మొబిలైజేషన్ ఆఫీసర్లను నియమించాలి
మైనార్టీ గురుకులాల్లో కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్లను నియమించాలి. వారితో నిరంతర కార్యక్రమాలు నిర్వహించాలి. ముందస్తు అడ్మిషన్ ప్రక్రియ చేపట్టడం కోసం సెక్రటరీ ఆలోచన సరైనదే. కానీ క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను అంచనా వేయాలి. మైనార్టీల్లో భాషా సమస్య తెలెత్తడం, సంస్కృతి, సంప్రదాయాలు ప్రత్యేకంగా ఉన్నాయి. అందుకే వారందరిని సామాన్య జనంలో కలపడానికి అదే కమ్యూనిటీ సంబంధించిన వారిని మొబిలైజర్లుగా నియమిస్తూ నిరంతర కార్యక్రమాలు చేపట్టాలి.
డాక్టర్ రాజ్‌మహ్మద్, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత


