ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏలో స్టాటిస్టికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మాదాసు సురేష్‌బాబు (41) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబంతో భద్రాచలంలో నివాసముంటున్న సురేష్ శుక్రవారం బంధువుల ఇంటికి వెళ్తూ భద్రాచలం సమీపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎటపాక మండలం నెల్లిపాక వద్ద గేదెలను ఢీకొని మృతి చెందినట్లు సమాచారం. భద్రాచలంలో ఐటీడీఏ ఎస్‌ఓగా పనిచేస్తూ ఏటూరునాగారం ఐటీడీఏకు గత ఏడాది బదిలీపై వచ్చిన సురేష్.. గిరిజనుల సమస్యపై స్పందిస్తూ వారి మన్ననలను పొందారు. సురేష్‌బాబుకు భార్య, పిల్లలు ఉన్నారు.
ఏటూరునాగారం ఐటీడీఏలో ఎస్‌ఓగా పనిచేస్తున్న సురేష్‌బాబు


