ప్రతిభను గుర్తించేందుకే సీఎం కప్
వరంగల్ స్పోర్ట్స్: క్రీడాకారుల్లో అంతర్లీనంగా ఉన్న ప్రతిభను వెలికితీసి మరింత ప్రోత్సహించేందుకే ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలలు నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా ట్రెజరీ ఆఫీసర్ శ్రీనివాస్ అన్నారు. హనుమకొండలోని జేఎన్‌ఎస్‌లో నిర్వహిస్తున్న సీఎం కప్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు ఆదివారం కొనసాగాయి. మూడో రోజు పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన డీటీఓ శ్రీనివాస్ విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు గ్రామీణం నుంచి అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులు ఎదిగేలా సీఎం కప్ పోటీల రూపకల్పన చేశారన్నారు. హనుమకొండ జిల్లా యువజన, క్రీడల అధికారి గుగులోత్ అశోక్‌కుమార్ మాట్లాడుతూ మూడో రోజు లాంగ్ జంప్, జావెలిన్ త్రో, 4 ్ఠ100 రిలే విభాగాల్లో పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం నగదు పురస్కారం అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ బాధ్యులు సారంగపాణి, వెంకటేశ్వర్‌రెడ్డి, రెజ్లింగ్ సంఘం బాధ్యులు దయాకర్‌రెడ్డి, మహ్మద్ కరీం తదితరులు పాల్గొన్నారు.
డీటీఓ శ్రీనివాస్
మూడో రోజు కొనసాగిన
రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీలు


