ్రీపాల్‌రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ మోడల్ స్కూల్లో విద్యాభివృద్ధిపై మరిపెడ వార్డు కౌన్సిలర్లు, సర్పంచులకు అవగాన సదస్సును మరిపెడ ఎంఈవో గాదె అనితాదేవి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ విజయానంద్, వైస్ చైర్మన్ కాలం నునీతారవీందర్రెడ్డి, ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అక్తరుద్దీన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సదస్సుకు హాజరుకాని సర్పంచ్‌లు గూడూరు: మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర హైస్కూల్లో విద్యా వారోత్సవాలలో భాగంగా మండల సర్పంచ్‌లకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు 41 మంది సర్పంచ్‌లకు గాను 8మంది మాత్రమే హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. ఉదయం 9 గంటలకు ఇన్చార్జ్ ఎంఈఓ సుజాత, గూడూరు సర్పంచ్ జ్యోతి ప్రజ్వల చేసి సదస్సును ప్రారంభించారు. ఈవిషయమై ఎంఈఓ సుజాతను అడగ్గా సర్పంచ్‌లకు సమాచారం అందించామన్నారు. భాగస్వాములు కావాలి గార్ల: ప్రభుత్వ పాఠశాల అభివృద్ధిలో సర్పంచ్‌లు భాగస్వాములు కావాలని ఎంఈఓ మంకిడి వీరభద్రం సూచించారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం వెంకటేశ్వర్లు, సర్పంచ్‌లు గంగావత్ రాంసింగ్, బానోత్ పార్వతి హతీరాం పాల్గొన్నారు. -
‘ఆది’కి మించి అదిరేలా..
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో గతేడాది మే నెలలో నిర్వహించిన సరస్వతీనది ఆది పుష్కరాలకు మించి ఈనెల 21 నుంచి జరుగనున్న సరస్వతీనది అంత్య పుష్కరాలకు భారీ ఎత్తున డెకరేషన్ ఏర్పాట్లు చేపట్టారు. సినీ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ కంపెనీతో సరస్వతీఘాట్ వద్ద తోరణాలు, డిజైన్స్, నందులు, ఏనుగు, ఇతర బొమ్మలు మర్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాత్రి, పగలు అనే తేడా లేకుండా వందలాది మంది కార్మికులు పని చేస్తున్నారు. ఈనెల 20 వరకు పనులనీ పూర్తి చేసేలాగా అక్కడే తమకు కావాల్సిన డెకరేషన్ తయారు చేసి రంగులు వేస్తున్నారు. అబ్బుర పరిచేలా సెట్టింగ్‌లు చేపడతుండగా గ్రామస్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. అంత్య పుష్కరాలకు భారీగా డెకరేషన్ ఏర్పాట్లు -
తారు పోసేదెన్నడు?
బయ్యారం: రహదారి నిర్మాణం ప్రారంభించి రెండు సంవత్సరాల ఏడు నెలలు పూర్తయిన రోడ్డు తారుకు మాత్రం నోచుకోవటం లేదు. కంకరపోసి అసంపూర్తిగా వదిలేసిన రహదారిపై వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా ఉంది. అసలు రహదారి పనులు ఎప్పుడు పూర్తి అవుతాయోనని పలు పంచాయతీల వాసులు ఎదురుచూస్తున్నారు. 2023లో శంకుస్థాపన.. మండలకేంద్రం నుంచి మహబూబాబాద్ మండలం ముత్యాలమ్మగూడెం వరకు యస్టీయస్డీఎఫ్ నిధులతో రహదారిని నిర్మించేందుకు అప్పటి మంత్రి సత్యవతిరాథోడ్ శంకుస్థాపన చేశారు. రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా బయ్యారం చివరి నుంచి చోక్లాతండా వరకు ఉన్న బీటీ రోడ్డును రెండు వరుసల రహదారి కోసం తొలగించి కంకరపోశారు. కంకరపోసి సంవత్సరన్నర గడిచినప్పటికీ తారును మాత్రం పోయలేదు. మరో వైపు ముత్యాలమ్మగూడెం నుంచి ఉప్పలపాడు పంచాయతీలోని వట్టేరు వరకు రహదారి నిర్మాణం పూర్తి అయినప్పటికీ పూర్తిస్థాయిలో పనులు జరగకపోవటంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడ లేదు. ఏడు పంచాయతీలకు ఇదే రహదారి.. మండలంలోని ఏడు పంచాయతీలు వెంకట్రాంపురం, బాల్యాతండా, బాలాజీపేట, గౌరారం, గురిమెళ్ల, ఉప్పలపాడు, నర్సాతండా గ్రామపంచాయతీల పరిధిలోని పలు గ్రామాల వాసులు పలు పనుల నిమిత్తం నిత్యం మండల కేంద్రానికి వాహనాల ద్వారా రాకపోకలు కొనసాగిస్తుంటారు. రహదారి సరిగా లేకపోవటంతో అవస్థలు పడుతున్నామని ఈ విషయాన్ని అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెల్లిన ఫలితం లేకుండా పోతుందని వాహనదారులు వాపోతున్నారు. రోడ్డు పనులు ప్రారంభమై రెండున్నరేళ్లు ఇబ్బంది పడుతున్న వాహనదారులు బయ్యారం చివరి నుంచి చోక్లాతండా వరకు కంకర పనులు పూర్తయ్యాయి. తారు పోస్తే వాహనదారులకు సౌకర్యవంతంగా ఉంటుంది. తారుపోయాలని కాంట్రాక్టర్‌కు సూచించాం. త్వరలోనే పనులు పూర్తి చేసి, వాహనదారుల ఇబ్బందులు తొలగిస్తాం. – అనిల్, ఆర్అండ్బీ ఏఈ -
పోలీసు లాంఛనాలతో జవాన్ అంత్యక్రియలు
గూడూరు: మండలంలోని సీతానగరం గ్రామానికి చెందిన బొమ్మగాని శ్రీనివాస్‌గౌడ్ అనే సీఆర్పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ (జవాన్) శ్రీనగర్‌లో జరిగిన ప్రమాదంలో సోమవారం మృతిచెందిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి జవాన్ భౌతికకాయాన్ని తీసుకురాగా, బుధవారం ఉదయం సీఆర్పీఎఫ్ పోలీసు లాంఛనాలతో స్వగ్రామం సీతానగరంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఎమ్మెల్యే మురళీనాయక్, మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్, మాజీ ఎంపీ మాలోతు కవిత జవాన్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. శతాధిక వృద్ధురాలి మృతి పెద్దవంగర: నూరు వసంతాలు దాటి, ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఒక నిండు ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. పెద్దవంగర మండల కేంద్రానికి చెందిన ఎండీ అల్లేమ్మ (106) బుధవారం కాలం చేశారు. కొంత కాలంగా వయో భారంతో బాధ పడుతూ ఆమె తుది శ్వాస విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లారు. అల్లేమ్మకు ముగ్గురు కుమార్తెలు ఉండగా.. ఏకంగా 62మంది మనుమలు, మునిమనుమలు ఉన్నారు. నాలుగు తరాలను ఆమె కళ్లారా చూశారు. శతాబ్ధి కాలం పాటు సాగిన ఆమె సుదీర్ఘ ప్రయాణం ముగియడంతో గ్రామస్తులు, బంధువులు ఘన నివాళులర్పించారు. లీకేజీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి మహబూబాబాద్ అర్బన్: వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పేపర్ లీకేజ్‌కి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మునుగాల మహేష్, బోనగిరి మధు అన్నారు. జిల్లా కేంద్రంలోని పీడీఎస్‌యూ కార్యాలయంలో బుధవారం వారు మాట్లాడారు. కార్యక్రమంలో మహేష్, రాజు, బాలు, నరేష్, తదితరులు పాల్గొన్నారు. సీపీఎంకు రాజీనామా గార్ల: తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా హరినాయక్ సీపీఎం పార్టీకి, ప్రజాసంఘాల పదవికి రాజీనామా చేస్తున్నట్లు గార్లలో ప్రకటించారు. ఈమేరకు తన రాజీనామా లేఖను బుధవారం పార్టీ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్‌కు పంపినట్లు తెలిపారు. కొందరు వ్యక్తిగత నిర్ణయాలు పార్టీలో ఆచరించడం నచ్చక పార్టీకీ, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు డోర్నకల్: మున్సిపాలిటీ పరిధిలో రెండో విడతలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని మున్సిపల్ చైర్పర్సన్ కొండేటి రాజకుమారిహరినాథ్ తెలిపారు. స్థానిక పాతడోర్నకల్లో బుధవారం ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ మాదా లావణ్యాశ్రీనివాస్, నాయకులు సుమేర్‌చంద్‌జైన్, ఎస్.వెంకటేశ్వర్లు, ఏపూరి రమణయ్య, ఖాదర్‌బాబా పాల్గొన్నారు. ‘పేదింటి కల నెరవేరింది’ కురవి: పేదల ఇంటి కల నెరవేరిందని అయ్యగారిపల్లి సర్పంచ్ జక్కులమాధవినాగన్న అన్నారు. బుధవారం గ్రామంలో సుక్కమ్మరవి దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో దొంగల జనార్ధన్‌రెడ్డి, తాడబియిన లింగబాబు, వడ్లకొండ రాములు, బుడిగె రమేష్, గజ్జి అనిల్‌కుమార్ పాల్గొన్నారు. ఉద్యోగం ఇవ్వాలి గార్ల: ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన గార్ల మండలానికి చెందిన పీడీ మాలోత్ మంగయ్య కుమారుడికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని కోరుతూ బుధవారం టీపీటీఎఫ్ సంఘం నాయకులు జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ అనురాధకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమేష్, మండల ప్రధాన కార్యదర్శి బాలాజీనాయక్, యాదగిరి, తదితరులు ఉన్నారు. -
పెళ్లికి వెళ్లొస్తూ మృత్యుఒడికి..
రేగొండ/నడికూడ: కుటుంబీకులతో కలిసి ఆనందంగా పెళ్లికి వెళ్లొస్తున్న ఓ బాలుడు మృత్యుఒడికి చేరాడు. కారు అదుపు తప్పి బోల్తా పడిన ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నారాయణపూర్ శివారులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా నడికూడ మండల కేంద్రానికి చెందిన ఊర రాజు తన భార్య మౌనిక, కూతురు తన్విత, కుమారుడు హిమాన్షు(09)ను తన అన్న కొడుకు పెళ్లికి కారులో ములుగు జిల్లా ఇంచర్లకు పంపించాడు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తిరిగి వస్తున్న క్రమంలో నారాయణపూర్ శివారులో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో హిమాన్షుతో పాటు తల్లి, అక్కకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఆరెపల్లిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. హిమాన్షును మెరుగైన వైద్యం కోసం హనుమకొండకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. కాగా, నిన్నమొన్నటి వరకు నతమ కళ్లెదుట ఆడుకున్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కుటుంబీకులు గుండెలవిసేలా రోదించారు.హిమాన్షు మృతితో కుటుంబంతోపాటు గ్రామంలో విషాదం నెలకొంది. కారు బోల్తా పడి బాలుడి మృతి నారాయణపూర్ శివారులో ఘటన -
ముగిసిన ‘బాలమంగళం’ వేసవి శిబిరం
హన్మకొండ చౌరస్తా : చిన్నారుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సృజనాత్మకతను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ‘బాలమంగళం’ బాలబాలికల వేసవి శిక్షణ శిబిరం బుధవారం ముగిసింది. ఈనెల 5వ తేదీన ప్రారంభమైన శిబిరం 9 రోజుల పాటు విద్యార్థుల ఉత్సాహభరిత భాగస్వామ్యంతో కొనసాగింది. ఈ సందర్భంగా హనుమకొండ కాకాజీ కాలనీలోని శ్రీ వివేకానంద యోగా కేంద్రంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి మాధవ స్మారక సమితి అధ్యక్షుడు కోదాటి సుధాకర్ రావు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా ఎంజీఎం రిటైర్డ్ ఆర్ఎంఓ, ఆర్ఎస్ఎస్ వరంగల్ మహానగర్ సంఘచాలక్ డాక్టర్ బందెల మోహన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలబాలికల్లో భారతీయ సంస్కృతి, సభ్యతను పెంపొందింపజేస్తున్న మాధవస్మారక సమితికి అభినందనలు తెలిపారు. నేటి డిజిటల్ యుగంలో పిల్లలకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, శారీరక దృఢత్వం పట్ల అవగాహన కల్పించడమే ఈ శిబిరం ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ సందర్భంగా బాలబాలికలు ప్రదర్శించిన యోగాసనాలు, సైన్స్ ప్రదర్శనలు హాజరైన వారిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది లెక్కల జలంధర్ రెడ్డి, మాధవస్మారక సమితి ప్రధాన కార్యదర్శి దాస్యం రామానుజం, కుటుంబ ప్రబోధన్ వరంగల్ విభాగ్ సంయోజక్ ఆర్.లక్ష్మణ్ సుధాకర్, విజ్ఞాన భారతి రాష్ట్ర కన్వీనర్ సత్తు రామనాథం, సంస్కృత భారతి పేట శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. 9 రోజుల పాటు ఉత్సాహంగా కొనసాగిన క్యాంపు -
కాకతీయుల కళావైభవాన్ని చాటుదాం
హన్మకొండ కల్చరల్: కాకతీయుల ఘన కీర్తి, సామ్రాజ్య కళా వైభవాన్ని ప్రపంచానికి చాటుదామని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి హనుమకొండలోని కాళోజీ కళా క్షేత్రంలో రేచర్ల రుద్రయ్య ప్రాంగణంలో చేతన కళా వేదిక ఆధ్వర్యంలో ఓరుగల్లు సాంస్కృతిక మహాసమ్మేళనం, కాకతీయ కళల జాతర వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నిర్వాహకులు ఆకుల నాగేశ్వర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు ముఖ్యఅతిథులుగా హాజరై ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావు, ఆర్యవైశ్య నాయకులు గట్టుమహేష్బాబు, వరంగల్ శ్రీనివాస్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించి మాట్లాడారు. కాకతీయుల కీర్తి, ప్రతిష్టలు పెంచేలా కళావేదిక ఉత్సవాలు నిర్వహిస్తోందని చెప్పారు. ఈ ఉత్సవాల్లో నాటి వైభవం ఉట్టిపడేలా సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉండడం మహాద్భుతమని కొనియాడారు. 800 ఏళ్ల చరిత్రను నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. శిల్ప కళా సంపదను పరిరక్షిస్తూ యునెస్కో గుర్తించేలా అందరం బాధ్యతగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కాకతీయ యూనివర్సిటీలో వివిధ కళల కోర్సులు ఏర్పాటు చేయాలని నిర్వాహకులు కోరగా మంత్రి అందుకు తగిన విషయాలపై చర్చిస్తానన్నారు. కాళోజీ కళాక్షేత్రం వేదికపై కళాకారులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కళాకారులు, కళాజాతర ప్రతినిధులు, వెయ్యికి మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కాకతీయ కళల జాతర వేడుకలు ప్రారంభం -
నర్సంపేటలో డ్రైవర్ శంకర్ విగ్రహం ఏర్పాటు
హన్మకొండ : ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శంకర్ విగ్రహాన్ని నర్సంపేట బస్‌డిపోలో ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి చొల్లేటి కిరణ్ తెలిపారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ వరంగల్ రీజియన్ అధ్యక్షుడు ఎస్వైకె పాషా, కార్యదర్శి జితేందర్ రెడ్డితో కలిసి మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ మజ్దూర్ యూని యన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వథామ రెడ్డిని.. చొల్లేటి కిరణ్ కలిసి శంకర్ విగ్రహం ఏర్పాటుకు ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌గా సహకరించాలని కోరుతూ వినతి పత్రం అందించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని కిరణ్ తెలిపారు. కార్యక్రమంలో టీఎంయూ నాయకులు గడ్డం రవీందర్, ఎండీ గౌస్, మూడ్ రమేశ్ నాయక్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు శ్రీధర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. విమానయాన రంగంలో విస్తృత అవకాశాలు కేయూ క్యాంపస్ : విమానయానరంగంలో విస్తృత అవకాశాలున్నాయని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి అన్నారు. మంగళవారం కాకతీయ యూనివర్సిటీలోని గణిత విభాగం సెమినార్‌హాల్‌లో పోటీ పరీక్షల శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు పెంచుకోవాలన్నారు. అనంతరం వీసీ కె. ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం, కాంపీటివ్ కోచింగ్ సెల్ డైరెక్టర్ టి. నాగయ్య మాట్లాడారు. -
రోడ్డెక్కిన మక్క రైతులు
గూడూరులో రాస్తారోకో నిర్వహిస్తున్న మక్క రైతులుగూడూరు: కాంటాలు పూర్తయినా మక్కలను తరలించడం లేదని, 20రోజులైనా కాంటాలు పెట్టడంలేదని నిరసిస్తూ మంగళవారం రైతులు రోడ్డెక్కారు. దీంతో గూడూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అరగంటకు పైగా ఆందోళన కొనసాగడంతో విషయం తెలుసుకున్న సీఐ వినయ్‌కుమార్ సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. రైతులతో మాట్లాడి సమస్య తెలుసుకున్నారు. రైతులు రవిసింగ్ రాథోడ్, బోడ చంద్రుతో పాటు పలువురు రైతులు 20రోజుల క్రితం కేంద్రానికి తీసుకొచ్చిన మక్కలు కాంటా అయినా, లారీలు రావడం లేదని చెప్పారు. దీంతో వెంటనే సీఐ మార్క్‌ఫెడ్, పీఏసీఎస్ నిర్వాహకులతో ఫోన్లో మాట్లాడి, వెంటవెంటనే లారీలు వచ్చేలా, సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పడంతో.. వారు ఈ రోజు లారీలు వస్తున్నాయని తెలి పారు. దీంతో సీఐ రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. ఆ తర్వాత పీఏసీఎస్ కార్యాలయానికి వెళ్లిన సీఐ కాంట్రాక్టర్‌తో మాట్లాడి లారీలు వచ్చేలా చేశారు. -
సహజీవనంలో విషాదం..
● పెట్రోలు పోసుకుని యువకుడి ఆత్మహత్యాయత్నం ● పరిస్థితి విషమం.. జిల్లా ఆస్పత్రికి తరలింపు జనగామ: జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డా డు. సీఐ సత్యనారాయణరెడ్డి కథనం ప్రకారం.. జిల్లాలోని బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన పసుల అఖిల్ కుటుంబం కొన్నేళ్లుగా జనగామలో నివాసముంటోంది. ఈ క్రమంలో జనగామ మండలం పెద్దపహాడ్ శివారు ఓ తండా(తల్లిగారు), నర్మెట మండలానికి(అత్తగారు)కు చెందిన ఓ వివాహితతో అఖిల్ ఏడాదిగా సహజీవనం చేస్తున్నాడు. ఆ మహిళకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం కాగా కూతురు, కుమారుడు ఉన్నారు. ఐదేళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఒంటరి జీవనం సాగిస్తున్న క్రమంలో అఖిల్ పరిచయమయ్యాడు. రెండు నెలల క్రితం సదరు మహిళ జిల్లా కేంద్రంలోని నెహ్రూపార్క్ సమీపంలో కూల్‌డ్రింక్ షాప్ ప్రారంభించింది. ఈ క్రమంలో అఖిల్ ఆమైపె అనుమానం పెంచుకుని తరచూ గొడవలు పడేవారు. దీనిపై బాధిత మహిళ ఇప్పటి వరకు రెండుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అఖిల్, అతని తల్లికి కౌన్సెలింగ్ నిర్వహించారు. నాలుగు రోజులకోసారి ఇద్దరు గొడవలు పడడం, మళ్లీ కలిసి ఉండడం పరిపాటిగా మారింది. ఇదే సమయంలో అఖిల్‌కు అనుమానం పెనుభూతంగా మారింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి బాటిల్లో పెట్రోలు తీసుకుని కూల్‌డ్రిండ్ షాప్‌నకు చేరుకున్నాడు. అక్కడికి రాగానే మహిళతో వాగ్వాదం జరగగా ఆగ్రహంతో తన శరీరంపై పెట్రోలు పోసుకుని అక్కడే నిప్పంటించుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని తీవ్ర గాయాలతో పడిపోయిన అఖిల్‌ను వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అఖిల్ పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, ఇంకా ఫిర్యాదు అందలేదని సీఐ సత్యనారాయణరెడ్డి వెల్లడించారు. దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
జిల్లా అభివృద్ధికి కృషి
● రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి మహబూబాబాద్ రూరల్ : మానుకోట జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నామని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్‌లో నూతనంగా రాజ్యసభకు ఎన్నికై న వేం నరేందర్‌రెడ్డిని కాంగ్రెస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వేం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికీ ఇళ్లు ఇవ్వలేదని, మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరు చేస్తుందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. జిల్లాను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని, స్థానికంగా రైల్వే పీఓహెచ్ ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని, జిల్లా రూపురేఖలు మారిపోతాయన్నారు. రానున్న రెండున్నర ఏళ్లలో మిగిలిన హామీలను కూడా అమలుచేసే విధంగా చూస్తున్నామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉమ అధ్యక్షతన జరిగిన అభినందన సభలో ఎంపీ పోరిక బలరాంనాయక్, ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెన్నం శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రాధాబాయి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్లు జ్యోతి, సునీత, ప్రగతి, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. -
టీజీ ఆర్పీడీసీఎల్కు ఆప్షన్ల వెల్లువ..
హన్మకొండ: రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న మూడో డిస్కం తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్‌కు వెళ్లేందుకు విద్యుత్ ఉద్యోగులు పెద్ద ఎత్తున ముందుకొచ్చారు. ఈ మేరకు ఆప్షన్లు ఎంచుకున్నారు. ముందుగా కొత్త డిస్కం ఎలా ఉంటుందో.. వెళ్లాలా? వద్దా? అని మల్లగుల్లాలు పడిన ఇంజనీర్లు, ఇతర అధికారులు, ఉద్యోగులు చివరకు పెద్ద ఎత్తున స్పందించారు. ఊహించని విధంగా ఆర్పీడీసీఎల్కు వెళ్లేందుకు ఆన్లైన్లో ఆప్షన్ ఇచ్చారు. ఏప్రిల్ 30 నుంచి ఈ నెల 8 వరకు ఆసక్తి కలిగిన అధికారులు, ఉద్యోగుల నుంచి సమ్మతి కోరింది. టీజీ ఆర్పీడీసీఎల్కు మొత్తం 2వేల మంది అధికారులు, ఉద్యోగులు అవసరమని ప్రభుత్వం జీఓలో పేర్కొంది. దీంతో రాష్ట్రంలోని టీజీ జెన్కో, టీజీ ట్రాన్స్ కో, టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్కు చెందిన ఉద్యోగుల నుంచి ఆప్షనల్ కోరారు. దీంతో ఒక్క టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి 1,252 మంది ఆప్షన్ ఇచ్చారు. సీనియార్టీ ఆధారంగా ఉద్యోగుల ఎంపిక ఆప్షన్లో పొందుపరిచిన వివరాలు.. వాస్తవ వివరాలు సరి చూసి జాబితాను మూడో డిస్కంకు పంపారు. ఈ జాబితాను పరిశీలించి ఆప్షన ఇచ్చిన వారి నుంచి సీనియార్టీ ఆధారంగా ఉద్యోగులను ఎంపిక చేస్తారు. ఈ నెల 13(నేడు)న ఉద్యోగులను ఎంపిక చేసి బదిలీ నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు. వీరు ఈ నెల 15న ప్రస్తుతం పని చేస్తున్న స్థానంలో రిలీవ్ అయి, 18న ఆర్పీడీసీఎల్లో రిపోర్టు చేయాలి. వీరికి 19న పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేస్తారు. ఈ ఉత్తర్వుల మేరకు ఈ నెల 25వ తేదీ లోపు పోస్టింగ్ పొందిన స్థానంలో జాయిన్ కావాలి. దీంతో మూడో డిస్కం పూర్తి స్వరూపం ఈ నెల 25న రానుంది. 1,252 మంది ఉద్యోగులు ఆప్షన్.. టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి మొత్తం 1,252 మంది ఉద్యోగులు ఆప్షన్ ఇచ్చారు. ఇందులో జూనియర్ లైన్మెన్లు 16 మంది, అసిస్టెంట్ లైన్ మెన్లు 271 మంది, లైన్మెన్లు 116, లైన్ ఇన్స్పెక్టర్లు 31, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్లు 4, ఫోర్మెన్లు 2, అసిస్టెంట్ ఇంజనీర్లు 115, అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్లు 61, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు 59, డివిజనల్ ఇంజనీర్లు 28, సూపరింటెండెంట్ ఇంజనీర్లు 4, ఒక చీఫ్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్లు 265, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లు 66, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్లు 10, అకౌంట్స్ ఆఫీసర్లు 5, సీనియర్ అసిస్టెంట్లు 50, జూనియర్ అసిస్టెంట్లు 20, జూనియర్ పర్సనల్ ఆఫీసర్లు 15, పర్సనల్ ఆఫీసర్లు 2, ఆర్టిజన్ గ్రేడ్‌కు చెందిన వారు 5, ఆర్టిజన్ గ్రేడ్–3కి చెందిన వారు 6, ఒకరు ఆర్టిజన్ గ్రేడ్– 4, ఒక రికార్డు అసిస్టెంట్, ఒక సివిల్ ఈఈ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఆర్పీడీసీఎల్లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రాధాన్యం ఆర్పీడీసీఎల్కు వెళ్తున్న ఉద్యోగులకు ఒక్క సారి మాత్రమే సత్వర పదోన్నతికి మినహాయింపు ఇస్తారు. బదిలీ ద్వారా పదోన్నతి పొందిన ఉద్యోగులు ఐదేళ్ల పాటు స్వచ్ఛంద పదవీ విరమణకు అవకాశం లేదు. అదే విధంగా కంపెనీ బయటకు డిప్యుటేషన్‌పై వెళ్లడానికి అర్హులు కారు. ఇప్పటికే ఆర్పీడీసీఎల్లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తారు. కంపెనీకి కావాల్సిన ఉద్యోగులు 2 వేలు ఒక్క టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి 1,252 మంది దరఖాస్తు.. పరిశీలన పూర్తి నేడు జారీ కానున్న బదిలీ నియామక ఉత్తర్వులు ఆర్పీడీసీఎల్కు బదిలీ అయిన వారు 15న రిలీవ్ ఈ నెల 25 లోపు ఉద్యోగంలో చేరాలి -
కొనుగోళ్లలో జాప్యం.. బారులుదీరిన ట్రాక్టర్లు
బయ్యారం: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. దీంతో మంగళవారం ఇల్లెందు, కొత్తగూడెం ప్రధాన రహదారిపై కిలోమీటరు మేర ధాన్యం లోడ్లతో ట్రాక్టర్లు బారులు దీరాయి. కొనుగోలు ఆలస్యం వల్ల మూడు రోజుల నుంచి రైతులు రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి కొనుగోలును వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు. అలాగే మండలంలోని పలు కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన మక్కల బస్తాలను బయ్యారంలోని ఏఎంసీ గోడౌన్లో దిగుమతి చేస్తుండడంతో అధికసంఖ్యలో మక్కల ట్రాక్టర్లు రహదారిపై బారులుదీరాయి. గార్లలో నిలిచిన సింగరేణి ఎక్స్ప్రెస్గార్ల: విద్యుత్ సాంకేతిక లోపంతో సిర్పూర్– కాగజ్‌నగర్ నుంచి భద్రాచలం రోడ్ వెళ్లే సింగరేణి ఎక్స్‌ప్రెస్ మంగళవారం గార్ల రైల్వేస్టేషన్ రెండు గంట పాటు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓహెచ్ఈ పవర్ సప్లై గార్ల నుంచి మహబూబాబాద్ వరకు నిలిచిపోవడంతో పలు స్టేషన్లలో రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కాగా, ప్ర యాణికులకు గార్లలోని ఆర్యవైశ్య సంఘం సభ్యు లు వాటర్, అరటిపండ్లు, బిస్కెట్లు అందజేశారు. అనంతరం ఎలక్ట్రికల్ టెక్నీషియన్లు వచ్చి సమస్యను పరిష్కరించడంతో ట్రైన్ ముందుకు సాగింది. అలాగే మానుకోట రైల్వే స్టేషన్లో ఖమ్మం వైపు వెళ్తున్న నవజీవన్ ఎక్స్‌ప్రెస్ గంటపాటు నిలిచి పోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. -
‘నీట్’ రద్దుపై ఆందోళన
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకుగాను దేశవ్యాప్తంగా ఈ నెల 3న నిర్వహించిన నేషనల్ ఎలిజి బులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)– 2026 రద్దు చేశారు. రాజస్థాన్‌లో పేపర్ లీక్ అయినట్లు నిర్ధారణ కావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై పలువురు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఎంత కష్టపడి చదివి రాశామని, ఇప్పుడు రద్దు అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తంగా 14 కేంద్రాల్లో కలిపి 6,059మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. స్టేషన్‌ఘన్‌పూర్: రాజస్థాన్‌లో పేపర్ లీకై ందని నిర్ధారణ కావడంతో నీట్(యూజీ) పరీక్షను ప్రభుత్వం రద్దు చేయడం బాధాకరం. నీట్ పరీక్ష కోసం లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకున్నా. పరీక్ష బాగా రాశా. ఎక్కడో పేపర్ లీక్ అయిందనే సాకుతో కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్షను రద్దు చేయడం బాధాకరం. ఇలాంటి సంఘటనలతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. ఇలాంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షల విషయంలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా ముందస్తుగా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. – వంగపండ్ల గౌతమి, జనగామ జిల్లా కాశిబుగ్గ: ఎంతో కష్టపడి నీట్–2026 ఎంట్రన్స్ పరీక్ష రాస్తే నిరాశే మిగిలింది. ఇంటర్మీడియట్లో అధిక మార్కులు సంపాదించి, నీట్ పరీక్ష కోసం సమయాన్ని వృథా చేయకుండా చదివా. ఎక్కువ మార్కులు తెచ్చుకుని పేదలకు సేవ చేసే డాక్టర్ కోర్సు చదువుకోవాలనేది నా లక్ష్యం. రాజస్థాన్ రాష్ట్రంలో పేపర్ లీక్ చేయడంతో మా ఆశలు నీరుగారాయి. మళ్లీ పరీక్ష రాస్తే గతంలో లాగా రాస్తామో, లేదోనని ఆందోళనతో ఉండాల్సి వస్తుంది. – జోగు రక్షిత, వరంగల్విద్యారణ్యపురి: నేను ఇంటర్ బైపీసీలో 1000 మార్కులకు 984 మార్కులు సాధించా. నీట్‌కు ప్రిపేరై పరీక్ష బాగా రాశా. సీటు వస్తుందనే భావనతో ఉన్నా. అయితే పేపర్ లీకై ందని నిర్ధారణ కావడంతో పరీక్ష రద్దు చేశారని తెలిసి బాధగా ఉంది. మళ్లీ మొదటి నుంచి ప్రిపేర్ కావాల్సింటుంది. మరోసారి నిర్వహించబోయే నీట్ ప్రశ్నపత్రం ఎలా వస్తుందో. ఇప్పటికై నా పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి. – ఎం. రిషిత, పున్నేలు, హనుమకొండ జిల్లా -
అంత్య పుష్కరాల్లో నిరంతర విద్యుత్
కాళేశ్వరం : జయశంకర్భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ నెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించనున్న సరస్వతీనది అంత్య పుష్కరాల్లో నిరంతర విద్యుత్ అందించనున్నట్లు టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం కాళేశ్వరంలోని పుష్కర ఘాట్, బస్టాండ్ ప్రాంతం, పార్కింగ్ ఏరియాలో చేపడుతున్న విద్యుత్ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించేందుకు ఎన్పీడీసీఎల్ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందన్నారు. ఈ క్రమంలో సంబంధిత పనుల్లో ఇప్పటికే అధిక భాగం పూర్తయ్యాయని, మిగతా పనులన్నీ ఈ నెల 15వ తేదీ లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాల సమయంలో ఎలాంటి విద్యుత్ అంతరాయాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా విద్యుత్ భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ ప్రమాదాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికా రులను ఆదేశించారు. సీఎండీ వెంట సీఈ రాజు చౌహాన్, ములుగు ఎస్ఈ బేతి భిక్షపతి, కాటారం డీఈ (ఆపరేషన్) నాగరాజు, డీఈ (టెక్నికల్) జగదీశ్, డీఈ సదానందం, లైన్ ఇన్స్పెక్టర్లు సదానందం, కిరణ్ కాంత్, సిబ్బంది పాల్గొన్నారు. 15వ తేదీలోగా ఏర్పాట్లు పూర్తి చేయాలి టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి -
పైపులైన్ మరమ్మతు
డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలపై ఇటీవల నిర్వహించిన ‘సాక్షి ఫోన్‌ఇన్’ కార్యక్రమం ఫలితాలిస్తోంది. ఈమేరకు ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కారమవుతున్నాయి. మున్సిపల్ చైర్పర్సన్ కొండేటి రాజకుమారిహరినాథ్ ఆదేశాల మేరకు మంగళవారం బీఎస్ఎన్ఎల్ టవర్ సమీపంలో రోడ్డు కింది పగిలిన పైపులైన్ మరమ్మతులు చేపట్టారు. మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ ఆదేశాల మేరకు తాగునీటి సమస్యలు పరిష్కారమవుతున్నాయని కాంగ్రెస్ నాయకులు హరినాథ్, మాదా శ్రీనివాస్ తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలి తొర్రూరు: ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అన్నారు. డివిజన్ కేంద్రంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్, డయాగ్నోస్టిక్ సెంటర్లను మంగళవారం తనిఖీ చేశారు. ఆస్పత్రుల్లోని రికార్డులు, ఔట్ పేషెంట్, ఆపరేషన్ థియేటర్లను పరిశీలించారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనల మేరకే వైద్యం అందించాలని, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం–2010 ప్రకారం నిర్వహణ చేపట్టాలన్నారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తే సీజ్ చేస్తామన్నారు. బోర్డులపై చికిత్సల ధరలు ప్రదర్శించాలన్నారు. ఇరుకు గదుల్లో ఆస్పత్రులు నిర్వహించవద్దన్నారు. లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అర్హత కలిగిన రేడియాలజిస్టు, గైనకాలజిస్ట్ మాత్రమే గర్భిణులకు స్కానింగ్ చేయాలన్నారు. తనిఖీలో ప్రోగ్రాం ఆఫీసర్ విరాజిత, వైద్యాధికారి జ్వలిత, హెచ్ఈఓ లోక్యా, మనోహర్ పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం మహబూబాబాద్ అర్బన్: మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ స్టడీ సర్కిల్ సహకారంతో యూపీఎస్, సీఎస్ఏటీ–2027 ప్రవేశ పరీక్ష శిక్షణకు అర్హులైన మైనార్టీ(క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు) అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి శ్రీనివా స్రావు మంగళవారం తెలిపారు. మహిళా అభ్యర్థ్ధులకు 33.33 శాతం సీట్లు, రిజర్వ్ కేటగిరీలో దివ్యాంగులకు 5శాతం సీట్లు కేటాయిస్తారని చెప్పారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 5లక్షలకు మించొద్దన్నారు. ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులన్నారు. ఆన్లైన్ హెచ్‌టీటీపీఎస్.సీఈటీ.సీజీజీ.గౌట్.ఇన్.టీమ్రీస్ వెబ్సైట్లో ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తు చేయాలన్నారు. జూన్ 14న జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు. పూర్తి వివరాలకు 91825 40680 ఫోన్ నంబర్లో సంప్రదించాలన్నారు. ఐటీఐ కళాశాలలో ప్రవేశాలకు.. తెలంగాణ ఉపాధి శిక్షణశాఖ ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీ కళాశాలల్లో మొదటి విడత ప్రవేశాలకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ బి. ఓంకార్ మంగళవారం తెలిపారు. ఆన్లైన్లో హెచ్‌టీటీపీఎస్.ఐటీఐ.తెలంగాణ.గౌట్.ఇన్ వెబ్సైట్లో నెల 14నుంచి జూన్ 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు ప్రభుత్వ ఐటీఐ కళాశాలను సంప్రదించాలన్నారు. లక్ష్యాలు ఎంచుకుని చదవాలి కేసముద్రం: విద్యార్థులు మంచి లక్ష్యాలను ఎంచుకుని చదవాలని, అప్పుడే భవిష్యత్‌లో ఉన్నతస్థాయికి ఎదుగుతారని కేసముద్రం మున్సి పల్ చైర్పర్సన్ బానోత్ సునీతవెంకన్న, వైస్ చైర్పర్సన్ అల్లం రమనాగేశ్వర్‌రావు అన్నారు. ప్రజాపాలన–ప్రగతిప్రణాళికలో భాగంగా మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యా వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు హాజరై మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలన్నారు. అనంతరం జిజ్ఞాస స్టూడెంట్స్ స్టడీ ప్రాజెక్ట్ రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ డి.రాజు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
నాకు డ్యాన్స్ చేయడం చాలా ఇష్టం..
యోగాసనాలు వేస్తున్న విద్యార్థినులుడ్యాన్స్ నేర్చుకుంటున్న విద్యార్థినులునాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ చేయడమంటే చాలా ఇష్టం. టీవీలో పాటలు చూస్తూ నృత్యం చేస్తుంటే మా నాన్న సెలవుల్లో శిక్షణకు పంపించేవాడు. ప్రస్తుతం నృత్యంలో కొంత నైపుణ్యం సాధించా. పాఠశాలతో పాటు శ్వేతార్కమూలగణపతి దివ్య క్షేత్రంలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో డ్యాన్స్ చేస్తూ అభినందనలతో పాటు అవార్డులు, రివార్డులు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ వేసవి సెలవుల్లోనూ సిమ్మింగ్తోపాటు డ్యాన్స్ శిక్షణ తరగతులకు హాజరవుతున్నా. –కాజీపేటబి.రియాన్షా , 4వ తరగతి, కాజీపేట మహబూబాబాద్ అర్బన్: మొన్నటి వరకు పుస్తకాలతో కుస్తీపట్టిన విద్యార్థులు ప్రస్తుతం వేసవి సెలవుల్లో ఆటాపాటలతో సందడి చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో నిర్వహించిన శిక్షణ(సమ్మర్ క్యాంపు) తరగతుల్లో ఉత్సాహంగా పాల్గొని తమకు నచ్చిన క్రీడ, ఆటాపాటలు నేర్చుకుంటూ సరదాగా గడిపారు. పిల్లల్లో మానసికోల్లాసం, ఆటాపాటల్లో నైపుణ్యం పెంచడానికి గత నెల 25వ తేదీ నుంచి మొదలైన ఉచిత వేసవి శిక్షణ శిబిరాలకు హుషారుగా వచ్చి తర్ఫీదు పొందారు. డ్యాన్స్, కుట్లు, అల్లికలు, స్పోకెన్ ఇంగ్లిష్, వాలీబాల్, యోగా.. ఇలా 10 రకాల క్రీడాంశాలపై ఇచ్చిన శిక్షణలో సుమారు 300 మంది బాలబాలికలు పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు సమ్మర్ క్యాంపులు ఇలా. ఏటూరునాగారం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల, ములుగు జిల్లా చిన్నబోయినపల్లి గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాల, కొత్తగూడ సోర్ట్స్ స్కూల్లో వేసవి శిబిరాలు నిర్వహించారు. చిన్నబోయినపల్లి, మహబూబాబాద్‌లో క్యాంపునకు 100 మంది చొప్పున మొత్తం 200 మంది విద్యార్థులకు శిబిరాలు నిర్వహించారు. కంప్యూటర్ బేసిక్స్, ఆర్ట్, క్రాఫ్ట్, కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, మోహిందీ మేకింగ్, డిజైనింగ్ ఆన్ హ్యాండ్స్, అక్షరాస్యత, వ్యాసచరన, వ క్తృత్వం, కథ, రచన, కథలు చెప్పడం, పద్యాలు పాడడం, తెలుగు, ఇంగ్లిష్ స్పెల్–బీ, నృత్యం, పాటలు, సాంస్కృతి కార్యకలాపాలు, యోగా, స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు నిర్వహించారు. మోడల్ క్రీడా పాఠశాలలో.. కొత్తగూడ మోడల్ స్పోర్ట్స్ స్కూల్లో 60 మంది బాలికలు, 60 మంది బాలురకు ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, జావెలిన్‌త్రో, బాస్కెట్‌బాల్, అథ్లెటిక్స్ వంటి క్రీడల్లో శిక్షణ నిర్వహించారు. ఏప్రిల్ 25 నుంచి ఈ నెల 9వ తేదీ వరకు నిర్వహించిన ఈ శిక్షణలో విద్యార్థులకు పలు అంశాల్లో మెళకువలు నేర్పించారు.ఆడుతూ.. పాడుతూవేసవి సెలవుల్లో మండలంలోని పలు ప్రాంతాల్లోని చిన్నారులు బొమ్మల ఆటలు ఆడుతూ సందడి చేస్తున్నారు. విజ్ఞానంతోపాటు మానసికోల్లాసానికి సంబంధించిన ఆటలు ఆడుతున్నారు. టెడ్డీ బియర్లు, గురుగులతో ఆడుతూ రోజంతా ఉత్సాహంగా గడుపుతున్నారు. – ఏటూరునాగారం బొమ్మలతో ఆడుకుంటున్న చిన్నారులు చెట్టు నీడలో ఆటాపాట మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో కరాటే అకాడమీ నిర్వాహకులు అబ్బు, హుస్సేన్ బాలబాలికలకు శిక్షణ ఇస్తున్నారు. సెల్ఫోన్లు, టీవీలకు అతుక్కుపోకుండా కరాటే నేర్చుకునేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారని మాస్టర్లు తెలిపారు. ఈ శిక్షణ నెల రోజుల పాటు కొనసాగుతుందని, కరాటేతో బాలికల్లో ఆత్మరక్షణ కలుగుతుందన్నారు. – ఏటూరునాగారంఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు చోట్ల సమ్మర్ క్యాంపులు నిర్వహించాం. ఈ శిబిరాలతో విద్యార్థుల్లో విజ్ఞానం, మానసిక దృఢత్వం పెంపొందుతుంది. పిల్లలు క్రమ శిక్షణ తో అన్ని అంశాలు నేర్చుకున్నారు. –దేశీరాం నాయక్, గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుడు, మానుకోట జిల్లా వేసవి సెలవుల్లో ఆడుతూ పాడు తూ గడపడం సంతోషంగా ఉంది. తెలుగులో లఘులు, గురులు, ఇంగ్లిష్‌లో గ్రామర్, యోగాలో సూర్య నమస్కారాలు, ఆసనాలు నేర్చుకున్నాం. ఈ శిబిరం నాకు నచ్చింది. – యామిని, బాలికల ఆశ్రమ పాఠశాల ఊరట్టం, మేడారం నేను ఇంగ్లిష్ మాట్లాడానికి ఈ స్పోకెన్ తరగతులు చాలా ఉపయోగపడుతున్నాయి. సహ విద్యార్థుల మధ్య స్పీకింగ్ భయం పోగొట్టడం, ఇంగ్లిష్‌పై పట్టు సాధించేందుకు ఈ శిక్షణ సులువుగా ఉంది. – అక్షయ, బాలికల ఆశ్రమ పాఠశాల ప్రాజెక్ట్ నగర్, ములుగు జిల్లా ఏటూరునాగారం ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు కరాటేలో శిక్షణ ఇస్తున్న మాస్టర్ హుస్సేన్వేసవి సెలవుల్లో ఇరుగుపొరుగు విద్యార్థులు ఒక చోట చేరి సందడి చేస్తున్నారు. ఉదయం పది గంటలు దాటితే చాలు ఇంట్లో ఉండకుండా చల్లదనం కోసం చెట్ల కిందికి చేరుతున్నారు. అక్కడ తమకు తోచిన ఆటలు ఆడుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు. – వాజేడు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు శిబిరాలు -
వైభవంగా హనుమాన్ జయంత్యుత్సవ ర్యాలీ
మహబూబాబాద్ రూరల్ : హనుమాన్ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో భక్తులు మంగళవారం భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. మొదటగా స్థానిక పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద అంజన్నకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శోభాయమానంగా అలంకరించిన వాహనంతో కూడిన వేదికపై శ్రీ అభయాంజనేయ స్వామిని కొలువుదీర్చి తమలపాకులు, గజమాలతో అలంకరించి పూజించారు. అక్కడి నుంచి శ్రీ హనుమాన్ వానర యువసేన ఆధ్వర్యంలో వందలాది వాహనాలతో ర్యాలీ చేపట్టి ప్రధాన పురవీధుల మీదుగా జై శ్రీరామ్.. జై హనుమాన్ నినాదాలు చేస్తూ ఆధ్యాత్మిక చింతనతో పరవశించిపోయారు. చివరగా హనుమంతుని గడ్డలోని ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ర్యాలీ ముగించారు. -
ముగిసిన టీజీఎడ్‌సెట్– 2026
కేయూ క్యాంపస్: తెలంగాణ రాష్ట్రంలో బీఈడీ కళాశాలల్లో ఈ విద్యాసంవత్సరం (2026–2027) లో ప్రవేశాలకు మంగళవారం నిర్వహించిన టీజీఎడ్‌సెట్ –2026 ప్రశాతంగా ముగిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకేంద్రంలో ఏడు, వరంగల్జిల్లా నర్సంపేటలో ఒకటి మొత్తం 8 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్దకు అభ్యర్థులు ముందుగానే చేరుకున్నారు. మొదటి సెషన్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన పరీక్షకు 2,304మంది హాజరుకావాల్సి ఉండగా 1,886 మంది (81.86శాతం) హాజరయ్యారు. 418మంది గైర్హాజరయ్యారు. రెండో సెషన్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగగా 2,304 మందికి 1,926 మంది అభ్యర్థులు (83.59శాతం) హాజరయ్యారు. 378 మంది గైర్హాజరయ్యారని టీజీఎడ్‌సెట్ కన్వీన ర్ ప్రొఫెసర్ వెంకట్రామ్రెడ్డి తెలిపారు. కాగా, హనుమకొండలో పలు కేంద్రాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, వీసీ కె. ప్రతాప్‌రెడ్డి సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. అంతకుముందు టీజీఎడ్‌సెట్ ప్రశ్నపత్రాన్ని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ వి. బాలకిష్టారెడ్డి.. కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డితోకలిసి ఎంపిక చేశారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తం, సెక్రటరీ పొఫెసర్ శ్రీరామ్‌వెంకటేష్, కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, టీజీఎడ్‌సెట్ కన్వీనర్ బి.వెంకట్రామ్రెడ్డి, వివిధ విభాగాల డీన్లు రాంనాథ్ కిషన్, బి. సురేశ్‌లాల్, కె. రాజేందర్,జి. హనుమంతు, విద్యాకళా శాల ప్రిన్సిపాల్ నల్లానిశ్రీనివాస్ పాల్గొన్నారు. మొదటి సెషన్‌కు 81.86 శాతం, రెండో సెషన్ 83.59 శాతం మంది హాజరు పరీక్ష కేంద్రాలను సందర్శించిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్, వీసీ -
అజ్ఞాతం వీడిన పసునూరి
సాక్షి ప్రతినిధి, వరంగల్: సీపీఐ (మావోయిస్ట్) పార్టీ అగ్రనేత పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్ అలియాస్ సంతోశ్ ఎట్టకేలకు ఉద్యమ బాటను వదిలారు. పార్టీ సాధారణ సభ్యుడి నుంచి కేంద్ర కమిటీ నాయకుడి వరకు ఎదిగిన ఆయన జనజీవన స్రవంతిలో కలిశారు. 1982లో అజ్ఞాతంలోకి వెళ్లారు. సుమారు మూడు దశాబ్దాల పాటు మావోయిస్ట్ పార్టీ ఉద్యమంలో కొనసాగిన ఆయన మంగళవారం అడవిబాటను వదిలి పోలీసుల సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు. సోమిడి నుంచి జార్ఖండ్ వరకు.. పసునూరి నరహరి స్వస్థలం హనుమకొండ జిల్లాలోని కాజీపేట మండలం సోమిడి గ్రామం. 1980 నుంచి పీపుల్స్‌వార్‌కు అనుబంధంగా ఉన్న రాడికల్ విద్యార్థి సంఘం, రాడికల్ యూత్ లీగ్‌లలో ఆయన చురుకై న పాత్ర పోషించారు. పులి అంజయ్య, క్రాంతి రణ దేవ్, గోపగాని అయిలన్న అలియాస్ మహేశ్‌తో కలిసి వరంగల్ నగరంలో పలు కార్యక్రమాలు నిర్వహించిన నరహరి.. అనతికాలంలోనే పోలీసులకు వాంటెడ్‌గా మారారు. నిర్బంధం తీవ్రం కావడంతో 1982లో పూర్తికాలపు కార్యకర్తగా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏటూరునాగా రం, తాడ్వాయి.. ఉత్తర తెలంగాణ జిల్లాలోని వివి ధ ప్రాంతాల్లో పని చేసిన ఆయన ఆంధ్రా ఒడిశా సరిహద్దుకు బదిలీపై వెళ్లారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఉద్యమ సహచరిని పెళ్లి చేసుకుని ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఏఓబీ, ఝార్ఖంఢ్‌లో మావో యిస్ట్ ఉద్యమ విస్తరణకు కీలకంగా పని చేశారు. నరహరి పలు ఆపరేషన్స్‌లో కీలక పాత్ర పోషించినట్లుగా పోలీసు రికార్డులు చెబుతున్నాయి. నాలుగున్నర దశాబ్దాల పాటు అజ్ఞాతంలో ఉంటూ క్రమంగా మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు. ఉమ్మడి వరంగల్ నుంచి చివరి లొంగుబాటుకేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్‌లో భాగంగా పలువురు మావోయిస్టు అగ్రనేతలు ఎన్కౌంటర్లలో మృతి చెందారు. దళాలకు దళాలే మృత్యువాత పడగా.. మరికొందరు అగ్రనేతలు, మావోయిస్టుల ఆయుధాలతో సహా లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి 31 టార్గెట్‌గా చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ పూర్తయిన సందర్భంగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్ట్ అగ్రనేతలు ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి, పొలిట్‌బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్రాతో పాటు పసునూరి నరహరి అలియాస్ సంతోశ్ పేరును కూడా కేంద్రం ప్రకటించింది. ఇటీవల కాలంలో పోలీస్ కూంబింగ్‌లు మరింత ఉధృతంగా సాగుతున్న తరుణంలో కేంద్ర కమిటీ సభ్యుడు, జార్ఖండ్ ఈస్ట్ రీజినల్ బ్యూరో టెక్నికల్ విభాగం ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్న పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, అలియాస్ సంతోశ్ మంగళవారం భార్యతో కలిసి తెలంగాణ పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయారు. కాగా, ఉమ్మడి వరంగల్ నుంచి ఇంకా ఐదారుగురు మావోయిస్ట్ ఉద్యమంలో ఉన్నట్లు ప్రచారం ఉన్నా.. పోలీసు రికార్డుల్లో మాత్రం లేరు. దీంతో ఉమ్మడి వరంగల్ నుంచి పోలీసు రికార్డుల్లో కీలక నేతగా ఉన్న పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, సంతోశ్ లొంగుబాటు చివరిదిగా చెబుతున్నారు. అజ్ఞాత మావోయిస్టుల జాబితాలో ఉన్న నరహరి జనజీవన స్రవంతిలో కలవడంతో నక్సల్స్ రహిత జిల్లాగా మారిందంటున్నారు. జనజీవన స్రవంతిలోకి మావోయిస్ట్ అగ్రనేత నరహరి అలియాస్ విశ్వనాథ్ పార్టీ మెంబర్ నుంచి కేంద్ర కమిటీ సభ్యుడి వరకు.. నాలుగున్నర దశాబ్దాలపాటు ఉద్యమంలో పనిచేసిన అనుభవం జార్ఖండ్ ఇన్చార్జ్గా పనిచేసి లొంగిపోయిన నేత -
‘ఓరియంటేషన్’ విజయవంతం చేయాలి
బయ్యారం: విద్యా వారోత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించే సర్పంచ్ల ఓరియంటేషన్ కార్యక్రమాన్ని పాఠశాలల హెచ్ఎంలు విజయవంతం చేయాలని డీఈఓ సత్యనారాయణమూర్తి ఆదేశించారు. మంగళవారం బయ్యారంలోని జెడ్పీబాలుర ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించి మాట్లాడారు. పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల హాజరు, నాణ్యమైన విద్యపై గ్రామస్థాయి ప్రజాప్రతినిధుల పాత్రను బలపర్చడమే కార్యక్రమం ఉద్దేశం అన్నారు. పాఠశాలల అవసరాలు, మౌలిక వసతులు, హాజరు నమోదు పెంపునకు సర్పంచ్‌లు కృషి చేయాలన్నారు. విద్యలో నాణ్యత పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశించారు. ఏసీజీ శ్రీరాములు, ఎఫ్ఏఓ శంకర్, ఎంఈఓ లక్ష్మణ్‌రావు, హెచ్ఎం ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం చేయొద్దు
● వీసీలో సీఎం రేవంత్‌రెడ్డి మహబూబాబాద్: ధాన్యం, మక్కల కొనుగోలులో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని, ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి.. మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, లక్ష్మణ్‌కుమార్, కృష్ణారావు, శ్రీహరి, సీతక్క, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్ళి రామకృష్ణారావుతో కలసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కొనుగోళ్ల పురోగతిపై సమీక్షించారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ ధాన్యం, మక్కల కొనుగోలులో వేగం పెంచాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలన్నారు. అవసమైన లారీలు అందుబాటులో ఉంచాలన్నారు. వాహనాలు సమకూర్చని కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాత్కాలిక నిల్వ కేంద్రాలను వినియోగించాలన్నారు. మొక్కజొన్న పంట అధికంగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్ స్నేహశబరీష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. జాప్యం లేకుండా చూడాలి : కలెక్టర్ కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ స్నేహ శబరీష్ సమావేశం నిర్వహించి మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం లేకుండా చూడాలన్నారు. ప్రతీ కొనుగోలు కేంద్రానికి ప్రత్యేక అధికారులను నియమించాలన్నారు. గన్నీ బ్యాగులు ఇతర అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో పని చేయాలన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్ ఉన్నారు. -
కళతప్పిన గ్రంథాలయాలు
మహబూబాబాద్: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోస్టును రెండున్నరేళ్ల తర్వాత ఎట్టకేలకు భర్తీ చేశా రు. అయితే ఆయనకు గ్రంథాలయాల్లో పేరుకుపోయిన సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. జిల్లా గ్రంథాలయంలో మినహా మిగిలిన 13 గ్రంథాలయాల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. స్వీపర్లే వాటి నిర్వహణ చేపడుతున్నారు. ఇన్నాళ్లు చైర్మన్ లేకపోవడంతో మున్సిపాలిటీలు, జీపీల నుంచి వచ్చే కోట్ల రూపాయల పన్ను చెల్లించడంలో అఽధికారులు నిర్లక్ష్యం చేశారు. కాగా, ఆ పన్ను గ్రంథాలయాలకు చెల్లిస్తే అభివృద్ధికి అడుగులు పడుతాయి. రెండు మినహా అన్ని ఖాళీలే.. జిల్లా గ్రంథాలయానికి కార్యదర్శి లేకపోవడంతో వేరే జిల్లాకు చెందిన వ్యక్తికి ఇన్చార్జ్ ఇచ్చారు. డిప్యూటీ లైబ్రేరియన్, సీనియర్ అసిస్టెంట్, జూని యర్ అసిస్టెంట్, అటెండర్, వాచ్మెన్, తోటమాలి ఉండాలి. కానీ ఆ పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఇద్దరు లైబ్రేరియన్లు ఉండగా.. వారు వారానికి రెండు మూడు రోజులే వస్తున్నారు. సిబ్బంది లేక సమస్యలు వస్తున్నాయి. 13 శాఖ, గ్రామ గ్రంథాలయాలు.. జిల్లాలోని కేసముద్రం, నెల్లికుదురు, బయ్యారం, మరిపెడ, దంతాలపల్లి, తొర్రూరు, గూడూరు, కొత్తగూడ, ఇనుగుర్తి, డోర్నకల్, గార్లలో శాఖ గ్రంథాలయాలు ఉన్నాయి. కురవి మండల కేంద్రం, అదే మండలంలోని రాజోలులో గ్రామ గ్రంథాలయాలు ఉన్నాయి. ఆయా గ్రంథాలయాల్లో కనీస సౌకర్యాలు, పక్కా భవనాలు లేకపోవడంతో పాఠకులకు ఇబ్బందులు తప్పడం లేదు. స్వీపర్లే దిక్కు.. గ్రంథాలయాల్లో లైబ్రేరియన్, అటెండర్ ఉండాలి. కానీ 13 గ్రంథాలయాల్లో పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. దీంతో స్వీపర్లే దిక్కు అయ్యారు. దీంతో నిర్వహణ సరిగా లేక పాఠకులు ఇబ్బందులు పడుతున్నారు. పన్ను పెండింగ్‌లోనే.. గ్రంథాలయాల అభివృద్ధికి మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు ఆస్తి పన్నులో 8 శాతం చెల్లించాలి. ప్రజలు పన్ను చెల్లిస్తున్నారు. ఈ మేరకు 8శాతం పన్ను జిల్లా గ్రంథాలయ సంస్థ ఖాతాలో జమ చేయాలి. అయితే సుమారు రూ.2.5కోట్ల సెస్ బకాయిలు పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో గ్రంథాయాల అభివృద్ధి కుంటుపడింది. చైర్మన్ లేక పోవడం, ఇన్చార్జ్ కార్యదర్శి వసూళ్ల విషయంలో నిర్లక్ష్యం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎట్టకేలకు చైర్మన్ నియామకం.. 2023 డిసెంబర్ 5న అప్పటి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్‌రావు రాజీనామా చేశారు. కాగా రెండున్నర సంవత్సరాలుగా ఆ పోస్టును కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేయలేదు. ఎట్టకేలకు ఈనెల 5న రాత్రి ప్రభుత్వ కార్యదర్శి శ్రీదేవ సేన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా వెన్నం శ్రీకాంత్‌రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితియే. సమస్యల స్వాగతం.. 14 గ్రంథాలయాల్లో రెండు పోస్టులు మినహా మిగిలిన అన్ని పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. చైర్మన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పోస్టులు భర్తీ చేస్తేనే గ్రంథాలయాలు గాడిన పడుతాయి. పెండింగ్ పన్ను బకాయిలు వసూళ్లు చేయాల్సి ఉంది. శిథిలావస్థలో ఉన్న గ్రంథాలయాలు, సొంతభవనాలు లేని గ్రంథాలయాలకు పక్కా భవనాల కోసం నిధులు మంజూరు చేయించాలి. 13 లైబ్రరీలకు స్వీపర్లే దిక్కు పోస్టులన్నీ ఖాళీలు, సౌకర్యాలు నిల్ కోట్ల రూపాయల సెస్ బకాయిలు నేడు గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం నేడు ప్రమాణ స్వీకారం.. ఈనెల 13న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా వెన్నం శ్రీకాంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు మానుకోట జిల్లా గ్రంథా లయం ఎదుట సిబ్బంది ఏర్పాట్లు చేశారు. కా ర్యక్రమానికి మంత్రి ధనసరి సీతక్క, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ హాజ రుకానున్నట్లు చైర్మన్ తెలిపారు. -
మక్కలను గోదాములకు తరలించాలి
● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ మహబూబాబాద్ రూరల్ : మానుకోట వ్యవసాయ మార్కెట్లోని మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రంలో వేలాది మక్కల బస్తాలు నిల్వ ఉన్నాయి. దీంతో రైతుల పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ సాక్షి దినపత్రికలో ‘లారీలు రావు.. బస్తాలు పోవు’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం, జిల్లా అధికారులు మంగళవారం స్పందించారు. ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, అదనపు కలెక్టర్ అనిల్ కుమార్, జిల్లా మార్కెటింగ్ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ నరసింహస్వామి మానుకోట మార్కెట్ యార్డును సందర్శించారు. మక్కల బస్తాలు నిల్వ ఉన్న షెడ్లను పరిశీలించి, ఏఎంసీ పరిధిలో ఉన్న నాబార్డు గోదాము, ఇతర గోదాములను సందర్శించి పరిశీలించారు. మక్కలను త్వరగా కొనుగోలు చేసి ప్రభుత్వ గోదాములకు తరలించాలని అధికారులకు సూచించారు. మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోత్ జ్యోతిరమేష్, ఏఎంసీ వైస్ చైర్మన్ మదన్ గోపాల్ లోయ, సెక్రటరీ సుజన్ బాబు, డైరెక్టర్లు దేశెట్టి మల్లయ్య, జంగాల నరసింహారావు, వేమిశెట్టి యాకాంబ్రం, పీఏసీఎస్ సెక్రటరీ ప్రమోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీనగర్‌లో రోడ్డు ప్రమాదం
● సీతానగరం వాసి మృతి ● మృతుడు సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గూడూరు: జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ బొమ్మగాని శ్రీనివాస్‌గౌడ్ మృతి చెందాడు. ఇరవై ఏళ్లుగా సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన.. ఇటీవల హెడ్‌కానిస్టేబుల్ (అవాల్ధార్)గా పదోన్నతి పొందారు. ఈ క్రమంలో శ్రీనగర్ చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌గౌడ్‌ను సోమవారం రాత్రి బైక్ ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ విషయాన్ని సీఆర్పీఎఫ్ బలగాలు తమకు తెలిపాయని మృతుడి కుటుంబీకులు మంగళవారం తెలిపారు. శ్రీనివాస్‌గౌడ్‌కు భార్య సౌజన్య, కూతురు, కుమారుడు ఉన్నారు. శ్రీనివాస్‌గౌడ్ మృతితో కుటుంబంతోపాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, శ్రీనివాస్‌గౌడ్ అంత్యక్రియలు బుధవారం జరగనున్నట్లు సమాచారం. అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం కన్నాయిగూడెం: మావోయిస్టు ఉద్యమంలో ప్రాణా లర్పించిన అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని మాజీ మావోయిస్టు బడే చొక్కారావు అలియాస్ దా మోదర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం మండలంలోని బుట్టాయిగూడేకి విచ్చేసి గ్రామస్తులతో మాట్లాడారు. ఇంతకాలం అడవిలో ఉండి ప్రజల కోసం పనిచేసిన తాను ఇక నుంచి ప్రజాక్షేత్రంలో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గతంలో తనకు పరిచయం ఉన్న కుటుంబా లు, అమరుల కుటుంబాలను పరామర్శించి సమస్యలు తెలుసుకున్నట్లు చెప్పారు. -
లారీలు రావు.. బస్తాలు పోవు
● మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రంలో వేలకొద్ది బస్తాల నిల్వ ● పడిగాపులు కాస్తున్న రైతులు మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ప్రభుత్వం, మార్క్‌ఫెడ్ సంస్థ ఆదేశాల మేరకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మొక్కజొన్నల కొనుగోలు కేంద్రంలో వేలకొద్ది మక్కల బస్తాలు నిల్వ ఉన్నాయి. ఇటీవల 20వేల బస్తాలపైగా మక్కలు కొనుగోలు చేయగా.. సకాలంలో లారీలు రాకపోవడంతో బస్తాలు మిల్లులకు తరలించలేదు. దీంతో భారీగా పేరుకుపోయా యి. వీలున్నప్పుడు ఒక లారీ మాత్రమే వస్తుండడంతో అందులో 550 నుంచి 600 బస్తాలు మాత్రమే తరలిస్తున్నారు. మరో 10వేల బస్తాలు.. ఇప్పటి వరకు 20వేల బస్తాలు కొనుగోలు చేసి అక్కడే నిల్వ ఉండగా.. మరో 10వేల బస్తాలు నింపి ఉన్నాయి. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో మక్కలు తడిసిపోగా రైతులు వాటిని ఆరబెట్టుకొని బస్తాల్లో నింపి ఉంచారు. వేల కొద్ది బస్తాలు నిల్వ ఉండడంతో మహబూబాబాద్ మండలంతో పాటుగా చుట్టుపక్కల మండలాలకు చెందిన రైతులు మక్కలను విక్రయించేందుకు వచ్చి నెలల తరబడి వ్యవసాయ మార్కెట్లోనే పడిగాపులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. లారీలు రావడం లేదు.. మానుకోటలోని మక్కల కొనుగోలు కేంద్రానికి 83 బస్తాల మక్కలను 20 రోజుల క్రితం విక్రయించేందుకు తీసుకువచ్చా ను. ఇటీవల పీఏసీఎస్ సిబ్బంది బస్తాలు నింపి కాంటాలు పెట్టారు. లారీలు రావడంలేదని చెబుతున్నారు. ఇన్ని రోజులుగా ఇంటి నుంచి వచ్చి వెళ్తున్న క్రమంలో రూ.2వేల వరకు పెట్రోల్‌కు ఖర్చు అయ్యింది. వర్షం వచ్చినప్పుడు రైతులు చాలా ఇబ్బందిపడ్డారు. –పి.యాకయ్య, రైతు, మాధవాపురం -
విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయాలి
● కలెక్టర్ స్నేహ శబరీష్ మహబూబాబాద్ అర్బన్: వేసవి శిక్షణ శిబిరాల్లో విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాన్ని సోమవారం ఆమె సందర్శించి మాట్లాడారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా విద్యా వారోత్సవాలను ఈనెల 17వరకు నిర్వహించాలన్నారు. విద్యార్థులు క్రీడ, సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించేలా శిక్షణ ఇవ్వాలని అన్నారు. పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల్లో 100శాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ సత్యనారాయణమూర్తి, ఎంఈఓ వెంకటేశ్వర్లు, పాఠశాల హెచ్ఎం ఆరుద్ర వెంకటేశ్వర్లు, అధికారులు శ్రీరాములు, అప్పారావు, సంతోష్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.సమన్వయంతో పని చేయాలి.. మహబూబాబాద్: అధికారులు సమన్వయంతో పనిచేసి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం సంబంధిత అధికారులతో ధాన్యం, మక్కల కొనుగోళ్లు తదితర విషయాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు, రవాణా విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలు కల్పించాలన్నారు. సమావేశంలో ఎస్పీ శబరీష్, అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్ పాల్గొన్నారు. -
నేడు టీజీఎడ్ సెట్
● నిమిషం ఆలస్యమైతే నోఎంట్రీ ● 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు ● హాజరుకానున్న 4,609 మంది అభ్యర్థులు కేయూ క్యాంపస్ : తెలంగాణ రాష్ట్రంలో బీఈడీ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం 2026–2027లో ప్రవేశాలకుగాను ఈనెల 12న (నేడు) ప్రవేశ పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్)నిర్వహించబోతున్నారు. ఉమ్మడి వరంగల్ జి ల్లా కేంద్రంలో ఏడు, వరంగల్ జిల్లా నర్సంపేటలో ఒకటి మొత్తం 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో కాజీపేట సోమిడిలోని తాళ్ల పద్మావతి ఇంజనీరింగ్ కాలేజీ, బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీ, ములుగు ఎక్స్‌రోడ్‌లోని (గాయత్రీ డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ ఐటీఐ కాలేజీ), ఎర్రగట్టుగుట్టలోని ఐయాన్ డిజిటల్, హసన్‌పర్తి హైవేలోని నోబుల్ టెక్నాలజీ అండ్ సొల్యూషన్స్, గోపాల్‌పూర్‌లోని ఎన్ఎస్ గ్లోబల్ టెక్నాలజీస్, హనుమకొండ వడ్డేపల్లిలోని ఐయాన్ డిజిటల్, వరంగల్ జిల్లా నర్సంపేట లక్నెపల్లి సమీపంలోని బాలాజీ ఇన్స్టిటిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్‌లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు టీజీఎడ్‌సెట్ కన్వీనర్, కాకతీయ యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ బి. వెంకట్రామ్రెడ్డి సోమవారం తెలిపారు. టీజీఎడ్సెట్ను రెండు సెషన్లలో నిర్వహించబోతున్నారు. మొదటి సెషన్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4గంటల వరకు నిర్వహిస్తారు. ఉదయం సెషన్‌కు 8: 30 నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 10 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండబోదు. రెండోసెషన్‌లో మధ్యాహ్నం 12: 30 గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. రెండు గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుతించబోరు. మొదటి సెషన్లో 2,304 మంది, రెండో సెషన్లో 2,305 మంది మొత్తం 4,609 మంది అభ్యర్థులు పరీక్షలు రాయబోతున్నారు. హాల్‌టికెట్, బ్లూలేదా బ్లాక్ పాయింట్ పెన్, ఐడీ ప్రూప్ తీసుకుని రావాలని వెంకట్రామ్రెడ్డి తెలిపారు. అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. -
రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా రాధాబాయి
గూడూరు: మండలంలోని రాములుతండాకు చెందిన జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నూనావత్ రాధాబాయిని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించినట్లు సోమవారం ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ పోరిక బలరాంనాయక్, రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మంత్రులు ధనసరి సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు మురళీనాయక్, రాంచంద్రునాయక్‌తో పాటు పలువురికి రాధాబాయి కృతజ్ఞతలు తెలిపారు. -
పనికి వెళ్లడం లేదని తండ్రి మందలింపు..
● మనస్తాపంతో కుమారుడి ఆత్మహత్య ● స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఘటన స్టేషన్‌ఘన్‌పూర్: పనికి వెళ్లడం లేదని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన కుమారుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన ఆంజనేయులుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు సంపత్(23) డ్రైవింగ్ చేస్తుంటాడు. ఇటీవల పనికి వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆంజనేయులు భార్య కవిత ఈనెల 10న వేములవాడకు వెళ్లగా తండ్రీకుమారులు ఇంటి వద్ద ఉన్నారు. ఆదివారం సాయంత్రం ఇంటి వద్ద ఉన్న కుమారుడిని పనికి వెళ్లకుండా ఇంట్లో ఎందుకు ఉంటున్నావని, ఇలా అయితే ఎలా బతుకుతావంటూ తండ్రి మందలించాడు. దీంతో సంపత్ మనస్తాపానికి గురయ్యాడు. రాత్రి భోజనం చేసి పడుకున్నారు. సోమవారం ఉదయం నిద్రలేచి చూడగా సంపత్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడి కనిపించాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వేణు తెలిపారు. వివాహిత ఆత్మహత్య.. ● భర్త, ఆర్మీజవాన్ రిమాండ్ గార్ల: వివాహిత మృతికి కారణమైన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై బి. సాయికుమార్ సోమవారం తెలిపారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరుకు చెందిన యోదుల సతీశ్‌కుమార్‌తో తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన శైలజకు వివాహం జరిగింది. కొంతకాలం పాటు వీరి కాపురం సజావుగానే జరిగింది. ఈ క్రమంలో 2025లో పిండిప్రోలు గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ కాంపాటి శ్రీరామ్.. శైలజకు తరచూ ఫోన్ చేస్తూ నిన్ను ప్రేమిస్తున్నానని వేధించేవాడు. ఈ విషయం భర్త సతీశ్‌కుమార్‌కు తెలియడంతో శైలజను మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన శైలజ 2025లో ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డింది. ఈ ఘటనపై మృతురాలి తల్లి కవిత ఫిర్యాదు మేరకు అల్లుడు సతీశ్‌కుమార్, ఆర్మీ జవాన్ శ్రీరా మ్ను అరెస్ట్ చేసి రిమాండ్ తలించినట్లు ఎస్సై వెల్లడించారు. -
పేకాట రాయుళ్ల అరెస్ట్
● రూ.1,32,090 నగదు స్వాధీనం హసన్‌పర్తి: భీమారంలోని ఓ పేకాట శిబిరంపై టాస్క్‌ఫోర్స్ బృందం సోమవారం రాత్రి దాడులు నిర్వహించింది. ఈ ఘటనలో రూ.1,32,090 నగ దు స్వాధీనం చేసుకోవడంతోపాటు 9 ఫోన్లు సీజ్ చేసి ఏడుగురిని అరెస్ట్ చేసింది. భీమారంలోని గణేశ్ నగర్లో కొంతకాలంగా పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందించింది. దీంతో టాస్క్‌ఫోర్స్ బృందం దాడులు నిర్వహించింది. ఇందులో పేకాట ఆడుతున్న దేశిని వీరస్వామి, లవన్‌కుమార్, శరత్‌కుమార్, దామెర నాగరాజు, సూరం మల్లికార్జున్, సుధాకర్, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం కేయూ పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు. ఇన్స్పెక్టర్ బాబులాల్, ఎస్సై సుధాకర్, సిబ్బంది గౌస్ పాషా, శ్యాంకుమార్, కేయూ ఎస్సై కల్యాణ్, సిబ్బంది పాల్గొన్నారు.ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్ ● యువకుడి దుర్మరణం నెల్లికుదురు: మక్కజొన్న లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను బైక్ వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు శివారులో చోటు చేసుకుంది. ఎస్సై చిర్ర రమేశ్ బాబు కథనం ప్రకారం.. బిహార్‌లోని రాయిగుడాకు చెందిన సంతోష్ కుమార్ కొంతకాలంగా నెల్లికుదురు మండలం నైనాలలో నివాసముంటూ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నెల్లికుదురు శివారులోని ఐకేపీ కొనుగోలు కేంద్రం నుంచి మక్కజొన్న లోడ్‌తో మహబూబాబాద్ వైపునకు అజాగ్రత్తగా ఎలాంటి ఇండికేషన్ వేయకుండా వెళ్తున్నాడు. ఈ క్రమంలో మహబూబాబాద్ టౌన్ సాయిబాబ గుడి బజార్‌కు చెందిన ముద్రగణం విశాల్ కుమార్ (38) బైక్‌పై తొర్రూరు వైపు నుంచి వస్తూ వెనుక నుంచి ట్రాక్టర్ ఢీకొన్నాడు. దీంతో తీవ్రంగా గాయపడడంతో గమనించిన స్థానికులు 108లో మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి భార్య శశాంక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ బాబు సోమవారం తెలిపారు. -
దేవుడంటే రేవంత్‌రెడ్డికి లెక్కలేదు
ఖానాపురం: దేవుడు, బడులంటే సీఎం రేవంత్‌రెడ్డికి లెక్కలేదని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. వ రంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో కూల్చివేసిన శివాలయాన్ని సోమవారం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయని, ఆలయం వద్ద 24 ఫీట్ల లోతు తవ్వి పూడ్చివేయడంలో కారణం ఏంటన్నారు. ఆర్కియాలజీ అధికారులు ఈనెల 7న ఫిర్యాదు చేస్తే కలెక్టర్ ఎందుకు కేసులు నమోదు చేయించడం లేదని ప్రశ్నించారు. గుప్తనిధుల కోస మే సీఎం రేంవత్‌రెడ్డి తవ్వకాలు జరిపించారని ఆరో పించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను అశోక్‌నగర్‌కు ఎందుకు మార్చాల్సి వచ్చిందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ దేవాలయాలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకువస్తే సీఎం రేవంత్‌రెడ్డి కూల్చివేస్తున్నాడని ఎద్దేవా చేశారు.రుణమాఫీ చేస్తామని దేవుళ్లపై ఒట్లు వేసి మాటతప్పిన వారిలో దేశంలో తొలిముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి ద యాకర్‌రావు మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి అనేక పా పాలు చేస్తున్నాడన్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ కూల్చివేతపై కలెక్టర్ ఎందుకు నోరు విప్పడం లేదని, కూల్చివేతపై కాంగ్రెస్ పెద్దల్లో భయం పుట్టుకుందన్నారు. మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, అరూరి రమేశ్, శంకర్‌నాయక్, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రో ళ్ల శ్రీనివాస్, మర్రి యాదవరెడ్డి, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, ఓడీసీఎంఎస్ మాజీ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్, నియోజకవర్గ కన్వీనర్ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎంపీపీ ప్రకాశ్‌రావు, సర్పంచ్ రమేశ్, నాయకులు వి ద్యాసాగర్‌రెడ్డి, కిషన్‌రావు, రాజశేఖర్, శ్రీనివాస్, వెంకటనారాయణ, కోటేశ్వర్రావు, వెంకటనర్స య్య, సంపత్, రాజు, దేవేందర్‌రావు పాల్గొన్నారు. శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు -
బదిలీల సందడి
సాక్షి, మహబూబాబాద్ : జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలోని అన్ని మండలాల పంచాయతీ కార్యదర్శులు డిప్యుటేషన్‌పై బదిలీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల్లో బదిలీల సందడి నెలకొంది. దీంతో ఈనెల 1నుంచి 7వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. 8వ నుంచి 15వ తేదీ వరకు ఆప్షన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. తర్వాత స్క్రూట్నీ పూర్తి చేసి ఈనెల చివర వరకు బదిలీల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. 40శాతం మందికే అవకాశం.. ప్రస్తుతం జిల్లాలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శుల్లో బదిలీకి అర్హత ఉన్నా.. వారిలో 40శాతం మందికి మాత్రమే స్థానచలనం అయ్యే అవకాశం ఉంది. జిల్లాలో మొత్తం 482 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందుల గ్రేడ్–1 కార్యదర్శులు 14మంది, గ్రేడ్–2 క్యాదర్శులు 27మంది, గ్రేడ్–3 కార్యదర్శులు 28 మంది ఉన్నారు. వీరి బదిలీ ప్రక్రియ జోనల్ స్థాయిలో ఉంటుంది. కాగా, కమిషనర్ పరిధిలో బదిలీల ప్రక్రియ ఉంటుంది. ఇక మిగిలిన గ్రేడ్–4 కార్యదర్శులు 330 మంది ఉన్నారు.73 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భార్యాభర్తల ఒకేచోట పనిచేసే అవకాశం, మెడికల్ గ్రౌండ్ కలిపి మొత్తం 40శాతం అంటే 132 మందికే బదిలీ అయ్యే అవకాశం ఉంది. సర్వీస్ జాబితా సిద్ధం.. పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసిన ఉద్యోగుల బదిలీ ప్రక్రియకు అనుగుణంగా జిల్లాలో బదిలీలు చేపట్టేందుకు జిల్లా అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లా పరిధిలో గ్రేడ్–4 కార్యదర్శుల బదిలీ మాత్రమే జరుగుతుంది. జిల్లాలో మొత్తం 330 మంది గ్రేడ్–4 కార్యదర్శులు ఉండగా.. ఇందులో 132 మందికే అవకాశం ఉంటుంది. అయితే నిబంధనల ప్రకారం ఒకే గ్రామంలో నాలుగు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన వారు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంది. అదేవిధంగా రెండు సంవత్సరాల సర్వీస్ పూర్తి అయితే బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే జిల్లాలో నాలుగు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన వారు 185 మంది ఉన్నారు. వీరికి తోడు స్పౌజ్, మెడికల్ గ్రౌండ్ ఉద్యోగులు ఉన్నారు. వీరందరిలో 40శాతం మాత్రమే బదిలీ చేస్తారు. ఇలా 132 మంది మాత్రమే బదిలీ అవుతారు. అంటే ఇంకా అర్హత ఉన్నవారిలో కూడా 53 మందికి అవకాశం రాదు. ఏజెన్సీ కార్యదర్శుల్లో బిక్కు బిక్కు.. పంచాయతీ ఎన్నికల తర్వాత జిల్లాలోని కార్యదర్శులను తాము పనిచేస్తున్న నియోజకవర్గం నుంచి డిప్యుటేషన్‌పై ఇతర నియోజకవర్గాలకు పంపించారు. కాగా చిన్న పిల్లల తల్లులు, ఆరోగ్య సమస్యలు, వయస్సు మీద పడిన వారు ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లిన వారిలో ఉన్నారు. మరికొందరు డిప్యుటేషన్‌పై ఆయా ప్రాంతాలకు వెళ్లలేమని కలెక్టర్‌కు అర్జీ పెట్టుకున్నారు. దీంతో కలెక్టర్ సాధారణ బదిలీల సందర్భంగా మీకు స్థానచలనం కల్గుతుందని చెప్పారు. ముందు మీరు విధుల్లో చేరండి.. తర్వాత మీ పరిస్థితి ఆధారంగా మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పినట్లు సమాచారం. ఇప్పుడు సాధారణ బదిలీలు అవుతున్నా.. సీనియార్టీ జాబితాలో మైదాన ప్రాంతం ఖాళీలే ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఇదే నిజమైతే.. ఏజెన్సీల్లోకి డిప్యుటేషన్‌పై వెళ్లిన కార్యదర్శుల్లో అత్యధిక జీపీలకు కొత్తవారు వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీంతో తాత్కాలికమే అనుకొని డిప్యుటేషన్‌పై వెళ్లిన వారు అక్కడే పనిచేయాల్సి వస్తుందని కార్యదర్శుల్లో చర్చ జరుగుతోంది. నాలుగేళ్ల సర్వీసు నిండిన వారిలో 40శాతం పంచాయతీ కార్యదర్శులకే స్థానచలనం అవకాశం ఈనెల చివరి వరకు ప్రక్రియ ఇప్పటికే డిప్యుటేషన్‌పై వెళ్లిన పీఎస్‌లకు అక్కడే విధులు -
ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధ్యమే..
రామవరం అనే చిన్న ఊరిలో నవ్య, కావేరి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. చదువులో ఇద్దరూ తెలివైన వారే. ఆ ఊరిలో పదో తరగతి వరకు చదువుకున్నారు. ఇద్దరికి చదువుంటే చాలా ఇష్టం. నవ్యకు డాక్టర్ కా వా లని కోరిక. కాని ఆత్మవిశ్వాసం తక్కువ. ఎవరైనా ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే అదే ఆలోచించేది. కా వేరి ధైర్యవంతురాలే కాకుండా ఆత్మవిశ్వాసం ఎక్కువ. బాగా చదువుకుని లాయరై పేదలకు సేవ చేయాలనే కోరిక. ఇద్దరు కలిసి వెళ్తుంటే గ్రామంలో పనిపాటలేని కొందరు మీరు అమ్మాయిలు.. మీకు చదువు ఎందుకు చక్కగా పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండొచ్చు. ఊరోళ్లు గొప్ప ఉద్యోగాలు చే యలేరు. మీ నుంచి కాదు అంటూ నిరుత్సాహ పరుస్తారు. నవ్య అదే ఆలోచించుకుంటూ నేను డాక్టర్‌ను కాలేనేమో అనే అనుమానంతో ఆలోచిస్తూ పెళ్లి చేసుకోవడమే మేలేమో అనుకుని నిర్ణయం మార్చుకుంటుంది. సంబంధం రావడంతో పెళ్లి చేసుకుంటుంది. కావేరి మాత్రం వారి మాటలు పట్టించుకోకుండా ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో చదువుకుని లాయర్ అవుతుంది. ఎంతో మందికి సేవ చేస్తుంది. చాలా రోజుల తర్వాత నవ్య కావేరిని కలిసి తన కుటుంబ పరిస్థితి, ఆర్థికంగా ఇబ్బందులు వివరిస్తూ నేను ధైర్యంగా చదువుకుని ఉంటే ఈ రోజు డాక్టర్‌ను అయ్యి ఎంతో మందికి సేవ చేసేదాన్ని. నా పిల్లలను కూడా మంచిగా చూసుకునేదానంటూ బాధపడుతుంది. దీనికి కావేరి ధైర్యం చెప్పింది. ఇప్పటికి బాధపడకు. మించిపోయింది ఏమీలేదు. ఏదో ఉద్యోగం సంపాదించు నేను నీకు సాయం చేస్తానంటూ నవ్యకు భరోసా ఇచ్చింది. దీంతో నవ్య ఆగిపోయిన చదువు కొనసాగిస్తుంది. కావేరి సాయంతో నవ్య మంచి ఉద్యోగం సాధిస్తుంది. ఇద్దరు కలిసి పేదలకు సేవ చేస్తూ స్నేహితులుగా మంచి పేరు తెచ్చుకుంటారు. –లింగాలఘణపురం నీతి: ఆత్మవిశ్వాసం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. – వై.అక్షయ, పదో తరగతి, లింగాలఘణపురం -
నర్సంపేట ఆర్డీఓ కార్యాలయంలో విషాదం
● గుండెపోటుతో డీఏఓ మృతి నర్సంపేట రూరల్: నర్సంపేట ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. డీఏఓ (డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్)గా విధులు నిర్వర్తిస్తున్న తిప్పరి శ్రీనివాస్ (57) గుండెపోటుతో మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా కాజీపేటకు చెందిన తిప్పరి శ్రీనివాస్ వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్డీఓ కార్యాలయంలో మూడు సంవత్సరాల నుంచి డీఏఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. నర్సంపేట ఆర్డీఓ కార్యాలయానికి శ్రీనివాస్ విధులకు హాజరయ్యారు. విధులు నిర్వర్తిస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి కిందపడిపోయాడు. వెంటనే సహ ఉద్యోగులు ఆస్పత్రికి తరలించే సరికి మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈతకు వెళ్లి విద్యార్థి మృతి ● మర్రిపల్లిగూడెంలో ఘటన కమలాపూర్ : ఈతకు వెళ్లి ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో చోటు చేసుకుంది. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. బీనవేని ఉమ, భిక్షపతి దంపతుల చిన్న కుమారుడు అజయ్(16) ఇటీవల పదో తరగతి పూర్తి చేశాడు. సోమవారం తన బంధువులు ఇద్దరితో కలిసి గ్రామంలోని పెద్దిరెడ్డి చెరువులోకి ఈతకు వెళ్లాడు. ఈసమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై మధు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరకాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ నవీన్ తెలిపారు. అక్రమ మట్టి తవ్వకాలే కారణం.. అజయ్ మృతికి అక్రమ మట్టి తవ్వకాలే కారణమని గ్రామస్తులు ఆ రోపించారు. ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి, మొరం తవ్వకా లు చేపడుతున్నారని, దీంతో చెరువులో ప్రమాదకరంగా పెద్ద గుంతలు ఏర్పడ్డాయన్నారు. ఆ గుంతల్లో పడి గతేడాది ఓ మహిళ, తాజాగా అజయ్ మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని ప్రా ణాలు పోకముందే అధికారులు స్పందించి వెంటనే చెరువులో అక్రమ మట్టి, మొరం తవ్వకాలను అరికట్టాలని వారు కోరుతున్నారు. -
విజ్ఞాన గనులు.. గిరిజన గురుకులాలు
న్యూశాయంపేట: పేద విద్యార్థులకు గిరిజన గురుకులాలు వరంగా మారనున్నాయి. వారికి కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్య, వసతి, పౌష్టికాహారం అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలు ఇప్పుడు విజ్ఞాన గనులుగా విరాజిల్లుతున్నాయి. ప్రతిభ ఉండి పేదరికంతో ఇబ్బంది పడుతున్న గిరిజన, గిరిజనేతర విద్యార్థుల కోసం ఈ విద్యాసంస్థలు మరోసారి ద్వారాలు తెరుచుకున్నాయి. 2026–27 విద్యాసంవత్సరానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ఐదు గురుకుల కళాశాలల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో అడ్మిషన్ల ప్రక్రియ ఊపందుకుంది. నేరుగా ప్రవేశానికి అవకాశం.. గిరిజన గురుకుల కళాశాలల్లో ప్రవేశానికి పదో తరగతి పూర్తి చేసిన గిరిజన (ఎస్టీ) విద్యార్థులతో పాటు ప్రభుత్వం నిర్ణయించిన గిరిజనేతర కోటా ప్రకారం ఎస్సీ, బీసీ, ఇతర వర్గాల విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. ప్రవేశ పరీక్ష రాయక పోయినా లేదా మెరిట్ జాబితాలో వెనుకబడిన వారికి ఇదొక అద్భుత అవకాశం అని చెప్పవచ్చు. ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో మొదటి సంవత్సరంలో చేరేందుకు అవకాశం కల్పించింది. ఉచిత భోజన, వసతి, యూని ఫాం, పుస్తకాలతోపాటు నాణ్యమైన బోధన, పోటీ పరీక్షలకు (జేఈఈ, నీట్) ప్రత్యేక శిక్షణ కూడా అందిస్తుంది. గిరిజన, గిరిజనేతర విద్యార్థులు నేరుగా అడ్మిషన్ పొందడానికి వీలుంది. బాలురకు ఒకటి, బాలికలకు నాలుగు కళాశాలలు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాలుగు బాలికల గురుకుల కళాశాలలు, ఒకటి బాలుర గురుకుల కళాశాలలు ఉన్నాయి. హనుమకొండ జిల్లా పరిధిలోని దేవన్నపేట గిరిజన సంక్షేమ గురుకుల (బాలికల) కళాశాల, జనగామ జిల్లా పరిధిలో పాలకుర్తి గిరిజన సంక్షేమ బాలికల గురుకుల కళాశాల, వరంగల్ జిల్లా పరిధిలోని పర్వతగిరి గిరిజన సంక్షేమ బాలికల కళాశాల, నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లిలో గిరిజన సంక్షేమ బాలికల కళాశాల, వరంగల్ జిల్లా నర్సంపేటలో గిరిజన సంక్షేమ గురుకుల బాలుర కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో సీట్ల భర్తీ.. ప్రతీ గురుకుల కళాశాలలో ఎంపీసీ, బైపీసీ గూపుల్లో 40 సీట్ల చొప్పున భర్తీ చేస్తారు. రిజర్వేషన్ ప్రకారం ఎస్టీలకు(34), ఓసీ/ఈబీసీ (1), బీసీ (1), ఎస్సీ (1), అనాథ (1), స్పోర్ట్స్ కోటా (1), పీహెచ్సీ (1)కి కేటాయింపులు ఉంటాయి. అర్హులైన విద్యార్ధులు తమ టీసీ, మెమో, స్టడీ సర్టిఫికెట్, పాస్‌ఫొటో, ఆదాయ, ఆధార్, కుల, ఆదాయ (రూరల్ పరిధి 1.50 లక్షలు, పట్టణ పరిధి రూ.2 లక్షలు) ధ్రువీకరణ పత్రాలతోపాటు రెండు సెట్ల జిరాక్స్ ప్రతులను వెంట తీసుకుని నేరుగా వరంగల్ యాకత్‌పురలోని చింతల్‌బ్రిడ్జి వద్ద ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలను ఈనెల 16వ తేదీన ఉదయం 10 గంటలకు సంప్రదించాలి. విద్యార్థులకు నాణ్యమైన బోధన, నీట్, జేఈఈలో శిక్షణ ఉమ్మడి జిల్లాలోని ఐదు కళాశాలల్లో అడ్మిషన్లు షురూ దరఖాస్తుకు ఈనెల 16వ తేదీ వరకు గడువుగిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులు ఉన్నత శిఖిరాలు అధిరోహించడానికి మంచి అవకాశం. అర్హులైన వారు గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆలస్యం చేయకుండా తమ సమీపంలోని గిరిజన గురుకుల కళాశాల ప్రిన్సిపాళ్లను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు. అవకాశం కోల్పోకుండా తమ భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలి. – డీఎస్ వెంకన్న, ఆర్సీఓ వరంగల్, కరీంనగర్ రీజియన్ -
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
● తొర్రూరు ఆర్డీఓ గణేష్ ● ప్రజావాణిలో 13 వినతులు స్వీకరణతొర్రూరు: ప్రజావాణి అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయవద్దని తొర్రూరు ఆర్డీఓ జి.గణేష్ అన్నారు. డివిజన్ కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. స్థానికుల నుంచి 13 దరఖాస్తులు అందాయి. దానిలో 10 భూ సంబంధిత, పంచాయతీరాజ్ శాఖ, ఇరిగేషన్, సర్వే శాఖకు సంబంధించినవి ఒక్కో దరఖాస్తు వచ్చాయి. తొర్రూరు, పెద్దవంగర, నెల్లికుదురు, మరిపెడ, నర్సింహులపేట, దంతాలపల్లి, చిన్నగూడూరు మండలాలకు సంబంధించిన వారు ఫిర్యాదులు ఆర్డీఓకు అందించారు. ఆర్డీఓ మాట్లాడుతూ.. ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. పరిష్కరించలేని సమస్యలు ఉంటే దరఖాస్తుదారులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో డీఎల్పీఓ పుల్లారావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ సుధీర్‌రెడ్డి, ఏఎల్ఓ రవి, సీడీపీఓ కమలాదేవి, ఆర్డీఓ కార్యాలయ ఏఓ కె.అనిల్‌కుమార్, ఎకై ్సజ్ ఎస్సై శంకర్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదులు ఇలా.. ప్రభుత్వ భూమి ఆక్రమణపై చర్యలు తీసుకోవాలి: పెద్దవంగర వాసులు డివిజన్ పరిధి పెద్దవంగరలోని డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించిన కొంత భూమిని అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించాడని, ఆ స్థలంలో ప్రహరీ సైతం నిర్మించాడని గ్రామస్తులు తెలిపారు. భూమిని ఆక్రమించడమే కాకుండా డబుల్ బెడ్రూం ఇళ్ల వెనకాల ఉన్న మొక్కలు, నీటి సరఫరా పైపులను ధ్వంసం చేశాడని తెలిపారు. ఇదేమిటని ప్రశ్నించిన గ్రామ దళితులకు ఆక్రమణదారు కోర్టు నుంచి నోటీసులు పంపించాడన్నారు. ఈ వ్యవహారంపై గ్రామస్తులు ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. నకిలీ భూ పత్రాలు సృష్టించారు : బాధితుడు ధర్మా నాయక్ తొర్రూరు మండలం కంఠాయపాలెం శివారు సీత్యాతండాకు చెందిన బానోతు ధర్మానాయక్‌కు తండాలో వారసత్వంగా సంక్రమించిన 2 ఎకరాల భూమి ఉంది. సదరు భూమికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి. సదరు భూమిపై కన్నేసిన తండాకు చెందిన ఓ వ్యక్తి నకిలీ భూ పత్రాలు సృష్టించి దాన్ని కాజేసేందుకు రెవెన్యూ అధికారులకు తప్పుడు సమాచారం అందిస్తున్నాడు. భూమి సాగు చేయకుండా అడ్డంకులు సృష్టిస్తున్న సదరు వ్యక్తికి పట్టా చేయకుండా చర్యలు తీసుకోవాలని బాధిత రైతు ఆర్డీఓను కోరారు. -
మక్కల కొనుగోళ్లలో జాప్యం
రైతుల ఆందోళన తొర్రూరు: మక్కల కొనుగోళ్లలో జాప్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజులుగా సాకులు చెబుతూ కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారంటూ సోమవారం డివిజన్ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఎదు ట రైతులు రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గన్నీ బ్యాగులు, వాహనాల కిరాయి ఖర్చులు భరించి కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే, కొనుగోలు చేయడం లేదన్నారు. కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు నెల రోజు లుగా ఎండలో మాడుతున్నామని, అకాల వర్షాలు కురుస్తున్నా పంట కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదనపు ఎస్సైలు అంజమ్మ, ఖాదర్‌పాషా ఆందోళన స్థలికి చేరుకుని రైతులతో మాట్లాడారు. లారీలు ఆలస్యంగా రావడం, గన్నీ సంచుల కొరత వల్ల మక్కల కొనుగోళ్లలో జాప్యం జరిగిందన్నారు. తక్షణమే కొనుగోళ్లు చేపట్టేలా అధికారులతో మాట్లాడతామని హామీనివ్వడంతో రైతులు శాంతించారు. సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి డోర్నకల్: మున్సిపాలిటీ పరిధిలోని సమస్యల పరిష్కారంపై మున్సిపల్ సిబ్బంది దృష్టి సారించాలని పలువురు కౌన్సిలర్లు కోరారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం చైర్ పర్సన్ కొండేటి రాజకుమారిహరినాథ్ అధ్యక్షతన నిర్వహించిన పాలకవర్గ సాధారణ సమావేశంలో 32 అంశాలతో కూడిన ఎజెండాపై చర్చ జరిపారు. పారిశుద్ధ్య సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. చెత్త సేకరణ వాహనాలకు వెంటనే మరమ్మతులు జరిపి వీధుల్లో పూర్తిస్థాయిలో చెత్త సేకరణ జరపాలని, డ్రైవర్లతో పాటు సిబ్బందిని వెంటనే నియమించాలని పలువురు కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. కౌన్సిల్ అనుమతిస్తే పారిశుద్ధ్య పనులను ప్రత్యేక ఏజెన్సీకు అప్పగిస్తామని కమిషనర్ బి.నిరంజన్ తెలిపారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, నీటి సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు. పట్టణ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని కౌన్సిలర్లు కోరారు. మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై దృష్టి సారించినట్లు చైర్పర్సన్ రాజకుమారి తెలిపారు. వైస్ చైర్పర్సన్ లావణ్యాశ్రీనివాస్, మున్సిపల్ ఏఈ శృతి, సీనియర్ అసిస్టెంట్ లోకేష్ పాల్గొన్నారు. విద్యతోనే సమాజంలో మంచి గుర్తింపుమహబూబాబాద్ అర్బన్: విద్యార్థులకు విద్యతోనే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని డీఐఈఓ మదార్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బాలికల, బాలుర జూనియర్ కళాశాలల్లో సోమవారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్బంగా డీఐఈఓ మాట్లాడుతూ.. ఇంటర్లో ఫెయిల్‌అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులను ఏర్పాటు చేశామని, ఈ నెల 13నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ జూని యర్ కళాశాలల్లో విద్యా వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఐడీపీ, ఐఎఫ్‌పీ డిజిటల్ టీవీలను ప్రారంభించి విద్యార్థులకు ట్యాబ్‌లు అందజేశారు. ప్రిన్సిపాల్స్ సదానందం, గణేష్, అధ్యాపకులు శ్రీనివాస్, రవి పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంమహబూబాబాద్ అర్బన్: బేగంపేట, రామాంతపూర్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ఒకటో తరగతిలో (2026–27 విద్యా సంవత్సరం) ప్రవేశాలకు జిల్లాలో నిరుపేద గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి దేశీరాంనాయక్ సోమవారం తెలిపారు. దరఖాస్తు ఫారాలు నేరుగా జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో అందిస్తామని, ఈ నెల 18న సాయంత్రం 4గంటల వరకు గిరిజన కార్యాలయంలో తిరిగి సమర్పించాలన్నారు. ఈ నెల 22న కలెక్టరేట్లోని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో లక్కీడ్రా ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తామన్నారు. విద్యార్థులు 1–6–2019 నుంచి 31–5–2020 మధ్య జన్మించి ఉండాలన్నారు. -
వినతులు వెంటనే పరిష్కరించాలి
● ప్రజావాణిలో కలెక్టర్ స్నేహశబరీష్ ● దివ్యాంగుల ఇబ్బందులుమహబూబాబాద్: ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ స్నేహశబరీష్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. కలెక్టర్ స్వయంగా వినతులను స్వీకరించి మట్లాడారు. వినతుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా గడువులోగా పరిష్కరించాలన్నారు. ఆర్డీఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పెండింగ్ వినతులు కూడా త్వరగా పరిష్కరించాలన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రజావాణి ప్రాజెక్ట్ డైరెక్టర్ రాకేశ్ జిల్లాలో అమలు చేస్తున్న ప్రజావాణి ప్రక్రియ యాప్ విధానాన్ని కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రజావాణిలో 133 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్, జిల్లాస్థాయి అఽధికారులు పాల్గొన్నారు. దివ్యాంగుల గోస.. దివ్యాంగులు పలుమార్లు కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణిలో ఇచ్చిన సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీ వారం ఆటో మాట్లాడుకొని ప్రజావాణికి వస్తున్నారు. ఆటో చార్జీలు వృథా అవుతున్నాయే తప్ప సమస్యలు పరిష్కారం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
మైనింగ్‌కు ఊతం!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రభుత్వం మైనర్ ఖనిజ బ్లాకుల వేలం విధానంలో కొత్త మార్గదర్శకాలకు శ్రీకారం చుట్టింది. ఖనిజాల తవ్వకాల్లో పారదర్శకత, ఆదాయం పెంపు లక్ష్యంగా హైబ్రిడ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. పూర్తిగా ఆన్లైన్లోనే వేలం ప్రక్రియ ద్వారా ఖనిజాల లీజులు కేటాయించనున్నారు. ఈమేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎన్.శ్రీధర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మైనింగ్ రంగానికి ఊతమివ్వనున్నాయి. ముఖ్యంగా గ్రానైట్, స్టోన్ మెటల్, బ్లాక్ గ్రానైట్, రోడ్ మెటల్, మట్టి, ఇసుక వంటి ఖనిజాల తవ్వకాల్లో కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో లీజులు.. ఉమ్మడి వరంగల్‌లో ఇప్పటికే వందల సంఖ్యలో లీజులు ఉన్నాయి. వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అధికంగా క్వారీలు ఉన్నాయి. మైన్స్ అండ్ జియాలజీ శాఖ అంచనాల ప్రకారం ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల పరిధిలో ప్రస్తుతం చిన్నా, పెద్దవి కలిపి సుమారు 250కు పైగా మైనింగ్, క్వారీ లీజులు అమలులో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో అధిక భాగం స్టోన్ మెటల్, రోడ్ మెటల్ యూనిట్లు, గ్రానైట్ తవ్వకాలు, బ్రిక్ ఎర్త్, మట్టి క్వారీలు, ఇసుక రీచ్‌లు ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాలు అధికంగా ఉండండంతో గ్రానైట్, స్టోన్ మెటల్ క్వారీల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పట్టాదారులకు తీపి కబురు ఇకపై మైనర్ ఖనిజాల వేలం మొత్తం ఆన్లైన్లోనే జరగనుంది. బిడ్డింగ్ నుంచి లీజు కేటాయింపు వరకు ప్రతీ దశ డిజిటల్ విధానంలో ఉండడంతో అక్రమాలు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కనీసం ముగ్గురు బిడ్డర్లు తప్పనిసరి చేయడం ద్వారా పోటీ పెరిగి ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, పట్టా భూముల్లో ఖనిజ తవ్వకాలకు అంగీకరించిన భూ యజమానులకు ప్రభుత్వం అదనపు సొమ్ము చెల్లించనుంది. గ్రానైట్, మార్బుల్ మినహా ఇతర ఖనిజాలకు సీనియరేజ్ ఫీజులో 10 శాతం, గ్రానైట్, మార్బుల్‌కు 5 శాతం పెంచనున్నారు. ఈ నిర్ణయం వల్ల జిల్లాలోని ప్రైవేట్ భూముల్లో కొత్త క్వారీలకు భూ యజమానులు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా భావిస్తున్నారు. రాయల్టీ పెరిగే అవకాశం.. కొత్త వేలం విధానం అమలైతే ఉమ్మడి వరంగల్‌లో ఖనిజ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సుమారుగా ఏటా రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు వస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం నిర్మాణ రంగం వేగంగా విస్తరిస్తుండడంతో రోడ్ మెటల్, స్టోన్ మెటల్, గ్రానైట్‌కు డిమాండ్ పెరుగుతోంది. కొత్త లీజులు మంజూరైతే ప్రభుత్వానికి రూ.25–30 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని మైనింగ్ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మైనర్ ఖనిజాల వేలంలో భారీ మార్పులు హైబ్రిడ్ విధానానికి సర్కారు గ్రీన్‌సిగ్నల్ పూర్తిగా ఆన్లైన్లోనే వేలం ప్రక్రియ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్త లీజులు గ్రానైట్, స్టోన్ మెటల్, ఇసుక క్వారీలపై ఫోకస్ 40–60 కొత్త లీజులకు అవకాశం? ఇప్పటి వరకు పర్యావరణ, కాలుష్య నియంత్రణ అనుమతులు లేక వేలం జరగని అనేక ఖనిజ బ్లాకులు కొత్త ‘హైబ్రిడ్ విధానం’ ద్వారా వేలంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా లోనే మరో 40 నుంచి 60 వరకు కొత్త మైనింగ్ లీజులు, క్వారీ బ్లాకులు వేలానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని మైనింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా మహబూబాబాద్‌లో బ్లాక్ గ్రానైట్, భూపాలపల్లిలో రోడ్ మెటల్, ము లుగులో స్టోన్ క్వారీలు, వరంగల్, హనుమకొండ పరిసరాల్లో నిర్మాణ రంగానికి అవసరమైన మెటల్ క్వారీలు అధికం. కాగా, ఆయా జిల్లాల్లో కొత్త విధానంతో వేగంగా అనుమతులు పొందే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో అటవీ శాఖ ఉద్యోగి మృతి
● మరొకరికి తీవ్ర గాయాలు వెంకటాపురం(కె): ములుగు జిల్లా వెంకటాపురం (కె) మండలం దానవాయి పేట గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ అటవీ శాఖ ఉద్యోగి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కల్లూరి లక్ష్మయ్య (55), దేవయ్య అటవీ శాఖ ఉద్యోగులు. ఈ క్రమంలో విధుల్లో భాగంగా ఆదివారం రాత్రి బైక్‌పై దానవాయిపేట సమీపంలోని టేకు ప్లాంటేషన్ వద్దకు వెళ్తున్నారు. ఈ క్రమంలో గ్రామ శివారులో రోడ్డుకు అడ్డుగా ఉన్న చెట్టును తప్పించబోయి బైక్ అదుపు తప్పింది. ఈ ఘటనలో సెక్షన్ అధికారి దేవయ్య తీవ్రంగా, లక్ష్మయ్య స్వల్పంగా గాయపడ్డారు. దీంతో క్షతగాత్రులను వెంకటాపురం వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్య కోసం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో లక్ష్మయ్య మృతి చెందాడు. దేవయ్యను అదే వైద్యశాలకు తరలించారు. లక్ష్మయ్య కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కొప్పుల తిరుపతి రావు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ప్రజల వద్దకు పోలీస్
సాక్షి, మహబూబాబాద్: ● ఇటీవల కాలంలో హెల్మెట్ వినియోగం, అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ శబరీష్ కురవి మండంలోని ఓ గ్రామానికి వెళ్లారు. అక్కడ ప్రజాప్రతినిధుల రాకకోసం ఎదురుచూస్తున్న సందర్భంలో ఓ మహిళ ఎస్పీ వద్దకు వచ్చి తన సమస్యను చెప్పుకున్నారు. దీంతో స్పందించిన ఆయన పోలీస్ అధికారులను పిలిచి రెండు రోజుల్లో సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. రంగంలోకి దిగిన పోలీసులు సదరు మహిళ సమస్యను పరిష్కరించారు. అందుకు ఆమె పోలీస్ బాస్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ మెసేజ్ పంపించింది. ● కేసముద్రం మండలంలో మహిళా సమాఖ్య సమావేశం జరుగుతుంటే జిల్లా షీ–టీమ్ బృందం అక్కడికి వెళ్లింది. అక్కడ మహిళలతో మమేకమై.. వారి బాగోగులు తెలుసుకుంది. ఈ సందర్భంగా ఓ మహిళ తనకు ఓ సమస్య ఉందని ఫోన్ నంబర్ తీసుకుంది. తర్వాత షీ–టీమ్ ఎస్సై సునందకు ఫోన్ చేసి.. తమది పరువుగల కుటుంబం. భర్త ప్రాణంగా చూసుకుంటున్నాడు. ఇటీవల ఓ వ్యక్తి తనకు తరచూ ఫోన్ చేసి లోబర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని.. ఎవరితో చెప్పుకోవాలో తెలియడం లేదని ఏడుస్తూ వివరించింది. దీంతో వేధింపులకు గురిచేసే వ్యక్తి ఫోన్ నంబర్ తీసుకున్న ఎస్సై సదరు వ్యక్తికి ఫోన్ చేసి స్టేషన్‌కు పిలిపించింది. తాను చేసిన వెలిక చేష్టల వివరాలు చెప్పింది. మరోసారి ఆమెకు ఫోన్ చేస్తే కేసు పెట్టి జైలుకు పంపిస్తానని హెచ్చరించింది. దీంతో ఆ సమస్య సమసిపోయింది. ● కురవి మండలంలోని ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లిన షీ–టీమ్ బృందం మహిళలతో మాట్లాడి ఇబ్బందులుంటే ఫోన్ చేయమని కోరింది. ఫోన్ నంబర్ తీసుకున్న ఓ మహిళ మరుసటి రోజు షీ–టీమ్‌కు ఫోన్ చేసింది. తన ఇంటిపక్కన యువకుడు తన కూతురును వేధింపులకు గురి చేస్తున్నాడని, ఎన్ని సార్లుచెప్పినా.. మార్పు రాలేదని, మెస్సేజ్‌లు పంపిస్తున్నాడని వివరించింది. దీంతో పోలీస్ స్టేషన్‌కు యువకుడిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి అమ్మాయి జోలికి వెళ్తే కేసులు పెడతామని హెచ్చరించారు. దీంతో యువకుడు తన ప్రవర్తనన మార్చుకోవడంతో యువతి సమస్య తీరిపోయింది. ఇలా ఒకప్పుడు పోలీసుల పేరు చెబితేనే భయపడే జనం ప్రస్తుతం ఏ సమస్య ఉన్నా పోలీసులకు చెబితే పరిష్కారం అవుతుందనే విధంగా పరిస్థితి మారింది. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కరించడం ద్వారా ప్రజలకు సైతం పోలీసులపై నమ్మకం పెరిగింది. ఈనేపథ్యంలో జిల్లాలో పోలీసులు ప్రజలకు చేరువ అవుతున్న తీరుపై కథనం. గ్రామాల్లోకి పోలీస్.. పాత పద్ధతిన కాకుండా వినూత్న రీతిలో పోలీసింగ్ చేయాలని భావించిన ఎస్పీ.. ప్రజల మధ్యకు వెళ్తేనే సమస్యలు తెస్తాయి. వాటి పరిష్కారం సులువు అవుతుందనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. ప్రధానంగా గ్రామాల్లో పండుగలు, క్రీడలు, విగ్రహాల ఆవిష్కరణ, రైతులు, యువజనుల సమావేశాల్లో శాంతి భద్రతల పరిష్కణ చూస్తూనే ప్రజలతో మమేకం కావాలని ఆదేశించినట్లు తెలిసింది. ప్రధానంగా యూరియా, గ్యాస్ కొరత వంటి సమస్యలు వచ్చినప్పుడు గుంపులను చెదరగొట్టడమే కాకుండా.. వారితో మమేకమై.. అసలు సమస్య ఎక్కడ వస్తుందనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. దీంతో సమస్య పరిష్కారానికి మార్గం దొరికింది. సమస్య సమసి పోయిందని ఓ పోలీస్ అధికారి తెలిపారు. అదే విధంగా హోం గార్డు స్థాయినుంచి జిల్లా ఉన్నతాధికారి వరకు ఇటీవల నిర్వహించిన కార్యక్రమాలు, గ్రామాల్లో పర్యటన, ప్రజా ప్రతినిధులతో మమేకం వంటి ప్రక్రియ మంచి ఫలితాలను ఇచ్చింది. గంజాయి వినియోగం, రవాణా అదుపులోకి తేవడానికి దోహద పడింది. ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకోవడం మూలంగా సీసీ కెమెరాల కొనుగోళ్లు, హెల్మెట్ల పంపిణీ వంటి కార్యక్రమాలకు సర్పంచ్‌లు, మున్సిపల్ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లు ముందుకు రావడం ఇందుకు నిదర్శనం. ప్రజల్లో ఒకరిగా.. పోలీసులంటే సమాజంలో ఉన్న అభిప్రాయం పోవాలి. వాళ్లు వేరు కాదు..సమాజంలో వారు ఒకరు అనే అభిప్రాయం రావాలన్నదే పోలీస్‌శాఖ ఉద్దేశం. అప్పుడే వారి సమస్యలు చెబుతారు.వాటికి పరిష్కారం దొరుకుతుంది. ఈ ఉద్దేశంతోనే ఫ్రెండ్లీ పోలీస్, విలేజ్ పోలీసింగ్ వ్యవస్థను బలోపేతం చేశాం. ప్రజలతో మమేకం కావడం. సామాజిక రుగ్మతులను నిర్మూలించడంలో ప్రజల సహకారం తీసుకుంటూ ముందుకెళ్తున్నాం. – శబరీష్, ఎస్పీప్రజలతో మమేకం.. సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చట్టాలపై అవగాహన, సామాజిక రుగ్మతుల నివారణ వినూత్నరీతిలో జిల్లా పోలీస్‌శాఖ కార్యక్రమాలు మహిళల గుంపుతో షీ–టీమ్మహిళలకోసం ఎన్ని చట్టాలు వచ్చినా అవి కిందిస్థాయికి చేరడం లేదు. అయితే జిల్లాలోని షీ–టీమ్ మాత్రం మహిళల గుంపు ఎక్కడ ఉంటే అక్కడ వాలి.. చట్టాల గురించి చెప్పడం పరిపాటిగా మారింది. సాధారణంగా స్కూల్స్, కాలేజీల్లోని విద్యార్థిణులతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. కానీ జిల్లాలోని షీ–టీమ్ మాత్రం మహిళలకు ఎక్కడ పనిచేస్తే అక్కడ.. ప్రధానంగా మార్కెట్లో ధాన్యం ఊడ్చేవాళ్లు, పారిశుద్ధ్య కార్మికులు, ఉపాధి హామీ కూలీలు, ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా సంఘాల సమావేశాలు.. మొదలైన చోట్లకు వెళ్లడం. మహిళల చట్టాలు. వాటిని వినియోగించుకోవడం, లైంగిక వేదింపులు, అత్యాచారాలు, వరకట్న వేధింపులతో ఇబ్బందులు పడుతున్న వారికి పోలీస్ ఏవిధంగా సహాయ పడుతుందో చెప్పడం. వారితో మమేకం కావడం పరిపాటిగా మారింది. -
ప్రపంచ యవనికపై వరంగల్ ‘5ఎఫ్’
సాక్షి, వరంగల్/గీసుకొండ: కేంద్రం ఆలోచనలకు అనుగుణంగా 5ఎఫ్ (ఫామ్ టు ఫైబర్.. టు ఫ్యాక్టరీ.. టు ఫ్యాషన్.. టు ఫారిన్) దృక్కోణంతో ఓరుగల్లు ఖ్యాతి ప్రపంచానికి తెలిసేలా మరో అడుగు పడింది. పత్తి ఉత్పత్తి నుంచి అంతర్జాతీయ ఎగుమతుల దాకా ఒకే వేదికపై పూర్తి విలువ వ్యవస్థను కల్పించేలా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరా త్, మధ్యప్రదేశ్‌తో పాటు తెలంగాణ నుంచి వరంగల్‌లోకి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును పీఎం మిత్ర (ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్ పార్కు) పథకం కింద 2023లో ఎంపిక చేశారు. ఈ మేరకు రూ.200 కోట్లతో కూడిన అభివృద్ధి పనులను ప్రధాని మోదీ హైదరాబాద్ వేదికగా ఆదివారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఇప్పటికే విడుదల చేసిన రూ.30 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టగా, మరో రూ.170 కోట్ల దఫాల వారీగా కేంద్రం రాష్ట్రానికి అందివ్వనుంది. దీంతో పాటు ‘కాంపిటిటివ్ ఇన్సెంటివ్ సపోర్ట్’ కింద రూ.300 కోట్ల వరకు ప్రోత్సాహ క మద్దతు ఇవ్వనుండడంతో దేశ, విదేశీ కంపెనీలు ఇక్కడికి క్యూ కట్టే అవకాశం ఉంది. గీసుకొండ, సంగెం మండలాల్లో 1,327 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ పార్కులో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ఇప్పటివరకు ఈ పార్కులో 548 ఎకరాల్లో పరిశ్రమలు వస్తే పీఎం మిత్ర కింద కేఎంటీపీ ఎంపికైన తర్వాతనే 310 ఎకరాల్లో పరిశ్రమలు వచ్చాయని కేంద్ర జౌళి పరిశ్రమ మంత్రిత్వ విభా గాధికారులు అంటున్నారు. ఇందులో భాగంగానే ‘ఎవర్టాప్ టెక్స్టైల్ అండ్ అపెరెల్ కాంప్లెక్స్ ప్రైవేట్ లిమిటె డ్’ వంటి సంస్థలు భారీ పెట్టుబడులతో ముందుకు రావడం దీనికి నిదర్శనమని చెబు తున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.1695.54 కోట్ల వ్యయం కాగా, వివిధ మార్గాల ద్వారా రూ.6,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ పార్కు ద్వారా 24,400కు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వార్షికంగా రూ.1,990 కోట్ల వ్యాపార లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు రాష్ట్రస్థాయిలో ఉన్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, ‘పీఎం మిత్ర’ హోదా తో జాతీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుని, అంతర్జాతీయ జౌళి మ్యాప్‌పై వరంగల్‌కు ప్రత్యేక స్థానం కల్పించనుంది. ఈ పార్కు దేశంలోనే తొలి పీఎం మిత్ర పార్కుగా నిలవడం తెలంగాణకు, వరంగల్‌కు గౌరవంగా పేర్కొనవచ్చు. పత్తి ఉత్పత్తి నుంచి అంతర్జాతీయ ఎగుమతులు ఒకే వేదికపై.. కేఎంటీపీకి పీఎం మిత్ర కింద రూ.200 కోట్లు, సీఐఎస్ కింద రూ.300 కోట్లు వర్చువల్‌గా హైదరాబాద్ నుంచి ప్రారంభించిన పీఎం నరేంద్రమోదీ -
ప్రభుత్వ నిరక్ష్యంతోనే రైతులకు ఇబ్బంది
● మాజీ మంత్రి రెడ్యానాయక్ దంతాలపల్లి: ప్రభుత్వ నిరక్ష్యంతోనే రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి రెడ్యానాయక్ విమర్శించారు. మండల కేంద్రంలోని అంబేడ్కర్ కూడలి నుంచి ఖమ్మం, వరంగల్, జాతీయరహదా రిపై కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి సమీపంలోని ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ అసమర్ధత, ముందుచూపు లేకపోవడం వలనే ధాన్యం, మొక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నెల రోజులు గడుస్తున్నా.. కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం కొనుగోలు చేయకపోవడం దారుణమ న్నారు. నియోజకవర్గంలో సుమారు రెండు లక్షల ధాన్యం బస్తాలు ఉన్నాయన్నారు. తహసీల్దార్ సునిల్‌కుమార్, పీఏసీఎస్ సీఈఓతో మాట్లాడారు. వారం రోజుల్లో ధాన్యం తరలించకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఆందోళన చేస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలపార్టీ అధ్యక్షుడు ధర్మారపు వేణు, జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ నూకల వెంకటేశ్వరరెడ్డి, మాజీ ఎంపీపీ మల్లారెడ్డి, నాయకులు కిషోర్, నూకల గౌతమ్‌రెడ్డి, సురేష్, వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
నేటినుంచి వేసవి శిక్షణ శిబిరాలు
● ఈ నెల 25 వరకు నిర్వహణ ● జిల్లాలో 18 పాఠశాలలు ఎంపికమహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వం బడుల్లో చదువుతున్న విద్యార్థులకు వేసవి సెలవుల్లో ఆటపాటలతో కూడిన విజ్ఞానాన్ని అందించేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు సిద్ధమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లోని 18 పీఎంశ్రీ పాఠశాలను ఎంపిక చేశారు. ఈ పాఠశాలల్లో ఈ నెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు వేసవి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఒక శిక్షణ శిబిరంలో 100 మంది విద్యార్థులకు అవకాశం కల్పించారు. ఈ శిబిరాలను సక్రమంగా నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రూ.9 లక్షలు మంజూరు వేసవి శిక్షణ శిబిరాల నిర్వహణ కోసం ప్రభుత్వం ఎంపిక చేసిన ఒక పీఎంశ్రీ పాఠశాలకు రూ.50 వేల చొప్పున నిధులు విడుదల చేశారు. ఈ నిధులను ఆ పాఠశాల హెచ్ఎంల అకౌంట్లకు జమచేశారు. మెటీరియల్ కలర్స్ స్కేచ్ తదితరాలకు రూ.10వేలు, వంట సహాయకులకు రూ.4వేలు, ఆయా రంగాల్లో నిష్ణాతులైన నలుగురు కోచ్‌లకు రూ.3 వేల చొప్పున రూ.12 వేలు చెల్లించాలి. శిక్షణలో నిర్వహించే ఆటలు, సంగీతం, నృత్యం, డ్రాయింగ్, యోగా, కథ చెప్పటం, వ్యక్తిత్వ వికాసం, చెస్, ఇండోర్ గేమ్స్, సైన్స్ ప్రయోగాలు, క్రీడలు, క్వీజ్లు, మాక్ పార్లమెంట్, తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. వేసవి శిక్షణ శిబిరాలు ముగిసిన తర్వాత ఖర్చులకు సంబంధించిన ఓచర్లు, యుటిలైజేషన్ సర్టిఫికెట్లను సమర్పించాలని విద్యాశాఖ అధికారుల సూచించారు. అన్ని పాఠశాలల విద్యార్థులకు ఎంట్రీ.. ఈ వేసవి శిక్షణ శిబిరం పీఎంశ్రీ పాఠశాలల విద్యార్థులకు కాకుండా అన్నిరకాల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొనేలా అవకాశం కల్పించారు. శిక్షణ శిబిరాలను సెక్టోరల్ ఆఫీసర్లు, ఎంఈఓలు ప్రతీరోజు పర్యవేక్షించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. విద్యార్థులకు వేసవి వేడి నుంచి ఉపశమం కలిగించి ఆహ్లాదకరమైన వాతావరణంలో శిక్షణ ఇచ్చేలా ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శిబిరాలు నిర్వహించే పాఠశాలలు ఇవే.. బయ్యారం మండలం జీకేపేటలోని పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల, డోర్నకల్ మండలం చిలుక్కోడు పీఎంశ్రీ మోడల్ స్కూల్, డోర్నకల్ జెడ్పీహెచ్ఎస్, సిరోలు కాంపల్లి జెడ్పీహెచ్ఎస్, కంబాలపల్లి జెడ్పీహెచ్ఎస్, మానుకోట జెడ్పీహెచ్ఎస్, మున్సిపల్ పరిధిలోని అనంతారం మోడల్ స్కూల్, గూడూరు మండలంలోని పోనుగోడు జెడ్పీహెచ్ఎస్, కేసముద్రం స్టేషన్ పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల, నెల్లికుదురు మోడల్ స్కూల్, నర్సింహులపేట పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల, చిన్నగూడురు మండలంలోని జయ్యారం పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్, మరిపెడ మండలంలోని సీతారాంపురం పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్, దంతాలపల్లి పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల, తొర్రూరు మండలంలోని గుర్తూరు మోడల్ స్కూల్, తొర్రూరు పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల, పెద్దవంగర మండలంలోని అవతాపురం పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల, మరిపెడ మోడల్ స్కూల్లో వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. -
నేటినుంచి విద్యావారోత్సవాలు
● ప్రజాపాలన –ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహణ ● 17వ తేదీ వరకు కార్యక్రమాలుమహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతమే ధ్యేయంగా ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా విద్యావారోత్సవాలను నిర్వహించేందుకు సంబంధిత శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కొనసాగే ఈ ప్లాన్‌కు సంబంధించిన విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని గురుకులాల విభాగాల్లో అడ్మిషన్ల పెంపు, విద్యా ప్రమాణాలను పెంచడం, మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, డిజిటల్ క్లాస్‌లను బలోపేతం చేయడం ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశం. ఈ ప్లాన్‌లో అమలుకు జిల్లా కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించారు. వారోత్సవాలు ఇలా.. ● 11వ తేదీన మొదటి రోజు పునాది దినోత్సవం నిర్వహించాలి. పాఠశాల మౌలిక సదుపాయాల కల్పనకు శంకుస్థాపన.. పీఎంశ్రీ పాఠశాలల్లో వేసవి శిబిరాలను ప్రారంభం. కోడింగ్, ఆర్ట్స్, యోగా, క్రీడల్లో ఇతర కార్యక్రమాల్లో విద్యార్థులకు శిక్షణ నిర్వహించాలి. ● 12వ తేదీన రెండో రోజు పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక కార్యచరణతో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలకు రెమెడియల్ క్యాంప్‌లు ప్రారంభించాలి. వారి పురోగతి సమీక్ష, మధ్యాహ్న భోజనం అందించాలి. ● 13వ తేదీన గ్రామపంచాయతీ స్థాయిలో సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించాలి. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు, బడిబాట తదితర అంశాలపై చర్చించాలి. బడిబాటలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేయాలి. మండల స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలతో అవగాహన కల్పించాలి. ● 14వ తేదీన గ్రామాలు, తండాల్లో ఇంటింటికీ తిరుగుతూ విద్యార్థులను బడిలో చేర్పించాలి. తల్లిదండ్రులు, పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు, ఉన్నత స్థాయిలో స్థిరపడిన పూర్వ విద్యార్థులతో సమావేశాలు, సమ్మేళనం నిర్వహించాలి. మధ్యాహ్న భోజన వంట కార్మికులకు వంట పోటీలు నిర్వహించాలి. ఉత్తమ హాజరు ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు అందజేయాలి. విద్యార్థుల సంఖ్య పెంపునకు కృషి చేయాలి. ● 15వ తేదీన పాఠశాల్లో గ్రంథాలయ దినోత్సవం నిర్వహించి. గ్రంథాలయాలు– జ్ఞాన హృదయం నినాదంతో పుస్తక ప్రదర్శనలు చేపట్టాలి. అంబేడ్కర్ లాంటి మహనీయుల పుస్తకాలు ప్రదర్శించాలి. ఉత్తమ పాఠకులకు గుర్తింపు, పుస్తక దానం శిబిరాలు నిర్వహించాలి. ● 16వ తేదీన విద్యార్థులకు చిత్రలేఖనం, హస్తకళల పోటీలు, కోలాటం, ఒగ్గుకథలు సంప్రదాయ కళల ప్రదర్శనలు, కళా వైభవం ఆర్ట్ అండ్ క్రాప్ట్ దినోత్సవం, పీఎం శ్రీపాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. జానపద కళారూపాల ప్రదర్శనలు, రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఉత్తమ చిత్రపటాలు, శిల్పాలను ఎంపిక చేయాలి. ● 17వ తేదీన విద్యా విజయోత్సవం నిర్వహించాలి. జిల్లాస్థాయిలో పదో తరగతి మొదటి ముగ్గురు టాపర్లకు పురస్కారాలు, రూ.10వేల నగదు బహుమతి, ప్రశంసపత్రాలు అందించాలి. విద్యలో అత్యుత్తమ ప్రతిభను వేడుకగా నిర్వహంచాలి అనే నినాదంతో ఈ కార్యక్రమం చేపట్టాలి. ఈ కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలి. ఘనంగా నిర్వహిస్తాం.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన విద్యావారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు భాగస్వామ్యయ్యేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలి. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తాం. – అలువాల సత్యనారాయణమూర్తి, డీఈఓ -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
మహబూబాబాద్ అర్బన్: ఈ నెల 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లను పూర్తి చేశామని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి సీహెచ్.మదార్‌గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలపై చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్లతో ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ.. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లాలో 14 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం పరీక్షలు జరుగుతాయని, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయత్రం 5:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 3వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్షలకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో పరీక్ష కేంద్రాల పీఎస్, డీఈఓలు, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు శ్రీనివాస్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ‘ప్రజలకు రక్షణ లేకుండాపోయింది’నెహ్రూసెంటర్: రాష్ట్రంలో ప్రజలు, ముఖ్యంగా మహిళలకు రక్షణ కరువైందని మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైందని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని మాజీ ఎంపీ కవిత క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాజీ ఎంపీ కవితతో కలిసి మాట్లాడారు. హైదరాబాద్‌లో కొత్తగా గన్ కల్చర్, గంజాయి, డ్రగ్ కల్చర్ అలవాటైందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. మహిళలు, యువతులపై దారుణాలు జరుగుతున్నా సీఎం రేవంత్‌రెడ్డి ఎలాంటి సమీక్షలు నిర్వహించకపోవడం దారుణమన్నారు. హోంమంత్రి పదవి ఆయన వద్దనే ఉన్నా ఎలాంటి పురోగతి లేదని విమర్శించారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసులు పెట్టకుండా తప్పుదోవ పట్టించాలని చూశారని విమర్శించారు. కేసులు పెట్టకుండా బాలిక తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఎట్టకేలకు కేసు నమోదు చేశారని అన్నారు. వారోత్సవాలను జయప్రదం చేయాలి నెల్లికుదురు: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో జరిగే ప్రత్యేక విద్యా వారోత్సవాలను జయప్రదం చేయాలని డీఈఓ సత్యనారాయణమూర్తి అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయంలో జరిగే అభివృద్ధి పనుల స్థల పరిసరాలను ఆదివారం ఆయన పరిశీలించారు. సోమవారం ఎమ్మెల్యే మురళీనాయక్ ముందుగా కేజీబీవీఓ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని, ఆ తర్వాత మోడల్ స్కూల్లో వేసవి శిక్షణ తరగతులను ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎంఎస్సీ సంతోష్, జీసీడీఓ విజయకుమారి, ఎస్ఓ సుమలత, సుధాకర్ పాల్గొన్నారు. అంతర్జాతీయ సదస్సుకు ఆదిరెడ్డి ఎంపిక కేయూ క్యాంపస్ : అమెరికాలోని ఎరోడెక్స్ రీసెర్చ్ యూనివర్సిటీలో ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సుకు ఆర్ట్స్అండ్ సైన్స్‌కళాశాల అధ్యాపకుడు, జర్నలిజం విభాగాధిపతి డాక్టర్ రుక్కిరెడ్డి ఆదిరెడ్డి పాల్గొనబోతున్నారని ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి ఆదివారం తెలిపారు. ఈ సదస్సులో మీడియా అధ్యయనాలు, డిజిటల్ కమ్యూనికేషన్ సమకాలిన జర్నలిజం ధోరణులపై ఆదిరెడ్డి తన పరిశోధన పత్రాన్ని సమర్పించబోతున్నారని ఆమె వెల్లడించారు. ఈమేరకు అంతర్జాతీయ సదస్సుకు రావాలని ఆదిరెడ్డికి ఆహ్వానం అందినట్లు వెల్లడించారు. ప్రిన్సిపాల్‌తోపాటు అధ్యాపకులు ఆదిరెడ్డిని అభినందించారు. -
తాగునీటి సమస్యకు పరిష్కారం
● ‘సాక్షి’ ఫోన్ ఇన్‌లో ప్రజల ప్రస్తావన ● పరిష్కారానికి కదిలిన యంత్రాంగం డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్యల పరిష్కారానికి మున్సిపాలిటీ యంత్రాంగం కదిలింది. తాగునీటి సమస్యలపై శనివారం సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ కొండేటి రాజకుమారిహరినాథ్, వైస్‌చైర్‌పర్సన్ మాదా లావణ్యాశ్రీనివాస్తో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో ప్రజలు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన వారు అధికారులు, సిబ్బందిని ఆదేశించడంతో ఇందిరానగర్‌లో బోరుకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. శాంతినగర్‌లో ట్యాంకర్‌తో నీటి సరఫరా చేశారు. తమ దృష్టికి వచ్చి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని చైర్పర్సన్ రాజకుమారిహరినాథ్, వైస్‌చైర్‌పర్సన్ మాదా లావణ్యాశ్రీనివాస్ ఈసందర్భంగా తెలిపారు. -
సొప్ప కాలుస్తూ మంటల్లో పడి రైతు మృతి
శాయంపేట : మొక్కజొ న్న సొప్ప కాలుస్తూ ప్ర మాదవశాత్తు మంటల్లో పడి రైతు మృతి చెందిన సంఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కొప్పుల గ్రా మంలో ఆదివారం జరి గింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గోలి జయపాల్‌రెడ్డి(74) వ్యవసాయాన్ని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. గ్రామ శివారులోని తన వ్యవసాయ భూమిలో మొక్కజొన్న సొప్ప కాలుస్తుండగా గాలి పెరగడంతో మంటలు భారీగా వ్యాపించాయి. ఈ క్రమంలో తప్పించుకునేందుకు పరుగెడుతుండగా కాలుకు ఉన్న చెప్పులు జారిపోయాయి. ప్రమాదవశాత్తు మంటల్లో పడి శ్వాస రాక అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అమ్మమ్మ చెప్పిన కథ
గాడిద–గుర్రంరామయ్య అనే వ్యాపారి సరుకులను గాడిదమీద పెట్టుకొని తాను గుర్రం ఎక్కి పొరుగూరు వెళ్తున్నాడు. కొంత సేపటికి బరువులు మోస్తున్న గాడిదకు ఆయాసం వచ్చి ఓ పావు బరువును మోయమని గుర్రాన్ని అడిగింది. గుర్రం అది నాబాధ్యత కాదు బరువులు మోయడానికి నువ్వు..సుఖంగా జీవించడానికి నేను అన్నది. బరువు మోయలేని గాడిద నడుము విరిగి కిందపడింది. వెంటనే వ్యాపారి గాడిదను అక్కడే వదిలి ఆ బరువు మొత్తాన్ని గుర్రంపై వేసి తాను ఎక్కి ప్రయాణం సాగించాడు.ఆ కొంచం బరువును ముందే మోస్తే నాకు ఈగాడిద బరువు తప్పేది కదా అని గుర్రం మనసులో బాధపడింది.–ఆత్మకూరు నీతి : బరువు పంచుకుంటే బతుకు భారం తగ్గుతుంది. –కె.వేదశ్రీ,6వ తరగతి, మార్గదర్శి స్కూల్, ఆత్మకూరు -
విద్యుత్ సేవలు మరింత సులభం
హన్మకొండ: విద్యుత్ వినియోగదారులకు అరచేతిలో సమస్యలు పరిష్కరించుకోవడంతోపాటు సలహాలు, సూచనలు పొందే అవకాశాన్ని టీజీ ఎన్పీడీసీఎల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనుసంధానంతో అధునాతనంగా వాట్సాప్ చాట్‌బాట్‌ను తీర్చిదిద్దారు. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని 18 సర్కిళ్లలో 70.39 లక్షలు మంది విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడానికి నూతన సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ యాజమాన్యం ముందుకుపోతోంది. వేగవంతమైన, పారదర్శకమైన సేవలను అందిస్తూ వినియోగదారులకు సులభతరం చేసింది. ఈ క్రమంలో ఈనెల 8 నుంచి ఏఐ వాట్సాప్ చాట్‌బాట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వాట్సాప్‌లో వినియోగదారులు సమస్యను తెలుగు, ఇంగ్లిష్ భాషల్లోనూ మెసేజ్ చేసి పోస్టు చేయాలి. ఏఐ పోస్టు (ప్రశ్న)ను అర్థం చేసుకొని, విశ్లేషించుకొని వినియోగదారుడికి అవసరమైన సమాచారం అందిస్తుంది. వినియోగదారులు వాట్సాప్ చాట్‌బాట్ ద్వారా ఈ కింది సేవలు పొందవచ్చు.. ● బిల్లు విచారణ : ప్రస్తుత బిల్లు మొత్తం చెల్లింపు తేదీ. ● చెల్లింపు స్థితి : వినియోగదారులు చెల్లించిన బిల్లుల వివరాలు తెలుసుకోవచ్చు. ● ఫిర్యాదు నమోదు: తెలుగు, ఇంగ్లిష్‌లో వివరాలు తీసుకుంటుంది. వినియోగదారుడికి ఫిర్యాదు టికెట్ ఇస్తుంది. ● ిఫర్యాదు టికెట్: టికెట్ నంబర్‌తో ఏ ఫిర్యాదు స్థితినైనా తెలుసుకోవచ్చు. ● అంతరాయ సమాచారం: వినియోగదారులు సేవా ప్రాంతంలో ప్రస్తుత అంతరాయ స్థితిగతులను తెలుసుకోవచ్బు. ● టీజీఎన్పీడీసీఎల్ హెల్ప్ లైన్: చాట్‌బాట్‌కు స మాధానం చెప్పలేని, పరిష్కరించలేని సమస్య వచ్చినప్పుడు వినియోగదారుడితో ఉద్యోగి మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపుతారు. ● వాట్సాప్ చాట్‌బాట్ సేవలు వినియోగదారులకు 24/7 అందుబాటులో ఉంటాయి. రైతులకు అర్థమయ్యే విధంగా తెలుగులో అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యుత్ బిల్లుల పూర్తి సమాచారం, బిల్లుల విచారణ, చెల్లింపుల స్థితి సెకన్లలో పరిష్కరిస్తారు. కాల్ వెయిటింగ్ టైం, ఏజెంట్ క్యూ ఉండదు. మెనూ నావిగేషన్ మాత్రం ఉంటుంది. ● వినియోగదారుడు తమ మొబైల్లో 8712481489 ద్వారా వాట్సాప్‌లోకి వెళ్లి కావా ల్సిన సేవలను సులభంగా పొందవచ్చు. ఈ సేవలను నేరుగా యాక్సెస్ చేయడానికి హెచ్‌టీటీపీఎస్://డబ్ల్యూఏ.ఎంఇ/918712481489 ( https://wa.me/918712481489) లింక్‌పై క్లిక్ చేయాలి. సేవలు పొందే సులభమైన అవకాశాన్ని టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం కల్పించింది. వినియోగదారులకు ఏఐ అనుసంధానంతో వాట్సాప్ చాట్‌బాట్ సర్వీస్ టీజీ ఎన్పీడీసీఎల్లో అందుబాటులోకి అధునాతన సాంకేతిక సేవలు -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
దామెర: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం దామెర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై కొంక అశోక్ కథనం ప్రకారం.. శాయంపేటకు చెందిన పాముకుంట్ల సుధాకర్ (47) స్కూటీపై శనివారం సాయంత్రం హనుమకొండ నుంచి శాయంపేటకు బయలుదేరాడు. మార్గమధ్యలో దామెర మండలం ఊరుగొండ నాగమయ్య గుడి ఆర్చ్ వద్ద ఓ బైక్ వెనుక నుంచి స్కూటీని ఢీకొంది. దీంతో సుధాకర్‌కు తీవ్రగాయాలుకాగా 108లో ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. మృతుడి భార్య శాంతకుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వడదెబ్బతో వృద్ధురాలు.. మంగపేట : వడదెబ్బతో ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లికి చెందిన సుతారి లక్ష్మి(60) ఆదివారం మృతి చెందింది. కొంతకాలం క్రితం భర్త, కుమారుడు మృతి చెందడంతో లక్ష్మి వ్యవసాయ కూలీకి వెళ్తూ ఒంటరి జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో రోజు మాదిరిగానే శనివారం కూడా కూలీకి వెళ్లి ఇంటికి చేరుకుంది. ఆదివారం ఉదయమైనా ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల వారు వెళ్లి చూడగా మృతి చెంది ఉంది. ఎండలో కూలీకి వెళ్లడంతో వడదెబ్బకు గురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. -
మిర్చి వ్యాపారి కుచ్చుటోపీ
ఖిలా వరంగల్: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఓ మిర్చి వ్యాపారి చేతులెత్తేశాడు. అడ్తిదారుల నుంచి మిర్చి కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా పరారయ్యాడు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. శ్రీవిద్య చిల్లీస్ ట్రేడర్స్ అధినేత అమడగాని అయిలయ్య అలియాస్ అరుణ్ 62 మంది అడ్తిదారుల నుంచి రూ.2.60 కోట్ల విలువైన మిర్చి కొనుగోలు చేశాడు. వారికి డబ్బులు చెల్లించకుండా పరారైనట్లు తెలుస్తోంది. దీంతో అడ్తిదారులు రైతులకు డబ్బులు చెల్లించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాధితులు వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయాన్ని సంప్రదించారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డిని కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. సదరు వ్యాపారి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని రవీందర్‌రెడ్డి తెలిపారు. బాధితులకు న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు సమాచారం. బాధితుడు, మోక్ష ఎంటర్ప్రైజెస్ యజమాని పోతు వినయ్‌కుమార్ ఆదివారం ఏనుమాముల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రూ.33.81 లక్షల విలువైన మిర్చి కొనుగోలు చేసి తనకు డబ్బులు చెల్లించలేదని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఈమేరకు మిర్చి వ్యాపారి అమడగాని అయిలయ్య అలియాస్ అరుణ్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులు శోభ, నాగరాజు, మానస, సందీప్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ జవ్వాజి సురేశ్ తెలిపారు. మార్కెట్లో వరుస ఘటనలు.. మూడేళ్ల క్రితం ఓ వ్యాపారి రూ.6 కోట్లతో పరారయ్యాడు. నెల రోజుల క్రితం వరంగల్ మార్కెట్లో గాయత్రి చిల్లీస్ ట్రేడర్స్ పేరుతో 49 మంది అడ్తిదారుల నుంచి రూ.2 కోట్ల విలువైన మిర్చికొనుగోలు చేసిన వ్యాపారి బోర్డు తిప్పేసి పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా మరోవ్యాపారి రూ.2.60 కోట్లతో పరారయ్యాడు. -
ఉత్సాహంగా రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్ : హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మూడో రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. అండర్–16,18,20 బాలబాలికలు, మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో నిర్వహించిన పోటీలకు సుమారు 400 మంది క్రీడాకారులు హాజరయ్యారు. అథ్లెట్లకు హైజంప్, లాంగ్ జంప్, జావెలిన్‌త్రో, డిస్కస్‌త్రో, హ్యామర్‌త్రో, షాట్‌పుట్, ట్రిపుల్ జంప్, 400 మీటర్ల పరుగు ఈవెంట్లలో పోటీలు నిర్వహించారు. సాయంత్రం జరిగిన ముగింపు వేడుకల్లో అథ్లెటిక్స్ అసోసియేషన్ బా ధ్యులు ఆయా విభాగాల్లో విజేతలుగా నిలిచిన క్రీ డాకారులకు పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందన్నారు. 400 మంది క్రీడాకారులు హాజరు -
కేసు నమోదు
ఖిలా వరంగల్: ఓ వాహనదారుడిపై కేసు నమోదు చేసినట్లు మిల్స్‌కాలనీ ఇన్స్పెక్టర్ రమేశ్ తెలిపారు. కాజీపేటకు చెందిన ఆదిరాల సత్యనారాయణ బైక్‌పై ఈనెల 9న ఎస్‌ఆర్‌ఆర్‌తోటకు వచ్చి తిరిగి సాయంత్రం ఇంటికి బయల్దేరాడు. ఉర్సు గుట్ట జంక్షన్‌కు చేరుకోగానే హనుమకొండ నుంచి ఉర్సుగుట్ట వైపునకు బైక్‌పై వస్తున్న మణికంఠ.. ఆయన బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడి కుమారుడు సాయి రాహుల్ ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
ధాన్యం తూర్పార పట్టేందుకు వెళ్తూ.. మృత్యుఒడికి
పెద్దవంగర: ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చింది. కల్లం నుంచి ఆ ధాన్యాన్ని విక్రయించేందుకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి చేర్చారు. అమ్మడానికి ఆ ధాన్యాన్ని తూర్పార పట్టేందుకు వెళ్తుండగా మృత్యువు కారు రూపంలో వచ్చి ఓ వృద్ధురాలిని బలితీసుకుంది. గుర్తుతెలియని కారు ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ఈ ఘటన ఆదివారం మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రమోద్ కుమార్ గౌడ్ కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం టీక్యాతండా జీపీ పరిధి శంకర్ తండాకు చెందిన జాటోత్ భద్రమ్మ (60) రామోజీ దంపతులు వ్యవసాయ కూలీలు. తమకున్న కొద్దిపాటి భూమిలో పడించిన ధాన్యాన్ని విక్రయించేందుకు వడ్డేకొత్తపల్లి గ్రామంలోని ఐకేపీ సెంటర్‌కు తరలించారు. అలాగే తన బావ కుమారుడు జాటోత్ వెంకన్న కూడా అదే కొనుగోలు కేంద్రంలో ధాన్యం నిల్వ ఉంచాడు. తూర్పార పట్టేందుకు వెంకన్న అతడి భార్య విజయతోపాటు భద్రమ్మ బైక్‌పై శనివారం రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో ఐకేపీ సెంటర్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో కొరిపల్లి క్రాస్ రోడ్డు వరకు చేరుకుంటున్న క్రమంలో తిర్మలగిరి వైపునకు వెళ్తున్న ఓ గుర్తుతెలియని కారు ఢీకొంది. ఈ ఘటనలో భద్రమ్మ అక్కడికక్కడే దుర్మరణం చెందగా, వెంకన్న, విజయ దంపతులకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో 108లో తొర్రూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు విజయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గుర్తుతెలియని కారు ఢీకొని వృద్ధురాలు దుర్మరణం దంపతులకు తీవ్రగాయాలు -
నాట్య మయూరాలు..
మహబూబాబాద్ అర్బన్ : భారతీయ సంప్రదాయ ప్రాచీన నృత్యం కూచిపూడి. దేశంలో ఈ నృత్యానికి అంత్యంత ప్రాధాన్యం ఉంది. అయితే ఈ నృత్యంలో రాణించడం అనుకున్నంత సులువేం కాదు. ఎంతో సాధన చేయాలి. నేర్చుకోవాలనే తపన ఉండాలి. అప్పుడే ఇందులో ప్రావీణ్యం సాధిస్తారు. ఇలాంటి ఆసక్తే చూపుతూ మంచి నృత్యకారిణులుగా పేరు తెచ్చుకుంటున్నారు మానుకోట జిల్లా కేంద్రలోని చిన్నారులు, యువతులు, మహిళలు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి వేదికలపై ప్రదర్శనలు ఇస్తూ పలువురి ప్రముఖుల ప్రశంసలతో పాటు అనేక అవార్డులు అందుకుంటున్నారు. తల్లీకూతుళ్ల అసాధారణ ప్రతిభ.. జిల్లా కేంద్రంలోని పాతబజారు హరిజనవాడకు చెందిన బుర్ర రాజశేఖర్, ఉమ దంపతులు. రాజశేఖర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా, ఉమ ఎకై ్సజ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉండగా 2023 నుంచి పెద్ద కూతురు కాత్యాయని విద్మహేకు, 2024 నుంచి చిన్న కూతురు మోక్షదాయిని విద్మహేకు కూచిపూడి నేర్పిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఇద్దరితోపాటు తల్లి ఉమ కూడా కూచిపూడి నేర్చుకుంటోంది. ఇటీవల వరల్డ్ రికార్డు బుక్ఆఫ్ ఇండియాలో మొదటిసారి ప్రదర్శనలు చేసి ముగ్గురు అవార్డులు అందుకున్నారు. దీంతో రాజశేఖర్, ఉమ దంపతుల బంధుమిత్రులు అభినందించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో రాణిస్తున్న అక్కాచెల్లి.. జిల్లా కేంద్రంలోని బుక్కబజారుకు చెందిన కనమర్లపూడి ఆనంద్, ఆశ్లేష దంపతుల కూతుళ్లు ఖుషి, ఆరుషి 2023 నుంచి కూచిపూడి నేర్చుకుంటున్నారు. ఖుషి 7, ఆరుషి 4వ తరగతి చదువుతోంది. వీరు కూచిపుడిలో జిల్లా, రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. హైదరాబాద్ రవీంద్రభారతి, మహారాష్ట్రలోని షిర్డీ, నెల్లూరు, ఉప్పల్‌లోని మినీ శిల్పరామంలో పలు ప్రదర్శనలు చేసి ప్రశంస పత్రాలు, బహుమతులు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉప్పల నేహ కూడా.. మానుకోటకు చెందిన ఉప్పల రంగ, శ్రావణి దంపతుల కూతురు నేహ భరతనాట్యం, కూచిపూడి నేర్చుకుంటుంది. నేహ ప్రస్తుతం 3వ తరగతి చదువుతుంది. ఆయా నాట్యాల్లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణిస్తూ పురస్కారాలు అందుకుంటోంది. కూచిపూడిలో రాణిస్తున్న మానుకోట నృత్యకారిణులు జిల్లా, రాష్ట్ర స్థాయిలో పలు ప్రదర్శనలు ఎన్నో అవార్డులు, ప్రశంసలు -
యువకుడి బలవన్మరణం
● ఎల్బీజీ నగర్ కాలనీలో ఘటన మహబూబాబాద్ రూరల్ : ఓ యువకుడు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ ఎల్బీజీ నగర్ కాలనీలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. టౌన్ ఎస్సై ఉమ కథనం ప్రకారం.. కాలనీకి చెందిన ఆరుముళ్ల ఉమ, నర్సయ్య దంపతులకు కుమారుడు రాజు (20), ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాల క్రితం నర్సయ్య మృతి చెందగా ఒక కుమార్తె వివాహం జరిగాక ఆ కుటుంబం హైదరాబాద్ వెళ్లి కూలీ చేసుకుంటూ జీవిస్తోంది. ఈ క్రమంలో రాజు తన బైక్ లైసెన్స్ తీసుకొస్తానని తల్లికి చెప్పి శనివారం మహబూబాబాద్ వచ్చాడు. రాత్రి తన మిత్రులతో కలిసి వారి ఇంటిలోనే నిద్రించాడు. ఉదయం మళ్లీ మిత్రులు ఫోన్ చేయగా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో వారు వచ్చి చూడగా ఇంట్లో ఉరేసుకుని కనిపించాడు. కాగా, రాజుకు ఓ యువతితో ప్రేమ వ్యవహారం కొనసాగగా కొంతకాలం క్రితం ఆ అమ్మాయి సంబంధీకులు అతడిని బెదిరించినట్లు తెలిసింది. మళ్లీ అదే విధంగా బెదిరింపులు వస్తే భయపడి ఉరేసుకున్నాడా? లేక ఏ కారణంతో ఉరేసుకున్నాడో తెలియరాలేదు. మృతుడి తల్లి ఉమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
షాట్‌పుట్‌లో రాష్ట్రస్థాయికి ఎంపిక
పెద్దవంగర: జిల్లా అథ్లెటిక్స్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జంప్స్, త్రోస్, 400 మీటర్ల ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ఈపోటీల్లో పెద్దవంగర మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల పదో తరగతి కిన్నెర బాలాజీ షాట్‌పుట్‌లో అండర్–16 విభాగంలో పాల్గొని జిల్లా స్థాయిలో ప్రతిభ కనపర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర త్రోస్ (షాట్‌పుట్) పోటీలకు బాలాజీ అర్హత సాధించడంపై పాఠశాల పీడీ కంచెర్ల ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 10, 11 తేదీల్లో హనుమకొండ జిల్లాలోని జేఎన్ఎస్లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొనున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి నెహ్రూసెంటర్: ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. ధాన్యం కొనుగోళ్లు, ఫార్మర్ రిజిస్ట్రీ, జనగణన, విద్యా వారోత్సవాలపై హైదరాబాద్ నుంచి శనివారం ఆయన సంబంధిత అధికారులు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక, విద్యావారోత్సవాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎస్ తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కె.అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని, విద్యా వారోత్సవాలు షెడ్యూల్ ప్రకారం విజయవంతం చేయాలని ఆదేశించారు. జనగణనపై సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లకు గూగూల్ సమావేశం నిర్వహించి దిశా నిర్ధేశం చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ కాన్ఫరెన్స్‌లో డీఆర్డీఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదనరాజు, వ్యవసాయ అధికారి సరిత, విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి, ఇంటర్మీడియట్ అధికారి మదర్, ఈఈ అరుణ్‌కుమార్, ఎంవీఐ సాయిచరణ్, మార్కెటింగ్ అధికారి వెంకటేశ్వర్లు, సీపీఓ శ్రీనివాసరావు, డీఎస్ఓ రమేష్, సివిల్ సప్లయీస్ డీఎం నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి మహబూబాబాద్ అర్బన్: విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను వెలికితీసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించామని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఏటీడీఓ ఉపేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో శనివారం సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమానికి ఉపేందర్ హాజరై మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణ, వినోదంతోపాటు విజ్ఞానం పెంపొందించుకునేందుకు సమ్మర్ క్యాంప్ దోహదపడుతుందన్నారు. ఈ సమ్మర్ క్యాంప్‌లో బాలికలకు కుట్లు అల్లికలు, ఆటలు, యోగా, డ్రాయింగ్‌లో సంబంధిత ఉపాధ్యాయులతో శిక్షణ ఇప్పించినట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు, బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఏసీఎంఓ డి.రాములు, జీసీడీఓ విజయ, పాఠశాల హెచ్ఎం పొడుగు నర్సయ్య, హెచ్‌డబ్ల్యూఓ పద్మ, పీడీ అనిల్, శిక్షకులు రవీందర్, రవి, శారద పాల్గొన్నారు. భారీ వర్షం.. తడిసిన ధాన్యం గూడూరు: మండలంలో శనివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో విద్యుత్ అంతరాయం ఏర్పడి బయటికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఆరుగాలం కష్టపడి పండించిన రైతులు మక్కలు, వరి ధాన్యం విక్రయించడానికి పీఏసీఎస్, ఐకేపీ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రాసులుగా ఏర్పాటు చేసుకున్నారు. రాత్రి 9 గంటలకు ఈదురు గాలులతో భారీ వర్షం మొదలైంది. దీంతో కొనుగోలు కేంద్రాల్లోని మక్కలు, వరి ధాన్యం దడిసి ముద్దయ్యాయి. అకాల వర్షానికి పాడైన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. -
అనాథలకు అమ్మ
జఫర్‌గఢ్: వందలాది మంది అనాథ పిల్లలతో అమ్మ అని ఆప్యాయంగా పిలుపించుకుంటున్నారు ‘మా ఇల్లు ఆశ్రమ నిర్వాహకులు గాదె పుష్పరాణి. మండలంలోని రేగడితండా గ్రామ శివారు టీబీతండా వద్ద గాదె ఇన్నయ్య 20 ఏళ్ల క్రితం ‘మా ఇల్లు’ ప్రజాదరణ అనాథ ఆశ్రమాన్ని స్థాపించారు. 32 మంది పిల్లలతో ప్రారంభించిన ఈ ఆశ్రమంలో ఇప్పటి వరకు వందకు పైగా అనాథ పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. ఆశ్రమంలోని ఆడపిల్లల విషయంలో ఆమె ప్రత్యేక శ్రద్ధవహిస్తూ తల్లిదండ్రులు లేని లోటు తీరుస్తున్నారు. ఆశ్రమానికి చెందిన ముగ్గురు ఆడపిల్లలకు సొంత ఖర్చులతో వివాహాలు జరిపించారు. పుష్పరాణి కృషి ఫలితంగా ఆశ్రమానికి చెందిన పిల్లలు లాయర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, నర్సులు, ఉపాధ్యాయులు, కానిస్టేబుల్‌గా ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా గాదె పుష్పరాణి మాట్లాడుతూ.. ఎంతో మంది అనాథ పిల్లలకు అమ్మలా సేవ చేయడం, వారితో అమ్మ అని పిలిపించుకోవడం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు. -
అమ్మ నింపిన ధైర్యమే ఉద్యోగస్తున్ని చేసింది
సాక్షి, మహబూబాబాద్: మాది ఉమ్మడి కుటుంబం. అమ్మాన్నాన్నలు లక్ష్మీ, నరసింహం. నాన్న వ్యవసాయం చేసేవారు. ఇంట్లో నేనే పెద్ద కొడుకును. నామీదనే అందరి ఆశలు. అందుకోసమే చిన్నప్పటి నుంచి నేను బాగా చదవాలని అమ్మ చెబుతుండేది. పరీక్షల్లో వచ్చిన మార్కులు కూడా అమ్మే చూసి సంతోషపడేవారు. పోలీస్‌శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ చూసి అమ్మకు చెప్పాను. ఈ ఉద్యోగం నీకు వస్తుంది.. నీకు ఆ శక్తి ఉందని ధైర్యం నింపింది. ఆమె చెప్పినట్లుగానే ఉద్యోగం సంపాదించాను. అప్పుడు ఆమె కళ్లల్లో చూసిన ఆనందం ఇప్పటికి మరవలేను. నన్ను చూసి మా అన్నదమ్ముళ్లు, ఆక్కా చెల్లెళ్లు బాగా చదివారు. మంచి పొజీషన్లో ఉన్నారు. అమ్మ మాతోనే ఉంటుంది. పని ఒత్తిడి, ఇతర సమస్యలు వచ్చినప్పుడు అమ్మతో మాట్లాడితే అంతా పోతుంది. – ఎన్.తిరుపతిరావు, డీఎస్పీ మహబూబాబాద్ -
డబ్బులిస్తేనే వేసవి శిబిరం!
సాక్షి, మహబూబాబాద్: వేసవి సెలవుల్లో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రాగా.. అర్బన్ ప్రాంతంలోని పిల్లలకు శిక్షణ ఇచ్చేందుకు తమ వద్ద డబ్బులు లేవని స్పోర్ట్స్ అథారిటీ చెబుతుంది. పిల్లల వద్ద డబ్బులు(ఫీజు) వసూలు చేసి.. ఆ డబ్బుతోనే కోచ్‌లను నియమించుకోవాలని చెప్పడంతో ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో తమ పిల్లలకు వేసవిలో ఆటల్లో శిక్షణ ఇప్పిద్దామనుకున్న తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. రూరల్ ప్రాంతాల్లో పది శిబిరాలు జిల్లాలోని రూరల్ ప్రాంతాల్లో పది వేసవి క్రీడా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధానంగా వాలీబాల్, కరాటే, తైక్వాండో, వెయిట్ లిఫ్టింగ్, బాస్కెట్ బాల్, నెట్‌బాల్, తదితర క్రీడల్లో మే 5 నుంచి జూన్ 7వ తేదీ వరకు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఉచిత క్రీడా శిక్షణా శిబిరాలు నిర్వహించనున్నట్లు అధికారులకు తెలిపారు. ఇందుకోసం ఇనుగుర్తి, జయపురం, గార్ల, నేరడ, తానంచర్ల, కాట్రపల్లి, ఉప్పలపాడు, అమ్మపాలెం, కల్వల గ్రామాలు వేదికకానున్నాయి. డబ్బులిస్తేనే అర్బన్‌లో.. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉచిత క్రీడా శిబిరాలు ఏర్పాటు చేసిన జిల్లా యువజన క్రీడల శాఖ.. అర్బన్ ప్రాంతాల్లో మాత్రం డబ్బులు చెల్లించిన వారికే శిబిరాలు ఉంటాయని ప్రకటించింది. ప్రధానంగా మహబూబాబాద్, కేసముద్రం, డోర్నకల్, మరిపెడ, తొర్రూరు మున్సిపాలిటీ కేంద్రాల్లో ప్రతీ సంవత్సరం వేసవి శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది మాత్రం మొత్తం 34 క్రీడలకు ఏ క్రీడకు ఎన్ని డబ్బులు చెల్లించాలని రాష్ట్ర అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో బాస్కెట్ బాల్ రూ.300, బాడ్మెంటెన్ రూ.500, చెస్ రూ.500, జమ్నాస్టిక్స్ రూ.200, లాన్‌టెన్నిస్ రూ.500, స్విమ్మింగ్ రూ.600, ఇలా ఒక్కొ క్రీడకు ధర నిర్ణయించారు. డబ్బులు ఇచ్చి శిక్షణ ఇప్పించే స్తోమత లేని తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల శిక్షణకు పంపించడంలేదు. అధికారులు స్పందించి రూరల్ ప్రాంతాల మాదిరిగానే అర్బన్‌లో కూడా పేద పిల్లలకు ఉచిత శిక్షణ ఇప్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అర్బన్ పరిధిలో క్యాంపులకు కొత్త నిబంధన ఉత్తర్వులు జారీ చేసిన క్రీడలు యువజన విభాగం పిల్లల డబ్బులతోనే కోచ్‌ల వేతనాలు ముందుకు రాని కోచ్‌లు ఆటలకు దూరంగా అర్బన్ ఏరియా పిల్లలుఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తారాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అర్బన్ ప్రాంతంలో క్రీడా శిబిరాలు పెట్టాలంటే విద్యార్థులనుంచి ఫీజులు వసూలు చేయాలి. అలా అయితేనే శిబిరం ఏర్పాటు, కోచ్‌లకు ప్రోత్పాహకాలు వస్తాయి. జిల్లా ప్రత్యేక పరిస్థితిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా. వారి ఆదేశాల మేరకు శిబిరాలు నిర్వహిస్తాం. – ఓటేటి జ్యోతి,జిల్లా యువజన క్రీడలశాఖ అధికారి ఉచితంగా శిక్షణ ఇవ్వాలిగిరిజనులు, పేదలకు ఎక్కువగా ఉన్న జిల్లా మహబూబాబాద్, క్రీడలకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం. వేసవిలో పిల్లలకు ఇచ్చే క్రీడా శిక్షణకు డబ్బులు వసూళ్లు చేయడం సరికాదు. ప్రభుత్వమే కోచ్‌ను నియమించాలి. వేసవిలో విద్యార్థులకు భోజన వసతులు కల్పించి క్రీడల్లో శిక్షణ ఇవ్వాలి. మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా ప్రోత్సహించాలి. – గుగులోత్ కిషన్ నాయక్, రిటైర్డ్ ఉపాధ్యాయుడు -
పరిశీలిస్తాం.. పరిష్కరిస్తాం
డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న తాగునీటి సమస్యలను పరిశీలించి పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్పర్సన్ కొండేటి రాజకుమారిహరినాథ్, వైస్ చైర్మన్ మాదా లావణ్యశ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శనివారం సాక్షి ఆధ్వర్యంలో తాగునీటి సమస్యలపై నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో వారు ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణంతో పైపులు పగిలి తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈసందర్భంగా పలువురు చైర్పర్సన్ దృష్టికి తీసుకొచ్చారు. భగీరథ పైపుల ద్వారా తక్కువస్థాయిలో నీరు రావడంతో వార్డులకు అరకొరగా నీరు సరఫరా అవుతోందన్నారు. ప్రస్తుతం ట్యాంకుల ద్వారా కొన్ని వార్డులకు నీటిని సరఫరా చేస్తున్నామని, యుద్దప్రాతిపదికన పైప్లైన్ల మరమ్మతులు చేపడతామన్నారు. తాగునీటి సమస్యలపై మున్సిపల్ సిబ్బందిని నిత్యం అప్రమత్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. తాగునీటి ఎద్దడి నివారణకు సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రశ్న: 13వ వార్డులోని పలు వీధుల్లో తాగునీటి సమస్యను పట్టించుకోవడం లేదు. పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపడతారు? – పిల్లి శబరీష్, పోటు జనార్థన్‌రావు, ఎల్లావుల హరికృష్ణ, నీలం సారమ్మ, పండరినాథ్లడ్డా, మహబూబూబ్ జవాబు: రోడ్డు నిర్మాణం, అమృత్ పనులతో పైపులు పగిలి నీటి సరఫరాకు అంతరాయం కలుగుతో ంది. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయిస్తున్నా ం. వార్డుకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తాం. ప్రశ్న: 11వ వార్డులో పైపులు పగిలి తాగునీరు కలుషితమవుతోంది. రోడ్లు ధ్వంసమై ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. – ఎల్లావుల నర్సింహరావు, జాలా ప్రసాద్, ఎస్కే సాధిక్ జవాబు: అమృత్ పనులు పూర్తి కాగానే తాగునీటి కలుషితం కాకుండా చర్యలు చేపడతాం. నీటి కొరతను నివారిస్తాం. ప్రశ్న: మూడురోజులకోసారి అరకొరగా నీరు సరఫరా అవుతోంది.. –భాస్కర్, మహ్మద్ అజ్గర్, ఎస్కే నేహాకౌషర్, భవాని, సుభాష్‌వీధి, బషీర్ అలీ, శాంతినగర్, చాంద్‌పాషా అంబేడ్కర్‌నగర్, అక్కిరెడ్డి పద్మ, న్యూ నెహ్రూ స్ట్రీట్ జవాబు: ప్రస్తుతం నీటి కొరతతో భగీరథ ద్వారా సరఫరా తక్కువగా ఉంది. త్వరలో సమస్య పరిష్కరిస్తాం. ప్రశ్న: మున్నేరువాగు నీటిని సరఫరాచేయరా..? – దేవర వెంకటేశ్వర్లు, అంబేడ్కర్‌నగర్ జవాబు: త్వరలో విద్యుత్ మోటార్లను అమర్చి నీటి కొరత ఉన్న సమయాల్లో మున్నేరువాగు నుంచి నీటిని సరఫరా చేస్తాం. ప్రశ్న: కాల్వలు తవ్వి వదిలేశారు.. – రాజేందర్‌సింగ్, సుభాష్ స్ట్రీట్ జవాబు: పైప్లైన్లు, డ్రెయినేజీల కోసం రోడ్లను తవ్వడంతో ఏర్పడిన గుంతలను పూడ్చేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రశ్న: నీటి సరఫరా ఇబ్బందులు పరిష్కరించరా? – గుండ్రాల భాస్కర్, వీరన్న, ఇందిరానగర్ జవాబు: భగీరథ లైన్ ద్వారా తక్కువ నీరురావడం, లీకేజీలతో నల్లాల ద్వారా తక్కువ నీరు వస్తుంది. త్వరలో సమస్య పరిష్కరిస్తాం. సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన నీటి సమస్యపై ప్రజల నుంచి పలు ప్రశ్నలు పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ కొండేటి రాజకుమారి, వైస్ చైర్పర్సన్ మాదా లావణ్య -
రైతులకు చేరువలో ‘ఆకాశవాణి’
హన్మకొండ : ఆకాశవాణి వరంగల్ కార్యక్రమాలు రైతులకు చేరువగా వెళ్లాయని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ సంచాలకుడు డాక్టర్ ఆర్.ఉమా రెడ్డి కొనియాడారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా శుక్రవారం ఉదయం వాక్ థాన్ నిర్వహించారు. అందులో భాగంగా హనుమకొండ కేయూ క్రాస్‌లోని వరంగల్ ఆకాశవాణి ప్రాంగణం నుంచి కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వరకు, తిరిగి ఆకాశవాణి ప్రాంగణం వరకు వాక్ థాన్ సాగింది. డాక్టర్ ఆర్.ఉమా రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి వాక్‌థాన్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆకాశవాణి అనేక కార్యక్రమాలను రైతులకు చేరువ చేయడంలో ఇక్కడి శాస్త్రవేత్తలు, అధికారులు ఎంతగానో తోడ్పడుతున్నారని అన్నారు. విపత్కర పరిస్థితుల్లో సైతం ఆకాశవాణి సేవలు అద్వితీయమన్నారు. వరంగల్ కేంద్రానికి దేశంలోనే ప్రత్యేక స్థానం ఉందని, స్థానికంగా ఉన్న ఎంతోమంది మేధావులు సైతం ఆకాశవాణి ద్వారా పలు కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయవంతమయ్యారని కొనియాడారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యక్రమ నిర్వహణ అధికారి, ప్రోగ్రాం హెడ్, స్టేషన్ ఇన్చార్జ్ ఇల్లందుల రవికుమార్ మాట్లాడుతూ.. ఆకాశవాణి వాకథాన్ విజయవంతమైందని అన్నారు. జూన్ 8వ తేదీ వరకు ఇలాంటి వినూత్న, సృజనాత్మక కార్యక్రమాలు మరెన్నో శ్రోతలకి అందించనున్నామని తెలిపారు. కాకతీయ విశ్వవిద్యాలయం పీఆర్ఓ డాక్టర్ వల్లాల పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఆకాశవాణితో తన చిరకాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి సిబ్బంది శ్రీనివాస్, శివ, నరేష్, విజయలక్ష్మి, శ్రీనివాసరాజు, శ్రీనివాస చారి, ఉషశ్రీ, రామ్మూర్తి, రామ్మోహన్, అనిల్ ప్రసాద్‌తో పాటు వ్యాఖ్యాతలు, విశ్రాంత ఉద్యోగులు, శ్రోతలు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రాంతీయ వ్యవసాయ స్థానం సహపరిశోధన సంచాలకుడు డాక్టర్ ఆర్.ఉమా రెడ్డి -
జిల్లాలో మున్సిపాలిటీల్లో ప్రస్తుత వేసవిలో తాగునీటి ఇబ్బందులు తప్పడంలేదు. ప్రభుత్వం తాగునీటి సరఫరాకు ఏర్పాటు చేసిన భగీరథ పైపులైన్లు చాలాచోట్ల పగిలి నీటిసరఫరాకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో పలుచోట్ల రెండుమూడురోజులకోసారి ట్యాంకర్ల ద్వారా అధికారులు నీటి స
తొర్రూరు: తొర్రూరు పట్టణ ప్రజలకు తాగునీరు సరిపడా అందడం లేదు. నాలుగైదు రోజులకోసారి వదలడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండల తీవ్రత పెరగడంతో తాగునీటి సరఫరా ఆందోళనకరంగా మారింది. గత నెల మొదటి వారంలో కనీసం మూడు రోజులకోసారి తాగునీరు సరఫరా చేసేవారు. ఆ తర్వాత పంపింగ్ కేంద్రాల వద్ద విద్యుత్ సమస్య, పైప్‌లైన్ లీకేజీలు, ధ్వంసం అంటూ మూడు నుంచి నాలుగు రోజులకోసారి తాగునీరు అందిస్తున్నారు. దీంతో పట్టణ ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. తప్పని నీటి కష్టాలు.. తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులు ఉన్నాయి. స్థానిక జనాభాకు తోడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిపోయేవారు, ఇక్కడే ఉద్యోగం, విద్యాభ్యాసం రీత్యా ఉండేవారితో కలిపి పట్టణ జనాభా 35 వేలకు పైగా ఉంది. జనాభాలో ఒక్కొక్కరికీ సగటున రోజుకు 135 లీటర్ల నీరు అందించాలన్నది లక్ష్యం. ఈ మేరకు రోజుకు 4.72 లక్షల లీటర్ల నీరు అవసరం. కానీ 2 లక్షల లీటర్ల వరకు మాత్రమే నీటి సరఫరా జరుగుతుంది. మిషన్ భగీరథ పథకం ద్వారా మంచినీరు అన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయిలో అందడం లేదు. వేసవి తీవ్రత దృష్ట్యా నీటి అవసరాలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణంలోని నాగేశ్వరరావు కాలనీ, రిక్షా కాలనీ, దుబ్బతండా, ఎర్రసోమ్లాతండా తదితర ప్రాంతాల్లో నీటి సమస్యతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీ నీరు సక్రమంగా రాకపోవడంతో వ్యవసాయ బావుల దగ్గర నుండి, చేతిపంపుల ద్వారా నీరు తెచ్చుకుంటున్నట్లు స్థానికులు వాపోతున్నారు. చేతిపంపుల నుంచి నీరు తెచ్చుకుంటున్నాం మూడు రోజులకోమారు మిషన్ భగీరథ నీరు ఇస్తున్నారు. దీంతో నీరు సరిపోక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మంచినీళ్ల కోసం అవస్థలు పడుతున్నాం. సమీపంలోని బాలవికాస సంస్థ చేతిపంపు నుండి నీరు తెచ్చుకుని వాడుకుంటున్నాం. నీటి కొరతతో పొదుపుగా నీరు వాడుకుంటున్నాం. అధికారులు ప్రతీరోజు నీరు సరఫరా చేస్తే అవసరాలు తీరుతాయి. – ఇరుగు చామంతి, రిక్షా కాలనీ, తొర్రూరు ●తొర్రూరులోని రిక్షా కాలనీలో చేతిపంపు ద్వారా నీటిని తీసుకెళ్తున్న మహిళలు -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
కురవి: మండలంలోని ఎల్కచెట్టు తండా జీపీ పరిధిలోని మేఘ్యా తండాకు చెందిన రైతు బానోత్ మంగ్యా(70) అప్పులబాధతో గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగ్యాకు సుమారు 30 గుంటల వ్యవసాయ భూమి ఉంది. కొన్నేళ్ల నుంచి పంటలసాగు, ఇంటి కోసం, గతంలో భార్యకు ప్రమాదం జరగడంతో చికిత్స కోసం అప్పు చేశాడు. చేసిన అప్పులు పంటమీద తీర్చే పరిస్థితి కనిపించడంలేదు. భూమి అమ్మినా తీరే పరిస్థితి లేకుండాపోయింది. దీంతో మనస్తాపానికి గురైన మంగ్యా గురువారం సాయంత్రం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ అదేరోజు రాత్రి మృతిచెందినట్లు మంగ్యా కుమారుడు హతిరాం శుక్రవా రం తెలిపారు. మంగ్యాకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ విషయమై కురవి ఎస్సై సతీష్‌ను వివరణ కోరగా అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కుమారుడు హతిరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
హనుమకొండ, వరంగల్ జిల్లాలను కలపాలి
నయీంనగర్: హనుమకొండ, వరంగల్ జిల్లాలను కలపాలని, ప్రజలకు బతుకుదెరువు అవకాశాలు కల్పించాలని తెలంగాణ జనసమితి (టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కోరారు. శుక్రవారం హనుమకొండలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్ మీటింగ్ హాల్లో ఏర్పాటుచేసిన టీజేఎస్ ఉమ్మడి జిల్లా ప్లీనరీలో ఆయన మాట్లాడారు. టీజేఎస్ ఏర్పాటునుంచి ఉద్యోగ, నిరుద్యోగ, కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేసిందన్నారు. ప్రజా అవసరాలకు తగ్గట్టు పాలన జరగాలని, రియల్ ఎస్టేట్‌కు ప్రాధాన్యత తగ్గించుకోవాలని అన్నారు. ఉద్యోగులకు పెన్షన్ డబ్బులు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలన్నారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి శ్రీనివాస్ మాట్లాడుతూ కోదండరామ్‌ను విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి నియమించాలని కోరారు. ఈ నెల 12న హైదరాబాద్‌లో పార్టీ పార్టీ 4వ ప్లీనరీ కార్యక్రమానికి తరలిరావాలని కోరారు. కాగా, ఉమ్మడి జిల్లా పరిధిలోని గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసితులకు, ఎయిర్పోర్ట్ భూ నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించాలని, ఎన్నికల్లో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తీర్మానించారు. కార్యక్రమంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు చిల్ల రాజేంద్రప్రసాద్, షేక్ జావిద్, నాయకులు రత్నం కిరన్, శివకుమార్, రాజేష్, బోనగాని రవీందర్, చిల్లా శ్రవన్‌కుమార్, సంధాని, మల్లేశం, రాధా కిషన్, రాజేష్, శివకుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు. టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం -
రైతు సంక్షేమమే ధ్యేయం
● జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్‌నాయక్ ● రైతులకు స్ప్రే యంత్రాల పంపిణీగూడూరు: రైతు సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్‌నాయక్ అన్నారు. గూడూరులోని ప్రభుత్వ హైస్కూల్లో శుక్రవారం యూనియ న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సీఎస్ఆర్ ఫౌండేషన్ సహకారంతో ఉచితంగా అందించిన 400 స్ప్రే పంపులను రైతులకు కలెక్టర్ స్నేహశబరీష్తో కలిసి హుస్సేన్‌నాయక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుమూల మచ్చర్లలో జన్మించిన తనకు ప్రధాని మోదీ ఢిల్లీలో స్థానం కల్పించి రైతులకు సేవచేసే అవకాశం ఇచ్చారన్నా రు. రైతులకు ఏదైనా సేవలందించాలన్న తపనతో, గుర్తుంచుకునేలా వ్యవసాయరంగానికి ఉపయోగపడే స్ప్రే పంపులను అందించాలని యూనియన్ బ్యాంకు వారిని కోరినట్లు తెలిపారు. భారత ప్రభుత్వం రైతుల ఆర్థికాభివృద్ధి కోసం అనేక పథకాలను అమలుచేస్తుందని తెలిపారు. అనంతరం కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ.. రైతులు పంటల మార్పిడి విధానంతో ఆర్థిక అభివృద్ధి సాధించాలని కోరారు. అంతర పంటలుగా పామాయిల్, కూరగాయలు, వాణిజ్య పంటలు, మిల్టెట్స్ పంటల ద్వారా ఆర్థికంగా ఎదగవచ్చని సూచించారు. సేంద్రియ ఎరువుల వాడకంపై వివరించారు. అధికంగా యూరియా వాడకం వల్ల కలిగే అనర్థాలను, నానో ఎరువుల వాడకంపై అవగాహన పెంచాలని డీఏఓకు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ వాంకుడోతు సునీతకొమ్మాలు, యూని యన్ బ్యాంక్ ఆఫ్ చీఫ్ జనరల్ మేనేజర్ రవీంద్రబాబు, కమలాకర్, రమేష్, విజయ్‌కుమార్, గూ డూరు యూనియన్ బ్యాంకు మేనేజర్ రవికుమార్, డీఏఓ సరిత, తహసీల్దార్ నాగభవాని, ఏఓ అబ్దుల్మాలిక్, ఎంపీడీఓ సత్యనారాయణ పాల్గొన్నారు. మక్కల కొనుగోళ్లు వేగంగా చేపట్టాలి ఇనుగుర్తి: మొక్కజొన్న కొనుగోళ్లు వేగంగా చేపట్టాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ అధికారులకు సూచించారు. ఇనుగుర్తి మండలం చిన్య తండా సమీపంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో నిల్వ ఉంచిన మొక్కజొన్నలు, కొనుగోలు రికార్డులను పరిశీలించారు. అనంతరం కొనుగోలు కేంద్రం వద్ద ఎదురుచూస్తున్న రైతులో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తూకాల్లో ఆలస్యం కాకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. రైతులు ఎండ తీవ్రతకు ఇబ్బంది పడకేండా కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, నీడ సదుపాయాలు కల్పించాలని చెప్పారు. అనంతరం కలెక్టర్ స్నేహ శబరీష్‌తో ఫోన్లో మాట్లాడి నిబంధనల ప్రకారం కొనుగోలు ప్రక్రియను వేగంగా చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లభ వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు దుంపల సందీప్, జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు, నవీన్, సుందర్, తదితరులు పాల్గొన్నారు. -
వడదెబ్బతో రైతు మృతి
స్టేషన్‌ఘన్‌పూర్ : వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురై ఓ రైతు మృతి చెందిన సంఘటన శుక్రవారం జరిగింది. ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లికి చెందిన రైతు గాండ్ల రవి (46) వడదెబ్బతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రవి తనకున్న వ్యవసాయ భూమిలో పండించిన ధాన్యాన్ని ఇటీవల శివునిపల్లిలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆరబోశాడు. శుక్రవారం భార్యతో కలిసి ధాన్యం తూర్పార పట్టారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మండుటెండలో పనిచేసిన రైతు మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నాడు. కాసేపటికే తీవ్ర అస్వస్థతకు గురై ఒక్కసారిగా అపస్మారక స్థితికి చేరుకోగా గమనించిన అతడి భార్య చుట్టుపక్కల వారి సాయంతో బాధితుడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో భార్య, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రవికి భార్య జ్యోతి, కుమార్తె రసజ్ఞ, కుమారుడు రాజేష్ ఉన్నారు. రైతు మృతిపట్ల శివునిపల్లి మున్నూరుకాపు సంఘం నాయకులు, రైతులు తోట వెంకటేశ్వర్లు, తోట భిక్షపతి, పోశాల క్రిష్ణమూర్తి, తోట సోమయ్య, గాండ్ల రాజు తదితరులు ప్రగాఢ సంతాపం తెలిపారు. -
సెలవుల్లో యోగాపై ఆసక్తి..
బచ్చన్నపేట : వేసవి సెలవుల్లో విద్యార్థులు యోగాపై ఆసక్తి చూపుతున్నారు. సెల్ఫోన్లు, టీవీలకు అతుక్కుపోకుండా యోగా నేర్చుకుంటున్నారు. మండలంలో కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో యోగా గురువు మల్లేశం రోజు విద్యార్థులకు యోగాను నేర్పిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్ల లను యోగా తరగతులకు పంపిస్తున్నారు.చిన్నారుల్లో భక్తిభావం..గోవిందరావుపేట : వేసవి సెలవుల్లో సాధారణంగా చిన్నారులు సెల్ఫోన్లు, టీవీలతో సమయం గడుపుతుంటారు. కానీ మండలంలోని చల్వాయి గ్రామంలో చిన్నారులు హనుమాన్ మాలధరించి భక్తి భావాన్ని చాటుకుంటున్నారు. చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, భక్తి, సంస్కారం అలవడితే భవిష్యత్‌లో మంచి వ్యక్తిత్వం ఏర్పడుతుందనే ఆలోచనతో ఈ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం స్నానాలు చేసి దేవాలయాలకు వెళ్లడం, భజనలు చేయడం, హనుమాన్ చాలీసా పారాయణం, పెద్దలకు గౌరవం ఇవ్వడం వంటి అలవాట్లు చిన్నారుల్లో పెంపొందుతున్నాయి. ముఖ్యంగా సెల్ఫోన్లకు అలవాటు పడుతున్న ప్రస్తుత కాలంలో చిన్నారులను ఆధ్యాత్మిక వాతావరణంలో వల్ల చెడు అలవాట్లకు దూరంగా ఉంటారని తల్లిదండ్రులు భావిస్తున్నారు. వేసవి సెలవులు వృథా కాకుండా పిల్లలకు మంచి మార్గం చూపిస్తున్నామని, చదువుతో పాటు సంస్కారం కూడా అవసరమని, చిన్నప్పటి నుంచే భక్తి భావం అలవడితే జీవితంలో క్రమశిక్షణ పెరుగుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. -
యువత ఉన్నతస్థాయికి ఎదగాలి
హన్మకొండ అర్బన్ : యువత అవకాశాలను వినియోగించుకోని ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ సూచించారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి భారీ జాబ్ మేళాను శుక్రవారం కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ మేళాకు వేలాది మంది నిరుద్యోగులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ హాజరై మాట్లాడారు. జాబ్ మేళాలో 10వ తరగతి నుంచి ఉన్నత విద్య చదివిన వారందరికీ 72 కంపెనీల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. మహిళలకు వరంగల్ ప్రాంతంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిర్వాహకులను కోరారు. రక్తదానం, అవయవదానం వంటి సామాజిక అంశాలపై యువత అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. నైపుణ్యాలను పెంపొందించుకుంటే మరిన్ని అవకాశాలు వస్తాయన్నారు. ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. ఐటీ, ఫార్మా, తయారీ రంగాల్లో సుమారు 4 వేల ఉద్యోగ అవకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు. కేవలం డిగ్రీలు సరిపోవని, కమ్యూనికేషన్, సాంకేతిక నైపుణ్యాలు అవసరమని యువతకు సూచించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. 72 ప్రముఖ కంపెనీలు ఈ మేళాలో పాల్గొన్నాయని తెలిపారు. ఆన్లైన్ ద్వారా 2,600 మంది నమోదు చేసుకోగా, మొత్తం 4 వేల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వైవీ గణేష్, అధికారులు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ మెగా జాబ్ మేళాలో 4 వేల మందికి ఉద్యోగావకాశాలు -
దాహం తీర్చండి..
మున్సిపాలిటీల్లో అరకొరగా తాగునీటి సరఫరాకాలనీల్లో నీటికి కటకట మహబూబాబాద్: మానుకోట మున్సిపాలిటీలో మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. భగీరథ పైపులైన్ లేని సుమారు 12 కాలనీలకు ట్యాంకర్ల ద్వారా నీటిని రెండు రోజులకోసారి అందిస్తున్నారు. మానుకోట మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా 65,712 మంది ఓటర్లు ఉద్యోగ, విద్యా, వ్యాపార పరంగా మానుకోటలో నివాసం ఉండే వారితో కలిపి లక్ష జనాభా దాటుతుంది. 15,364 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులకు ప్రతీరోజు నీటి సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మానుకోటలో సుమారు 12కాలనీలకు భగీరథ పైపు లైన్ నిర్మించకపోవడంతో ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నారు. మున్సిపాలిటీకి సంబంధించిన 61 బావులు ఉండగా వాటిలో 28 బావులు వినియోగిస్తున్నారు. మిషన్ భగీరథ ద్వారా పంపిణీ చేసేందుకు ఈదులపూసపల్లి చెరువు నీటిని వినియోగించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.యాక్షన్ ప్లాన్‌తో ముందుకెళ్తున్నాం.. మిషన్ భగీరథ నీరు సరిపోను వస్తున్నాయి. సమస్య వచ్చినా ఎదుర్కొనేవిధంగా యాక్షన్ ప్లాన్ తయారు చేశాం. పలు కాలనీల్లో సమస్య ఉంది. ట్యాంకర్లద్వారా సరఫరా చేస్తున్నారు. బోర్లు అన్ని మరమ్మతు చేయించాం. వేసవిలో నీటి సమస్య లేకుండా చూస్తాం. – రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్, మానుకోట దశాబ్దాలుగా నీటి సమస్య కాలనీకి పూర్తిస్థాయిలో మిషన్ భగీరథ పైపులైన్ నిర్మాణం చేయలేదు. దాంతో కాలనీలో కొన్ని దశాబ్దాలుగా నీటి సమస్య తీరడంలేదు. ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. నీటి సమస్య పరిష్కరించాలి. – వడ్లకొండ పద్మ, ధర్మన్న కాలనీ నీటి సమస్య ఎక్కువగా ఉంది.. కాలనీల్లో నీటి సమస్య ఎక్కువగా ఉంది. ట్యాంకర్ ద్వారా సరఫరా చేసే నీరు సరిపోవడం లేదు. సమస్య ఉన్న కాలనీలకు రోజుకు రెండు సార్లు ట్యాంకర్లు పంపించాలి. శాశ్వతంగా నీటి సమస్య లేకుండా పరిష్కరించాలి. – జగంటి మమత, మానుకోట -
సమన్వయంతో పని చేయాలి
● డీసీఓ భారతి హోళీ కేరి మహబూబాబాద్: సెన్సెస్ –2027 నిర్వాహణలో అధికారులు సమన్వయంతో పని చేయాలని డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ ఆపరేషన్స్ (డీసీఓ) భారతి హోళీకేరి అన్నారు. సెన్సెస్‌పై సంబంధిత అధికారులతో శుక్రవారం హైదరాబాద్ నుంచి భారతి హోళీ కేరి వీడియో కాన్సరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భారతి హోళీ కేరి మాట్లాడుతూ ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు సామగ్రి పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వీసీలో జిల్లా నుంచి అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్, సీపీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తలసేమియాపై అవగాహన కల్పించాలి నెహ్రూసెంటర్: తలసేమియా రక్త సంబంధిత వ్యాధి అని ముందస్తు పరీక్షలు, ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా వ్యాధిని నివారించవచ్చని జీజీహెచ్ ఆర్ఎంఓ డాక్టర్ జగదీశ్వర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ సుధీర్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ తలసేమియా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ప్రభుత్వ ఆస్పత్రి నుంచి నెహ్రూ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువత వివాహానికి ముందు రక్త పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. జిల్లాలో 4,050 మంది గర్భిణులకు తలసేమియా పరీక్షలు నిర్వహించగా 114 మందికి తలసేమియా నిర్ధారణ జరిగిందన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రవణ్‌కుమార్, లక్ష్మీనారాయణ, విరాజిత, అనిత, డెమో ప్రసాద్, ఆరోగ్య కేంద్ర సూపర్వైజర్లు పాల్గొన్నారు. సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి మహబూబాబాద్ అర్బన్: ఈ నెల 13వ తేదీ నుంచి జిల్లాలో జరగనున్న ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ పురుషొత్తం అన్నారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలపై జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో శుక్రవారం ఇంటర్‌విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయత్రం 5:30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఉంటాయని తెలిపారు. పరీక్షలకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డీఐఈఓ సీహెచ్.మదార్‌గౌడ్, అధికారులు శ్రీరాములు, ఎస్సై పాల్గొన్నారు. రేపు జిల్లా రైల్వే ప్రాజెక్ట్‌ల ప్రారంభం కాజీపేట రూరల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు రైల్వే ప్రాజెక్ట్‌లను ఈ నెల 10వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటనలో వర్చువల్‌లో ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నట్లు శుక్రవారం రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట–హసన్‌పర్తి రైల్వేస్టేషన్ల మధ్య కోమటిపల్లి రైల్వే గేట్‌సమీపంలో నిర్మించిన సొరంగమార్గం (రైల్ అండర్ రైల్), బల్లార్షా – కాజీపేట – విజయవాడ మూడవ రైలు మార్గాన్ని ప్రారంభించనున్నారు. -
దేవుళ్లను విమర్శిస్తే భూస్థాపితమే..
● బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్‌రెడ్డి ఖానాపురం : హిందూ దేవుళ్లను విమర్శిస్తే ఎవరైనా భూస్థాపితం కావాల్సిందేనని, హిందూ దేవుళ్లను విమర్శించిన మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, స్టాలిన్, మమతాబెనర్జీలు భూస్థాపితమయ్యారని బీజేపీ శాసనసభ పక్షనేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఖానాపురం మండలంలోని అశోక్‌నగర్‌లో కూల్చివేసిన శివాలయాన్ని శుక్రవారం వారు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన నాటినుంచి 13 దేవాలయాలను కూల్చివేశారని పేర్కొన్నారు. చరిత్రను కాపాడుకోవడానికి ఇతర రాష్ట్రాలు నిధులు కేటాయిస్తే, తెలంగాణలో కూల్చడానికి నిధులు కేటాయించడం దుర్మార్గమని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులకు భూములపై ఉన్న పిచ్చితో దేవాలయ భూములను లాక్కుంటున్నారని విమర్శించారు. శివాలయం పునఃనిర్మాణం చేయకపోతే బీజేపీ ఆధ్వర్యంలో చందాలు వేసుకోని నిర్మాణం చేపడతామన్నారు. అనంతరం బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్మాగ్రహ దీక్షకు మద్దతు తెలిపి రాణాప్రతాప్‌రెడ్డి, నాయకులతో దీక్షను విరమింపజేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, గోగుల రాణాప్రతాప్‌రెడ్డి, వడ్డేపల్లి నర్సింహారాములు, రాధారపు అశోక్, సందీప్, వినయ్, అంబేడ్కర్, అశోక్, రాజశేఖర్, సహదేవ్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మూర్ఖుల పాలన తెలంగాణలో మూర్ఖుల పాలన సాగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. అశోక్‌నగర్‌లో 800 సంవత్సరాల క్రితం కాకతీయులు నిర్మించిన పురాతన శివాలయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ధ్వంసం చేసి కుప్పపోయడం దారుణమన్నారు. ‘ఎక్స్’లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -
ఆడుదాం.. అష్టాచమ్మా
కాజీపేట : గ్రామాల్లో అష్టాచమ్మా ఆట ట్రేడ్‌మార్క్ గేమ్‌గా పేరుగాంచింది. ఈ ఆటను వేసవి సెలవుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు కాలక్షేపం కోసం ఆడుతుంటారు.పల్లెలతోపాటు పట్టణాల్లోనూ చింతగింజలతో ఆడుతూ కనిపిస్తారు. అష్టా చమ్మాను కొన్ని ప్రాంతాల్లో చకార్ ఆటగా పిలుస్తారు. అష్టా చమ్మా ఆడే విధానం.. అష్టా చమ్మా ఆటను భూమిపై లేదా బండలపై చతురస్రాకారంలో 5 గడులు 25 వచ్చేలా గీయాలి. ఈ గీతల కోసం గ్రామాల్లో బొగ్గునే ఎక్కువగా ఉపయోగిస్తారు.ఈ 25 గడుల్లో 9 గడులను సేఫ్టీ రూంలుగా (గదులుగా) భావిస్తూ వాటిలో గుణాకారం వచ్చే విధంగా గుర్తిస్తారు. ఆ తర్వాత ఆట ఆడేందుకు విరగ్గొట్టిన నాలుగు చింత గింజలను (పాచికలుగా) ఆడేందుకు ఉపయోగిస్తారు. మొత్తం నలుగురు ఆడే ఈ ఆటలో ఒక్కొక్కరు తమ ఆట వస్తువులుగా ఏదైనా తీసుకోవచ్చు. ఉదాహరణకు చిన్న, చిన్న రాళ్లు, చాక్లెట్లు, వేపగింజలు తదితరాలను తీసుకోవచ్చు. చింతగింజలు నలుపు రంగులో పడితే 8 గడులను దాటేందుకు అర్హత పొందినట్టు. అదే తెలుపు ఆకారంలో పడితే 4 గడులను దాటొచ్చు. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఆడుతూ ముందుకెళ్తారు. ఆడుతు వెళ్తున్న సమయంలో ఎదుటి వారి వస్తువు ఉన్న చోటా మనం ఆగేందుకు అవకాశం ఉంటే వారి వస్తువును తిరిగి వెనక్కి గడియలోకి పంపవచ్చు. ఆటలో గుణాకారపు ఆకారం గడిలో మనకు సంబంధించిన వస్తువులు ఉంటే అది సేఫ్టీ జోన్‌గా భావిస్తారు. కాపాడే సేఫ్టీ జోన్.. అదే బయట ఉన్నప్పుడు ప్రమాదకరంగా ఉన్నట్టు చింత గింజల ద్వారా వేసే పాచికలు ఎక్కువ విలువ పడే విధంగా వేస్తూ త్వరత్వరగా ఆటలోని గడియ మధ్యలో ఉన్న సేఫ్టీజోన్లో చేరితే వారు గెలిచినట్టు లెక్క. ఇలా ఎవరైతే చివరగా సేఫ్టీ జోన్లో చేరుతారో వారు ఓడినట్లు ఇలా నలుగురు కూర్చోని ఆడే అష్టా చమ్మా ఆట టైంపాస్తోపాటు వినోదాన్ని ఇస్తుంది. నలుగురు ఆడే ఆట ఇది.. -
ఆదాయ వనరుల పెంపుతోనే బలోపేతం
హన్మకొండ అర్బన్ : స్థానికంగా అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకుని ఆదాయ వనరులను పెంపొందించేందుకు స్థానిక సంస్థలు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచించారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన సెంట్రల్ తెలంగాణ స్థానిక సంస్థల ప్రాంతీయ సదస్సులో ఎమ్మెల్యే నాగరాజు, సభ్య కార్యదర్శి పి.కాత్యాయనిదేవి, సభ్యుడు ఎస్. సుధీర్ రెడ్డితో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. వివిధ జిల్లాల అదనపు కలెక్టర్లు స్థానిక సంస్థల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలు, ఆదాయ వనరులపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. స్థానిక సంస్థలు స్వీయ ఆదాయాన్ని పెంచుకుని ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్య, పచ్చదనం, పన్ను వసూళ్లు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులపైనే ఆధారపడకుండా ఇతర మార్గాల ద్వారా ఆదాయం పెంపొందించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. స్థానిక సంస్థలు ఆర్థికంగా బలపడితేనే గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, వివిధ జిల్లాల అదనపు కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. భద్రకాళిని దర్శించుకున్న నోడల్ అధికారి హన్మకొండ కల్చరల్ : వరంగల్‌లోని శ్రీ భద్రకాళి దేవాలయాన్ని శుక్రవారం ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారి, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పి.కాత్యాయనిదేవి సందర్శించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, అధికారులు ఆలయాన్ని సందర్శించిన కాత్యాయనిదేవిని పూర్ణకుంభంతో స్వాగతించారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసిన అనంతరం అర్చకులు కాత్యాయనిదేవికి తీర్ధప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య -
‘అమృత్’ విషమవుతోంది!
● పగిలిన పైపులతో కలుషితమవుతున్న తాగునీరు డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో రెండున్నర సంవత్సరాల క్రితం చేపట్టిన అమృత్ జల్ పథకం పనులతో ప్రజలకు సక్రమంగా తాగునీరందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 19 వేలకు పైగా జనాభా ఉన్న మున్సిపల్ పరిధిలో అమృత్ పనుల కోసం తవ్వకాలు చేపట్టడంతో పలు వార్డుల్లో తాగునీటిని సరఫరా చేస్తున్న పైపులు పగిలి రోజుల తరబడి తాగునీటి సరఫరా నిలిచింది. కొన్ని వార్డుల్లో రెండు నుంచి మూడు రోజులకోసారి తాగునీరు సరఫరా అవుతుండగా కొన్ని వార్డుల్లో వారం రోజులకోసారి సరఫరా అవుతుండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైపులు పగలడం, పైపుల్లో మట్టి కూరుకుపోయి సరఫరా నిలవడం, భగీరథ సరఫరా నిలిచిపోవడం, ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేయకపోవడంతో స్థానికులు నిత్యం తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. 1వ వార్డులోని అంబేడ్కర్‌నగర్, రెండవ వార్డులోని న్యూ నెహ్రూ స్ట్రీట్, 12వ వార్డులోని యాదవనగర్, 9వ వార్డు పరిధిలోని పాతడోర్నకల్, 13వ వార్డులోని బొక్కలకొట్టు బజార్ తదితర ప్రాంతాల్లో తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భగీరథ నీటి సరఫరాతో సంబంధం లేకుండా పెద్ద చెరువులోని నాలుగు బోరుబావులు, కిరీటాపురం బావితోపాటు రెండు అద్దె బావుల ద్వారా ద్వారా రాజుతండా, ఎస్సీబీసీ కాలనీ, చర్చి కాంపౌండ్, బంకట్సింగ్తండా, లచ్చాతండా, రాజుతండా, పంపుబావితండా, సిగ్నల్‌తండా, సోమ్లాతండా తదితర ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. మూడు నెలలుగా ఇబ్బందులు.. అంబేడ్కర్‌నగర్‌లోని పలు ప్రాంతాల్లో మూడు నెలలుగా తాగునీటి సరఫరా నిలవడంతో నరకయాతన అనుభవిస్తున్నాం. చేతిపంపుల ద్వారా నీటిని తెచ్చుకునేందుకు ఇబ్బంది ఉంటుంది. నీటి ఇబ్బందులపై మున్సిపల్ సిబ్బంది, పాలకవర్గం వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలి. – మందా రవి, అంబేడ్కర్ నగర్, డోర్నకల్●


