నేడు ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్ల సమావేశం | - | Sakshi
Sakshi News home page

నేడు ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్ల సమావేశం

Feb 26 2026 8:40 AM | Updated on Feb 26 2026 8:40 AM

నేడు

నేడు ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్ల సమావేశం

నేడు డయర్‌ యువర్‌ డీఎం

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అకడమిక్‌ కోఆర్డినేటర్లతో గురువారం యూనివర్సిటీలోని హ్యూమనిటీస్‌ బిల్డింగ్‌లోని సెమినార్‌హాల్‌లో సమావేశం నిర్వహించనున్నట్లు కేయూ రిజిస్ట్రార్‌ వి. రామచంద్రం బుధవారం తెలిపారు. అకడిమిక్‌ రీఫామ్స్‌, స్కిల్‌డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎంప్లాయిబులిటీ, రీసెర్చ్‌, ఇన్నోవేషన్‌ అండ్‌ ఐ అండ్‌ ఐపీఆర్‌, ఇండస్ట్రీలింకేజ్‌ అండ్‌ ఎంట్రీప్రెన్యూర్షిప్‌ తదితర అంశాలపై చర్చించనున్నారని తెలిపారు. ముఖ్యఅతిథిగా వీసీ ప్రతాప్‌రెడ్డి పాల్గొంటారని, ప్రిన్సిపాళ్లు, అకడమిక్‌ కోఆర్డి నేటర్లు విధిగా హాజరుకావాలన్నారు.

మిర్చి షెడ్లలోనే

నిల్వ చేయాలి

46 షెడ్లలో 80 వేల బస్తాలకు

అవకాశం

10వేల బస్తాలకు సరిపడా టార్పాలిన్లు

డీఎంఓ సురేఖ

వరంగల్‌: వరంగల్‌ వ్యవసాయ మార్కెట్‌కు విక్రయించేందుకు తీసుకొచ్చే మిర్చి అకాల వర్షాలకు తడవకుండా యార్డుల్లోని షెడ్డుల్లోనే నిల్వ చేయాలని జిల్లా మార్కెటింగ్‌ అధికారి కె.సురేఖ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏనుమాముల మార్కెట్‌ యార్డుల్లోని 46 షెడ్లలో సుమారు 50–80వేల బస్తాల వరకు నిల్వ చేసేందుకు అవకాశం ఉందన్నారు. అదే విధంగా సుమారు 10వేల బస్తాల వరకు తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు తమ సరుకులు విక్రయించుకోవాలన్నారు. ఏమైనా ఇబ్బందులుంటే రాత్రి వేళలో సూపర్‌వైజర్‌ జి.గంగాధర్‌ 99083 41270, ఉదయం వేళలో సూపర్‌వైజర్‌ టి.సాగర్‌ 93939 93590 నంబర్లలో రైతులు సంప్రదించాలని సురేఖ పేర్కొన్నారు.

శక్తి డెయిరీలో పేలుడు

ఇద్దరికి తీవ్రగాయాలు

రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి శివారులోని శక్తి డెయిరీలో బుధవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. డెయిరీలోని కూలింగ్‌ చాంబర్‌ నుంచి బాదం మిల్క్‌ బాటిళ్లు చల్లారక ముందే డోర్‌ తీస్తున్న క్రమంలో కంప్రెషర్‌ పేలింది. ఈ ఘటనలో గోవర్ధనగిరికి చెందిన బాల్నె వివేక్‌, జమ్మికుంటకు చెందిన ఆపరేటర్‌ రాంగోపాల్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. సీసపు గాజు ముక్కలు ఇరువురి శరీరంలోకి గుచ్చుకోవడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. దీంతో ఇద్దరిని చికిత్స నిమిత్తం వరంగల్‌, హైదరాబాద్‌ తరలించారు. కూలింగ్‌ చాంబర్‌లోని కంప్రెషర్‌ పేలడంతోనే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.

హన్మకొండ: మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రయాణికుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు గురువారం డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టీజీఎస్‌ ఆర్టీసీ వరంగల్‌–1 డిపో మేనేజర్‌ పుప్పాల అర్పిత తెలిపారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు హనుమకొండలోని వరంగల్‌–1 డిపో నుంచి డయల్‌ యువర్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్‌, నిజామాబాద్‌, సిద్దిపేట, పాలకుర్తి, తరిగొప్పుల తదితర రూట్ల ప్రయాణికులు 9959226047 నంబర్‌కు ఫోన్‌ చేసి తమ సలహాలు, సూచనలు, సమస్యలు తెలపాలని ఆమె కోరారు.

శక్తి డెయిరీ

నేడు ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్ల సమావేశం
1
1/1

నేడు ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్ల సమావేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement