breaking news
Mahabubabad District Latest News
-
ఉప్పొంగిన వాగులు
బయ్యారం/గూడూరు/గార్ల/డోర్నకల్: జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బయ్యారంలో పందిపంపులవాగు వరద ప్రవాహం అల్లిగూడెం–భీమ్లాతండా నడుమ రహదారిపైకి చేరటంతో రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో భారీ నీటిపారుదల ప్రాజెక్టు బయ్యారం పెద్దచెరువులోకి వరదనీరు భారీగా వస్తుండటంతో నాలుగు అడుగుల మేర అలుగు పోస్తోంది. మండలంలో ప్రవహించే పాకాల, అలిగేరు, వట్టేరు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. అలాగే గూడూరు నుంచి నెక్కొండ, కేసముద్రం మండలాలకు వెళ్లు మార్గంలోని పాకాలవాగు బ్రిడ్జిపై నుంచి పొంగి ప్రవహించడంతో ఆ వైపు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో డోర్నకల్ సమీపంలోని మున్నేరువాగుకు వరద భారీగా పెరిగింది. గార్ల సమీపంలోని పాకాల ఏరు చెక్‌డ్యాం పైనుంచి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గార్ల నుంచి రాంపురం, మద్దివంచ పంచాయతీల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు నిత్యావసరాలు తీర్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు బయ్యారం పెద్దచెరువుకు భారీ వరద చెక్‌డ్యాం పైనుంచి పొంగి ప్రవహిస్తున్న పాకాల ఏరు -
నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలి
● మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ మహబూబాబాద్: గణేశ్ నిమజ్జనానికి శాఖ పరంగా కేటాయించిన పనులు సకాలంలో పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ టి. రాజేశ్వర్‌రావు సిబ్బందిని ఆదేశించారు. స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం నిమజ్జనం ఏర్పాట్లపై సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నిమజ్జనం రోజున సిబ్బందికి కేటాయించిన విధుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. వినాయక మండపాల వద్ద ఉత్సవ కమిటీ సభ్యులకు సహకరించాలన్నారు. పారిశుద్ధ్య సమస్య లేకుండా చూడాలని ఆకస్మిక తనిఖీ చేసిన క్రమంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు ఉంటాయన్నారు. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈసారి నిజాం చెరువులో నిమజ్జనం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో డీఈ సీహెచ్ ఉపేందర్, మేనేజర్ శ్రీధర్, టీపీఓ సాయిరాం, ఏఈ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు ఎంపికమహబూబాబాద్ అర్బన్: పంజాబ్ రాష్ట్రంలో ఈనెల 2 నుంచి 9వ తేదీ వరకు జరగనున్న జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ చాంపియన్ షిప్ పోటీలకు జిల్లా కేంద్రానికి చెందిన ఎన్.శ్యామ్, సిద్ధార్థలు ఎంపికై నట్లు కోచ్ వెలిశాల కుమారస్వామి, ఉమ్మడి వరంగల్ జిల్లా బాధ్యులు ప్రతాప్‌రెడ్డి సోమవారం తెలిపారు. రాష్ట్ర జట్టు నుంచి జిల్లా కేంద్రానికి చెందిన వ్యక్తులు ఎంపికవడం అభినందనీయమని సీనియర్ క్రీడాకారులు చంద్రయ్య, ప్రసాద్‌రెడ్డి, కాశీనాథ్, కమల్ కిషోర్, యాకయ్య, మోహన్‌లు తెలిపారు. సమస్యల పరిష్కారంలో విఫలం● బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మహబూబాబాద్: సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వి.వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలోకి పోయేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానుకోట మండలంలోని వేంనూర్, కేసముద్రం మండలంలోని బేరువాడ, నారాయణపురం రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి పాస్ పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొన్ని గ్రామాల్లో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రధానంగా యూరియా సమస్య ఎక్కువగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్యాంసుందర్ శర్మ, హిందూ భారతి, గడ్డం అశోక్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. వాజేడు: ఆదివారం ఉదయం నుంచి గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. దీంతో మూడు రోజులుగా వరద నీటిలో మునిగి ఉన్న రహదారులు క్రమంగా బయటపడ్డాయి. దీంతో ఆయా గ్రామాలకు రాక పోకలు కొనసాగుతున్నాయి. మండల పరిధిలోని టేకులగూడెం గ్రామ చివరన మర్రిమాగు వద్ద జాతీయ రహదారి ముంపునకు గురైన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు రాక పోకలు నిలిచిపోయాయి. మూడు రోజులుగా నీటిలో ఉన్న జాతీయ రహదారి పైనుంచి వరద నీరు తగ్గడంతో రెండు రాష్ట్రాల మధ్యన రాక పోకలు సాగుతున్నాయి. -
యూరియా ఏదయా!
మహబూబాబాద్ రూరల్/కేసముద్రం: యూరియా కష్టాలు రైతులను వెంటాడుతున్నాయి. పంటలకు యూరియా పంపిణీ చేయాలని కోరుతూ సోమవారం జిల్లా వ్యాప్తంగా రైతులు రాస్తారోకో, ధర్నా చేశారు. దీంతో వాహనాలు స్తంభించాయి. జిల్లా కేంద్రంలోని పీఏసీఎస్ వద్ద తెల్లవారుజామున చేరుకున్న రైతులకు సొసైటీ సిబ్బంది యూరియా సా్ట్క్ లేదని చెప్పడంతో తొర్రూరు ప్రధాన రహదారిపై ఉదయం 10.30 గంటలకు రాస్తారోకో చేపట్టి ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మండుటెండలోనే రైతులు ఐదు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. పలువు రు రైతులు రోడ్డుపైనే పడుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఏడీఏ అజ్మీర శ్రీనివాసరావు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. యూరియా గ్రామాల వారీగా పంపిణీ చేసేవిధంగా చర్యలు తీసుకుంటామని తెలపడంతో రైతులు రాస్తారోకో విరమించారు. గందరగోళంగా టోకెన్ల పంపిణీ యూరియా టోకెన్ల పంపిణీలో గందరగోళం నెలకొంది. సోమవారం కేసముద్రం ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలోని రైతువేదిక వద్ద యూరియా టోకెన్లు ఇచ్చేందుకు ఆదివారం సాయంత్రం బారీకేడ్లు ఏర్పాటు చేయగా, సుమారు వెయ్యి మంది రైతులు రాత్రి నుంచే క్యూలో ఉన్నారు. సోమవారం ఉదయం వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో రైతులు చేరుకోవడంతో పరిస్థితి ఉ ద్రిక్తంగా మారింది. రైతుల మధ్య తోపుబాట జరగడంతో పలువురు కిందపడ్డారు. గోప్యాతండాకు చెందిన బానోత్ అనిత అనే మహిళా రైతు కాలికి తీవ్రగాయం కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ముందస్తు జాగ్రత్తగా అధికారులు 860 టోకెన్లకు గాను 430 పంపిణీ చేసి నిలిపేశారు. దీంతో ఆగ్రహానికి గురైన రైతులు పోలీస్‌స్టేషన్ ఎదుట రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న త హసీల్దార్ వివేక్, రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సై మురళీధర్రాజులు అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. యూరియా అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించారు. మరిపెడ మండలంలో రైతు లు రాస్తారోకో చేయడంతో సుమారు రెండు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.ఐదు గంటల పాటు రైతుల రాస్తారోకో కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు కేసముద్రంలో తోపులాట, మహిళా రైతుకు గాయాలు -
ఆలకించరూ..
మంత్రిగారూ..సాక్షి, మహబూబాబాద్: గిరిజనులు, ఆదివాసీలు ఎక్కువగా ఉన్న జిల్లా.. గ్రామీణ ప్రాంతం జనాభా తోపాటు నిరుపేద కుటుంబాలు ఎక్కువ.. ఇక్కడ ప్రజలకు మెరుగైన ప్రభుత్వ వైద్యం అందుబాటులో ఉంచాలని అందరూ చేబుతుంటారు.. ఈ దశలోనే గత ప్రభుత్వం పలు ఆస్పత్రులను అప్‌గ్రేడ్ చేయడం, మరికొన్ని చోట్ల కొత్త ఆస్పత్రులను మంజూరు చేసి.. శిలాఫలకాలు కూడా వేశారు. కానీ రెండు సంవత్సరాలు అవుతున్నా.. పనులు ముందుకు సాగడం లేవు. పేదలకు చేరువలో వైద్యం అందడంలేదు.. ఇలా గత ప్రభుత్వం వేసిన శిలాఫలకాలకే పరిమితమైన పనులను ముందుకు తీసుకెళ్లి గిరిజన జిల్లాలో మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని, నిధులు మంజూరు చేయాలని నేడు (మంగళవారం) జిల్లాకు వస్తున్న రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహాను జిల్లా ప్రజలు కోరుతున్నారు. వెక్కిరిస్తున్న శిలాఫలకాలు జిల్లా కేంద్రం తర్వాత పెద్ద పట్టణం, డివిజన్ కేంద్రం తొర్రూరు. గిరిజనులు ఎక్కువగా ఉన్న పట్టణం మరిపెడ. ఈ రెండు చోట్ల ఉన్న ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు ప్రతీరోజు వందలాది మంది రోగులు వస్తుంటారు. రోగుల ఫ్లోటింగ్, స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ రెండు ఆస్పత్రులను 100 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లుగా మార్చేందుకు గత ప్రభుత్వం అంగీకరించింది. ఒక్కొక్క ఆస్పత్రికి రూ. 36 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 2023 సెప్టెంబర్ 28న అప్పటి వైద్యా ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చేతుల మీదుగా ఆస్పత్రుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. తొర్రూరుకు వైద్యులు, స్టాఫ్ నర్సులను కూడా నియమించారు. కానీ ఇంకా పూర్తి స్థాయిలో అప్‌గ్రేడ్ కాలేదని స్థానికులు చెబుతున్నారు. అదేవిధంగా జిల్లాలోని నర్సింహులపేట, పెద్దవంగర, సీరోలు మండలా ల్లో నూతన ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు మంజూరు చేశారు. ఇందుకోసం ఒక్కొక్క పీహెచ్‌సీకి రూ. 1.43 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇందులో సీరోలు మండలం కాంపెల్లి, న ర్సింహులపేట మండలంలో పీహెచ్సీ నిర్మాణాల కు టెండర్ ప్రక్రియ పూర్తి కాగా పనులు ప్రారంభించలేదు. అలాగే పెద్దవంగర పీహెచ్సీ నిర్మాణం పనులు భూసేకరణతోనే ఆగింది. కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది సెస్టెంబర్లో కేసముద్రం మున్సిపాలిటీ, కొత్తగూడలోని ఆస్పత్రులను 30 పడకలకు అప్‌గ్రేడ్ చేస్తూ కొత్తగూడ రూ. 13.5 కోట్లు, కేసముద్రానికి రూ.12 కోట్లు మంజూరు చేసింది. కానీ ఇంత వరకు పనులు ప్రారంభించలేదు. వెక్కిరిస్తున్న శిలాఫలకాలు రెండేళ్లు గడిచినా.. అప్‌గ్రేడ్ కాని పీహెచ్‌సీలు ఇబ్బందుల్లో గిరిజనులు నేడు జిల్లాకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి రాకగిరిజన లంబాడీలు, ఆదివాసీ గిరిజనులతోపాటు మారుమూల ప్రాంతాల్లో నివసించే వారే జిల్లాలో ఎక్కువ. వీరికి తరచుగా వ్యాధులు సోకడం, చిన్న వైద్యానికే దూర ప్రాంతాల్లోని ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో వారి సంపాదనలో ఎక్కువ శాతం వైద్యం కోసమే ఖర్చు చేస్తున్నారు. కొందరు అప్పుల పాలవుతున్నారు. అయితే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వం జనరల్ ఆస్పత్రితోపాటు, గూడూరు, గార్ల సీహెచ్‌సీలు, 21 పీహెచ్‌సీల వైద్యం మెరుగు పర్చాల్సి ఉంటుంది. ప్రభుత్వం మంజూరు చేసిన తొర్రూరు, మరిపెడ సీహెచ్‌సీలతో జనరల్ ఫిజీషియన్లు, జనరల్ సర్జన్లు, ప్రత్యేక నిపుణులు, స్టాఫ్ నర్సులు, పేషెంట్ కేర్స్, శానిటేషన్ సిబ్బంది.. ఇలా ఒక్కొక్క ఆస్పత్రికి 120 మంది మేరకు వైద్యులు, సిబ్బంది వస్తారు. 24 గంటల ప్రభుత్వ వైద్యం అందుబాటులో ఉంటుంది. తొర్రూరు 100 పడకల ఆస్పత్రి నిర్మిస్తే డివిజన్లోని ఏడు మండలాలతోపాటు, జనగామ, వరంగల్ జిల్లాల ప్రజలకు మేలు జరుగుతుంది. మరిపెడ ఆస్పత్రి అప్‌గ్రేడ్ ద్వారా మరిపెడ, సీరోలు, నర్సింహులపేట, చిన్న గూడూరు మండలాలతోపాటు, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల ప్రజలకు మేలు కలుగుతుంది. నర్సింహులపేట, కాంపెల్లి, పెద్దవంగరలో పీహెచ్‌సీలు ఏర్పాటు చేస్తే ఆయా మండలాల ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి ఉండదు. -
రాష్ట్ర విద్యాపాలసీ కమిటీ సభ్యుడిగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్‌ఘన్‌పూర్: తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్ర విద్యాపాలసీ కమిటీ మెంబర్‌గా స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నియమితులైనట్లు ప్రభుత్వ కార్యదర్శి యోగితా రాణా ఒక ప్రకటనలో తెలిపారు. కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ఉండగా మరికొంత మంది ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు. పాఠశాల, ఉన్నత, సాంకేతిక, వృత్తి, నైపుణ్యం, వృత్తి విద్యలో సంస్కరణలు సూచించడం, సమానత్వం, క్వాలిటీ ఎడ్యుకేషన్ నిర్ధారించడం వంటి అంశాలపై సభ్యులు సూచనలు చేయనున్నారు. -
కాజీపేట–బల్లార్షా సెక్షన్లో ఎన్ఐ వర్క్స్..
కాజీపేట రూరల్ : కాజీపేట–బల్లార్షా రైల్వే సెక్షన్ల మధ్య ఎన్ఐ పనుల(కమిషనింగ్ ఆటోమెటిక్ బ్లాక్ సిగ్నలింగ్)తో కాజీపేట, వరంగల్ మీదుగా ప్రయాణించే పలు ప్యాసింజర్ రైళ్ల రద్దుతో పాటు మరికొన్ని పాక్షికంగా రద్దు, కొన్ని రైళ్లకు హాల్టింగ్‌లు ఎత్తివేత, మరికొన్ని రైళ్లను రెగ్యులేషన్ చేసి నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ సోమవారం తెలిపారు. రద్దయిన రైళ్ల వివరాలు.. ఈ నెల 3వ తేదీన కాజీపేట–సిర్పూర్టౌన్ (17003) ప్యాసింజర్, బల్లార్షా–కాజీపేట (17004) ప్యాసింజర్, బల్లార్షా–కాజీపేట (17036) ప్యాసింజర్, ఈ నెల 2వ తేదీన( నేడు) కాజీపేట–బల్లార్షా (17035) ప్యాసింజర్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. పాక్షికంగా రద్దయిన రైళ్లు.. ఈనెల 3వ తేదీన భద్రాచలంరోడ్–బల్లార్షా (17033) సింగరేణి కాజీపేట–బల్లార్షా మధ్య, సిర్పూర్టౌన్–భద్రాచలంరోడ్ (17034) సింగరేణి, సిర్పూర్ కాగజ్‌నగర్–సికింద్రాబాద్ (17234) ఇంటర్సిటీ ఈ నెల 2న సిర్పూర్ కాగజ్‌నగర్–కాజీపేట మధ్య, సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ (17233) ఇంటర్సిటీ కాజీపేట–సిర్పూర్కాగజ్నగర్ మధ్య రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఉప్పల్, జమ్మికుంటలో పలు రైళ్లకు హాల్టింగ్ ఎత్తివేత ఈ నెల 3న హైదరాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (17011) ఇంటర్సిటీ, సిర్పూర్కాగజ్నగర్–బీదర్ (17012) ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (12757) ఎక్స్‌ప్రెస్‌లకు జమ్మికుంట, ఉప్పల్ రైల్వే స్టేషన్లలో తాత్కాలికంగా హాల్టింగ్ ఎత్తివేసినట్లు సీపీఆర్వో తెలిపారు. రెగ్యులేషన్ ట్రైన్స్.. ఈ నెల 3న కాజీపేట, వరంగల్ మీదుగా వెళ్లే శ్రీమాతవైష్ణవి దేవికాట్రా–కన్యాకుమారి (16318) ఎక్స్‌ప్రెస్ 90 నిమిషాలు, లక్నో–చైన్నె సెంట్రల్ (16094) ఎక్స్‌ప్రెస్ 75 నిమిషాలు, గోరఖ్‌పూర్–యశ్వంత్‌పూర్ (15023) ఎక్స్‌ప్రెస్ 45 నిమిషాలు, సిర్పూర్కాగజ్నగర్–సికింద్రాబాద్ (12758) ఎక్స్‌ప్రెస్ 30 నిమిషాలు, న్యూఢిల్లీ–విశాఖపట్నం (20806) ఎక్స్‌ప్రెస్ 20 నిమిషాల పాటు రెగ్యులేషన్ చేసి నడిపించనున్నట్లు సీపీఆర్వో తెలిపారు. 3వ తేదీన పలు రైళ్లు రద్దు, కొన్ని పాక్షికంగా రద్దు పలు ట్రైన్లకు హాల్టింగ్‌లు ఎత్తివేత, రెగ్యులేషన్.. -
నేచురోపతి లైబ్రరీ రీసెర్చ్ సెంటర్, కేయూ మధ్య ఎంఓయూ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ, హనుమకొండ ప్రకాశ్‌రెడ్డిపేటలోని ప్రొఫెసర్ గజ్జెల రామేశ్వరం ఇంటర్నేషనల్ నేచురోపతి లైబ్రరీ రీసెర్చ్ సెంటర్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఈ మేరకు సోమవారం క్యాంపస్‌లోని అకడమిక్ కమిటీహాల్లో వీసీ కె. ప్రతాప్‌రెడ్డి సమక్షంలో రిజిస్ట్రార్ వి. రామచంద్రం, ఆ రీసెర్చ్ సెంటర్ వ్యవస్థాపకుడు గజ్జెల రామేశ్వరం అవగాహన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భగా రిజిస్ట్రార్ వి. రామచంద్రం మాట్లాడుతూ నేచురోపతి లైబ్రరీ అండ్ రీసెర్చ్ సెంటర్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న దేశంలోని తొలి యూనివర్సిటీ కేయూ అన్నారు. ఈ ఒప్పందం ద్వారా కేయూలోని లైబ్రరీ సైన్స్, ఆర్ట్స్, లైఫ్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, యోగా, సోషల్ సైన్స్ వంటి విభాగాల్లో పరిశోధనలకు ఈ రీసెర్చ్ సెంటర్‌తో విస్తృత అవకాశాలు కలుగుతాయని తెలిపారు. సైన్స్ విభాగాల డీన్ జి. హనుమంతు, పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, ప్రిన్సిపాల్ టి. మనోహర్, ఫార్మసీ కళాశాల డీన్ గాదె సమ్మయ్య, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కోల శంకర్ తదితరులు పాల్గొన్నారు. 8 నుంచి ఫార్మా ‘డీ’ ఫస్టియర్ పరీక్షలుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిఽధిలోని ఫార్మా ‘డీ’ ఫస్టియర్ రెగ్యులర్, ఎక్స్ అండ్ ఇంప్రూవ్మెంట్ పరీక్షలు ఈనెల 8వ తేదీనుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాఽధికారి ఆసిం ఇక్బాల్ సోమవారం తెలిపారు. ఈనెల 8, 10, 12, 15, 17, 19 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహిస్తామని వారు తెలిపారు. రేపు స్పోర్ట్స్బోర్డుసర్వసభ్య సమావేశం కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్‌బోర్డు సర్వసభ్య సమావేశం ఈనెల 3వ తేదీన( రేపు)ఉదయం 11గంటలకు యూనివర్సిటీలోని సెనేట్హాల్లో నిర్వహించనున్నట్లు స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ వై. వెంకయ్య సోమవారం తెలిపారు. ఇందులో కేయూ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ అనుబంధ కళాశాలల వ్యాయామ విభాగపు ఫిజికల్ డైరెక్టర్లు పాల్గొంటారని తెలిపారు. 2025–2026 విద్యాసంవత్సరానికి సంబంధించి క్రీడలు, అథ్లెటిక్స్ నిర్వహణకు సంబంధించిన క్యాలెండర్‌ను రూపొందించి చర్చిస్తారని తెలిపారు. వీసీ కె. ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి. రామచంద్రం,యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి. మనోహర్ , కేయూ ఫైనాన్స్ ఆఫీసర్ హబీబుద్దీన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటారని వెంకయ్య తెలిపారు. -
యూరియా పంపిణీలో నకిలీ కూపన్ల కలకలం..
యూరియా పంపిణీ చేస్తున్న షాపు నిర్వాహకులునర్సింహులపేట: యూరియా నకిలీ కూపన్లు కలకలం సృష్టించాయి. సోమవారం సాయంత్రం మండల కేంద్రానికి చెందిన లక్ష్మీసాయి ఫర్టిలైజర్ షాపు నిర్వాహకులకు 220 బస్తాలు రావడంతో కూపన్లు తీసుకున్న రైతులు షాపు వద్ద లైన్లో నిలుచున్నారు. కొందరు రైతులు తీసుకున్న తర్వాత 42,45 మరో నంబర్‌తో కలర్ జిరాక్స్‌తో (నకిలీ కూపన్) లారీ వద్దకు రావడంతో నిర్వాహకులు ఇంతకు ముందే ఈ నంబర్‌పై పంపిణీ చేశామని వచ్చిన వారిని పట్టుకున్నారు. యూరియా పంపిణీ త్వరగా జరగడం, రైతులు పెద్ద ఎత్తున రావడంతో రెండు నకిలీ కూపన్లతో రెండో సారి వచ్చినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్సై సురేశ్ షాపు వద్దకు వచ్చి నకిలీ కూపన్ల నంబర్లను ఆరాతీసి నిందితులను పట్టుకుని వారి నుంచి రికవరీ చేశారు. -
తప్పనున్న మెడికోల ఇబ్బందులు
● నేడు హాస్టల్ భవనాలను ప్రారంభించనున్న మంత్రులు నెహ్రూసెంటర్: వైద్య కళాశాల హాస్టల్ భవనాలు పూర్తి కాకపోక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న నేపధ్యంలో ‘సాక్షి’లో ‘మెడికోల సతమతం’ అనే కథనం ఆగస్టు 29వ తేదీన ప్రచురితమైన విషయం విదితమే. దీంతో స్పందించిన అధికారులు, ప్రజాప్రతినిధులు త్వరగా పనులు చేపట్టి ప్రారంభోత్సవానికి సిద్ధం చేశా రు. సోమవారం ప్రభుత్వ వైద్య కళాశాలను ఎమ్మె ల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ పరిశీలించారు. అనంతరం కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా సీఎం, మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. నేడు కళాశాల భవనాల ప్రారంభానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, మంత్రులు పొంగులేటి శ్రీని వాస్‌రెడ్డి, ధనసరి సీతక్క, కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరవుతున్నారని తెలిపా రు. ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ వెంకట్ లకావత్, జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఆర్డీఓ కృష్ణవేణి, నాయకులు ఎడ్ల రమేశ్, ఎండీ ఖలీల్, జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు, పద్మం ప్రవీణ్, హరిసింగ్ తదితరులు పాల్గొన్నారు. హాస్టల్ భవనాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ.. ప్రభుత్వ వైద్య, నర్సింగ్ కళాశాల హాస్టల్ భవనాల ప్రారంభానికి మంత్రులు హాజరవుతున్నందున కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాఽథ్ కేకన్, అదనపు కలెక్టర్ కె.అనిల్‌కుమార్, ఆర్డీఓ కృష్ణవేణి పరిశీలించారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
● వీసీలో సీఎం రేవంత్రెడ్డిమహబూబాబాద్: భారీవర్షాల నేపద్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి సోమవారం మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, సీతక్క, సీఎస్ రామకృష్ణారావుతో కలిసి భారీ వర్షాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆస్తి ప్రాణ నష్టం జరుగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. వీసీలో కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్, ఎస్పీ సుధీర్‌రాంనాథ్ కేకన్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె అనిల్‌కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
భార్య మందలించిందని భర్త ఆత్మహత్య
మహబూబాబాద్ రూరల్ : భార్య మందలించిందనే కారణంతో భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ మండలం కొమ్ముగూడెంలో చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై వి.దీపిక తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భూక్య గణేశ్ (35), జ్యోత్స్న దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. గణేశ్ కొంతకాలం నుంచి మద్యానికి బానిసై పనికి వెళ్లడం లేదు. దీంతో భార్య గత నెల 31వ తేదీన మందలించింది. దీనిపై మనస్తాపం చెందిన గణేశ్ గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్ప డ్డాడు. గమనించిన కుటుంబీకులు వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతిచెందాడు. ఈ ఘటనపై భార్య జ్యోత్స్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై దీపిక తెలిపారు.ఒంటరి జీవితం గడపలేక గండితండాలో యువకుడు..గార్ల: భార్య కాపురానికి రావడం లేదనే కారణంతో ఒంటరి జీవితం గడపలేక ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై రియాజ్‌పాషా కథనం ప్రకారం.. గార్ల జీపీ పరిధి గండితండాకు చెందిన బానోత్ సుమన్(32)కు అదే తండాకు ప్రమీళతో పది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. ఈ క్రమంలో సుమన్ మూడేళ్ల నుంచి మద్యానికి బానిసై ఏ పని చేయకుండా తిరుగుతుండడంతో భార్య తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. దీంతో ఒంటరి తనం భరించలేక జీవితంపై విరక్తి చెందిన సుమన్ ఆదివారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై మృతుడి తల్లి ద్వాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రియాజ్‌పాషా సోమవారం పేర్కొన్నారు. ఇంటి పనుల విషయంలో గొడవతో మరో యువకుడు.. సంగెం: ఇంటి పనుల విషయంలో జరిగిన గొడవతో మనస్తాపం చెందిన ఓ యువకుడు క్షణికావేశంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. సంగెం మండలం గవిచర్ల గ్రామానికి చెందిన ముడిదేని సతీశ్(31)కు పదేళ్ల క్రితం ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామానికి చెందిన తిప్పని అనూషతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఇంటి పనుల విషయంలో దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన సతీశ్ క్షణికావేశంలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే 108లో ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి సాంబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. -
సైబర్ మోసం..
● బ్యాంకు ఖాతా నుంచి రూ. 38,500 మాయం గీసుకొండ: మండలంలోని కొనాయమాకులకు చెందిన కక్కెర్ల నిహారిక బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 38,500 మాయం చేశారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. గీసుకొండ ఇన్స్పెక్టర్ మహేందర్ కథనం ప్రకారం..నిహారిక ఇటీవల హనుమకొండ జిల్లా కాజీపేట వద్ద తన సెల్ ఫోన్‌ను పోగొట్టుకుంది. ఈ విషయమై కాజీపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి పది రోజుల్లో సెల్‌ఫోన్‌ను రికవరీ చేసి ఆమెకు అప్పగించారు. ఈ మధ్యలో నిహారిక ఎస్బీఐ ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు ఎనిమిది విడతలుగా రూ. 38,500ను డ్రా చేశారు. దీనిపై నిహారిక గీసుకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ మహేందర్ తెలిపారు. -
మహిళా దొంగ అరెస్ట్
వరంగల్ క్రైం: రద్దీ సమయంలో బస్టాండ్‌లో బస్సు ఎక్కుతున్న ప్రయాణికురాలి బ్యాగు నుంచి డబ్బులు అపహరించిన మహిళా దొంగను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు హనుమకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ తెలిపారు. ములుగు జిల్లా గొల్లవాడ గ్రామానికి చెందిన ప్రమీళ సోమవారం హైదరాబాద్ వెళ్లడానికి హనుమకొండ బస్టాండ్‌లో బస్సు ఎక్కుతోంది. ఈ క్రమంలో ఆమె బ్యాగు నుంచి ఓ మహిళా దొంగ రూ.75 వేలు అపహరించింది. దీంతో ప్రమీళ కేకలు వేయగా అక్కడే విధుల్లో ఉన్న హనుమకొండ ఎస్సై కిశోర్ అప్రమత్తమై బస్టాండ్‌లో తనిఖీ చేశారు. ఈ సమయంలో ఓ మహిళ.. పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకున్నారు. ఆమె బ్యాగు తనిఖీ చేయగా అందులో అపహరించిన రూ. 75 వేలు లభించాయి. సదరు మహిళా దొంగను మహారాష్ట్రలో నాగ్‌పూర్‌కు చెందిన సరిఫ బాయి సురేశ్ మంకార్గా గుర్తించారు. అనంతరం ప్రమీళ ఫిర్యాదు మేరకు ఎస్సై కిశోర్ కేసు నమోదు చేసి నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ శివకుమార్ తెలిపారు. -
సమీక్షకు అసోసియేషన్లను ఎందుకు పిలువలేదు?
హన్మకొండ: సమీక్ష సమావేశానికి ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులను ఎందుకు పిలువలేదని రాష్ట్ర ఎస్సీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. సోమవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ల అమలు, ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ సమీక్ష సమావేశం నిర్వహించింది. దీనికి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాల నాయకులను పిలువకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కమిషన్ చైర్మన్.. వెంటనే సంఘాల నాయకులను పిలువాలని ఆదేశించారు. దీంతో వెంటనే అసోసియేషన్ నాయకులకు సమాచారం అందించారు. అదే విధంగా జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి వచ్చారా అని ఆరా తీశారు. రాలేదని అధికారులు చెప్పడంతో న్యూస్ ఎవరు చేస్తారు.. వెంటనే పిలిపించాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. తనకు వచ్చిన వినతి పత్రాలను పరిశీలించి వాటిని పంపిస్తానని, వాటిని పరిష్కరించి తనకు నెల రోజుల్లో ఆ నివేదికను పంపాలని సూచించారు. అనంతరం అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బక్క దానయ్య మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలు ఎన్పీడీసీఎల్లో పరిష్కారం కావడం లేదన్నారు. ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్పీడీసీఎల్ కంపెనీ కార్యదర్శి శ్రీరాం నాయక్ మాట్లాడుతూ జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ ఆదేశాలను కంపెనీ పట్టించుకోవడం లేదన్నారు. సమావేశంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కుర్సం నీలాదేవి, రాంబాబు నాయక్, జిల్లా శంకర్, రేణికుంట్ల ప్రవీణ్, డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, సీఈలు కె.మాధవ రావు, రాజు చౌహాన్, తదితరులు పాల్గొన్నారు. కాగా, ఎన్పీడీసీఎల్ హెచ్ఆర్డీ డైరెక్టర్ సి.ప్రభాకర్ కంపెనీలో చేపట్టిన నియామకాలు, పదోన్నతుల్లో అమలు చేసిన రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్‌ను సమీక్షలో వివరించారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. సోమవారం హనుమకొండలోని వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ రూల్ ఆఫ్ రిజర్వేషన్, బ్యాక్లాగ్ వెకెన్సీస్, రోస్టర్ అమలుపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ సమీక్ష నిర్వహించింది. అధికారులు డీసీసీబీలో చేపట్టిన నియామకాలు, పదోన్నతుల్లో అమలవుతున్న రిజర్వేషన్ రోస్టర్ వివరాలు వివరించగా టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు బ్యాంకు ప్రగతి, ఉద్యోగుల సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాలు వివరించారు. హనుమకొండ లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ జన్ను మహేందర్, డీసీసీబీ జీఎంలు ఉషా శ్రీ, పద్మావతి, డీజీఎం అశోక్, ఏజీఎంలు రాజు, మధు, స్రవంతి, కృష్ణమోహన్, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య -
సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
● అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ● ప్రజావాణిలో 133 వినతులుమహబూబాబాద్: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.ఈసందర్భంగా లెనిన్‌వత్సల్ టొప్పో మాట్లాడుతూ పెండింగ్ వినతులను వెంటనే పరి ష్కరించాలని, పరిష్కరించలేని దరఖాస్తులు కార ణం చూపుతూ బాధితులకు తెలియజేయాలన్నా రు. ప్రజావాణి వినతులపై నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించే ది లేదన్నారు.గ్రీవెన్స్‌లో మొత్తం 133 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జెడ్పీ సీఈఓ పురుషోత్తం, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఓపీఎస్‌ను అమలు చేయాలి
● తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ శ్రీనివాస్మహబూబాబాద్: సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ వడ్డెబోయిన శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ రఫీ, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు సామ మల్లారెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు సీపీఎస్ పెనుశాపంగా మారిందన్నారు. పోరాట ఫలితంగా కేంద్రం సీపీఎస్‌ను యూపీఎస్గా మార్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు క్లియర్ చేసి వెంటనే పీఆర్సీని అమలు చేయాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ, యాఖుబ్, రమేశ్, వీరయ్య, ఎం.నాగయ్య, ఎం.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
బహుబాగు..
పందిరి సాగు..ఈ విధానపు కూరగాయల తోటలతో అధిక దిగుబడి, ఆదాయంహన్మకొండ: పందిరి కూరగాయల తోటల ద్వారా అధిక దిగుబడితోపాటు అధిక ఆదాయం అర్జించొచ్చు. ఏడాది పొడవునా దిగుబడులు పొందొచ్చు. అందుకే పందిరి కూరగాయల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ఉద్యాన శాఖ ద్వారా రాయితీ అందిస్తోంది. శాశ్వత పందిరి ఏర్పా టు కోసం 50 శాతం రాయితీ చొప్పున ఎకరాకు రూ. లక్ష అందిస్తుంది. ఒక రైతుకు గరిష్టంగా రెండున్నర ఎకరాల వరకు సబ్సిడీ ఇస్తారు. శాశ్వత పందిరిపై అనప, గుమ్మడి, పొట్ల, కాకర, బీర, దోస, బూడిద గుమ్మడి వంటి తీగజాతి కూరగాయలు పండించొచ్చు. ఈ పద్ధతి కూరగాయలకు మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. ఏడాదికి మూడు పంటలు వేసుకోవచ్చని ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు. నేలలు: ఈ పంటలను అన్ని రకాల నేలల్లోనూ సాగు చేసుకోవచ్చు. ఇసుక నేలల నుంచి తేలికపాటి బంకమన్ను వరకు అన్ని నేలల్లో పండించొచ్చు. ఎక్కువ క్షార, ఆమ్ల గుణలున్న నేలల్లో ఎదుగుదల సరిగా ఉండదు. ఈ నేలల్లో సాగుచేస్తే ఆకులు పసుపు వర్ణానికి మారుతాయి. ఉదజని సూచిక 6.0 నుంచి 6.7 ఉన్న నేలలు సాగుకు అనుకూలం. మురుగునీటి వసతి ఉండడం తప్పనిసరి. పొలాన్ని 3–4 సార్లు బాగా దున్ని తయారుచేసుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 20 టన్నుల వరకు బాగా మాగిన పశువుల ఎరువును వేయాలి. విత్తనం విత్తే పద్ధతి: భూమి మీద పాకించే పాదులకు, వర్షాకాలంలో నీటి కాల్వ లకు తోడుగా మురుగు నీరు వెళ్లడానికి 2 మీ. దూరంలో కాల్వలు చేయాలి. వేసవిలో వేసే పాదులకు పొలం అంతటా నీటి పారుదల కోసం బోదెలను చేయాలి. అన్ని రకాల పాదులకు 3 విత్తనాలను 1–2 సెం.మీ. లోతులో విత్తుకోవాలి.అన్ని తీగజాతి కూరగాయలను వర్షాధార పంటకు 10 సెం.మీ. కొలతలు గల పాలిథీన్ సంచుల్లో విత్తుకుని 15–20 రోజులు పెరిగిన తర్వాత అదునులో పొలంలో నాటుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రా. చొప్పున థైరమ్, 5 గ్రా. చొప్పున ఇమిడాక్లోప్రిడ్ ఒకదాని తర్వాత మరొటి కలిపి విత్తనశుద్ధి చేయాలి. ఆ తర్వాత 100 గ్రా. విత్తనానికి 2గ్రా. చొప్పున ట్రైకోడెర్మా విరిడేతో విత్తన శుద్ధి చేసి విత్తాలి. విత్తే ముందు ఎకరాకు 8–10 టన్నుల పశుఎరువు, 32–40 కిలోల భాస్వరం, 16–20 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులను గుంటల్లో వేయాలి. నత్రజనిని (32–40కిలోలు) రెండు సమపాళ్లుగా చేసి విత్తిన 25–30 రోజులకు, పూత, పిందె దశలో వేసుకో వాలి. మొక్కకు దగ్గరలో ఎరువు వేయొద్దు. ఎరువు వేసిన వెంటనే మట్టిని కప్పి నీరు పారించాలి. కలుపు నివారణ, అంతరకృషి: కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. 2–3 తడుల తర్వాత మట్టిని గుల్లచేయాలి. ఎకరాకు పెండిమి థాలిన్ 1.2 లీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 24–48 గంటల లోపు నేలకు పిచికారీ చేయాలి. మొక్కలు 2–4 ఆకుల దశలో ఉన్నప్పుడు లీటర్ నీటికి 3 గ్రా. బోరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేస్తే పూలు ఎక్కువ పూసి పంట దిగుబడి అధికంగా ఉంటుంది. కాకర, పొట్ల పంటలను తప్పనిసరిగా పందిరి పైకి తీగలు పాకించాలి. లేని పక్షంలో పండు ఈగ బెడద ఎక్కువ ఉంటుంది. అనప, బీర, పొట్ల, కాకర పంటలను పందిళ్లపై పెంచితే నాణ్యత గల కాయలు కాసి అధిక ధర లభిస్తుంది. రాయితీని సద్వినియోగం చేసుకోవాలి.. పందిరి కూరగాయల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా అందజేస్తున్న రాయితీని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. పందిరి కూరగాయల సాగు లాభదాయం. అధిక దిగుబడి వస్తుంది. దీంతో ఆదాయం పెరుగుతుంది. – జి.అనసూయ, ఆర్.శ్రీనివాసరావు, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారులు, హనుమకొండ, వరంగల్ పందిరి ఏర్పాటుకు ప్రభుత్వం సబ్సిడీ ఎకరాకు రూ. లక్ష రాయితీ గరిష్టంగా రెండున్నర ఎకరాల వరకు అవకాశం -
వావ్.. వాటర్ ఫాల్స్
చుట్టూ పచ్చని అటవీ ప్రాంతం.. అడవి మధ్యలో ఎత్తైన గుట్టలు.. ఆ గుట్టల మధ్య ఏర్పడిన సహజసిద్ధ పాయల నుంచి పారుతున్న నీరు పాలనురగలా జాలువారుతోంది. అలుగుపై గలగలా పారుతూ పర్యాటకుల మనసును కట్టిపడేస్తున్నాయి. ఆదివారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి గ్రామ సమీపంలోని బొగత, మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం శివారు కొమ్ములవంచ సమీపంలోని భీమునిపాదం, ఇదే జిల్లా బయ్యారం సమీపంలోని పెద్దగుట్టపై ఉన్న పాండవుల జలపాతం ఉధృతంగా జాలువారుతున్నాయి. దీంతో ఆ అందాలను చూసేందుకు సోమవారం పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు ఆయా జలపాతాల వద్దకు అధిక సంఖ్యలో వచ్చారు. ఈ సందర్భంగా జలపాతాల్లో స్నానం చేస్తూ కేరింతలు కొట్టారు. సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ ఎంజాయ్ చేశారు. జలపాతాల అందాలకు ఫిదా అయ్యారు. – వాజేడు/గూడూరు/బయ్యారం పాలనురగలా జాలువారుతున్న జలపాతాలు ● పర్యాటకుల మనసు దోచుకుంటున్న బొగత, భీమునిపాదం, పాండవుల జలపాతాలు -
మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్‌పోస్టర్లు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ఆదివాసీ ప్రజలు మావోయిస్టులకు సహకరించొద్దు, హింసామార్గం విడిచి సాధారణ ప్రజా జీవితంలోకి రావాలని తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ యువజన సంఘం పేరుతో మావోయిస్టులకు వ్యతిరేకంగా సోమవారం వాల్‌పోస్టర్లు వెలిశాయి. మండల పరిధిలోని బయ్యక్కపేట, ఊరట్టం, కాల్వపల్లి గ్రామాల్లో పలుచోట్ల వాల్ పోస్టర్లు కనిపించాయి. మావోయిస్టులతో ఒరిగేదేమి లేదని అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో మావోయిస్టుల అవసరం లేదని.. గ్రామాల అభివృద్ధికి, పిల్లల భవిష్యత్ బాగుండాలంటే మావోయిస్టుల సమాచారం పోలీసులకు ఇవ్వాలని పోస్టర్లో పేర్కొన్నారు. ఈ వాల్ పోస్టర్ల విషయం ఆయా గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది. -
భద్రతా వైఫల్యం!
మహబూబాబాద్: అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో బాలసదనాల సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల బాల సదనం నుంచి నలుగురు బాలికలు పరార్ కావడమే ఇందుకు నిదర్శనం. కాగా బాలికలకు భద్రత లేదని తల్లిదండ్రులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా చాలా సందర్భాల్లో బాలికలు పరారయ్యారు. అయినా సిబ్బంది తీరులో ఎలాంటి మార్పురావడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపడితే బాల సదనం నిర్వహణలో మార్పు వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో రెండు బాల సదనాలు.. జిల్లాలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ పరిధిలో రెండు బాల సదనాలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో బాలబాలికలకు వేర్వేరుగా బాలసదనా లు ఉన్నాయి. అలాగే జిల్లా కేంద్రంలో దైవ కృప అనే ప్రైవేట్ ఆశ్రమం ఉండగా.. అక్కడ 17 మంది బాలురు ఉన్నారు. ఆశాభవన్‌లో 19 మంది బాలు రు, తొర్రూరులోని స్నేహనివాస్లో 39 మంది బాలికలు ఉన్నారు. ఇదిలా ఉండగా జిల్లా కేంద్రంలోని బాలికల బాలసదనంలో 22 మంది ఉన్నారు. ఇందులో 20 మంది పాఠశాలలకు వెళ్తున్నారు. బాలుర బాలసదనంలో 29 మంది ఉన్నారు. అవి రెండు కూడా అన్ని వసతులు ఉన్న ప్రభుత్వ భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వాటిలో సూపరింటెండెంట్, మ్యాట్రిన్, చైల్డ్వెల్ఫేర్ అధికారి, సూపర్వైజర్, కేస్‌వర్కర్, కేస్ టేకర్, కుక్, అటెండర్, నైట్ వాచ్మెన్ ఉండాలి. కాగా బాలికల బాలసదనంలో నైట్ వాచ్మెన్, కేస్ వర్కర్, కేస్ ట్రేకర్ మాత్రమే లేరు మిగతా సిబ్బంది ఉన్నారు. అలాగే బాలుర బాలసదనంలో పూర్తిస్థాయి సిబ్బంది ఉన్నారు. 18 సంవత్సరాల్లోపు పిల్లల కోసమే.. 18 సంవత్సరాలలోపు పిల్లల కోసమే ప్రభుత్వం బాలసదనాలు ఏర్పాటు చేసింది. లక్షల వేతనాలు చెల్లిస్తూ సిబ్బందిని భర్తీ చేసింది. బాలసదనాల్లో అన్ని వసతులు కల్పించింది. తల్లిదండ్రులు లేని పిల్లలు, పేదరికంలో ఉన్నవారు, తప్పిపోయిన పిల్లలు, బాల కార్మికులు, బాల్యవివాహాలు చేసుకున్న వారు, రిస్క్ చేసిన పిల్లలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. నలుగురు పిల్లలు పరార్.. జిల్లా కేంద్రంలోని బాలికల బాలసదనం నుంచి ఆగస్టు 27న రాత్రి 11.16 గంటలకు నలుగురు బాలికలు పరారయ్యారు. ఈమేరకు బాలసదనం సిబ్బంది 28వ తేదీన టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేశారు. వెంటనే పోలీసులు స్పందించి గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఆ నలుగురిలో ఇద్దరిని వరంగల్‌లో పట్టుకున్నట్లు సమాచారం. మిగిలిన ఇద్దరు హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు. వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. గతంలోనూ ఘటనలు.. బాలికల బాలసదనంలో గతంలోనూ బాలికలు పరారైన ఘటనలు ఉన్నాయి. ఏటా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా.. భద్రత విషయంలో అధికారులు పెద్దగా దృష్టిపెట్టడం లేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కిందిస్థాయి సిబ్బంది పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కాగా బాలికలు అటెండర్‌పై చేయి చేసుకుని తాళాలు పగులకొట్టి పరారైనట్లు సమాచారం. కాగా భత్రను పటిష్టం చేయకపోతే ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. తీసుకొచ్చిన వారికి కౌన్సెలింగ్.. బాలసదనం నుంచి పారిపోయిన వారిని తీసుకొచ్చి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులు ఉంటే అప్పగించడం, వారు స్పందించకుంటే అక్కడే ఉంచుకుని వారికి ఒకేషనల్ కోర్సుల్లో శిక్షణ ఇప్పించడం, ఓపెన్ టెన్త్, ఇంటర్, డిగ్రీ లాంటి కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బాల సదనం నుంచి నలుగురు బాలికలు పరార్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యం గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పటికీ మారని సిబ్బంది తీరు -
ఆశాజనకంగా వరి సాగు
సాక్షి, మహబూబాబాద్: వానాకాలం సీజన్ ప్రారంభంలో వర్షాలు దోబూచులాడాయి. దీంతో వరి సాగుపై సందిగ్ధంగా ఉన్న రైతులు.. తర్వాత వర్షాలు కురుస్తున్న కొద్దీ సాగులో వేగం పెంచారు. మొదట ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో వార్షిక ప్రణాళిక లక్ష్యంలో సగం కూడా పంట సాగయ్యే అవకాశం లేదని అధికారులు భావించారు. అయితే జూలై మూడో వారం నుంచి ఆగస్టు వరకు అంతా తారుమారైంది. వరి సాగులో వెనక్కి తగ్గకుండా రైతులు లక్ష్యానికి చేరువయ్యారు. మందకొడిగా మొదలు.. ఈ ఏడాది జూన్‌లో సరిగా వర్షాలు పడలేదు. దీంతో వరి సాగుచేసే రైతులు నార్లు ఆలస్యంగా పోసుకున్నారు. జూలై మొదటి వారం వరకు కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. దీనికి తోడు గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 157 చెరువులు, కుంటలు తెగిపోయాయి. ఈ పరిస్థితిలో సరైన వర్షం పడకపోవతే ఇబ్బంది అవుతుందని రైతులు వరి సాగుకు వెనకడుగు వేశారు. బావులు, బోర్ల కింద మాత్రమే కొంతమేరకు సాగుచేశారు. ఇలా జిల్లాలో వరి సాగు అంచనా 2,21,282 ఎకరాలు ఉండగా.. జూలై మొదటి వారం వరకు 70వేల ఎకరాల్లో కూడా సాగు చేయలేదు. ఈ పరిస్థితిలో వరికి బదులు ఏ పంట సాగు చేయాలని రైతులు ఆలోచించారు. తర్వాత జూలై మూడో వారంలో మోస్తరు వర్షాలు కురిశాయి. అప్పుడు వ్యవసాయశాస్త్రవేత్తలు దీర్ఘకాలిక వంగడాలు కాకుండా స్వల్పకాలిక వంగడాలు సాగు చేసుకోవాలని సూచించారు. ఈక్రమంలో ఆగస్టు నెల ఆరంభం నుంచి వర్షాలు జోరందుకున్నాయి. దీంతో ఇప్పటి వరకు జిల్లాలో 2,10,676 ఎకరాల్లో వరి సాగు చేయగా ఈ వారం రోజుల్లో మరో 10వేల ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అంటే ఆలస్యంగా సాగు మొదలైనా రైతులు అంచనాకు చేరువలోకి వరి సాగును తీసుకొ చ్చారు. అదే విధంగా మిర్చి పంట 52,249 ఎకరాల్లో సాగుచేస్తారని అంచనా వేయగా ఇప్పటి వరకు కేవలం 2,327 ఎకరాల్లోనే సాగుచేశారు. అయితే మిర్చి నార్లుపోసి అదునుకోసం ఎదురు చూస్తూ ఆలస్యమైంది. ప్రస్తుతం కురిసిన వర్షాలతో సాగు వేగం పుంజుకుంది. మరో పంట వేయలేక.. తొలుత వర్షాభావ పరిస్థితులతో పత్తి సాగు అంచనా 84,854 ఎకరాలు ఉండగా 82,539 ఎకరాల్లోనే సాగు చేశారు. అదే మొక్కజొన్న మాత్రం 58,361 ఎకరాలు సాగుచేస్తారని అంచనా వేయగా అంచనాకు మించి 62,021ఎకరాల్లో సాగుచేశారు. వరి విషయానికొస్తే 2,21,282 సాగు అంచనా ఉండగా ఆగుతూ సాగుతూ.. 2,10,676 ఎకరాలకు చేరింది. మిగిలిన పదివేల ఎకరాల్లో కూడా ఇంకా సాగుచేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అంటే వరి సాగుచేసే రైతులు మరో పంట వేసేందుకు వెనకడుగు వేశారు. కష్టమైనా.. నష్టమైనా వరి సాగే చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. కూలీల కొరత, కుటుంబ అవసరాలు, సన్నధాన్యం వేస్తే అదనంగా క్వింటాకు రూ. 500 బోనస్ వస్తుందనే నమ్మకం, సమృద్ధిగా నీటి వనరులు ఉండటం మొదలైన కారణాలతోనే వరి సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటివరకు 70శాతానికి మించి సన్నరకం వంగడాలే సాగు చేయడం గమనార్హం. ఆలస్యంగా సాగు మొదలైనా ఈ ఏడాది 4.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వరి సాగు (ఎకరాల్లో) అంచనాకు చేరువలో సేద్యం ఆలస్యంగా వర్షాలు కురిసినప్పటికీ ఆగని సాగు ఇబ్బందులెదురైనా వరిపై రైతులకు తగ్గని మోజు 4లక్షల టన్నులకుపైగా దిగుబడి అంచనాపంటల సాగు వివరాలు(ఎకరాలు) పంట అంచనా సాగు వరి 2,21,282 2,10,676 మొక్కజొన్న 58,361 62,021 పత్తి 84,854 82,539 మిర్చి 52,249 2,327 పెసర 4,555 1,614 పసుపు 00 150 బొబ్బెర్లు 00 10 మినుములు 00 38 మొత్తం 4,21,301 3,59,7752,10,676 -
విద్యాసామర్థ్యాల పెంపే లక్ష్యం
● నేటి నుంచి ఈనెల 15వరకు పఠనోత్సవం ● విద్యార్థుల అక్షరపునాదికి చర్యలు ● రోజుకు 30నిమిషాల పాటు పఠనానికి కేటాయింపుమహబూబాబాద్ అర్బన్: సర్కారు బడుల్లో చదివే విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పెంచేందుకు విద్యాశాఖ అధికారులు నడుం బిగించారు. ముఖ్యంగా విద్యార్థులు చదవడం అలవాటు చేసుకోవడమే లక్ష్యంగా పఠనోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒకటో తరగతి విద్యార్థులు సరళ పదాలు, గుణిత పదాలు చదవడం, 2వ తరగతి విద్యార్థులు ద్విత్వ, సంయుక్తాక్షర పదాలు, వాక్యాలను ధారళంగా చదవగలడం, 3 నుంచి ఆపై తరగతి విద్యార్థులు అన్ని సబ్జెక్ట్‌లకు చెందిన పాఠ్యాంశాలతో పాటు వారి స్థాయికి తగిన బాల సాహిత్యాన్ని, దిన పత్రికలను చదివేలా పఠనోత్సవ కార్యక్రమాన్ని నేడు ప్రారంభించనుండగా.. ఈనెల 15న ముగియనుంది. నిరుపేద విద్యార్థులే... ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధికంగా నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులే చదువుతున్నారు. వసతులు, ఇతర కారణాలతో చదువులో పట్టు సాధించలేకపోతున్నారు. ఉన్నతస్థాయిలో చాలా మంది విద్యార్థులు చదవడం, రాయడంలో తబడుతున్నారు. తరచూ విద్యార్థులు బడికి గైర్హాజరు కావడం కూడా ఇందుకు కారణమవుతోంది. దీంతో విద్యార్థుల్లో కనీస విద్యా సామర్థ్యాలు కరువవుతున్నాయి. ఈనేపథ్యంలో విద్యార్థులకు విషయ పరిజ్ఞానాన్ని అందించి ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఈ విద్యా సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థుల కోసం కార్యక్రమం రూపకల్పన చేశారు. అభ్యసనాభివృద్ధి.. జిల్లాలో 898 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఆదర్శ పాఠశాలలు 8, టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ స్కూళ్లు 4, తెలంగాణ ట్రైబల్ గురుకుల పాఠశాలలు 7, గిరిజన ఆశ్రమ పాఠశాలలు 22, మైనారిటీ గురుకుల పాఠశాలలు 3, కేజీబీవీలు 15, ఒక కేంద్రియ విద్యాలయం ఉంది. ఆయా పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు సుమారు 96,386 వేల మంది చదువుతున్నారు. రోజు పుస్తక పఠనోత్సవం కోసం ప్రతీ తరగతికి 30 నిమిషాలు కేటాయించాల్సిదే. పిల్లలు ధారళంగా చదివేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలి. తరగతి ఏదైనా.. విషయం ఏదైనా బోధిస్తున్న ఉపాధ్యాయుడు బోధన అంశాలకు సంబంధించి ప్రాథమిక పరిజ్ఞానాన్ని పిల్లలు అందరూ చదువుతున్నారా? లేదా? అనే అంశాలను పరిశీలించి బోధించిన పాఠ్యాంశాన్ని 10 నిమిషాల పాటు ఒక్కొక్క విద్యార్థ్ధితో చదివించి, కీలక పదాలను గుర్తించి బోర్డు చార్టుపై రాయించాలి. తద్వారా పిల్లలకు చదవడం అలవాటుగా మారే విధంగా చూడాలి. మరో వ్యూహంలో గ్రంథాలయ పుస్తకాలను పిల్లలతో చదివించాల్సి ఉంటుంది. ప్రతీరోజు ప్రతీ తరగతికి గ్రంథాలయ పుస్తకాలు చదవడానికి 30 నిమిషాలు కేటాయించాలి. గ్రంథాలయంలో మూడు రోజుల్లో తెలుగు, హిందీ, ఉర్దూలోని కథల పుస్తకాలు చదివించాలి. ఇలా ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల్లో రాయడం, చదవడం, లెక్కలు చేయడం వంటి సామర్థ్యాలను పెంచాలి. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి. ప్రతీ పాఠశాలలో పఠనోత్సవం నిర్వహించాలి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ప్రతీ విద్యార్థికి నాణ్యమైన విద్య అందించేందుకు సెప్టెంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు పఠనోత్సవం ప్రభుత్వం నిర్వహిస్తోంది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గ్రంథాలయాల్లో పుస్తకాలు, కథలు, దిన పత్రికలను విద్యార్థులతో చదివించాలి. అన్ని సబ్జెక్ట్‌లు ధారళంగా చదివేవిధంగా విద్యార్థులను తయారు చేయాలి. నిర్ణీత గడువులోగా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా కార్యక్రమంపై పర్యవేక్షణ చేస్తున్నాం. – దక్షిణామూర్తి, డీఈఓ -
చిమ్మ చీకటి.. జోరువాన
● అన్నదాతల ‘కూపన్’ కష్టాలు..బందోబస్తు మధ్య యూరియా కూపన్ల పంపిణీ నర్సింహులపేట: మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద ఆదివారం ఉదయం నుంచి ఎస్సై మాలోతు సురేష్, సిబ్బంది పర్యవేక్షణలో అధికారులు రైతులకు యూరియా కూపన్లు అందజేశారు. యూరియా రాకున్నా సాయంత్రం వరకు 770 కూపన్లు అందజేశారు. కాగా కూపన్లు అందని సుమారు 800 మంది రైతులు ఏఓ వినయ్‌కుమార్‌ను కార్యాలయం ఎదుట నిలదీశారు. వారం రోజుల నుంచి తిరుగుతున్న కూపన్లు ఇవ్వడం లేదని, కూపన్లు ఇస్తనే ఇంటికి వెళ్తామని రైతులు ఏఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా కూపన్లు రాని రైతుల నుంచి పట్టాదారు పాస్బుక్కుల జిరాక్స్‌లు తీసుకున్నారు. రెండు రోజుల్లో కూపన్లు అందజేసి యూరియా బస్తాలు ఇస్తామని, అందోళన చెందాల్సిన అవసరం లేదని ఏఓ అన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూసిన రైతులు చివరకు కూపన్లు దొరకకపోడంతో నిరాశతో ఇళ్లకు వెళ్లారు. ఎస్సై సురేష్ ఎలాంటి గొడవలు జరగకుండా పర్యవేక్షణ చేశారు. కేసముద్రం: కేసముద్రం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలోని రైతు వేదిక వద్ద ఆదివారం రాత్రి యూరియా కూపన్ల కోసం రైతులు జాగరణ చేశారు. నేడు(సోమవారం) రైతు వేదిక వద్ద యూరియా ఇవ్వనుండడంతో అధికారులు మహిళలు, పురుషుల కోసం ఆదివారం సాయంత్రం ప్రత్యేకంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న చుట్టు పక్కల గ్రామాల రైతులు అధిక సంఖ్యలో చేరుకోవడంతో.. పోలీ సులు వారిని క్యూలో నిలబెట్టారు. వీరితో పాటు మరికొంతమంది రైతులు వస్తుండడంతో ప్రధాన గేటుకు తాళం వేశారు. ఒక వైపు వర్షం పడుతున్నప్పటికీ రైతులు గొడుగులు పట్టుకొని నిల్చు న్నారు. యూరియా కూపన్ల కోసం పడిగాపులు పడ్డారు. కనీసం విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయకపోవడంతో చీకట్లో రైతులు అవస్థలు పడ్డారు. మరికొందరు మహిళలు, వృద్ధులు దుప్పట్లను వెంట తెచ్చుకుని రైతు వేదిక ముందు నిద్రించారు. చీకట్లో మహిళా రైతులు అవస్థలు పడ్డారు. మొత్తానికి యూరియా టోకెన్ల కోసం అర్ధరాత్రి వరకు నానా అవస్థలు పడ్డారు. సెల్ఫోన్ల లైట్ల వెలుతురు మధ్య కూర్చున్నారు. -
హేమాచలక్షేత్రంలో భక్తుల కోలాహలం
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. ఆలయంలోని స్వయంభూ లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకుని పూజలు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి కార్లు, ఆటోలు ఇతర ప్రైవేట్ వాహనాల్లో హేమాచలగుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలోని చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించారు. -
జల విలయానికి ఏడాది..
మరిపెడ రూరల్: గతేడాది ఆగస్ట్ 31 అర్ధరాత్రి, సెప్టెంబర్ 1న తెల్లవారుజామున ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి వరదలు ముంచెత్తాయి. ఫలితంగా మండలంలోని చెరువులు, కుంటలన్నీ తెగిపోయి వరద పోటెత్తింది. ఆకేరు వాగు ఉగ్రరూ పం దాల్చి పరీవాహక ప్రాంత గ్రామాలు మహబూ బాబాద్ జిల్లా మరిపెడ మండలం ఉల్లెపల్లి, సీతా రాంతండా, బాల్నిధర్మారం గ్రామాల్లోకి అర్ధరాత్రి వరద చేరుకుంది. ఆ సమయంలో ప్రజలంతా ని ద్రలో ఉన్నారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఇళ్లల్లోకి నీ రు చేరడంతో ఏమి జరుగుతుందో అర్థం కానీ ప రిస్థితుల్లో అర్థనాదాలు చేశారు. సీతారాంతండా పూ ర్తిగా జలమయమైంది. దీంతో బతుకు జీవుడా అంటూ ఇళ్లల్లో నుంచి పిల్లాపాపలతో బయటకు పరుగులు తీశారు. ఎటు చూసిన వరదనీరే. దీంతో ఇళ్ల స్లాబ్‌లు ఎక్కి బిక్కుబిక్కుమంటు తెల్లవార్లు పైనే ఉండి ప్రాణాలు రక్షించుకున్నారు. విషయం తెలు సుకున్న అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు ప్రత్యేక బృందాలతో ముంపు గ్రామాలకు చే రుకుని వరదల్లో చిక్కుకున్న సీతారాంతండా ప్రజ లను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముంపు గ్రామాల్లో భారీ నష్టం.. ముంపు గ్రామాల్లో భారీ నష్టం వాటిల్లింది. తిండి గి ంజల నుంచి దుస్తుల వరకు తడిసి ముద్దయ్యాయి. పంటలన్నీ వరదకు కొట్టుకుపోయాయి. దీంతో ఎ టుచూసినా ఇసుక దిబ్బలు తప్ప మరేమీ కనిపించలేదు. బాల్నిధర్మారం–జెల్లెపల్లి గ్రామాల మధ్య ఆకే రు వాగుపై ఉన్న బ్రిడ్జి అరకిలోమీటర్ కొట్టుకుపోయింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారంతండాకు చెందిన యువ శాస్త్రవేత్త నూనావత్ అశ్వ ని, ఆమె తండ్రి మోతీలాల్ కారులో హైదరాబాద్ వెళ్తున్నారు. ఈ క్రమంలో పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి వద్ద హైవే తెగిపోయి కారు కొట్టుకుపోయింది. దీంతో తండ్రి, కూతురు మృతి చెందారు. సుమారు వెయ్యి ఎకరాల్లో పంట నష్టం.. అధికారుల లెక్కల ప్రకారం.. సీతారాంతండాలో 49, ఉల్లెపల్లిలో 123, బాల్నిధర్మారంలో 10, తండాధర్మారంలో 10 ఇళ్లు నీట మునిగాయి. అలాగే, ఆకేరు వాగు పరీవాహక ప్రాంతంలో సుమారు వె య్యి ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. అనంతరం ముంపుకు గురైన సీతారాంతండాను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సందర్శించారు. బాధిత కుటుంబాలకు రూ.10 వేలు, పంట నష్టం జరిగిన బాధితులకు రూ.16 వేల చొప్పున పరిహారం అందించారు. వాగు పరీవాహక గ్రామాల్లో ముంపునకు గురైన ఇళ్ల బాధిత కుటుంబాలకు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి వారందరికీ ఒకే చోట సామూహికంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇ స్తామని సీఎం ఇచ్చిన హామీ నేటికీ అమలు కాలేదని బాధితులు కన్నీరుమన్నీరవుతున్నారు.గతేడాది అర్ధరాత్రి ముంచెత్తిన వరదలు ఆకేరు వాగు వరద నీటిలో చిక్కుకున్న సీతారాంతండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇంటి స్లాబ్‌లపైకి ఎక్కిన ప్రజలు అనంతరం తండాను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి వరద బాధితులకు ఇచ్చిన హామీ ఏడాదిగా నెరవేరని వైనం -
సర్వం కోల్పోయాం..
గతేడాది ఆకేరు వాగు వరద ధాటికి సర్వం కోల్పోయాం. వారం రోజులుగా ఇళ్లు వదిలేసి పునరావాస కేంద్రంలోనే తలదాచుకున్నాం. ఇప్పటికీ ఆ పీడకల గుర్తుకొస్తే భయంతో వణికిపోతున్నాం. –మూడు రామన్న, ముంపు బాధితుడు, సీతారాంతండా కోలుకోలేక పోతున్నాం.. వరదతో సర్వం కోల్పోయిన మేము ఇంకా కోలుకోలేకపోతున్నాం. పొలాల్లో ఇసుక మేటలు పడి పంటలు పండే పరిస్థితి కానరావడం లేదు. ఇంట్లో వస్తువులన్నీ వరదకు కొట్టుకుపోవడంతో ఒక్కొక్కటిగా కొనుగోలు చేసుకుంటున్నాం –గుగులోత్ మంగీ, ముంపు బాధితురాలు, సీతారాంతండా వర్షం వస్తే భయం అనిపిస్తోంది.. గతేడాది ఆకేరు వాగు వరదలో చిక్కుకుని బతికి బట్టగట్టా. ప్రస్తుతం వర్షం వస్తే భయంతో వణికి పోవాల్సి వస్తుంది. నా ఇల్లు ఉల్లెపల్లిలో ఆకేరు వాగు ఒడ్డునే ఉంది. ఎప్పడు వరదలు వచ్చి ప్రాణాలు పోతాయోనని భయంగా ఉంది. –గండ్లు శాంతమ్మ, ముంపు బాధితురాలు, ఉల్లెపల్లి -
సమస్యలకు చావే పరిష్కారం కాదు..
ఏదైనా సమస్య ఉంటే కుటుంబ సభ్యులతో పంచుకోవాలి. స్నేహితుల సహకారం తీసుకోవాలి. అంతేకానీ ఆత్మహత్యకు పాల్ప డొద్దు. ఆత్మహత్యకు ముందు చాలా మంది డిప్రెషన్‌కు లోనవుతారు. ఈసమయంలో ఎవరైనా గుర్తిస్తే ఆత్మహత్య నిర్ణయం నుంచి బయటకొచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వారికి భరోసా ఇచ్చేలా మాట్లాడాలి. అవసరమైతే వైద్యులతో కౌన్సెలింగ్ ఇప్పించాలి. డాక్టర్ రాజు, సైకియాట్రిస్ట్, వరంగల్ అవగాహన కల్పిస్తున్నాం.. ఫుట్ బోర్డు ప్రయాణం ప్రమాదమని ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నాం. రైల్వేస్టేషన్లో ఎక్కువ సేపు కూర్చుంటున్న వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. రైలు పట్టాలు దాటడం, సురక్షితంగా గమ్యస్థానాలు చేరుకోవడానికి జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నాం. అలాగే, సూసైడ్ స్పాట్లను గుర్తించి ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం. సురేందర్, జీఆర్పీ ఇన్స్పెక్టర్, వరంగల్ -
ఐక్య పోరాటాలతోనే కార్మిక హక్కుల రక్షణ
తొర్రూరు: ఐక్య పోరాటాలతోనే కార్మికుల హక్కుల పరిరక్షణ సాధ్యమని టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు కె. సూర్యం అన్నారు. డివిజన్ కేంద్రంలో టీయూసీఐ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి రవి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సూర్యం మాట్లాడారు. ప్రధాని మోదీ కార్మిక చట్టాలను రద్దు చేసి కోట్లాది కార్మికుల జీవితాలను అంధకారంలోకి నెడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల శ్రమ శక్తిని దోచుకుంటూ మతవిద్వేషాలతో కూడిన రాజకీయం చేస్తుందన్నారు. కనీస వేతనాల జీఓను అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందన్నారు. కార్మికుల క్రమబద్ధీకరణ విషయంలోనూ నిర్లక్ష్యం చేస్తోందన్నారు. పనిగంటలను పెంచి కార్మికుల శ్రమను దోచుకుంటుందన్నారు. లక్షలాది కార్మికులకు పీఎఫ్ అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కార్యక్రమంలో సంఘ కార్యదర్శి బిల్లకంటి సూర్యం, నాయకులు జక్కుల యాకయ్య, శ్రీరాం పుల్లయ్య, అర్వపల్లి వెంకన్న, పాడ్య భీకు, వేర్పుల మహేందర్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎరుపెక్కుతున్న రైలు పట్టాలు
● వరంగల్ చింతలపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఇటీవల క్రిస్టియన్ కాలనీకి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి జీవితంపై విరక్తి చెంది రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ● బట్టల షాపులో పనిచేస్తున్న వరంగల్ ఎస్‌ఆర్‌ఆర్‌తోటకు చెందిన ఓ గుమస్తా ఆర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తి చెంది హంటర్ రోడ్డులో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖిలా వరంగల్/కాజీపేట రూరల్ : రైలు పట్టాలు రక్తధారలతో ఎరుపెక్కుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్దాటుతూ ప్రమాదాలకు గురికావడం.. రైలు బోగి నుంచి ప్రమాదవశాత్తు జారి పడడం, కష్టాలకు చితికి పోయి క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడడం లాంటి ఘటనలతో రైలు పట్టాలపై మరణ మృదంగం మోగుతోంది. ఫలితంగా ఆనందంగా సాగుతుందనుకునే రైలు ప్రయాణం పలువురి జీవితాల్లో తీవ్ర విషాదం నింపుతోంది. భద్రత కోసం అఽధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఉండడం లేదు. ప్రయాణంలో నిర్లక్ష్యం, జీవితం మీద విరక్తితో ఆత్మహత్యలకు పాల్పడడం.. ఇలా కారణం ఏమైనా తరచూ రైలు పట్టాలపై మృత్యు ఘోష వినిపిస్తూనే ఉంది. వరంగల్ రైల్వేస్టేషన్ (జీఆర్పీ ) పరిధిలో న్యూశాయంపేట రైల్వే గేట్ నుంచి మహబూబాబాద్ వరకు సుమారు 110 కిలోమీటర్ల పరిధిలో రోజూ ఏదో ఒక చోట దుర్ఘటన చోటు చేసుకుంటూనే ఉంది. కాజీపేట జీఆర్పీ స్టేషన్ పరిధి కాజీపేట నుంచి పెంబర్తి, కాజీపేట నుంచి ఉప్పల్, కాజీపేట నుంచి దర్గా రైల్వే గేట్ వరకు ఉంది. ఎవరితో చెప్పుకోవాలి.. పదేళ్ల క్రితం వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉమ్మడి కుటుంబాలుండే వి. ఏ కష్టం వచ్చినా పంచుకునే ందుకు, భరోసా ఇచ్చేందుకు పెద్దలు ఉండేవారు. నేడు ఆ పరిస్థితి లేదు. కష్టమొస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఉరుకులు, పరుగుల జీవితంలో కనీసం భార్య, భర్తలు కుటుంబ పెద్దలతో మనసు విప్పి మాట్లాడుకునే సమయం ఎక్కడుంది. ఒంటరితనంలో మానసికంగా కృంగిపోతుండడంతో ఆత్మహత్యలకు దారి తీస్తోంది. యువతలో అధికం.. చదువులో ఒత్తిడి.. ప్రేమలో వైఫల్యం.. మత్తుపదార్థాలకు బానిస కావడం.. కుటుంబ కలహాలు.. దీర్ఘకాలిక అనారోగ్యం.. ఆర్థిక ఇబ్బందులు.. ఒంటరి తనం.. తదితర కారణాలతో యువత ఎక్కు వ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జీవితంలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఆ వ్యక్తిలోని క్షణికావే శం ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది. వివాహేతర సంబంధాలు కూడా కుటుంబాల్లో గొడవలకు కారణమవుతున్నాయి. వీటి వల్ల మనస్తాపానికి గురై ప్రాణం తీసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతిని విశ్లేషణ శక్తి కొరవడుతోంది. స్నేహితులు, పెద్దల నుంచి సరైన సలహాలు తీసుకోలేకపోవడం వల్ల తనువు చాలిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది యువతే ఉంటున్నారు. 22 నుంచి 25 ఏళ్లలోపు వారు 35 శాతం ఉంటున్నారు. 35 నుంచి 65 ఏళ్ల పైబడిన వారిలో ఈ ధోరణి ఎక్కువ కనిపిస్తోందని మానసిక శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఘటనలకు కొన్ని కారణాలు.. కదులుతున్న రైళ్లు ఎక్కడం, దిగడం, వేగంగా వెళ్తు న్న రైల్లోని గేట్ల వద్ద కూర్చుని, నిల్చొని స్వీయ చి త్రాలు, రీల్స్‌కు యత్నించడం, గేట్ల వద్ద కూర్చున్నప్పుడు నిద్రొచ్చి జారిపడపోవడం, రైలు వస్తోందని గమనించకుండా పట్టాలు దాటడం, అనారోగ్య, ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో జీవి తంపై విరక్తి చెంది ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రైలు ప్రమాదాలకు గురవుతూ చనిపోతున్న పలువురు కష్టాలకు చితికి అర్ధంతరంగా తనువు చాలిస్తున్న యువత వెరసి ట్రాక్‌పై మోగుతున్న మరణ మృదంగంజీవితం మీద విరక్తితో ..జీవించి సాధించాల్సింది పోయి కష్టాలతో చితికి.. మానసిక వేదన గురై పలువురు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. వరంగల్ జీఆర్పీ స్టేషన్ పరిధిలో ఆత్మహత్య ఘటనలు ఇటీవల ఎక్కువగా నమోదవుతున్నాయి. కుటుంబాల కలహాలతో క్షణికావేశానికి గురైన వారు కొందరైతే.. ఆర్థిక కష్టాలతో మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడి నమ్ముకున్న వారికి పుట్టెడు శోకం మిగుల్చుతున్నారు. -
ముదిరాజ్‌లను బీసీ ‘ఏ’లోకి మార్చాలి
నెహ్రూసెంటర్: ముదిరాజ్ కులస్తులు ఐకమత్యంతో ఉంటూ రానున్న స్థానిక ఎన్నికల్లో సత్తాచాటాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ముదిరాజ్ మహాసభ మహబూబాబాద్ జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ 42 శాతం రిజర్వేషన్లో ముదిరాజ్ కులస్తులకు జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి బీసీ ‘ఏ’లోకి మార్చాలన్నారు. ముదిరాజ్ కులస్తులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లుగానే మత్స్యశాఖ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. మత్స్యకారులకు చేప పిల్లలకు బదులు సొసైటీ సభ్యుల ఖాతాలో నగదు జమ చేయాలని కోరారు. జీపీ పరిధిలోని చెరువులను మత్స్యశాఖ పరిధిలోకి తీసుకురావాలని, తెలంగాణ మత్స్యశాఖ ఫెడరేషన్‌కు ఎన్నికలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో పల్లెబోయిన అశోక్, గుర్రాల మల్లేశం, పిట్టల వెంకట్రాంనర్సయ్య, నీలం దుర్గేశ్, కొత్తూరు రమేశ్, చిల్ల సహదేవ్, గుండెల రాజు, ఎడెల్లి యాకయ్య, అల్వాల సోమయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ -
రుద్రేశ్వరాలయంలో శ్రీమహాలక్ష్మీ యాగం
హన్మకొండ కల్చరల్: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వరంగల్ నగరంలోని రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో ఐదో రోజు శ్రీమహాలక్ష్మీ యాగం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు మణికంఠశర్మ, ప్రణవ్, సందీప్‌శర్మ ఉదయం నుంచి స్వామివారికి రుద్రాభిషేకం, పూజలు నిర్వహించారు. మూల(ఉత్తిష్ట) మహాగణపతికి ప్రాచీన కోనేరు నీటితో గంగా జలాభిషేకం, నారికేళాభిషేకం, పంచామృతాభిషేకం నిర్వహించి అనంతరం సర్పగణపతిగా అలంకరించారు. ఉత్సవ గణపతి విగ్రహానికి గణపతి సూక్త మంత్రపఠనంతో షోడశోపచారపూజలు, మహా నైవేద్యం, మహా హారతి జరిగాయి. పంచలోహ ఉత్సవమూర్తిని పద్మవాహనంపై ప్రతిష్ఠించి పల్లకీసేవ నిర్వహించారు. లోకకల్యాణార్థం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో గణపతి రుద్రహోమం, శ్రీమహాలక్ష్మీ హోమం నిర్వహించారు. వొడ్డె ప్రకాశ్ దంపతులు, కంజుల మహేశ్ దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. ఈ సందర్భంగా గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లను వీడి ధార్మికభావాలతో ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు. సాయంత్రం ప్రదోషకాల పూజలు చేశారు. నృత్యగురువు తాడూరి రేణుక శిష్య బృందం చేసిన కూచిపూడి నృత్యాలు అలరించాయి. కాగా ఆలయ ఈఓ ధరణికోట అనిల్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
ఆకేరు వరదతో ఆగం..
● కోలుకోని బాధితులు డోర్నకల్: ఏడాది క్రితం సెప్టెంబర్ 1వ తేదీన కురిసిన భారీ వర్షంతో డోర్నకల్ సమీపంలోని మున్నేరువాగుతో పాటు ముల్కలపల్లి సమీపంలోని ఆకేరువాగుకు భారీ వరద పోటెత్తి తీవ్ర నష్టం వాటిల్లింది. సెప్టెంబర్ 1న తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురువడంతో ఆకేరువాగుకు వరద పోటెత్తింది. దీంతో దుబ్బగడ్డతండాలో 45, మోదుగ్గడ్డతండాలో 40, ముల్కలపల్లిలో సుమారు 120 ఇళ్లు ముంపునకు గురయ్యాయి. ఆకేరు పరీవాహక ప్రాంతంలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వాగు పక్కన నర్సరీలోని 50 లక్షల మిరప మొక్కలు, మెకానిక్ షెడ్డులోని జేసీబీలు, ట్రాక్టర్లు వరదకు కొట్టుకుపోయాయి. డోర్నకల్ సమీపంలో రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో రైళ్లన్నీ డోర్నకల్‌లో రోజంతా నిలిచాయి. మున్నేరువాగు ఉప్పొంగడంతో డోర్నకల్, అమ్మపాలెం, గొల్లచర్ల, వెన్నారం గ్రామాల పరిధిలోని పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నాటి వరదను గుర్తు తెచ్చుకుంటున్న స్థానికులు భయంతో వణికిపోతున్నారు. -
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం
● అదనపు జూనియర్ సివిల్ జడ్జి అర్వపల్లి కృష్ణతేజమహబూబాబాద్ అర్బన్: బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని అదనపు జూనియర్ సివిల్ జడ్జి అర్వపల్లి కృష్ణతేజ అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల డిగ్రీ గురుకుల కళాశాలలో శనివారం జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యలో న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. అదనపు జూనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ.. సమాజంలో మూఢనమ్మకాలు, ఆచారాలను అనుసరించి కొంత మంది ఇప్పటికీ బాల్యవివాహాలు చేస్తున్నారన్నారు. ఎక్కడైన బాల్య వివాహాలు జరిగితే వెంటనే 1098, జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారిపేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. పోక్సో చట్టాన్ని తెలుసుకొని విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సి పాల్ డాక్టర్ బిందు మాధవి, టౌన్ ఎస్సై మౌనిక, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
గుడ్ల సరఫరా టెండర్‌పై కసరత్తు
దరఖాస్తు ప్రక్రియ పూర్తి ● కొనసాగుతున్న డాక్యుమెంట్ వెరిఫికేషన్ ● కాంట్రాక్ట్ కాలపరిమితి ఏడాది మహబూబాబాద్: జిల్లాలో గుడ్లు సరఫరా చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. కాగా, ఈ సారి అన్ని ప్రభుత్వ శాఖలకు ఒకే కాంట్రాక్టర్ గుడ్లు సరఫరా చేసేవిధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు దరఖాస్తుల స్వీకరణ పూర్తయి, వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతోంది. ప్రతీ నెల 15 లక్షల గుడ్లు సరఫరా చేయనున్నారు. అన్నింటికీ ఒక్కరే.. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, గురుకులాలు, మోడల్ స్కూల్స్, ఏకలవ్య స్కూల్స్, బీసీ, ఎస్సీ, ఎస్టీ హస్టళ్లకు ఒక్కరే కాంట్రాక్టర్‌ను ఎంపిక చేయాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. గతంలో శాఖల వారీగా కాంట్రాక్టర్లు ఉండే వారు. అది కూడా ఆ శాఖల ఉన్నతాధికారుల హెడ్ ఆఫీస్‌లోనే కాంట్రాక్టర్ల ఎంపిక జరిగేది. ప్రస్తుతం ఆవిధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. కాగా గత నెల 30నుంచి ఈనెల 12వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు ఇచ్చింది. కాగా జిల్లాలో కోళ్లఫాంల యజమానులు ఆరుగురు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకే 2,50,000 గుడ్లు.. జిల్లాలో ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిధిలో 1,435 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆ కేంద్రాల్లో జీరో నుంచి ఆరు నెలలోపు పిల్లలు 3,604 మంది ఉండగా.. ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల లోపు పిల్లలు 20,295మంది, మూడేళ్ల నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు 16,181 మంది ఉన్నారు. కేంద్రాల్లో మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు (ప్రీస్కూల్), గర్భిణులు, బాలింతలకు రోజు గుడ్డు ఇస్తున్నారు. ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాలోపు పిల్లలకు మాత్రం (టీహెచ్ఆర్ కింద) ప్రతీ నెల 16గడ్లు ఇస్తున్నారు. కాగా ప్రతీ నెల కేంద్రాలకు సుమారు 2,50,000 గుడ్లు కాంట్రాక్టర్ సరఫరా చేస్తున్నాడు. ఈనెల వరకు పాత కాంట్రాక్టర్ సరఫరా చేస్తారు. మూడు సంవత్సరాల నుంచి ఒక్క కాంట్రాక్టరే సరఫరా చేస్తున్నాడు. కమిటీలోనలుగురు సభ్యులు.. టెండర్‌కు సంబంధించిన కమిటీలో జిల్లా సంక్షేమాధికారి, డీఈఓ, బీసీ వెల్ఫేర్ అధికారితో పాటు మరొకరు సభ్యులుగా ఉన్నారని అధికారులు తెలిపారు. అంతా పూర్తయిన తర్వాత ఫైనాన్స్ బిడ్ కలెక్టర్ సమక్షంలో ఎంపిక చేసి ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత కాంట్రాక్టర్‌ను ఎంపిక చేస్తారు.దరఖాస్తుల స్వీకరణ పూర్తయి ఈనెల 13నుంచి డాక్యుమెంట్ల వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతోంది. అన్ని శాఖలకు సంబంధించి జిల్లా సంక్షేమశాఖ కార్యాలయంలో ప్రాసెస్ కొనసాగుతోంది. కాంట్రాక్టర్ ఎంపిక కలెక్టర్ సమక్షంలో జరుగుతుందని అధికారులు తెలిపారు. -
అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన పెళ్లి బస్సు
● అక్కడికక్కడే డ్రైవర్ మృతి దంతాలపల్లి: పెళ్లి బస్సు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లగా.. అక్కడికక్కడే డ్రైవర్ మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో శనివారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. హనుమకొండ పట్టణంలోని గోపాలపురానికి చెందిన ఓ ముస్లిం కుటుంబంతో పాటు బంధువులు ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఖమ్మంలో జరిగిన పెళ్లికి వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో దంతాలపల్లి మండల కేంద్రంలో రోడ్డుపై ఏర్పడిన గుంతలో బస్సు అదుపు తప్పి రేకుల ఇంటిని ఢీకొట్టింది. ఈక్రమంలో ఇంటి పైకప్పు రేకు మెడకు కోసుకుపోవడంతో డ్రైవర్ దేవేందర్ అక్కడికక్కడే మృతి చెందగా క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కాగా, బస్సులో ఉన్న సుమారు 30మందికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. అలాగే ఇంట్లో ఉన్న ఆరుగులు కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారు. -
విద్యాభివృద్ధే లక్ష్యంగా విధులు నిర్వర్తించాలి
● కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ గూడూరు: ఆశ్రమ పాఠశాల ఉద్యోగులు విద్యాభివృద్ధే లక్ష్యంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. మండలంలోని దామరవంచ గిరిజన బాలుర గురుకుల పాఠశాల, కళాశాలను శనివారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కిచెన్, డైనింగ్‌హాల్, పరిసర ప్రాంతాలతో పాటు తరగతి గదులను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు పక్కా ప్రణాళికతో విద్యార్థులకు డిజిటల్ బోధన చేపట్టాలన్నారు. విద్యార్థులకు షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని, వారి ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు. నిబంధనల ప్రకారం డైట్ మెనూ పాటించాలన్నారు. విద్యార్థుల స్టడీ అవర్స్‌ను ప్రత్యేకంగా పరిశీలించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, సాయంత్రం తప్పకుండా స్టడీ అవర్స్ నిర్వహించాలని, ఏఎన్ఎం అందుబాటులో ఉండాలన్నారు. ఎన్హెచ్ఎం మెరిట్ జాబితా ప్రదర్శననెహ్రూసెంటర్: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో గతంలో ఎంపిక చేసి నిలిపివేసిన ఎంఎల్‌హెచ్‌సీ, ఎంహెచ్ఎన్ స్టాఫ్ నర్స్, ఎన్సీడీ స్టాఫ్‌నర్స్ పోస్టులకు ప్రొవిజినల్ మెరిట్ జాబితాను ప్రదర్శించినట్లు డీఎంహెచ్ఓ రవిరాథోడ్ శనివారం తెలిపారు. జాబితాను మహబూబాబాద్.తెలంగాణ.గవర్నమెంట్.ఇన్ వెబ్సైట్లో పొందుపరిచినట్లు ఆయన తెలిపారు. సెప్టెంబర్ 1నుంచి 5వ తేదీ వరకు కార్యాలయం పనివేళల్లో జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపారు. డోర్నకల్ సీఐగా చంద్రమౌళిడోర్నకల్: డోర్నకల్ పోలీ స్‌స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా నియామకమైన చంద్రమౌళి శనివా రం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ సీఐగా విధులు నిర్వహించిన బి.రాజేష్ ఈ నెల 23న లంచం తీసుకుంటూ పట్టుబడిన విషయం విదితమే. కాగా 2009 బ్యాచ్‌కు చెందిన చంద్రమౌళి బదిలీపై వచ్చి విధుల్లో చేరారు. ప్రేమ వ్యవహారంలో ప్రేమికుడి తల్లి ఆత్మహత్యాయత్నంబయ్యారం: మండలంలోని కొత్తపేట పంచాయతీలో ఓ ప్రేమ వ్యవహారంలో ప్రేమికుడి తల్లి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన శనివా రం రాత్రి జరిగింది. స్థానికుల వివరాల ప్రకా రం.. కొత్తపేట గ్రామానికి చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన బాలికను ప్రేమించి వెంట తీసుకెళ్లాడు. ఈవిషయం తెలి సిన బాలిక తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫి ర్యాదు చేశారు.ప్రేమ వ్యవహారం పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లిందనే భయంతో యువకుడి తల్లి ఇస్లావత్ స్వప్న తన ఇంట్లో చీరతో ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి స్వప్నను చికిత్స నిమిత్తం మహబూబాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. డీఈఓగా దక్షిణామూర్తిమహబూబాబాద్ అర్బన్: సూర్యాపేట డీఈఓ కార్యాలయంలో ఏడీగా విధులు నిర్వహిస్తున్న పి.దక్షిణామూర్తిని మహబూబాబాద్ జిల్లా డీఈ ఓగా నియమిస్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్‌నికోలస్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం డీఈఓగా విధులు నిర్వహించిన ఏ.రవీందర్‌రెడ్డి పదవీ విరమణ పొందారు. దీంతో దక్షిణామూర్తి డీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. -
హత్య కేసులో వ్యక్తి అరెస్ట్..
● మహిళ మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు కాళేశ్వరం: ఓ మహిళను హత్య చేసి తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ఎన్.వెంకటేశ్వర్లు, ఎస్సై పవన్‌కుమార్ శనివారం తెలిపారు. వారి కథనం ప్రకారం.. ఈ ఏడాది జనవరి 1వ తేదీన మహదేవపూర్ మండలం అంబట్పల్లికి చెందిన ఒల్లాల రవికుమార్ తన తల్లి భాగ్యలక్ష్మి (51) గతేడాది డిసెంబర్ 27 నుంచి కనిపించడం లేదని మహదేవపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, భాగ్యలక్ష్మి వద్ద డబ్బులు ఉన్నట్లు మల్హర్ మండలం వల్లంకుంట గ్రామానికి చెందిన వెన్నపురెడ్డి రామయ్య అలియాస్ రాంరెడ్డి గమనించాడు. ఈ క్రమంలో సదరు మహిళను నమ్మించి భూపాలపల్లి దగ్గరలోని కమలాపూర్ ఎక్స్ రోడ్ నుంచి కొద్ది దూరంలో ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశాడు. ఎలాంటి ఆధారం లేకుండా మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టాడు. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతుండగా పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో క్లూస్ టీమ్ ఆధారాల మేరకు సెల్ ఫోన్ సిగ్నల్, కాల్ డేటా, సీసీ కెమెరాలు పరిశీలించి శనివారం రాంరెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. ఎస్సై శశాంక్ పాల్గొన్నారు. -
త్వరలోనే ‘పంచాయతీ’!
సాక్షిప్రతినిధి, వరంగల్: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలైనట్లేనా? లోకల్ బాడీస్ ఎన్నికల విషయంలో ప్రభుత్వం స్టాండ్ మారిందా? మొదటగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలకున్నా.. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల వైపు మొగ్గు చూపుతుందా? ఈ దిశగానే ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తుందా? అంటే.. నిజమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు కూడా ఇవే సంకేతాలిస్తున్నాయి. రాష్ట్ర కేబినెట్లో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్‌లో నిర్వహించాలని నిర్ణయించి ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయాలని నిర్ణయించారు. దీంతోపాటు ఎన్నికల్లో రిజర్వేషన్ పరిమితి ఎత్తివేస్తూ 42శాతం రిజర్వేషన్ కోసం ప్రత్యేక జీఓ తేవాలని తీర్మానించింది. దీంతోపాటు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్ జారీ చేసిన నేపథ్యంలో.. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియ మొదలైంది. గ్రామ పంచాయతీల వారీగా గురువారం ఓటరు జాబితాను అంటించారు. శుక్రవారం కలెక్టర్, ఉన్నతాధికారులు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన జిల్లా స్థాయి నాయకులతో ఆయా జిల్లాల కలెక్టరేట్లలో సమావేశమయ్యారు. ఆరు రోజుల్లోనే అన్నీ.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో వేగం పుంజుకుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మంగళవారం ఓటరు జాబితాపై ఎస్ఈసీ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. ఈమేరకు పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా విడుదలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) రాణి కుముదిణి నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో ఉమ్మడి వరంగల్‌లోని అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఫొటో ఎలక్ట్రోరల్ రోల్స్‌ను తయారుచేసి సెప్టెంబర్ 2న తుది జాబితా ప్రచురించాలని సూచించారు. ఈమేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 28న పంచాయతీలు, వార్డుల వారీగా ఓటరు జాబితాను ప్రదర్శించి.. 28న జిల్లాస్థాయి, 29న మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. 28 నుంచి 30 వరకు అభ్యంతరాలు స్వీకరించి, 31న డీపీఓలు ఓటర్ల సవరణ జాబితాపై కీలక సమావేశం నిర్వహించి జిల్లా కలెక్టర్లకు నివేదించనున్నారు. ఆతర్వాత, సెప్టెంబర్ 2న తుది జాబితా ప్రకటించాల్సి ఉండగా.. ఆరు రోజుల్లోనే అన్ని జరిగేలా అధికార యంత్రాంగం పనిచేస్తోంది. ఉమ్మడి వరంగల్‌లో గ్రామ పంచాయతీలు, వార్డుల వివరాలుజిల్లా గ్రామ వార్డులు పోలింగ్ పంచాయతీలు కేంద్రాలు హనుమకొండ 210 1,986 1986 వరంగల్ 317 2,754 2,754 భూపాలపల్లి 248 2,102 2,102 మహబూబాబాద్ 482 4,110 4,110 ములుగు 171 1,520 1,535 జనగామ 280 2,534 2,534సెప్టెంబర్ 2న జీపీల్లో ఫైనల్ ఓటర్ల జాబితా మరో మూడు రోజుల్లోనే అన్నీ.. చురుగ్గా ఓటర్ల సవరణ ప్రక్రియ సీఈసీ ఆదేశాల మేరకు యాక్షన్‌ప్లాన్ అమలు రాజకీయ పార్టీల నేతలతో ముగిసిన సమావేశం 31న డీపీఓల కీలక సమావేశం.. ఆ తర్వాత ఓటర్ల జాబితా ప్రకటన ఉమ్మడి జిల్లాలో 30,43,540 ఓటర్లు.. అత్యధికంగా మహిళలు 15,51,289 ఓటర్ల సవరణ షెడ్యూల్‌తో పల్లెల్లో వేడెక్కిన రాజకీయం -
ఏఐతో పని సరళం..
● కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి కేయూ క్యాంపస్ : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ).. కఠిన పనిని కూడా సరళం చేస్తోందని కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి అన్నారు. కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్అండ్ బిజినెస్మేనేజ్మెంట్ కళాశాలలో మూడురోజులుగా నిర్వహించిన ‘డేటా డివైన్ టీచింగ్ బిజినెస్ అనాలటిక్స్ అండ్ పవర్ బీఐ ఫర్ ఎడ్యుకేటర్స్’ వర్క్‌షాప్ ముగింపు సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అధ్యాపకులకు లెర్నింగ్ నిరంతర ప్రక్రియ అన్నారు. మానవ మేధస్సుకు ప్రత్నామ్నాయం లేదన్నారు. అయితే టెక్నాలజీలో ఎప్పటికప్పడు వస్తున్న మార్పులకనుగుణంగా విద్యాబోధనలో పట్టుకలిగి ఉండాలని సూచించారు. విద్యార్థుల అవసరాలకు తగ్గట్లు అధ్యాపకులు నాణ్యమైన విద్యనందించేలా సిద్ధం కావాలన్నారు. సమావేశంలో ప్రిన్సిపాల్ పి. అమరవేణి, డీన్ కె. రాజేందర్, సీడీసీ డీన్ పి. వరలక్ష్మి, యూనివర్సిటీ పీజీ కళా శాల ప్రిన్సిపాల్ ఎస్. నర్సింహాచారి, డాక్టర్ ఫణీంద్ర, డాక్టర్ ప్రగతి, తదితరులు పాల్గొన్నారు. పోక్సో కేసులో నేరస్తుడికి ఇరవై ఏళ్ల జైలు ఏటూరునాగారం : పోక్సో కేసులో నేరస్తుడికి 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ ములుగు జిల్లా కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించినట్లు ఎస్సై రాజ్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. 2022లో ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లిలో ఓ బాలికపై అదే గ్రామానికి చెందిన గౌస్‌పాషా (కిరాణాషాపు) లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధిత కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. వాదోపవాదాలు విన్న అనంతరం నేరం రుజువు కావడంతో నేరస్తుడు గౌస్‌పాషాకు న్యాయమూర్తి సూర్య చంద్రకళ 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.3వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారని ఎస్సై తెలిపారు. -
వేయిస్తంభాల గుడిలో డుండి గణపతిగా అలంకరణ
హన్మకొండ కల్చరల్: హనుమకొండ నగరంలోని వేయిస్తంభాల దేవాలయంలో నిర్వహిస్తున్న గణపతినవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శనివారం దేవాలయంలోని ఉత్తిష్ట మహాగణపతిని చందన రంగులతో డుండిగణపతిగా అలంకరించి దూర్వాపత్రాలతో ఘనంగా పూజలు నిర్వహించారు. ఆలయప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయం నుంచి రుద్రేశ్వరస్వామివారికి రుద్రాభిషేకం, పూజలు నిర్వహించారు. ఉత్తిష్టగణపతికి ప్రాచీన కోనేరునీటితో జలాభిషేకం నిర్వహించి డుండి గణపతిగా అలంకరించారు. ఉత్సవ గణపతి విగ్రహానికి షోడశోపచారపూజలు జరిగాయి. ఉత్సవమూర్తికి నందివాహనసేవ నిర్వహించారు. యాగశాలలో గణపతినవగ్రహ పాశుపత హోమం, లక్ష్మీగణపతి మూలమంత్రహోమం, సహస్త్రమోదక హోమం నిర్వహించారు. వందలాది మంది భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. పూజాకార్యక్రమాల్లో దాత వేముల ఉమాదేవి, సేవాసమితి సభ్యులు గండ్రాతి రాజు, పులి రజనీకాంత్, చొల్లేటి కృష్ణమాచారి, గరిగె అశోక్ పాల్గొన్నారు. సాయంత్రం ప్రదోషకాల పూజలు జరిగాయి. బోడిగె లక్ష్మీనారాయణ భాగవతార్‌తో హరికథాపారాయణం నిర్వహించారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
ఒడిశా టు గోదావరిఖని..
వాజేడు: ఒడిశా నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయగా ఐదుగురు పరారయ్యారు. వారి వద్ద నుంచి రూ.15 లక్షల విలువైన 30 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ వివరాలు వెల్లడించారు. గోదావరి ఖనిలోని 8ఇంక్లైన్ కాలనీకి చెందిన తొగరి విష్ణువర్ధన్, జెంజర్ల రేవంత్, మేకల మహేందర్, అజయ్, జెంజర్ల రోహిత్, జెజర్ల బాలాజీ, రుత్విక్ స్నేహితులు. వీరు గంజాయి సేవించడంతో పాటు గోదావరిఖని చుట్టు పక్కల గ్రామాల్లో ఎక్కువ డబ్బులకు అమ్ముతూ జల్సాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 18న ఒడిశాకు వెళ్లి అక్కడ ఓ వ్యక్తి వద్ద రూ. 15 లక్షల విలువైన 30 కిలోల గంజాయి కొనుగోలు చేశారు. సరుకును బ్యాగుల్లో సర్దుకుని నాలుగు బైక్‌లపై శనివారం వెంకటాపురం(కె) వైపు నుంచి ఏటూరునాగారం వైపునకు వస్తున్నారు. దీనిపై విశ్వసనీయ సమాచారం మేరకు హైవేపై వాజేడు ఎస్సై సతీశ్ సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో నాలుగు బైక్‌లు అక్కడికి రావడంతో పోలీసులకు అనుమానం వచ్చి మొదటి బైక్‌ఫై ఉన్న ఇద్దరిని పట్టుకున్నారు. దీనిని వెనుక మూడు బైక్‌లపై ఉన్న వారు గమనించి తమ వద్ద ఉన్న బ్యాగులను పడేసి పరారయ్యారు. ఆ బ్యాగులను తనిఖీ చేయగా గంజాయి లభించింది. దీంతో తొగరి విష్ణువర్ధన్, జెంజర్ల రేవంత్‌ను అరెస్ట్ చేయగా మేకల మహేందర్, కొల్లి అజయ్, జెంజర్ల బాలాజీ, రుత్విక్ , జెంజర్ల రోహిత్ పరారైనట్లు ఏఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో వెంకటాపురం (కె) సీఐ ముత్యం రమేశ్, వాజేడు ఎస్సై జక్కుల సతీశ్ ఉన్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్, ఐదుగురు పరార్ రూ. 15 లక్షల విలువైన సరుకు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ -
సమాచారం ఇవ్వడంలో జాప్యమెందుకు?
సాక్షి, మహబూబాబాద్ : దాపరికం లేని పాలన, సంక్షేమ పథకాల్లో పారదర్శకత పెంపొందించడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన సమాచార హక్కు చట్టం ప్రకారం పౌరులు అడిగిన సమాచారం ఇవ్వడంలో జాప్యం ఎందుకు చేయాలి? దాపరికం ఎందుకని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్లు బోరెడ్డి అయోధ్యరెడ్డి, పీవీ శ్రీనివాస్, మోహ్సినా పర్వీన్, దేశాల భూపాల్ అన్నారు. శనివారం మహబూబాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్‌తో కలిసి జిల్లాలోని పీఐఓఎస్, ఏపీఐఓఎస్ అన్ని విభాగాల అధికారులతో సమీక్షించారు. అనంతరం జిల్లాలోని పెండింగ్ ఫిర్యాదులపై అర్జీదారులు, అధికారులతో చర్చించారు. 12 శాఖలకు సంబంధించి 115 అప్పీళ్లను నలుగురు కమిషనర్లు పరిష్కరించారు. అనంతరం వారు విలేకరులతో సమావేశంలో మాట్లాడారు. రెండున్నర సంవత్సరాలుగా కమిషన్ లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 18వేల అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాటికి పరిష్కార మార్గం చూపుతూ.. ప్రజలు, అధికారుల్లో మరింత అవగాహన పెంచేందుకు కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తోందని చెప్పారు. ఇప్పటి వరకు 10 జిల్లాల్లో పర్యటించి 4వేలకు పైగా ఫిర్యాదులు పరిష్కరించామన్నారు. పెండింగ్ దరఖాస్తుల్లో అత్యధికంగా రెవెన్యూ, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్ శాఖలవే ఉన్నాయని చెప్పారు. ఇందులో మహబూబాబాద్ జిల్లాలో 160 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. చట్టానికి లోబడి ఉన్న ఫిర్యాదులకు సమాచారం ఇవ్వాలని, సాకుతో కాలయాపన చేయడం సరికాదన్నారు. ఇలాంటి పరిస్థితి వస్తే సెకండ్ అప్పీల్‌కు వెళ్లొచ్చని సూచించారు. చట్టం ప్రకారం సమాచారం ఇవ్వకపోతే సెక్షన్ 20 అనుసరించి సదరు అధికారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అదే విధంగా సమాచారం అడిగే వారు కూడా అనవసర విషయాల జోలికి వెళ్లొద్దని సూచించారు. చట్టాన్ని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చట్టాన్ని సద్వినియోగం చేసుకుంటే సుపరిపాలన అందించొచ్చని చెప్పారు. సమాచారం పొందడం పౌరుల హక్కు సద్వినియోగం చేసుకుంటే సుపరిపాలన చట్టాన్ని దుర్వినియోగం చేయడం నేరం రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లు -
ఉగ్ర గోదావరి..
కాళేశ్వరం: ఎగువన కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. శనివారం జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నారం బ్యారేజీకి 8.55 లక్షల క్యూసెక్కుల నీరు తరలి వస్తోంది. దీంతో బ్యారేజీలో మొత్తం 66గేట్లు ఎత్తి నీటిని దిగువకు అదేస్థాయిలో కాళేశ్వరం వైపునకు తరలిస్తున్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద మహారాష్ట్ర నుంచి తరలొస్తున్న ప్రాణహిత నదితో కలిసి గోదావరి వరద ప్రవాహం పుష్కర ఘాట్లను తాకుతూ 12.550 మీటర్ల ఎత్తులో నీటిమట్టం దిగువకు తరలుతోంది. శుక్రవారం ఉదయం నుంచి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ కొనసాగుతోంది. ఇప్పటికే గోదావరి ఒడ్డున పలు దుకాణాలు, హోటళ్ల వద్దకు నీరు చేరింది. దిగువన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి 10.25లక్షల క్యూసెక్కులు తరలి రాగా, మొత్తం 85 గేట్లు ఎత్తి అదే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అన్నారం సమీపంలోని చండ్రుపల్లి వాగు గోదావరి కమ్మేయడంతో రాకపోకలు నిలిచాయి. అన్నారం, కాళేశ్వరం, మహదేవపూర్ వరకు వందల ఎకరాల్లో పత్తి పంట నీటమునిగింది. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ● కాళేశ్వరం వద్ద కొనసాగుతున్న మొదటిప్రమాద హెచ్చరిక ● పుష్కరఘాట్ వద్ద 12.550 మీటర్ల ఎత్తులో నీటిమట్టం ● అన్నారం బ్యారేజీకి 8.55 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ● మేడిగడ్డ బ్యారేజీకి 10.25 లక్షల క్యూసెక్కులు.. ● నీట మునిగిన పంటలు -
సీపీఎం నాయకుడిపై డాక్టర్ దాడి
జనగామ: తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఓ మహిళను శనివారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా..ఓపీ పేరు నమోదు సమయంలో పేషెంట్ తరఫున వచ్చిన సీపీఎం నాయకుడిపై డాక్టర్ దాడికి పాల్పడ్డాడు. సీపీఎం నాయకుడు బొట్ల శేఖర్, బాధితుడి బంధువుల కథనం ప్రకారం.. లింగాలఘణపురం మండలం సిరిపురం గ్రామానికి చెందిన దుర్గి పూలమ్మ వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురైంది. అదే మండల సీపీఎం కార్యదర్శి బొడ్డు కరుణాకర్ సదరు మహిళను వెంటనే జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. పూలమ్మ పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే పేరు నమోదు చేసుకుని అడ్మిట్ చేసుకోవాలని డాక్టర్ స్నేహిత్‌ను కోరారు. ఓపిక లేదా.. ఆగలేరా.. అంటూ డాక్టర్ దురుసుగా ప్రవర్తిస్తూ పైకి రావడంతో రోగి బంధువులతో పాటు కరుణాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సదరు డాక్టర్ సహనం కోల్పోయి తన చేతిలో ఉన్న ఓ పాయిజన్ డబ్బాను విసరడంతో కరుణాకర్ చాతీ, కడుపులో బలంగా తాకగా అస్వస్థతకు గురయ్యాడు. డాక్టర్ ప్రవర్తనను నిరసిస్తూ సీపీఎం నాయకులు బొట్ల శేఖర్, జోగు ప్రకాశ్‌తో పాటు బంధువులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న సీఐ దామోదర్‌రెడ్డి, ఎస్సై రాజేశ్, చెన్నకేశవులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. అనంతరం వైద్యుడు స్నేహిత్‌పై చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి సూపరింటెండెంట్, వైద్యాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజలింగం మాట్లాడుతూ.. ఘటనపై ఆర్ఎంఓ మధుకర్, మరో డాక్టర్‌తో కలిసి విచారణ కమిటీ నియమించామన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని చెప్పారు. 30జెజిఎన్064: వివరాలు తెలుసుకుంటున్న పోలీసులు ఆందోళనకు దిగిన బంధువులు, నాయకులు జనగామ జిల్లా ఆస్పత్రిలో ఉద్రిక్తత.. రంగంలోకి పోలీసులు -
కాజీపేట మీదుగా 8 ఫెస్టివల్ ట్రైన్లు
● సెప్టెంబర్ 7 నుంచి అమలు.. కాజీపేట రూరల్ : వినాయకచవితి, దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాజీపేట జంక్షన్ మీదుగా 8 ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్లు నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ శనివారం తెలిపారు. ఫెస్టివల్ ట్రైన్ల వివరాలు.. సెప్టెంబర్ 7 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు ప్రతీ ఆదివారం చర్లపల్లి–హజ్రత్ నిజాముద్దీన్ (07023) ఎక్స్‌ప్రెస్, సెప్టెంబర్ 9 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు హజ్రత్‌నిజాముద్దీన్–చర్లపల్లి (07024) ఎక్స్‌ప్రెస్ ప్రతీ బుధవారం, సెప్టెంబర్ 3 నుంచి నవంబర్ 26వ తేదీ వరకు చర్లపల్లి–రక్సోల్ (07007) ఎక్స్‌ప్రెస్ ప్రతీ బుధవారం, సెప్టెంబర్ 5 నుంచి నవంబర్ 28వ తేదీ వరకు రక్సోల్–చర్లపల్లి (07008) ఎక్స్‌ప్రెస్ ప్రతీ శనివారం, సెప్టెంబర్ 2 నుంచి నవంబర్ 25వ తేదీ వరకు చర్లపల్లి–డెహ్రాడూన్ (07077) ఎక్స్‌ప్రెస్ ప్రతీ మంగళవారం, సెప్టెంబర్ 4 నుంచి నవంబర్ 27వ తేదీ వరకు డెహ్రాడూన్–చర్లపల్లి (07078) ఎక్స్‌ప్రెస్ ప్రతీ శుక్రవారం, అక్టోబర్ 4 నుంచి నవంబర్ 29వ తేదీ వరకు చర్లపల్లి–రక్సోల్ (07051) ఎక్స్‌ప్రెస్ ప్రతీ మంగళవారం, అక్టోబర్ 7 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు రక్సోల్–చర్లపల్లి (07052) ఎక్స్‌ప్రెస్ ప్రతీ బుధవారం కాజీపేట జంక్షన్‌కు చేరుకుని వెళ్లనున్నట్లు రైల్వే సీపీఆర్వో తెలిపారు. ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిలో అరుదైన చికిత్స వరంగల్ చౌరస్తా : వరంగల్‌లోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో శనివారం అరుదైన చికిత్స నిర్వహించారు. ఆయుర్వేద వైద్యశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ తుమ్మ మధు బృందం ఆధ్వర్యంలో ‘టీనో సైను వైటీస్’ అనే వ్యాధికి ‘అగ్ని కర్మ’చికిత్స నిర్వహించారు. వరంగల్ 34 డివిజన్ శివనగర్‌కు చెందిన సత్యనారాయణ‘ట్రిగ్గర్ ఫింగర్ టీనో సైను వైటీస్’ అనే నరాల వ్యాధితో ఐదు నెలల నుంచి బాధపడుతున్నాడు. అల్లోపతి వైద్యులను సంప్రదించి ఎన్నో మందులు వాడినా ఫలితం లేదు. నరాల కదలిక ఆగిపోవడం, ఆ ప్రాంతంలో అధిక నొప్పితో సత్యనారాయణ.. ఆర్థోపెడిక్, జనరల్ సర్జన్లను సంప్రదించగా ఆపరేషన్ చేయాలని సూచించారు. ఆపరేషన్ ఖర్చుతో కూడి ఉండడంతో వరంగల్ ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిలో తుమ్మ మధును సంప్రదించారు. దీంతో ‘టీనో సైను వైటీస్’అనే వ్యాధికి ‘అగ్నికర్మ’ అనే చికిత్స చేశారు. తద్వారా వారానికి ఒకటి చొప్పున ఆరు పర్యాయాలకు రెండో దశలో చేతి వేలుకు కదలిక వచ్చింది. ఈ వ్యాధి లక్షణం కండరంలో వాపు ఉంటుందన్నారు. దీని వల్ల వేలు కదలికలు మందగిస్తాయని, నొప్పి తీవ్రంగా ఉంటుందని, చికిత్స అనంతరం ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు తెలిపారు. ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను ఆయుర్వేద వైద్యంలో ఖర్చు లేకుండా నయం చేయొచ్చని నిరూపించామని వైద్యులు పేర్కొన్నారు. ఈ చికిత్సలో సర్జన్లు మేఘన, కేతన, శివాని హరినాథ్ తదితరులు ఉన్నారు. -
ఉచిత న్యాయ సహాయాన్ని వినియోగించుకోవాలి
మహబూబాబాద్ రూరల్: ఖైదీలు ఉచిత న్యాయ సహాయాన్ని వినియోగించుకోవాలని మహబూబాబాద్ సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ శాలిని అన్నారు. జిల్లా కేంద్రంలోని సబ్ జైలును శనివారం సందర్శించారు. ఖైదీలను ఉద్దేశించి జడ్జి శాలిని మాట్లాడుతూ.. ఖైదీలు ఉచిత న్యాయ సహాయాన్ని ఉపయోగించుకుని జైలు నుంచి బయటపడాలన్నారు. అదేవిధంగా ఖైదీల ప్రవర్తనలో మార్పురావాలని, తిరిగి మళ్లీ జైలు వైపు చూడకుండా ఉండాలని ఆశిస్తున్నామని తెలిపారు. ఎవరైనా ఖైదీలు తప్పులు ఒప్పుకున్నట్లయితే వారికి శిక్ష నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉందని సూచించారు. ఖైదీలకు అందుతున్న సదుపాయాలు, సౌకర్యాలు, ఖైదీల గదుల్లో శుభ్రత, ఆరోగ్యం గురించి సీనియర్ సివిల్ జడ్జి ఆరాతీశారు. ఈ సదస్సులో సబ్ జైలు సూపరింటెండెంట్ మల్లెల శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. పిల్లలకు ఆధార్‌కార్డులు తప్పనిసరి మహబూబాబాద్: బాలల సంరక్షణ కేంద్రాల్లోని పిల్లలకు ఆధార్ కార్డులు తప్పనిసరిగా ఇప్పించాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ శాలిని సిబ్బందిని ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలోని బాలుర, బాలికల సంరక్షణ కేంద్రాలను సందర్శించారు. కేంద్రాల్లోని సౌకర్యాలపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. -
సీపీఎస్‌ను వెంటనే రద్దు చేయాలి
డోర్నకల్: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా సీపీఎస్‌ను రద్దు చేయాలని యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. మండలంలోని ముల్కలపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన పలు ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 1న కలెక్టరేట్ ఎదుట నిర్వహించే నిరసన కార్యక్రమానికి ఉపాధ్యాయుల అధిక సంఖ్యలో హాజరుకావా ల న్నారు. యూటీఎఫ్ మండల అధ్యక్ష, కార్యదర్శులు అజీజ్, శివప్రసాద్, టీపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కా ర్యదర్శులు వై.సాయిబాబు, పూల్రాజ్, నాయకులు సీతారామారావు, అజయ్‌సింగ్ ఉన్నారు. గూడూరు:పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఐక్య ఉపాధ్యాయ సంఘం నాయకులు వీరూనాయక్, ప్రభాకర్, వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ప్రభాకర్, మంగీలాల్, చందా, వెంకటేశ్వర్లు, రామయ్య పాల్గొన్నారు. -
సమాచార హక్కు చట్టానికి తూట్లు
మహబూబాబాద్ అర్బన్: సమాచార హక్కు చట్టం ద్వారా పౌరులు.. ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ నియంత్రణలో ఉండే సంస్థల నుంచి సమాచారాన్ని పొందవచ్చు. కానీ, జిల్లాలోని వివిధ శాఖల్లోని అధి కారులు సమాచారం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నేడు జిల్లాకు రానున్న రాష్ట్ర స మాచారహక్కు చట్టం కమిషనర్లు బోరెడ్డి అయోధ్య రెడ్డి, శ్రీనివాసరావు, మోహిసినా పర్వీన్, దేశాల భూపాల్ రానున్నారు. వీరి పర్యటన తర్వాతనైనా జిల్లాలోని అధికారుల్లో మార్పు వస్తుందో వేచిచూడాలి. సమాచారమివ్వని అధికారులు ● ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఎంతమంది సిబ్బంది పని చేస్తున్నారు.. వారి వేతనాలు, ఈఎఫ్, పీఎఫ్ వంటి సమాచారం కావాలని జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశాడు. కానీ, అధికారులు సమాచారం ఇవ్వకపోవడంతోపాటు తమకు ప్రజాప్రతినిధుల అండ ఉందని బెదిరింపులకు పాల్పడ్డ సందర్భాలు ఉన్నాయి. ● ఎస్సీ సంక్షేమ శాఖలో ఓ ఉద్యోగి నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగం చేస్తున్నారని సమాచారం కావాలని ఓ వ్యక్తి సంబంధిత జిల్లా అధికారులకు దరఖాస్తు చేశాడు. సమాచారం ఇవ్వకపోవడంతో రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. దీంతో సమాచారం అందించాలని రాష్ట్ర కార్యాలయం నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసినా బేఖాతారు చేయడం గమనార్హం. సమాచారం అందించాలి సమాచార హక్కు చట్టం ప్రకారం 30 రోజుల్లోనే అధికారులు సమాచారం ఇవ్వాలి. కానీ దరఖాస్తు చేసి మూడేళ్లు గడిచినా అధికారులు సరైన సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా, రాష్ట్ర అధికారులు స్పందించి జిల్లాలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయో.. పరిశీలించి న్యాయం చేయాలి. – మంద శశి కుమార్, మానుకోట పాత బజార్ సమాచారం అందించని అధికారులు నేడు జిల్లాకు రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్లు -
చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
● డీఎస్పీ తిరుపతిరావు కేసముద్రం: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరా వు, కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా శుక్రవారం మున్సిపాలిటీ పరిధి జెడ్పీహెచ్ఎస్, పా లిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు, సీనియర్ క్రీడాకా రులకు నిర్వహించిన వన్ కే రన్ ను ప్రారంభించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జాతీయస్థాయి బాస్కెట్‌బాల్, హాకీలో రాణిస్తున్న క్రీడాకా రులకు సన్మానించారు. అనంతరం వేం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.25 వేల విలువైన క్రీడాసామగ్రిని, కల్వల మోడల్ స్కూల్లో విద్యార్థులకు ఆట వస్తువులను అందజేశారు. సీఐ సర్వయ్య, ఎస్సై మురళీధర్‌రాజు, ఎంఈఓ యాదగిరి, అల్లం నాగేశ్వర్రావు, మురళీ, వెంకన్న, సురేందర్, హెచ్ఎం రాజు, పీడీ కొమ్ము రాజేందర్, పాలిటెక్నిక్ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ నర్సయ్య పాల్గొన్నారు. -
సమస్యలు తలెత్తకుండా చూడాలి
నెల్లికుదురు: వినాయక ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చూడాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. నెల్లికుదురు పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్ పరిసరాలు, సీజ్ చే సిన వాహనాలు, రిసెప్షన్లో రికార్డులు, రైటర్ రూమ్ పరిశీలించారు. అనంతరం డీఎస్పీ, సీఐ, ఎస్సైలతో కలసి స్టేషన్ ఆవరణలో మొ క్కలు నాటారు. పోలీస్ అధికారులు తరచూ గ్రామాలను సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్నారు. బ్లూ కోల్డ్స్, పెట్రో కార్ విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి సాధ్యమైనంత తొందరగా సమస్యలు పరిష్కరించాలని, జూదం, పీడీఎస్‌రైస్ అక్రమరవాణా జరగకుండా నిఘా ఏర్పాటు చేసి కేసులు నమోదు చేయాలన్నారు. ఈసందర్భంగా పోలీస్‌స్టేషన్ నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ టీవీని ఎస్పీ ప్రారంభించారు. కార్యక్రమంలో డీఎస్పీ కృష్ణకిశోర్, డీసీఆర్పీ సీఐ సత్యనారాయణ, సీఐ గణేష్, ఎస్సై రమేష్ బాబు, ఏఎస్సైలు పాల్గొన్నారు.నేడు 1,200 మెట్రిక్ టన్నుల యూరియా రాకమహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ పట్టణానికి శనివారం 1,200 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని ఎమ్మెల్యే మురళీనా యక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 800 మెట్రిక్ టన్నులు, సాయంత్రం 400 మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని తెలిపారు. రైతులు ఎవరు అధైర్యపడొద్దని, అవసరం మేరకు యూరియా సరఫరా చేస్తామని తెలిపారు. యూరియా పంపిణీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.‘ఆది కర్మయోగి’ ఫలాలు అందించాలిమహబూబాబాద్ అర్బన్: ఆది కర్మయోగి అభినయాన్ పథకానికి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆ పథకం ఉపయోగపడేలా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నా రు. కలెక్టరేట్లో శుక్రవారం అధికారులతో ని ర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మా ట్లాడారు. జిల్లాలో 18 మండలాలకు 92 గ్రామపంచాయతీల పరిధిలో అర్హులైన గిరిజనులకు ఆధార్‌కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్, పీఎం జనరల్ యోజన, పీఎం కిసాన్ సమ్మాన్నిధి, రేషన్ కా ర్డు, సికిల్ సెల్టెస్టులు చేయడం, వందరోజుల పని దినాలు, ముద్ర యోజన కింద రుణాలు, ఫారెస్ట్రైట్ యాక్ట్‌పైన విడతల వారీగా అవగా హన కల్పిస్తున్నామన్నారు. అన్ని విభాగాలు సమన్వయంతో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలిపారు. ఆర్డీఓ గణేష్, ట్రైబల్ వెల్ఫ్‌ర్ డీడీ దేశీరాంనాయక్, డీవీహెచ్ఓ డాక్టర్ కిరణ్ కుమార్, డీఎంహెచ్ఓ రవి రాథోడ్, జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి ప్రేమ్‌కుమార్, విద్యాశాఖ ఉద్యోగులు శ్రీరాములు, ఆజాద్‌చంద్రశేఖర్ పాల్గొన్నారు.దివ్యాంగులకు పింఛన్ పెంచాల్సిందే..తొర్రూరు/మరిపెడ రూరల్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ పెంచాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లో పింఛన్ లబ్ధిదారుల భారీ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో వీహెచ్పీఎస్, ఎంఆర్పీఎస్ల ఆధ్వర్యంలో శుక్రవారం తొర్రూరు డివి జన్ కేంద్రంలో, మరిపెడ మండలం అబ్బాయిపాలెంలో దివ్యాంగులతో సన్నాహక సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ మా దిగ మాట్లాడుతూ.. అధికారంలోకి రాగానే పింఛన్ పెంచుతామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి దివ్యాంగులను పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ మోసం.. ప్రతిపక్షాల మౌనం సరికాదన్నారు. పింఛన్లు పెంచుతారా.. లేక రాజీనా మా చేస్తారా.. అని ప్రశ్నించారు. సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లో జరిగే సభకు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు యాకూబ్‌పాషా, భూక్యా వెంకన్న, నాయకులు మంద యాకమల్లు, బచ్చలి వెంకన్న, వెంకన్న, రాము, లింగన్న, భరత్‌కుమార్, చిన్నసుబ్బారావు, రమేష్, రవీందర్, పరశురాములు, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మేడారంలో శాశ్వత పనులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి : మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర వందేళ్ల ప్రణాళికతో శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. సమ్మక్క–సారలమ్మల గద్దెల వరుస క్రమంలో పగిడిద్ద రాజు, గోవిందరాజు గద్దెలను ఏర్పాటు పూజారులు సమాలోచనలు చేశారు. శుక్రవారం మేడారంలోని ఐటీడీఏ అతిథి గృహంలో కలెక్టర్ దివాకర్ టీఎస్, ఐటీడీఏ పీఓ చిత్రమిశ్రా, వివిధశాఖల అధికారులు, పూజారులతో కలిసి మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ ప్లాన్ రీ డెవలప్మెంట్ ప్లాన్, ఆర్కియాలజిస్ట్, వివిధ శాఖల అధికారుల ద్వారా చేపట్టనున్న వివరాలను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మేడారం జాతరలో శాశ్వత అభివృద్ధి పనులను అన్ని శాఖల అధికారుల సమన్వయంతో చేయాలని ఆదేశించారు. జాతర సమయం వరకు మొదటి విడత పనులు పూర్తి చేయాలన్నారు. భక్తులకు సులువైన దర్శనంకోసం గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను వరుస క్రమంలో ఏర్పాటు చేయాలన్నారు. మహాజాతర పనులు నాణ్యతతో శాశ్వతంగా నిలిచేలా అధికారులు సమీక్షించాలని ఆదేశించారు. ముందుగా మంత్రి సీతక్క అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంపత్‌రావు, పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు, ఈఓ వీరస్వామి, అధికారులు పాల్గొన్నారు. వందేళ్ల మాస్టర్ ప్రణాళికతో అభివృద్ధి సమీక్షలో రాష్ట్ర మంత్రి సీతక్క -
ఉత్తములెవరో..
ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు కసరత్తుసాక్షి, మహబూబాబాద్ : ‘ఉత్తమ గురువు లభించిన శిష్యుడు అదృష్టవంతుడు.. అలాగే ఉత్తమ శిష్యుడు లభించిన గురువు ధన్యుడు’ అంటారు. మంచి గురువు చేతిలో విద్యార్థి ఉన్నత విలువలు నేర్చుకుంటాడు. మంచి శిష్యుడిని గురువు తన లక్ష్యానికి అనుగుణంగా తయారుచేస్తారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఉత్తమ గురువులను ప్రతీ సంవత్సరం మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి(ఉపాధ్యా య దినోత్సవం) సందర్భంగా సన్మానించుకోవడం ఆనవాయితి. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఉత్తమ గురువులను ఎంపిక చేయడంలో మాత్రం చాలా విధాలుగా కసరత్తు చేయాల్సి వస్తుంది. ఎంఈఓల ద్వారా ప్రతిపాదనలు గతంలో ఉపాధ్యాయులు తాము చేసిన పనుల వివరాలు తెలుపుతూ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుకు ఎంపిక చేయాలని దరఖాస్తు చేసుకునే వారు. అయితే అవార్డును అడుక్కునేలా ఉన్న ఈ విధానం కాకుండా ప్రతిభను గుర్తించి ఉన్నతాధికారులే అవా ర్డుకు ఎంపిక చేయాలని ఉపాధ్యాయులు అభిప్రా యం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఎంఈఓలు ఉపాధ్యాయుల పేర్లను ఎంపిక చేసి జిల్లా కమిటీకి ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. ఇందులో ప్రతీ మండలం నుంచి హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ క్యాటగిరీల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేసి డీఈఓకు పంపిస్తున్నారు. ఉత్తమ గురువుగా ఎంపిక కావాలంటే.. ఉత్తమ గురువుగా ఎంపిక చేయాలంటే విమర్శలు లేకుండా ఉండాలి. పాఠశాలకు హాజరయ్యే విధానం.. పనిచేస్తున్న పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చేపట్టిన కార్యక్రమాలు, బడి బయట ఉన్న పిల్లలను చేర్పించేందుకు చేపట్టిన కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం, బడి, శుభ్రత, పరిసరాల శుభ్రత మొదలైన అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ప్రధానోపాధ్యాయులు అయితే గత రెండు సంవత్సరాలుగా పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం, సైన్స్‌ఫెయిర్, ఇన్స్పైర్ కార్యక్రమాల్లో పాల్గొనడం, విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎంపిక కావ డం, జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో క్రీడలు, సాంస్కృతిక, సాహిత్య రంగాల్లో ప్రతిభ, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు అయితే పై లక్షణాలతోపాటు, వారు బోధించిన సబ్జెక్టుల్లో విద్యార్థుల ప్రతిభను పరిగణలోకి తీసుకుంటారు. విద్యాశాఖలో సందడి.. ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియతో విద్యాశాఖలో సందడి మొదలైంది. ఉత్తమ గురువులను ఎంపిక చేయడంలో గతంలో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. కొందరి ఎంపికలో పక్షపాతంగా వ్యవహరించారని, కనీస విలువలు కూడా లేనివారిని ఎంపి క చేశారని ఉపాధ్యాయ వర్గంలో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఎంపిక ఎలా ఉంటుందో అనే సందేహం మొదలైంది. ఈ ఏడాది గతానికి భిన్నంగా మొదటి రౌండ్లో ఎంఈఓలే ఉత్తముల ఎంపిక ప్రతిపాదనలు పంపించడంతో ఏదైనా విమర్శలు వస్తే వారే బాధ్యులు కావాల్సి వస్తుంది. అందుకోసం ఎంఈఓలు శుక్రవారం వరకు ప్రతిపాదనలు పంపించాల్సి ఉండగా ఆచీతూచీ ఎంపిక చేయడంలో మరికొంత గడువు కావాలని కోరినట్లు సమాచారం. మండలస్థాయి నుంచి గుర్తింపు ఎంఈఓల ద్వారా ప్రపోజల్స్ స్వీకరణ పనితనమే ప్రామాణికంగా ఎంపిక విద్యాశాఖలో మొదలైన సందడిపక్షపాతం లేకుండా ఎంపిక ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక కోసం విద్యాశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు పంపించిన మార్గదర్శకాలను అనుసరించి జరుగుతుంది. ఎక్కడ విమర్శలకు తావులేకుండా మొదటి రౌండ్లో ఎంఈఓల ద్వారా వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి జిల్లా స్థాయి స్క్రూట్నీ కమిటీ ద్వారా తుది జాబితా తయారు చేస్తారు. అందులో లోటుపాట్లు ఉంటే సరిచేసి కలెక్టర్ పరిశీలన తర్వాత తుది జాబితా ప్రకటిస్తాం. – రవీందర్‌రెడ్డి, డీఈఓ -
వృత్తి విద్యాకోర్సుల్లో శిక్షణ ఇవ్వాలి
మహబూబాబాద్ అర్బన్: జువైనల్ హోమ్‌లోని పిల్ల లకు వృత్తి విద్యాకోర్సుల్లో శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జువైనల్ హోమ్‌ను శుక్రవారం రాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. హోమ్‌లోని గదులు, పరిసరాలు, కిచెన్ షెడ్, డైనింగ్‌హాల్, మరుగుదొడ్లను పరిశీలించారు. స్టడీ అవర్‌లో ఉన్న పిల్లలతో మాట్లాడారు. హోమ్‌లో ఉన్న పిల్లల వివరాలు తెలుసుకున్నారు. అనాథ పిల్లలు, ఇంటి నుంచి పారిపోయినవారు, మాదకద్రవ్యాలకు బానిసైన పిల్లలు, చిన్న కేసుల్లో ఉన్న బాల సదనంలోని బాలుర వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలకు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలని, వారిలో మార్పు కోసం క్రీడా సాంస్కృతిక సామాజిక అంశాల మీద శిక్షణ అందించాలన్నారు. తనిఖీలో జువైనల్ సూపరింటెండెంట్ కృష్ణవేణి, డిప్యూటీ సూపరింటెండెంట్ సునీల్‌బాబు పాల్గొన్నారు. రాజకీయ పార్టీలతో సమావేశం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. ముసాయిదా ఓటర్ జాబితాపై అభ్యంతరాలను ఈనెల 30వ తేదీ వరకు స్వీకరించనున్నట్లు తెలిపారు. వచ్చే నెల 2న పంచాయతీల వారీగా ఫొటోతో కూడిన తుది జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్‌టొప్పో, అనిల్‌కుమార్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ జువైనల్ హోమ్ ఆకస్మిక తనిఖీ -
‘రెవెన్యూ’లో వేళ్లూనిన అవినీతి !
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూశాఖలో అవినీతి పరాకాష్టకు చేరుతోంది. కొందరు తహసీల్దార్లు, అధికారులు అక్రమాదాయానికి కొత్తదారులు వెతుక్కుని మరీ అవినీతికి పాల్పడుతుండడం వివాదాస్పదమవుతోంది. కిందిస్థాయిలో పలువురు వీఆర్వోలు, వీఆర్ఏల నుంచి పైస్థాయిలో సర్వేయర్లు, ఇన్స్పెక్టర్లు, తహసీల్దార్ల వరకు అవినీతి రాజ్యమేలుతోంది. ప్రతీ పనికి ఓ రేటు నిర్ణయించి వసూలు చేస్తున్న కొందరి తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారు. చేయి తడిపితే తప్ప దస్త్రం కదిలించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఓ వైపు శాఖాపరమైన చర్యలు.. మరోవైపు ఏసీబీ దాడులు చేస్తున్నా కొందరు తహసీల్దార్ల తీరు మారడం లేదు. తాజాగా ఖిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వర్రావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. శుక్రవారం ఆయన ఇంటితో పాటు కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లపై ఐదు చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించడం సంచలనంగా మారింది. ప్రాథమికంగా రూ.5 కోట్ల అక్రమాస్తులను గుర్తించిన ఏసీబీ.. కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తుండడం రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఆది నుంచి అవినీతి ఆరోపణలు.. 2022లో వీఆర్ఎస్కు దరఖాస్తు.. ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించిన కేసులో అరెస్టయిన తహసీల్దార్ బండి నాగేశ్వర్రావుపై గతంలోనూ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ధర్మసాగర్, కాజీపేట, హసన్‌పర్తితోపాటు ఉమ్మడి వరంగల్, కరీంనగర్లో పలుచోట్ల పనిచేసిన సమయంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఫిర్యాదులు అధికా రులకు అందాయి. తహసీల్దార్ ఉద్యోగంతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో భాగస్వామిగా చేరి రెండు చేతులా సంపాదిస్తూ ప్రభుత్వ, అసైన్డ్భూములను అప్పనంగా కట్టబెట్టారన్న ఫిర్యాదు మేరకు 2019లో అప్పుడున్న కలెక్టర్ విచారణ జరిపారు. ధర్మసాగర్ మండలంలోని ఓ గ్రామంలో గుట్టను విక్రయించి రిజిస్ట్రేషన్ చేసి పాస్ పుస్తకాలు జారీ చేయడం వివాదంగా మారింది. 1976లో హసన్‌పర్తి శివారు కోమటిపల్లిలో కొనుగోలు చేసిన సీకేఎం కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్‌కు చెందిన 29 గుంటల భూమిని నగరానికి చెందిన ముగ్గురికి రిజిస్ట్రేషన్ చేసి వారి నుంచి రూ.45 లక్షలు తీసుకున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఈ విషయమై బాధితులు 2022లో అప్పటి సీపీ, డీసీపీ, ఏసీపీకి ఫిర్యాదు చేశారు. తహసీల్దార్‌తోపాటు ఆ ముగ్గురిపై చేసిన ఫిర్యాదుపై విచారణ జరిగినా ఇప్పటికీ నానుతోంది. వరంగల్, హైదరాబాద్‌లో విలాసవంతమైన భవనాలను నిర్మించడంతోపాటు ఒక్కొక్కటిగా అక్రమాలు వెలుగుచూడడంతో స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు కూడా నాగేశ్వర్రావు దరఖాస్తు చేసుకున్నారు. చివరకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీ బీ దాడులు చేయడం చర్చనీయాంశమవుతోంది. ఖిలా వరంగల్ తహసీల్దార్ కార్యాలయంలో ఫైళ్ల పరిశీలన, స్వాధీనం ఖిలా వరంగల్: వరంగల్ ఫోర్ట్‌రోడ్డులోని ఖిలా వరంగల్ తహసీల్ధార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. బీరువా, కౌంటర్లు, క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రతీ ఫైల్‌ను పరిశీలించి కొన్నింటిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మండల ఏర్పాటు నుంచి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.అడ్డదారుల్లో కొందరు తహసీల్దార్లు, అధికారులు భూసమస్యల పరిష్కారానికి రూ.లక్షల్లో డిమాండ్ తీవ్ర ఆరోపణలు వస్తున్నా.. మారని తీరు ఆదాయానికి మించిన ఆస్తుల వివాదంలో బండి నాగేశ్వర్ ఏసీబీ దాడులతో మళ్లీ కలకలం.. రెవెన్యూ శాఖలో చర్చనీయాంశంఏసీబీ దాడులు చేస్తున్నా వెరవని వైనం.. 2024లో భూసేకరణలో అక్రమాలకు పాల్ప డ్డారనే ఆరోపణలపై వరంగల్ ఆర్డీఓ సిడాం దత్తును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అంతకుముందు వరంగల్ జిల్లా సంగెం తహసీల్దార్ రాజేంద్రనాథ్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్లో ఏకంగా సంయుక్త పాలనాధికారి సీసీ రూ 45 వేలు తీసుకుంటూ అడ్డంగా దొరికాడు. హనుమకొండ జిల్లా నడికూడ మండల ఆర్ఐ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. భూపాలపల్లిలో రెవెన్యూ అధికారులకు లంచమివ్వాలని, లేదంటే తమ పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడం లేదని వృద్ధ దంపతులు భిక్షాటన చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. వెంకటాపూర్‌లో ఓ రైతు తనకున్న భూమిని పట్టా చేయాలని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి, చివరకు విసిగిపోయి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇలా ఆరోపణలు వచ్చిన పలువురిపై బదిలీలు, సస్పెన్షన్, వీఆర్‌లో వేటు పడినా.. రాజకీయ పలుకుబడితో మళ్లీ కీలక మండలాల్లో పోస్టింగ్‌లు తెచ్చుకుని అదే తంతు కొనసాగిస్తున్నారు. నాలుగేళ్లలో అవినీతి నిరోధక శాఖ ఉమ్మడి జిల్లాలో 66కు పైగా వివిధ శాఖలకు చెందిన వారిని పట్టుకుంది. అందులో రెవెన్యూ శాఖదే అగ్రస్థానం ఉండడం గమనార్హం. అయినా ఆ శాఖలో పని చేస్తున్న కొందరిలో మార్పు రావడం లేదన్న చర్చ జరుగుతోంది. -
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
మహబూబాబాద్ రూరల్ : రైతులకు సరిపడా యూరియా అందించాలంటూ జిల్లా కేంద్రంలోని తొర్రూర్ ప్రధాన రహదారిపై ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో రైతులు బైఠాయించి శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ఇప్పటికే యూరియా కోసం పలుదఫాలుగా ఆందోళనలు, రాస్తారోకోలు జరుగగా బీఆర్ఎస్, సీపీఐ, ఎల్‌హెచ్‌పీఎస్, ఇతర సంఘాలు మద్దతు తెలుపగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద రాస్తారోకో సందర్భంగా మాత్రం రాజకీయ పార్టీలకు సంబంధంలేకుండా రైతులే స్వచ్ఛందంగా రోడ్డెక్కి తమ ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రెండు గంటలకుపైగా రాస్తారోకో చేపట్టగా టౌన్, రూరల్ సీఐలు మహేందర్ రెడ్డి, సర్వయ్య, ఏఓ తిరుపతిరెడ్డి రైతులతో మాట్లాడారు. అయినా వినకుండా ఎమ్మెల్యే మురళీనాయక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోకి దూసుకువెళ్లారు. పోలీసులు వారిని బలవంతంగా బయటకు పంపించారు. ఈ క్రమంలో రైతులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రైతుల ఆందోళనతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా అందించలేకపోతుందని విమర్శించారు. యూరియా కొరతకు ఎమ్మెల్యే బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సొసైటీ సిబ్బందితో రైతుల వాగ్వాదం శుక్రవారం తెల్లవారుజామునే రైతులు యూరియా కోసం మహబూబాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో సొసైటీ అధికారులు, సిబ్బంది యూరియా స్టాక్ లేదని చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సొసైటీ ప్రధాన గేటు నెట్టుకుని లోపలికి వెళ్లారు. సొసైటీ సీఈఓ ప్రమోద్ కుమార్‌తో వాగ్వాదం చేశారు. టౌన్ ఎస్సైలు ప్రశాంత్ బాబు, శివ, సూరయ్య అక్కడకు చేరుకుని రైతులకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు ఊరుకోలేదు. దీంతో చేసేదేమీలేక సొసైటీ అధికారులు, సిబ్బంది కార్యాలయానికి తాళాలు వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. మానుకోట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి పీఏసీఎస్‌లోకి దూసుకెళ్లిన రైతులు -
నకిలీ పాస్‌పుస్తకాలతో రుణాలు
కురవి : నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు తయారు చేసి వాటి ద్వారా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించిన ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. 11మంది రైతులకు వివిధ బ్యాంకుల నుంచి రూ.16.90లక్షల లోన్లు మంజూరు చేయించి బ్యాంకులను బురిడీ కొట్టించిన ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా కురవి పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఆయన వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన కథనం ప్రకారం.. కురవి మండలం నేరడ శివారు ఎల్కచెట్టు తండా గ్రామ పంచాయతీ పరిధిలోని మంచ్యా తండాకు చెందిన మూడు బాలాజీ, మహబూబాబాద్ మండలం ఆమన్‌గల్ గ్రామ శివారు కస్నా తండాకు చెందిన బానోత్ హరికిషన్, జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం ఒగ్లాపురం గ్రామానికి చెందిన బానోత్ వర్జన్ ముఠాగా ఏర్పడ్డారు. మూడు బాలాజీ వివిధ ప్రాంతాల్లోని రైతులనుంచి పాస్ పుస్తకాలను సేకరించి, అవి ఎక్కడో పోయినట్లుగా ఆన్లైన్లో ఫిర్యాదు చేయించాడు. రైతుల ఫిర్యాదు మేరకు అధికారులు కొత్తగా డూప్లికేట్ పాస్‌పుస్తకాలు ఇచ్చారు. బాలాజీ ఆయా పాస్ పుస్తకాల్లోని పేజీలను తొలగించి బానోత్ హరికిషన్‌కు ఇస్తే అతను బానోత్ వర్జన్కు అందజేశాడు. బానోత్ వర్జన్ వాటిని కంప్యూటర్లో స్కాన్ చేసి కలర్ జిరాక్స్ తీసి పుస్తకాల్లోని మధ్యలోని ఎకరాల విస్తీర్ణాన్ని పెంచి అతికించాడు. ఇలా ఒక్కో పాస్ పుస్తకానికి రూ.10వేలు తీసుకుని వారు తయారు చేసిన నకిలీ పాస్‌బుక్‌లను ఆయా రైతులకు అందజేశారు. వాటితో కురవి యూనియన్ బ్యాంకునుంచి ఒకరు, డోర్నకల్ బ్రాంచ్‌లో ఆరుగురు, మహబూబాబాద్ బ్రాంచ్‌లో ఒకరు, మహబూబాబాద్ కెనరా బ్యాంకులో ముగ్గురు చొప్పున రూ.16.90లక్షల రుణాలు పొందారు. కాగా వీరు పట్టుబడకపోతే సుమారు రూ.కోటి వరకు రుణాలు పొందేవారని డీఎస్పీ తిరుపతిరావు పేర్కొన్నారు. బ్యాంకుల్లోని ఫీల్డ్ అధికారులు సరిగ్గా పరిశీలన చేయకపోవడంతోనే రుణాలు పొందినట్లు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపి నిందితులను పట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ కేసుపై బ్యాంకు అధికారులు, ఇతరులను మరింత విచారిస్తామని తెలిపారు. అరెస్టు చేసి ముగ్గురి వద్ద నుంచి 23 పాసు పుస్తకాలకుగాను 11 పుస్తకాలను, మూడు సెల్ఫోన్లను, కంప్యూటర్ మానిటర్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ఈ కేసులో సీసీఎస్ సీఐ హథీరాం, ఎస్సై ఉషాకుమార్, మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య, కురవి ఎస్సై గండ్రాతి సతీష్ విచారణ చేసినట్లు, వీరిని ఎస్పీ అభినందించినట్లు వివరించారు. రూ.16.90లక్షల క్రాప్లోన్లు పొందిన రైతులు ముగ్గురు నిందితుల అరెస్ట్ -
32కిలోల గంజాయి స్వాధీనం
కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్లో జీఆర్పీలు 32 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. కాజీపేట జీఆర్పీ స్టేషన్లో సీఐ నరేష్కుమార్ శుక్రవారం విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఒడిశాకు చెందిన ధరందీర్ నాయక్, రామ బెహరా, నమిత బెహెరా ముగ్గురు కలిసి 16 ప్యాకెట్లతో గంజాయిని పార్సిల్ చేసి ట్రావెల్ బ్యాగులో భద్రపరిచి కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో మహారాష్ట్రలోని దాదర్‌కు తరలిస్తున్నారు. కాగా కోణార్క్ ఎక్స్‌ప్రెస్ గురువారం సాయంత్రం కాజీపేట జంక్షన్‌కు చేరుకోగా తని ఖీలో భాగంగా జీఆ ర్పీ ఎస్సై ఎం.అభినవ్ తన బృందంతో తనిఖీలు చే శారు. పోలీసుల కదలికలు గమనించిన నింది తులు గంజాయి బ్యాగులతో కిందికి దిగి వెళ్తున్నా రు. అనుమానం కలగడంతో నిందితులను ఆపి త నిఖీ చేయగా బ్యాగుల్లో గంజాయి తరలిస్తు పట్టుబ డ్డారు. వీటి విలువ సుమారు రూ.16 లక్షలు ఉంటుందని, నిందితుల నుంచి రెండు ఫోన్లు, గంజా యిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. రూ.16లక్షల విలువైన గంజాయి పట్టివేత ఒడిశాకు చెందిన ముగ్గురి రిమాండ్ -
సమాచార హక్కు చట్టంతో పారదర్శక పాలన
● కమిషనర్లు అయోధ్యరెడ్డి, శ్రీనివాస్‌రావు న్యూశాయంపేట : ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అధికార యంత్రాంగంలో జవాబుదారీతనం సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశమని తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లు బోరెడ్డి అయోధ్య రెడ్డి, పీవీ శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం వరంగల్ కలెక్టరేట్లో సమాచార హక్కు చట్టం–2005 పై రాష్ట్ర సమాచార కమిషన్ ఆధ్వర్యంలో పీఐఓలు, అప్పిలేట్ అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించగా వారు పాల్గొని మాట్లాడారు. సమాచార హక్కు చట్టం పౌరులకు పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలన అందించడంలో కీలక సాధనమని తెలిపారు. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా చట్టం అమల్లోకి వచ్చిందని, ఇందులోని అంశాలపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఆర్టీఐ ఫిర్యాదులు తక్కువ అందిన జిల్లాలో వరంగల్ ఒకటి అని చెప్పారు. ప్రభుత్వ అధికారులు ప్రజలకు సకాలంలో పూర్తి సమాచారాన్ని అందించాలని సూచించారు. మూడేళ్ల నుంచి 17వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, జిల్లాల పర్యటనలతో వీటిని అక్కడికక్కడే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ప్రతి మూడు నెలలకు ఒకసారి అధికారులకు చట్టంపై అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. జిల్లాలో సమాచార హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలయ్యేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఆర్టీఐ చట్టంలో 31 సెక్షన్లు, ఆరు చాప్టర్లు ఉన్నాయని ఈ చట్టంపై ప్రతి అధికారి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. నిబంధనలకు లోబడి సమాచారం అందించాలని తెలిపారు. సమావేశం తర్వాత పెండింగ్‌లో ఉన్న ఆర్టీఐ దరఖాస్తులపై కమిషనర్లు విచారణ చేపట్టారు. సంబంధిత పీఐఓలు దరఖాస్తుదారుల నుంచి వివరాలు స్వీకరించి తగిన ఆదేశాలు జారీ చేశారు. సదస్సులో పాల్గొనేందుకు విచ్చేసిన కమిషనర్లకు కలెక్టర్ సత్య శారద, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, డీ సీపీలు షేక్ సలీమా, అంకిత్‌కుమార్ పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీ స్ గౌరవ వందనం స్వీకరించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో కమిషనర్లు మొక్కలు నాటారు. సదస్సులో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఏసీపీ శుభం ప్రకాశ్, డీఆర్డీఓ విజయలక్ష్మి, ఆర్డీఓలు, వివిధ శాఖల పీఐఓలు, అప్పిలేట్ అధికారులు పాల్గొన్నారు. -
కాజీపేట–హడప్సర్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌ల పెంపు
కాజీపేట రూరల్ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే అధికారులు కాజీపేట నుంచి హడప్సర్ వెళ్లే హడప్సర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు అప్ అండ్ డౌన్లో అదనపు చైర్ కార్ కోచ్‌లు పెంచినట్లు రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ శుక్రవారం తెలిపారు. అదనపు కోచ్‌లు సెప్టెంబర్ 1వ తేదీనుంచి అమల్లోకి రానున్నట్లు చెప్పారు. 2న డిగ్రీ ఇన్స్టంట్ పరీక్ష కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో డిగ్రీ బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ తదితర కోర్సుల్లో ఫైనల్ ఇయర్లో ఒక్క సబ్జెక్టులో ఫెయిల్ అయిన విద్యార్థులకు సెప్టెంబర్ 2న ఇన్స్టంట్ పరీక్ష నిర్వహించనున్నట్లు అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ వెంకటయ్య తెలిపారు. ఈనెల 29న జరగాల్సిన పరీక్షలు భారీ వర్షాల నేపథ్యంలో వాయిదా వేశారని పేర్కొన్నారు. అన్ని రంగాలకు రుణాలు ● హైదరాబాద్ జోన్ హెడ్ ధారాసింగ్ నాయక్న్యూశాయంపేట : అన్ని రంగాలను ప్రోత్సహించేందుకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ పథకాలను అమలు చేస్తోందని హైదరాబాద్ జోన్ హెడ్ ధారాసింగ్ నాయక్ పేర్కొన్నారు. శుక్రవారం వరంగల్ ప్రాంతీయ కార్యాలయంలో నిర్వహించిన దేశవ్యాప్త మెగా రుణ వితరణ కార్యక్రమంలో పాల్గొని పలు రంగాలకు రూ.67 కోట్ల రుణ మంజూరు పత్రాలను వినియోగదారులకు అందజేశారు. ఆగస్టులో మొత్తం రూ.150 కోట్ల రుణాలు వివిధ రంగాలకు సీబీఐ వరంగల్ రీజియన్ మంజూరు చేసిందన్నారు. వరంగల్ రీజినల్ హెడ్ వి.కృష్ణమోహన్, చీఫ్ మేనేజర్లు టి.సాయికుమార్, ఎండీ ఖాదర్, హెచ్.శివశంకర్, బ్రాంచి మేనేజర్లు రాబర్ట్ జోన్స్, జి.రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు. -
సస్యరక్షణ చర్యలు
హన్మకొండ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంట పొలాల్లో నీరు నిలుస్తోంది.. నీరు అలాగే నిల్వ ఉంటే పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంద. దీంతో రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటించి పంటలను కాపాడుకోవాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం వరంగల్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఎ.విజయ భాస్కర్ సూచించారు. అధిక వర్షాలకు వరి పైరులో పాము పొడ, కాండం కుళ్లు తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది. వీటి నివారణకు వాలిడామైసిన్ 2 మిల్లి లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధితో 2 సార్లు పిచికారీ చేయాలి. కాండంకుళ్లు తెగులు ఆశించిన పంటలో హెక్సాకొనజోల్ 2 మి.లీ.లీటరు నీటికి లేదా కార్బెండిజం 1 గ్రాము లీటరు నీటికి కలిపి 7–10 రోజుల వ్యవధితో 2 సార్లు పిలకల మొదళ్లు తడిచేలా పిచికారీ చేయాలి. నీటి ముంపునకు గురైన వరి పొలాల్లో సల్ఫైడ్ దుష్ప్రభావం ఆశించడానికి అనుకూల పరిస్థితులు కనబడుతున్నాయి. దీని గమనించిన రైతులు వరి పంటలో మొక్కల వేర్లకు తగినంత గాలి తగిలే విధంగా మురుగు నీటిని తీసివేయాలి. అదేవిధంగా పొలాన్ని సన్న నెరల్రు వచ్చేవరకు ఆరబెట్టి మళ్లీ నీరు ఇవ్వాలి. వివిధ పంటల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి -
గోదావరి పరవళ్లు
కాళేశ్వరం : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శుక్రవారం పుష్కర ఘాట్‌ను తాకుతూ కాళేశ్వరం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీ వద్ద 8.51 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో తరలి వస్తోంది. దీంతో బ్యారేజీలో మొత్తం 66 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద మహారాష్ట్ర నుంచి వస్తున్న ప్రాణహిత నదితో కలిసి గోదావరి వరద ప్రవాహం పుష్కర ఘాట్లను తాకుతూ 12.330 మీటర్ల ఎత్తులో నీటిమట్టం దిగువకు తరలి పోతుంది. దీంతో ఉదయం సీడబ్ల్యూసీ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అలాగే దిగువన మేడిగడ్డ బ్యారేజీలో 9.71లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లోతో మొత్తం 85 గేట్లు ఎత్తి అదేస్థాయిలో ఔట్‌ఫ్లో నీటిని దిగువకు తరలిస్తున్నారు. అన్నారం సమీపంలోని చండ్రుపల్లి వాగును గోదావరి కమ్మేయడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అన్నారం నుంచి మద్దుపల్లి, కాళేశ్వరం వెళ్లే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయింది. నీటమునిగిన పత్తి పంట.. అన్నారం, మద్దులపల్లి, పలుగుల, బలిజాపూర్, పూస్కపల్లి, కాళేశ్వరం వరకు వందల ఎకరాల్లో పత్తి పంట నీటమునిగింది. అధికారులు సర్వే చేసి పరిహారం చెల్లించాలని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. కాళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అన్నారం బ్యారేజీలో 8.51లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మేడిగడ్డ బ్యారేజీలో 9.71లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వందల ఎకరాల్లో నీటమునిగిన పత్తిపంట -
మెడికోల సతమతం!
సాక్షి, మహబూబాబాద్: ప్రభుత్వ మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటికే మూడు బ్యాచ్‌లు రాగా మరో బ్యాచ్ రానుంది. కళాశాల భవన నిర్మాణం దేవుడెరుగు.. హాస్టల్ భవనం పూర్తి చేసినట్లు చెబుతున్న అధికారులు కళాశాలకు అప్పగించడం లేదు. దీంతో మెడికల్ విద్యార్థులు ఎక్కడ ఉండాలో తెలియక సతమతవుతున్నారు. నిర్మాణ పనులు పూర్తయిన హాస్టల్ భవనం అప్పగించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రిన్సిపాల్, జిల్లా ఉన్నతాధికారులను కోరుతున్నారు. వారి పాపం.. వీరికి శాపం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరు చేయడంతో పాటు స్థలం కేటాయించి రూ.250కోట్ల మేరకు కేటాయించారు. వీటితో పాటు మెడికల్, నర్సింగ్ కళాశాలల భవనాలు, ల్యాబ్స్, థియేటర్లు, 20 విభాగాల డాక్టర్ల చాంబర్లు, బెడ్స్, క్రిటికల్ కేర్ భవనాలు, డైనింగ్ హాల్, విద్యార్థిని, విద్యార్థులతో పాటు ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ల కోసం క్వార్టర్స్ నిర్మించాలి. అయితే పనులు ప్రారంభించి నాలుగు సంవత్సరాలు గడిచినా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ నర్సింగ్ కళాశాల కోసం నిర్మించిన భవనంలోనే తరగతులు జరుగుతున్నాయి. దీంతో డాక్టర్లు, స్టాఫ్ నర్సులు సరిపడ ఉన్నా.. హాస్టల్స్, క్వార్టర్స్ లేక విద్యార్థులు, ప్రొఫెసర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఇదేం తాత్సారం.. సరైన వసతులు కల్పించకపోతే ప్రస్తుతం కౌన్సెలింగ్‌లో కళాశాలకు సీట్లు కేటాయించమని హెచ్చరిక చేసిన నేపథ్యంలో ఉరుకులు, పరుగుల మీద పనులు చేశారు. హాస్టల్స్, డైనింగ్ హాల్ నిర్మాణం పూర్తి చేశారు. ప్రస్తుతం ఉన్న 330 పడకలకు తోడుగా ఈ విద్యాసంవత్సరం ప్రారంభం వరకు 600కు పైగా పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసేందుకు 50 పడకల క్రిటికల్ కేర్, 250 పడకల జనరల్ విభాగాల కోసం పనులు చేస్తున్నారు. ఇప్పటికే మూడు బ్యాచ్‌లకు చెందిన 450 మంది విద్యార్థులు చదువుతుండగా.. పది పదిహేను రోజుల్లో నాల్గో బ్యాచ్ 150 మంది విద్యార్థులు వస్తారు. కాగా పూర్తి చేసిన హాస్టల్ భవనాలను తాత్సారం చేయకుండా అప్పగిస్తే ఇబ్బందులు తొలుగుతాయని మెడికల్ కళాశాల విద్యార్థులు కోరుతున్నారు. హాస్టల్ సౌకర్యం లేక అవస్థలు పాత కలెక్టరేట్లో కొంతకాలం వసతి జేఎన్టీయూ విద్యార్థుల కోసం ఖాళీ చేయించిన అధికారులు అర్ధంతరంగా సామగ్రితో ఇంటికి పయనం హాస్టల్ భవన నిర్మాణం పూర్తయినా అప్పగించని ఆఫీసర్లు సెప్టెంబర్ 2నుంచి పరీక్షలు.. ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితిరాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కళా శాలలకు దీటుగా తరగతులు నిర్వహిస్తున్న మానుకోట మెడికల్ కళాశాలకు హాస్టల్ వసతి లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. భవన నిర్మాణాల్లో జాప్యం కావడంతో విద్యార్థినులకు పాత కలెక్టరేట్లో హాస్టల్ నిర్వహించారు. అయితే అక్కడే జేఎన్టీయూ అనుబంధ ఇంనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడంతో మెడికల్ విద్యార్థినులు అర్ధంతరంగా ఖాళీ చేయాల్సి వచ్చింది. దీంతో ఎక్కడ ఉండాలో తెలియక ఇంటిబాట పట్టిన విద్యార్థినులు తరగతులకు సక్రమంగా హాజరు కాలేకపోయారు. అయితే సెప్టెంబర్ 2నుంచి సెమిస్టరీ పరీక్షలు ఉన్నా యి. హాస్టల్ వసతి లేకపోయినా ఇంటి వద్ద ఉండి చదువుకున్న విద్యార్థినులు ఇప్పుడు పరీక్షలు రాసేందుకు తప్పనిసరిగా రావాల్సి ఉంది. అ యితే హాస్టల్ లేదు. ఇలాంటి పరిస్థితిలో ఆడపిల్లలను ఎలా పంపించాలి.. ఎక్కడ ఉంచాలని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. -
జ్వరపీడితులు..
విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులు ● ఆస్పత్రులకు పరుగులు పెడుతున్న జనం ● జీజీహెచ్‌లో పెరుగుతున్న ఓపీ ● జిల్లాలో 176 డెంగీ కేసులు నమోదునెహ్రూసెంటర్: జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలు తున్నాయి. దగ్గు, జ్వరం, నొప్పులతో ప్రజలు ఆస్పత్రుల బాట పడుతున్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతీ ఇంట్లో ఒకరు, ఇద్దరు చొప్పున జ్వరం బారినపడి వైద్యం కోసం ఆస్పత్రుల్లో క్యూ కడుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రితో పాటు ప్రైవేట్ ఆస్పత్రులు, చిన్న పిల్లల ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ఇదిలా ఉండగా గతేడాది జిల్లాలో డెంగీ విలయతాండవం చేయగా.. ప్రస్తు తం ఇప్పటి వరకు 176 డెంగీ కేసులు నమోదు కాగా.. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పారిశుద్ధ్య లోపంతోనే.. పారిశుద్ధ్యలోపం కారణంగా డెంగీ కేసులు నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. మహబూబాబాద్ పట్టణం, ఇందిరానగర్, వడ్డెర కాలనీ, కేసముద్రం మండలం సర్వాపురం ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు డెంగీ కేసులు అధికంగా నమోదవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇంటి పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, నీరు నిల్వ లేకుండా చూసుకోవడం, మురికినీరు కాల్వల్లో ప్రవహించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. దోమలు వ్యాప్తి కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా వ్యహరించాలని వైద్యులు తెలుపుతున్నారు. అవగాహన, మెడికల్ క్యాంపులు.. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఎప్పకప్పుడూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పట్టణంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పి స్తూ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ప్రజల వద్దకే వెళ్లి రక్త నమూనాలను సేకరించి పరీక్షలు ని ర్వహిస్తున్నారు. మూడు రోజుల్లో జ్వరం తగ్గకుంటే వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాలని వైద్య సిబ్బంది సూచిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలకు నోడల్ అధికారులను నియమించి సీజనల్ ముప్పుకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండేలా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. ప్రైవేట్‌కు వెళ్తే అంతే సంగతులు.. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తే రోగుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఆస్పత్రికి వెళ్లింది మొదలు టెస్టులు, అడ్మిట్, ట్రిట్మెంట్ అంటూ అత్యధిక ఫీజులను వసూలు చేస్తున్నారని ప్రజలు, రోగులు ఆరోపిస్తున్నారు. జ్వరం, దగ్గు అని వెళ్తే తప్పనిసరిగా టెస్టులు రాస్తున్నారు. పిల్లల ఆస్పత్రులు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. జలుబు, ద గ్గు, జ్వరంతో చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నా రు. ఇదే అదునుగా భావించిన కొంతమంది అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఏడాది కేసుల సంఖ్య 2024 419 2025 (ఇప్పటి వరకు) 176జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 176 డెంగీ కేసులు నమోదుయ్యాయి. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తూ నమోదు కానీ కేసులు కూడా ఉన్నాయి. గతేడాది 419 డెంగీ కేసులు, అలాగే మలేరియా, చికెన్‌గున్యా వంటి కేసులు నమోదయ్యాయి. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
● కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ మహబూబాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ క్యాంపు కార్యాలయం నుంచి తహసీల్దార్లు, కమిషనర్లు, సంబంఽధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వర్షాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక బృందాలు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. చెరువులు, వంతెనలు, వాగులు, లోలెవల్ బ్రిడ్జి తదితర ప్రదేశాల్లో సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్‌కుమార్, ఆర్డీఓలు కృష్ణవేణి, గణేష్, మండల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. హాజరుశాతం పెంచాలి విద్యార్థుల హాజరు శాతం పెంచడంతో పాటు నాణ్యమైన విద్య అందించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో గురువారం విద్యాశాఖ పనితీరుపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు కృషి చేయాలన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, డీఈఓ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్దచెరువు పరిశీలన.. బయ్యారం: మండలంలో గురువారం కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ ఆకస్మికంగా పర్యటించారు. బయ్యారం పీహెచ్‌సీని తనిఖీ చేసిన ఆయన లేబర్‌రూం, వార్డులు, మందుల గది, సిబ్బంది హాజరు, మందులస్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం వైద్యాధికారితో మాట్లాడుతూ.. పీహెచ్సీ పరిధిలోని సబ్సెంటర్లలో షెడ్యూల్‌ప్రకారం వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం బయ్యారంలోని బాలుర ఉన్నత పాఠశాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. తర్వాత బయ్యారం పెద్దచెరువు అలుగులు, ఇల్లెందు–మహబూబాబాద్ రహదారిపై ఉన్న జిన్నెలవర్రె లోలెవల్ కల్వర్ట్ను కలెక్టర్ పరిశీలించారు. తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ విజయలక్ష్మి, వైద్యాధికారి విజయ్, ఎంఈఓ దేవేంద్రాచారి తదితరులు ఉన్నారు. -
కొలువుదీరిన గణనాథుడు..
కోతుల బెడదతో గణపయ్యకు ఇల్లు గార్లలో గణనాథుడి సన్నిధిలో భక్తులు మహబూబాబాద్ రూరల్: జిల్లా వ్యాప్తంగా బుధవారం వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు భారీ సెట్లు వేసి గణనాథులను ప్రతిష్ఠించారు. జిల్లా కేంద్రంలో శ్రీమహాలక్ష్మి గణపతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గోమయ గణపతిని కొలువుదీర్చారు. అదేవిధంగా పలు చోట్ల మట్టిగణపతి విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఉదయం, సాయంత్రం పూజలు చేస్తున్నారు. విఘ్నేశ్వరుడు తమను ఆశీర్వదించాలని భక్తులు వేడుకున్నారు. ఇదిలా ఉండగా గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆదేశాల మేరకు డీఎస్పీలు తిరుపతిరావు, కృష్ణకిశోర్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విస్తృత పోలీసు బందోబస్తు నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు.మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామంలో గణపయ్యకు భక్తులు ఇల్లు నిర్మించి పూజలు ప్రారంభించారు. గణపయ్యకు ఇల్లు నిర్మించటం ఏమిటీ అనుకుంటున్నారా.. గ్రామంలో కోతుల బెడద అధికంగా ఉంది. లడ్డూ, ప్రసాదాలు, ఇతర సామగ్రి రక్షణ కోసం వేప చెక్క బెండ్లతో చిన్న ఇల్లు మాదిరిగా నిర్మించి అందులో గణపతిని కొలువుదీర్చి పూజిస్తున్నారు. ఇలా చేయడం వల్ల తమ గణపతికి కోతుల తాకిడి ఉండదని భక్తులు పేర్కొన్నారు. – మహబూబాబాద్ రూరల్ -
‘సమయపాలన పాటించని అధికారులు’
చిన్నగూడూరు: మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం అధికా రులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. గురువారం ఉద యం 11.05 గంటల వరకు ఎంపీడీఓ కిన్నెర యాకయ్య మినహా అధికారులు, సిబ్బంది విధులకు హాజరుకాకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఈవిషయమై ఎంపీడీఓను ‘సాక్షి’ వివరణ కోరగా దూర ప్రాంతాల్లోని పట్టణాల్లో నివాసం ఉంటూ రైళ్లు, బస్సుల ద్వారా ఆలస్యంగా వస్తున్నారని తెలిపారు. సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, అధికారులు, సిబ్బంది ఆలస్యంగా రావడం వల్ల తమ పనులు సకాలంలో పూర్తి కావడంలేదని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పర్యావరణ పోటీల్లో జనగామ ఫస్ట్
జనగామ: జాతీయ స్థాయిలో నిర్వహించిన నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ కాంపిటేషన్–2025లో తెలంగాణకు గర్వకారణంగా జనగామ జిల్లా దేశంలో మొదటి స్థానాన్ని కై వసం చేసుకుంది. మొత్తం 75,156 రిజిస్ట్రేషన్ నమోదు కావడం రాష్ట్రానికే కాక దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఈ మే రకు కలెక్టర్ రిజ్వాన్ బాషా గురువారం సంతోషం వ్యక్తం చేస్తూ ప్రకటన చేశారు. పోటీలు ఇలా.. జాతీయ పర్యావరణ పోటీలను మూడు దశల్లో జూలై 1వ తేదీన ప్రారంభించారు. పేరు, మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, భాష వివరాలను రాసి, పర్యావరణ ఫొటోలతో అప్లోడ్ చేయాలి. విద్యార్థి తరగతి ని బట్టి, ఇతరులకు వృత్తి ఆధారంగా ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. అనంతరం క్విజ్ దశ ప్రారంభించి నీటి పొదుపు, మొక్కల నాటకం, చెత్త వేరు చేయడం వంటి అంశాలకు సంబంధించి 20 ప్రశ్నలకు జవాబుతో ముగుస్తుంది. ప్రశ్నలకు జవాబు చెప్పిన ఆధారంగా మార్కులను కేటాయించి, ఆన్లైన్ ద్వారా డిజిటల్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. విద్యార్థులతో పాటు ఉద్యోగులు, స్వయం సహాయక బృందాలు, అన్ని వర్గాల ప్రజలకు పాల్గొనే అవకాశం కల్పించడంతో జనగామ జిల్లా మొదటి నుంచే దేశంలో రెండో స్థానంలో నిలిచి, ఆగస్టు 18న మొదటి స్థానాన్ని చేరుకుంది. అనంతరం ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాతో గట్టి పోటీ నడిపి 10 వేల స్కోర్ మెజార్టీతో దేశంలోనే అగ్రస్థానం దక్కించుకుంది. అందరి భాగస్వామ్యంతోనే సాధ్యం – కలెక్టర్ రిజ్వాన్ బాషా భౌగోళిక పరిమితులు, వనరుల కొరత ఉన్నప్పటికీ, మన జిల్లా–మన నీరు కార్యక్రమం, ఇంకుడుగుంతల నిర్మాణం, వనమహోత్సవంలో మొక్కల నాటకం వంటి పర్యావరణ అనుకూల కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడంతో ఈ పో టీల్లో అత్యధిక భాగస్వామ్యం సాధ్యమైందని కలెక్ట ర్ రిజ్వాన్ తెలిపారు. వినాయక చవితి సందర్భంగా మరింత ఉత్సాహం నెలకొందన్నారు. ఆగస్టు 26వ తేదీ రాత్రి వరకు 10 వేల స్కోర్ ఆధిక్యాన్ని కొనసాగించిన జిల్లా, కలెక్టర్ పిలుపుతో వినాయక చవితి రోజు వేలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబ స భ్యులు మట్టి గణపతి ఫొటోలు అప్లోడ్ చేసి రిజి స్ట్రేషన్లు పూర్తి చేయడంతో జాతీయ స్థాయిలో తె లంగాణకు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేసిందన్నా రు. ఈ విజయానికి తోడ్పడిన హరితదళ ప్రాజెక్ట్ అ ధికారి గౌసియా బేగం, ఏఎంఓ శ్రీనివాస్, విద్యా శా ఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, స్వయం సహాయక సభ్యులు, వివిధ శాఖల ఉ ద్యోగులను కలెక్టర్ అభినందించారు. దేశంలోనే మొదటి స్థానం సాధించిన జిల్లా కాంపిటీషన్–2025లో ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు 75,156 మంది రిజిస్ట్రేషన్ -
ఉగ్రరూపం దాల్చిన గోదావరి
కాళేశ్వరం: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల ద్వారా వరద ప్రవాహం తరలిరావడంతో కాళేశ్వరం వద్ద గోదావరి గురువారం సాయంత్రం ఉగ్రరూపం దాల్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీ వద్ద 3.52 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో తరలివస్తుంది. దీంతో బ్యారేజీలో మొత్తం 66 గేట్లు ఎత్తి నీటిని దిగువకు అదేస్థాయిలో ఔట్‌ఫ్లో రూపంలో కాళేశ్వరం వైపునకు తరలిస్తున్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద మహారాష్ట్ర నుంచి తరలి వస్తున్న ప్రాణహితనదితో కలిసి గోదావరి వరద ప్రవాహం పుష్కర ఘాట్లను తాకుతూ 9.500 మీటర్ల ఎత్తులో నీటిమట్టం దిగువకు తరలిపోతుంది. దిగువన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో 5.52లక్షల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో మొత్తం 85 గేట్లు ఎత్తివేసి ఉంచడంతో అదేస్థాయిలో ఔట్‌ఫ్లో దిగువకు ఇంజనీర్లు తరలిస్తున్నారు. దీంతో గోదావరికి పెద్ద ఎత్తున వరద ఎగువ నుంచి తరలి రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తం అవుతున్నారు. శుక్రవారం ఉదయం వరకు భారీగా వరద తరలిరానున్నట్లు ఇరిగేషన్ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో అన్నారం సమీపంలోని చండ్రుపల్లి వాగు గోదావరి కమ్మెయడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అన్నారం టు మద్దుపల్లి వరకు రవాణాస్తంభించింది. -
సైబర్ వలలో ఆలయ ఉద్యోగి
కురవి: సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా బాధితులు మోసపోతున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కట్ట జగన్నాధం సైబర్ వలలో చిక్కుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి.. కరీంనగర్ జిల్లాకు చెందిన కట్ట జగన్నాథం గత కొన్నేళ్ల నుంచి కురవిలోని భద్రకాళీ సమేత శ్రీవీరభద్రస్వామి ఆలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 26న (మంగళవారం) సైబర్ నేరగాడు 6003447660 నంబర్ నుంచి ఫోన్ చేసి ‘హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నా.. మీకు హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు ఉంది కదా.. దాని లిమిట్ పెంచుతాం.. ఇది అంతా ఉచితమే’ అని చెప్పాడు. దీంతో జగన్నాధం అతడి మాటలను నమ్మాడు. అతడు (సైబర్ నేరగాడు) సెల్ఫోన్లో హెచ్డీఎఫ్సీ ‘మై కార్డ్స్’ యాప్ ఓపెన్ చేయమని చెప్పడంతో తన మొబైల్లో ఆ యాప్ లేదని బాధితుడు తెలిపాడు. సెల్‌ఫోన్ వాట్సాప్‌కు లింక్ పంపిస్తా ఓపెన్ చేయమని చెప్పడంతో జగన్నాధం ఓపెన్ చేశాడు. వెంటనే మైకార్డ్స్ యాప్ లింక్ హెచ్డీఎఫ్సీ బ్యాంకు గుర్తులతో వచ్చింది. అతను చెప్పినట్లే బాధితుడు లింక్‌ను ఓపెన్ చేయడంతో అందులో రూ.6.89 లక్షలు క్రెడిట్ లిమిట్ పెరిగినట్లు చూపించింది. అనంతరం అవతలి వ్యక్తి ఇంకా నీకు ఏమైనా క్రెడిట్ కార్డులున్నాయా? అని అడిగాడు. ఎస్బీఐ, యాక్సిస్‌బ్యాంక్, ఇండస్‌ల్యాండ్ కార్డులున్నాయని చెప్పడంతో అవతలి వ్యక్తి ఫోన్ పెట్టేశాడు. అన్ని కార్డుల గురించి ఎందుకు అడిగాడని అనుమానం రావడంతో వెంటనే ఎస్బీఐ క్రెడిట్ కార్డు యాప్‌లో చెక్ చేయగా అందులో నుంచి రూ.1,61,353 డెబిట్ అయినట్లు గుర్తించాడు. దీంతో వెంటనే అవతలి వ్యక్తి ఫోన్ నంబర్‌కు ఫోన్ చేయడంతో సాయంత్రం వరకు మీకు డబ్బులు వస్తాయని చెప్పి ఫోన్ కట్ చేశాడు. యాక్సిస్ బ్యాంకు కార్డు నుంచి రూ.3,87,093, ఇండస్ బ్యాంకు క్రెడిట్ కార్డు నుంచి రూ.1,94,498, హెచ్డీఎఫ్సీ కార్డు నుంచి రూ.1.30లక్షలు కట్ అయ్యాయి. ఇలా నాలుగు క్రెడిట్ కార్డుల నుంచి మొత్తం రూ.8.72 లక్షలు కట్ అయ్యాయి. దీంతో మోసపోయానని గుర్తించి వెంటనే ఆన్‌లైన్‌తో పాటు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై గండ్రాతి సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రూ.8.72 లక్షలు కాజేసిన సైబర్ నేరస్తులు పోలీసులకు ఫిర్యాదు -
రైల్వే రవాణాకు వర్షం ఎఫెక్ట్
కాజీపేట రూరల్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో దక్షిణ మధ్య రైల్వే అధికారి పలు రైళ్లను దారి మళ్లించగా మరికొన్ని రైళ్లను రద్దు చేశారు. గు రువారం కాజీపేట రైల్వే స్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్, సీపీఆర్ఓ శ్రీధర్ మాట్లాడుతూ కాజీపేట నుంచి బల్లార్షా వెళ్లే రెండు ప్యాసింజర్ రైళ్లు, డైలీ రామగిరి ప్యాసింజర్, కాజీపేట–బల్లార్షా వెళ్లే డైలీ అజ్నీ ప్యాసింజర్ రైళ్లను శుక్రవారం రద్దు చేస్తున్నామన్నారు. అలాగే కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే 8 ఎక్స్‌ప్రస్ రైళ్లను శుక్రవారం వయా పెద్దపల్లి, పెద్దపల్లి, కరీంనగర్ మీదుగా దారి మళ్లించి నడిపిస్తున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్–తిరుపతి (17405) కృష్ణా ఎక్స్‌ప్రెస్, నర్సాపూర్–నాగర్సోల్ (12787) ఎక్స్‌ప్రెస్, ముంబాయి–లింగంపల్లి (17057) ఎక్స్‌ప్రెస్, ఓకా–రామేశ్వరం (16734) ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి–ముంబాయి (17058) ఎక్స్‌ప్రెస్, బిజికెటి–కాచిగూడ (17606) ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్–జైపూర్ (12720) ఎక్స్‌ప్రెస్, కాచిగూడ–బిజికెటి (17605) ఎక్స్‌ప్రెస్‌ను వయా కాజీపేట బైపాస్ లైన్ మీదుగా పెద్దపల్లి, కరీంనగర్, ఆర్మూర్, నిజమాబాద్ మీదుగా దారి మళ్లించి నడిపిస్తున్నట్లు తెలిపారు. అలాగే కాజీపేట–సిర్పూర్ టౌన్ (17003) వెళ్లే ప్యాసింజర్, కరీంనగర్–సిర్పూర్టౌన్ (67772) వెళ్లే పుష్పుల్, సిర్పూర్టౌన్–కరీంనగర్ (67771) వెళ్లే పుష్పుల్ రైళ్లు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. భద్రాచలంరోడ్–బల్లార్షా (17033) వెళ్లే సింగరేణి కాజీపేట–బల్లార్షా మధ్య, సిర్పూర్టౌన్–భద్రాచలంరోడ్ (17034) వెళ్లే సింగరేణి సిర్పూర్టౌన్–కాజీపేట, సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (17233) వెళ్లే ఎక్స్‌ప్రెస్ కాజీపేట–సిర్పూర్కాగజ్నగర్, సిర్పూర్కాగజ్నగర్– సికింద్రాబాద్ (17234) వెళ్లే ఎక్స్‌ప్రెస్ సిర్పూర్కాగజ్నగర్– కాజీపేట మధ్య రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.● పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు ● కాజీపేట జంక్షన్లో హెల్ప్‌డెస్క్ ఏర్పాటుకాజీపేట జంక్షన్లో రైల్వే హెల్ప్‌డెస్క్ వర్షాల కారణంగా కాజీపేట జంక్షన్ మీదుగా అప్ అండ్ డౌన్ రూట్లో ప్రయాణించే పలు రైళ్లను దారి మళ్లించి నడిపిస్తున్న నేపథ్యంలో రైల్వే అధికారులు కాజీపేట జంక్షన్లో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశారు. రైళ్ల రద్దు, దారి మళ్లింపు, పాక్షికంగా రద్దు, ఆలస్యంగా నడిచే రైళ్ల వివరాలను ఎప్పటికప్పుడు ప్రయాణికులకు తెలియజేస్తున్నామన్నారు. -
తల్లితో తనువు చాలించాలనుకున్న కొడుకు..
● కోడిపుంజులతండాలో విషాదం బయ్యారం: నవమాసాలు మోసిన తల్లితో తాను తనువు చాలించాలనుకొని గడ్డిమందు తాగిన కొడుకు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కోడిపుంజులతండాకు చెందిన ధరావత్ రాజు మహబూబాబాద్ మండలం సలార్‌తండాకు చెందిన కవితను రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటికే కవితకు వివాహం జరిగి కుమారుడు సాద్విక్ అలియాస్ మున్న(11) జన్మించగా కుమారుడిని తీసుకొని రాజు వద్దకు వచ్చింది. వీరికి కుమార్తె భవ్యశ్రీ జన్మించగా ఈ నెల 21న రాత్రి సమయంలో రాజు, కవితల మధ్య వివాదం చోటుచేసుకోగా 22వ తేదీన ఉదయం కవిత మనస్తాపానికి గురై ఇంట్లో ఉన్న గడ్డిమందు తాగింది. ఇది చూసిన కుమారుడు మున్న అదే గడ్డిమందును తాగగా స్థానికులు ఇద్దరిని చికిత్స నిమిత్తం మహబూబాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించి మున్న మృతి చెందగా తల్లి కవిత కోలుకుంటుంది. కాగా భార్యాభర్తల మధ్య జరిగిన వివాదంలో అభంశుభం తెలియని చిన్నారి మృతి చెందడంతో కోడిపుంజులతండాలో విషాదం నెలకొంది. మృతుడి అమ్మమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సై తిరుపతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుత్ పునరుద్ధరణకు అహర్నిశలు కృషి
హన్మకొండ: భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు విద్యుత్ అధికారులు, ఉ ద్యోగులు అహర్నిశలు శ్రమిస్తున్నారని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన భారీ వర్షాలు కురిసిన కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, ని ర్మల్, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో పర్యటించారు. దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కా మారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ సర్కి ల్ పరిధిలో నేలకూలని 108 విద్యుత్ స్తంభాలకు 87 స్తంభాలు పునరుద్ధరించామని, 21 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు 17 సరి చేశామని, 86 ట్రాన్స్ఫార్మర్లు నీట మునుగగా 6 ట్రాన్స్ఫార్మర్లు పునరుద్ధరించామన్నారు. భారీ వరద, ముంపుతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. విద్యుత్ పునరుద్ధరణకు బ్రేక్‌డౌన్ టీం సిద్ధంగా ఉందని, రేయింబవళ్లు నిబద్ధతతో పని చేస్తున్నారన్నారు. కరీంనగర్ సర్కిల్ కార్యాలయంలో లోడ్ మానిటరింగ్ సెల్ కంట్రోల్‌రూంను పరిశీలించి వర్షాలతో విద్యుత్ సరఫరా, సబ్ స్టేషన్ల పనితీరు, స్తంభాలు, లైన్ల పనితీరు, స్థితిగతులను తనిఖీ చేశారు. వర్షాలతో ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగులు సెలవులు తీసుకోవద్దని ఆదేశించారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి -
వేయిస్తంభాల ఆలయంలో గణపతి ఉత్సవాలు
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల దేవాలయంలో బుధవారం వినాయక చవితిని పురస్కరించుకుని గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ, వేదపండితులు మణికంఠశర్మ, సందీప్‌శర్మ, ప్రణవ్‌ల ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుంచి ఉత్తిష్ట గణపతికి కోనేరునీటితో నవరసాభిషేకం నిర్వహించి, హరిద్రాకుంకుమలేపనం గావించి వరసిద్ధివినాయకుడిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. విగ్రహదాత శ్రీకుమార్ రెమాండ్స్ షోరూం అధినేత వెనిశెట్టి సుబ్రహ్మణ్యం ఇంటి నుంచి మంగళవాయిధ్యాలతో వేదమంత్రోచ్ఛరనలతో ఊరేగింపుగా విగ్రహాన్ని తీసుకువచ్చి విష్ణుమూర్తి ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన వేదికపై ప్రతిష్ఠించారు. కళశస్థాపన, మంటపారాధన, నవగ్రహారాధన, అఖండదీపారాధన, శోడషోపచారపూజ, పత్రిపూజ, ఉండ్రాళ్ల నైవేద్యం నివేదన, ఋత్విగ్వరణం, మహాహారతి, తీర్దప్రసాదాల వితరణ జరిపారు. అనంతరం అగ్ని ప్రతిష్టాపన, గణపతి నవగ్రహరుద్రహోమం నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి రూ.75కోట్లు.. మహాగణపతి ఉత్సవాలను ఎంపీ కడియం కావ్య, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలనం చేసి పూజా కార్యక్రమాలను ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కావ్య మాట్లాడుతూ వేయిస్తంభాల ఆలయ అభివృద్ధికి రూ .75కోట్లు కేటాయించాలని కేంద్ర పురావస్తు, టూరిజం శాఖ మంత్రి గజేంద్రసింగ్ షికావత్ను కలిసి విన్నవించినట్లు తెలిపారు. దీనికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు గట్టు మహేష్‌బాబు, దాత నడిపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. సాయంత్రం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రవచకులు వంగల సోమయాజులు శమంతఖోపాఖ్యానం వినిపించారు. శ్రీలక్ష్మిగణపతిగా అలంకరణ గణపతి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు వరసిద్ధి వినాయకుడిగా, రెండో రోజు శ్రీలక్ష్మి గణపతిగా అలంకరించి భక్తులకు దర్శనానికి అనుమతించారు. వేముల సత్యమూర్తి ఆధ్వర్యంలో నిత్యాన్నదానం ప్రారంభించారు. ఆలయ ఈఓ ధరణికోట అనిల్‌కుమార్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఉత్సవకమిటీ సభ్యులు పులి రజినీకాంత్, గండ్రాతి రాజు, చొల్లేటి కృష్ణమచారి పాల్గొన్నారు. సాయంత్రం శివానంద నృత్యమాల శిష్య బృందంచే కూచిపూడి నృత్యాలు అలరించాయి. ప్రారంభించిన ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి -
అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి
మరిపెడ రూరల్: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం స్టేజితండా గ్రామపంచాయతీ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. స్టేజితండా గ్రామపంచాయతీ పరిధిలోని మేగ్యాతండాకు చెందిన భూక్య వెంకన్న (35) ఆటో నడుపుకుంటూ జీవ నం సాగిస్తున్నాడు. వెంకన్నకు పదేళ్ల క్రి తం రజితతో వివా హం కాగా, వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల భార్య పుట్టింటికి వెళ్లింది. స్టేజితండా పరిధిలోని ఓ వెంచర్లో ఆటో నిలిచి ఉండగా గురువారం తెల్లవారుజామున స్థానికులు గమనించి ఆటోలో ఉన్న వెంకన్నను లేపగా ఉలుకుపలుకు లేదు. దీంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా నా కొడుకు వెంకన్నను కోడలు ర జితతో పాటు మరో వ్యక్తి కావాలనే చంపారని, వా రిపై చర్య తీసుకోవాలని ఆరోపిస్తూ మృతుడి తండ్రి హచ్చు మరిపెడ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. -
నత్తేనయం!
కొత్తగూడ: ఏజెన్సీ గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు నెరవేరడం లేదు. ముఖ్యంగా రోడ్ల నిర్మాణాల్లో తీవ్రం జాప్యం జరుగుతోంది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఏళ్లుగా పనులు సాగుతూనే ఉన్నాయి. అలాగే మరికొన్ని పనులు అటవీశాఖ అనుమతుల పేరిట కొర్రీలు పెట్టడంతో రోడ్ల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. కంకరపోసి వదిలేశారు. కాగా, పనులు త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రతీ సమావేశంలో చెబుతున్నప్పటికీ.. పనుల్లో మాత్రం కదలిక రావడం లేదు. బ్రిడ్జి నిర్మించి రోడ్డు వేయడం ఆపేశారు.. కొత్తగూడ మండల కేంద్రం నుంచి సాదిరెడ్డిపల్లి, జంగవానిగూడెం, ముస్మి వైపునకు వెళ్లే ప్రధాన రహదారిపై కోటి రూపాయలతో బ్రిడ్జి నిర్మించారు. బ్రిడ్జి నుంచి రెండు వైపులా వంద మీటర్లు బీటీ రోడ్డు నిర్మించాలి. కానీ ఏడాదిగా పనులు చేపట్టడం లేదు. దీంతో మట్టి రోడ్డుపై గుంతలు పడి పూర్తిగా బురదమయంగా మారింది. ఇటు వైపునకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బిల్లులు రాకనే పనులు చేపట్టడం లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నట్లు తెలిసింది. అదేవిధంగా కొత్తపల్లి నుంచి ఓటాయి క్రాస్‌రోడ్డు వరకు డబుల్ రోడ్డు నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో వర్షం వచ్చిందంటే భారీ వాహనాలు రాకపోకలు సాగించడం లేదు. అటవీశాఖ అనుమతులు రాక.. అటవీశాఖ నుంచి అనుమతులు రాకపోవడంతో పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి బక్కచింతలపల్లి, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి ఈశ్వరగూడెం, చెరువుముందుతండా నుంచి దొరవారివేంపల్లి, గోవిందాపురం నుంచి పొగుళ్లపల్లి, నీలంపల్లి నుంచి పొగుళ్లపల్లి, ఆర్అండ్బీ రోడ్డు నుంచి కుందెనపల్లి గ్రామాల రోడ్ల పనులు నాలుగేళ్లుగా కంకరకే పరిమితమయ్యాయి. కొత్తపల్లి నుంచి దుబ్బగూడెం రోడ్డు సగం మాత్రమే పూర్తయింది. ఈరోడ్డు అనుమతుల కోసం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. పాత రోడ్ల విస్తరణను అటవీశాఖ అడ్డుకోవడంతో స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కొత్తగూడ ఏజెన్సీలో ఏళ్లుగా పూర్తికాని రోడ్లు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో కొన్ని, అటవీశాఖ అడ్డంకితో మరికొన్ని నిలిచిపోయిన పనులు ప్రజలకు తప్పని ఇబ్బందులు -
రైతుల అరిగోస..
● టోకెన్ల కోసం రాత్రి నుంచే పడిగాపులు ● క్యూలైన్లో చెప్పులు, చెట్ల కొమ్మలుకేసముద్రం: యూరియా టోకెన్ల కోసం సోమవారం రాత్రి నుంచే రైతులు పడిగాపులు పడ్డారు. క్యూలో చెప్పులు, చెట్ల కొమ్మలను ఉంచారు. అలాగే సరిపడా యూరియా అందించాలంటూ రైతులు ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగిన సంఘటన కేసముద్రం మున్సిపాలిటీ, ఇనుగుర్తి మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. కేసముద్రంవిలేజ్ పీఏసీఎస్‌కు యూరియా వస్తుందనే సమాచారం మేరకు సోమవారం రాత్రి సొసైటీ వద్ద రైతులు పడిగాపులు పడ్డారు. దీంతో పోలీసులు చేరుకుని రాత్రి సమయంలో ఇక్కడ నిద్రిస్తే విష పరుగులు వస్తాయని నచ్చజెప్పి రైతులు పంపించారు. దీంతో తెల్ల వారుజామున 4 గంటలకు రైతులు సొసైటీ వద్దకు చేరుకుని క్యూలో నిల్చున్నారు. 222 బస్తాలకు టోకెన్లు ఇచ్చే క్రమంలో.. రైతులంతా ఒక్కసారిగా సెంటర్లోకి వెళ్లడంతో గందరగోళపరిస్థితి ఏర్పడింది. దీంతో సంఘటన స్థలానికి రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సై మురళీధర్‌రాజు, తహసీల్దార్ వివేక్ చేరుకుని రైతులకు నచ్చజెప్పి పరిస్థితిని చక్కదిద్దారు. చివరకు 222 మందికి టోకెన్లు అందజేసి.. ఒక్కో బస్తా చొప్పున పంపిణీ చేశారు. అదే విధంగా ఇనుగుర్తి మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద 222 బస్తాలకు గాను టోకెన్లు ఇవ్వగా, రైతులు క్యూలో తమ చెప్పులను, చెట్ల కొమ్మలను ఉంచి పడిగాపులు పడ్డారు. ఈ క్రమంలో అత్యధిక సంఖ్యలో వచ్చిన రైతుల తమకు సరిపడా యూరియా అందించాలంటూ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. సంఘటన స్థలానికి పోలీసులు, అధికారులు చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. అనంతరం వర్షం పడడంతో రైతు వేదిక లోపల రైతులను క్యూలో ఉంచి టోకెన్లు అందించారు. కాగా మహబూబాబాద్ ఏడీఏ శ్రీనివాసరావు సెంటర్ వద్దకు చేరుకుని, రైతులకు సూచనలు చేశారు. నానో యూరియాను పిచికారీ చేయాలని ఆయన సూచించారు. -
వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి
మహబూబాబాద్: పెంపకందారులు గొర్రెలు, మేకలకు తప్పనిసరిగా పీపీఆర్ వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని జిల్లా పశువైద్య, సంవర్థక శాఖాధికారి కిరణ్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 26నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు టీకాలు వేస్తామన్నారు. జిల్లాలో 6,60,000 గొర్రెలు, మేకలు ఉన్నాయన్నారు. పీపీఆర్ అనే వ్యాధి వైరస్క్రిమి వల్ల వస్తుందన్నారు. వ్యాధి బారిన పడిన జీవాల్లో ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరడం, ము క్కు నుంచి చీము, నోటి నుంచి సొంగకారడం వంటి వ్యాధి లక్షణాలు ఉంటాయన్నారు.దరఖాస్తుల ఆహ్వానంమహబూబాబాద్ అర్బన్: జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక కోసం అర్హులైన ప్రభు త్వ పాఠశాలలు, మోడల్ స్కూల్, కస్తూర్బాగాంధీ విద్యాలయం, ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల ప్రతిపాదనలు మండల విద్యాశాఖ అధికారి ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రవీందర్‌రెడ్డి మంగళవారం తెలిపారు. అర్హులైన ఉపాధ్యాయులు తమ ప్రతిపాదనలు తగిన డాక్యుమెంట్స్‌తో ఈ నెల 29న సాయంత్రం 4గంటలలోపు మండల విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఉపాధ్యాయులపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు పెండింగ్‌లో లేవని, కోర్టు కేసులు లేవని ధ్రువీకరించి ఎంఈఓలు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు.డిపో అభివృద్ధికి కృషి చేయాలినెహ్రూసెంటర్: మహబూబాబాద్ డిపో అభివృద్ధికి కృషి చేయాలని కరీంనగర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలోమన్ సూచించారు. మహబూబాబాద్ ఆర్టీసీ డిపోను మంగళవారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా డిపోలోని మెయింటనెన్స్, సెక్యూరిటీ, గ్యారేజ్ విభాగాలను సందర్శించారు. బస్సుల మన్నిక, మెయింటనెన్స్ గురించి మెకానిక్‌లకు వివరించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ ఎం.శివప్రసాద్, సూపరింటెండెంట్ శ్రీమన్నారాయణ, ఎంఎఫ్ పాపిరెడ్డి, టీఐ శ్రీరాములు, ఏడీసీలు, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.క్షయరహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం: డీఎంహెచ్ఓ రవి రాథోడ్నెహ్రూసెంటర్: మానుకోటను క్షయ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతీ ఒక్కరు సహకరించాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో క్షయ వ్యాధిగ్రస్తులకు మంగళవారం యూపీహెచ్ఎస్లో పోషకాహారం అందజేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహారం అందించేందుకు అందరూ సహకరించాలని కోరారు. క్రమం తప్పకుండా పోషకాహారం తీసుకోవడం, మందులు వాడడం ద్వారా టీబీని జయించవచ్చని డీఎంహెచ్ఓ తెలిపారు. కార్యక్రమంలో యూపీహెచ్సీ డాక్టర్ మౌనిక, ప్రోగ్రాం అధికారి విజయ్‌కుమార్, తోట శ్రీనివాస్, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మైస నాగయ్య, సోమ య్య, వెంకటయ్య, జనార్దన్, రమణయ్య, నారాయణ, అరుణకుమారి, వెంకట్‌రెడ్డి, రత్నామాచారి, ప్రవీన్‌కుమార్, వైద్య సిబ్బంది, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.నిట్ ఉన్నతిలో భాగస్వాములు కావాలి: నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీకాజీపేట అర్బన్: నిట్ వరంగల్ క్యాంపస్‌ను అన్ని రంగాల్లో అగ్రభాగంలో నిలుపుతూ, ప్రపంచ స్థాయిలో కీర్తి ప్రతిష్టలను నిలిపే భాగస్వాములుగా నూతన విద్యార్థులు నిలవాలని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. నిట్‌లో ప్రవేశం పొందిన యూజీ 1,245 మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు నిట్ వరంగల్ ఆడిటోరియంలో మంగళవారం ఓరియంటేషన్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఇందులో నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ ముఖ్య అతిథిగా పాల్గొని ‘సాంకేతిక విద్యకు మణిహారంగా నిలుస్తున్న నిట్ వరంగల్‌కు స్వాగతం’ అంటూ విద్యార్థులను ఆహ్వానించారు. విద్యతోపాటు మానవీయ విలువలను పెంపొందించుకుని సమాజంలో ఉత్తమ పౌరులుగా రాణించాలని అన్నారు. -
పాల ఉత్పత్తిదారులను ప్రోత్సహిస్తాం
● రాష్ట్ర డెయిరీ సూపరింటెండెంట్ దేవేందర్ తొర్రూరు రూరల్: పాల ఉత్పత్తిదారులను ప్రోత్సహిస్తామని రాష్ట్ర డెయిరీ సూపరింటెండెంట్ దేవేందర్ తెలిపారు. మండల శివారులోని పాల శీతలీకరణ కేంద్రాన్ని మంగళవారం రాష్ట్ర డెయిరీ అధికారులు సందర్శించారు. పాల సేకరణ, విక్రయాలు, పాడి రైతుల అభివృద్ధి తదితర అంశాలపై తొర్రూ రు డెయిరీ చైర్మన్ రాసాల సమ్మయ్యను అధికారులు అడిగి తెలుసుకున్నారు. తొర్రూరు పాల కేంద్రం భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రహరీ నిర్మి స్తామని, విజయ డెయిరీ పార్లర్ మంజూరు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అనంతరం చైర్మ న్ సమ్మయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వరంగల్ డీడీ శ్రావణ్‌కుమార్, రిటైర్డ్ అడిషనల్ కలెక్టర్ సుబ్బారావుతో కలిసి రాష్ట్ర డెయిరీ సూపరింటెండెంట్ మాట్లాడారు. పాడి పశువుల కొనుగోలు, బల్క్ మిల్క్ చిల్లింగ్ కేంద్రాలతో పాటు మార్కెటింగ్ సౌకర్యాలు, పార్లర్లు ఏర్పాటు చేసేందుకు సహకరిస్తామన్నారు. విజయ డెయిరీ పాల ఉత్పత్తులపై ప్రజలకు నమ్మకం ఉందని, దాన్ని నిలబెట్టుకుంటామన్నారు. కార్యక్రమంలో టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌కుమార్, మేనేజర్లు సురేష్, వెంకటనారాయణ, ప్రతినిధులు సుధాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, చంద్రమౌళి, సతీష్ పాల్గొన్నారు. -
ఒంటరి మహిళలే టార్గెట్
వరంగల్ క్రైం: రోడ్లపై ఒంటరిగా వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకొని వారి మెడలో నుంచి చైన్స్నాచింగ్తోపాటు ద్విచక్రవాహనాల చోరీకి పాల్ప డుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు సీపీ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. నిందితుడి నుంచి రూ.23.5 లక్షల విలుౖవైన బంగారు ఆభరణాలు, మూడు ద్విచక్ర వాహనాలు, రూ.10 వేల నగదు, ఒక సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర ప్రాంతానికి చెందిన మంతుర్తి హరీశ్ హైదరాబాద్‌లోని ఓ సిమెంట్ కంపెనీలో క్వాలిటీ టెక్నీషియన్‌గా పనిచేసేవాడు. కాగా, అదే కంపెనీలో పనిచేస్తున్న ఓ ఇంజనీర్ ఇంటిలో బంగారు గొలుసు చోరీ చేసి గోల్డ్‌లోన్ కంపెనీలో తాకట్టు పెట్టాడు. వచ్చిన డబ్బుతో నిందితుడు జల్సాలు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సంఘటనలో నిందితుడిని స్థానిక నేరెడ్మెట్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. బెయిల్‌పై విడుదలైన నిందితుడిలో ఎలాంటి మార్పు రాలేదు. మళ్లీ చైన్ స్నాచింగ్‌లకు పాల్ప డి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేసినట్లు సీపీ వివరించారు. నిందితుడు ముందుగా ద్విచక్ర వాహనాన్ని చోరీ చేస్తాడు. దానిపై వెళ్లి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు ఆయన తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 10 చైన్ స్నాచింగ్‌లు, మూడు ద్విచక్ర వాహనాలు చోరీ చేశాడని పేర్కొన్నారు. అప్రమత్తమైన పోలీసులు.. చైన్ స్నాచింగ్‌లపై అప్రమత్తమైన పోలీసులు పక్కా సమాచారంతో మంగళవారం ఉదయం యాదవ్‌నగర్ క్రాస్ వద్ద తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా ద్విచక్ర వాహనంపై వస్తున్న నిందితుడు తప్పించుకొని పారిపోగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చైన్ స్నాచింగ్, ద్విచక్రవాహనాలను చోరీ చేసినట్లు అంగీకరించినట్లు ఆయన తెలిపారు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో హనుమకొండ రెడ్డి కాలనీలోని అద్దె ఇంటిలో పోలీసులు మిగిలిన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు సీసీ వివరించారు. అధికారులకు అభినందనలు.. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కబరిచిన క్రైం డీసీపీ గుణశేఖర్, క్రైం ఏసీపీ సదయ్య, హనుమకొండ ఏసీపీ నర్సింహారావు, కేయూ, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, రాఘవేందర్, ఏఏఓ సల్మాన్ పాషా, సీసీఎస్ ఎస్సైలు రాజ్‌కుమార్, శివకుమార్, హెడ్‌కానిస్టేబుళ్లు అంజయ్య, జంపయ్య, కానిస్టేబు ళ్లు మధుకర్, చంద్రశేకర్, రాములు, నగేశ్‌ను పోలీస్ కమిషనర్ అభినందించారు. ఆభరణాలు, వాహనాలను చోరీ చేస్తున్న వ్యక్తి అరెస్ట్ రూ.23.5 లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం వివరాలు వెల్లడించిన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ -
కొనసాగుతున్న పంపింగ్
కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామపంచాయతీ పరిఽధిలో ఉన్న దేవాదుల జె. చొక్కారావు పంపింగ్ కొనసాగుతోంది. పంపింగ్ కొన్ని రోజుల నుంచి నిలిచింది. ఈ క్రమంలో మంగళవారం పంపింగ్ వద్ద ఉన్న మూడు ఫేజ్ల్లోని పది మోటార్లలో ఫేజ్ టులో– 2 , ఫేజ్ త్రీలో 2 మోటార్లను ఆన్ చేసి నీటిని దిగువన ఉన్న గొల్లబెద్దారం రిజర్వాయర్‌లోకి పంపింగ్ చేస్తున్నారు. నాలుగు మోటార్లతో 831 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం పంపింగ్ వద్ద 78.30 మీటర్ల నీటిమట్టం కొనసాగుతోంది. సమ్మక్క సాగర్ బ్యారేజీలోకి ఎగువ నుంచి 3,17,480 క్యూసెక్కులు చేరుతుండడంతో 59 గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 77.45 మీటర్ల నీటి మట్టం కొనసాగుతోంది -
బోధనోపకరణాలతో విద్యాభ్యాసం సులభతరం
● కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్మహబూబాబాద్ అర్బన్: బోధనోపకరణాలతో విద్యార్థులకు విద్యాభ్యాసం సులభతరంగా ఉంటుందని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని అనంతారం మోడల్ స్కూల్లో మంగళవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి టీఎల్ఎం మేళాను నిర్వహించారు. కలెక్టర్ టీఎల్ఎంలను పరిశీలించి, వాటి ప్రత్యేకతలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులకు బోధన, ఉపాధ్యాయుల పనితీరును, మధ్యాహ్నం భోజనం, వసతుల గురించి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు విద్యార్థులకు రోల్ మోడల్‌గా ఉండాలన్నారు. టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్‌తో విద్యార్థులకు ఎంతగానో ఉపయోగం ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు అభ్యసన సామగ్రిని ఉపయోగించడం ద్వారా విద్యార్థులకు అర్థవంతమైన బోధన అందుతుందన్నారు. ఉపాధ్యాయులు అంకితభావంతో విద్యాబోధన చేసి విద్యార్థులను ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. డీఈఓ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో 18 మండలాల నుంచి తెలుగు, ఇంగ్లిష్, గణితం, ఈవీఎస్‌లో 180 ఎగ్జిబిట్లను ఉపాధ్యాయులు ప్రదర్శించారన్నారు. జిల్లాస్థాయిలో ప్రదర్శించిన ఎగ్జిబిట్లలో 8 ఉత్తమ టీఎల్ఎంలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి బి. అప్పారావు, ఏఎంఓ ఆజాద్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ..
ఐనవోలు: తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటన మండలంలోని వనమాల కనపర్తిలో చోటు చేసుకుంది. ఎస్సై పస్తం శ్రీనివాస్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పులి యాదగిరి, నాగమ్మ దంపతులు ఈ నెల 22వ తేదీన ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికెళ్లారు. తిరిగి 25న సాయంత్రం సమయంలో ఇంటికి చేరుకున్నారు. ఇంటి తలుపులు తెరిచి తాళం పగులగొట్టి ఉండడాన్ని గమనించి అనుమానంతో లోపలికి వెళ్లి చూడగా బీరువా పగులగొట్టి ఉంది. అందులో భద్రపరిచిన 2 తులాల బంగారు గొలుసు, అరతులం ఉంగరం, 20 తులాల వెండి, రూ.10 వేల నగదు కనిపించలేదు. దీంతో చోరీకి గురైనట్లు గుర్తించి లబోదిబోమన్నారు. సుమారు రూ. 1.6లక్షల విలువైన వస్తువులు అపహరణకు గురయ్యాయని కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా క్లూస్ టీం ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. ● రూ. 1.6లక్షల విలువైన వెండి, బంగారు ఆభరణాలు అపహరణ -
పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి
● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్మహబూబాబాద్ రూరల్: పెండింగ్ కేసుల పరిష్కారంలో పోలీసు అధికారులు మరింత చొరవ చూపాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. నెలవారీ నేర సమీక్ష సమావేశం మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బుధవారం నుంచి ప్రారంభమయ్యే గణేశ్ ఉత్సవాలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. విగ్రహాల ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని, అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గంజాయి రవాణా, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, పేకాట స్థావరాలను గుర్తించి, కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా స్థానిక పాఠశాలలు, కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గ్రామాల్లో చిన్నచిన్న గొడవలు జరిగినప్పుడు వెంటనే తగిన చర్యలు తీసుకోవడం ద్వారా, పెద్ద నేరాలను నియంత్రించవచ్చని సూచించారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో బీట్ సిస్టమ్‌ను మరింత మెరుగుపర్చాలన్నారు. షీటీం ద్వారా ఈవ్ టీజింగ్ వంటివి జరగకుండా అరికట్టాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు తిరుపతిరావు, కృష్ణకిశోర్, శ్రీనివాస్, డీసీఆర్బీ సీఐ సత్యనారాయణ, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
గణపతి మండపం ఏర్పాటులో అపశ్రుతి..
నెక్కొండ: గణపతి మండపం ఏర్పాటులో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డా డు. ఈ ఘటన మంగళవారం మండలంలోని నెక్కొండ తండాలో జరిగింది. తండాకు చెందిన బానోత్ పవన్ సెంట్రింగ్ కర్రలను మిషన్ (విద్యుత్ రంపం)తో కట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో రంపం అదుపు తప్పి పవన్ ఎడమ చేయికి తగలగా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మండప నిర్వాహకులు హుటాహుటినా హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పవన్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయని కుటుంబీకులు తెలిపారు. -
మంచం పట్టిన బాలికకు చేయూత..
కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ గ్రామానికి చెందిన చెవుగాని మహేశ్ కూతురు సుష్మ అనారోగ్యంతో 9 ఏళ్లుగా మంచం పట్టింది. దీంతో బాలిక కుటుంబ దీనస్థితిని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హైదరాబాద్‌లో ఆ బాలిక తండ్రికి మంగళవారం రూ.3లక్షల ఆర్థిక సాయం అందజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. సుష్మ 9 సంవత్సరాల వయసులో దసరా పండుగకు అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. అక్కడ చీమల మందు కలిసిన చపాతీ తినడంతో తీవ్ర అనారోగ్యానికి గురైంది. అప్పటి నుంచి మంచానికే పరిమితమైంది. ఆర్థిక స్థోమత లేకపోవడంతో మహేశ్ తన కూతురును ఆస్పత్రుల్లో చూపించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో ఇటీవల మహేశ్ తన కూతురి పరిస్థితిని గాంధీభవన్ మీడియాకు తెలుపగా వారు జగ్గారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన జగ్గారెడ్డి బాలిక తండ్రిని తన ఇంటికి పిలిపించుకుని, రూ.3లక్షల ఆర్థిక సాయం అందించారు. ‘నేనున్నా.. అధైర్యపడొద్దు’ అని భరోసా బాధిత కుటుంబానికి కల్పించారు. ఆ వెంటనే డాక్టర్ చంద్రశేఖర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వమే వైద్య ఖర్చులను భరించేలా చూస్తానన్నారు. వైద్యఖర్చుల కోసం రూ.3 లక్షల అందజేసిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి -
కాజీపేట–బల్లార్షా మధ్య రైల్వే ఎన్ఐ వర్క్స్
కాజీపేట రూరల్: కాజీపేట సబ్ డివిజన్ పరిధిలోని హసన్‌పర్తి–ఉప్పల్–జమ్మికుంట,కాజీపేట–బల్లార్షా సెక్షన్లో ప్రీ ఇంటర్‌లాకింగ్ అండ్ నాన్ ఇంటర్‌లాకింగ్ ఆటోమెటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వర్క్స్‌తో పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు, పలు ప్యాసింజర్ రైళ్లు తాత్కాలిక రద్దు, మరికొన్ని రైళ్ల హాల్టింగ్ ఎత్తివేత, కొన్ని రైళ్లను రెగ్యులేషన్ చేసి నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ మంగళవారం తెలిపారు. ప్యాసింజర్ రైళ్ల రద్దు వివరాలు ఆగస్టు 29వ తేదీన కాజీపేట–సిర్పూర్టౌన్ (17003) ప్యాసింజర్, బల్లార్షా–కాజీపేట (17004) ప్యాసింజర్, బల్లార్షా– కాజీపేట (17036) ప్యాసింజర్, ఆగస్టు 28వ తేదీన కాజీపేట–బల్లార్షా (17035) ప్యాసింజర్లను రద్దు చేయనున్నారు. తాత్కాలిక రద్దు.. ఆగస్టు 29వ తేదీన భద్రాచలం రోడ్డు–బల్లార్షా (17033) సింగరేణి కాజీపేట–బల్లార్షా మధ్య రద్దు, సిర్పూర్టౌన్ –భద్రాచలం రోడ్డు (17034) సింగరేణి సిర్పూర్టౌన్ –కాజీపేట మధ్య రద్దు, ఆగస్టు 28వ తేదీన సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్ (17233) కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ కాజీపేట–సిర్పూర్కాగజ్నగర్ మధ్య రద్దు, ఆగస్టు 29వ తేదీన సిర్పూర్ కాగజ్‌నగర్–సికింద్రాబాద్ (17234) సిర్పూర్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌ను సిర్పూర్ కాగజ్‌నగర్–కాజీపేట మధ్య రద్దు చేసినట్లు తెలిపారు. తాత్కాలిక హాల్టింగ్ ఎత్తివేత.. ఆగస్టు 29వ తేదీన హైదరాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (17011) ఎక్స్‌ప్రెస్, సిర్పూర్కాగజ్నగర్–బీదర్ (17012) ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (12757) ఎక్స్‌ప్రెస్‌లకు ఉప్పల్, జమ్మికుంట రైల్వే స్టేషన్లలో తాత్కాలికంగా హాల్టింగ్ ఎత్తివేశారు. రెగ్యులేషన్ ట్రైన్స్.. ఆగస్టు 29వ తేదీన రక్సోల్–చర్లపల్లి (07006) ఎక్స్‌ప్రెస్‌ను 75 నిమిషాలు, లక్నో–ఎంజీఆర్ చైన్నె సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ (16094) ఎక్స్‌ప్రెస్‌ను 45 నిమిషాలు, సిర్పూర్కాగజ్నగర్–సికింద్రాబాద్ (12758) ఎక్స్‌ప్రెస్‌ను 30 నిమిషాల పాటు రెగ్యులేషన్ చేసి నడిపించనున్నట్లు సీపీఆర్వో తెలిపారు. నాలుగు ప్యాసింజర్ రైళ్లు రద్దు నాలుగు రైళ్ల తాత్కాలిక రద్దు -
ఈసీజీ టెక్నీషియన్లపై దాడి
ఎంజీఎం : ఎంజీఎం ఆస్పత్రిలో ఈసీజీ టెక్నీషియన్లపై రోగితోపాటు ఆమె బంధువులు మంగళవారం రాత్రి దాడికి పాల్ప డ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ దేశాయిపేట ప్రాంతానికి చెందిన వివాహిత హా రికకు చాతీలో నొప్పి రావడంతో భర్త రాజేశ్, తండ్రి అరుణ్‌తో కలిసి చికిత్స నిమిత్తం ఎంజీఎంలోని క్యాజువాలిటీ విభాగానికి వచ్చింది. పరీక్షించిన వై ద్యులు ఈసీజీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దీంతో హారిక ఈసీజీ పరీక్షల కోసం క్యూలో ఉంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఓ రోగికి ఈసీజీ పరీక్ష నిర్వహించిన టెక్నీషి యన్లు మోబిన్, వసంత్‌కుమార్‌పై హారిక తోపాటు ఆమె భర్త, తండ్రి దాడికి పాల్ప డ్డారు. ఘటనను గుర్తించిన సెక్యూరిటీ సిబ్బందితో పాటు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గొడవను సద్దుమణిగించారు. కాగా, ఈఘటనపై తప్పు జరిగిందని హారికతోపాటు రాజేశ్, అరుణ్.. ఈసీజీ టెక్నీషియన్లను వేడుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. -
పర్యాటకుడిని సురక్షితంగా తీసుకొచ్చిన అధికారులు
వెంకటాపురం(కె): మండలంలోని వీరభద్రవరం గ్రామ సమీపంలోని ముత్యం ధార జలపాతం సందర్శనకు వెళ్లి అటవీ ప్రాంతంలో చిక్కుకున్న పర్యాటకుడిని అటవీశాఖ అధికారులు సురక్షితంగా తీసుకొచ్చారు. వరంగల్‌కు చెందిన అబ్రార్ సోమవారం బొగత జలపాతం సందర్శనకు వెళ్లాడు. తిరిగొచ్చే క్రమంలో కాలుకు గాయం కావడంతో నడవలేక అ టవీ ప్రాంతంలోనే చిక్కుకున్నాడు. దీంతో రాత్రి డ యల్ 100కు కాల్ చేసి వివరాలు తెలిపాడు. వి షయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు తెల్ల వారుజామున అబ్రార్‌ను గుర్తించి సురక్షితంగా తీసుకొచ్చారు. అనంతరం తల్లిదండులను పిలిచి వారి సమక్షంలో అబ్రార్‌కు కౌన్సెలింగ్ ఇచ్చి అప్పగించినట్లు అధికారులు తెలిపారు. -
గోమయ గణపతి
మహాగణపతి..మట్టి విగ్రహాలను పూజిద్దాం.. భావితరాలకు కాలుష్య రహిత సమాజాన్ని అందిద్దాం అనే గొప్ప సంకల్పంతో కొందరు భక్తులు ఏళ్లుగా మట్టి, గోమయ, పేపర్ వినాయక విగ్రహాలకే జై కొడుతున్నారు. మండపాల్లో ఆ విగ్రహాలను ప్రతిష్ఠించి పర్యావరణానికి హాని కలగని విధంగా పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి ప్రారంభంకానున్న గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ విధంగా పూజలు నిర్వహిస్తున్న భక్తులు, పలు మండపాల నిర్వాహకులు, సేవా ట్రస్ట్‌లపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. శ్రీమహాలక్ష్మీ గణపతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కొలువుదీరనున్న గోమయ గణపతి మహబూబాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని వివేకానంద సెంటర్లో గల శ్రీ మహాలక్ష్మీ గణపతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా గోమయ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. బుధవారం నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు 11 రోజులపాటు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు ట్రస్ట్ సభ్యులు శ్రీరంగం రాధిక, ఎస్.వి నాగేశ్వర్రావు, శ్రీరంగం రాజేశ్వరి, రామారావు, సోమ రజిత, శ్రీనివాస్, సోమ సింధు, రాంబాబు ఏర్పాట్లు చేస్తున్నారు. 2008 నుంచి 2016 వరకు మట్టి విగ్రహాలు, 2017 నుంచి గోమయ వినాయక విగ్రహాలతో ఉత్సవాలు చేస్తున్నారు.● మట్టి, గోమయ విగ్రహాలకే జై కొడుతున్న భక్తులు.. ● ఏళ్లుగా నవరాత్రి ఉత్సవాల నిర్వహణ ● పర్యావరణానికి హాని కలగని విధంగా పూజలు నర్సంపేట: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా నర్సంపేటకు చెందిన వనప్రేమి అవార్డు గ్రహీత గోక రామస్వామి మొక్కల పెంపకంతోపాటు 40 సంవత్సరాలుగా మట్టి వినాయక విగ్రహాలను తయారు చేసి పంపిణీ చేస్తున్నారు. అలాగే, గత సంవత్సరం నుంచి విత్తన గణపతులు తయారు చేస్తున్నారు. ప్రతీ విగ్రహంలో ఒక విత్తనం అమర్చుతున్నారు. తద్వారా నిమజ్జనం అనంతరం విత్తనం మొక్కగా రూపుదిద్దుకుని పెరిగి పండ్లు కాస్తాయని రామస్వామి తెలిపారు. ఈ విషయం తెలిసిన యునెస్కో అసోం ప్రతినిధులు రామస్వామికి శాంతిదూత అవార్డు అందజేసి సన్మానించారు. -
విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి
హన్మకొండ: భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి సూచించారు. ప్రతీఒక్కరు విఽధిగా పనిచేస్తున్న చోటే ఉండాలని ఆదేశించారు. మంగళవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ ఇతర శాఖల సమన్వయంతో వాగులు, వంకలు పొంగే ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లను గమనిస్తూ ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు లోడ్ మానిటరింగ్ చేస్తూ ఉండాలని, మెన్, మెటీరియల్ సిద్ధంగా ఉంచుకొని, అంతరాయం కలిగిన వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలని అన్నారు. మొబైల్ యాప్‌లో వినాయక మండపాల వివరాలు నమోదు చేయాలని వివరించారు. ఎన్ని కిలోవాట్ల లోడ్ వినియోగిస్తున్నారో నమోదు చేయాలని, తద్వారా ట్రాన్స్ఫార్మర్పై ఎంత భారం పడుతుందో తెలుసుకునే అవకాశముంటుందన్నారు. గత ఏడాది దాదాపు 35,000 విగ్రహాలు నమోదయ్యాయని, ఈ ఏడాది 10 నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని వివరించారు. విద్యుత్ భద్రతపై ఉత్సవ నిర్వాహకులకు తెలియజేయాలని, సంబంధిత లైన్మెన్లు, లైన్ఇన్స్పెక్టర్లు, ఏఈల నంబర్లు కూడా ఇవ్వాలని సూచించారు. ఎత్తు ఎక్కువగా ఉన్న విగ్రహాల నిమజ్జన రూట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని, రోడ్ క్రాసింగ్స్ ఉన్న చోట్ల 11 మీటర్ల స్తంభాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. నిమజ్జనం చేసే చెరువులు, కుంటలను కూడా విధిగా పర్యవేక్షించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్వాహకులు వాట్సాప్ గ్రూపుల్లో ఉండాలని, ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేయాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 1912 నంబర్‌కు ఫోన్ చేయాలని నవరాత్రి ఉత్సవ నిర్వాహకులకు సీఎండీ సూచించారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆపరేషన్ టి.మధుసూదన్, సీఈలు సదర్లాల్, అశోక్, వెంకటరమణ, జీఎం మల్లికార్జున్ పాల్గొన్నారు. వినాయక మండపాలను యాప్‌లో అప్లోడ్ చేయాలి టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఎస్ఈలు, డీఈలతో వీడియో కాన్ఫరెన్స్ -
ఇంటినుంచే తపాలా సేవలు
ఖిలా వరంగల్ : ఆన్లైన్ సౌకర్యం లేని కాలంలో తపాలా శాఖ ప్రజలకు అ త్యుత్తమ సేవలు అందించింది.. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ కాల్ లెటర్ రావాలన్నా.. ఉద్యోగం వచ్చిందన్న సమాచారం తెలుసుకోవాలన్నా.. బంధుమిత్రులకు వర్తమానం, సంస్థలు, కార్యాలయాలకు ముఖ్యమైన ధ్రు వీకరణ పత్రాలు పంపాలన్నా.. ఒకప్పుడు పోస్టల్ సేవలు ప్రధాన ఆధారం. ప్రసుత్తం వినియోగదారుడు ఉన్న చోటు నుంచే తపాలా సేవలు పొందేలా అధునాతన సౌకర్యాలు కల్పించింది. ఇటీవల తీసుకొచ్చిన సాఫ్ట్‌వేర్‌తో సాంకేతిక అనుసంధానం చేసి దేశీయ, విదేశీయ లెటర్లు, పార్సల్ బుకింగ్, స్పీడ్ పోస్ట్ అన్నీ స్వీయ–సేవ పోర్టల్ వెబ్ ఆధారంగా పోస్టాఫీసుకు వెళ్లకుండానే ఇంటి నుంచే సులభంగా తపాలా సేవలు పొందవచ్చు. india post.gov.in /customer&eltservice/ login యూజర్ ఐడీ, మొబైల్ ఓటీపీ, కస్టమర్ ఐడీ, పాస్వర్డ్ ద్వారా లెటర్లు, పార్సల్స్, స్పీడ్ పోస్ట్‌లు అన్ని ఇంటి వద్దే పొందొచ్చు. ఆన్లైన్ బుకింగ్ చేయగానే పోస్ట్‌మెన్ వినియోగదారుల ఇంటికి చేరుకుని స్పీడ్‌పోస్ట్ సేవలు, పార్సిల్స్ సేకరించి ఆన్లైన్ ట్రాకింగ్ విధానంతో గమ్యానికి చేరవేయనున్నారు. సేవలన్నీ ఒకే గొడుగు కిందికి.. తపాలా కార్యాలయాల ద్వారా అందించే సేవలన్ని ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చింది. నూతన ఐటీ 2.0 పేరుతో కొత్త సాఫ్ట్‌వేర్‌తో డేటా భద్రతతోపాటు సిస్టమ్ స్పీడ్ సామర్థ్యం పెంచారు. వరంగల్ డివిజన్ ప్రధాన కార్యాలయ పరిధిలో వరంగల్, మహబూబాబాద్ హెడ్ పోస్టాఫీసులు ఉండగా.. 42 సబ్ పోస్టాఫీసులు, 362 గ్రామీణ పోస్టాఫీసులు ద్వారా వినియోగదారులు తపాలా సేవలు పొందుతున్నారు. రిజిస్టర్డ్ పోస్ట్ స్పీడ్ పోస్ట్‌లో విలీనం..! స్మార్ట్ ఫోన్లు, ఆన్లైన్ సౌకర్యాలు లేని రోజుల్లో రిజిస్టర్డ్ పోస్ట్ ప్రజల జీవితాలతో విడదీయరాని బంధాన్ని ఏర్పర్చుకుంది. ముఖ్యమైన పత్రాలు, వస్తువులను సురక్షితంగా, నమ్మకంగా పంపించడానికి ఇదే ప్రధాన మార్గంగా నిలిచింది. అయితే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రిజిస్టర్డ్ పోస్ట్ సేవలు నిలిపి వేస్తున్నట్లు భారత తపాలా శాఖ ప్రకటించింది. స్పీడ్ పోస్ట్‌లోకి రిజిస్టర్డ్ పోస్ట్ సేవలను విలీనం చేసి.. ఇంకా మెరుగైన సేవలు అందించనున్నది. సాంకేతిక వ్యవస్థతో అనుసంధానం స్వీయ–సేవ పోర్టల్ వెబ్ ఆధారిత బుకింగ్ సౌకర్యాలు 1 నుంచి రిజిస్టర్డ్ పోస్టుకు మంగళం.. స్పీడ్‌పోస్ట్‌లో విలీనం మారుతున్న కాలానికి అనుగుణంగా తపాలాశాఖ కూడా మారుతోంది. ప్రైవేట్ సంస్థలకు దీటుగా ఇప్పటికే ఎన్నో సేవలతో అధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోస్టల్ శాఖ అంతే వేగంగా స్పీడ్ పోస్ట్ విధానానికి శ్రీకారం చుడుతోంది. బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్న రిజిస్టర్డ్ పోస్ట్ సేవలను స్పీడ్ పోస్ట్‌లో కలుపుతున్నట్లు భారత తపాలా శాఖ ప్రకటించింది.అధునాతన పరిజ్ఞానంతో ఖాతాదారులకు ఆన్లైన్ సేవలు అందిస్తున్నాం. ప్రైవేట్‌కు దీటుగా సేవలు అందించాలన్న లక్ష్యంతో నూతన విధానం అమల్లోకి తెస్తున్నాం. 1వ తేదీనుంచి రిజిస్టర్డ్ పోస్ట్ సేవలన్నీ స్పీడ్ పోస్ట్‌లో విలీనం చేసి ఆన్లైన్ ట్రాకింగ్ ద్వారా సేవలు అందిస్తాం. ప్రజలు కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ బుకింగ్ చేసిన ప్రతీ సేవను పది నిమిషాల వ్యవధిలో పోస్ట్‌మన్ మీ ఇంటికి చేరుకొని సేవలు అందిస్తారు. ఖాతాదారులు తమ ఇంటివద్ద తపాలా సేవలన్నీ పొందేలా చర్యలు తీసుకున్నాం. – రవికుమార్, తపాలాశాఖ, డివిజనల్ సూపరింటెండెంట్, వరంగల్ -
కాంగ్రెస్ ఖిల్లా.. వరంగల్ జిల్లా
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలిచి ఇక్కడే విజయోత్సవ సభ ● చెప్పి మరీ వర్ధన్నపేట, పాలకుర్తి ఎమ్మెల్యే సీట్లు గెలిచాం ● జనహిత పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్సాక్షి, వరంగల్: కాంగ్రెస్ ఖిల్లా.. వరంగల్ జిల్లా అని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆనాడు అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందు జరిగిన పాదయాత్రలో వర్ధన్నపేట శాసనసభ్యుడు అరూరి రమేష్, గొప్ప నాయకుడు అని చెప్పుకునే ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడిస్తామని చెప్పి మరీ ఆ సీట్లు కై వసం చేసుకున్నామన్నారు. జనహిత పాదయాత్రలో భాగంగా రాష్ట్ర పార్టీ వ్యవహరాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్‌తో కలిసి వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం నుంచి వర్ధన్నపేట టౌన్ అంబేడ్కర్ సెంటర్ వరకు సోమవారం రాత్రి పాదయాత్ర నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ సెంటర్లో జరిగిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. వరంగల్ జిల్లా అంటేనే రాజకీయాలకు అడ్డా అన్నారు. మరో మూడేళ్లు పాలన ప్రజలతో శభాష్ అనిపించుకొని 100 సీట్లతో అధికారంలోకి వచ్చాక ఇదే వర్ధన్నపేటలో విజయోత్సవ సభ చేస్తామని అన్నారు. మాజీ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ...‘ఓటు చోరీ బీజేపీ... ల్యాండ్ చోరీ బీఆర్ఎస్ పార్టీలను బ్యాలెట్ మీద బొంద పెట్టాలి. ఆ రెండు పార్టీలను రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పాతాళం లోతుకి పాతి పెట్టాలి. యూరియా మీద రెండు పార్టీలు దొంగ రాజకీయం చేస్తున్నాయి’ అని మండిపడ్డారు. ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, రాజేందర్ రెడ్డి, రాంచందర్ నాయక్, మురళీ నాయక్, గండ్ర సత్యనారాయణరావు, యశస్వనిరెడ్డిలు బీఆర్ఎస్, బీజేపీలపై దుమ్మెత్తిపోశారు. యూరియా విషయంలో కావాలనే కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ బద్నాం చేస్తోందన్నారు. యాత్రలో వేం నరేందర్ రెడ్డి, కొండా మురళీ, జంగా రాఘవరెడ్డి, ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. కాగా, మంత్రి సీతక్క, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, కడియం శ్రీహరి ఈ యాత్రకు హాజరుకాకపోవడంపై కార్యకర్తలు చర్చించుకోవడం కనిపించింది. పార్టీ ఫిరాయించారంటూ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులిచ్చిన వారిలో ఉన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి అందుకే దూరంగా ఉండొచ్చనే గుసగుసలు వినిపించాయి. పాదయాత్రకు తరలొచ్చిన శ్రేణులు.. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ రెండో విడత జనహిత పాదయాత్రకు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో తరలిరావడంతో వర్ధన్నపేట మండలంలో కోలాహలం కనిపించింది. కాంగ్రెస్ నేతలు రాత్రి ఏడు గంటల ఐదు నిమిషా లకు ఇల్లంద చేరుకోగా ఆటపాటలతో కళాకారులు, బోనాలతో మహిళలు ఘనస్వాగతం పలికారు. వీరిరాకకు ముందే ఇల్లందలో కాంగ్రెస్ పార్టీ జెండా ను జిల్లా పార్టీ అధ్యక్షురాలు స్వర్ణ ఆవిష్కరించారు. అనంతరం 7.05 గంటలకు భారీ సంఖ్య లో తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలతో కలిసి నేతలు దాదాపు మూడు కిలోమీటర్లు మేర పాదయాత్ర సాగించారు. సుమారు 8.24 గంటలకు వర్ధన్నపేట టౌన్‌లోని అంబేడ్కర్ సర్కిల్ చేరుకున్నారు. తప్పని తిప్పలు... ● ఇల్లంద నుంచి వర్ధన్నపేట వరకు జనహిత పాదయాత్ర ఉండడంతో పోలీసులు ట్రాఫిక్ని కట్రియాల నుంచి కొత్తపల్లి రోడ్డుకి డైవర్ట్ చేయగా భారీ ట్రాఫిక్ జామైంది. అంబులెన్స్ వాహనం కూడా ఆ ట్రాఫిక్‌లో చిక్కుకుంది. ● పాదయాత్ర జరిగే జాతీయ రహదారిలో గుంతలు పూడ్చకపోవడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నడిచే సమయంలో ఇబ్బంది పడ్డారు. కొందరు అదుపుతప్పి కిందపడ్డారు. -
మరో పెళ్లికి అడ్డుగా ఉందని..
రామన్నపేట : మరో పెళ్లికి అడ్డుగా ఉందనే కారణంతో భర్త.. భార్యను చంపాడు. నిద్రిస్తున్న సమయంలో ఆమె ముఖంపై బెడ్‌షీట్ కప్పి ఊపిరాడకకుండా చేసి కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన వరంగల్ మట్టెవాడ పీఎస్ పరిధిలోని హంటర్ రోడ్డులో ఆదివారం చోటుచేసుకోగా, ఘటన జరిగిన 24 గంటల్లోనే పోలీసులు ఛేదించి నిందితుడిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు వివరాలను వరంగల్ ఏఎస్పీ శుభం నాగ్రాలే వెల్లడించారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం దిర్శనపల్లి గ్రామానికి చెందిన బాదావత్ అశోక్ కూతురు గౌతమి(22)కి మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బాల్య తండాకు చెందిన బానోత్ గణేశ్‌తో ఈ ఏడాది మేలో వివాహం జరిగింది. గణేశ్‌కు కట్నకానుకల కింద రూ.2.5 లక్షల నగదు, రెండు తులాల బంగారంతోపాటు 150 గజాల స్థలాన్ని త్వరలోనే ఇస్తామని హామీ ఇచ్చి వివాహం జరిపించారు. గణేశ్ ఆటో నడుపుకుంటూ హంటర్ రోడ్డులోని పద్మావతి ఫంక్షన్ హాల్ సమీపంలో అద్దెకుంటున్నాడు. పెళ్లి అనంతరం నెల రోజుల వరకు బాగానే ఉన్న గణేశ్.. ఆటో నడుపుకోవడానికి అదనపు కట్నం కావాలని భార్య గౌతమిని వేధించసాగాడు. దీంతో గౌతమి తండ్రి అశోక్ రూ.లక్ష ఇవ్వగా గణేశ్ ఆ డబ్బుతో ఆటో కొనుగోలు చేశాడు. ఆటో నడుపగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడు. ఈ క్రమంలో మరోసారి డబ్బులు సరిపోవడం లేదంటూ గౌతమిని ఇబ్బందులకు గురిచేయడంతో మళ్లీ రూ.లక్ష ఇవ్వగా ఆ డబ్బులతో మేకలు కొనుగోలు చేసి స్వ గ్రామంలో తండ్రికి అప్పగించాడు. అప్పటి కూడా భార్యతో సక్రమంగా ఉండడం లేదు. ఈ క్రమంలో తనతో కలిసి పదో తరగతి చదువుకున్న అంజలి అనే యువతితో పరిచయం పెరిగింది. దీంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించి తనకు అడ్డుగా ఉన్న భార్య గౌతమిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి భార్య నిద్రిస్తున్న క్రమంలో ఆమె ముఖంపై బెడ్‌షీట్ బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపాడు. అనంతరం ఏమీ తెలియనట్లు నటిస్తూ గౌతమి పిలిచినా పలకడం లేదని తన ఇంటి పక్కన ఉంటున్న పెద్దమ్మ కొడుకు కుమార్‌కు చెప్పాడు. కుమార్ దంపతులు వచ్చి చూసి గౌతమిని 108లో ఎంజీఎం తరలించారు. పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఘటన తర్వాత నిందితుడు తప్పించుకుని తిరుగుతున్న క్రమంలో సోమవారం వరంగల్ చౌరస్తా వద్ద పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు 24 గంటల్లో కేసు ఛేదించిన మట్టెవాడ ఇన్స్పెక్టర్ కరుణాకర్, ఎస్సై శివకృష్ణ, సిబ్బంది ఏఎస్పీ అభనందించారు. నిందితుడి అరెస్ట్ వివరాలు వెల్లడించిన వరంగల్ ఏఎస్పీ శుభం నాగ్రాలే -
దొంగ అరెస్ట్, రిమాండ్
● రూ.5.50లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం ఖిలా వరంగల్: దొంగను అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి రూ.5.50 లక్షల విలువైన 56.083 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు వరంగల్ జీఆర్పీ ఇన్స్పెక్టర్ పి. సురేందర్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన వల్లపు గోపి(29) వరంగల్ ప్లాట్ ఫామ్‌పై సోమవారం అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో జీఆర్పీ పోలీసులు తనిఖీ చేయగా.. రూ.5.50 లక్షల విలువైన 56.083 గ్రాముల బంగారం లభ్యమైంది. అనంతరం విచారించగా ఇటీవల నెక్కొండ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల వద్ద చోరీ చేసినట్లు ఒప్పకున్నాడు. దీంతో బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జీఆర్పీ సిబ్బంది రాము, రియాజోద్దిన్, నాగరాజు, ఏఎస్సై రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.నౌవేరా షేక్‌కు రిమాండ్వరంగల్ లీగల్: హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ (ఎం/ఎస్ హారా గోల్డ్ ఎగ్జిమ్ లిమిటెడ్) సీఈఓ నౌవేరా షేక్‌పై ఇంతేజార్గంజ్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కాగా సోమవారం పోలీసులు అరెస్ట్ చేసి జిల్లా ప్రధాన న్యాయస్థానం ఎదుట హాజరుపర్చారు. సెప్టెంబర్ 8వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి నిర్మలా గీతాంబ అదేశాలు జారీ చేశారు. హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ నౌవేరా షేక్ వరంగల్ చార్బౌలి ప్రాంతానికి చెందిన షాహేద్ పర్వీజ్తోపాటు మరో ఇద్దరు వ్యక్తులను ప్రలోభ పెట్టి పెద్ద మొత్తంలో బంగారంపై పెట్టుబడి పెడితే అధిక మొత్తంలో వడ్డీ, లాభాలు అందిస్తామని తెలపడంతో ముగ్గురు బాధితులు రూ.33 లక్షలు చెల్లించారు. పెట్టుబడి అనంతరం వారికి సుమారు రూ.32వేలు మాత్రమే కంపెనీనుంచి రాగా విచారణలో మోసపోయామని నిర్ధారించుకొని 2021, జనవరి 14న బాధితుడు షాహేద్ పర్వీజ్ చేసిన ఫిర్యాదు మేరకు ఇంతేజార్గంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో 2021లో నౌవేరా షేక్‌కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతీ ఆదివారం సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో హాజరుకావాలని, అలాగే ప్రతీ కోర్టు వాయిదాకు హాజరుకావాలని న్యాయమూర్తి షరతులు విధించారు. పలు వాయిదాలకు నిందితురాలు నౌవేరా షేక్ హాజరు కాకపోవడంతో జిల్లా కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ వారెంట్ మేరకు ఇంతేజార్గంజ్ పోలీసులు నిందితురాలిని సోమవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా సెప్టెంబర్ 8 తేదీ (14 రోజుల) వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించారు. -
సెల్‌ఫోన్ చోరీ చేసిన ఇద్దరి అరెస్ట్..
● నిందితుల్లో కానిస్టేబుల్ డోర్నకల్: రైలులో సెల్‌ఫోన్ చోరీ చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఖమ్మం జీఆర్పీ సీఐ ఎన్. అంజలి, డోర్నకల్ ఎస్సై సురేశ్ తెలిపారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 23న హైదరాబాద్‌లోని మణికొండ ప్రాంతానికి చెందిన బండి ప్రియాంక సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ వెళ్తోంది. ఈ క్రమంలో రైలు డోర్నకల్ చేరుకుంటున్న సమయంలో తన ఐఫోన్ చోరీకి గురి కావడంతో డోర్నకల్ జీఆర్పీ స్టేషన్లో అదే రోజు ఫిర్యాదు చేసింది. దీంతో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇందులో రాచకొండ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబు ల్ యరవండి రవీందర్‌తోపాటు అతడి బావమరిది మేకల నాగసాయిగా గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. నిందితులు జల్సాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతున్నారని వారు పేర్కొన్నారు. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య ● పెద్దతండాలో ఘటన సంగెం: వ్యవసాయ పనులకు వెళ్లే విషయంలో దంపతుల మధ్య తలెత్తిన ఘర్షణతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సంగెం మండలం పెద్దతండాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన గుగులోత్ రవి(45), వినోద దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ పనులకు వెళ్లే విషయంలో ఆదివారం ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. దీనిపై మనస్తాపం చెందిన రవి.. సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన భార్య వినోద 108లో హుటాహుటిన ఎంజీఎం తరలించగా అదే రోజు రాత్రి మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కూతురు మౌనిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. పాము కాటుతో రైతు మృతి కొత్తగూడ: పాము కాటుతో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం మండలంలోని పోలారంలో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బానోత్ చక్ర(44) తన పత్తి చేనులో నీరు పారిస్తుండగా పాము కాటు వేసింది. వెంటనే నర్సంపేట ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, ముగ్గురు కుమారులు ఉన్నారు. ప్రభుత్వం మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
కమీషన్ డబ్బులు వెంటనే చెల్లించాలి
హన్మకొండ అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు పెండింగ్‌లో ఉన్న ఐదు నెలల కమీషన్ డబ్బులు వెంటనే చెల్లించాలని రేష న్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేష్‌బాబు డిమాండ్ చేశారు. సోమవారం సంఘం నాయకులతో కలిసి హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డికి రేషన్ డీలర్ల సమస్యలపై ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ సెప్టెంబర్ 5న బంద్ పాటించనున్నట్లు వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా డీలర్లకు కనీస గౌరవ వేతనం రూ.5 వేలు, కమీషన్ పెంపు, ఏ నెల కమీషన్ ఆ నెలలోనే చెల్లించాలని కోరారు. అలాగే, రేషన్ షాపులను మినీ సూపర్ మార్కెట్లుగా గుర్తించాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డిమల్ల హనుమండ్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, కోశాధికారి కిరణ్‌కుమార్, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, శ్రీనివాస్, రవీందర్, వెంకటేష్, రాము, మోహన్, నాయకులు నర్సయ్య, భానుచందర్,దామోదర్, వెంకటనారాయణ, తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 5న రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులు బంద్ -
వెంటాడుతున్న యూరియా కష్టాలు
మహబూబాబాద్ రూరల్ : యూరియా కష్టాలు రైతులను వెంటాడుతూనే ఉన్నాయి. మహబూబాబాద్ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఎదుట సోమవారం యూరియా బస్తాల కోసం రైతులు ఎండలో సైతం క్యూలో నిలబడి తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. అనంతరం తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ఈనెల 22న పేర్లు నమోదు చేయించుకున్న రైతులను క్రమపద్ధతిలో పిలుస్తూ జెడ్పీ సీఈఓ పురుషోత్తం, ఏడీఏ శ్రీనివాసరావు, ఏఓ తిరుపతిరెడ్డి, తహసీల్దార్ చంద్రరాజేశ్వరరావు, పీఏసీఎస్ చైర్మన్ నాయిని రంజిత్, సీఈఓ ప్రమోద్ యూరియా బస్తాలు పంపిణీ చేశారు. టౌన్ సీఐ మహేందర్ రెడ్డి, రూరల్ సీఐ సర్వయ్య ఆధ్వర్యంలో ఎసైలు శివ, సూరయ్య, మౌనిక, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. -
నానో యూరియా వాడకంతో ప్రయోజనాలు
తొర్రూరు/చిన్నగూడూరు: పంటలకు నానో యూరియా వాడాలని డీఏఓ విజయనిర్మల తెలిపా రు. తొర్రూరు పీఏసీఎస్, చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి రైతువేదికలో సోమవారం యూరియా పంపిణీని వ్యవసాయాధికారులు పరిశీలించారు. వ్యవసాయ శాఖ సంచాలకులు విజయ్‌చంద్రతో కలిసి డీఏఓ నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎకరాకు 500 మిల్లీ లీటర్ల నానో యూరియా వేయడం వల్ల పంటకు కావాల్సిన నత్రజని సమర్థవంతంగా అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో తొర్రూరు తహసీల్దార్ శ్రీనివాస్, ఏఓ రాంనర్సయ్య, అదనపు ఎస్సై శివరామకృష్ణ, ఏఈఓలు ఆమని, జమున, మానస, దీపిక, వినయ్‌వర్మ, భరత్‌చంద్ర, పీఏసీఎస్ సీఈఓ మురళి, చిన్నగూడూరు మండల వ్యవసాయ అధికారి భాస్కర్, ఏఈఓ శిరీష, రైతులు పాల్గొన్నారు -
నోటిఫికేషనే తరువాయి..
సాక్షిప్రతినిధి, వరంగల్ : స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి వేళయ్యిందా..? రిజర్వేషన్లు తేలకున్నా ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు సిద్ధమవుతోందా..? ఈ మేరకు పార్టీ కేడర్, నాయకులకు సంకేతాలు అందాయా..? పీఏసీలో తీసుకున్న నిర్ణయం మేరకు సెప్టెంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడనుందా?.. జిల్లా ఉన్నతాధికారులను కూడా అప్రమత్తం చేశారా?... అంటే నిజమే అంటున్నాయి అధికార పార్టీ, అధికార వర్గాలు. నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడినా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం ఉండాలని సోమవారం కూడా జిల్లా కలెక్టర్లకు మౌఖికాదేశాలు అందాయన్న ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్‌లోనే నోటిఫికేషన్..?.. ఈ దిశగానే కసరత్తు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు గడువు ముగిసి దాదాపుగా రెండేళ్లు కావస్తోంది. దీనిపై ఇదివరకే ఈ సెప్టెంబర్ నెలాఖరులోగా ఎన్నికలు జరిపించాలన్న హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. వీటంన్నిటిని దృష్టిలో పెట్టుకుని వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ఇటీవల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధికార పార్టీ నేతలు, సీఎం నిర్ణయించినట్లు ప్రచారం. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశం ఎటూ తేలకపోయినప్పటికీ.. పార్టీ పరంగా ఆ మేరకు అవకాశం కల్పించే యోచనలో అధిష్టానం ఉన్నట్లు పార్టీ ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు చెబుతున్నారు. ఈ నెల 29న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయాలపై చర్చించి ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడినా.. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధ్దంగా ఉండాలని కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్, చీఫ్ సెక్రటరీల నుంచి ఆదేశాలు అందడంతో అందరూ అలర్ట్ అయ్యారు. రాజకీయ పార్టీల్లో మొదలైన సందడి.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. మొదట పేర్కొన్న విధంగానే ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీపీపీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ వస్తే ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో ఆరు జిల్లా ప్రజాపరిషత్‌లు, 75 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 778 ఎంపీటీసీ స్థానాలు 75 ఎంపీపీ స్థానాలను ప్రకటించి ఆ మేరకు పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. ఆ తర్వాత 1,708 గ్రామ పంచాయతీలు, 15,006 వార్డులకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా ఎన్నికలు జరిపే విధంగా 15,021 పోలింగ్ కేంద్రాలను కూడా సిద్ధం చేసినట్లు అధికారులు ఇది వరకే ప్రకటించారు. కాగా, ఈ నెల 29న జరిగే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకునే కీలక నిర్ణయాలను బట్టి ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండగా.. రాజకీయ పార్టీల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికల సందడి పెరిగింది. సెప్టెంబర్ మాసంలో ఎన్నికలు ఖాయమన్న ప్రచారం నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీల టికెట్లపై పోటీ చేసేందుకు ఆశావహులు సై అంటున్నారు. కాగా, ఆయా పార్టీలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఆయా పార్టీల జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలను కలిసి తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్‌లో ఇలా.. స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం సెప్టెంబర్ మొదటి వారంలో ప్రకటించే అవకాశం ‘స్థానిక’ంలో బీసీలకు 42 శాతం అవకాశం.. పార్టీ కేడర్‌కు కాంగ్రెస్ సంకేతాలు ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ.. ఆ తర్వాతే సర్పంచ్, ‘ప్యాక్స్’ల ఎన్నికలు ఉమ్మడి జిల్లాలో 6 జెడ్పీలు, 75 జెడ్పీటీసీ స్థానాలు.. జిల్లా కలెక్టర్లకూ సీఎస్ సమాచారం.. జిల్లా జెడ్పీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్ వార్డులు పోలింగ్ కేంద్రాలుహనుమకొండ 1 12 12 129 210 1,986 1,986 వరంగల్ 1 11 11 130 317 2,754 2,754 జేఎస్‌భూపాలపల్లి 1 12 12 109 248 2,102 2,102 మహబూబాబాద్ 1 18 18 193 482 4,110 4,110 ములుగు 1 10 10 83 171 1,520 1,535 జనగామ 1 12 12 134 280 2,534 2,534 06 75 75 778 1,708 15,006 15,021 -
రుచికరమైన భోజనం అందించాలి
● కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ మహబూబాబాద్ అర్బన్: విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన భోజనం అందించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌ను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసి, వంట, తరగతి గ దులు, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని వంట నిర్వాహకులను ఆదేశించారు. భోజనం సిద్ధం చేసే సమయంలో పలు జాగ్రత్తలు పాటించాలన్నారు. విద్యార్థులకు షెడ్యూల్ ప్రకారం ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని వైద్య సిబ్బందికి సూచించారు. సబ్జెక్ట్‌ల వారీగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను గుర్తించి డిజిటల్ తరగతులు, ఏఐ ద్వారా బోధన చేపట్టాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం గుమ్ముడూరు ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, స్వచ్ఛమైన తాగునీరు అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సోషల్ వెల్ఫ్‌ర్ డీసీఓ జాక్లిన్, పాఠశాల హెచ్ఎం హల్యానాయక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
జనహిత పాదయాత్ర
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పరిధి ఇల్లంద మార్కెట్‌నుంచి మండలకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్ వరకు సోమవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ జనహిత పాదయాత్ర నిర్వహించారు. వారి వెంట మంత్రి కొండా సురేఖ, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు, పార్టీ శ్రేణులు నడిచారు. సుమారు మూడు కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. అనంతరం అంబేడ్కర్ సెంటర్లో జరిగిన కార్నర్ మీటింగ్‌లో ముఖ్యనేతలు ప్రసంగించారు. – సాక్షి, వరంగల్ -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
● డీఈఓ రవీందర్రెడ్డికురవి: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని డీఈఓ రవీందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో సీరోలు, కురవి మండలాల టీఎల్ఎం మేళా కార్యక్రమాన్ని నిర్వహించగా ఆయన సందర్శించారు. విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ పాఠశాలలో టీఎల్ఎంను ఉపయోగిస్తూ బోధన చేయాలని సూచించారు. పిల్లలను ప్రభుత్వ బడిలోకి పంపించాలన్నారు. సీరోలు నుంచి 10, కురవి నుంచి 10 ఎగ్జిబిట్లు జిల్లా స్థాయికి ఎంపికయ్యాయి. ఎంఈఓలు ఇస్లావత్ లచ్చిరాంనాయక్, వాంకుడోత్ బాలాజీ నాయక్, సీఆర్పీలు వెంకన్న, ఉమారాణి, నవీన్, బీమా, మానస పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
● అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్ మహబూబాబాద్: పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. కాలుష్య నియంత్రణ కోసం మట్టితో తయారు చేసిన విగ్రహాలను ప్రతిష్టించుకోవాలన్నారు. కాలుష్య నియంత్రణ కోసం ప్రతీ ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి నర్సింహస్వామి, గ్రౌండ్ వాటర్ డీడీ సురేష్, డీపీఆర్వో రాజేంద్రప్రసాద్, కాలుష్య నియంత్రణ మండలి సైంటిస్టు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఆందోళన చెందవద్దు కురవి: రైతులు ఆందోళన చెందవద్దని, యూరియా వస్తుందని అడిషనల్ కలెక్టర్ కె.అనిల్‌కుమార్ అన్నారు. సోమవారం యూరియా పరిస్థితిపై తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్షించారు. సొసైటీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో 756.495 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామని, గత ఏడాదితో పోలిస్తే 101.105 మెట్రిక్ టన్నుల యూరియాను అధికంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. యూరియా వస్తుందని, రైతులు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో మండల స్పెషల్ అధికారి నరసింహస్వామి, తహసీల్దార్ విజయ, ఏఓ నరసింహరావు, డీపీఆర్ఓ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. కొరత తీరుస్తాం గార్ల: జిల్లాలో త్వరలో యూరియా కొరత తీరుస్తామని అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్ వెల్లడించారు. సోమవారం గార్లలోని పీఏసీఎస్ కార్యాలయంలోయూరియా పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యూలో రైతులకు ఇబ్బందులు లేకుండా తాగునీరు, నీడ పరదాలు వేయించాలని మండల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి హరిప్రసాద్, తహసీల్దార్ శారద, మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు, ఎస్సై ఎస్కె రియాజ్‌పాషా తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ వ్యాపారాలపై చర్యలు తీసుకోవాలి
మహబూబాబాద్ రూరల్: జిల్లాలో అక్రమ వ్యాపారాలను అరికట్టాలని కోరుతూ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్‌కు సోమవారం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఇటీవల గంజాయి రవాణా, గుట్కా, బెల్లం అమ్మకాలు, పీడీఎస్ బియ్యం, ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోందని, అక్రమ వ్యాపారాలకు బాధ్యులైన వారిపై ఉక్కుపాదంమోపి అణచివేయాలని విజ్ఞప్తి చేశారు. యూరియా సమస్య పరిష్కరించాలి మహబూబాబాద్: రైతులకు సరిపడా యూరియా సరఫరా చేసి సమస్య పరిష్కరించాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్‌కు ఆమె వినతి పత్రం అందచేశారు. ఈసందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. రైతులకు యూరియా సక్రమంగా పంపిణీ చేయాలని కొరత లేకుండా చూడాలన్నారు. రైతాంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య సమస్యల పరిష్కారమే లక్ష్యం నెహ్రూసెంటర్: ఆర్బీఎస్కే ద్వారా 0 నుంచి 18 సంవత్సరాల పిల్లల ఆరోగ్య సమస్యల పరిష్కారమే ధ్యేయంగా డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ (డైక్) ఏర్పాటు చేశామని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అన్నారు. జీజీహెచ్‌లోని డైక్, అసంక్రమిత వ్యాధుల చికిత్స కేంద్రాన్ని సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. పిల్లల్లో ఆరోగ్య సమస్యలను గుర్తించి చికిత్స అందించేలా, పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి సెంటర్ పని చేస్తుందన్నారు. ఆర్బీఎస్కే ద్వారా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను గుర్తించి డైక్ సెంటర్‌కు రెఫర్ చేయాలని సూచి ంచారు. అసంక్రమిత వ్యాధులను మొదటి దశలోనే గుర్తించి వైద్యం అందించేలా ఏర్పాట్లు చేయాలని, వైద్య సిబ్బంది రోగికి మెరుగైన వైద్యం అందించేలా చొరవ చూపాలన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఆస్పత్రి ఆర్ఎంఓ జగదీశ్వర్, డెమో కొప్పు ప్రసాద్, డాక్టర్ సతీష్, డైక్ మేనేజర్ యగ్నేష్ పాల్గొన్నారు. అప్రమత్తంగా ఉండాలి తొర్రూరు: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో తెలిపారు. డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. జ్వరాల రికార్డుల నిర్వహణ పక్కాగా జరగాలని, ల్యాబ్ టెస్టులు తప్పనిసరిగా చేయాలని ఆదేశించారు. ఆస్పత్రిలోని బెడ్లు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. పల్లె దవాఖానాల్లో ఆరోగ్య సిబ్బంది, పంచాయతీ సిబ్బందితో మాట్లాడి జ్వర పీడితుల వివరాలు సేకరించి తగిన వైద్యం అందించాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టేలా అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. కార్యక్రమంలో ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్సుగుణాకర్రాజు, వైద్యాధికారి జ్వలిత, వైద్యులు గిరిప్రసాద్, మీరాజ్, నందన, సీహెచ్ఓ విద్యాసాగర్, డీపీఎంఓ వనాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పీఏసీఎస్ తనిఖీ.. పట్టణ శివారులోని పీఏసీఎస్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ సందర్శించారు. యూరియా విక్రయాల రిజిస్టర్ పరిశీలించారు. అమ్మకాలకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయాలన్నారు. పీఏసీఎస్ సీఈఓ మురళి, ఏఓ రాంనర్సయ్య, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కేడీసీలో జాతీయ సదస్సు కేయూ క్యాంపస్: హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని మైక్రో బయాలజీ విభాగం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12న జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు సదస్సు కన్వీనర్ డాక్టర్ పి.పల్లవి సోమవారం తెలిపారు. ‘మైక్రోబియల్ ఫ్రంట్ టైర్స్ హార్మోసింగ్ జీనోమిక్స్ సింథటిక్ బయాలజీ అండ్ మైక్రోబయోమ్ ఇన్నోవేషన్స్’ అంశంపై ఈ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. -
యూరియా కోసం చెప్పుల క్యూ
గూడూరు: యూరియా కోసం రైతులు ఎండలో నిలబడలేక చెప్పులను క్యూలో పెట్టిన సంఘటన మండలంలోని గాజులగట్టు ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద ఆదివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి మొదటిసారిగా 110 బస్తాల యూరియా మంజూరైంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, సమీప తండా రైతులు ఉదయాన్నే చేరుకోగా.. 10 గంటలు దాటినా నిర్వాహకుడు కేంద్రం తెరవలేదు. దీంతో రైతులు తమ చెప్పులను క్యూగా పెట్టి, మండల వ్యవసాయ అధికారి, కేంద్రం నిర్వాహకుడికి ఫోన్ చేశారు. ఇదిలా ఉండగా, బస్తాల పంపిణీ కోసం కేంద్రం నిర్వాహకుడి మిషన్‌లో డీడీ నంబర్‌ను జిల్లా అధికారులు పంపించలేదు. ఈ విషయాన్ని వెంటనే ఏఓకు తెలుపగా, మధ్యాహ్నం నంబర్ పంపించారు. ఆ తర్వాత ఏఓ అక్కడ ఉండి రైతులకు బస్తాలు పంపిణీ చేయించారు. -
ఆహ్లాదం.. ఆమడ దూరం!
● పార్కులో దెబ్బతిన్న పరికరాలు ● చిన్నారులు ఆడుకునేందుకు వసతులు కరువు ● మున్సిపాలిటీ పార్కు పరిస్థితి దయనీయంతొర్రూరు: ఆహ్లాదం పంచాల్సిన పార్కులు సమస్యలకు నిలయంగా మారాయి. ముఖ్యంగా తొర్రూరు పట్టణంలోని యతిరాజారావు పార్కు నిర్వహణ అధ్వానంగా మారింది. రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన చిన్నారుల క్రీడా పరికరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చిన్నారులు, మహిళలు, యువకులు, ఉద్యోగులు ఉదయం, సాయంత్రం పార్కులో వాకింగ్ చేస్తున్నారు. అయితే వ్యాయామం చేసేందుకు కనీస సదుపాయాలు లేవు. మూడేళ్ల క్రితం టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.2 కోట్లతో పార్కులో సౌకర్యాల కల్పనతో పాటు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. పిల్లలు ఆడుకునేందుకు, పెద్దలు వ్యాయామం, సేద తీరేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించారు. వీటి నిర్వహణ బాధ్యత మున్సిపాలిటీ నే చూడాల్సి ఉంటుంది. అయితే అధికారులు దృష్టి సారించకపోవడంతో పరికరాలు పాడయ్యాయి. పార్కు నిర్వహణ అధ్వానం.. మూడేళ్ల క్రితం యతిరాజారావు పార్కులో ఉద్యానవనం ఏర్పాటు చేశారు. విలువైన పూల మొక్కలు, గడ్డి జాతులు, రంగు రంగుల కళాకృతులు, కుర్చీలు, నీటిని వెదజల్లే ఫౌంటేన్‌తో పార్కు ఆహ్లాద వాతావరణం పంచేది. చిన్నారులకు క్రీడా పరికరాలతో ఆటవిడుపుగా ఉండేది. వ్యాయామం కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుండటంతో అధ్వానంగా మారాయి. పార్కులోని చిన్నారుల ఆట పరికరాలు, వ్యాయామ పరికరాలు నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారాయి. క్లైంబింగ్ ప్రేమ్‌తో పాటు పలు పరికరాలు తుప్పు పట్టాయి. ఫౌంటెన్ లైట్లు పగిలిపోయాయి. మూత్రశాలలకు నీటి సదుపాయం కల్పించకపోవడంతో నిరుపయోగంగా మారాయి. నిర్వహణ లేకపోవడంతో గడ్డి పెరిగి అధ్వానంగా మారింది. పాములు, విష పురుగులకు నివాసంగా మారింది. పార్కులోని జంతువుల బొమ్మలు దెబ్బతిన్నాయి. గ్రౌండ్‌లోని వాకింగ్ దారిలో మొక్కలు మొలిచి అధ్వానంగా మారింది. ఓపెన్ జిమ్ పరికరాలు తుప్పు పడుతున్నాయి. మరమ్మతులు చేపడతాం యతిరాజారావు పార్కులో అన్ని వసతులు కల్పిస్తాం. చిన్నారుల ఆట పరికరాలు విరిగిపోయాయి. వాటిని తిరిగి ఏర్పాటు చేస్తాం. ఉదయం, సాయంత్రం సమయాల్లో పార్కు తెరిచి ఉంచుతున్నాం. స్థానికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం. వసతుల కల్పనపై కలెక్టర్‌కు విన్నవిస్తాం. – శ్యాంసుందర్, తొర్రూరు మున్సిపల్ కమిషనర్ -
ప్రజాప్రతినిధులకు అవగాహన శూన్యం
● మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ డోర్నకల్: జిల్లాలో యూరియా అవసరాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన లేదని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. డోర్నకల్‌లో ఆదివారం సత్యవతి రాథోడ్ విలేకరులతో మాట్లాడుతూ.. నాట్లు వేసే సమయంలో యూరియా కొరత రావడం ప్రజాప్రతినిధుల వైఫల్యానికి నిదర్శనమన్నారు. యుద్ధాల వల్ల యూరియా కొరత ఏర్పడిందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. పాలకులు విహారయాత్రల్లో తేలుతున్నారని, ప్రభుత్వ విప్ వీడియో సందేశాలు పంపుతూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. డోర్నకల్‌లో నల్లబెల్లం, గంజాయి, బియ్యం, గుట్కా, ఇసుక, మట్టి దందా జోరుగా సాగుతోందని ఆరోపించారు. పోలీసు అధికారులు ప్రజాప్రతినిధులకు డబ్బు ఇచ్చి పోస్టింగ్ తెచ్చుకుని, డబ్బు సంపాదన కోసం లంచాలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్నారని ఆరోపించారు. ఈ ప్రాంతంలో గుడుంబా తయారీ, విక్రయాలు జోరుగా సాగుతున్నాయని, గుడుంబాతో అనేక కుటుంబాలు బలయ్యాయని తెలిపారు. మార్వాడీ గోబ్యాక్ నినాదం మూర్ఖత్వమని, కొంతమంది వారి స్వార్థం కోసం ఇలాంటి నినాదాలతో ప్రజల్లో అశాంతిని రేపేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. మార్వాడీలు దశాబ్దాలుగా మనలో ఒకరిగా కలిసి ఉన్నారని, మార్వాడీ గోబ్యాక్ నినాదాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మన్యుపాట్ని, యశోధర్జైన్, గౌస్, కందుల మధు, రాంభద్రం, సతీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఓపెన్ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలి
విద్యారణ్యపురి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఈవిద్యాసంవత్సరం 2025–26లో డిగ్రీ, పీజీ ప్రవేశాలు పొందాలని ఆ యూనివర్సిటీ స్టూడెంట్ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ వై.వెంకటేశ్వర్లు కోరారు. డిగ్రీ, పీజీ కోర్సుల ప్రవేశాల ప్రక్రియలో భాగంగా ఆదివారం వెంకటేశ్వర్లు ఆ యూనివర్సిటీ సెంటర్ ఫర్ స్టాఫ్ ట్రైనింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకటరమణతో కలిసి హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీల అధ్యయన కేంద్రాలను వేర్వేరుగా సందర్శిచారు. ప్రవేశాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలు పొందే విద్యార్థులకు రిటైలర్స్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా పారిశ్రామిక రంగంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని వెల్లడించారు. విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. ఈనెల 30 వరకు అడ్మిషన్లకు గడువు ఉందని తెలిపారు. పూర్తి వివరాలకు ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్లో చూడాలన్నారు. కేడీసీలో పోస్టర్ల ఆవిష్కరణ కేడీసీ కో–ఆర్డినేటర్ డాక్టర్ ఆలువాల సంజీవయ్య, అధ్యాపకులు బి.వెంకటగోపీనాథ్, ఎం.సదానందం, సురేశ్, పూర్ణచందర్ ఉన్నారు. -
ముఖం చూపించాల్సిందే..
● ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్‌తో ఉపాధ్యాయుల సతమతం ● పెరిగిన హాజరు శాతం, సెలవుల నమోదు ● ఇన్ సరే.. ఔట్ కనిపించని వైనం ● పర్యవేక్షణ పెంచుతామంటున్న అధికారులుసాక్షి, మహబూబాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల్లో కొందరు సక్రమంగా విధులకు హాజరుకావడం లేదనే విమర్శలు ఉన్నాయి. మారుమూల ప్రాంతాల్లో అయితే అంతే సంగతులు అన్నట్లు చెప్పుకుంటారు. దీనిని అరికట్టేందుకు గతంలో బయోమెట్రిక్ పద్ధతిన హజరు నమోదు చేసేవారు. కొంతకాలం తర్వాత అది మూలనపడింది. దీంతో ఈ ఏడాది ముందుగా విద్యార్థుల హాజరుకోసం.. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఉపాధ్యాయుల హాజరు కోసం ఎఫ్ఆర్ఎస్(ఫేస్ రికగ్నేషన్ సిస్టమ్)ను అమల్లోకి తీసుకొచ్చారు. ముఖం స్కాన్ చేస్తేనే హాజరు పడే విధంగా యాప్ ప్రవేశపెట్టారు. అయితే ఈ యాప్ ఉపయోగించడంలో కొందరు తడబాటు, మరికొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, మరికొందరు సతమతం అవుతున్నారు. ఏదీ ఏమైనా గతంలో పోలిస్తే జిల్లాలో ఉపాధ్యాయుల హాజరుశాతం పెరిగినట్లు స్పష్టం అవుతోంది. పెరిగిన ఉపాధ్యాయుల హాజరు ఎఫ్ఆర్ఎస్ వల్ల జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల హాజరుశాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలు కలిపి మొత్తం 898 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో విద్యార్థులు లేని పాఠశాలలు 148 ఉన్నాయి. ఇవిపోగా మిగిలిన 750 పాఠశాలల్లో అన్ని కేటగిరీల ఉపాధ్యాయులు, నాన్‌టీచింగ్ ఉద్యోగులు కలిపి మొత్తం 3,930 మంది పనిచేస్తున్నారు. గతంలో జిల్లాలో ఉపాధ్యాయుల హాజరు 65శాతం మేరకే ఉండేది. ఎఫ్ఆర్ఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత 80శాతానికి మించి నమోదు కావడం గమనార్హం. అదే విధంగా పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, కాంప్లెక్స్ హెచ్ఎంలతో సమన్వయం చేసుకుంటూ కొందరు నామమాత్రం సెలవులు పెట్టి నడిపించేవారనే ఫిర్యాదులు ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం ఎఫ్‌ఆర్‌ఎస్‌లో సెలవుల కాలం స్పష్టంగా కనిపించడంతో తప్పని సరిగా సెలవుల పెట్టాల్సి వస్తోంది. పెట్టిన సెలవు నమోదు అవుతుంది. ఇలా గతంలో జిల్లాలో రోజుకూ 100 నుంచి 150 మంది మేరకు సెలవులు పెట్టినట్లు ధ్రువీకరించగా ఇప్పుడు ఈ సెలవులు 300 నుంచి 350 వరకు నమోదు అవుతున్నాయి. దశల వారీగా మార్పులు ఎఫ్ఆర్ఎస్ ప్రవేశపెట్టిన తర్వాత గతం కన్నా ఉపాధ్యాయుల హాజరు శాతం పెరిగింది. అయితే కొన్ని లోటుపాట్లు ఉన్న విషయంపై విద్యాశాఖ పెద్దల సమక్షంలో చర్చ జరుగుతోంది. దశల వారీగా మార్పులు వస్తాయి. అప్పటి వరకు సాయంత్రం పర్యవేక్షణ పెంచుతున్నాం. –రవీందర్ రెడ్డి, డీఈఓఇటీవల జిల్లాలో ఉపాధ్యాయుల హాజరు వివరాలు మరింత మార్పు అవసరం.. ఉపాధ్యాయుల హాజరు నమోదు కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎఫ్‌ఆర్‌ఎస్‌లో మరిన్ని మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని విద్యాశాఖ ఉద్యోగుల్లో చర్చ. ప్రతీ ఉపాధ్యాయుడు ముందుగా తమ మొబైల్లో ఎఫ్ఆర్ఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. దానిలో పనిచేస్తున్న పాఠశాల లొకేషన్, ఉపాధ్యాయుడు ముఖం నమోదు చేయాలి. ఉదయం 9:30 గంటల నుంచి 10:30 గంటల వరకు పనిచేస్తున్న పాఠశాల లొకేషన్ వద్ద సెల్‌ఫొన్‌లో ఎఫ్ఆర్ఎస్ చేయాలి. అయితే మారుమూల ప్రాంతాలు ఎక్కువగా ఉన్న మహబూబాబాద్ వంటి జిల్లాలో సిగ్నల్ లేకపోవడం, లొకేషన్ సక్రమంగా చూపకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అదేవిధంగా ఉదయంతో పాటు సాయంత్రం 4:30 తర్వాత మరోసారి ఎఫ్ఆర్ఎస్ చేయాలి. కానీ ప్రస్తుతం అది కనిపించడం లేదు. నమోదు అయినట్లు చూపించడం లేదని సమాచారం. దీంతో ఉదయం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు సాయంత్రం వరకు ఉండేది.. ఉండనిది తెలియడం లేదని విద్యాశాఖ కార్యాలయ ఉద్యోగులు చెబుతున్నారు. తేదీ రిజిస్ట్రేషన్ హాజరు గైర్హాజరు సెలవు శాతం 18 3,852 3099 299 461 80.45 19 3,871 3,226 321 324 83.34 20 3,876 3,149 347 380 81.24 21 3,863 3,150 355 359 81.54 22 3,885 3,172 380 331 81.64 -
పొలం గట్లే పిల్లలకు దారి..
మంచ్యతండా ప్రాథమిక పాఠశాల భవనంపొలం గట్లపై నడుస్తున్న పాఠశాల విద్యార్థులుమరిపెడ రూరల్: మారుమూల పల్లెలు, గిరిజన తండాల్లోని పలు పాఠశాలలు పొలాల మధ్య ఉండడంతో సరైన రహదారులు లేవు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు తిప్పలు తప్పడంలేదు. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబా బాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామ పంచాయ తీ పరిధిలోని మంచ్యతండాలో 20 ఏళ్ల క్రితం పొలాల మధ్య పాఠశాల ఏర్పాటు చేశారు. అందులోనే అంగన్వాడీ కేంద్రంతోపాటు పాఠశాల నిర్వహణ కొనసాగుతోంది. అంగన్వాడీ కేంద్రంలో 10 మంది చిన్నారులు, ప్రాథమిక పాఠశాలలో 20 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కాగా, గదిలో ఐదో తరగతి వరకు విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు బోధిస్తుండగా.. వరండాలో అంగన్వాడీ పిల్లల ఆలనా పాలన చూస్తున్నారు. కాగా దారి లేకపోవడంతో విద్యార్థులు, చిన్నారులు పొలం గట్ల మీదుగా పాఠశాలకు వెళ్లి, అదే గట్లపై మళ్లీ సాయంత్రం ఇంటికి వస్తున్నారు. ఉపాధ్యాయులు సైతం తమ ద్విచక్రవాహనాలను రోడ్డుపై నిలిపి, గట్ల వెంబడి పాఠశాలకు వెళ్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో పొలం గట్లు తడిసిపోయి పిల్లలు జారి కింద పడిపోతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికై నా విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలకు తక్షణమే అదనపు గదులతో పాటు, రహదారిని ఏర్పాటు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, మంచ్యతండా వాసులు కోరుతున్నారు. రహదారి లేని మంచ్యతండా పాఠశాల ఇరుకు గదిలోనే 30 మంది విద్యార్థులకు బోధన పట్టించుకోని విద్యాశాఖ అధికారులు -
ముగిసిన టేబుల్ టెన్నిస్ పోటీలు
హసన్‌పర్తి: నగరంలోని కిట్స్ ఇంజనీరింగ్ కశాశాల ఇండోర్ స్టేడియంలో రెండు రోజులపాటు నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు ఆదివారం ముగిశాయి. టేబుల్ టెన్నిస్ వెటరన్ క్రీడాకారుడు రమేశ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ క్రీడలతో క్రమశిక్షణ, స్నేహభావం పెంపొందుతుందన్నారు. అనంతరం విజేతలకు జ్ఞాపికలు అందజేశారు. టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హరీశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కిట్స్ కళాశాల ఏఓ డాక్టర్ రమేశ్‌రెడ్డి, టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ మోహన్‌రావు, టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్లు డాక్టర్ జైసింగ్ అజ్మీరా, సునీల్‌కుమార్, కార్యనిర్వాహక సభ్యులు రవికుమార్, వెంకటస్వామి, మహేశ్, డాక్టర్ ప్రభాకరాచారి తదితరులు పాల్గొన్నారు. -
కాజీపేట రైల్వేడిపోకు పూర్వ వైభవం
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్‌లోని రన్నింగ్ డిపోకు త్వరలో పూర్వ వైభవం రానుంది. ఐదేళ్ల క్రితం వెలవెలబోయిన కాజీపేట జంక్షన్‌కు మహర్దశ పట్టనుంది. ఇటీవల సికింద్రాబాద్‌లో జరిగిన రన్నింగ్‌స్టాఫ్ రివ్యూలో రైల్వే అధికారులు కాజీపేట రన్నింగ్ డిపోను దృష్టిలో పెట్టుకొని దసరా కానుకగా కొత్తగా పోస్టులు ప్రకటించారు. 90 గూడ్స్ అసిస్టెంట్ లోకో పైలెట్లు, 90 అసిస్టెంట్ లోకో పైలెట్లు, 10 ప్యాసింజర్ అసిస్టెంట్ లోకో పైలెట్లను కలుపుకొని కొత్తగా 190 పోస్టులను అధికారులు అలాట్మెంట్ చేసినట్లు రైల్వే ట్రేడ్ యూనియన్ నాయకులు ఆదివారం తెలిపారు. గతంలో కాజీపేట జంక్షన్ నుంచి డోర్నకల్, విజయవాడ రైల్వే డిపోలకు రైల్వే క్రూ లింక్‌లు, లోకోపైలెట్లను తరలించి ప్రాధాన్యతను తగ్గించారని పేర్కొన్నారు. ఇప్పుడు కొత్త పోస్టులతో ఆ సమస్య లేకుండా పోయిందని వివరించారు. కాజీపేట నుంచి క్రూ లింక్‌లను తరలించి ఈ ప్రాంతాన్ని నిర్వీర్యం చేయవద్దని గతంలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, రైల్వే నాయకులు రైల్వే జీఎం, డీఆర్ఎంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో నాటి రైల్వే జీఎం కాజీపేటకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కాజీపేటకు అలాట్ చేసిన కొత్త పోస్టులతో మొత్తం కాజీపేట రైల్వే రన్నింగ్ డిపో 720 మంది స్టాఫ్‌తో సికింద్రాబాద్ డివిజన్లో పెద్ద డిపోగా మారనుంది. బెల్లంపల్లి, డోర్నకల్తోపాటు ఇతర రైల్వే డిపోల్లో పనిచేస్తూ కాజీపేటకు రెక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్న వారు ఇక్కడికి బదిలీపై వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కాజీపేట రైల్వే డిపోపై ప్రత్యేక శ్రద్ధ.. వయా కరీంనగర్ మీదుగా భీమవరం–నాందేడ్‌కు సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఎక్స్‌ప్రెస్ రైలుకు కాజీపేట రైల్వే డిపోకు చెందిన క్రూ వారే (లోకోపైలెట్, అసిస్టెంట్ లోకోపైలెట్, ట్రైయిన్మేనేజర్–గార్డు) పనిచేసే అవకాశం ఉందని, అప్ అండ్ డౌన్ రూట్లో ఈ రైలుకు ఆరుగురు రన్నింగ్ స్టాఫ్ పనిచేస్తారని రైల్వే నాయకులు తెలిపారు. భవిష్యత్‌లో కరీంనగర్ మీదుగా నిజమాబాద్, నాందేడ్ వరకు ఎక్కువ రైళ్లను ప్రవేశపెట్టి నడిపించే క్రమంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కాజీపేట రైల్వే డిపోపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని పేర్కొన్నారు. రైల్వే నాయకుల హర్షం.. కాజీపేట రైల్వే డిపోకు కొత్తగా సికింద్రాబాద్ రైల్వే అధికారులు 190 ఎల్పీ, ఏఎల్పీల పోస్టులను మంజూరు చేసినందుకు కాజీపేట రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ లోకో రన్నింగ్ బ్రాంచ్ చైర్మన్ పాక రాజ్‌కుమార్, కాజీపేట రైల్వే మజ్దూర్ యనియన్ లోకోరన్నింగ్ బ్రాంచ్ సెక్రటరీ పి.సాయికుమార్ హర్షం వ్యక్తం చేశారు. దసరా కానుకగా కొత్త పోస్టులు ఇండెంట్ 190 ఎల్పీ, ఏఎల్పీ పోస్టులకు గ్రీన్‌సిగ్నల్ రన్నింగ్ స్టాఫ్ క్రూ రివ్యూలో నిర్ణయం ఫలించిన ఎంపీ, ఎమ్మెల్యే, రైల్వే నాయకుల కృషి -
సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలి
హన్మకొండ: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్ధల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చేపట్టనున్న సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని ఆ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు బుట్టి శ్యాం యాదవ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పులి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని సంఘం కార్యాలయంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రంజిత్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పిందన్నారు. బీసీలకు రిజర్వేషన్ల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లును ఆమోదం తెలిపేలా ఒత్తిడి పెంచాలన్నారు. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా ముందుకు వెళ్తే యుద్ధం చేస్తామన్నారు. సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు సోల్తి సారయ్య, నాయకులు బాబు యాదవ్, సౌగాని శ్రీనివాస్, బగ్గీ రాజు, సనత్ రాజేష్, తదితరులు పాల్గొన్నారు. -
మట్టి వినాయకా.. మనసా స్మరామి
కాజీపేట : వినాయక చవితి దేశవ్యాప్తంగా నిర్వహించుకునే పండుగ. ఈ క్రమంలో నవరాత్రి వేడుకలకు ఇప్పటికే విగ్రహాల తయారీలో కళాకారులు నిమగ్నమయ్యారు. ఎలాంటి విగ్రహం ఏర్పాటు చేసుకోవాలి. ఎంత ఎత్తులో ఉండాలని గణపతి మండపాల నిర్వాహకులు సన్నాహాలు మొదలుపెట్టారు. ఇంత వరకు బాగానే ఉంది. మరి ఎలాంటి విగ్రహాన్ని ఎంచుకుందాం..? పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా ఉండే మట్టి విగ్రహాలకు ప్రాధాన్యమిద్దామా..? ప్రకృతికి విఘాతం కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన వాటికి మొగ్గు చూపుదామా..? నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులు మట్టి గణనాథుల వైపు ఆసక్తి చూపించాలని ఆశిస్తూ ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఇతర రాష్ట్రాలకు చెందిన కళాకారులు మట్టితో సైతం భారీ విగ్రహాలను తయారు చేస్తున్నారు. నాలుగేళ్లుగా వందల సంఖ్యలో పూర్తి సహజ రంగులతో రూపొందించి, వాటిని విక్రయిస్తూ తమవంతుగా పర్యావరణాన్ని కాపాడుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి కుటుంబ సభ్యులతో వలస వచ్చి వినాయక విగ్రహాల తయారీలో నిమగ్నమవుతున్నారు. మట్టి వినాయకులనే పూజించాలని కొంత కాలంగా ప్రచారం చేస్తుండడంతో సొంతంగా తయారు చేసి విక్రయించాలని నిర్ణయించుకున్నారు. మొదట పదుల సంఖ్యలో తయారు చేసి పండుగ రోజు విక్రయించే వారు. రెండేళ్ల నుంచి వారు చేస్తున్న మట్టి వినాయకులకు అనూహ్య స్పందన రావడంతో విగ్రహాల తయారీ విపరీతంగా పెరిగిపోయింది. చవితికి కొన్ని నెలల ముందుగానే పూర్తి సమయాన్ని విగ్రహాల తయారీకి కేటాయిస్తున్నారు. 4 నుంచి 9 అడుగుల ఎత్తును పెంచుకుంటూ విగ్రహాలను తయారు చేయడం ప్రారంభించారు. కొనుగోలు చేయడానికి ప్రజలు సైతం ముందుకు వస్తున్నారు. ఇక అప్పటి నుంచి మండపాల నిర్వాహకులు ఆర్డర్ ఇచ్చిన కొలతల ప్రకారం విగ్రహాలు రూపొందిస్తున్నారు. మహా రాష్ట్రలోని సిరొంచ నుంచి ప్రత్యేకంగా మట్టిని తీసుకొచ్చి రసాయనాలు లేని రంగులు వేస్తూ అందంగా తీర్చిదిద్దుతున్నారు. పర్యావరణాన్ని రక్షిద్దాం.. ప్రకృతిని బతికిద్దాం మొదలైన గణపతి నవరాత్రి ఉత్సవాల సందడి.. -
ఉపాధ్యాయుడు రాజేందర్‌పై క్రిమినల్ కేసు
భూపాలపల్లి అర్బన్: జయశంకర్ భూపాలపల్లి జి ల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల సై న్స్ ఉపాధ్యాయుడు పెండ్యాల రాజేందర్‌పై క్రిమి నల్ కేసు నమోదు చేసినట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ ప్రకటనలో తెలిపారు. రాజేందర్ మూడు రోజుల క్రితం పాఠశాలలో విద్యార్థులు తాగే ఆర్వో ప్లాంట్‌లో క్రిమిసంహారక మందు కలిపినట్లు నిర్ధారించా మని పేర్కొన్నారు. ఎంఈఓ దేవానాయక్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేట్టారు. ఇందులో ప్రస్తుత ప్రత్యేకాధికారి వెంకటనర్సయ్యపై వ్యక్తిగత విభేదాల కారణంగా పాఠశాల ప్రతిష్ఠను దెబ్బతీసేలా రాజేందర్ కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. కుట్రలో భాగంగా ఈ నెల 21వ తేదీన రాత్రి తాగునీటి ట్యాంకులో హానికర పురుగులమందు కలిపినట్లు విద్యార్థులు గమనించి పోలీసులకు తెలిపారన్నారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టి రాజేందర్ తాగునీటిలో విషం కలిపారని నిర్ధారించినట్లు తెలిపారన్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.. తాగునీటిలో క్రిమిసంహారక మందు కలిపిన ఘట నలో ఉపాధ్యాయుడు రాజేందర్‌ను అరెస్ట్ చేసినట్లు భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల ప్రాణాలకు ముప్పు కలిగించే ఈ తరహా దారుణ చర్యలకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేలేదన్నారు. ఈ కేసులో ఇతరుల ప్రమేయం ఉందా అనే అంశాన్ని పరిశీలిస్తున్నామని, దర్యాపు పూర్తి స్థాయిలో కొనసాగుతోందన్నారు. సమావేశంలో సీఐ నరేశ్‌కుమార్, ఎస్సై సాంబమూర్తి పాల్గొన్నారు. -
ఆర్ట్స్ కళాశాల డిగ్రీ సెమిస్టర్ల పరీక్షల ఫలితాల విడుదల
కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (అటానమస్)లో బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ మొదటి, రెండు, ఐదో (బ్యాక్లాగ్) సెమిస్టర్ పరీక్షల ఫలితాలను ఆదివారం ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి విడుదల చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 1,014మంది విద్యార్థులు హాజరుకాగా అందులో 355మంది (35శాతం)ఉత్తీర్ణులయ్యారని ప్రిన్సిపాల్ జ్యోతి తెలిపారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, ఆ కళాశాల పరీక్షల నియంత్రణాధికారి సుధీర్, అధ్యాపకులు గిరిప్రసాద్, శ్రీదేవి, నహిదాపర్వీన్, జితేందర్,రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు
రెబ్బెన: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని గోలేటి టౌన్షిప్లో కొనసాగుతున్న 71వ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ముగిశాయి. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆదిలా బాద్ మహిళ జట్టు విజేతగా నిలువగా పురుషుల వి భాగంలో వరంగల్ జిల్లా జట్టు విజయకేతనం ఎగురేసింది. సెమీఫైనల్‌తోపాటు ఫైనల్ పోటీలు నిర్వహించగా క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. ఫైనల్లో ఆదిలాబాద్ జిల్లా మహిళల జట్టు వరంగల్ జట్టుతో తలపడింది. పురుషుల విభాగంలో వరంగల్ జిల్లా క్రీడాకారులు రంగారెడ్డి జిల్లాతో తలపడ్డారు. పోటీలతో స్నేహభావం.. రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల నిర్వహణతో వివిధ జిల్లాల క్రీడాకారుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తిరుపతి, బెల్లంపల్లి ఏరియా జీఎం విజయభాస్కర్‌రెడ్డి, ఎస్వోటూజీఎం రాజమల్లు, బాల్‌బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు దుర్గయ్య, ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.నారాయణరెడ్డి, ప్రధానకార్యదర్శి రఘునాథ్‌రెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు రాజయ్య తదితరులు పాల్గొన్నారు. చాంపియన్‌గా ఆదిలాబాద్, వరంగల్ జట్లు -
గూడ్స్‌షెడ్‌కు భారీగా ఎరువులు
ఖిలా వరంగల్: వరంగల్ రైల్వేస్టేషన్ గూడ్స్‌షెడ్‌కు ఆదివారం కోరమండల్ కంపెనీకి చెందిన ఎరువులు భారీగా వచ్చాయి. 20:20:0:13 రకం 1844 మెట్రిక్ టన్నులు, 15:15:15 రకం 526 మెట్రిక్ టన్నులు, 16:20:0:13 రకం 319 మెట్రిక్ టన్నులు చేరాయి. కోరమండల్ ఎరువులను రికార్డుల ప్రకారం వ్యవసాయ అధికారులు విజ్ఞాన్, రవీందర్‌రెడ్డి పరిశీలించారు. కలెక్టర్ సత్యశారద, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ ఆదేశాల ప్రకారం కోరమండల్ ఎరువులను నిబంధనల ప్రకారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పీఏసీఎస్ గోదాంలు, ఫర్టిలైజర్ షాపులకు పంపించనున్నట్లు వ్యవసాయ అధికారి రవీందర్‌రెడ్డి తెలిపారు. అలాగే, సోమవారం ఆర్సీఎఫ్ కంపెనీకి చెందిన 1,319.12 మెట్రిక్ టన్నుల యూరియా నగరానికి రానుందని, దీంతో ఉమ్మడి జిల్లా రైతుల యూరియా కష్టాలు తీరనున్నాయని జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ పేర్కొన్నారు. -
అప్రమత్తతే రక్ష
● వినాయక మండపాల ఏర్పాటులో నిబంధనలు తప్పనిసరి ● జాగ్రత్తలు పాటిస్తే విద్యుత్ ప్రమాదాల నివారణనెహ్రూసెంటర్: జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందడి నెలకొంది. కమిటీల ఆధ్వర్యంలో మండపాలు ఏర్పాటు చేయడంతో పాటు వినాయక విగ్రహాలను తీసుకొచ్చి ప్రతిష్టిస్తున్నారు. కాగా, ఉత్సవాల్లో ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ అధికారులు సూచిస్తున్నారు. గణపయ్య విగ్రహాలను మండపాలకు తరలించేటప్పుడు, తిరిగి నిమజ్జన సమయంలో విద్యుత్‌వైర్లకు తగలకుండా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ వైర్లను సరిచేసేలా, గణపతి నిమజ్జనం సమయంలో రూట్లను పరిశీలించి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు చేపట్టేలా ఇప్పటికే విద్యుత్ ఉన్నతాధికారులు సిబ్బందికి సూచనలు చేశారు. మండపాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ● గణపతి మండపాలు ట్రాన్స్ఫార్మర్ దగ్గర, విద్యుత్ లైన్లు, వైర్ల కింద ఏర్పాటు చేయవద్దు ● అర్హత కలిగిన టెక్నీషియన్లతోనే లైటింగ్, వైరింగ్ చేయించుకోవాలి ● వైర్లు నాణ్యమైనవి ఉపయోగించాలి. ఎలాంటి జాయింట్స్ లేకుండా చూసుకోవాలి ● స్తంభాల నుంచి విద్యుత్ కనెక్షన్లను విద్యుత్ సిబ్బందితోనే తీసుకోవాలి ● ఇనుప స్తంభాలకు సపోర్టు లేకుండా వైర్లు తీసుకోవాలి ● సర్వీస్ వైర్లు, ఇతర విద్యుత్ వైర్లు నేలపై నుంచి తీసుకురావొద్దు ● త్రీ పిన్ ఫ్లగ్లనే ఉపయోగించాలి. ఎర్తింగ్ తప్పకుండా చేసుకోవాలి ● ఐరన్ వస్తువుల ద్వారా మండపాల ఏర్పాటు జరిగితే షార్ట్ సర్క్యూట్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ● మండపాలనికి ఒకటి మాత్రమే సర్వీస్ వైరు తీసుకోవాలి. మరొకటి తగిలించకూడదు ● ఇన్వర్టర్, జనరేటర్ ఉపయోగిస్తే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి ● గణపతి మండపాల్లో వినియోగించే ప్రతీ కరెంట్ సామగ్రికి ఎర్తింగ్ తప్పకుండా చేసుకోవాలి ● తడి చేతులతో స్విచ్ బోర్డులు, విద్యుత్ వైర్లను తాకొద్దు ● స్విచ్ బోర్డులు, విద్యుత్ పరికరాలు పిల్లలకు అందకుండా ఎత్తులో ఉంచాలి ● వినాయక నిమజ్జన రూట్లలో వైర్లు తగలకుండా విద్యుత్ అధికారులు తనిఖీలు చేసి క్లియరెన్స్ చేయాలి ● ఉత్సవ కమిటీలతో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలి ● విద్యుత్ అత్యవసర వేళల్లో విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించాలి ● వైర్లు తెగిపడిన వెంటనే అధికారులకు లేదా 1912 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సమాచారం అందించాలి -
బోదకాలు వ్యాప్తిని అరికట్టాలి
కొత్తగూడ: బోదకాలు వ్యాప్తిని అరికట్టేందుకు గ్రామస్తులు సహకరించాలని డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి డాక్టర్ శిరీష కోరారు. మండలంలోని వేలుబెల్లిలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. బోదకాలు దోమ కాటు వల్ల వస్తుందన్నారు. ప్రభుత్వం సరఫరా చేసిన మందులు ప్రతీ ఒక్కరు వేసుకోవాలని సూచించారు. మందుల వాడకం వల్ల ఎలాంటి దుష్ప్రభావం ఉండదని, వ్యాఽధి కారక క్రీములు ఉన్న వ్యక్తుల్లో కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పడతాయని అవగాహన కల్పించారు. వాటి వల్ల ఎలాంటి ఇబ్బందులు రావన్నారు. మాజీ సర్పంచ్ వజ్జ వెంకటలక్ష్మి, గంగారం పీహెచ్సీ వైద్యాధికారి ప్రత్యూష, సుధీర్‌రెడ్డి, పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు. -
పీహెచ్‌సీలకు నోడల్ అధికారి నియామకం
గార్ల: జిల్లాలోని 9 పీహెచ్‌సీలకు ప్రభు త్వ నోడల్ అధికారిగా గంధంపల్లి పీహెచ్సీ డాక్టర్ రాజ్‌కుమార్‌ను నియమిస్తూ శనివారం డీఎంహెచ్ఓ రవి రాథోడ్ ఉత్వర్వులు జారీచేశారు. జిల్లాలోని బ య్యారం, గార్ల, గంగారం, కొత్తగూడ, అయోధ్యపురం, గంధంపల్లి, కోమట్లగూడెం, తీగలవేణి, ముల్కనూరు పీహెచ్‌సీల పరిధిలో నిర్వహించే జాతీ య ఆరోగ్య మిషన్, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యక్రమాల అమలు తీరుతెన్నులను రాజ్‌కుమార్ పరిశీలించనున్నారు. విషజ్వరాలు, సీజనల్ వ్యాధులు ప్రభలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక నోడల్ అధికారి అవగాహన చర్యలు చేపట్టనున్నారు. -
మతసామరస్యాన్ని పెంపొందించుకోవాలి
● డీఎస్పీ తిరుపతిరావు మహబూబాబాద్ రూరల్: వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీ సమీపిస్తున్న తరుణంలో మత సామరస్యాన్ని పెంపొందించుకునేందుకు పీస్ కమిటీ సభ్యులు కృషి చేయాలని డీఎస్పీ తిరుపతిరావు కోరారు. జిల్లా శాంతి, సంక్షేమ కమిటీ (పీస్ కమిటీ) సభ్యులతో మహబూబాబాద్ టౌన్ పో లీస్ స్టేషన్లో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతిరావు సజావుగా పండుగలు నిర్వహించుకోవడానికి తీసుకునే చర్యలపై చర్చించారు. పోలీసులకు ప్రజలు సహకారం అందించాలని, మత సామరస్యాన్ని బలోపేతం చేయడానికి కృషి చేయాలని కోరారు. సమావేశంలో టౌ న్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి, ఎస్సైలు శివ, అశోక్, అలీం హుస్సేన్, సూరయ్య, మౌనిక పాల్గొన్నారు. -
యూరియా వినియోగం తగ్గించాలి
● ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు మహబూబాబాద్ రూరల్: యూరియా వినియోగాన్ని తగ్గించాలని వ్యవసాయశాఖ సహాయ సంచాలకుడు అజ్మీరా శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పీఏసీఎస్ వద్ద యూరియా కోసం వచ్చిన రైతులను ఉద్దేశించి శ్రీనివాసరావు శనివారం మాట్లాడారు. యూరియాను అధిక మొత్తంలో వినియోగించి అనారోగ్యాల పాలుకావద్దన్నారు. జిల్లాకు ఇప్పటి వరకు 21,071.452. మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందన తెలిపారు. ఇఫ్కో కంపెనీ నుంచి ప్రభుత్వం 112 మెట్రిక టన్నుల యూరియా కేటాయించారని, ప్రైవేట్ డీలర్లకు 88 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు తెలిపారు. ఆదివారం ఆర్.సీ.ఎఫ్ కంపెనీ నుంచి 112 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్లకు 88 మెట్రిక్ టన్నులు కేటాయింపు చేస్తారని తెలిపారు. 500 ఎం.ఎల్ నానో యూరియా 50 కిలోల యూరియా బస్తాకు సమానమని వివరించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ పురుషోత్తం, డీసీఓ వెంకటేశ్వర్లు, పీఏసీఎస్ చైర్మెన్ నాయిని రంజిత్, ఏఓ తిరుపతిరెడ్డి, తహసీల్దార్ చంద్రరాజేశ్వర్ రావు, టౌన్ సీఐ మహేందర్ రెడ్డి, పీఏసీఎస్ సీఈఓ ప్రమోద్ పాల్గొన్నారు. -
‘స్థానికం’లో విజయం మనదే..
హన్మకొండ చౌరస్తా: త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వందశాతం విజయ సాధించి తీరుతామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 25, 26 తేదీల్లో జిల్లాలో చేపట్టనున్న ‘జనహిత పాదయాత్ర’పై శనివారం హనుమకొండలోని డీసీసీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశానికి మంత్రులు లక్ష్మణ్, సీతక్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమీక్ష అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి లక్ష్మణ్ మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ చేపట్టిన జనహిత పాదయాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు రోజులు కొనసాగుతుందన్నారు. మొదటి రోజు వర్ధన్నపేట మండలం ఇల్లంద మార్కెట్ నుంచి వర్ధన్నపేటలోని అంబేడ్కర్ సెంటర్ వరకు, రెండో రోజు వర్ధన్నపేట నుంచి ఫిరంగిగడ్డ ప్రభుత్వ పాఠశాల వరకు కొనసాగుతుందన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ పాదయాత్ర ద్వారా ప్రజాప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి ఫలాలను అందరికీ వివరించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. అభివృద్ధితో పాటు పార్టీ బలోపేతానికి మరింత చురుగ్గా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు ఠాకూర్, కేఆర్ నాగరాజు, యశస్వినిరెడ్డి, ఎంపీలు పోరిక బలరాంనాయక్, డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, టీపీసీసీ బాధ్యులు సత్యనారాయణ, ఈవీ శ్రీనివాస్, ధర్మారావు, ప్రభాకర్‌రెడ్డి, బత్తిని శ్రీనివాసరావు, మేయర్ గుండు సుధారాణి, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్‌రెడ్డికి శ్రద్ధాంజలి ఘటించారు. మీతో కలిసి పనిచేస్తా.. సమీక్ష సమావేశానికి హాజరుకానీ మంత్రి కొండా సురేఖ.. జిల్లా ఇన్చార్జ్ మంత్రి లక్ష్మణ్‌కు ఫోన్ చేశారు. అనివార్య కారణాలతో తాను సమావేశానికి హాజరు కాలేకపోతున్నానని, ఉమ్మడి జిల్లాలో నిర్వహించే ప్రతీ కార్యక్రమానికి మీతో కలిసి పనిచేస్తామని తెలిపారు. వ్యక్తిగత కారణాలతో హాజరుకాని ఎమ్మెల్యేలు.. వ్యక్తిగత కారణాలతో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి సమీక్షకు హాజరు కాలేకపోతున్నట్లు సమాచారం చేరవేశారు. కాగా, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ, మురళీనాయక్, డిప్యూటీ స్పీకర్ రామచంద్రనాయక్ గైర్హాజరయ్యారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్‌కుమార్ జనహిత పాదయాత్రపై సమీక్ష -
ప్రజలు కులమతాలకతీతంగా జీవించాలి
కాజీపేట రూరల్ : ప్రజలు కులమతాలకతీతంగా కలిసి ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. కాజీపేట దర్గా ఉత్సవాలు ముగింపునకు మంత్రి లక్ష్మణ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరుకాగా నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం దర్గా పీఠాధిపతి ఖుస్రూపాషా, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో కలిసి ఫకీర్ల విన్యాసాలు తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చారిత్రక కాజీపేట దర్గా దీవెనలతో తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రసిద్ధిగాంచిన కాజీపేట దర్గా ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో జరుగుతాయన్నారు. అనంతరం దర్గా పీఠాధిపతి, తెలంగాణ రాష్ట్ర హజ్‌కమిటీ చైర్మన్ ఖుస్రూపాషా మాట్లాడుతూ దేశ నలుమూలల నుంచి పీఠాధిపతులు, కులమతాలకతీతంగా భక్తులు తరలొచ్చి దర్గాను దర్శించుకుని అల్లా దీవెనలు పొందారన్నారు. ఆకట్టుకున్న ఫకీర్ల విన్యాసాలు.. కాజీపేట దర్గా ముగింపు ఉత్సవంలో ఫకీర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. హైదరాబాద్, పూణె నుంచి వచ్చిన ఫకీర్లు విన్యాసాలు చేపట్టారు. కార్యక్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన దర్గా పీఠాఽధిపతి అబ్దుల్ రజాక్ బాబామలంగ్ మసుమన్ మదారి, మన్సూర్ బియాబానీ, ముస్లిం మతపెద్దలు, వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇవి.శ్రీనివాస్‌రావు, కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ మోసస్, ఎస్సీసెల్ మాజీ అధ్యక్షుడు రామకృష్ణ, మాజీ కా ర్పొరేటర్ అబుబాకర్, సింగారపు రవిప్రసాద్, కందుకూరి పూర్ణచందర్, అరూరి సాంబయ్య, ఎం.డి. ఇంతియాజ్, లెంకలపల్లి శ్రీనివాస్, పోతరబోయిన శ్రీనివాస్, ఎస్.కె.సర్వర్, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి లక్ష్మణ్‌కుమార్ ముగిసిన కాజీపేట దర్గా ఉత్సవాలు పాల్గొన్న ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సారయ్య -
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
● అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో కేసముద్రం: ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ఆదేశించారు. మున్సిపల్ పరిధిలోని గిరిజన గురుకుల బాలికల పాఠశాల, కల్వల జెడ్పీ హైస్కూల్, పీఎస్‌లను శనివారం ఆయన ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు సబ్జెక్టులవారీగా విద్యాబోధన చేయాలన్నారు. మధ్యాహ్న భోజనం వండే సిబ్బంది తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం డైనింగ్ హాల్, కిచెన్షెడ్లు, మరుగుదొడ్లు, తరగతి గదులను, స్టోర్ రూమ్‌ను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, తహసీల్దార్ వివేక్, ఎంపీడీఓ క్రాంతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. క్లినిక్‌ను వినియోగించుకోవాలి● జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శాలిని నెహ్రూసెంటర్: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ క్లినిక్ సేవలను వినియోగించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శాలిని అన్నారు. జీజీహెచ్‌లో ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను శనివారం ఆమె ప్రారంభించిన మాట్లాడారు. మత్తు పదార్థాలు, డ్రగ్స్, గంజాయి, ఆల్కహాల్‌కు అలవాటు పడిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించి మంచిపౌరులుగా తీర్చిదిద్దడానికి క్లినిక్ ఉపయోగపడుతుందన్నారు. వ్యసనం ఒక తీవ్రమైన సమస్య అని పరిష్కారం కోసం డీ అడిక్షన్ సెంటర్ సాయం తీసుకోవడం ముఖ్యమని తెలిపారు. కార్యక్రమంలో జీజీహెచ్ ఆర్ఎంఓ డాక్టర్ జగదీశ్వర్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర సమితిలో నలుగురికి చోటు● రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా విజయసారథి నెహ్రూసెంటర్: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీ ఐ) రాష్ట్ర సమితిలోకి జిల్లా నుంచి నలుగురికి చోటు దక్కింది. పార్టీ రాష్ట్ర 4వ మహాసభలు మేడ్చల్ జి ల్లా గాజులరామారంలో 3 రోజుల పాటు నిర్వహించి నూతన సమితిని ఎన్నుకోగా జిల్లాకుచోటు కల్పించారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బి.విజయసారథి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా బి.అజయ్‌సారథిరెడ్డి, నల్లు సుధాకర్‌రెడ్డి, కట్టెబోయి న శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బి.విజయసారథి మాట్లాడుతూ... పార్టీ రాష్ట్ర బాధ్యతలతో బాధ్యత పెరిగిందన్నారు. అవగాహన కల్పించాలి● డీఎంహెచ్ఓ రవిరాథోడ్ నెహ్రూసెంటర్: అంగన్వాడీలు హెచ్ఐవీ రహిత సమాజ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలని అందుకు గ్రామస్థాయి నుంచి క్షేత్రస్థాయిలో ప్రజలు, గర్భిణులకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అన్నారు. హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని అంగన్వాడీ టీచర్లకు శనివారం మహబూబాబాద్‌లో ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ... గర్భస్థ శిశువుకు హెచ్ఐవీ సోకకుండా గర్భం దాల్చిన వెంటనే ప్రభు త్వ ఆస్పత్రిలో పరీక్ష చేయించుకోవాలని సూ చించారు. గర్భిణులు అంగన్వాడీ సెంటర్లలో తప్పకుండా నమోదు చేసుకుని పౌష్టికాహారం అందించాలన్నారు. అనంతరం ఎయిడ్స్‌పై అవగాహన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు విజయ్ కుమార్, సారంగం, డెమో ప్రసాద్, ఎంపీహెచ్ఈఓ లోక్య, క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ జ్యోతి, సీఎస్ఓ సారయ్య, ఎస్ఎస్కే మేనేజర్ రమేష్, ఐసీటీసీ కౌన్సిలర్ రమేష్ పాల్గొన్నారు. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం మనదే
● రాష్ట్ర మంత్రులు లక్ష్మణ్, సీతక్క ● జనహిత పాదయాత్రపై సమీక్ష సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి సీతక్క, చిత్రంలో మంత్రి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు నాయిని, నాగరాజు, యశస్వినిరెడ్డి, ఠాకూర్, ఎమ్మెల్సీ సారయ్య, ఎంపీలు కావ్య, బలరాంనాయక్ తదితరులు ఈ నెల 25, 26 తేదీల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేపట్టనున్న జనహిత పాదయాత్ర విజయవంతానికి శనివారం హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రులు లక్ష్మణ్, సీతక్క హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థ ల ఎన్నికల్లో వందశాతం విజయం సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. – హన్మకొండ చౌరస్తా -
మైనర్లపై అఘాయిత్యం నేరం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ మహబూబాబాద్ రూరల్: లైంగిక అఘాయిత్యం మైనర్ బాలుడిపై జరిగినా పోక్సో చట్టం పరిధిలోకి వస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. జిల్లాలో పోక్సో కేసుల నమోదు, విచారణ తదితర అంశాలపై జిల్లాస్థాయి అధికారుల సమావేశం న్యాయ సేవ సదన్‌లో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ మాట్లాడుతూ.. సాధారణంగా మైనర్ బాలికలపై లైంగిక అఘాయిత్యం జరిగితేనే పోక్సో చట్టం వర్తిస్తుందని అపోహ సమాజంలో ఉందని, కానీ 18 సంవత్సరాలలోపు వయసున్న బాలబాలికలపై జరిగిన లైంగిక నేరాలన్నీ పోక్సో చట్టపరిధిలోకే వస్తాయని స్పష్టం చేశారు. పిల్లలకు సంబంధించి ప్రభుత్వం ఏ చట్టం చేసినా బాలలు మంచి వాతావరణంలో పెరగాలన్నదే ఆ చట్టాల ఉద్దేశమని తెలిపారు. బాలలపై లైంగిక నేరం జరిగినట్లు తెలిసినప్పటికీ పోలీసులకు ఫిర్యాదు చేయయనివారుకూడా ఈ చట్ట ప్రకారం శిక్షార్హులేనని వివరించారు. సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవా సంస్థ కార్యదర్శి ఎస్.శాలిని మాట్లాడుతూ.. పోక్సో చట్టం బాల్యవివాహాల నిరోధక చట్టాలపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో కూడా వివిధ రకాల చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ రూపొందించిన లఘు చిత్రాలను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పోక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంపెల్లి వెంకటయ్య, సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ డాక్టర్ నాగవాణి, సభ్యులు డేనియల్, అశోక్, జిల్లా బాలల సంరక్షణ అధికారి నరేష్, తదితరులు పాల్గొన్నారు. -
గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
కేయూ క్యాంపస్: గణేశ్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. శనివారం కాకతీయ యూనివర్సిటీలోని పరిపాలన భవనం సెనేట్హాల్లో కమిషనరేట్ పరిధిలోని హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల కలెక్టర్లు, జీడబ్ల్యూఎంసీ కమిషనర్, గణేశ్ ఉత్సవ కమిటీ, హిందూ ధర్మ పరిషత్, ముస్లిం మత పెద్దలతో నిర్వహించిన సమావేశంలో సీపీ మాట్లాడారు. గణేశ్ ఉత్సవాలు పోటీ తత్వంతో కాకుండా భక్తిభావంతో నిర్వహించాలని తెలిపారు. మండపాలకు విద్యుత్ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ శాఖ పోర్టల్‌లో వివరాలు న మోదు చేయాలని సూచించారు. గణేశ్ నిమజ్జనం, మిలాద్ – ఉన్ –నబీ ఒకేరోజు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో మతసామరస్యం దెబ్బతినకుండా ఒకరికొకరు సహకరించుకోవాలని కోరారు. హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ జిల్లాపరిధిలో 12 నిమజ్జనం ప్రదేశాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకో వాలని కోరారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద మా ట్లాడుతూ నిమజ్జనం సందర్భంగా చిన్న వడ్డేపల్లి చెరువు వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ జిల్లాలో 35 వరకు చెరువులు ఉన్నాయని, అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగుండా నిమజ్జనానికి చర్యలు చేపడుతామన్నా రు. వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్‌బాజ్‌పాయ్ మాట్లాడుతూ నిమజ్జనం ప్రదేశాల్లో వివిధ పనులను చేపట్టేందుకు రూ. 18లక్షలు కేటాయించామన్నారు. మున్సిపల్ పరిధిలోని చిన్న వడ్డేపల్లి, పద్మాక్షి టెంపుల్, వరంగల్ జిల్లా పరిధిలో 15, హనుమకొండ జిల్లా పరిధిలో 12 నిమజ్జన ప్రదేశాల్లో వివిధ పనులు చేపట్టనున్నామన్నారు. సమావేశంలో హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల అదనపు కలెక్టర్లు, డీసీపీలు, ఏసీపీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ మూడుజిల్లాల కలెక్టర్లు, జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌తో సమన్వయ సమావేశం -
ఆటోమేటిక్ మీటరు రీడింగ్‌తో బిల్లింగ్ సులువు
హన్మకొండ: హెచ్‌టీ సర్వీస్‌ల బిల్లింగ్‌లో లోపాలు సవరించడానికి ఆటోమేటిక్ మీటరు రీడింగ్ ప్రక్రి య ప్రారంభించామని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. ఈ విధానాన్ని డిసెంబర్ నాటికి అన్ని సర్కిళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. శనివారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎండీ మాట్లాడుతూ ప్రస్తుతం కరీంనగర్, వరంగల్, హనుమకొండలో పనులు జరుగుతున్నాయన్నారు. మోడెం ద్వారా కచ్చితమైన సమాచారం వ స్తుందన్నారు. మీటరు స్థితి, విద్యుత్ వినియోగం, సరఫరా సమాచారం రియల్ టైంలో వస్తుందని తెలిపారు. ఇలా చేయ డం వల్ల పొరపాట్లకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. నవరాత్రి ఉత్సవ నిర్వాహకులు, ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లు, ఎన్పీడీసీఎల్ సిబ్బందికి సూచనలు తెలిపే కరపత్రం రూపొందించామని, దీనిని 16 సర్కిళ్ల పరిధిలో మండపాల నిర్వాహకులకు అందజేయాలన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వి. మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సీఈలు అశోక్ కుమార్, సదర్ లాల్, తిరుమల్ రావు, అశోక్, వెంకట రమణ, చరణ్ దాస్, జీఎంలు అన్నపూర్ణ, సురేందర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
ఆదివారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2025
చాలెంజింగ్ విధులు...రాత్రిపూట విధులు నిర్వహించడం మహిళా పోలీసులకు చాలెంజింగ్ మారింది. బ్లూకోల్ట్ సిబ్బందితో సమానంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నిర్దేశించిన డ్యూటీని నిర్వహిస్తున్నారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న హాస్టళ్ల పరిసరాలను పరిశీలించడంతోపాటు బార్అండ్రెస్టారెంట్ల దగ్గర ఎదురయ్యే ఆకతాయిల గొడవలు మొదలు కొని, అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో బ్యాగులు, తదితర వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేయడం, రౌడీ షీటర్ల ఇళ్లను సందర్శించి ఉన్నారో, లేదో తెలుసుకోవడం, రాత్రి పూట నిర్వహించే వ్యాపారాలను బంద్ చేసి ఎక్కడా చిన్న ఘటన జరగకుండా చూసుకోవడం చేస్తున్నారు. దీంతోపాటు ఏదైనా లాఅండ్ఆర్డర్కు సంబంధించి పెద్ద సంఘటన జరిగితే వెంటనే బ్లూకోల్ట్ సిబ్బంది సహకారం తీసుకుని పరిష్కరిస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగానే చిరునవ్వుతో ఆహ్వానించే ఓ రిసెప్షనిస్ట్. అక్రమార్కుల తాట తీసే ఓ టాస్క్‌ఫోర్స్ టీం మెంబర్. ఇలా శాఖలోని అన్ని విభాగాల్లో ముందుంటున్నారు మహిళా పోలీసులు. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో అందరూ సమానమే అనేలా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇన్నాళ్లు కొన్ని విధులకే పరిమితమైన వారంతా ఉన్నతాధికారుల నిర్ణయాలతో రోడ్డెక్కి విధులు నిర్వహిస్తున్నారు. ‘మీ భద్రతే మా బాధ్యత’ అంటూ రాత్రిళ్లు సైతం విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. – వరంగల్ క్రైండయల్ 100 కాల్స్ మొదలుకుని కష్టతరమైన ఫిర్యాదుల విచారణకు సైతం మహిళా పోలీసులు సై అంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో పురుషులతో సమానంగా స్వీకరిస్తూ రంగంలోకి దిగుతున్నారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా బ్లూకోల్ట్ విధుల్లో పురుషులతో కలిసి సమర్థంగా రాణిస్తున్నారు. రాత్రిపూట పెట్రోలింగ్ విధుల్లో భాగస్వామ్యమవుతున్నారు. మహిళా నేరస్తులను జైళ్లకు తరలించే క్రమంలో ఎస్కార్ట్‌గా, నేతల సభలకు షార్ట్ వెపన్లతో హాజరై సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారు. సాధారణంగా పోలీస్ స్టేషన్లలో రూల్‌కాల్ ఉదయం 9 గంటలకు చేపడుతున్నారు. అప్పటి నుంచి 2 గంటల వరకు విధులు నిర్వహించి.. ఆ తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు డ్యూటీలో కొనసాగుతున్నారు. రాత్రి డ్యూటీ ఉన్నవారు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. రిసెప్షన్ విధులు నిర్వహించే మహిళలు ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు డ్యూటీలో ఉంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి 9 గంటల వరకు మరొకరు విధులు చేపడుతున్నారు. వీరికి 24 గంటల పాటు రెస్ట్ దొరుకుతుంది. మహిళా పోలీస్ అధికారులు అత్యంత హుషారుగా ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నారు. ఇందుకుగాను వేతనంతో పాటు 30 శాతం అదనంగా చెల్లిస్తారు. దీనికి తోడు ఉన్నత అధికారుల నుంచి విధులకు సంబంధించి ఎలాంటి ఒత్తిళ్లు లేకపోవడంతో ట్రాఫిక్ విధుల్లో మక్కువ చూపిస్తున్నారు. ప్రస్తుతం ట్రైసిటీ పరిధి ట్రాఫిక్ పోలీస్స్టేషన్లలో ఒక ఇన్స్పెక్టర్, ముగ్గురు ఏఎస్సైలు, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, ఏడుగురు కానిస్టేబుళ్లు, ఒకరు హోంగార్డు విధుల్లో కొనసాగుతున్నారు. పోస్టు సంఖ్య డీసీపీ 01సీఐ 02 ఎస్సై 24 ఏఎస్సై, హెడ్‌కానిస్టేబుళ్లు 245కానిస్టేబుళ్లు 352 హోంగార్డులు 70 -
విద్యార్థుల మేధస్సును వెలికితీయాలి
● కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మహబూబాబాద్ అర్బన్: విద్యార్థుల మేధస్సును వెలికితీయడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మానుకోట మున్సిపల్ పరిధిలోని అనంతారం బీ ఫార్మసీ బాలికల గురుకుల కళాశాలను శనివారం కలెక్టర్ పరి శీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నూతన టెక్నాలజీతో సబ్జెక్ట్‌ల వారీగా ఉపాధ్యాయులు విద్యాబోధన చేయాలన్నారు. అంకితభావంతో పనిచేస్తూ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన మెనూను ప్రకారం రుచికరమైన నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలన్నారు. వసతి గృహాల్లో వార్డెన్ హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, సీజనల్ వ్యాధుల వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులకు వేడి ఆహారాన్నే అందించాలని చెప్పారు. అనంతరం జిల్లా కేంద్రంలోని బాలికల పాఠశాలను సందర్శించారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, డిజిటల్ తరగతులను నిర్వహిస్తు విద్యార్థులను సైన్స్ టెక్నాలజీతోపాటు అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని, తరగతి గదులు, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్లు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. -
యూరియా వచ్చేసింది..
ఖిలా వరంగల్ : వరంగల్ రైల్వేస్టేషన్ గూడ్స్ షెడ్‌కు శనివారం ఇఫ్కో కంపెనీకి చెందిన 1,340.010 మెట్రిక్ టన్నుల యూరియా చేరింది. ఇఫ్కో కంపెనీ ప్రతినిధులతో కలిసి వ్యవసాయ అధికారులు రవీందర్‌రెడ్డి, విజ్ఞాన్ వ్యాగన్‌లోని యూరియాను పరిశీలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యూరియాను ఉమ్మడి జిల్లా పరిధిలోని ఫర్టిలైజర్ షాపులకు 40 శాతం, మార్క్‌ఫెడ్‌కు 60 శాతం పంపిస్తామని వారు తెలిపారు. అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి కాజీపేట : దర్గా కాజీపేటకు చెందిన చాడ శ్రీలేఖ (30) శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చె ందగా పోలీసులు కేసు నమోదు చేశారు. కాజీపేటకు చెందిన శ్రీలేఖకు దర్గా ప్రాంతానికి చెందిన చాడ శ్రావణ్‌కుమార్‌తో 2014లో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెళ్లయిన కొద్దికాలం అన్యోన్యంగా ఉన్నారు. అనంతరం మనస్పర్థలతో ఘర్షణ పడుతున్నారు. ఈ క్రమంలో శనివారం శ్రీలేఖ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందనే సమాచారం మేరకు కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. తమ కూతురు మృతిపై అనుమానాలు ఉన్నాయనే తల్లి చింతకింది లలిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కడవెండిలో సురవరం జ్ఞాపకం.. దేవరుప్పుల : మండలంలోని కడవెండిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి యోధుడు దొడ్డి కొమురయ్య స్మారక భవన నిర్మాణంలో సీపీఐ పక్షాన కీలక పాత్ర పోషించిన ఆ పార్టీ జాతీయ నాయకుడు సురవరం సుధాకర్‌రెడ్డి భాగస్వామ్యం జ్ఞాపకం పదిలంగా ఉంది. నిర్బంధ కాలంలో దొడ్డి కొమురయ్య భవన్ ఏర్పాటు సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో నక్సల్స్ అనుబంధ పార్టీల సహకారంతో స్థల సేకరణకు శ్రీకారం చుట్టగా సీపీఐ భవన నిర్మాణంలో కీలక పాత్ర పోషించి సుధాకర్ రెడ్డి ప్రారంభోత్సవానికి వచ్చారు. ఈ తరుణంలో డీకే ఫౌండేషన్ ప్రతినిధులు సురవరాన్ని కలిసి ఫొటో దిగారు. ఇది చిరస్మరణీయమని ఫౌండే షన్ ప్రతినిధి అస్నాల శ్రీనివాస్ పేర్కొన్నారు. -
భీమునిపాదం..
ప్రకృతి సోయగం..ఎత్తైన గుట్టల నడుమ నుంచి జాలువారుతున్న జలపాతం గూడూరు: అదో అందమైన జలపాతం. ప్రకృతి రమణీయతను సంతరించుకున్న పచ్చని అటవీ ప్రాంతం. చుట్టూ గుట్టలు.. పక్షుల కిలకిలరావాలు.. గలగల పారే సెలయేటి సవ్వళ్లు.. గుట్టల నడుమ నుంచి సుమారు 70 అడుగుల ఎత్తు నుంచి దూకే జలధార. అదే పర్యాటకులను ఉల్లాస పరుస్తూ.. వారి మనసును కట్టిపడేస్తున్న భీమునిపాదం జలపాతం. పాండవులు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో గడిపినట్లు, ఈ జలపాతం పై భాగంలో భీముని పాదముద్ర ఉండడంతో భీమునిపాదం జలపాతంగా పేరుగాంచిందని స్థానికుల నమ్మకం. ప్రకృతి అందాల నడుమ పాలనురగల్లా జాలువారే ఈ జలపాతం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం శివారు కొమ్ములవంచ సమీప అటవీ ప్రాంతంలో ఉంది. జలపాతం పక్కనే దేవుళ్ల విగ్రహాలు.. భీమునిపాదం జలపాతం పక్కనే శివుడు, పాపాయ మ్మ, నాగదేవతల విగ్రహాలు ఉన్నాయి. జలపాతం నుంచి జాలువారిన నీరు సమీప భీమునిపాద చెరువులోకి చేరుతుంది. ఈ చెరువు నీటితోనే కొమ్ములవంచలో పంటలు పండుతాయి. ప్రతీ సంవత్సరం కొమ్ములవంచ గ్రామస్తులు మృగశిరకార్తె ప్ర వేశించిన మొదటి బుధవారం అక్కడ ఉన్న దేవతల విగ్రహాలకు పూజలు చేస్తారు. అలాగే, మహా శివరాత్రి, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో ఇక్కడి విగ్రహాలకు పూజలు చేస్తారు. పర్యాటకులు కూడా జలపాతం కింద స్నానమాచరించి దేవతామూర్తుల విగ్రహాలకు మొక్కుకోవడం ఆనవాయితీ. రూ. 54 లక్షలతో అభివృద్ధి పనులు.. రిజర్వ్ ఫారెస్ట్, వన్యప్రాణి విభాగం పరిధిలోని ఈ జలపాతం సందర్శనకు వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటవీ శాఖ పలు చర్యలు చేపట్టింది. రూ. 54 లక్షలతో జలపాతం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. స్వాగత ద్వారం, పార్కు, స్విమ్మింగ్ ఫూల్, జలపాతం పైభాగంలో కూడా వాచ్ టవర్, కుర్చీలు, బెంచీలు, మంచినీరు, బాత్రూమ్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఎకో డెవలప్మెంట్ కమిటీ ద్వారా నిర్వహణ.. భీమునిపాద జలపాతం అభివృద్ధికి శ్రీకారం చుట్టి న అటవీశాఖ.. ఎకో డెవలప్మెంట్ కమిటీని ఏర్పా టు చేసి నిర్వహణ బాధ్యతలను వారికి అప్పగించింది. ఈ కమిటీలో అదే గ్రామానికి చెందిన వ్యక్తులను చైర్మన్, వైస్‌చైర్మన్‌గా, బీట్ అధికారిని పర్యవేక్షకుడిగా నియమించారు. పర్యాటకుల నుంచి రుసుం రూపేణ వసూలు చేసే మొత్తాన్ని నిర్వహణ ఖర్చు ల కోసం ఉపయోగిస్తున్నారు. ప్రతీ సంవత్సరం వ ర్షాకాలం ప్రారంభంతో నాలుగు నెలల పాటు జలపాత వీక్షణకు సందర్శకుల తాకిడి ఎక్కువ ఉంటుంది. ప్రతీ ఒక్కరి నుంచి రూ. 40 చొప్పున రుసుము వసూలు చేస్తున్నారు. అదే విధంగా బైక్, ఆటో, ఫో ర్, సిక్స్ వీలర్ వాహనాలకు టోకెన్ వసూలు చేస్తున్నారు. అయితే రెండు దశాబ్దాలుగా పర్యాటక కేంద్రంగా పేరుగాంచినా జాతీయ రహదారి నుంచి ఇ క్కడకు చేరుకోవడానికి రోడ్డు మాత్రం ఇబ్బందికరంగా ఉంది. ఇప్పటికై నా అటవీశాఖ అధికారులు స్పందించి జలపాతం వరకు బీటీ రోడ్డు వేయించాలని పలువురు పర్యాటకులు కోరుతున్నారు. మనసును కట్టి పడేస్తున్న ఆహ్లాదకర వాతావరణం ఆస్వాదిస్తున్న పర్యాటకులు.. టూరిజం కేంద్రంగా ఏర్పాట్లు ఎకో డెవలప్మెంట్ కమిటీతో నిర్వహణ భీమునిపాదం జలపాతం వరంగల్‌కు 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహబూబాబాద్ జిల్లా గూ డూరు మండల కేంద్రానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి మూడు మార్గాలున్నాయి. ఒక మార్గం నర్సంపేట నుంచి భూపతిపేట బస్టాండ్, సీతానగరం శివారు కొమ్ములవంచ మీదుగా, మరో మార్గం గూడూ రు, చంద్రుగూడెం, లైన్‌తండా, వంపుతండాల మీదుగా, ఇంకో మార్గం ములుగు జిల్లా కొత్తగూడ మండల కేంద్రం, కోలారం, బత్తులపల్లి, గోపాలపురం మీదుగా భీమునిపాదం జలపాతం చేరుకోవచ్చు. దట్టమైన అటవీ ప్రాంతం ఉన్న ఈ జలపాతం రెండు దశాబ్దాలుగా పర్యాటక కేంద్రంగా పేరుగాంచింది. పర్యాటకుల రద్దీ పెరుగుతున్న క్రమంలో అక్కడ మౌలిక సదుపాయాల ఏర్పాటుపై అటవీశాఖ దృష్టి సారించింది. -
విద్యాశాఖలో పదోన్నతుల పండుగ
● జిల్లాలో 103 మంది ఎస్జీటీలకు పదోన్నతి ● కసరత్తు చేస్తున్న విద్యాశాఖ అధికారులుమహబూబాబాద్ అర్బన్: జిల్లాలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు సుధీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులకు ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్ పడింది. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్జీటీలుగా పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో 103 మంది స్కూల్ అసిస్టెంట్లుగా, వివిధ సబ్జెక్ట్‌ల్లో ప్రాథమిక పాఠశాల ప్రాధానోపాధ్యాయులుగా ఉద్యోగోన్నతి పొందనున్నారు. ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయులు రిపోర్ట్ చేస్తే మిగతావాటిని భర్తీ చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 103 మంది ఎస్జీటీల సీనియార్టీ ఆధారంగా ఖాళీల జాబితాను అధికారులు విడుదల చేశారు. నేడు (ఆదివారం) వెబ్సైట్లో పాఠశాలలను ఎంపిక చేసుకునే అవకాశం ఉపాధ్యాయులకు కల్పించారు. పదోన్నతుల కేటాయింపు ఇలా.. ఎస్జీటీ ఉపాధ్యాయుల నుంచి స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు పొందే వారు సీనియార్టీ ఆధారంగా జిల్లా వ్యాప్తంగా 103 మంది ఉన్నారు. 14 మంది స్కూల్ అసిస్టెంట్లు జిల్లాలో ప్రిన్సిపాళ్లుగా పదోన్నతులు పొందారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్జీటీల ఉపాధ్యాయుల లిస్టు, సీనియార్టీ ప్రకారం వారికి వివిధ సబ్జెక్ట్‌ల వారీగా పదోన్నతులు కల్పిస్తాం. ప్రభుత్వ నింబధనలు మేరకు షెడ్యూల్ వచ్చాక పదోన్నతులు ప్రారంభిస్తాం. ఉపాధ్యాయులు పదోన్నతుల విషయంలో ఆందోళనలు చెందవద్దు. – డాక్టర్ రవీందర్‌రెడ్డి, డీఈఓ -
ఉమ్మడి జిల్లాకు రెండు సీఓఈ కళాశాలలు
న్యూశాయంపేట : ఉమ్మడి వరంగల్ జిల్లాకు తెలంగాణ మైనారిటీ గురుకులాల విద్యాసంస్థలు(టెమ్రిస్) ఆధ్వర్యంలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ (సీఓఈ) కళాశాలలు రెండు మంజూరయ్యాయి. ఈ మేరకు టెమ్రిస్ సెక్రటరీ షఫియుల్లా ఉత్తర్వులు జారీచేశారు. సీఓఈ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టెమ్రిస్ ఉమ్మడి జిల్లా కో–ఆరినేటర్ జంగా సతీశ్ శనివారం తెలిపారు. ఉమ్మడి జిల్లా మైనారిటీ కేటగిరీకి చెందిన (ముస్లింలు, క్రిస్టియన్లు, పార్సీలు, జైనులు, సిక్కులు)వారితోపాటు నాన్ మైనారిటీ కోటా కింద(ఎస్సీ,ఎస్టీ, బీసీ, ఓసీ) అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు అర్హులన్నారు. బాలికల కోసం ఒకటి(వరంగల్(జీ1) కేయూ క్రాస్), బాలుర కోసం ఒకటి (వరంగల్(బీ1) రంగశాయిపేట జక్కలొద్దిలో సీఓఈలు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. దరఖాస్తులు సమర్పించడానికి ఈనెల 29 వరకు గడువు ఉందన్నారు. మరిన్ని వివరాలకు ములుగురోడ్డు పెద్దమ్మగడ్డ సమీపంలోని మైనారిటీ గురుకులాల ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతీయ సమన్వయాధికారి కార్యాలయం లేదా 7331170866, 7331107367 నంబర్లలో సంప్రదించాలన్నారు. ఏసీబీ వలలో డోర్నకల్ సీఐ, కానిస్టేబుల్డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ సీఐ బి.రాజేష్ బెల్లం కేసులో నిందితుడినుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా శనివారం ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సీఐతోపాటు గన్‌మెన్ (కానిస్టేబుల్) రవిని అదుపులోకి తీసుకుని వరంగల్ ఏసీబీ కోర్టుకు తరలించారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి కిరాణంతోపాటు బెల్లం వ్యాపారం నిర్వహిస్తున్నాడు. గత మే నెలతోపాటు ఈ నెల మొదటి వారంలో సదరు వ్యాపారి బెల్లం తరలిస్తుండగా డోర్నకల్ పోలీసులు పట్టుకుని బొలేరోతోపాటు ట్రాలీ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. వేర్వేరుగా రెండు కేసులు నమోదు చేశారు. మొదటి కేసుకు సంబంధించి సీఐ.. నిందితుడికి నోటీసు జారీ చేయలేదు. ఈ నెల మొదటి వారంలో నమోదైన కేసులో నిందితుడు హైకోర్టునుంచి ముందస్తు బెయిల్ పొందాడు. సీఐ ఆదేశాల మేరకు గన్‌మెన్ రవి సదరు వ్యాపారికి ఫోన్ చేసి సీఐ రమ్మంటున్నాడని, రూ.50 వేల లంచం ఇవ్వాలని, లేకుంటే బెల్లం వ్యాపారం చేయనివ్వమని బెదిరించాడు. దీంతో సదరు వ్యాపారి ఈ నెల 21న ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో సీఐపై నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు శనివారం స్థానిక ఎస్సీ, బీసీ కాలనీలోని సీఐ ఇంటికి వెళ్లిన వ్యాపారి రూ.30 వేల నగదు ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్ పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. అనంతరం ఇంట్లో తనిఖీలు నిర్వహించి రూ.1,25,050 నగదును సీజ్ చేసినట్లు తెలిపారు. సీఐతో పాటు గన్‌మెన్ రవిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు చెప్పారు. కేసు విచారణలో భాగంగా ఫిర్యాదుదారుడి పేరు గోప్యంగా ఉంచుతున్నట్లు తెలిపారు. దాడుల్లో డీఎస్పీతో పాటు సీఐలు ఎల్. రాజు, ఎస్. రాజు, ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు. ● ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం ● ఈనెల 29వ తేదీ వరకు గడువు బెల్లం కేసులో రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు సీఐ ఇంట్లో మరో రూ.1.25 లక్షల నగదు స్వాధీనం -
మేడారం జాతరకు సమాయత్తం కావాలి
● ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ సోలమన్హన్మకొండ: మేడారం జాతరకు ఆర్టీసీ అధికారులు సమాయత్తం కావాలని ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలమన్ సూచించారు. శనివారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజియన్ కార్యాలయంలో కరీంనగర్ జోన్‌లోని రీజినల్ మేనేజర్ల సమావేశం నిర్వహించారు. ఇందులో 2026 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరగనున్న మేడారం జాతరపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ 2024 మేడారం జాతరలో ట్రాఫిక్ జామ్‌తో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగిందన్నారు. దీనికి కారణం సొంత వాహనాలు విరివిగా రావడమేనని, ప్రైవేట్ వాహనాల నిర్లక్ష్య డ్రైవింగ్‌తో ట్రాఫిక్ జామ్ అయ్యి మహిళలు, పిల్ల లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని గుర్తు చేశారు. మేడారం భక్తులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని, దీనిపై అధికారులు విస్తృత ప్రచారం చేయాలన్నారు. భక్తుల సంఖ్యకనుగుణంగా బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం ఆర్ఎంలు డి.విజయభాను, బి.రాజు, భవానీ ప్రసాద్, ఎ.సరిరాం, డిప్యూటీ రీజినల్ మేనేజర్లు భాను కిరణ్, శ్రీ మహేశ్, భూపతిరెడ్డి, మధుసూదన్, ఈఈ బీఆర్ సింగ్, అకౌంట్స్ ఆఫీసర్ ఎ. రవీందర్, డిపో మేనేజర్లు ధరమ్ సింగ్, రవిచంద్ర, అర్పిత, శివకుమార్, శ్రీరాం ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
బైక్, ఏటీఎం వ్యాన్ ఢీ..
గార్ల: బైక్, ఏటీఎం వ్యాన్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ మత్స్యకారుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన శుక్రవారం గార్ల మండలం తిర్లాపురం గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గార్ల మండల కేంద్రంలోని బెస్తబజారుకు చెందిన బాదం సురేందర్(48) మత్స్య కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బైక్‌పై ఖమ్మం వెళ్లి చేపల వలలు కొనుగోలు చేసి తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో తిర్లాపురం గ్రామ సమీపంలో గార్ల నుంచి డోర్నకల్ వెళ్తున్న ఏటీఎం వ్యాన్ ఎదురెదురుగా ఢీకొనడంతో సురేందర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై రవీందర్ తెలిపారు. కాగా, రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మత్స్య కార్మికుడు సురేందర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మత్స్యకార్మిక సంఘం గార్ల మండల అధ్యక్షుడు బాదం కుమారస్వామి డిమాండ్ చేశారు. మత్స్యకారుడి దుర్మరణం తిర్లాపురం సమీపంలో ఘటన -
దూరవిద్య డిగ్రీ పరీక్షలు ప్రారంభం
● 8 మంది విద్యార్థులు డీబార్ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య డిగ్రీ బీఏ, బీకాం జనరల్, కంప్యూటర్స్, బీఎస్సీ ఫైనలియర్ విద్యార్థులకు ఇయర్వైజ్స్కీం (ఎక్స్, రెగ్యులర్) పరీక్షలు శుక్రవారం 14 కేంద్రాల్లో ప్రారంభమయ్యాయి. వరంగల్ ఏఎస్ఎం, ఎల్బీ కాలేజీ కేంద్రాల్లో కాపీయింగ్ చేస్తూ పట్టుబడిన విద్యార్ధులను డీబార్ చేసినట్లు అదనపు పరీక్షల నియంత్రణాధికారి పద్మజ తెలిపారు. ఏఎస్ఎం కాలేజీలో ఒకరు, ఎల్‌బీకాలేజీ కేంద్రంలో ఏడుగురు డీబార్ అయ్యారని తెలిపారు. ఇదిలా ఉండగా హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్‌కాలేజీ కేంద్రాన్ని పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి పద్మజ సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. అంతర్జాతీయ జూడో రెఫరీగా నాగరాజు మడికొండ: హనుమకొండ జిల్లా మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల జూడో కోచ్ నాగరాజు అంతర్జాతీయ జూడో రెఫరీగా ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ దాసరి ఉమామహేశ్వరి తెలిపారు. ఇంటర్నేషనల్ జూడో ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు జోర్ధాన్ రాజధానిలో జూడో రెఫరీ పరీక్షలు జరిగాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోని హనుమకొండ జిల్లా కేంద్రానికి చెందిన నాగరాజు ఒక్కరే ఉత్తీర్ణత సాధించారు. తెలుగు రాష్ట్రాల నుంచి మొదటిసారి అంతర్జాతీయ జూడో రెఫరీగా ఎంపికై న నాగరాజును ప్రిన్సిపాల్ దాసరి ఉమామహేశ్వరి అభినందించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ మడికొండ పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి, సాంఘిక సంక్షేమ విద్యా సంస్థల కార్యదర్శి అలుగ వర్షిణి, మల్టీజోనల్ ఆఫీసర్ అలివేలు, విద్యారాణి ప్రోత్సాహంతోనే ఈవిజయం సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది నాగరాజును అభినందించి సన్మానించారు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య కేసముద్రం : అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన మండలంలోని ఇంటికన్నెలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గంధసిరి బొందయ్య (56) సుమారు రూ.5లక్షలకు పైగా అప్పు చేసి ఎకరంన్నర భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు. మూడేళ్లుగా పంట దిగుబడి రాకపోవడంతో కొంతకాలంగా మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు గమనించి మానుకోట జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు మృతుడుకి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. -
ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలి
విద్యారణ్యపురి: విద్యార్థినులు ఆధునిక సాంకేతికతను కూడా వినియోగించుకోవాలని, భవిష్యత్‌లో ఆర్థికస్వావలంబన సాధించే దిశగా చదువుకోవాలని వరంగల్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఇండియన్ పోలీస్ మెడల్ అవార్డు గ్రహీత ఎన్.రవి అన్నారు. హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ కాలేజీలో కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ‘రీసెంట్ ట్రెండ్స్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇన్ కెమికల్ అండ్ అలైడ్ సైన్సెస్ రీసెర్చ్’ అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది ఈ సదస్సులోఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థి దశలోనే లక్ష్యంతో ముందుకెళ్లాలని విద్యార్థినులకు సూచించారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సీనియర్ ప్రొఫెసర్ లలితాగురుప్రసాద్ కీలకపోన్యాసం చేస్తూ రసాయన శాస్త్ర అనుబంధ శాస్త్ర పరిశోధనల్లో ఆధునిక సాంకేతికత కృత్రిమ మేధా.. సాంకేతికతలో వస్తున్న ఆధునిక పోకడల విశిష్టతను తెలియజేస్తుందన్నారు. సదస్సులో ఆ కళాశాల ప్రిన్సిపాల్ బి. చంద్రమౌళి, కేయూ సైన్స్‌విభాగాల డీన్ జి. హనుమంతు, కెమిస్ట్రీ విభాగం అధిపతి ఎన్.వాసుదేవరెడ్డి, కేయూ కెమిస్ట్రీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్లు సి.హెచ్. సంజీవరెడ్డి, వడ్డె రవీందర్ మాట్లాడారు. ఈ సదస్సులో సావనీర్‌ను అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ జి. సుహాసిని, జాతీయ సదస్సు కన్వీనర్ ఎం.ప్రశాంతి, అధ్యాపకులు సురేశ్‌బాబు, ఉదయశ్రీ, బాలరాజు,జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈనెల 23న జాతీయసదస్సు ముగియనుంది. అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రవి -
దర్గా ఉత్సవాలు షురూ..
భక్తులతో కిక్కిరిసిన కాజీపేట బియాబానీ దర్గా కాజీపేట: కాజీపేట బియాబానీ దర్గా ఉత్సవాలు షురూ అయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున సందల్ ముగియడంతో ఉర్సు లాంఛనంగా ప్రారంభమైంది. భక్తులతో దర్గా కాజీపేట పరిసర ప్రాంతాలు కిక్కిరిసి పోతున్నాయి. కులమతాలతీతంగా తరలొచ్చి దర్గాను దర్శించుకుని పూలు, చాదర్లు సమర్పించి మొక్కులు సమర్పించుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సాయుధ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాగా, ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడిపించకపోవడంతో భక్తులు ప్రైవేట్ వాహనాల్లో ఇబ్బందులు పడుతూ దర్గా చేరుకుంటున్నారు. గురువారం అర్ధరాత్రి దాదాపు లక్షమందికిపైగా భక్తులు దర్గాను దర్శించుకున్నారని నిర్వాహకుల అంచనా. దేశంలోని 25 దర్గాల మత పెద్దలు బియాబానీ దర్గాను సందర్శించి పీఠాధిపతి ఖుస్రూపాషాను ఆశీర్వదించారు. దర్గాను దర్శించుకున్న ప్రజాప్రతినిధులు, అధికారులు.. బియాబానీ దర్గాను ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎంపీ కడియం కావ్య, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ స్నేహ శబరీష్, సీపీ సన్‌ప్రీత్‌సింగ్, అదనపు డీసీపీ రాయల ప్రభాకర్ రావు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అజీజ్‌ఖాన్, మాజీ కార్పొరేటర్ అబుబక్కర్ తదితరులు దర్శించుకున్నారు. లక్షమందికిపైగా సందర్శన.. చాదర్లు సమర్పించి మొక్కులు.. -
పూలు అమ్మబోయి విగతజీవిగా మారి..
దేవరుప్పుల : ఓ హమాలీ బో నాల పండుగ సందర్భంగా పూ లు అమ్మబోయి విగతజీవిగా మారాడు. డ్రెయినేజీలో పడి మృతి చెందాడు. ఈ ఘటన దేవరప్పులలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన చిట్టబోయిన వీరయ్య(55) హమాలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తన ఇద్దరు కూతుళ్లు పూలు, పండ్ల వ్యాపారం చేస్తుండగా వారికి చేదోడుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో గురువారం గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా సాయంత్రం సైకిల్‌పై పూలు అమ్మడానికి వెళ్లా డు. తిరిగి ఇంటికొచ్చే క్రమంలో ప్రమాదవశాత్తు ఎస్సీ కాలనీలోని డ్రెయినేజీలో పడి ఊపిరాడక మృతి చెందాడు. రాత్రి అయినా వీరయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులకు అనుమానం వచ్చింది. శుక్రవారం వెతుకుతున్న క్రమంలో వీరయ్య డ్రెయినేజీలో పడిపోయిన విషయం తెలిసింది. వెంటనే వెళ్లి చూడగా అప్పటికే మృతి చెంది కనిపించాడు. ఈ ఘటనపై మృతుడి భార్య ధనమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సృజన్‌కుమార్ తెలిపారు. 92 దస్తావేజులకు ఈ–సైన్ రిజిస్ట్రేషన్ కాజీపేట అర్బన్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని పైలట్ ప్రాజెక్ట్‌లో ఎంపిక చేయగా గురువారం ఈ– సైన్ రిజిస్ట్రేషన్లు విజయవంతంగా పూర్తి చేశారు. రెండో రోజు శుక్రవారం కాజీపేట వంద ఫీట్ల రోడ్డులోని వరంగల్ ఆర్వో కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్లు రామ నరసింహరావు,ఆనంద్ 92 దస్తావేజులకు ఈ–సైన్ పద్ధతిలో రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. కాగా, సర్వర్ సమస్యతో రాత్రి 8 గంటల వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగాయి.● డ్రెయినేజీలో పడి హమాలీ మృతి ● దేవరుప్పులలో ఘటన -
పెన్షన్, జీపీఎఫ్‌పై అవగాహన ఉండాలి
● కలెక్టర్ స్నేహశబరీష్ హన్మకొండ అర్బన్ : విరమణ పొందే ఉద్యోగులు పెన్షన్, జీపీఎఫ్‌పై అవగాహన పెంపొందించుకోవాలని హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో విశ్రాంత ఉద్యోగుల పెన్షన్, జీపీఎఫ్ సమస్యలపై వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ పెన్షన్, జీపీఎఫ్‌పై ఖజానా శాఖ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి పూర్తి తెలుసుకోవాలన్నారు. అనంతరం ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిట్, హైదరాబాద్ ఏజీ కార్యాలయ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ అభయ్ అనిల్ సొనార్కర్, నరేశ్‌కుమార్ మాట్లాడుతూ పెన్షన్, జీపీఎఫ్ సమస్యల పరిష్కారం కోసం ఆదాలత్ నిర్వహించామని, తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యల పరిష్కారానికి బృందాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పెన్షనర్లకు పెన్షన్ చెల్లింపు ఆర్డర్లు, జీపీఎఫ్ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. వరంగల్, హనుమకొండ డీఆర్ఓలు వై.వి గణేశ్, విజయలక్ష్మి, హనుమకొండ జిల్లా డీటీఓ శ్రీనివాసకుమార్, ఉమ్మడి వరంగల్ జిల్లాల డీడీఓలు, పెన్షనర్లు, తదితరులు పాల్గొన్నారు. -
రిమాండ్ మహిళా ఖైదీకి పోస్టుమార్టం
నర్సంపేట రూరల్ : రిమాండ్ మహిళాఖైదీకి ఫోరెన్సిక్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించారు. నర్సంపేట సబ్ జైలు రిమాండ్ మహిళా ఖైదీ పెండ్యాల సుచరిత (36) ఈనెల 21న మృతి చెందిన విషయం విధితమే. తొలుత నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్ రవిచంద్రారెడ్డి, టౌన్‌సీఐ రఘుపతిరెడ్డి సమక్షంలో పంచనామా నిర్వహించారు. అనంతరం వరంగల్ కేఎంసీ ఫోరెన్సిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సురేందర్, సిద్దిపేట మెడికల్ కళాశాల ఫోరెన్సిక్ హెచ్ఓడీ శ్రీధరాచారి, కుత్బుల్లాపూర్ మెడికల్ కళాశాల ఫోరెన్సిక్ హెచ్ఓడీ వసంత నాయక్‌తోపాటు నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, తహసీల్దార్ రవిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సుచరిత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ఉమ్మడి వరంగల్ జిల్లాకు భారీగా నిధులు..
హన్మకొండ: రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క చొరవతో తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ రాజ్(పీఆర్) శాఖ ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాకు భారీగా నిధులు కేటాయించింది. శుక్రవారం రూ.23.50 కోట్లు కేటాయించి విడుదల చేసింది. ఈ నిధులతో ఇంటిగ్రేడ్, మండల ప్రజాపరిషత్ కార్యాలయాల భవనాలు నిర్మించనున్నారు. ములుగు జిల్లాలో ఎస్ఈ కార్యాలయం నిర్మాణానికి రూ.1.50 కోట్లు, వరంగల్ జిల్లాలో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.8 కోట్లు, మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో మహిళా స్వయం సహాయక సంఘాల భవనానికి రూ.2 కోట్లు, ములుగులో ముస్లిం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.1.50 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం పరిపాలన మంజూరు చేసింది. అదే విధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల, భూపాలపల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయం, హనుమకొండ జిల్లా వేలేరు, దామెర మండల ప్రజా పరిషత్ కార్యాలయం నిర్మా ణం, ములుగు జిల్లా మల్లంపల్లి ఎంపీపీ కార్యాల యం, ములుగు జిల్లా ఏటూరునాగారంలో ముస్లిం కమ్యూనిటీ హాల్ నిర్మాణం, మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరులో ఎంపీడీఓ కార్యాలయం నిర్మాణానికి రూ.1.50 కోట్ల చొప్పున కేటాయిస్తూ నిధులు మంజూరు చేసింది. ఎన్‌హెచ్163 పనులు పూర్తి చేయాలి హన్మకొండ చౌరస్తా: నేషనల్ హైవే 163 పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో గడ్కరీని కావ్య మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యాదాద్రి–వరంగల్ జాతీయ రహదారి 163 (హైదరాబాద్–భూపాలపట్నం రోడ్) లో పెండింగ్‌లో ఉన్న సర్వీస్ రోడ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. జాతీయ రహదారి నాలుగు లేన్లుగా విస్తరించినా కొన్ని గ్రామాల వద్ద సర్వీస్ రోడ్లు అనుసంధానం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిడిగొండ, రఘునాథపల్లి, ఛాగల్లు, స్టేషన్‌ఘన్‌పూర్, కరుణాపురం గ్రామాల వద్ద రోడ్డు ఉన్నా జనగామ నుంచి ఈ గ్రామాల మధ్యలో లింక్ లేకపోవడం సమస్యగా మారిందన్నారు. నేరుగా ప్రధాన రహదారి పైకి రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి..సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు ఇస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీ కావ్య తెలిపారు. ● పీఆర్ శాఖకు రూ.23.50 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం కేంద్ర మంత్రి గడ్కరీని కోరిన ఎంపీ కావ్య -
వర్షపాతం.. సాధారణం
హన్మకొండ: ఇటీవల కురిసిన వర్షం ఉమ్మడి వరంగల్ జిల్లాలో లోటు పూడ్చింది. అప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో లోటు, సాధారణ వర్షపాతం ఉండగా ఇటీవలి అల్పపీడనం, వాయుగుండంతో వరంగల్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు కాగా జనగామ, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలో సాధారణంగా నమోదైంది. జూలై 21 నుంచి 24వ తేదీ వరకు వరుసగా ఆరు రోజులు వర్షాలు కురిసినా సాధారణాన్ని మించలేదు. కొన్ని ప్రాంతాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. ఇదిలా ఉండగా ఈ నెల 8 నుంచి 19 వరకు కురిసిన భారీ వర్షాలు లోటు పూడ్చడంతోపాటు సాధారణ వర్షపాతం నమోదైంది. ఆయా జిల్లాలో కొన్ని మండలాల్లో భారీ వర్షం కురవగా, మరికొన్నింటిలో తేలికపాటి నుంచి మోస్తరు కురిసింది. దీంతో జిల్లా సగటు సాధారణ వర్షపాతంగా నమోదైంది. వ్యవసాయ పనులు ముమ్మరం.. ఈ వర్షంతో వ్యవసాయ పనులు ముమ్మరంగా సా గుతున్నాయి. ప్రధానంగా వరి నాట్లు ఊపందుకున్నాయి. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో చెరువులు, కుంటల్లోకి నీరు చేరగా, సాధారణంగా కురిసిన ప్రాంతాల్లో చెరువులు, కుంటల్లోకి పూర్తి స్థాయిలో నీరు చేరలేదు. ఈ నెల 21 వరకు ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురిసినా సాధారణాన్ని మించలేదు. వర్షాకాలంలో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 843.4 మిల్లీ మీటర్లుగా కాగా ఇప్పటి వరకు 912 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో కన్నాయిగూడెం, వాజేడు మండలాల్లో లోటుగా ఉంది. ఏటూరుగానాగారం, వెంకటాపురం, మంగపేట మల్లంపల్లి మండలాల్లో సాధారణానికి మించి కు రిసింది. మిగతా మండలాల్లో సాధారణంగా నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది. వర్షాకాలం ప్రారంభం నాటి నుంచి ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 681.5 మి.మీ కాగా ఇప్పటి వరకు 651.9 మి.మీ కురిసింది. మహదేవ్పూర్, కాటారం మండలాల్లో లోటు వర్షపాతం, మిగతా మండలాల్లో సాధారణంగా నమోదైంది. మహబూబాద్ జిల్లాలోనూ సాధారణ వర్షపాతం నమోదైంది. వర్షాకాలం నుంచి ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 567.9 మి.మీ కాగా ఇప్పటి వరకు 663 మి.మీ నమోదైంది. గూడూరు, కేసముద్రం, మరిపెడ, పెద్దవంగర మండలాల్లో సాధారణానికి మించి (ఎక్సెస్) కురిసింది. మిగతా మండలాల్లో సాధారణంగా నమోదైంది. జనగామ జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జిల్లా సాధారణ వర్షపాతం 448.6 మి.మీ కాగా ఇప్పటి వరకు 499.5 మి.మీ మాత్రమే కురిసింది. స్టేషన్ ఘనపూర్‌లో లోటు వర్షపాతం ఉండగా నర్మెట, జనగామ, లింగాలఘణపురం, దేవరుప్పుల, కొడకండ్లలో ఎక్సెస్ వర్షపాతం నమోదు కాగా మిగతా మండలాల్లో సాధారణంగా నమోదైంది. హనుమకొండ జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది. జిల్లాలో వర్షాకాలం నుంచి ఇప్పటి వరకు 567.2 మి.మీ సాధారణ వర్షపాతం కాగా ఇప్పటి వరకు 569.1 మి.మీ కురిసింది. భీమదేవరపల్లి, వేలేరు మండలాల్లో ఎక్సెస్ వర్షం కురిసింది. ఎల్కతుర్తి మండలంలో లోటు వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో సాధారణంగా కురిసింది. వరంగల్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలో వర్షాకాలం నుంచి ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 602.6 మి.మీ కాగా ఇప్పటి వరకు 756.9 మిల్లీమీటర్లు కురిసింది. వర్ధన్నపేటలో అతి అత్యధిక వర్షపాతం నమోదు కాగా, గీసుకొండ, దుగ్గొండి, ఖానాపురం, చెన్నారావుపేట, సంగెం, పర్వతగిరి, నెక్కొండ మండలాల్లో అత్యధికంగా కురిసింది. నల్లబెల్లి, నర్సంపేట, రాయపర్తి, ఖిలా వరంగల్, వరంగల్ మండలాల్లో సాధారణంగా కురిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంటల సాగు ముమ్మరమైంది. సాధారణాన్ని మించి పంటల సాగైంది. వరంగల్ జిల్లాలో.. వరంగల్ జిల్లాలో అన్ని పంటలు కలిపి సాధారణ సాగు 2,84,375 ఎకరాలు కాగా ఇప్పటి వరకు 2,05,777 ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 2,40,068 ఎకరాల్లో సాగైంది. హనుమకొండ జిల్లాలో .. హనుమకొండ జిల్లాలో సాధారణ సాగు మొత్తం 2,43,357 ఎకరాలు కాగా ఇప్పటి వరకు 1,28,406 ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా 1,95,902 ఎకరాల్లో సాగైంది. మహబూబాబాద్ జిల్లాలో.. మహబూబాబాద్ జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం మొత్తం 3,52,531 కాగా ఇప్పటి వరకు 2,31,294 ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా 3,39,982 ఎకరాల్లో సాగైంది. ములుగు జిల్లాలో.. ములుగు జిల్లాలో అన్ని పంటలు కలిపి మొత్తం సాధారణ సాగు విస్తీర్ణం 1,26,973 ఎకరాలు కాగా ఇప్పటి వరకు 1,24,051 ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా 86,653 ఎకరాల్లో సాగైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తం సాధారణ సాగు విస్తీర్ణం 2,12,415 ఎకరాలు కాగా ఇప్పటి వరకు 2,34,195 ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా 1,92,244 ఎకరాల్లో సాగు చేశారు. జనగామ జిల్లాలో.. జనగామ జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం మొత్తం 3,63,104 ఎకరాలు కాగా ఇప్పటి వరకు 3,06,732 ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా 2,67,111 ఎకరాల్లో సాగు చేశారు. అన్ని పంటలు కలిపి సాధారణ సాగు విస్తీర్ణం ఇలా.. అన్ని పంటలు కలిపి సాధారణ సాగు విస్తీర్ణంతో ఇప్పటి వరకు సాగైనా విస్తీర్ణం చూస్తే వరంగల్ జిల్లాలో 84.42 శాతం, హనుమకొండ జిల్లాలో 80.50, మహబూబాబాద్ జిల్లాలో 96.44, ములుగు జిల్లాలో 68.25, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 90.50 శాతం, జనగామ జిల్లాలో 73.56 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రధాన పంటల సాగు ఇలా.. ప్రధాన పంటలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరి పంట సాధారణ సాగు విస్తీర్ణం 8,78,376 ఎకరాలు కాగా ఇప్పటి వరకు 5,10,100 ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా 6,89,635 ఎకరాల్లో సాగు చేశారు. మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం మొత్తం 64,906 ఎకరాలు కాగా ఇప్పటి వరకు 63,375 ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా 95,979 ఎకరాల్లో సాగు చేశారు. పత్తి మొత్తం సాధారణ విస్తీర్ణం 5,79,863 ఎకరాలు కాగా ఇప్పటి వరకు 5,91,372 ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా 5,00,412 ఎకరాల్లో సాగైంది. వరంగల్ జిల్లాలో అత్యధికం మిగతా జిల్లాల్లో సాధారణం ఊపందుకున్న పంటల సాగు -
నకిలీ మద్యం తయారీ ముఠా అరెస్ట్
మహబూబాబాద్ రూరల్ : నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠాలోని ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారివద్ద నుంచి రూ.5 లక్షల విలువైన నకిలీ మద్యం, 60 లీటర్ల స్పిరిట్, 2 కార్లను స్వాధీనం చేసుకున్నామని మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. ఈ మేరకు టౌన్ పీఎస్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కిరణ్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. వరంగల్ జిల్లా శాయంపేటకు చెందిన అల్లం రవీందర్ గతంలో మధ్యప్రదేశ్ నుంచి తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి ఎక్కువకు విక్రయించేవాడు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ఆశీష్ ఠాకూర్‌తో పరిచయం ఏర్పడింది. అతడు కూడా రవీందర్ మాదిరి దొంగ మద్యం విక్రయించేవాడు. ఈ క్రమంలో ఖమ్మంకు చెందిన ఆర్ఎంపీ షేక్.సాబీర్ పాషా..రవీందర్‌కు పరిచయం కాగా ఇద్దరు కలిసి అక్రమంగా డబ్బులు సంపాదించాలకున్నారు. దీంతో ఆశీష్ ఠాకూర్‌ను కలిసి రూ.2.50 లక్షలు అందజేసి నకిలీ మద్యం తయారీకి కావాల్సిన స్పిరిట్ తెప్పించారు. వారందరికి వరంగల్ పెరికవాడకు చెందిన ములుగు రాజు, రాంతేజ, మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పెద్దకిష్టాపురానికి చెందిన ఓర్పు గోపాలకృష్ణ, జక్కుల రమేశ్ పరిచయమయ్యారు. ఆరుగురు కలిసి ఆశీష్ ఠాకూర్ పంపిన స్పిరిట్‌తో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ గోదాంలో నకిలీ మద్యం తయారు చేశారు. దానిని ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ ప్రాంతాల్లో విక్రయించాలన్నారు. ఈ క్రమంలో గురువారం గోపాలకృష్ణ, రమేశ్, సాబీర్ పాషా రెండు కార్లలో వచ్చి మద్యం తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉండగా పోలీసులు పట్టుకున్నారు. గోపాలకృష్ణ, సాబీర్ పాషా, రమేశ్, రవీందర్, రాజును అరెస్ట్ చేయగా రాంతేజ, ఆశీష్ ఠాకూర్ పరారీలో ఉన్నారని ఎస్పీ, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ తెలిపారు. రూ.5 లక్షల విలువైన నకిలీ మద్యం, 60 లీటర్ల స్పిరిట్, 2 కార్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ -
పంటలకు యూరియా అందించాలి
● మానుకోటలో రైతుల రాస్తారోకో ● మద్దతు తెలిపిన ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎల్‌హెచ్‌పీఎస్ మహబూబాబాద్ రూరల్: పంటలకు యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలో రైతులు శుక్రవారం రోడ్డెక్కి అధికారులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మానుకోటలోని పీఏసీఎస్ వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురుచూసిన రైతులకు అధికారులు యూరియా బస్తాలు ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో కంకరబోర్డు వాటర్ ట్యాంకు వద్ద ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న డీఏఓ విజయనిర్మల, డీఏఓ కార్యాలయ ఏడీఏ మురళి, పీఏసీఎస్ చైర్మన్ రంజిత్, తహసీల్దార్ చంద్రరాజేశ్వర్ రావు అక్కడికి వచ్చి రైతులతో మాట్లాడారు. వారు వినకుండా తమకు యూరియా బస్తాలు ఇచ్చేంతవరకు రాస్తారోకో విరమించేదిలేదని రోడ్డుపైనే బైఠాయించారు. ఎల్‌హెచ్‌పీఎస్, బీఆర్ఎస్ నాయకులు రైతుల రాస్తారోకోకు మద్దతు తెలుపగా.. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ హాజరై మాట్లాడారు. యూరియా కోసం రైతులు క్యూలో రోజుల తరబడి నిలబడాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. రాస్తారోకోలో బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లూనావత్ అశోక్, ఎల్‌హెచ్‌పీఎస్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ బోడ లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు అంగోత్ చందూలాల్, మూడు రవి, అజ్మీరా శ్రీనివాస్, బాలరాజు, రైతులు పాల్గొన్నారు. -
ఐదు గంటలు హైరానా..
● మరిపెడలోని వసతి గృహం నుంచి పారిపోయిన విద్యార్థిని ● భూపాలపల్లి బస్టాండ్‌లో ప్రత్యక్షంమరిపెడ: మరిపెడ పట్టణంలోని ఓ వసతి గృహం నుంచి ఉదయం పారిపోయిన విద్యార్థిని ఐదు గంటల తర్వాత మధ్యాహ్నం భూపాలపల్లి బస్టాండ్‌లో ప్రత్యక్షమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని బుద్ధారం గ్రామానికి చెందిన బంటు భానుశ్రీ మరిపెడలోని మహాత్మా జ్యోతిరావుపూలే బాలికల వసతి గృహంలో ఐదో తరగతి చదువుతోంది. కాగా, విద్యార్థిని శుక్రవారం ఉదయం అల్పాహారం తీసుకునే సమయంలో పాఠశాల వెనుక నుంచి కంచె దాటి పారిపోయింది. తోటి విద్యార్థినుల ద్వారా విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ అనిత వెంటనే మరిపెడ సీఐ రాజ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. సీఐ ఆదేశాల మేరకు ఎస్సై సతీష్ సిబ్బందితో కలిసి కూడళ్ల వద్ద సీసీ ఫుటేజీలను పరిశీలించగా.. విద్యార్థిని కార్గిల్ సెంటర్ మీదుగా మరిపెడ బస్ స్టేషన్ వైపునకు వెళ్లినట్లు గుర్తించారు. వెంటనే విద్యార్థిని కుటుంబ సభ్యులను అప్రమత్తం చేసి వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి బస్టాండ్‌లో ఆరా తీశారు. మధ్యాహ్నం 2గంటలకు భూపాలపల్లి బస్టాండ్‌లో భానుశ్రీని గుర్తించినట్లు కుటుంబ సభ్యులు మరిపెడ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా తనకు హాస్టల్లో ఉండడం ఇష్టం లేదని రెండు రోజుల క్రితం తోటి విద్యార్థినులకు చెప్పినట్లు తెలిసింది. ఐదు గంటల వ్యవధిలోనే విద్యార్థిని ఆచూకీ కనుగొన్న సీఐ రాజ్‌కుమార్, ఎస్సై సతీష్‌ను పలువురు అభినందించారు. కాగా, వసతిగృహం చుట్టూ ప్రహరీ లేకనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు అంటున్నారు. -
పనుల జాతర షురూ..
● ఉపాధి హామీ పథకంలో గ్రామాలు, తండాల్లో అభివృద్ధి పనులు ● జిల్లాలో 456 పనులకు రూ.86.59కోట్ల నిధులుమహబూబాబాద్ అర్బన్: జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలు, మారుముల తండాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పనుల జాతర కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద కూలీలకు పనులు కల్పించడానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 2025–26 సంవత్సరానికి గానూ 456 పనులను గుర్తించారు. రూ.86.59 కోట్ల నిధులతో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఆర్‌డబ్ల్యూస్ శాఖల సమన్వయంతో పనులు చేపడుతున్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పలు పనులను ప్రారంభించగా.. మరిన్ని పనులకు శంకుస్థాపనలు చేశారు. పనులు ఇవే.. జిల్లాలో నూతనంగా అంగన్వాడీ, గ్రామపంచాయతీ భవనాలు, సెగ్రిగేషన్ షెడ్లు, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్, ఇందిరా మహిళాశక్తి భరోసా కింద వ్యక్తిగత పశువుల పాక, గొర్రెలు, కోళ్ల షెడ్లు, పండ్ల తోటల పెంపకం, బావుల నిర్మాణం, వానపాముల ఎరువుల తయారీ కేంద్రం, అజోల్లా ఫిట్ నిర్మాణ పనులు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్‌శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ రహదారుల నిర్మాణం, సీఆర్ఆర్ నిధులతో కొత్తగా చేపట్టే పనులకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు శంకుస్థాపన చేస్తారు. కూలీల వివరాలు.. జిల్లా వ్యాప్తంగా 18 మండలాల పరిధిలో ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్న కూలీలు మొత్తం 2,55,840 మంది ఉన్నారు. ఇందులో మహిళలు 1,33,915 మంది, పురుషులు 1,21,925 మంది ఉన్నారు. పనులు త్వరగా పూర్తి చేస్తాం జిల్లాలో ఉపాధి కూలీలకు పనులు కల్పించడం కోసం గ్రామాలు, తండాల్లో అంగన్వాడీ, గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం, వివిధ పనులకు రాష్ట్ర ప్రభుత్వం పనులు జాతరను తీసుకువచ్చింది. ఈ పనులను డిసెంబర్ చివరి వరకు పూర్తి చేసి జిల్లా ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. –మధుసూదన్‌రాజు, డీఆర్డీఓ