అగ్రి యూనివర్సిటీ క్రీడల్లో వరంగల్ విద్యార్థుల ప్రతిభ
హన్మకొండ/వరంగల్: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన క్రీడా, సాంస్కృతిక పోటీల్లో వరంగల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించారు. చెస్, డిస్కస్ త్రో, క్యారం, బాస్కెట్ బాల్, లాంగ్ జంప్, టగ్ ఆఫ్ వార్, పరుగు పందెం 400 మీటర్లలో ప్రథమ, ద్వితీ య స్థానంలో పతకాలు సాధించారని కళాశాల అసోసియేట్ డీన్ వి.రవీందర్ నాయక్ తెలిపారు. అగ్రి యూత్ ఫెస్ట్‌లో భాగంగా నిర్వహించి న యూత్ పార్లమెంట్, జానపద నృత్యం, గ్రేయిన్ ఆర్ట్, లైవ్ పెయింటింగ్, కార్టూనింగ్, యంగ్ కార్టూనింగ్, యంగ్ బడ్డీస్ ప్యానెల్ డిస్‌కషన్, స్పెల్‌బీ, అగ్రి టెక్ క్విజ్‌లో ప్రథమ, ద్వితీయ బహుమతులు సా ధించారని వివరించారు. బహుమతులు సాధించిన విద్యార్థులను కళా శాల అసోసియేట్ డీన్ వి.రవీందర్ నాయక్, ప్రొఫెసర్ విద్యాదర్, ప్రొఫెసర్ మాలతి, శివకృష్ణ, రాంబాబు, ప్రజ్ఞ, గోపిక అభినందించారు.
జాతీయస్థాయి పారా వాలీబాల్
పోటీలకు రాష్ట్ర జట్లు
వరంగల్ స్పోర్ట్స్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు జరగనున్న 14వ జాతీయస్థాయి పారా వాలీబాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు బుధవారం తెలంగాణ రాష్ట్ర పురుషుల, మహిళాజట్లు బయలుదేరి వెళ్లాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి 32 మంది క్రీడాకారులతో కూడిన టీం కాజీపేట రైల్వేస్టేషన్ నుంచి మీరట్‌కు బయలుదేరింది. ఇందులో 14 మంది పురుషులు, 14 మంది మహిళలు, నలుగురు అధికారులు ఉన్నారు. పురుషుల జట్టుకు కెప్టెన్‌గా గాడిపల్లి ప్రశాంత్, మహిళల జట్టుకు కెప్టెన్‌గా దయ్యాల భాగ్య, ఇరు జట్లకు ప్రధాన కోచ్‌గా సింగారపు బాబు వ్యవహరిస్తున్నారు. జట్లు ఉత్తమ ప్రతిభ కనబరిచి తెలంగాణ రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలనే లక్ష్యంతో పోటీల్లో పాల్గొంటున్నట్లు కోచ్ సింగారపు బాబు తెలిపారు.


