breaking news
Mahabubabad District News
-
చెత్త ఎత్తారు..
కేసముద్రం: మున్సిపాలిటీ పరిధిలో పలుచోట్ల పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని సోమవారం మున్సిపల్ సిబ్బంది ట్రాక్టర్లలో తరలించారు. మున్సిపాలిటీ పరిధిలో పలుచోట్ల చెత్తపేరుకుపోవడంతో, ఆ దుర్వాసనకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న తీరుపై సోమవారం సాక్షి దినపత్రికలో ‘చెత్త శుద్ధి ఏది?’ అనే శీర్షీక కథనం ప్రచురితమైంది. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ ప్రసన్నరాణి ఆదేశాలతో పలుచోట్ల పేరుకుపోయిన చెత్తాచెదారన్ని సిబ్బంది ఎత్తి, ట్రాక్టర్లలో తరలించారు. మొత్తంగా టన్నున్నర చెత్తను సేకరించినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. -
దాతలారా.. ఆపన్నహస్తం అందించండి..
గీసుకొండ: గ్రేటర్ వరంగల్ నగరం 36వ డివిజన్ పుప్పాలగుట్ట ప్రాంతానికి చెందిన వేల్పుల నవీన్‌కుమార్ (36) మూడేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయన రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోవడంతో మంచంపై కదల్లేని స్థితిలో దీనావస్థలో జీవితం సాగిస్తున్నాడు. అతని భార్య కవిత మూగ, చెవిటికాగా, కూతురు నివేదిత ఉన్నారు. నవీన్‌కుమార్ స్థానికంగా కరెంటు స్విచ్ బోర్డుల తయారు చేసే కాంట్రాక్టర్ వద్ద రోజుకు రూ.300 దినసరి కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని కష్టంమీద పోషిస్తున్నాడు. మూడేళ్ల క్రితం అతడికి హైబీపీ రావడంతో రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోవడంతో ఇంటిదగ్గరే ఉంటున్నాడు. గతంలో వారానికి రెండు రోజులపాటు డయాలసిస్ చేయగా, ప్రస్తుతం పరిస్థితి విషమించడంతో హనుమకొండలోని విశ్వాస్ ఆస్పత్రిలో వారానికి మూడు సార్లు డయాలసిన్ జరుగుతోంది. ఇందుకోసం ప్రతీనెల రూ.2లక్షల మేర ఖర్చు అవుతుండంతో భరించలేని స్థితిలో నవీన్‌కుమార్ కుటుంబం ఉంది. చెడిపోయిన రెండు కిడ్నీల స్థానంలో ఓ కిడ్నీ అయినా ఏర్పాటు చేస్తే తన ప్రాణం నిలిచే అవకాశం ఉందని నవీన్కమార్ చెబుతున్నారు. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో ‘జీవన్‌దాన్’ పథకం కింద కిడ్నీ మార్పిడి కోసం దరఖాస్తు చేసుకుని 8 నెలల అవుతున్నప్పటికీ కిడ్నీ దాతలు లభించడం లేదు. దాతలెవరైనా ఉంటే 99493 49660 సెల్ నంబర్‌కు ఫోన్ చేసి సహాయం అందించాలని బాధితుడి తండ్రి రత్నం కోరుతున్నారు. రెండు కిడ్నీలు చెడిపోయి దీనావస్థలో బాధితుడు నిమ్స్‌లో ‘జీవన్‌దాన్’కోసం దరఖాస్తు చేసుకున్నా ఫలితం శూన్యం చికిత్స పొందుతున్న నవీన్‌కుమార్ -
టీ–హబ్‌తో ఒప్పందంపై మంత్రిని కలిసిన వీసీ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి దృష్టికి కేయూ అభివృద్ధికి సంబంధించిన అంశాలను తీసుకెళ్లారు. ప్రధానంగా రాష్ట్రీయ ఉన్నత విద్య అభియాన్ (రూసా) నిధులతో కేయూలో ఏర్పాటుచేసి కె–హబ్ గురించి మంత్రికి వివరించారు. యువతలో నూతన ఆవిష్కరణలు, ఇంక్యుబేషన్, అంకుర స్టార్టప్‌లను ప్రోత్సహించాలనే లక్ష్యం ఉందని వీసీ తెలిపారు. ఇంక్యుబేషన్, స్టార్టప్‌లను అభివృద్ధి చేసేందుకు హైదరాబాద్‌లోని టి–హబ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాల్సిన అవసరం ఉందని, అందుకు సహకరించాలని మంత్రితో చర్చించారు. అలాగే, జీయాలజీ విభాగానికి పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య భాగస్వామ్యాన్ని ఏర్పాట చేయాలనే అంశంపై కూడా మంత్రి సానుకూలంగా స్పందించారని వీసీ తెలిపారు. ప్రత్యేకించి లైఫ్ సైన్సెస్ రంగంలో నూతన ఆవిష్కరణల కోసం కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా నిలవాలని మంత్రి కాంక్షించారని ప్రతాప్‌రెడ్డి సోమవారం సాయంత్రం క్యాంపస్‌లో వెల్లడించారు. వీసీ వెంట కేయూ జీయాలజీ విభాగం అధిపతి ఆర్. మల్లికార్జున్‌రెడ్డి ఉన్నారు. -
డీటీ రాజేశ్ ఖన్నా కన్నుమూత..
● ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి ● మృతుడి కుటుంబానికి కలెక్టర్ పరామర్శ నల్లబెల్లి: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న నల్లబెల్లి డిప్యూటీ తహసీల్దార్ (డీటీ) రాజేశ్ ఖన్నా(50) కన్నుమూశారు. సోమవారం తెల్లవారుజామున ఎంజీఎంలో మృతి చెందారు. బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. హనుమకొండ ప్రశాంత్ నగర్‌కు చెందిన డిప్యూటీ తహసీల్దార్ అన్నబోయిన రాజేశ్‌కన్నా(50) ఎనిమిదేళ్ల క్రితం అనారోగ్యానికి గురికాగా పరీక్షించిన వైద్యులు రెండు కిడ్నీలు పని చేయడం లేదని నిర్ధారించారు. దీంతో భార్య రమాదేవి తన కిడ్నీ దానం చేసి భర్తను బతికించుకుంది. ఈ క్రమంలో వైద్యం కోసం అప్పు చేయడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. వైద్యుల సూచన మేరకు జాగ్రత్తలు పాటిస్తూ డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతేడాది తండ్రి, రెండు నెలల క్రితం తమ్ముడు మృతి చెందాడు. ఈ క్రమంలో 20 రోజుల క్రితం డీటీ రాజేశ్ కన్నా ఊపిరితిత్తుల సమస్యతో తీవ్ర ఇబ్బంది పడడంతో కుటుంబీకులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. భార్య, కూతురు బంగారు ఆభరణాలు అమ్మి సుమారు రూ.25 లక్షలతో చికిత్స చేయించారు. అయితే ఇంకా అదే ఆస్పత్రిలో చికిత్స చేయించేందుకు చేతిలో డబ్బులు లేవు. దీంతో డిశ్చార్జ్ చేసి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తామంటే ప్రస్తుతం చికిత్స పొందుతున్న ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాహకులు రూ.7 లక్షలు చెల్లించాలని ఒత్తిడి చేశారు. దీంతో దిక్కుతోచని స్థితిలో భార్య రమాదేవి విలపిస్తూ రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో తన గోడు వెల్లబోసుకుంది. దీంతో వారు ఆస్పత్రి యాజమాన్యంతో చర్చించి మెరుగైన వైద్యం అందించారు. ఐదు రోజుల క్రితం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు. కృత్రిమ శ్వాసతో కోలుకుంటున్న క్రమంలో ఆదివారం రాత్రి ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. మెరుగైన వైద్యం నిమిత్తం ఎంజీఎం తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. డిప్యూటీ తహసీల్దార్ మృతితో నల్లబెల్లి మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, డీటీ రాజేశ్కన్నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి కుటుంబానికి కలెక్టర్ పరామర్శ.. డిప్యూటీ తహసీల్దార్ మృతి సమాచారం తెలుసుకున్న కలెక్టర్ స త్యశారద.. రాజేశ్ ఖన్నా మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. దహన సంస్కారాల నిమిత్తం రూ.50 వేలు అందించారు. నివాళులర్పించిన వారి లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు లచ్చిరెడ్డి, తహసీల్దార్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షు డు పాక రమేశ్, కలెక్టరేట్ ఏఓ విశ్వప్రసాద్, తహసీల్దార్లు ముప్పు కృష్ణ, నాగేశ్వరరావు, మంజుల, తదితరులు పాల్గొన్నారు. -
లెక్కలన్నీ తేల్చుతారు ..
నేడు చార్టెడ్ అకౌంటెంట్ డేహన్మకొండ చౌరస్తా: ఏడాదిలో చేసిన లక్షలు, కోట్ల రూపాయల ఖర్చు, జమలకు సంబంధించిన ప్రతీ పైసా లెక్క తేల్చుతారు. బడా వ్యాపారుల నుంచి మొదలు.. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోనూ వీరిదే ముఖ్య భూమిక. లాభాల నుంచి నష్టాల వరకు ప్రతి అంశానికి ఓ లెక్క.. ఆ లెక్కకు ఓ రికార్డును సరిచేస్తారు. వారు లేనిది ఎంత పెద్ద సంస్థ అయినా నడవదంటే అతిశయోక్తి కాదు. ఇంతకీ వారు ఎవరు అనుకుంటున్నారా.. చార్టెడ్అకౌంటెంట్లు. ప్రస్తుతం ప్రతీ సంస్థకు ఓ సీఏ తప్పనిసరి అయ్యింది. దీంతో సీఏ కోర్సుకు డిమాండ్ పెరిగింది. సీఏ పూర్తి చేస్తే ఉపాధి అవకాశాలకు కొరత లేదనే చెప్పొచ్చు. నేడు చార్టెడ్ అకౌంటెంట్ల దినోత్సవ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఆర్థిక మోసాలను కనిపెట్టడంలో దిట్ట.. కంపెనీ ప్రాజెక్టు నివేదికలు తయారుచేయడం.. ఖర్చులు నియంత్రించడం.. ఆర్థిక మోసాలను కనిపెట్టి వాటి నివారణకు చర్యలు సూచించడం సీఏ బాధ్యత. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు 250 మంది చార్టెడ్ అకౌంటెంట్లు ఉన్నారు. పెరుగుతున్న ఆదరణ.. సీఏగా గుర్తింపు పొందిన వారికి దేశంలోనే కాదు విదేశాల్లోనూ విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేసే సీఏకు రూ.లక్షల్లో వేతనాలు చెల్లిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. సీఏ కోర్సు వివరాలు .. ఇంటర్మీడియట్ పూర్తయ్యాక సీఏ ఫౌండేషన్‌కు రిజిస్టర్డ్ అవ్వాలి. డిగ్రీ పూర్తి చేసిన వారు ఫౌండేషన్ అవసరం లేకుండానే నేరుగా సీఏకు రిజిస్టర్డ్ కావొచ్చు. అడ్మిషన్ కోసం ముందు ఐసీఏఐ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి, అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. సీఏ ఫౌండేషన్ ఇంటర్ తర్వాత మొదటి స్టేజ్‌లో అకౌంటింగ్, ‘లా’, ఎకనామిక్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇలా నాలుగు సబ్జెక్టులు ఉంటాయి. 2 నుంచి 3 సంవత్సరాల ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది. చివరి స్టేజీలో రెండు గ్రూప్స్, ఆరు పేపర్లు పూర్తి చేయాలి. కోర్సు పూర్తయ్యే వరకు రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అయితే ఐసీఏఐ ద్వారా మెరిట్, నీడ్ బేస్డ్ స్కాలర్షిప్స్ అందుతాయి. కోర్సు పూర్తి చేయడానికి 4–5 సంవత్సరాలు పడుతుంది. అద్దె భవనంలో .. దశాబ్ద కాలంగా హనుమకొండ హంటర్‌రోడ్ లోని ట్యాక్స్ బార్ అసోసియేషన్ భవనంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) వరంగల్ శాఖ అద్దె భవనంలో కొనసాగుతోంది. అప్పట్లో జిల్లాకు ఐసీఏఐకు సొంత భవనం మంజూరు చేయాలని అసోసియేషన్ బాధ్యులు అప్పటి కలెక్టర్ వాకాటి కరుణను కోరారు. స్పందించిన ఆమె బాలసముద్రంలోని ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్ పక్కన గల సుమారు ఎకరం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించేందుకు సూచనప్రాయంగా అంగీకారం తెలిపారు. అందుకు ప్రభుత్వ ధర ప్రకారం ఆయా స్థలానికి చెల్లించేందుకు ఐసీఏఐ సైతం ముందుకొచ్చింది. అంతేకాదు భవన నిర్మాణం కోసం రూ.6 కోట్లు వెచ్చించేందుకు ఐసీఏఐ రెడీగా ఉన్నట్లు తెలిపారు. ఇంతలో ఏమైందో తెలియదు ఆ ప్రతిపాదనలు మూలకుపడ్డాయి. దీంతో సీఏ కోర్సు చదవడానికి సరైన వసతులు లేకపోవడంతో ఉమ్మడి వరంగల్ విద్యార్థులు హైదరా బాద్, చైన్నె లాంటి మహానగరాలకు వెళ్తున్నారు. విశ్వసనీయతకు నిలువుటద్దం వ్యాపారుల లెక్కలన్నీ వీరి గుప్పిట్లోనే.. సీఏ కోర్సుతో ఉన్నత అవకాశాలు -
గుట్టలెక్కి.. వైద్యం చేసి
వాజేడు: గుట్టలపై ఉన్న పెనుగోలు గ్రామానికి వెళ్లి ఆదివాసీలకు వైద్యం చేయడం మధురానుభూతినిస్తుందంటున్నారు వాజేడు వైద్యాధికారి మధుకర్. ఏడాది క్రితం వాజేడు వైద్యాధికారిగా వచ్చిన తొలి రోజుల్లో సిబ్బందితో కలిసి మండల పరిధి కొంగాల గ్రామ పంచాయతీ గుట్టలపై పెనుగోలు గ్రామానికి కాలినడకన వెళ్లారు. వాగులు వంకలు దాటుతూ అప్అండ్ డౌన్ 34 కిలో మీటర్ల నడిచారు. మారుమూల గ్రామాల ప్రజలకు సైతం ప్రభుత్వ వైద్యం అందాలని, వారికి సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు మధుకర్ చెబుతున్నారు. -
పోలీసుల అదుపులో నిందితులు?
● ఫైనాన్స్ వ్యాపారి హత్య కేసు విచారణలో విస్తుపోయే నిజాలు కాజీపేట: కాజీపేట రైల్వే క్వార్టర్స్‌లో శుక్రవారం ఫైనాన్స్ వ్యాపారి త్రిపురాధి నవీన్‌కుమార్‌ను దారుణంగా హత్య చేసిన నిందితులు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నవీన్‌కుమార్‌ను చంపిన తర్వాత నిందితులు అతడి(నవీన్‌కుమార్) శరీరంపై ఉన్న బంగా ర ఆభరణాలను తీసుకుని వరంగల్ బట్టల బజారులోని ఓ జ్యువెల్లరీ షాపులో రూ.6 లక్షలకు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిందితులు ఇద్దరు కాజీపేటలోని ఓ చిరువ్యాపారిని కలిసి తమ ఫోన్ పోయిందని చెప్పి మరొకరితో మాట్లాడినట్లు కేసు విచారణలో బయట పడింది. దీంతో నిందితుల కదలికలపై కన్నేసిన పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మృతుడు ఆ రోజు డబ్బుల వసూలు కోసం వచ్చి సదరు మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించడం వల్లే చంపినట్లు నిందితుడు ప్రవీణ్‌కుమార్ పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. నవీన్‌కుమార్‌ను చంపిన తర్వాత మృతదేహాన్ని మాయం చేసి ఏమి తెలియనట్లు ఉండాలని భావించామని, కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో విషయం బహిర్గతం అయ్యిందని కన్నీరు పెట్టుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. డబ్బులు సాయం చేసిన వ్యాపారిని హత్య చేయాలనే ఉద్దేశం తమకు లేదని, అతడి ప్రవర్తన వల్లే మద్యం మత్తులో హత్య చేసినట్లు నిందితులు పోలీసు అధికారులకు చెబుతున్నట్లు తెలుస్తోంది. హత్య జరిగిన అనంతరం వరంగల్‌లో బంగారం విక్రయించగా వచ్చిన డబ్బులలో కొంత మేర బాకీలు చెల్లించి సుదూర ప్రాంతాలకు వెళ్లి బతకాలని నిర్ణయించుకున్నామని నిందితులు వెల్లడిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో విచారణ పూర్తి చేసి నిందితులను కోర్టులో హాజరుపర్చడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. నవీన్‌కుమార్(ఫైల్) -
పల్లె డాక్టర్ ప్రణీత్‌కుమార్
ఏటూరునాగారం: ఆ గ్రామానికి వెళ్లాలంటే వాగు దాటాలి. రోడ్డు సరిగ్గా ఉండదు. అక్కడున్న వారికి ఆరోగ్యాన్ని అందించేందుకు డాక్టర్ ప్రణీత్‌కుమార్ సేవలందిస్తున్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి పల్లె దవాఖాన వైద్యుడు హనుమకొండ ప్రణీత్‌కుమార్ కొండాయి సబ్‌సెంటర్ (పల్లెదావఖాన)లో పని చేస్తున్నారు. ఏ సమయంలోనైనా అందుబాటులో ఉంటూ వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా.. వెంటనే స్పందిస్తున్నారు. గొత్తికోయగూడెల్లోకి సైతం నడుచుకుంటూ వెళ్లి వైద్యం అందిస్తున్నారు. గూడెల్లోని ప్రజల మన్ననలు పొందుతున్నాడు. -
ప్రభుత్వం హామీలను అమలు చేయాలి
మహబూబాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వీరస్వామి, జేఏసీ నాయకుడు డోలి సత్యనాయణ డిమాండ్ చేశారు. ఫోరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కా ర్యాలయం ఎదుట ఒకరోజు శాంతియుత దీక్ష నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఉద్యమకారులకు 250గజాల స్థలంతో పాటు రూ.25,000 పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు గత ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా న్యాయం చేయాలన్నారు. ఉద్యమకారులలో విద్యార్హత ఉన్న వారికి ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలన్నారు. దీక్షకు డాక్టర్ నెహ్రూనాయక్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్లు మార్నేని వెంకన్న, ఫరీద్, టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, బానోత్ రవికుమార్‌తో పాటు పలువురు సంఘీభావం తెలి పారు. దీక్షలో వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌రెడ్డి, వహీద్, హనుమంత్, గోపాల్, వీరభద్రం ఉన్నారు. -
తల్లికి నిప్పంటించిన కొడుకు అరెస్ట్
● వివరాలు వెల్లడించిన పోలీసులు సంగెం: తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సంగెం పీఎస్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పర్వతగిరి సీఐ రాజ్‌గోపాల్, సంగెం ఎస్సై నరేశ్.. నిందితుడి అరెస్ట్ చూపి వివరాలు వెల్లడించారు. డబ్బు, ఆస్తి కోసం మండలంలోని కుంటపల్లికి చెందిన ముత్తినేని వినోద(60)పై తన కొడుకు పెట్రోల్ పోసి నిప్పంటించగా ఆమె 90 శాతానికిపైగా కాలిన గాయాలతో ఎంజీఎంలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న విషయం విధితమే. సోమవారం మధ్యాహ్నం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా చింతలపల్లి రైల్వే గేట్ సమీపంలో నిందితుడు ముత్తినేని సతీశ్ పారిపోతుండగా పట్టుకుని విచారించారు. వీరికున్న భూమిలో 4 ఎకరాలు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో, మరో ఎకరం తండ్రి సాంబయ్య పేర ఉంది. పరిహారంగా రూ. 40 లక్షలు వచ్చాయి. వాటిలో రూ. 30 లక్షలు సతీశ్‌కు ఇవ్వగా వాటితో బుధరావుపేటలో రెండున్నర ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. మిగతా డబ్బులో కొంత మరోసారి కుమారుడికి ఇవ్వగా తండ్రి సాంబయ్య పేర రూ.3 లక్షలు, తల్లి వినోద పేర రూ.3,50,000 బ్యాంకు డిపాజిట్ చేసుకున్నారు. తల్లిదండ్రుల వద్ద ఉన్న డబ్బు, ఎకరం భూమి తనకు ఇవ్వకుండా అక్క స్వరూపకు ఇస్తారా అని తరచూ గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో గీసుకొండ మండలం గంగదేవిపల్లిలో కిరాయికి ఉంటున్న సతీశ్.. తల్లిపై కక్ష పెంచుకుని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. శనివారం రాత్రి సంగెంలోని ఓ బంక్‌లో పెట్రోల్ కొనుగోలు చేసి అర్ధరాత్రి కుంటపల్లికి చేరుకున్నాడు. ఇంటికి వచ్చి ‘నీవు ఉన్నన్ని రోజులు డబ్బులు, భూమి ఇవ్వవు.. నీవు చస్తే నాకు వస్తాయి’ అని తల్లి వినోదపై పెట్రోల్ చల్లి నిప్పంటించి పరారయ్యాడు. ఈ ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేశామని, మంగళవారం రిమాండ్‌కు తరలిస్తామని సీఐ, ఎస్సై తెలిపారు. -
అక్టోబర్‌లో రాష్ట్రస్థాయివెయిట్ లిఫ్టింగ్ పోటీలు
నయీంనగర్: వరంగల్‌లో అక్టోబర్ నెలలో రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని వరంగల్ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కెఆర్.దివ్యజ రాజ్ తెలిపారు. సోమవారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో వరంగల్ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ నూతన కార్యవర్గం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా దివ్యజ రాజ్ మాట్లాడుతూ వరంగల్ క్రీడాకారులకు నాణ్యమైన శిక్షణతోపాటు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొనే క్రీడాకారులకు ఆర్థిక సహకారం అందజేస్తామన్నారు. క్రీడాకారులకు క్రీడాసామగ్రి, క్రీడా దుస్తులు ఇస్తామన్నారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులకు పారితోషికం అందజేస్తామన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీపాద శ్రీనివాసరావు, ట్రెజరర్ డాక్టర్ ఎస్.నూతన్, మెడ్ల సురేందర్, తదితరులు పాల్గొన్నారు. పీహెచ్డీ అడ్మిషన్లు కల్పించాలని ఆందోళన కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో 2021–2022 పీహెచ్డీ నోటిఫికేషన్ ఇచ్చి అప్పటికే అభ్యర్థులకు అడ్మిషన్లు కల్పించిన విషయం విధితమే. అయితే తమకు పీహెచ్‌డీలో అడ్మిషన్లు కల్పిస్తామని గతంలో చెప్పారని, ఉన్నత విద్యామండలి నుంచి సిఫార్సు చేసినా అడ్మిషన్లు కల్పించకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తూ ఐదుగురు అభ్యర్థులు సోమవారం వీసీ చాంబర్లో ఆందోళన చేపట్టారు. వీసీ ప్రతాప్‌రెడ్డితో వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. అనంతరం సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. ఆందో ళన చేసిన వారిలో మంద నరేశ్, బొట్ల మనోహర్, మోతే రాజు, ఎస్. అనిల్, తిరుపతినాయక్ ఉన్నారు. -
వైద్యచికిత్సతోపాటు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్న ‘వంగర’ వైద్యురాలు
మంగళవారం శ్రీ 1 శ్రీ జూలై శ్రీ 2025– 8లోuహనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర పీహెచ్సీ నిత్యం గర్భిణులు, మహిళలు, రోగులతో నిండిపోయి ఉంటుంది. ఇక్కడ వైద్యం కోసం వారంతా గంటల తరబడి ఎదురుచూస్తుంటారు. అందుకు కారణం అక్కడి వైద్యురాలు రుబీనా. ఆమె కేవలం చికిత్సలు అందించడమే కాకుండా జబ్బు రావడానికి కారణాలు. ఎలా చేస్తే ఆరోగ్యంగా ఉండగలం అని రోగులకు విడమర్చి చెబుతున్నారు. పేదల కష్టాలను దగ్గర్నుంచి చూశారు. వారి జబ్బులకు కారణం తెలుసుకున్నారు. వారి ఆర్థిక వెనుకబాటుకు అనారోగ్యమే కారణమని గ్రహించారు. ఆరోగ్యం అందరి ప్రాథమిక హక్కు అని చెప్పాలనుకున్నారు. అందుకే ఆమె డాక్టరయ్యారు. అనా రోగ్యంతో వచ్చిన రోగికి వైద్యమందించడమే కాదు.. వారికి అవగాహన కల్పిస్తే మరోసారి అనారోగ్యం బారిన పడరని అవగాహన కల్పించడం మొదలు పెట్టారు.ఇందుకోసం సొంతఖర్చులతో లైబ్రరీ ఏర్పాటుచేశారు. ఫలితంగా ఇప్పుడా ప్రభుత్వ వైద్యురాలి వద్దకు ప్రజలు క్యూ కడుతున్నారు. నేడు (మంగళవారం) నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా పేదల ఆరోగ్య నేస్తం వంగర పీహెచ్సీ వైద్యురాలు సయ్యద్ రుబీనాపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.వంగర పీహెచ్సీలో వైద్యఆరోగ్య పుస్తకాలు చదువుతున్న మహిళలు, లైబ్రరీలోని పుస్తకాలునవజాత శిశువుతో డాక్టర్ రుబీనా (ఫైల్)ఆరోగ్య విద్య.. పుస్తక పఠనం వంగర పీహెచ్సీ వైద్యురాలిగా చేరిన తర్వాత ఆస్పత్రికి వచ్చే రోగులకు, గర్భిణులకు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధకనబర్చడం మొదలెట్టారు. సమీప గ్రామాల్లో క్యాంపులు పెట్టి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. టీబీ, షుగర్, బీపీ వంటి వ్యాధులపై వందల సంఖ్యలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్ర భుత్వ పాఠశాలల్లో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య కార్యకర్తల ద్వారా గర్భం దాల్చిన మహిళల్ని కలిసి ప్రైవేట్‌కు వెళ్లకుండా పీహెచ్సీలో పరీక్షలు చేయించుకునేలా, ప్రసవం చేయించుకునేలా ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కల్పిస్తున్నారు. ఫలితంగా వంగర పీహెచ్‌సీకి రోజూ దాదాపు 70 నుంచి 100 మంది ఓపీ చూపించుకుంటున్నారు. డాక్టర్ కోసం వేచి ఉన్న సమయంలో పేషెంట్లతో పుస్తకాలు చదివిస్తున్నారు. ఇందుకోసం లై బ్రరీ ఏర్పాటుచేశారు. ఆమె సొంత ఖర్చులతో హెల్త్ గైడ్, హెల్త్ కేర్, ఆరోగ్య వ్యాయామ విద్య, ఆరోగ్య నిధి, ఆ రోగ్య విజ్ఞాన శాస్త్రం, యోగా, వంటిల్లే వైద్యశాల వంటి పుస్తకాలను కొనుగోలు చేసి రోగులతో చదివిస్తున్నారు. ● పలు గ్రామాల్లో సదస్సుల నిర్వహణ.. ● ఆరోగ్యకేంద్రంలో సొంతంగా ఆరోగ్య పుస్తకాలతో లైబ్రరీ ఏర్పాటు ● ఆస్పత్రికి వచ్చే మహిళలు, గర్భిణులతో పుస్తక పఠనం.. నేడు జాతీయ వైద్యుల దినోత్సవంఅనారోగ్యంతో వచ్చినవారికి మందులిచ్చి పంపించడం అందరూ చేస్తుంటారు. కానీ అనారోగ్యానికి కారణాలు. మరోసారి అలా చేయకుండా ఉండేందుకు జాగ్రత్తలు చెబితే ఆ వైద్యుల్ని ఎవరైనా మరిచిపోతారా? అచ్చం రుబీనా అదే పద్ధతి ఫాలో అవుతున్నారు. వచ్చిన వారికి తన పరిధిలో పూర్తి సాయం చేస్తున్నారు. ఒక ఇంట్లోని మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ ఇళ్లంతా బాగుంటుందని ఆమె నమ్ముతారు. అందుకని ముఖ్యంగా మహిళా సంబంధిత అనారోగ్య సమస్యలపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. వారిని ఎడ్యుకేట్ చేస్తూ మందులిస్తున్నారు.కేన్సర్‌పై అవగాహన సదస్సులో మాట్లాడుతున్న డాక్టర్ రుబీనారైల్వే టికెట్ ధరలు పెంపు నేటి నుంచి స్వల్పంగా రైల్వే టికెట్ చార్జీలు పెంచుతున్నట్లు రైల్వే అధికారులు సోమ వారం రాత్రి తెలిపారు. – 8లోuవాతావరణం జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.ప్రజల ఆరోగ్యమే నా కర్తవ్యం ఉద్యోగాన్ని బాధ్యతగా భావిస్తున్నా. తెలంగాణ ఫార్మేషన్ డే రోజు టీబీ మీద, డ్రగ్స్ మీద పరేడ్ గ్రౌండ్లో మేం చేసిన స్కిట్‌కు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అయితే వ్యాధులపై అవగాహన సాధారణంగా చెప్పకుండా స్కిట్ల ద్వారా, పాటల ద్వారా అవగాహన కల్పిస్తే ప్రజల్లోకి వెళ్తుందని నమ్ముతున్నా. ఇప్పుడు నా పీహెచ్సీ పరిధిలో 27,000 పాపులేషన్ ఉంది. వారు ఆరోగ్యంగా ఉండడమే నా కర్తవ్యం. – రుబీనా, పీహెచ్సీ వైద్యురాలు, వంగర – సాక్షి, వరంగల్ డెస్క్అవగాహనే కొండంత అండ.. -
ఉద్యోగ విరమణ సహజం : కలెక్టర్
మహబూబాబాద్: ప్రతీ ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ సహజమని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వీర బ్రహ్మచారి పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అంకితభావంతో విధులు నిర్వర్తించిన అధికారులను ప్రజలు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ గణేశ్, డీఎస్పీ తిరుపతి రావు, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, కలెక్టరేట్ ఏఓ పవన్‌కుమార్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలి
మహబూబాబాద్ రూరల్: రైల్వే మూడో లైన్ నిర్మాణం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలని రైల్వే డీఆర్ఎం భరతేష్ కుమార్ జైన్‌ను ఎమ్మె ల్యే భూక్య మురళీనాయక్ కోరారు. సికింద్రాబాద్ రైల్ నిలయంలో డీఆర్ఎంను సోమవారం ఎమ్మెల్యే కలిసి పలు సమస్యలను ఆయ న దృష్టికి తీసుకెళ్లారు. మహబూబాబాద్ పట్టణంలోని ఏ క్యాబిన్ రైలు గేట్ మూసివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, దీనికి శాశ్వత పరిష్కారంగా రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు. కేసముద్రం మండలం అన్నారం గ్రామంలో అండర్ బ్రిడ్జి మరమ్మతులు త్వరగా పూర్తిచేయాలని కోరారు. అలాగే మానుకోట రైల్వేస్టేషన్లో జీటీ, ఏపీ, వందేభారత్, రప్తిసాగర్, హింసాగర్, సంఘమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలపాలని కోరారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ డీఈ ఉపేందర్ ఉన్నారు.దరఖాస్తుల ఆహ్వానంమహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్ పాఠశాలల్లో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల నుంచి 2025 విద్యా సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రవీందర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల ఉపాధ్యాయులు జూలై 13 తేదీ లోపు http://nationalawards toteachers.education.gov.in వెబ్సైట్ ద్వారా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కోసం రిజిస్ట్రేషన్ చేసుకొని, రెండు పత్రాలను సంబంధిత ఎంఈఓతో, పాటు ఈనెల 14న సాయంత్రం 5.00గంటల లోపు డీఈఓ కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలికురవి: ఉద్యోగుల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి అన్నారు. సోమవారం మండలంలోని రాజోలు ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణ కోసం డీఈఓ, డిప్యూటీ ఈఓ, ఎంఈఓ, కాంప్లెక్ హెచ్ఎంలను వినియోగించాలని డిమాండ్ చేశారు. అవసరమైనచోట కొన్ని అదనపు పో స్టులను మంజూరు చేయాలని, ప్రత్యేక యంత్రాంగం ద్వారా మాత్రమే పర్యవేక్షణ చేపట్టాలన్నారు. పర్యవేక్షణ కోసం ఉపాధ్యాయులను నియమించడాన్ని ఉపసంహరించుకోవా లన్నారు. యూపీఎస్‌ల పర్యవేక్షణ కోసం ఎంఈఓతో పాటు అకడమిక్ పోస్టును అదనంగా సృష్టించాలని డిమాండ్ చేశారు. ఉన్నత పాఠశాలల పర్యవేక్షణకు రెవెన్యూ డివిజన్‌కు ఉప విద్యాధికారిని నియమించాలన్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మురళీకృష్ణ, షేక్‌యాకూబ్, ఎం.ప్రవీణ్‌కుమార్, రమ్య, అస్మత్‌పాషా, డీఎస్ శ్రీనివాస్, భవాని, విజయరాణి, దయతబిత, సుభాషిణి తదిత రులు పాల్గొన్నారు. -
కంపు.. కంపు!
‘ఈ ఫొటోలో మురికి కూపంగా కనిపిస్తున్న ప్రాంతం మహబూబాబాద్ పట్టణంలోని గోగుల మల్లయ్య బజార్. నాసిరకంగా డ్రెయినేజీ నిర్మాణం చేపట్టడంతో కొద్దిరోజులకు కూలిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో నివాస గృహాల నుంచి వచ్చే మురుగు నీరు ఒకేచోట చేరుతోంది. దీనిని సరిగ్గా తీయకపోవడంతో చెత్తాచెదారంతో నిండి కంపు కొడుతోంది. బాటసారులు అక్కడికి రాగానే ముక్కు మూసుకుని ముందుకు వెళ్తున్నారు.’● ‘ఫొటోలో కనిపిస్తున్న ఇళ్ల మధ్య మురికి నీటి కుంట కేసముద్రం మున్సిపాలిటీ పరిధి అంబేడ్కర్ సెంటర్ సమీపంలోనిది. కాలనీ నుంచి వచ్చే మురుగు నీరు బయటకు వెళ్లేందుకు సరైన కాల్వలు లేవు. దీంతో ఒకే చోటకు చేరి చెరువును తలపించింది. మురికి కూపంలో పందులు, కుక్కలు స్వైర విహారం చేయడం, ఆహార పదార్థాలు, ఇతర చెత్త కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతోంది.’● ‘పక్క ఫొటోలో కనిపిస్తున్న మురికికాల్వ డోర్నకల్ మున్సి పాలిటీలోని బ్యాంకు స్ట్రీట్లోనిది. నెలల తరబడి కాల్వలు తీయకపోవడంతో మురుగునీటితో నిండిపోయాయి. దీనికి తోడు చెత్త, గృహ నిర్మాణాలకు వినియోగించే ఇటుకలు, కంకర కాల్వలో పడి నీరు ముందుకు కదలడం లేదు. కాల్వ ను శుభ్రం చేయకపోవడంతో పక్కనే గడ్డి మొలిచింది. అంతా కుళ్లిపోయి కాల్వ కంపు కొడుతోంది.’ -
వినతులు వెంటనే పరిష్కరించాలి
మహబూబాబాద్: ప్రజావాణి దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్,అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ మాట్లాడుతూ.. పెండింగ్ వినతులను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలన్నారు సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. పరిష్కారం సాధ్యం కాకపోతే కారణాలతో కూడిన నివేదిక అందజేయాలని సూచించారు. ప్రజావాణిలో 148 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ పురుషోత్తం, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ -
భూ వివాదంతో రైతు ఆత్మహత్య
గార్ల: భూ వివాదంతో మనస్తాపం చెందిన ఓ రైతు.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆది వారం పెద్దకిష్టాపురంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గంగావత్ మోహన్ (38) అదే గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద 3 ఏళ్ల క్రితం భూమి కొనుగోలు చే శాడు. ఈ భూమిని పట్టా చేసుకునేందుకు మోహన్ పలుమార్లు విక్రయించిన రైతు వద్దకు వెళ్లాడు. అయితే ఆ వ్యక్తి పట్టా చేయడానికి రెవెన్యూ కార్యాలయానికి రావడం లేదు. ఈ సమస్య 3 ఏళ్లుగా కొ నసాగుతోంది. దీంతో భూమి తన పేరుపై ఇంకా ప ట్టా కావడం లేదనే మనస్తాపంతో మోహన్ శనివా రం రాత్రి తన పొలం వద్ద పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన స్థానికులు కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రుడిని మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రియాజ్‌పాషా తెలిపారు. -
గుంజేడు ముసలమ్మను దర్శించుకున్న అదనపు కలెక్టర్
కొత్తగూడ: మండలంలోని గుంజేడు ముసలమ్మ తల్లిని అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. అమ్మవారికి అర్చన చేశారు. ఆదివాసీ పూజారులు వేద మంత్రాలతో ఆయనకు ఆశీర్వచనం ఇచ్చారు. మర్రిగూడెంలో.. గార్ల: మండలంలోని మర్రిగూడెం వేట వేంకటేశ్వరస్వామిని అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకుడు రామాచార్యులు ఆయనను గర్భగుడిలోకి ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వీరబ్రహ్మచారిని పంచాయతీ కార్యదర్శులు శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు అజ్మీరా కిషన్, కిశోర్, చక్రధర్, మహేశ్, వెంకటేశ్వర్లు, మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు. వీరన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు కురవి: మండల కేంద్రంలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆలయంలో ఎటు చూసిన భక్తుల సందడి నెలకొంది. స్వామి, అమ్మవారిని దర్శించుకునేందుకు బారులుదీరారు. మొక్కులు చెల్లించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విద్యుత్ తీగలు సరిచేశారు కేసముద్రం : మున్సిపలిటీ పరిధి జమలాపురం సమీపంలో వేలాడుతున్న విద్యుత్ తీగలను ఆ శాఖ సిబ్బంది ఆదివారం సరిచేశారు. ఈ విషయంపై ఈనెల 28న ‘సాక్షి’ దినపత్రికలో ‘చేతులు లేపితే అంతే’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. స్పందించిన విద్యుత్ శాఖ ఏఈ రాజు విద్యుత్ సిబ్బందితో తీగలను ఎలాంటి ప్రమాదం లేకుండా సరి చేయించారు. రైతులు సాక్షి దినపత్రికకు కృతజ్ఞతలు తెలిపారు. వైభవంగా శాకంబరీ మహోత్సవాలు హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయంలో వైభవంగా కొనసాగుతున్న శాకంబరీ నవరాత్ర మహోత్సవాలు ఆదివారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేద పండితులు ఉదయం అమ్మవారికి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం, క్షీరాన్న నివేదన నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని కురుకుల్లా క్రమంలో, షోడశీక్రమాన్ని అనుసరించి భోగభేరాన్ని భేరుండాక్రమంలో అలంకరించి నవరాత్ర విశేషపూజలు నిర్వహించారు. -
బురద అంటకుండానే వరిసాగు..
దుగ్గొండి : వరి సాగులో ప్రస్తుతం పెట్టుబడి పెరగడంతోపాటు కూలీల కొరత రైతులను వేధిస్తోంది. పంట చేతికొచ్చాక గిట్టుబాటు ధర లేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి తరుణంలో అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ నీరు అవసరం లేకుండానే బురద అంటకుండా అధిక దిగుబడి సాధించేలా వరి సాగు విధానాన్ని శాస్త్రవేత్తలు అందుబాటులోకి తీసుకొచ్చారు. దమ్ము చేయకుండా నేరుగా దుక్కిలోనే వరి విత్తనాలు వేసి సాగు చేసే విధానాన్ని వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త నాగభూషణం వివరించారు. దుక్కి తయారీ.. పొలాన్ని లేదా మెట్ట భూమిని కల్టివేటర్‌తో మొదట రెండు సార్లు దున్నిన అనంతరం రోటోవేటర్‌తో చ దును చేయాలి. తదనంతరం సీడ్ డ్రిల్లర్, ఫెర్టికమ్ సీడ్ డ్రిల్లర్ యంత్రంతో విత్తనాలు వేయాలి. అనువైన రకాలు.. ఉత్తర తెలంగాణ ప్రాంతానికి దీర్ఘకాలిక రకాలైతే సాంబమశూర, సిద్ధి, మధ్య కాలిక రకాలైతే జగిత్యా ల వరి, పోలాస ప్రభ, వరంగల్ సన్నాలు, వరంగల్ సాంబ, విజేత, భద్రకాళి, స్వల్ప కాలిక రకాలైతే తెలంగాణ సోన, కూనారం సన్నాలు అనుకూలం. నాటే సమయం.. దీర్ఘకాలిక రకాలైతే జూన్ 10 నుంచి 30 వరకు, మధ్యకాలికం జూన్ 30 నుంచి జూలై 10 వరకు, స్వల్పకాలికం జూలై 10 నుంచి జూలై 30 వరకు విత్తుకోవచ్చు.. విత్తన మోతాదు.. సన్నగింజ రకాలైతే ఎకరాకు 8 నుంచి 10 కిలోలు, దొడ్డు గింజ రకాలైతే 10 నుంచి 12 కిలోలు సరిపోతాయి. సాలుకు సాలుకు మధ్య 25 సెంటీమీటర్ల, మొక్కకు మొక్కకు మధ్య 6 నుంచి 8 సెంటీమీటర్ల దూరం ఉండాలి.. విత్తనాలను ట్రాక్టర్ సాయంతో పనిచేసే సీడ్ డ్రిల్లర్ లేదా ఫర్టికమ్ సీడ్ యంత్రం సాయంతో విత్తుకోవాలి. ఎరువుల యాజమాన్యం.. ఎకరాకు 48 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 16 కిలోల పోటాష్ నిచ్చే ఎరువులు వేయాలి. మొదట 20 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాష్‌ను ఆఖరి దుక్కిలో వేయాలి. నత్రజని ఎరువును మూడు సమపాళ్లుగా విభజించి విత్తిన 15 నుంచి 20 రోజులకు, పిలక, అంకురం దశల్లో వాడుకోవాలి. చివరి దశలో వేసే నత్రజనితో పాటు 8 కిలోల పోటాష్‌ను తప్పనిసరిగా వేయాలి. కలుపు నివారణ.. వరిలో 45 రోజుల వరకు ఎలాంటి కలుపు లేకుండా చూసుకోవాలి. కలుపుపై అశ్రద్ధ చేస్తే దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉంది. విత్తిన వెంటనే తేమ ఉన్న సమయంలో 48 గంటలలోపు ఎకరాకు లీటర్ పెండిమిథాలిన్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి భూమి తడిచేలా పిచికారీ చేయాలి. 20 రోజుల వయసులో ఎకరాకు బిస్పైరిబాక్ సోడియం 120 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి పంటపై పిచికారీ చేయాలి. లేదా వీడర్ సాయంతోనూ కలుపును నివారించుకోవచ్చు. ఇనుపదాతు లోపం.. ఎద పద్ధతిలో సాగుచేసే వరిలో ఇనుపదాతు లోపం ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లీటర్ నీటికి 5 గ్రాముల అన్నబేది, 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి పంటపై 2–3 సార్లు పిచికారీ చేయాలి. చీడపీడల ప్రభావం పెద్దగా ఉండదు. ఉన్నా మామూలు వరిపై పద్ధతులనే పాటించాలి. నీటి యాజమాన్యం.. తొలకరి వర్షాలు పడగానే వాటిని ఉపయోగించుకుని ఎద పద్ధతి వరిసాగు చేసుకోవడం లాభాదా యకం. తొలకరి వర్షాలకు వరి విత్తనాలు విత్తితే జూ న్, జూలై, ఆగస్టు మాసాల వరకు వర్షాలే సరిపోతా యి. ఆ తర్వాత 15 రోజుల వరకు వర్షాలు లేకుంటే ఆరుతండి పంటకు మాదిరిగా నీటి తడులివ్వాలి. పూత దశనుంచి గింజ గట్టిపడేవరకు పొలంలో అంగుళం మేర నీరు ఉండేలా చూసుకోవాలి.. ఖర్చులు.. ఆదాయం.. సాధారణ పద్ధతిలో వరి సాగుకు నారుమడి, విత్త నం, దమ్ము చేయడం, చదునుచేయడం, కూలీ లు, అధిక నీరు ఇలా చాలా పెట్టుబడి అవుతుంది. ఎద పద్ధతిలో అయితే ఎకరాకు రూ. 10 వేల పెట్టుబడి తగ్గుతుంది. దిగుబడి సాధారణం కంటే ఎక్కువే వస్తున్న నేపథ్యంలో ఎకరాకు రూ. 15 వేల అదనపు ఆదాయం సాధ్యమవుతుంది. దిగుబడి .. వర్షాకాలంలో ఎకరాకు 35 నుంచి 40 బస్తాలకు తగ్గకుండా దిగుబడి వస్తుంది. సాధారణ పదధతిలోని వరికంటే 3 నుంచి 5 బస్తాల అధిక దిగుబడి వస్తుంది. తక్కువ పెట్టుబడి.. ఎక్కువ దిగుబడి -
మానుకోటను బంగారుకోటగా తీర్చిదిద్దుతా
మహబూబాబాద్ అర్బన్: మానుకోట మున్సిపాలిటీని బంగారు కోటగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ అన్నారు. మానుకోట మున్సిపాలిటీ పరిధి ఈదులపూసపల్లి ఒకటో వార్డులో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో మానుకోట మున్సిపాలిటీ పరిధి విలీన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి, సీసీ రోడ్లు వేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని నిధులతో మానుకోటను అభివృద్ధి పథంలో ముందు ఉంచుతామన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వెన్నం లక్ష్మారెడ్డి, నాయకులు గోవర్ధన్ రెడ్డి, బావ్ సింగ్, వెంకన్న, వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ -
ఫోన్ ట్యాంపరింగ్‌లో దయాకర్‌రావు
హసన్‌పర్తి: ఫోన్ ట్యాంపరింగ్‌లో మాజీ మంత్రి దయాకర్‌రావు ప్రమేయం ఉందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్.నాగరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ వరంగల్ ఒకటో డివిజన్ పరిధిలో రూ.1.78కోట్లతో నిర్మిస్తున్న సీసీరోడ్ల పనులకు నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి ఆదివారం శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పర్వతగిరి కేంద్రంగా ఫోన్ ట్యాంపరింగ్ జరిగిందని, ఇందుకు స్పష్టమైన ఆధారాలు లభ్యమైనట్లు చెప్పారు. ఫోన్ ట్యాంపరింగ్‌లో దయాకర్‌రావు జైలుకు వెళ్లడం ఖాయమని, ఆయనకు చిన్న మెదడు చిట్లి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడన్నారు. వర్ధన్నపేట కేంద్రంగా వంద ఎకరాల్లో యంగ్‌ఇండియా ఇంటిగ్రేడెడ్ స్కూల్‌తో పాటు సబ్‌జైలు, మున్సిఫ్ కోర్టు, స్టేడియం నిర్మించడానికి ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. వర్ధన్నపేట ఎమ్మెల్యేగా మూడు పర్యాయాలు కొనసాగిన దయాకర్‌రావు అక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడాదిన్న కాలంలోనే అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని అన్నారు. సమావేశంలో కార్పొరేటర్ అరుణకుమారి, మాజీ సర్పంచ్ దేవరకొండ అనిల్‌కుమార్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వెంకటేశ్వర్లు, మాజీ వార్డు సభ్యుడు గడ్డం శివరాంప్రసాద్, ఎన్ఎస్యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు వీసం సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆయన జైలుకు వెళ్లడం ఖాయం వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు -
శిథిల భవనం!
మహబూబాబాద్: జిల్లాలో పలు తహసీల్దార్ కార్యాలయాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి ఉంది. దీంతో అధికారులు, సిబ్బంది బిక్కుబిక్కుంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. ముఖ్యంగా మానుకోట తహసీల్దార్ కార్యాలయ భవనం పరిస్థితి మరి దారుణంగా ఉంది. పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని స్లాబ్ పెచ్చులు ఊడిపడుతున్నాయి. నూతన భవన నిర్మాణాలు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. నాలుగు కార్యాలయాలు శిథిలావస్థ భవనాల్లో.. జిల్లాలో 18మండలాలు ఉన్నాయి. కాగా 482 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 6,35,872 మంది జనాభా, 5,61,960 మంది ఓటర్లు, 1,69,556 గృహాలు ఉన్నాయి. కాగా మానుకోట, డోర్నకల్ తహసీల్దార్ కార్యాలయాల భవనాలు పూర్తిగా శిథిలావస్థలో ఉండగా.. కురవి, తొర్రూరు కార్యాలయాల భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కాగా పెద్దవంగర, దంతాలపల్లి తహసీల్దార్ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అలాగే కొత్తగూడ కార్యాలయం ఐటీడీఏకు చెందిన భవనంలో.. గంగారం ఇతర శాఖ భవనంలో, చిన్నగూడూరు కార్యాలయం ఎస్సీ హాస్టల్ భవనంలో కొనసాగుతోంది. ఇటీవల ఏర్పడిన ఇనుగుర్తి మండల తహసీల్దార్ కార్యాలయం గ్రామ పంచాయతీ భవనంలో, సీరోలు కార్యాలయం పాత పాఠశాల భవనంలో నడుస్తోంది. ఏడు కార్యాలయాలకే పక్కా భవనాలు.. జిల్లాలోని నెల్లికుదురు, గూడూరు, నర్సింహులపేట, బయ్యారం, గార్ల, కేసముద్రం, మరిపెడ మండలాల తహసీల్దార్ కార్యాలయాలు మాతమ్రే పక్కా భవనాల్లో కొనసాగుతున్నాయి. ఆయా భవనాల్లో అన్ని సౌకార్యాలు ఉన్నాయి. నిజాంకాలం నాటి భవనంలో మానుకోట కార్యాలయం.. మానుకోట తహసీల్దార్ కార్యాలయం నిజాంకాలం నాటి భవనంలో కొనసాగుతోంది. ఈ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. భవనం స్లాబ్ పెచ్చులు ఊడిపడుతున్నాయి. వెనుక భాగంలో ఉన్న పలు గదులు కూలిపోయాయి. వర్షాకాలం నేపథ్యంలో భవనం ఎప్పుడు కూలుతుందోనని అధికారులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. అందులో కూడా గదుల కొరతతో సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతిపాదనలకే పరిమితం.. నూతన భవనాల కోసం ఏటా అధికారులు ప్రతిపాదనలు పంపుతున్నారు. కానీ నిధులు మంజూరు కావడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం శిథిలావస్థలో ఉన్న భవనాల కోసం వెంటనే నిధులు మంజూరు చేయాలని ఆయా కార్యాలయాల సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు. కార్యాలయాలకు వచ్చే ప్రజలు కూడా ఆ భవనాలను చూసి భయపడుతున్నారు. శిథిలావస్థలో పలు తహసీల్దార్ కార్యాలయాల భవనాలు ఇబ్బందులు పడుతున్న అధికారులు, సిబ్బంది ప్రతిపాదనలకే పరిమితమైన నూతన బిల్డింగ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్న పలు కార్యాలయాలు -
ఇంటర్ లింక్‌తో నిరంతర విద్యుత్
హన్మకొండ : విద్యుత్ అవసరాలు రోజురోజుకూ పె రుగుతున్నాయి. ఈ క్రమంలో అంతరాయాలతో వినియోగదారులు ఇబ్బందులు పడొద్దనే లక్ష్యంతో టీజీ ఎన్పీడీసీఎల్ పెద్ద ఎత్తున ప్రత్యామ్నాయ విద్యుత్ లైన్లు చేపట్టింది. ఇందులో భాగంగా నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ఇంటర్ లింక్ లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీని ద్వారా వినియోగదారులకు నాణ్యమైన, మెరుగైన విద్యుత్ సరఫరా జరుగుతుంది. దీని కోసం ప్రతీ సబ్ స్టేషన్ మధ్య ప్రత్యామ్నాయ విద్యుత్ లైన్ నిర్మించింది. తదనుగుణంగా 11 కేవీ ఇంటర్ లింకింగ్ లైన్ల వ్య వస్థపై కూడా దృష్టి సారించింది. అవసరమైన లైన్ల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించింది. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కారణాలతో ఒక లైన్లో లేదా సబ్ స్టేషన్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన లేదా నిలిపివేయాల్సిన ఆవశ్యకత ఏర్పడితే ఆయా లైన్ లేదా సబ్ స్టేషన్ పరిధిలోగల విద్యుత్ 33 కేవీ ఇంటర్ లింక్ లైన్ వ్యవస్థ ఒక 33/11కేవీ సబ్ స్టేషన్ నుంచి మరో 33/11 కేవీ సబ్ స్టేషన్‌కు, అదే విధంగా 33 కేవీ లైన్ నుంచి మరో 33 ౖకేవీ లైన్‌కు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా అందిస్తారు. దీంతో మరమ్మతులు చేసిన సమయంలో, మరే ఇతర కారణాల వల్ల ఒక లైన్లో విద్యుత్ సరఫరా చేస్తే ఆ ప్రాంత విద్యుత్ వినియోగదారులకు అంతరాయాలు లేకుండా ప్రత్యామ్నాయ విద్యుత్ లైన్ ద్వారా విద్యుత్ సరఫరా చేస్తారు. ఆరు ఇంటర్ లింకింగ్ లైన్ల నిర్మాణం పూర్తి.. వరంగల్ సర్కిల్ పరిధిలోని 33/11 కేవీ సబ్ స్టేషన్లు, 33 కేవీకి చెందిన 16 లైన్లలో ఇంటర్ లింకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 6 ఇంటర్ లింకింగ్ లైన్ల నిర్మాణం పూర్తి చేశారు. పది 33/11కేవీ సబ్ స్టేషన్లలో పనులు కొనసాగుతున్నాయి. హనుమకొండ సర్కిల్ పరిధిలోని డైబ్బె నాలుగు 33/11 కేవీ సబ్ స్టేషన్లో అయిదు 33 కేవీ లైన్లలో ఇంటర్ లింకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 72 సబ్ స్టేషన్లలో పనులు పూర్తయ్యాయి. మరో రెండు 33/11 కేవీ సబ్ స్టేషన్లలో పనులు కొనసాగుతున్నాయి. మూడు 33 కేవీ లైన్లులలో ప్రత్యామ్నాయ విద్యుత్ లైన్ల నిర్మాణం జరుగుతోంది. వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన కరెంట్ ప్రత్యామ్నాయ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసిన టీజీఎన్పీడీసీఎల్ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు .. వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన అంతరాయాలు లేని విద్యుత్ సరఫరాకు ప్రత్యేక కార్యాచరణ తో ముందుకెళ్తున్నాం. కొన్ని లైన్ల నిర్మాణానికి రైల్వే క్రాసింగ్‌ల వద్ద రైల్వే అధికారుల అనుమతి రావాల్సి ఉంది. ఈ మేరకు రైల్వే అధికారులను అనుమతి కోరాం. – పి.మధుసూదన్ రావు, ఎస్ఈ, హనుమకొండ వినియోగదారులకు నిరంతర విద్యుత్ వినియోగదారులకు నిరంతర విద్యుత్ అందించేందుకు అన్ని చర్యలు చేపట్టాం. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి ప్రత్యామ్నాయ లైన్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. వినియోగదారులకు అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. – కె.గౌతం రెడ్డి, ఎస్ఈ, వరంగల్ -
దౌర్జన్యంగా విద్యుత్ స్తంభాల ఏర్పాటు
మరిపెడ రూరల్: మామిడితోట మధ్యలో ఓ వ్యక్తి రాత్రికిరాత్రే దౌర్జన్యంగా విద్యుత్ స్తంభాలు, తీగలు ఏర్పాటు చేశాడు. ఇది తెలిసిన తోట యజమాని పు రుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్ప డ్డాడు. ఈ ఘటన మ రిపెడ మండలం రాంపురంలో ఇటీవల చోటు చేసుకోగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. బాధితుడి కుమారుడు రాజాకుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మాడుగుల ఉపేందర్‌కు ఐదున్న ర ఎకరాల్లో మామిడి తోట ఉంది. ఈ క్రమంలో తోట పక్కన గెట్టు ఉన్న అదే గ్రామానికి చెందిన చింతపల్లి మల్లయ్య మామిడితోట మధ్య నుంచి తన బోరు మోటారుకు విద్యుత్ కోసం ఈ నెల 19వ తేదీన అర్ధరాత్రి స్తంభాలు, తీగలు ఏర్పాటు చేశాడు. ఈ విషయం తెలిసి తోట వద్దకు వెళ్లిన ఉపేందర్ మనస్తాపానికి గురై అక్కడే గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు సూర్యాపేటలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా, చింతపల్లి మల్లయ్య .. విద్యుత్ అధికారుల అనుమతులు లేకుండా, తమకు తెలియకుండా మామిడి తోట మధ్య దౌర్జన్యంగా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశాడని ఉపేందర్ కుమారుడు రాజాకుమార్ తెలిపాడు. మా నాన్న ఉపేందర్ ఆత్మహత్యాయత్నానికి కారణమైన మల్లయ్యపై చర్యలు తీసుకుకోవాలని కోరాడు. మల్లయ్యపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నెల 19న తానే స్వయంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసులో ఎలాంటి పురోగతి లేదని ఆరోపించాడు. మనస్తాపంతో పురుగుల మందు తాగిన మామిడితోట యజమాని మండలంలోని రాంపురం గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి.. మరిపెడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టింపు కరువు -
డ్రైవర్ నిర్లక్ష్యానికి ఒకరి బలి..
● ట్రాలీ ఆటో ఢీకొని యువకుడు దుర్మరణం ● అయోధ్య క్రాస్ వద్ద ఘటన మహబూబాబాద్ రూరల్ : ఓ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. వాహనం నిర్లక్ష్యంగా నడుపుతున్న క్రమంలో వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఓ యువకుడు ఆ ఆటోను ఢీకొని దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఆదివారం మహబూబాబాద్ మండలం అయోధ్య క్రాస్ వద్ద చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై వి.దీపిక కథనం ప్రకారం.. మహబూబాబాద్ మండలం ముడుపుగల్కు చెందిన సుంద రవి (లేట్), రమ దంపతుల పెద్ద కుమారుడు అరుణ్ అలియాస్ టాకిల్ (20) జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఉదయం తన ద్విచక్రవాహనంపై ఆస్పత్రికి వస్తున్నాడు. అంతకంటే ముందు అయోధ్య గ్రామానికి చెందిన కన్నం విజయ్ తన టాటా ఏస్ ట్రాలీ ఆటోలో ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఆటో అయోధ్య క్రాస్ వద్దకు చేరుకోగానే ఇండికేటర్ వేయకుండా వాహనాన్ని అలాగే నడిపాడు. అంతలోనే ఆ వాహనం వెనకే వస్తున్న ద్విచక్రవాహనదారుడు అరుణ్ ఒక్కసారిగా ఆటోను వెనుక నుంచి ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అరుణ్ ద్విచక్ర వాహనంపైనుంచి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ పోలీసులు ఘటనా స్థలిని సందర్శించి ఆటోను అదుపులోకి తీసుకుని అరుణ్ మృతదేహాన్ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పోస్టుమార్టం గదికి తరలించారు. మృతుడి బాబాయ్ సంద రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై దీపిక తెలిపారు. ఇంటి నుంచి బయలుదేరిన పది నిమిషాల్లోనే.. అరుణ్ ఆస్పత్రికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన పది నిమిషాలలోపే ఆటోను ఢీకొని దుర్మరణం చెందాడు. దీనిపై గ్రామస్తులు బోరున విలపించారు. అరుణ్ అప్పటిదాకా తమ ముందే కనబడి అంతలోనే కానరానిలోకాలకు వెళ్లిపోవడంతో ముడుపుగల్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. రెండేళ్ల క్రితం తండ్రి రవి అనా రోగ్యంతో మృతిచెందగా కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న పెద్ద కుమారుడు అరుణ్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో తల్లి రమ రోదించిన తీరు అందరి హృదయాలను కలచివేసింది. -
చెత్త తీయట్లేదు..
మా బజారులో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని మున్సిపాలిటీ సిబ్బంది ట్రాక్టర్లలో తీసుకుపోవట్లేదు. ఇప్పటి వరకు మా బజారుకు ట్రాక్టర్ రాలేదు. మున్సిపాలిటీ అయ్యాక అసలు అధికారులు ఎవరో అర్థం కావడంలేదు. సైడ్కాల్వలను శుభ్రం చేయకపోవడంవల్ల దుర్వాసనతోపాటు, దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. రాత్రిళ్లు కంటిమీద కునుకులేకుండా పోతుంది. ఇప్పటికై నా చెత్తాచెదారాన్ని తీసుకెళ్లడంతో పాటు సైడ్ కాల్వలను శుభ్రపరచాలి. వీధి లైట్లు ఏర్పాటు చేయాలి. – మేకల వెంకన్న, కేసముద్రం విలేజ్ -
ప్రభుత్వ బడులను మూసివేయొద్దు
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ బడుల మూసివేత విధానాలను మానుకోవాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బలాష్టి రమేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. గురుకుల పాఠశాలల కారణంగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంటే.. కొత్త పేర్లతో మరిన్ని గురుకులాలను నెలకొల్పి ప్రభుత్వ బడులను పూర్తిగా మూసివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఒకవైపు ప్రైవేట్ స్కూల్స్ దాడి, మరోవైపు సొసైటీ గురుకులాల దాడిని తట్టుకొని విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో నమోదు చేసుకోవడానికి ఉపాధ్యాయులు కష్టపడుతుంటే.. వారి మీద ప్రభుత్వం బురద జల్లే పనులు చేస్తోందని ఆరోపించారు. టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పులిచింతల విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను మంజూరు చేయాడానికి పది శాతం ముడుపులు చెల్లించాల్సి వస్తుందన్నారు. సమావేశంలో రాష్ట్ర కౌన్సిలర్లు శ్రీశైలం, ఐలయ్య జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్, వెంకట్రాంనర్సయ్య, ఉపేందర్, సాయిబాబు, ఉపేందర్, రవీందర్, కిషన్, రవీందర్‌రెడ్డి, జనార్దన్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
బైక్‌పైనుంచి పడిన మహిళ..
● చికిత్స పొందుతూ మృతి చిట్యాల: ద్విచక్రవాహనంపై నుంచి పడిన ప్రమాదంలో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన జయశంకర్ భూ పాలపల్లి జిల్లా చిట్యాలలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన చింతకింది రాజమణి (57) పని నిమిత్తం బైక్‌పై ఈనెల 27న రేగొండ మండలం కాకర్లపల్లెకు వెళ్తోంది. ఈ క్రమంలో తిర్మలాపూర్‌లో పంది అడ్డు వచ్చింది. దీంతో కింద పడగా తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన స్థానిక సివిల్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఆదివారం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మారమ్గధ్యలో మృతి చెందింది. మృతురాలి కుమారుడు రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై శ్రావన్‌కుమార్ తెలిపారు. మృతురాలికి భర్త రవీందర్, కుమారుడు రామకృష్ణ ఉన్నారు. -
చి(చె)త్త శుద్ధి ఏది..
సోమవారం శ్రీ 30 శ్రీ జూన్ శ్రీ 2025– 8లోuసాక్షి, మహబూబాబాద్: వానాకాలం.. అధికంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. డెంగీ, చికెన్ గున్యా, టైపాయిడ్, మలేరియా, ఫైలేరియా వంటి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. కాగా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టడం, డ్రెయినేజీల్లో చెత్త సేకరించి, బ్లీచింగ్ చల్లడం వంటి చర్యల ద్వారా దోమల వృద్ధిని అరికట్టి, సీజనల్ వ్యాధుల తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుంది. అయితే జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి.. డ్రెయినేజీలు దుర్వాసనను వెదజల్లుతున్నాయి. దీంతో పలువురు సీజనల్ వ్యాధు ల బారినపడి ఆస్పత్రుల బాటపడుతున్నారు. ఆదివారం ‘సాక్షి’ పరిశీలనలో పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయి.‘ఈ ఫొటోలో కనిపిస్తున్నది మహబూబాబాద్ కొత్త బస్టాండ్ ఏరియా వివేకానంద విగ్రహానికి సమీపంలోని గోపాల్ రెడ్డి కాంప్లెక్స్ ప్రాంతంలో పేరుకుపోయిన చెత్త. ఈ ప్రాంతంలో నివాస గృహాల నుంచి రోజువారి చెత్త సేకరించడం లేదు. దీంతో ఇళ్లలోని చెత్తను అందరు ఒకేచోట పోస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో చెత్త కుప్ప తయారైంది. తడి, పొడి చెత్త కలిసి ఉండడంతో చెత్త కుళ్లిపోయి దుర్వాస వస్తోందని స్థానికులు చెబుతున్నారు.’న్యూస్‌రీల్ మూడు రోజులకోసారి సేకరణ పందులు, కుక్కలతో పరేషాన్ వానాకాలం వస్తే అంతా దుర్వాసన సిబ్బంది కొరత, మరమ్మతుల్లోవాహనాలు -
‘కొండా’కు దమ్ముంటే కొత్త పార్టీ పెట్టాలి
హన్మకొండ చౌరస్తా: గత ఎన్నికల్లో పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలను తామే గెలిపించామని పదేపదే చెబుతున్న కొండా మురళీకి దమ్ముంటే కొత్త పార్టీ పెట్టాలని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డితో స్టేషన్‌ఘన్‌పూర్ , వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్.నాగరాజు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణ, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్రెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ సమావేశం అయ్యారు. అనంతరం స్వర్ణ, నాగరాజు, వెంకట్రామ్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ సారయ్య మీడియాతో మాట్లాడారు. గత 38 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని బతికించామని చెబుతున్న కొండా మురళికి రాజకీయ జన్మనిచ్చింది తెలుగుదేశం పార్టీ అన్నారు. పార్టీలు మారలేదంటున్న కొండా కుటుంబం అన్నీ పార్టీలు మారారని.. కాంగ్రెస్ పార్టీకి చేసిన పని ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. షోకాజ్ నోటీసు ఇస్తే హైదరాబాద్‌కు వెళ్లిన మురళి తననెవరూ పిలవలేదంటూనే క్రమశిక్షణ కమిటీకి తప్పుడు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ నాడు ప్రాణభయంతో రామసహాయం సురేందర్‌రెడ్డి వద్దకు వెళ్లిన కొండా మురళికి డీజీపీతో చెప్పి గన్మెన్లను ఇప్పించి ప్రాణభిక్ష పెట్టారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి గురించి మురళి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని, ఎమ్మెల్యేలను కించపరిచేలా మాట్లాడడం సరికాదని హితవుపలికారు. జూలై 5 వరకు అధిష్టానం సమయం ఇచ్చిందని.. అప్పటి వరకు ఎదురుచూస్తామని అన్నారు. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ మా మీద కొండా మురళి సవారీ చేయడం సరికాదని, తన గెలుపునకు ఎలాంటి సహాయం చేయలేదన్నారు. కొందరి కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించి వేధించారని, అలాంటి పనులు చేయొద్దని కోరారు. ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, శ్రీహరి మాట్లాడుతూ.. వచ్చే నెల 4న ఏఐసీసీ చీఫ్ ఖర్గే రాక నేపథ్యంలో జనసమీకరణ అంశంతో పాటు, వరంగల్ జిల్లా అభివృద్ధి, నిధుల సమీకరణపై సీఎం రేవంత్‌రెడ్డితో సమీక్ష నిర్వహించేందుకు ఆయన అపాయింట్మెంట్పై సుదీర్ఘంగా చర్చించామని చెప్పారు. కొండా మురళి వ్యాఖ్యలు, క్రమశిక్షణ కమిటీకి అందించిన నివేదికపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అధిష్టానం ఇచ్చిన సమయంలో సరైన నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మురళికి సురేందర్‌రెడ్డి ప్రాణభిక్ష పెట్టాడు వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ -
పర్యాటకులకు ఇబ్బంది కలగొద్దు
●● ఎఫ్డీఓ ద్వాలియా వాజేడు: బొగత జలపాతం వద్ద పర్యాటకులకు ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలని వెంకటాపురం(కె) ఎఫ్డీఓ ద్వాలియా సిబ్బందిని కోరారు. శనివారం మండల పరిధిలోని చెరుకూరు వద్ద ప్లాంటేషన్‌లో చేపట్టిన పనులను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం బొగత జలపాతానికి వచ్చిన ద్వాలియా అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. జలపాతానికి వచ్చే పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలన్నారు. దుసపాటి లొద్ది, మాసన్ లొద్ది, గుడం జలపాతాలకు పర్యాటకులను వెళ్లకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఎఫ్ఎస్ఓ నారాయణ, సిబ్బంది ఉన్నారు. -
భర్త జ్ఞాపకాలతో..
మహబూబాబాద్ రూరల్: కట్టుకున్న భర్తను ప్రాణంగా భావించి ఆయన మృతి అనంతరం పాలరాతితో విగ్రహం చేయించి ఓ భార్య ఆయనకు గుడి కట్టించింది. మహబూబాబాద్ మండలం సోమ్లా తండా గ్రామానికి చెందిన బానోత్ కల్యాణి ఎంపీటీసీగా పనిచేసింది. హరిబాబుతో ఆమెకు 1996లో వివాహం కాగా.. 2021లో హరిబాబు అనా రోగ్యంతో మృతిచెందాడు. ఆయనతోపాటే తాను చనిపోదామని కల్యాణి ప్రయత్నించినా బంధువులు ధైర్యం చెప్పడంతో హరిబాబు జ్ఞాపకాలతో జీవిస్తోంది. ఈక్రమంలో రూ.5.30 లక్షలతో పండుగ వాతావరణంలో గతేడాది ఏప్రిల్ 23న గుడి ప్రారంభించింది. ప్రతీ శనివారం ఆయనకు పూజలు చేస్తోంది. -
ఎల్లప్పుడూ కళ్ల ముందే ఉండాలని..
డోర్నకల్: కంటికి రెప్పలా చూసుకునే భర్త, అమ్మా అమ్మా అంటూ రోజుకు వెయ్యిసార్లు పలకరించే కుమారుడు అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో దిక్కు తోచని స్థితికి చేరుకున్న ఓ మహిళ తన భర్త, కుమారుడిని విగ్రహాల రూపంలో చూసుకుంటూ వారి జ్ఞాపకాలను నెమరువేసుకుంటుంది. డోర్నకల్ మండలం దుబ్బతండాకు చెందిన అజ్మీర బాల్యా, భారతి దంపతులకు సాయికుమార్ ఏకై క కుమారుడు. భారతి దుబ్బతండా సర్పంచ్‌గా పని చేసి భర్త బాల్యా సహకారంతో గ్రామాభివృద్ధిలో తమ వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించింది. బాల్యా, భారతి వ్యవసాయం చేస్తుండగా కుమారుడు ఖమ్మంలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. జూన్ 5న కుమారుడు సాయికుమార్‌ను కళాశాలకు పంపేందుకు బాల్యా ద్విచక్రవాహనంపై ఖమ్మం బయల్దేరగా ఖమ్మంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొని బాల్యా, సాయికుమార్ మృతి చెందారు. వారిని మర్చిపోలేని భారతి.. బాల్యా, సాయికుమార్ విగ్రహాలను గ్రామ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసింది. జూన్ 15న వారి సంతాప సభలో బాల్యా సాయికుమార్ విగ్రహాలను ఆవిష్కరించారు. -
ఫైనాన్స్ వ్యాపారి దారుణ హత్య
● కాజీపేట రైల్వే క్వార్టర్స్‌లో ఘటన ● హత్యకు గల కారణాలపై పోలీసుల ఆరా ● పోలీసులకు లొంగిపోయిన నిందితుడు?కాజీపేట: ఓ ఫైనాన్స్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి కాజీపేట రైల్వే క్వార్టర్స్‌లో జరిగింది. మృతుడి భార్య మాధవి, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జేపీఎన్ రోడ్డుకు చెందిన త్రిపురాధి నవీన్‌కుమార్ (55) ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. కొంతకాలంగా కాజీపేటలోని చిరువ్యాపారులు, రైల్వే, ఎఫ్‌సీఐ, ప్రైవేట్ ఉద్యోగులకు వడ్డీలకు డబ్బులు ఇస్తున్నాడు. ఈ క్రమంలో రైల్వే ఈఎల్ఎస్ షెడ్లో పనిచేసే గడ్డం ప్రవీణ్‌కుమార్‌కు ఆరు నెలల క్రితం రూ.50 వేలు అప్పుగా ఇచ్చాడు. అప్పు తీసుకున్నప్పటి నుంచి ప్రవీణ్‌కుమార్ అసలుతోపాటు వడ్డీ కూడా చెల్లించకపోవడంతో మృతుడు కొద్దికాలంగా ప్రవీణ్‌కుమార్‌పై ఒత్తిడి పెంచడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరిగాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి నవీన్‌కుమార్ రైల్వే క్వార్టర్స్‌కు వెళ్లి నిందితుడు ప్రవీణ్ కుమార్‌ను నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వా దం పెరిగింది. ఆ తర్వాత గొడవ సద్దుమణగడంతో ఇద్దరు కలిసి మద్యం సేవించారు. అయితే డబ్బుల విషయంలో జరిగిన గొడవను మనసులో పెట్టుకున్న ప్రవీణ్‌కుమార్.. కూరగాయలు కొసే కత్తితో విచక్షణారహితంగా పొడవడంతో నవీన్‌కుమార్ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. అనంతరం నిందితుడు నేరుగా కాజీపేట పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. హత్య కేసులో విభిన్న వాదనలు .. ఫైనాన్స్ వ్యాపారి నవీన్‌కుమార్ హత్యపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అప్పులు ఇచ్చిన తర్వాత అధిక మొత్తంలో వడ్డీలు వసూలు చేయడం, చెక్ బౌన్స్ కేసులు నమోదు చేయించడం, ఇళ్లు, స్థలాలు రాయించుకోవడం వంటి పనులు చేస్తుండేవాడనే ఆరోపనలు వినిపిస్తున్నాయి. కాగా, నవీన్‌కుమార్‌ను నిందితుడు ప్రవీణ్‌కుమార్ మధ్యాహ్నమే రైల్వే క్వార్టర్లో చంపి మృతదేహాన్ని బయటపడేయడం కోసం ప్రయత్నించగా ఆటో డ్రైవర్లు ఎవరూ సహకరించకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో పోలీసులకు నిందితుడు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కాగా, ఫైనాన్స్ వ్యాపారి నవీన్‌కుమార్ హత్య సమాచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఘటనా స్థలికి పోలీసు అధికారులు.. కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్ రెడ్డి, ఇన్చార్జ్ సీ ఐ పుల్యాల కిషన్‌తో పాటు టాస్క్‌ఫోర్స్, క్రైమ్ సిబ్బంది, క్లూస్ టీం బృందం ఘటనాస్థలిని సందర్శించి ఆధారాలు సేకరించారు. నవీన్‌కుమార్ హ త్య వెనుక నిందితుడితో పాటు ఇంకా ఎవరైనా ఉ న్నారా? లేక ఒక్కడే హత్య చేసి ఉంటాడా అనే కో ణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కా జీపేట చౌరస్తా నుంచి రైల్వే క్వార్టర్స్‌కు వెళ్లే రహదారుల్లో ఉన్న సీసీ కెమెరాలను జల్లెడ పడుతు న్నారు. మృతుడి భార్య త్రిపురాధి మాధవి ఫిర్యా దు మేర కు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు. కాగా, తన భర్త ఒంటిపైనుంచి రూ. 6 లక్షల విలువైన బంగా రు ఆభరణాలు నిందితుడు ప్రవీణ్‌కుమార్ తీసుకున్నాడని మృతుడి భార్య మాధవి ఆరోపించింది. -
ఆదివారం శ్రీ 29 శ్రీ జూన్ శ్రీ 2025
ఐనవోలు: మండల కేంద్రానికి చెందిన వడిచర్ల శ్రీనివాస్–అనురాధ దంపతుల కుమారుడు కమల్‌హాసన్, కూతురు శివాని. శ్రీనివాస్ టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. సమాజ సేవంటే ఇష్టపడే శ్రీనివాస్ ఎంపీటీసీగా పని చేశారు. గతేడాది జనవరి 22న అనారోగ్య కారణాలతో ఆయన మృతి చెందాడు. నాన్న నిర్ణయం మేరకు డిగ్రీ తర్వాత కమల్ హాసన్ లండన్‌కు వెళ్లారు. తండ్రి చనిపోయిన తర్వాత ఆయన కోరిక మేరకు చెల్లి పెళ్లి జరిపించాడు. ఆ పెళ్లిలో అతడి తండ్రి ఫైబర్ విగ్రహాన్ని తయారు చేయించి నాన్నతో తనకున్న ఎమోషన్‌ను అందరికి చూపించాడు. ఈసారి లండన్ నుంచి ఇండియాకు వచ్చినపుడు ఆ ఫైబర్ విగ్రహాన్ని మండల కేంద్రంలో ఏర్పాటు చేయించనున్నట్లు కమలహాసన్ తెలిపారు.న్యూస్రీల్పెళ్లిలో విగ్రహం ఓ ఎమోషన్ -
బీసీలపై రాజకీయ పార్టీల చిన్నచూపు
కాజీపేట రూరల్ : బీసీలను అన్ని రాజకీయ పార్టీలు చిన్న చూపు చూస్తున్నాయని, జనాభా దామాషా ప్రకారం బీసీలకు వాటా ఇచ్చే వరకూ అవిశ్రాంత పోరాటం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కాజీపేట ఫాతిమానగర్ వైష్ణవిగ్రాండ్ హోటల్లో శనివారం బీసీ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్‌గౌడ్ అధ్యక్షతన ‘స్థానిక సంస్థల ఎన్నికలు–బీసీల రిజర్వేషన్ల పెంపు’ అనే అంశం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. నెల రోజుల్లో రిజర్వేషన్లు నిర్ణయించి ఎన్నికల సంఘానికి నివేదించాలని హైకోర్టు ఆదేశించిన ప్రభుత్వం ఇంకా చర్యలు చేపట్టడం లేదన్నారు. బీజేపీ నాయకులు గల్లీలో ఒక మాట, ఢిల్లీలో మరోమాటతో బీసీలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ బీసీల వ్యతిరేక పార్టీ అని, కాంగ్రెస్, బీజేపీ మాత్రమే రిజర్వేషన్లు తేల్చాలని డిమాండ్ చేశారు. 48 గంటల్లోగా సీఎం రేవంత్‌రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి రిజర్వేషన్ల అంశంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని డైవర్ట్ చేయడానికి ఎమ్మెల్సీ కవిత బీసీ నినాదం ఎత్తుకున్నారని ధ్వజమెత్తారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్పించి 42 శాతం బీసీ బిల్లు ఆమోదింపజేయాలని, లేనిపక్షంలో తెలంగాణలో బీజేపీని మట్టి కరిపిస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాడి మల్లయ్యయాదవ్, బీసీ సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు డాక్టర్ చిర్ర రాజు, తమ్మేలా శోభారాణి, మాదం పద్మజాదేవి, కాసగాని అశోక్‌గౌడ్, డాక్టర్ సంగాని మల్లేశ్వర్, మేముల మహేందర్, వల్లాల జగన్‌గౌడ్, పంజాల మధు, తెల్ల కిశోర్, తెల్ల సుగుణ, బూర్గుల ప్రమాద, బాబుయాదవ్ పాల్గొన్నారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే ఎన్నికలకు పోవాలి బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ -
ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి
మహబూబాబాద్ రూరల్: క్షణికావేశంలో చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. మహబూబాబాద్ జైలు లో ఉన్న ఖైదీలకు అందుతున్న వసతులు, సౌకర్యాలపై ఆయన శనివారం సందర్శించి ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి జైలులో ఉన్న వివిధ బ్యారక్ లను తిరిగి ఖైదీలతో మాట్లాడారు. వారికి అందుతున్న నీరు,ఆహారం, పరిశుభ్రత, వైద్య సౌకర్యాల గురించి సబ్ జైల్ సూపరిండెంటెంట్ మల్లెల శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా అబ్దుల్ రఫీ మాట్లాడుతూ ఖైదీలకు భవిష్యత్‌లో ఇదే చివరి జైలు జీవితం కావాలని, ఉచిత న్యాయ సహాయం, లోక్ అదాలత్, శిక్ష తగ్గింపు (ప్లీ బార్గేయినింగ్) మొదలైన వాటి గురించి ఖైదీలకు వివరించారు. జైలు జీవితాన్ని తమ భవిష్యత్‌కు సోపానంగా మార్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జైల్ సూపరిండెంటెంట్ శ్రీనివాసరావు, భిక్షపతి డిప్యూటీ జైలర్ సదా నిరంజన్, అదనపు డిప్యూటీ జైలర్ ఖాజా ఖలీలుద్దీన్, హెడ్ వార్డర్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ -
కొమ్మకొమ్మకో గూడు..!
పక్షుల ఆవాసమైన గూళ్లు అందంగా.. ఆకర్షనీయంగా ఉంటాయి. ప్రస్తుతం వాతావరణ కాలుష్యంతో పలు పక్షి జాతులు అంతరించిపోయాయి. ఎక్కడో ఒకచోట మాత్రమే పక్షులు తమ జీవనాన్ని సాగిస్తున్నాయి. ఈక్రమంలో వాటికి అవసరమైన ఆవాసాలను అవే నిర్మించుకోవడం మనకు తెలిసిందే.. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ సమీపంలోని ఓ బావి వద్ద ఉన్న చెట్లుపై పక్షుల గూళ్లు.. ప్రతి కొమ్మకూ ఉన్నాయా.. అన్నట్లుగా కన్పిస్తూ ఆకట్టుకుంటున్నాయి.. – నెహ్రూసెంటర్ -
సమ్మక్క సాగర్‌కు జలకళ..
కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామం వద్ద గోదావరిపై నిర్మించిన సమ్మక్క సాగర్ జలకళ సంతరించుకుంది. కొన్ని రోజుల నుంచి బ్యారేజీలో నీరులేక పోవడంతో బోసిపోయిన గోదావరి.. వారం రోజుల నుంచి ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు భారీగా నీరు చేరడంతో గోదావరి నిండుగా ప్రవహిస్తోంది. దీంతో బ్యారేజీలోకి ఎగువ నుంచి 21,500 క్యూసెక్కుల నీరు చేరడంతో అధికారులు బ్యారేజీ వద్ద 59 గేట్లలో మూడు గేట్లు ఎత్తి 27,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. బ్యారేజీ సామర్థ్యం 6.94 టీఎంసీలకు గాను ప్రస్తుతం 3.81టీఎంసీల నీరు ఉంది. బ్యారేజీ నీటి మట్టం 83 మీటర్లకు గాను 79.50 మీటర్ల నీటి మట్టం కొనసాగుతోంది. కాగా, దేవాదుల వద్ద ఉన్న చొక్కారావు ఎత్తిపోతల నుంచి రెండు మోటార్ల ద్వారా 494 క్యూసెక్కుల నీరు ఎత్తిపోస్తున్నట్లు డీఈ శరత్ బాబు తెలిపారు. ఎగువ నుంచి బ్యారేజీలోకి 21,500 క్యూసెక్కుల నీరు చేరిక మూడు గేట్లు ఎత్తి 27,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల -
పక్కా వంద సీట్లు.. సర్వేలన్నీ మనవైపే
హసన్‌పర్తి: వచ్చే ఎన్నికల్లో పక్కాగా వంద అసెంబ్లీ స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బీఆర్ఎస్ వర్ధన్నపేట నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నగరంలోని నాని గార్డెన్లో శనివారం జరిగింది. సమావేశానికి మాజీ మంత్రి దయాకర్‌రావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సర్వేలన్నీ గులాబీ వైపు చూపుతున్నాయని తెలిపారు. గత ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతులకు కనీసం సాగు నీరు అందించకుండా వారి కళ్లల్లో కన్నీళ్లు నిలిపిందన్నారు. నాట్లకి..నాట్లకి రైతుబంధు కేసీఆర్ వేస్తే.. రేవంత్ మాత్రం ఓట్లకు ఓట్లకు రైతు భరోసా వేస్తున్నాడని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి ఓ అబద్దాల కోరుగా అభివర్ణించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపునకు పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేశ్‌రెడ్డి, మొట్టు శ్రీనివాస్, కార్పొరేటర్లు ఇండ్ల నాగేశ్వర్రావు, రాధికారెడ్డి, నాయకులు శ్రీధర్, అటికం రవీందర్, చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి, మార్గం భిక్షపతి, అప్పారావు, బండి రజనీకుమార్, తూర్ల కుమారస్వామి, కందుకూరి చంద్రమోహన్, పాడి మల్లారెడ్డి, నద్దునూరి నాగరాజు, జోరుక రమేశ్ పాల్గొన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు -
ఆర్టీసీ ప్రత్యేక టూర్ బస్సు ప్రారంభం
నెహ్రూసెంటర్: టీజీఎస్ఆర్టీసీ ప్రవేశపెట్టిన ప్రత్యేక టూర్ ప్యాకేజీలో భాగంగా మహబూబాబాద్ డిపో నుంచి మొదటి యాత్ర ప్రత్యేక బస్సులను శుక్రవారం రాత్రి 11 గంటలకు డిపో మేనేజర్ ఎం.శివప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 40 సీట్ల డీలక్స్ బస్సు మహబూబాబాద్ నుంచి శ్రీశైలం బయల్దేరిందని తెలిపారు. జూలై 6వ తేదీన పంచరామాలు (అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట)కు యాత్ర బస్సు ఉందని, ఒక్కొక్కరికి రూ.1,700 చార్జీలు చెల్లించి బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ప్రజలు, యాత్రికులు ఆర్టీసీ యాత్ర ప్యాకేజీలను వినియోగించుకోవాలని తెలిపారు. బస్సుల బుకింగ్, యాత్ర సంబంధిత వివరాలకు నబి ఫోన్ నంబర్ 99482 14022 ద్వారా సంప్రదించాలని సూచించారు. దరఖాస్తుల ఆహ్వానంమహబూబాబాద్ అర్బన్: జిల్లాలో 2024–25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల, కళాశాలలో చదువుతున్న పోస్ట్‌మెట్రిక్, ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి నరసింహస్వామి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి నుంచి ఫీజీ వరకు చదువుతున్న విద్యార్థులు WWW.telaganaepass.cgg.gov.in వెబ్సైట్లో ఈ నెల 30 వరకు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. పూర్తి వివరాలకు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. బాలసదన్ సందర్శనమహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని బాలసదన్ (బాలికల)ను శనివారం సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ శాలిని షాకెల్లి సందర్శించారు. బాలసదన్‌లోని వంట గది ఇతర గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లలు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. సిబ్బంది అందుబాలో ఉండాలని ఆదేశించారు. అభివృద్ధికి సహకరించాలి● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ మహబూబాబాద్: అభివృద్ధి పనులకు ప్రజలు అన్నివిధాలా సహకరించాలని ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ అన్నారు. మానుకోట మున్సిపల్ పరిధిలోని అస్తినాపురం కాలనీ, గోపాలపురం కాలనీలను శనివారం ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా మురళీనాయక్ మాట్లాడుతూ.. 11వ వార్డుకు రూ.50 లక్షలు వెచ్చించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. కుల్లా, నిత్యక్లిన్నాక్రమాల్లో శ్రీభద్రకాళి హన్మకొండ కల్చ రల్: శ్రీభద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా మూడవరోజు శనివారం అమ్మవారిని కుల్లాక్రమంలో, నిత్యక్లిన్నాక్రమంలో పూజలు నిర్వహించారు. ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయంనుంచి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం, చతుఃస్థానార్చన నిర్వహించారు. అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరానికి కుల్లాగా పూజలు నిర్వహించి, వారాహి అమ్మవారిగా అలంకరించారు. షోడశీక్రమాన్ని అనుసరించి స్నపనమందిరంలోని భోగభేరాన్ని నిత్యక్లిన్నాగా అలంకరించి పూజలు జరిపారు. ఈఓ శేషుభారతి పర్యవేక్షించారు. -
కుమారులు దూరమై.. విగ్రహాల్లో కొలువై
కొడకండ్ల: అల్లారుముద్దుగా పెంచుకున్న ఇద్దరు కుమారులు రోడ్డు ప్రమాదంలో దూరమయ్యారు. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని వారి జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ ఆ తల్లిదండ్రులు కాలం వెళ్లదీస్తున్నారు. ప్రాణం పోయిన వారి కుమారులకు విగ్రహాల రూపంలో ప్రాణం పోసి కళ్లారా చూస్తున్నారు. కొడకండ్ల మండలం రామవరం గ్రామానికి చెందిన మేటి రాములు–రాజేశ్వరి దంపతులకు ముగ్గురు కుమారులు. వ్యవసాయమే జీవనాధారమైన వారు కుమారులను చిన్నప్పటి నుంచి ప్రైవేట్ పాఠశాలల్లోనే చదివించారు. తల్లిదండ్రుల శ్రమను గుర్తించిన వారు ప్రయోజకులయ్యారు. పెద్దకుమారుడు అరవింద్, రెండో కుమారుడు శ్రవణ్ సాప్ట్వేర్ ఇంజనీర్లుగా హైదరాబాద్‌లో మూడో కుమారుడు శ్రవణ్ వరంగల్ ఎంజీఎంలో హౌస్ సర్జన్‌గా పనిచేసేవారు. గత సంవత్సరం మే 19న శివ హైదరాబాద్‌లోని అన్న శ్రవణ్ వద్దకు వెళ్లాడు. భోజనం తెచ్చుకునేందుకు బయటికి వెళ్లిన ఇద్దరు సోదరులను స్కార్పియో కారు ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. కుమారులను గుర్తు చేసుకుంటూ తమ వ్యవసాయ భూమిలో గదిని నిర్మించి శ్రవణ్, శివ విగ్రహాలను ఏర్పాటు చేయించారు. మే 19న ప్రథమ వర్ధంతి సందర్భంగా తల్లిదండ్రులు ఆవిష్కరించుకున్నారు. -
విద్యార్థుల చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
మహబూబాబాద్: పాఠశాలలో విద్యార్థుల చదువుపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో విద్యా తదితర విషయాలపై కలెక్టర్ శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ మాట్లాడుతూ.. వినూత్న పద్ధతులతో విద్యాబోధన చేయాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధవహించాలన్నారు. ఎంఈఓ ప్రతి రోజు కనీసం ఒక పాఠశాలనైనా సందర్శించాలని తెలిపారు. టైంటేబుల్ ప్రకారం సెలబస్ పూర్తి చే యాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించాలని తెలిపారు. జిల్లాలో వయోజన విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టి గ్రామీణాభివృద్ధి శాఖ సమన్వయంతో అక్షరాస్యత పెంచాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల అడ్మిషన్లు పెంచాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, డీఈఓ రవీందర్‌రెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మదార్, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య కురవి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీహైస్కూల్, పీహెచ్‌సీని శనివారం ఆయన సందర్శించారు. జెడ్పీ హైస్కూల్లోని తరగతులను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థుల నైపుణ్యాలను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారం అందిస్తున్నట్లు వివరించారు. సీజనల్ వ్యాధులపై వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. రికార్డులను మెయింటెన్స్ చేయాలన్నారు. మాతా శిశుమరణాలు, సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కార్యక్రంమలో డాక్టర్ విరాజిత, హైస్కూల్ హెచ్ంఎం వాహిద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ -
రైల్వేస్టేషన్లో దొంగ అరెస్ట్
● రూ. 2.86 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన వరంగల్ జీఆర్పీ సీఐ సురేందర్ రామన్నపేట : వరంగల్ రైల్వేస్టేషన్లో ఓ దొంగను అదుపులోకి తీసుకుని అతడి నుంచి రూ. 2,86,645 విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ జీఆర్పీ సీఐ సురేందర్ తెలిపారు. జీఆర్పీ సీఐ కథనం ప్రకారం.. శనివారం ఉదయం 9 గంటల సమయంలో నాలుగో ఫ్లాట్‌ఫామ్ వద్ద చింతల్ వైపున తనిఖీలు చేస్తుండగా మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం బంగ్లా తండాకు చెందిన ఇస్లావత్ సురేశ్ అనుమానాస్పదంగా సంచరిస్తూ కనిపించాడు. దీంతో అతడిని తనిఖీ చేయగా 28.645 గ్రాముల బంగారం చైన్, రెండు పుస్తెలు, 3 జతల చెవి కమ్మలు లభ్యమయ్యాయి. నిందితుడు ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌లో బంగారం చోరీ చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. దీంతో అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తునట్లు జీఆర్పీ సీఐ తెలిపారు. కాగా, నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బంది రాము, రియాజుద్దీన్, నాగరాజు, రామకృష్ణ, రమేశ్. మనోజ్‌కుమార్‌ను జీఆర్పీ సీఐ అభినందించారు. -
సమన్వయంతో సీజనల్ వ్యాధుల నియంత్రణ
హన్మకొండ: జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు సంబంధిత ప్రభుత్వ విభాగాలతో సమన్వయంతో పని చేస్తూ సీజనల్ వ్యాధుల నియంత్రణకు కృషి చేయాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఎస్.సంగీత సత్యనారాయణ సూచించారు. శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులతో సీజనల్ వ్యాధులు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ముందుగా జిల్లాల వారీగా నమోదవుతున్న మలేరియా, డెంగీ, ఇతర వ్యాధుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అ నంతరం ఆమె మాట్లాడుతూ వరంగల్ జిల్లా వైద్యారోగ శాఖాధికారి, సంబంధిత అధికారులు ఎంజీఎంలో నమోదవుతున్న మలేరియా, డెంగీ పాజి టివ్ కేసుల వివరాలను డీఎంహెచ్ఓలకు అందించాలన్నారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో హెచ్ఎంలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి సీజనల్ వ్యా ధులు, ముఖ్యంగా చేతుల శుభ్రత, ఓఆర్ఎస్ ద్రావ ణం తయారీ విధానం, జ్వరాలు, డయేరియాకు సంబంధించిన ప్రమాదకర లక్షణాల గురించి అవగాహన కల్పించాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ కార్యక్రమాల గురించి ప్రచారం చేయాలన్నారు. ప్రతీ మంగళవారం ఎంపిక చేసిన ఆరోగ్య కేంద్రాలలో నిర్వహించే ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా నిర్వహించాలని, ఆశలు, ఏఎన్ఎంలకు అవసరమైన సూచనలు చేయాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బాలికల లింగ నిష్పత్తి చాలా తక్కువ ఉందని, ఈ దిశగా డీఎంహెచ్ఓలు బాధ్యతగా తగిన చర్యలు చేపట్టాలని, లింగ నిర్ధారణ పరీక్షలపై నిఘా పెంచాలన్నారు. లింగ వివక్షతపై అవగాహన కల్పించాలన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా ఎక్స్‌రే పరీక్షలు అవసరం వారికి ఆర్.బి.ఎస్.కె వాహనం ద్వారా అందుబాటులో ఉన్న సెంటర్లకు తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించాలన్నారు. మేనరికపు వివాహాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. హనుమకొండ, వరంగల్, ములుగు, జనగామ, మహబూబాబాద్ జిల్లాల డీఎంహెచ్ఓలు ఎ.అప్ప య్య, బి.సాంబశివరావు, గోపాల్ రావు, మల్లికార్జు న్, రవి రాథోడ్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రోగ్రాం అధికారి శ్రీదేవి పాల్గొన్నారు. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఎస్.సంగీత సత్యనారాయణ -
బడికిపోయినా బతికేటోడు..
నెల్లికుదురు : పాపం చిన్నారి.. బడికి పోయినా బతికేటోడు. వ్యవసాయ బావి దగ్గరికి వెళ్దాం ఈ రోజు పాఠశాలకు వెళ్లకండి అని తండ్రి చెప్పడంతో ముగ్గురు చిన్నారులు ఎగిరి గంతేశారు. తల్లిదండ్రితోపాటు ట్రాక్టర్లో వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. అక్కడ తండ్రి వ్యవసాయ భూమి దున్నుతుండగా సరదాగా ముగ్గురు చిన్నారులు ట్రాక్టర్‌పై ఎక్కారు. ఇందులో ఓ చిన్నారి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ రోటోవేటర్ కిందపడి దుర్మరణం చెందాడు. దీంతో బడికి పోయినా బతికిటోడివి బిడ్డో అంటూ తల్లిదండ్రులు తమ కుమారుడి మృతదేహం మీద పడి గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటన శనివారం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రాజులకొత్తపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఇన్చార్జ్ ఎస్సై శివరామకృష్ణ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జిలుకర ప్రసాద్, స్వర్ణ దంపతులకు కూతురు సౌమ్య, ఇద్దరు కుమారులు సందీప్, వరుణ్(07) ఉన్నారు. ఈ క్రమంలో ముగ్గురు పిల్లలు, భార్యను ట్రాక్టర్‌పై ఎక్కించుకున్న ప్రసాద్.. తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లాడు. అక్కడ ట్రాక్టర్‌పై నుంచి స్వర్ణ దిగింది. పిల్లలు వరుణ్, సౌమ్య, సందీప్ ట్రాక్టర్‌పై కూర్చోపెట్టుకుని తండ్రి వ్యవసాయ భూమి దున్నుతుండగా పిల్లలు కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా వరుణ్ ట్రాక్టర్ పైనుంచి జారి దున్నుతున్న రోటో వేటర్ కింద పడ్డాడు. దీంతో నాన్న.. తమ్ముడు పడిపోయాడు అని మిగతా ఇద్దరు పిల్లలు అరుస్తుండగా ట్రాక్టర్ నిలిపి తండ్రి వెళ్లి చూడగా అప్పటికే వరుణ్ దుర్మరణం చెందాడు. రోటోవేటర్ కింద పడి ఆ చిన్నారి మృతదేహం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదం తమ కళ్లెదుటే జరుగడంతో ఆ కుటుంబం మొత్తం గుండెలవిసేలా రోదించింది. ఈ ఘటనపై బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్చార్జ్ ఎస్సై శివరామకృష్ణ తెలిపారు. కాగా, వరుణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టర్ రోటోవేటర్ కిందపడి బాలుడి దుర్మరణం రాజులకొత్తపల్లిలో ఘటన మిన్నంటిన కుటుంబీకుల రోదనలు -
వినోదానికి వస్తూ విషాదం..
మరిపెడ రూరల్: సినిమా చూడడానికి ముగ్గురు మిత్రులు ఒకే బైక్‌పై వస్తున్నారు. ఈ క్రమంలో గేదెలను తప్పించపోయి బైక్ అదుపు తప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గిరిపురం క్రాస్ సమీపంలోని పత్తి మిల్లు వద్ద శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం బిక్కుమల్ల గ్రామానికి చెందిన గజేంత్రి గణేశ్ (23), కుక్కల గణేశ్, బాల్ని గణేశ్ స్నేహితులు. సినిమా చూడడానికి ముగ్గురు ఒకే బైక్‌పై మరిపెడ మండల కేంద్రానికి వస్తున్నారు. ఈ క్రమంలో మండలంలోని గిరిపురం క్రాస్ సమీపంలోని పత్తి మిల్లు వద్ద గేదెల మంద ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చింది. వాటిని తప్పించబోయి బైక్ అదుపు తప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న గజేంత్రి గణేశ్‌తోపాటు మిగతా ఇద్దరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తరలిస్తుండగా గజేంత్రి గణేశ్ మార్గమధ్యలో మృతి చెందాడు. మిగతా ఇద్దరు చికిత్స పొందుతున్నారు. మృతుడి తల్లి సుశీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గేదెలను తప్పించబోయి అదుపు తప్పిన బైక్.. ఓ యువకుడు మృతి.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు మరిపెడ మండలం గిరిపురం క్రాస్ సమీపంలో ఘటన సూర్యాపేట జిల్లా బిక్కుమళ్ల గ్రామస్తులుగా గుర్తింపు -
జీపీలకు భవనాలేవి..?
మహబూబాబాద్: జిల్లాలోని సగానికి పైగా గ్రామపంచాయతీ కార్యాలయాలకు సొంత భవనాలు లేవు. కేవలం 175 జీపీలకు శాశ్వత భవనాలు ఉండగా 307 కార్యాలయాలకు పక్కా భవనాలు లేక ప్రభుత్వ పాఠశాల భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, ఇతర భవనాల్లో కొనసాగుతోన్నాయి. మరికొన్ని మాత్రం అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఆయా భవనాల్లో కనీస సౌకార్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సిబ్బంది ఆవేవన వ్యక్తం చేస్తున్నారు. 482 గ్రామపంచాయతీలు జిల్లాలో 18 మండలాలు.. 482 గ్రామపంచాయతీలు ఉండగా 6,35,872 మంది జనాభా, 5,61,960 ఓటర్లు ఉన్నారు. 1,69,556 గృహాలు ఉన్నాయి. కాగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు 24 మంది సీనియర్ పంచాయతీ కార్యదర్శులు 401 అవుట్ సోర్సింగ్ 12 మొత్తం 437 మంది పని చేస్తున్నారు. 45 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. 1,805 మంది గ్రామపంచాయతీ కార్మికులు పని చేస్తున్నారు. సొంత భవనాలు లేనివి 307 కార్యాలయాలు 482 జీపీలకు గాను 175 గ్రామపంచాయతీల కార్యాలయాలకు సొంత భవనాలు ఉన్నాయి. 307 జీపీల కార్యాలయాలకు సొంత భవనాలు లేవు. దీంతో చాలా వరకు ప్రభుత్వ పాఠశాలలో తక్కువ సంఖ్యలో అంగన్వాడీ కేంద్రాల్లో భవనాల్లో నిర్వహిస్తున్నారు. కొన్ని మాత్రమే అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాటి అద్దె ఆయా జీపీల నిధుల నుంచే చెల్లించాలి. ప్రత్యేక బడ్జెట్ ఏమీ ఉండదని అధికారులు పేర్కొన్నారు. నిర్మాణ దశలో 255 భవనాలు ఆర్జీఎస్కే కింద జిల్లాకు 10 జీపీ కార్యాలయాల భవనాలు, ఎస్టీ కాంపోనెంట్ నిధులతో 103 కార్యాలయాల భవనాలు, ఎన్ఆర్ఈజీఎస్లో 152 కార్యాలయాల భవనాలు మంజూరయ్యాయి. కాగా, కేవలం 10 మాత్రమే పూర్తి కాగా 255 భవనాలు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. వాటి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొన్ని మధ్యలోనే నిలిపివేశారు. సంబంధిత అధికారులు దృష్టి సారిస్తేనే పనులు పూర్తి అవుతాయి. 175 జీపీలకు సొంత భవనాలు ఉండగా 10 పూర్తిగా కాగా మిగిలిన 255 పూర్తి అయితే మరో 42 జీపీలకు భవనాలు నిర్మించాల్సి ఉంటుంది. పెండింగ్‌లోనే వేతనాలు.. 1,805 మంది జీపీ కార్మికులు ఉండగా వారి వేతనాలు మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి. వారికి నెలకు రూ.9,500 జీతం ఉండగా ప్రతి నెలా రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు విడుదల చేయించాలని ఇటీవల కార్మికులు అధికారులకు వినతి పత్రం అందచేశారు. అద్దె సమస్య లేదు 175 కార్యాలయాలు సొంత భవనాల్లో ఉండగా మిగిలినవి చాలా వరకు అద్దె లేకుండా ఉన్న భవనాల్లో నిర్వహిస్తున్నాం. కొన్ని మాత్రమే అద్దె భవనాల్లో ఉన్నాయి. జీపీ నుంచే చెల్లిస్తున్నారు. ఆ సమస్య ఏమీ లేదు. నూతన భవనాల నిర్మాణ పనులు వేగవంతం చేశాం. అవి పూర్తయితే చాలా వరకు సమస్య తీరుతుంది. – హరిప్రసాద్, డీపీఓ జిల్లాలో 482 గ్రామపంచాయతీలు 175 జీపీలకు మాత్రమే సొంత భవనాలు నిర్మాణ దశలో 265.. -
ఒంటరివాడినయ్యాననే మనస్తాపంతో..
● యువకుడి ఆత్మహత్యాయత్నం ● చికిత్స పొందుతూ మృతి గార్ల: ఒంటరి వాడినయ్యాననే మనస్తాపంతో జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన గార్ల మండల కేంద్రంలోని కొలిమికొట్టం బజారులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొలిమికొట్టం బజారుకు చెందిన రుద్ర ప్రశాంత్ (22) చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. అమ్మమ్మ ఉపేంద్రమ్మ వద్ద పెరిగి ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. గతేడాది అమ్మమ్మ కూడా చనిపోవడంతో హైదరాబాద్‌లో పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈనెల 15న అమ్మమ్మ సంవత్సరీకం సందర్భంగా గార్ల వచ్చాడు. బంధువులతో కలిసి కార్యక్రమం పూర్తి చేశాడు. బంధువులందరూ వెళ్లిపోయాక ఒంటరిగా ఉన్నాడు. అమ్మ, నాన్న, అమ్మమ్మ చనిపోయారని, దీంతో ఒంటరిగా ఉంటున్నానని మనస్తాపం చెంది ఈనెల 18న పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్థానికులు గమనించి వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి అన్న జశ్వంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై రవీందర్ తెలిపారు. డోర్నకల్‌లో విషాదం ● కర్ణాటకలో గ్రామ యువకుడి అనుమానాస్పద మృతి డోర్నకల్: డోర్నకల్‌లో విషాదం నెలకొంది. స్థానిక బంకట్సింగ్తండాకు చెందిన ఓ యువకుడు కర్ణాటకలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. తండాకు చెందిన ఆర్పీఎఫ్ ఎస్సై జాటోత్ సామ్యేల్ దేవరాజ్ కుమారుడు రాజ్‌కుమార్(26) కర్ణాటకలోని బెల్గావి జిల్లా కాగర్వాట్లోని సెంట్రల్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తూ బెల్గావిలో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 26న ఉదయం తన గదిలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని మార్చురీలో భద్రపర్చి కుటుంబ సభ్యులకు సమాచారం తెలిపారు. కుటుంబ సభ్యులు శనివారం రాజ్‌కుమార్ మృతదేహాన్ని డోర్నకల్‌కు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఉన్నత ఉద్యోగం చేస్తూ అందరితో కలిసి ఉండే రాజ్‌కుమార్ మృతితో స్థానికంగా విషాదం అలుముకుంది. -
టీజీ ఎన్పీడీసీఎల్లో బదిలీలు
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్లో బదిలీలు, సర్దుబాట్లు జరిగాయి. ఈ మేరకు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఫైనాన్స్ సీజీఎం వంటేరు తిరుపతి రెడ్డి డైరెక్టర్‌గా నియామకం కావడంతో ఖాళీ అయిన స్థానంలో సీజీఆర్ఎఫ్ వరంగల్ ఫైనాన్స్ మెంబర్‌గా కొనసాగుతున్న ఆర్.చరణ్‌దాస్‌ను పూర్తి స్థాయి అదనపు బాధ్యతలతో నియమించారు. సిరిసిల్ల సెస్‌కు ఫారిన్ డిప్యుటేషన్‌పై వెళ్లిన పి.విజేందర్ రెడ్డి అక్కడి నుంచి సెలవుపై వెళ్లి తిరిగి ఎన్పీడీసీఎల్లో విధుల్లో చేరాడు. ప్రస్తుతం ఆయనను మహబూబాబాద్ ఎస్ఈగా నియమించారు. సూపరింటెండెంట్ ఇంజనీర్ బి.సుదర్శన్‌ను నిర్మల్ నుంచి జగిత్యాలకు బదిలీ చేశారు. ఎస్ఈ వి.గంగాధర్‌ను మంచిర్యాల నుంచి పెద్దపల్లికి, జీఎం వి.వేణుమాదవ్‌ను కార్పొరేట్ ఆఫీస్ ప్రాజెక్ట్సు నుంచి జీఎం ప్లానింగ్‌కు బదిలీ చేశారు. కార్పొరేట్ ఆఫీస్‌లో ఆపరేషన్ జనరల్ మేనేజర్‌గా కొనసాగుతున్న ఉత్తమ్.. మంచిర్యాల ఎస్ఈగా, జగిత్యాల ఎస్ఈ సాలియా నిర్మల్ ఎస్ఈగా బదిలీ అయ్యారు. తొర్రూరు డీఈ జి.మదుసూధన్‌ను మెట్‌పల్లికి, కార్పొరేటర్ ఆఫీస్ డీఈ జి.ఎల్.మర్రెడ్డిని అదే ఆఫీస్‌లో ప్రాజెక్టు విభాగానికి, డీఈ మహా బూబాద్ బి.పెద్దిరాజంను వరంగల్ డీపీఈ డీఈగా, పెద్దపల్లి ఎస్ఈ కార్యాలయంలో డీఈ టెక్నికల్‌ను తొర్రూరు డీఈగా, కార్పొరేట్ ఆఫీ స్లో ప్రాజెక్టు డీఈ డి.నందరాథోడ్ను ప్రాజెక్టు నుంచి ఇంజనీరింగ్ డీఈగా బదిలీ చేశారు. కాపులకనపర్తి ఏడీఈ నరసింహారావును కార్పొరేట్ ఆఫీస్ ప్రాజెక్టు విభాగానికి, ఏడీఈ బి.రవిని ప్రాజెక్టు నుంచి కాపుల కనపర్తికి, ఏడీఈ బి.శ్రీనివాస్ యాదవ్‌ను భూపాలపల్లి క్వాలిటీ కంట్రోల్ నుంచి కార్పొరేట్ ఆఫీస్‌కు, ఏడీఈ కె.పవన్ కుమార్‌ను కార్పొరేట్ ఆఫీస్ నుంచి హెచ్‌టీ మీటర్స్ వరంగల్ సర్కిల్‌కు బదిలీ జరిగింది. అకౌంట్స్ జనరల్ మేనేజర్ ఎన్.దేవేందర్‌కు సీజీఆర్ఎఫ్ వరంగల్ ఫైనాన్స్ మెంబర్‌గా స్థానం చలనం కలిగింది. రెవెన్యూ జీఎం ఆర్.కృష్ణ మోహన్‌ను ఫైనాన్స్ జీఎంగా, ఆడిట్ జీఎం ఎస్.సత్యనారాయణను రెవెన్యూ జీఎంగా, ఫైనాన్స్ జీఎం వి.వేణు బాబును ఆడిట్ జీఎంగా బదిలీ చేశారు. కూరగాయల విత్తనాల పంపిణీ మామునూరు: ఖిలావరంగల్ మండలం మా మునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక (ఎస్సీఎస్పీ) పథకాల ఆధ్వర్యంలో శుక్రవారం వర్ధన్నపేట మండలం అంబేడ్కర్ నగర్‌కు చెందిన 35 మంది మహిహిళా రైతులకు కూరగాయల విత్తనాలను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృషి విజ్ఞానకేంద్రం కోఆర్డినేటర్ రాజన్న హాజరై మాట్లాడారు. చిన్నపాటి వ్యవసాయ పనిముట్లు మహిళలకు కలిగే శ్రమను తగ్గించి పొలాల్లో కలుపు నివారణ పనులు సు లభతరం చేస్తాయని తెలిపారు. కూరగాయల విత్తన కిట్లను ఇంటి ప్రాంగణంలో లేదా కంచె ల వెంట నాటడం ద్వారా ఆహార భద్రత మె రుగు పడి గ్రామీణ మహిళల జీవనోపాధి స్థిరత్వానికి తోడ్పడుతుందని వివరించారు. శాస్త్రవేత్త డాక్టర్ సా యి కిరణ్, డాక్టర్ గణేష్, రైతులు పాల్గొన్నారు. -
హక్కుల పరిరక్షణలో ఓంకార్ పాత్ర ఎనలేనిది
● మోదీ పాలన దేశానికే ప్రమాదకరం ● రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలువరంగల్ చౌరస్తా: పౌర హక్కులు.. రాజ్యాంగ పరిరక్షణ కోసం మాజీ ఎమ్మెల్యే ఓంకార్ చేసిన ఉద్యమాలు, త్యాగాలు ఎనలేనివని పలువురు వక్తలు తెలిపారు. వరంగల్ అండర్ బ్రిడ్జికి సమీపంలోని ఎంసీపీఐ(యూ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మద్దికాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవాల్లో భాగంగా పౌర హక్కుల పరిరక్షణలో ఆయన పాత్ర అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పెదారపు రమేష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, సీపీఎం జిల్లా నాయకురాలు నలిగంటి రత్నమాల, న్యూ డెమోక్రసీ గ్రేటర్ కార్యదర్శి రాచర్ల బాలరాజు, నాయకులు నున్నా అప్పరావు, లిబరేషన్ జిల్లా కార్యదర్శి అక్కనపెల్లి యాదగిరి, రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్, ప్రజా సంఘాల నాయకులు సోమ రామమూర్తి, కేడల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీ నాయకులను అక్రమంగా జైలులో పెడుతుందని ఆరోపించారు. బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారన్నాని అన్నారు. అడవిలోని ఆదివాసీలను కాల్చి చంపుతూ.. అటవీ సంపద కార్పొరేట్ పెట్టుబడిదారులకు దోచిపెట్టేందుకు అనేక కుట్రలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో నాయకులు నర్ర ప్రతాప్, కుసుంబ బాబురావు, జగదీశ్వర్, నలిగంటి చంద్రమౌళి, రాజన్న, అనిత, ఇస్మాయిల్ పాల్గొన్నారు. -
ప్రజల గుండెల్లోనే పీవీ..
ఎల్కతుర్తి: అభివృద్ధి లేమి.. అప్పుల ఊబిలో కూనరిల్లుతున్న తరుణంలో అన్నీ తానై ఆర్థిక సంస్కణలు చేపట్టి దేశాన్ని ప్రగతిబాట పట్టించా రు.. నాటి ప్రధాని పీవీ నర్సింహారావు. హనుమకొండ జిల్లా భీమదేవపల్లి మండలంలోని వంగర అనే ఒక చిన్న గ్రామం నుంచి ప్రధాన మంత్రి స్థాయికి ఎదిగిన గొప్ప మేధావి పీవీ నర్సింహారావు. పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో వంగర గ్రామం ఓ వెలుగు వెలిగింది. ఆ సమయంలోనే గ్రామంలో పలు అభివృద్ధి పనులు జరిగాయి. నేడు దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు 104వ జయంతి. భీమదేవరపల్లి మండలం వంగరలో 1921 జూన్ 28న పీవీ జన్మించారు. రాష్ట్ర, కేంద్ర మంత్రి పదవులతోపాటు ముఖ్యమంతి, ప్రధాన మంత్రిగా పదవులకు వన్నెతెచ్చారు. పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో వంగరలో ముమ్మరంగా అభివృద్ధి పనులు చేపట్టారు. పోలీస్‌స్టేషన్ మంజూరైంది. రక్షిత తాగునీటి బావి, పీవీ మోడల్ కాలనీ, బాలికల గురుకుల పాఠశాల, 24 గంటలు పనిచేసే ఆస్పత్రి, సబ్‌స్టేషన్ మంజూరయ్యాయి. ఓ వైపు దేశం, మరో వైపు కాంగ్రెస్ పార్టీ దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో పీపీ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని తలెత్తుకునేలా చేయడంతోపాటు భారత ఖ్యాతిని దేశ విదేశాల్లో ఇనుమడింపజేసిన ఘనత పీవీదే. కాగా, 2004 డిసెంబర్ 23న పీపీ తుదిశ్వాస విడిచారు. పీవీ మరణానంతరం అయనను సొంతపార్టీ పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. పీవీ నర్సింహారావు ఇంటిని మ్యూజియంగా మారుస్తామని హామీ ఇచ్చిన గత ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది. పీవీ సొంతగ్రామంలో విగ్రహం ఏర్పాటు చేయకపోవడంతో చివరకు గ్రామస్తులే చందాలు వసూలు చేసుకొని విగ్రహాన్ని ప్రతిష్ఠించడం గమనార్హం. కళ తప్పిన వంగర గ్రామం నేడు పీవీ నర్సింహారావు జయంతి వంగరలో తుదిదశకు చేరుకున్న పీవీ విజ్ఞాన కేంద్రం పనులుతుది దశలో పీవీ విజ్ఞాన కేంద్రం పనులు వంగర గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని రెండేళ్ల క్రితమే ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా అప్పటి సీఎం కేసీఆర్ రూ.11 కోట్లు మంజూరు చేసి పనులను ప్రారంభించారు. పీవీ విజ్ఞాన వేదిక పార్కు నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. పీవీ విజ్ఞాన వేదికలో ప్రవేశ ద్వారం, ఫుడ్‌కోర్టు, ఫొటో గ్యాలరీ, పీవీ జీవిత విశేషాలకు సంబంధించిన చిత్రాలు ఉండేలా రూపకల్పన చేశారు. దీంతోపాటు ధ్యాన మందిరం, సైన్స్ మ్యూజియం, అంపీ థియేటర్, వాటర్ ఫౌంటేషన్, చారిత్రక శిల్పాలు, పార్క్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు ప్రారంభించారు. పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రారంభించాలని గత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, అప్పటి నాయకులు పట్టించుకోకపోవడంతో పనులు నత్తనడకన కొనసాగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మంత్రి పొన్నం ప్రభాకర్.. పీవీ విజ్ఞాన కేంద్రం నిర్మాణం పనులను వేగవంతం చేశారు. దీంతో నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి.నెరవేరని హామీలు.. హనుమకొండ– సిద్ధిపేట రహదారిలో వంగర క్రాస్ నుంచి గ్రామంలోకి వెళ్లే దారిలో స్వాగత తోరణం, పీవీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు నాలుగు లైన్ల రహదారి నిర్మించి, సెంట్రల్ లైటింగ్ తీర్చిదిద్ధేందుకు అప్పటి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ, నేటికీ పూర్తి కాలేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వీటిపై దృష్టి సారించి వంగరలో అభివృద్ధి పనుల వేగం పెంచాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
స్నాతకోత్సవానికి సమన్వయంతో పనిచేయాలి
కేయూ క్యాంపస్: జూలై 7న నిర్వహించనున్న కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవం నిర్వహణకు సమన్వయంతో పనిచేయాలని కేయూ వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి ఆయా కమిటీల కన్వీనర్లు, మెంబర్లను కోరారు. ఇప్పటికే స్నాతకోత్సవం నిర్వహణకు ఐదుగురు ప్రొఫెసర్లతో కూడిన స్టీరింగ్ కమిటీ, 10 సబ్ కమిటీలను కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం నియమించారు. అన్ని కమిటీల కన్వీనర్లతో శుక్రవారం క్యాంపస్‌లోని అకాడమిక్ కమిటీ హాల్లో వీసీ ప్రతాప్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, హైదరాబాద్‌లోని ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు. స్నాతకోత్సవం స్టీరింగ్ కమిటీ మెంబర్ కన్వీనర్ ఆచార్య రాజేందర్ మాట్లాడుతూ.. ఇప్పటికే 331 మంది విద్యార్థులు పీహెచ్డీ పట్టాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. 374 మంది విద్యార్థులకు 564 బంగారు పతకాలను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్నాతకోత్సవ నిర్వహణకు సంబంధించిన విషయాలను ఆయన వివరించారు. సమావేశంలో రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం, స్ట్టీరింగ్ కమిటీ చైర్మన్ ఆచార్య మల్లారెడ్డి, యూనివర్సిటీ కాలేజీ ప్రొఫెసర్ మనోహర్, ప్రొఫెసర్ వెంకట్రామ్రెడ్డి, ప్రొఫెసర్ మల్లికార్జున్‌రెడ్డి, అమరవేణి, ప్రొఫెసర్ నర్సింహారెడ్డి, ప్రొఫెసర్ శ్రీలత, ప్రొఫెసర్ షమిత, ప్రొఫెసర్వై వెంకయ్య, ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి, డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి -
ఆషాఢం వేడుకల వేళ..
వనభోజనాల సందడి.. ఆషాఢ మాసంలో వనభోజనాలు ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. ప్రధానంగా గ్రామాల్లోని వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడి పంటలు వెల్లివిరియాలని కోరుకుంటారు. గ్రామదేవతలకు పూజలు నిర్వహించి ప్రకృతి ఒడిలో పచ్చని పంట పొలాల మధ్య చెట్ల కింద సామూహిక వనభోజన సంబురాలు జరుపుకుంటారు. పట్టణ ప్రాంతాల్లో సైతం ఈ సంప్రదాయం కొనసాగుతోంది. భక్తిశ్రద్ధలతో గ్రామ దేవతలకు పూజలు ● అమ్మవార్లకు మొక్కుల చెల్లింపులకు సిద్ధం ● తొలిఏకాదశి నాడు బీరన్న బోనాలు ప్రత్యేకం ● గురువారం ప్రారంభమైన మాసంహన్మకొండ కల్చరల్: ఆషాఢం వేడుకలకు సమయం ఆసన్నమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తొలకరి వానలు పలకరించాయి. ఫలితంగా పంటల సాగుతో పాటే గ్రామ దేవతల (బోనాలు)కు పూజలు మొదలు కానున్నాయి. ఆషాఢ మాసం గురువారం ప్రారంభమైంది. ఇదే సమయంలో గ్రామాల్లో అమ్మవారిని కొలిచేందుకు ప్రజలు సన్నద్ధమవుతున్నారు. మహిళలు కలిసికట్టుగా బయలుదేరి మొక్కులు చెల్లించనున్నారు. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలిఏకాదశి నాడు బీరన్న బోనాలు వైభవంగా నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో ప్రతీరోజు గ్రామ దేవతలను భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. కొందరికి గ్రామదేవతలకు బోనాలు సమర్పించే సంప్రదాయం కూడా ఉంది. ఇలవేల్పులైన అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తారు. ఆలయాల్లో ఉత్సవాలు.. ఆషాఢ మాస శుద్ధ ఏకాదశి రోజున విష్ణువు యోగా నిద్రలోకి వెళ్లిన రోజుగా భావిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇదే సమయంలో పూరి జగన్నాథ రథయాత్ర, గురుపౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా వేడుకగా జరుపుకోనున్నారు. అలాగే, వరంగల్ జిల్లాలో శ్రీభద్రకాళి అమ్మవారికి శాకంబరీ ఉత్సవాలు నిర్వహించడం ప్రత్యేకం. గోరంటాకు మురిపెం.. ఆరోగ్యదాయకం వర్షకాలం ప్రారంభమై బావులు, వాగులు, చెరువుల్లోకి కొత్త నీరొస్తుంది. ఇది చర్మవ్యాధులు వ్యాప్తి చెందే కాలం. వీటి బారి నుంచి ఆరోగ్యాన్ని రక్షించుకునేందుకు గోరింటాకు ఔషధంగా పని చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆషాఢ మాసంలో మహిళలు గో రింటాకును (మెహందీ) అలంకరించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఆయుర్వేద వైద్య నిపుణులు గోరింటాకు చర్మ వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుందని, శరీరంలో వేడి తగ్గిస్తుందని పేర్కొంటున్నారు. గోరింటాకు వేడుకలు హసన్‌పర్తి: ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గోరింటాకు వేడుకలను మహిళలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నగరంలోని 55వ డి విజన్ సత్యసాయి కాలనీలో అతివలు అరచేతిలో గోరింటాకు పెట్టుకుని మురిసిపోయారు. కార్యక్రమంలో తుమ్మ వనమాల, ఎర్రబెల్లి సుజాత, చెరుకు కృష్ణవేణి, చిట్టిరెడ్డి మంగ పూల్లూరి సరోజన, లావణ్య, చింత జ్యోతి, తుమ్మ ప్రియాంక, తుమ్మ పద్మ నిహాసి పాల్గొన్నారు. ఆరోగ్యం.. ఆనందం హిందూ సనాతన ధర్మంలో ఆరోగ్యం, ఆనందం కోసం కొన్ని పద్ధతులు అనాదిగా వస్తున్నాయి. ఇందులో కుంకుమ, తిలకం అద్దుకోవడం, విభూదిధారణ, గంధ ధారణ, కాటుక, గోరింటాకు పెట్టుకోవడం లాంటి పద్ధతులు ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం గోరింటాకు పెట్టుకోవడం వల్ల శరీరంలో ఉన్న వేడి తగ్గి ఆరోగ్యంగా ఉంటామని, అలాగే శరీరం కళకళలాడుతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేయిస్తంభాల దేవాలయం ప్రధానార్చకుడు గంగు ఉపేంద్ర శర్మ తెలిపారు. -
దివ్యాంగుల సంక్షేమానికి సర్కారు కృషి
కాళేశ్వరం: దివ్యాంగుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషిచేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. శుక్రవారం మహాదేవపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అలీం కో సంస్థ ద్వారా దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, ఇతర ఉపకరణాలు కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి అందజేశారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. దివ్యాంగులు సమాజంలో అన్ని రంగాల్లో రాణించేందుకు అవసరమైన సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగవుతాయని అభిప్రాయపడ్డారు. మండలంలో సుమారు 200 మంది దివ్యాంగులను గుర్తించగా, మొదటి విడతలో 54 మందికి వివిధ రకాలైన బ్యాటరీ ట్రై సైకిళ్లు, సాధారణ ట్రై సైకిళ్లు, వినికిడి పరికరాలు, చేతి కర్రలు, స్టాండ్లు వారి వైకల్యాన్ని బట్టి అందిస్తున్నామన్నారు. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఇల్లు లేని దివ్యాంగులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు. అర్హులకు విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. అతి త్వరలో నూతన పెన్షన్లు మంజూరు చేస్తామని తెలిపారు. నిరుపేదలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణీ, ఉచిత బస్సు సౌకర్యం, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు వడ్డీ లేని రుణాలు వంటి అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఒకొక్క హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు. అనంతరం మహదేవ్పూర్ మండలానికి చెందిన 89 మంది లబ్ధిదారులకు సుమారు రూ.90 లక్షల విలువగల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అంతకు ముందు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో రూ.20 లక్షలతో నిర్మించిన బీఆర్ అంబేడ్కర్ చిల్డ్రన్ పార్క్‌ను రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్‌రెడ్డి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్‌రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయ లక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి, సీడీపీఓ రాధిక, డీఎస్పీ సూర్యనారాయణ, సీఐలు రామచందర్‌రావు, నాగార్జునరావు, ఎస్సైలు పవన్, తమాషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అర్హులకు విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు -
వివస్త్రను చేసి.. జననాంగంలో జీడిపోసి..
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో ఐదు రోజుల క్రితం ఓ అమానవీయ ఘటన జరిగింది. ఓ వివాహితను వివస్త్ర చేసి జననాంగంలో జీడిపోసి విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడికి వివాహేతర సంబంధం కారణం కాగా, బాధిత మహిళ ఆచూకీ ఇప్పటివరకు బంధువులకు లభించలేదని సమాచారం. ఈఘటనకు సంబంధించి ‘సాక్షి’కి అందిన ఎక్స్‌క్లూజివ్ సమాచారం మేరకు.. తాటికాయల గ్రామానికి చెందిన ఓ యువతిని పదేళ్ల క్రితం ములుగు మండలం బోలోనిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. వీరికి ముగ్గురు పిల్లలు. అతడికి సమీప బంధువైన ఓ వివాహితతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ మహిళతో కలిసి సుమారు పది రోజుల క్రితం ఎటో వెళ్లిపోయారు. దీంతో సదరు వ్యక్తి భార్య తనకు జరిగిన అన్యాయాన్ని స్వగ్రామమైన తాటికాయలకు వచ్చి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు కోపంతో రగిలిపోయి లేచిపోయిన ఆ ఇద్దరిని వెతికి ఐదు రోజుల క్రితం తాటికాయల గ్రామానికి తీసుకొచ్చి విచక్షణారహితంగా దాడి చేశారు. ఇద్దరికి గుండు గీయించారు. ఆ మహిళను ఓ మంచానికి కట్టేసి వివస్త్రను చేసి.. జననాంగంపై జీడీ (పూర్వకాలంలో నొప్పి తగ్గించేందుకు వాడేవారు, అదేవిధంగా శరీరంలోని సున్నిత అవయవాలపై పోస్తే పుండ్లు అవుతాయి) పోశారు. ‘తప్పు చేశాను.. క్షమించండి’ అని బాధిత మహిళ వేడుకున్నా.. పలువురు ఇష్టారీతిన దాడి చేశారు. యోనిలోంచి తీవ్ర రక్తస్రావమవుతున్నా వదల్లేదు. తర్వాత ఆఇద్దరిని ఏం చేశారో ఆచూకీ తెలియలేదు. ఈ అమానవీయ ఘటన జరిగి ఐదు రోజులు గడుస్తున్నా పోలీసులకు సమాచారం అందలేదని తెలిసింది. అసలు ఆ ఇద్దరు ప్రాణాలతో ఉన్నారో, లేదో తెలియని పరిస్థితి. వివాహితపై దాడి వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కారణంతోనే.. ఘటన జరిగి ఐదు రోజులు తాటికాయల గ్రామంలో అమానవీయం -
బాధ్యతలు స్వీకరించిన ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు
హన్మకొండ: హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలోని శుక్రవారం టీజీ ఎన్పీడీసీఎల్ డైరక్టర్లు బాధ్యతలు స్వీకరించారు. ఫైనాన్స్ డైరెక్టర్‌గా వంటెరు తిరుపతి రెడ్డి, ఆపరేషన్స్ డైరెక్టర్‌గా టి.మదుసూధన్, ప్రాజెక్ట్స్ డైరెక్టర్‌గా వంగూరు మోహన్ రావు, హెచ్ఆర్డీ అండ్ ఐఆర్ డైరెక్టర్‌గా సి.ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించగా.. సీఎండీ వారికి శుభాకాంక్షలు తెలిపారు. సమష్టి కృషితో కంపెనీని అభివృద్ధి పథంలో తీసుకెళ్దామని అన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు మాట్లాడుతూ.. సీఎండీ వరుణ్ రెడ్డి సారథ్యంలో కంపెనీ అభివృద్ధిలో భాగస్వాములవుతామని, వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన డైరక్టర్లను అసోషియేషన్లు, యూనియన్ల నాయకులు, ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలు, ఇతర అధికారులు, ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. -
గవర్నర్ దత్తత గ్రామంలో సంబురాలు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దత్తత తీసుకున్న ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని కొండపర్తిలో గ్రామస్తులు శుక్రవారం సంబురాలు చేసుకున్నారు. కొండపర్తిలో ఇప్పటికే చాలా మేరకు అభివృద్ధి పనులు చేశారు. గ్రామంలోని ఆదివాసీలను వ్యవసాయం రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో అభివృద్ధి పనులతోపాటు 45 ఇళ్లు మంజూరు చేశారు. 7 వ్యవసాయ బోరుబావుల నిర్మాణంతోపాటు మహిళలకు స్వయం ఉపాధి కోసం కుట్టుమిషన్లు, మిర్చి పౌడర్ తయారీ పనులు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామానికి చెందిన మేడారం జాతర చైర్మన్ అరెం లచ్చుపటేల్ ఆధ్వర్యంలో గ్రామస్తులు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క చిత్రపటాలకు శుక్రవారం క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా లచ్చుపటేల్ మాట్లాడుతూ మంత్రి సీతక్క సూచన మేరకు గవర్నర్.. కొండపర్తి గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో అభివృద్ధి చెందుతుందన్నారు. కొండపర్తి అభివృద్ధికి కృషి చేస్తున్న గవర్నర్, మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఇర్ప సీతారాములు, కల్తి రమేశ్, ఇర్ప రామయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు. కొండపర్తిలో గవర్నర్, మంత్రి సీతక్క చిత్రపటాలకు క్షీరాభిషేకం -
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలి
నెహ్రూసెంటర్: రానున్న మున్సిపాలిటీ, సర్పంచ్, స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ సత్తా చాటాలని, అధిక స్థానాలను కై వసం చేసుకోవాలని ఆపార్టీ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ సమావేశం జిల్లా కేంద్రంలోని ధర్మన్న కాలనీలో శుక్రవారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వందేళ్ల చరిత్ర కలిగిన సీపీఐని స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మున్సి పల్ మాజీ ఫ్లోర్‌లీడర్ అజయ్‌సారథి, పెరుగు కుమార్, చింతకుంట్ల వెంకన్న, శ్రావణ్, తోట రాజ కుమారి, మంద శంకర్, మాలోత్ రవీందర్, ఆబో తు అశోక్, మంచినీళ్ల రాకేశ్, తండ శ్రీనాథ్, మాధ వి, అలీమా తదితరులు పాల్గొన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి -
తడి, పొడి పద్ధతుల్లో విత్తన శుద్ధి చేసుకోవాలి
గూడూరు: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ఆధారంగా వరిలో తడి లేదా పొడి పద్ధతుల్లో విత్తనశుద్ధ్ది చేసుకోవాలని ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు అన్నా రు. గూడూరు, గాజులగట్టు గ్రామాల్లో శుక్రవారం వరి, పత్తి, మొక్కజొన్న పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వరిలో తడి పద్ధతిలో లీటరు నీటికి 3గ్రాముల కార్బండిజమ్ కలిపిన నీటిలో కిలో విత్తనాలను 12 నుంచి 24 గంటల పాటు నానబెట్టిన తర్వాత విత్తుకోవాలని సూచించారు. పొడి పద్ధతిలో కిలో విత్తనాలకు 1గ్రాము కార్బండిజమ్ కలిసి నేరుగా నారుమడిలో చల్లుకోవచ్చని తెలిపారు. వానాకాలం మొక్కజొన్న పంటను బోదె సాళ్ల పద్ధతిలో వేసుకోవాలని, దీంతో అధిక వర్షాలు కురిస్తే పంట ముంపునకు గురికాకుండా ఉంటుందన్నారు. యూరియాను మోతాదుకు మించి వినియోగించొద్దన్నారు. కార్యక్రమంలో ఏఓ అబ్దుల్ మాలిక్, ఏఈఓ మధు, రైతులు పాల్గొన్నారు. -
కపాలినీ, భగమాలినీ క్రమాల్లో భద్రకాళి
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం అమ్మవారికి కపాలినీ, భగమాలినీ క్రమాల్లో పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు ఉదయం 4 గంటల నుంచి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం, క్షీరాన్న నివేదన, చతుఃస్థానార్చన తదితర పూజలు నిర్వహించారు. దశ మహావిద్యల్లోని కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని కపాలినీగా, షోఢశీక్రమాన్ని అనుసరించి భోగబేరాన్ని భగమాలినీగా అలంకరించి నవరాత్ర విశేష పూజలు జరిపారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు జరుపుకున్నారు. సినీ నటులు కొణిదెల నాగబాబు సతీమణి పద్మజ అమ్మవారిని దర్శించుకున్నారు. పూజల్లో ఆలయ చైర్మన్ డాక్టర్ శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు పాల్గొన్నారు. ఆల య ఈఓ శేషుభారతి పర్యవేక్షించారు. -
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
తొర్రూరు: అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. డివిజన్ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని 72 మంది లబ్ధిదారులకు రూ.72.8 లక్షల విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద బిడ్డల వివాహాలకు ప్రభుత్వం సాయం అందించి అండగా నిలుస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేయలేనివి కాంగ్రెస్ ప్రభుత్వం 18 మాసాల్లో చేసి చూపుతుందన్నారు. పేదలకు అండగా రేవంత్‌రెడ్డి సర్కారు నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, తహసీల్దార్ శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ కందాడి అచ్చిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్, స్థానిక నాయకులు గంజి విజయ్‌పాల్‌రెడ్డి, ముద్దం విక్రమ్‌రెడ్డి, చింతకుంట్ల శ్రీనివాస్‌రెడ్డి, వెన్నం సోమిరెడ్డి, మిత్తింటి హరీశ్, మొగుళ్ల లింగన్న, మహబూబ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి -
ప్రభుత్వం చేసే పనులను ప్రజలకు తెలపాలి
తొర్రూరు: రాష్ట్ర ప్రభుత్వం చేసే మంచి పనులను గ్రామాల్లోని ప్రజలకు తెలపాలని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం డివిజన్ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో క్లస్టర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఝాన్సీరెడ్డి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, పార్టీ కోసం కష్టపడిన నాయకులను సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా గెలిపించుకోవాలన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, సబ్సిడీ గ్యాస్ అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితం అందించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్, నాయకులు డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు, చాపల బాపురెడ్డి, పెదగాని సోమయ్య, జాటోతు నెహ్రూ, ఎర్రబెల్లి రాఘవరావు, జలకం శ్రీనివాస్, పింగిళి ఉష, వల్లపు యాకయ్య, అలువాల సోమయ్య, దొంగరి శంకర్, జాటోతు రవి, బచ్చలి లక్ష్మణ్, వల్లపు మల్లయ్య పాల్గొన్నారు. -
మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలంలోని వేమునూరు ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలోని వాటర్ ట్యాంక్‌కు ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీతో ప్రతీరోజు తాగునీరు వృథాగా పోతోంది. చాలారోజుల నుంచి పైపులైన్ లీకేజీ అవుతున్నా.. సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదు. ఈక్రమంలో ట్యాంకు పిల్లర్ల ప్రాంతంలో నీళ్లు నిలిచి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడే మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉండడంతో విద్యార్థులు అటువైపుగా వెళ్లి లీకేజీ నీళ్లలో జారిపడిన ఘటనలు ఉన్నాయని ఉపాధ్యాయులు వాపోతున్నారు. లీకేజీ కారణంగా ఆ ప్రాంతమంతా బురదమయంగా మారి అధ్వానంగా కనిపిస్తోంది. కాగా, మిషన్ భగీరథ అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు -
ట్రాఫిక్ కష్టాలు..
మహబూబాబాద్: జిల్లా కేంద్రం కొత్తబజారు మోడ ల్ మార్కెట్ ఎదుట ఉన్న రోడ్డు (పాత తొర్రూ రు బస్టాండ్ సెంటర్)లో ఏర్పాటు చేసిన పార్కింగ్ అ డ్డాతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. అక్కడ ఆటోలు, ద్విచక్రవాహనాలు, కార్లు పార్కింగ్ చేయడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రం కావడంతో ఆ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. కాగా వాహనాల పార్కింగ్తో పాటు ఆరోడ్డుకు ఇరువైపులా చిరువ్యాపారులు తోపుడు బండ్లు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య జఠిలమైంది. ఇటీవల నెహ్రూసెంటర్‌లో తొలగింపు.. ఇటీవల నెహ్రూసెంటర్‌లో ఉన్న పార్కింగ్ అడ్డాను పోలీసులు తొలగించారు. ఆ ప్రాంతంలో మార్క్ చేసి, వాహనాలను పార్కింగ్ చేస్తే రూ.1000 జరి మానా విధిస్తామని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీంతో ఆప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తీరింది. ఆరోడ్డు గుండా రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం పార్కింగ్ తొలగించడంతో వాహనదారులు సాఫీగా వెళ్తున్నారు. కాగా పాత తొర్రూరు బస్టాండ్ సెంటర్లో ఉన్న పార్కింగ్ అడ్డాను తొలగించి ట్రాఫిక్ కష్టాలను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. మానుకోటలోని మోడల్‌మార్కెట్ ఎదుట పార్కింగ్ అడ్డా ఏర్పాటు వాహనదారులు, ప్రజలకు తప్పని తిప్పలు -
లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలి
మహబూబాబాద్: జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ సంబంధిత అఽధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు. మంజూరు, గ్రౌండింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, వీరబ్రహ్మచారి, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, హౌసింగ్ డీఈ రాజయ్య, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాలి.. ప్రతీ గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్–2025లో జిల్లాను ముందంజలో ఉంచాలన్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, వీరబ్రహ్మచారి పాల్గొన్నారు. పటిష్ట చర్యలు తీసుకోవాలి.. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని లెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని వీసీ సమావేశ మందిరంలో రోడ్డు ప్రమదాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలలు ఉన్న ప్రాంతాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, వీరబ్రహ్మచారి, డీఎస్పీ తిరుపతి రావు, ఆర్అండ్బీ ఈఈ బీమ్లా పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ -
భూ సమస్యలకు మోక్షం!
సాక్షి, మహబూబాబాద్: భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి చట్టం తీసుకొచ్చి రెవెన్యూ సదస్సుల ద్వారా రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఆన్లైన్ చేస్తోంది. తర్వాత నోటీసులు ఇవ్వడం, విచారణ మొదలైన ప్రక్రియలు చేపట్టేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. త్వరగా తమ భూ సమస్యలు పరిష్కరించి పట్టాదారు పాస్‌పుస్తకాలు అందజేయాలని రైతులు కోరుతున్నారు. దరఖాస్తుల వరద.. జిల్లాలో ఎనిమిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా అధికారులు పైలెట్ మండలాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఇది సక్సెస్ కావడంతో జిల్లా వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాల్లో జూన్ 3నుంచి 16వ తేదీ వరకు సదస్సులు నిర్వహించారు. ప్రత్యేకంగా తయారు చేసిన సమస్యల జాబితాతో కూడిన దరఖాస్తు ఫాం తయారు చేసి గ్రామాల్లో పంపిణీ చేశారు. సర్వే నంబర్ మిస్ కావడం, మ్యుటేషన్ పెండింగ్, డీఎస్ పెండింగ్, భూ స్వభావంలో మార్పు, పట్టేదారు వివరాల సరవణ, ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చడం, అసైన్డ్ ల్యాండ్, ఓఆర్సీ, వారసత్వం, భూ సేకరణ మొదలైన అంశాలపై దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 39,513 దరఖాస్తులు రాగా.. అధికంగా 2007 వారసత్వ సమస్యలు ఉండగా.. అత్యల్పంగా 38–ఈ సర్టిఫికెట్ సమస్యలు ఉన్నాయి. మొదలైన కసరత్తు ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించే ప్రక్రియ జిల్లాలో మొదలైంది. 18 మండలాల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ఆన్లైన్లో ఎంట్రీ చేసేందుకు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే ముందుగా ప్రతీ దరఖాస్తుదారుడికి, సమస్యకు కారణమైన వారికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఆ తర్వాత విచారణ చేసి అక్కడే గ్రామ పెద్దల సమక్షంలో పరిష్కరిస్తారు. అయితే అత్యధికంగా భూ సర్వేతో ముడిపడి ఉన్న సమస్యలు ఉండడంతో 183 మంది సర్వేయర్లను నియమించి 50రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు. సర్వే ద్వారా ఆ భూ సమస్యలను పరిష్కరిస్తారు. ప్రక్రియ వేగవంతం భూ భారతి చట్టం అమలు ప్రక్రియ జిల్లాలో వేగంగా సాగుతోంది. రెండు మూడు రోజుల్లో నోటీసులు జారీ చేసి, ప్రతీ అంశాన్ని విచారణ చేస్తాం. ఈ విచారణలో రైతుల సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుంది. భూ భారతి చట్టం ద్వారా నిజమైన భూ యజమానికి మేలు జరుగుతుంది. –వీరబ్రహ్మచారి, అదనపు కలెక్టర్(రెవెన్యూ)జిల్లాలో వచ్చిన దరఖాస్తుల వివరాలు సమస్య వచ్చిన దరఖాస్తులు సర్వే నంబర్ మిస్సింగ్ 1,476 పెండింగ్ మ్యుటేషన్ 384 డీఎస్ పెండింగ్ 1,148 విస్తీర్ణం సవరణ 1,632 భూ స్వభావంపై 263 పట్టేదారు పేర్ల సవరణ 225 ప్రొహిబిటెడ్ జాబితా నుంచి తీసివేయడం 462 ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చడం 02 అసైన్డ్ భూ సమస్య 1,378 ఓఆర్సీ ఇష్యూ కానివి 45 38–ఈ సర్టిఫికెట్ రాకపోవడం 06 వారసత్వ సమస్య 2,007 భూ సేకరణ సమస్య 169 ఇతర సమస్యలు 30,316 మొత్తం దరఖాస్తులు 39,513 ఆన్లైన్లో భూ భారతి దరఖాస్తుల వివరాలు నమోదు రెవెన్యూ సదస్సుల్లో 39,513 అర్జీల స్వీకరణ ముందుగా నోటీసులు జారీ తర్వాత విచారణ, అవసరమైతే భూ సర్వే ద్వారా పరిష్కారం -
నేడు బెస్ట్ అవైలబుల్ స్కీం ఎంపికలు
మహబూబాబాద్ అర్బన్: కలెక్టరేట్లోని ఐడీఓసీ కార్యాలయంలో శనివారం ఉదయం 9 గంటలకు 2025–26 విద్యా సంవత్సరానికి గిరిజ న విద్యార్థుల బెస్ట్ అవైలబుల్ స్కీం ఎంపికలు లాటరీ పద్ధతిలో నిర్వహించనున్నట్లు జిల్లా గిరిజన శాఖ అధికారి గుగులోతు దేశీరాం నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. బెస్ట్ అవైలబుల్ స్కీంకు దరఖాస్తు చేసుకున్న గిరిజన విద్యార్థులు, తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. ‘పది’ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలమహబూబాబాద్ అర్బన్: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయని డీఈఓ రవీందర్ రెడ్డి తెలిపారు. జిల్లాలో 57 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 54 మంది ఉత్తీర్ణులయ్యారని, 94.74శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు చెప్పారు. రికౌంటింగ్ పెట్టాలనుకునే విద్యార్థులు ఎస్బీఐ బ్యాంకులో రూ.500 చలాన్ చెల్లించి, ప్రధానోపాధ్యాయుడి సంతకంతో జూలై 7వ తేదీలోపు డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ హైదరాబాద్‌కు పంపించాలన్నారు. అలాగే రీ వెరిఫికేషన్ కోసం రూ.1000 చలాన్ చెల్లించి విద్యాశాఖ కార్యాలయంలోని ఎగ్జామినేషన్ సెక్షన్లో జూలై 7లోపు అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు ఏసీజీఈ మందుల శ్రీరాములు 98497 61012 ఫోన్ నంబర్లో సంప్రదించాలన్నారు. విద్యుత్‌శాఖ ఎస్ఈగా విజయేందర్‌రెడ్డి నెహ్రూసెంటర్/తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా విద్యుత్‌శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ)గా పి.విజయేందర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా విద్యుత్‌శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఇన్చార్జ్ ఎస్ఈగా శ్రీనివాసాచారి కొద్దిరోజులు బాధ్యతలు చేపట్టగా.. పూర్తిస్థాయి ఎస్ఈగా పి.విజయేందర్‌రెడ్డి జిల్లాకు వచ్చారు. మహబూబాబాద్ జిల్లా నుంచి డివిజన్ ఇంజనీర్ టెక్నికల్‌గా విధులు నిర్వహిస్తున్న పెద్ది రాజం వరంగల్‌కు, తొర్రూరు డీఈ మధుసూదన్ మెట్‌పల్లికి బదిలీ అయ్యారు. కాగా పెద్దపల్లి డీఈ రవి తొర్రూరు డీఈగా బదిలీపై రానున్నారు. కాగా మహబూబాబాద్ డీఈటీ, తొర్రూరు డీఈ బాధ్యతలను ఇన్‌చార్జ్‌లకు అప్పగించారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వెంకన్ననాయక్ నెహ్రూసెంటర్: సేవాలాల్ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జిల్లాకు చెందిన వెంకన్ననాయక్ను నియమించినట్లు సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్య సంజీవ్‌నాయక్ శుక్రవారం తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన సంఘం రాష్ట్ర సమావేశంలో ఎన్నుకున్నారని, సంఘం బలోపేతం, గిరిజనుల హక్కుల సాధనకు పోరాటాలు నిర్వహిస్తానని వెంకన్ననాయక్ తెలిపారు. తన నియామకానికి కృషి చేసిన సంఘం జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. వర్సిటీ అధికారుల నిర్లక్ష్యంపై లోకాయుక్తలో ఫిర్యాదుఎంజీఎం: వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం, ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీలకు మేలు చేయాలనే ఒప్పందం, నష్టపోయిన అర్హులైన 400 మెడికల్ విద్యార్థులకు న్యాయం జరగాలని, అవినీతి అధికారులపై విచారణ చేపట్టాలని కోరుతూ వినియోగదారుల మండలి రాష్ట్ర కమిటీ లోకాయుక్తలో ఫిర్యాదు చేసింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు డీమ్డ్ యూనివర్సిటీలుగా మారడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు తప్పనిసరి. అయితే తెలంగాణ ప్రభుత్వ అనుమతి లేకున్నా.. 400 ఎంబీబీఎస్ సీట్లు ఉన్న రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు డీమ్డ్ యూనివర్సిటీలుగా మారడం, ఈక్రమంలో గతేడాది అర్హులైన 400 మెడికల్ సీట్లు రాష్ట్ర ప్రభుత్వ పరిధి నుంచి దాటిపోవడంపై జరిగిన అవినీతిపై విచారణ కోసం లోకాయుక్తలో ఫిర్యాదు దాఖలు చేసినట్లు వినియోగదారుల మండలి ప్రతినిధులు సాంబరాజు చక్రపాణి, మొగిలిచర్ల సుదర్శన్ తెలిపారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
మహబూబాబాద్ అర్బన్/మహబూబాబాద్ రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని విద్యాశాఖ వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల, అనంతారం మోడల్ స్కూల్, మహబూబాబాద్ మండలంలోని బ్రాహ్మణపల్లి ప్ర భుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులు, విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడి గి తెలుసుకున్నారు. ఆర్జేడీ సత్యనారాయణ మాట్లాడుతూ.. సర్కారు బడుల్లోనే సుశిక్షుతులైన ఉపాధ్యాయులు ఉంటారని, ప్రతి విద్యార్థి ఆ తరగతి గది అభ్యసన సామర్థ్యాలు సాధించాలన్నారు. పాఠశాల ఆరంభం నుంచే పదో తరగతి విద్యార్థులను ఉపాధ్యాయులు వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయాలన్నారు. గణితం, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్ట్‌ల్లో విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాలను తెలుసుకున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు కూరగాయలు, గుడ్లు, మిక్స్డ్ వెజిటబుల్ బిర్యానీ అందించాలన్నారు. బ్రాహ్మణపల్లి పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయని, గార్డెనింగ్ ఆహ్లాదకరంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. పాఠశాల అభివృద్ధికి ప్రధానోపాధ్యాయుడు చేపడుతున్న కార్యక్రమాలు, ఉపాధ్యాయులు పనితీరును ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో డీఈఓ రవీందర్‌రెడ్డి, ఏఎంఓ చంద్రశేఖర్ఆజాద్, కోఆర్డినేటర్ పూర్ణచందర్, ఎంఈఓ వెంకటేశ్వర్లు, పాఠశాలల హెచ్ఎంలు ఆరుద్ర వెంకటేశ్వర్లు, దారావత్ భద్రునాయక్, మోడల్ స్కూల్ ప్రిన్సి పాల్ ఉపేందర్, ఉపాధ్యాయులు పాలకుర్తి మౌని క, మాడిశెట్టి సూర్యప్రకాశ్, గొట్టిముక్కల పవన్ రాజ్, బొమ్మర కృష్ణమూర్తి, రాచకొండ ఉపేందర్, కుప్పం సూర్యతేజ, బానోత్ శంకర్ పాల్గొన్నారు. ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి -
ప్రేక్షకులపై ఊడి పడిన సీలింగ్
మహబూబాబాద్ రూరల్ : సినిమా చూస్తున్న ప్రేక్షకులపై ఒక్కసారిగా సీలింగ్ పడగా వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఏషియన్ ముకుంద థియేటర్లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. థియేటర్లో బుధవారం ప్రేక్షకులు ‘కుబేర’ సినిమా చూస్తున్నారు. రాత్రి సుమారు 11.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా సీలింగ్ పైకప్పుభాగం ఊడిపడడంతో ప్రేక్షకులు భయభ్రాంతులకు గురై వెంటనే థియేటర్ నుంచి బయటకు పరుగులు తీశారు. అప్రమత్తంగా ఉండడంతో ప్రాణ నష్టం తప్పింది. కాగా, కొద్దిసేపు ఉల్లాసం కోసం వస్తే ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
టైమ్స్‌స్క్వేర్‌లో అరుణ్‌కుమార్ ఫొటోల ప్రదర్శన
హన్మకొండ కల్చరల్ : ప్రతిష్టాత్మక డిజిటల్ డిస్ప్లే న్యూయార్క్ టైమ్స్‌స్క్వేర్ బిల్‌బోర్డుపై భూపాలపల్లికి చెందిన ఫొటోగ్రాఫర్ అరుణ్‌కుమార్ నలిమెల తీసిన మూడు ఫొటోలు ప్రదర్శించారు. మూడు రోజులు జరిగిన ఎన్ఎఫ్టీ ఎన్వైసీ(నాన్ ఫంజిబుల్ టోకెన్– న్యూయోర్క్ సిటీ)–2025 కార్యక్రమంలో భాగంగా అరుణ్‌కుమార్ ఫొటోలు ఈ బిల్‌బోర్డుపై ప్రదర్శించారు. మిస్ వరల్డ్ –2025 పోటీల్లో భాగంగా రామప్ప దేవాయంలో భారత దేశం తరపున ప్రాతినిథ్యం వహించిన నందినిగుప్తా ఫొటోగ్రాఫ్, యునెస్కో వరల్డ్ హెరిటెజ్ సైట్ రామప్ప దేవాలయం సందర్శన సమయంలో తీసిన ఫొటో, మహిళలు బతుకమ్మ పేరుస్తున్న దృశ్యాన్ని బిల్‌బోర్డుపై ప్రదర్శించారని అరుణ్‌కుమార్ తెలిపారు. -
కంపల్సరీ..
విజయానికి ముఖ్య పాయింట్లు ఇంజనీరింగ్‌తోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాల్సిందే..విద్యార్థులు ఇంజనీరింగ్‌లో 90 శాతం మార్కులు సాధించినా ఇంటర్వ్యూలలో వెనుకబడుతున్నారు. ప్రధానంగా సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, టెక్నికల్ స్కిల్స్, హ్యూమన్ రిలేషన్స్ వంటివి పూర్తిగా కలిగి ఉంటే ఇంటర్వ్యూల్లో ఎంపికవుతారు. కళాశాలలో క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైయినింగ్‌కు తప్పని సరిగా వెళ్లాలి. ప్రస్తుతం అన్ని కళాశాలలో అధ్యాపకులు శిక్షణ ఇస్తున్నారు. ఎలా మాట్లాడాలి అనే అంశంపై తర్ఫీదు ఇస్తున్నారు. ఖిలా వరంగల్ : ఇంజనీరింగ్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న కోర్సు.. ఈ చదువు పూర్తయిందంటే ఉద్యోగం వచ్చినట్లే. జీవితంలో ఇక స్థిరపడినట్లే. మరిప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. కోర్సు పూర్తయినా ఉద్యోగం వస్తుందనే నమ్మకం లేదు. దీనికి ప్రధాన కారణం కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోవడమే. ఇంజనీరింగ్ విద్యతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాల్సిందే. అప్పుడే కొలువు దక్కుతుంది. లేనిపక్షంలో ఉద్యోగం కలగానే మిగులుతుంది. చదువుకు.. చేసే పనికి ఉండని పొంతన.. ఇంజనీరింగ్ కోర్సు పూర్తయిన తర్వాత యువత ఏదో ఒక చిన్న ఉద్యోగంలో చేరుతున్నారు. ఇక్కడ తన చదువుకు.. చేసే పనికి పొంతనే ఉండడం లేదు. ఎందుకంటే.. ఇంజనీరింగ్ పూర్తయిన తర్వా త ఏం చేయాలనే అంశంపై అవగాహన ఉండడం లేదు. ఫలితంగా కొంత మంది హైదరాబాద్, బెంగళూరు, చైన్నె, ఇతర ప్రాంతాల్లో ఏదో ఒక చిన్న ఉద్యోగం చేస్తూ కాలం గడుపుతున్నారు. యువత ఇక నుంచి అలా చేయొద్దు. ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత ఈ కోర్సులు చేస్తే ఉద్యోగాలు మీ సొంతమవుతాయి. దీనిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఉద్యోగ వేటలో ఇంజనీరింగ్ విద్యార్థులు.. ఇంజనీరింగ్ చదివితే ఉద్యోగం వస్తుందనుకున్న కొంతమంది విద్యార్థులు నిరుత్సాహం చెందక తప్పడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏటా సుమారు 3వేలకుపైగా విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు. 30 నుంచి 40 శాతంలోపే వారికి క్యాంపస్ ఇంటర్వ్యూ లు ద్వారా ఉద్యోగాలు లభిస్తున్నాయి. మిగతా వారు ఇంజనీరింగ్ పట్టాలతో ఉద్యోగాల వేట ప్రారంభిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం కంప్యూటర్ నాలెడ్జ్, ఉద్యోగానికి సంబంధించిన కంప్యూటర్ కోర్సు నేర్చుకోకపోవడమే. ఫలితంగా యువత ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధంలేని ఉద్యోగాల్లో స్థిరపడుతోంది. ఉద్యోగం సులభంగా సాధించాలంటే ఇంజనీరింగ్ చదువుకు కంప్యూటర్ కోర్సు యాడ్ చేయాల్సిందే. అప్పుడే అతిసులభంగా సాఫ్ట్వేర్ ఉద్యోగంలో స్థిరపడొచ్చు. ఇందులో కొన్ని కోర్సులు ఇలా ఉన్నాయి. సీఎస్ఈ గ్రూప్ .. ఇంజనీరింగ్‌లో సీఎస్ఈ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్) గ్రూప్ పూర్తి చేసిన విద్యార్థులు 6 నెలల నుంచి సంవత్సర వరకు ఉండే కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవాలి. ఆ కోర్సులు బిగ్‌డేటా ఎనటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లె ర్ని, సైబర్ సెక్యూరిటీ వంటి మూడు కోర్సుల నే ర్చుకోవాలి. ఇంజనీరింగ్‌లో మార్కులశాతంతోపా టు కంప్యూటర్ కోర్సు ఉంటేనే ఉద్యోగం వస్తుంది. ఈఈఈ గ్రూప్ .. ఈఈఈ (ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) గ్రూప్ పూర్తి చేసిన విద్యార్థులు సాఫ్ట్వేర్ ఉద్యోగానికి కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ కోర్సుతో పాటు పవర్ టెక్నాలజీ సోలార్ కోర్సు చేయాలి. ఈ కోర్సులు 3 నెలల నుంచి 6నెలల వరకు ఉంటాయి. సివిల్ గ్రూప్.. సివిల్ గ్రూప్ చదివిన విద్యార్థులు స్టక్చరల్ ఇంజనీరింగ్ రివిట్ ఆర్కిటెక్చర్, రివిట్ స్ట్రక్చర్, ఆటో క్యాడ్ కోర్సులు నేర్చుకోవాలి. వీటి ద్వారా ప్రాజెక్టుల ఏర్పాటుకు ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరడానికి అవకాశాలు ఉంటాయి. ఈసీఈ గ్రూప్.. ఈసీఈ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) గ్రూప్ చేసిన వారికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లభిస్తాయి. అయితే విద్యార్థులు కంప్యూటర్ కోర్సులు చేయాలి. ఆండ్రాయిడ్ స్టిస్టమ్, ఈఎల్ఎస్ఐ డిజైన్స్ కోర్సులతో పాటు బిగ్ డేటా ఎనటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్ని, సైబర్ సెక్యూరిటీ కోర్సులు చేయాలి. ఈ కోర్సులు 6 నెలలు ఉంటాయి. దీంతో పాటు ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్(ఐఓటీ) కోర్సు చేస్తే మరింత ఉపయోగం. మెకానికల్ గ్రూప్ .. మెకానికల్ గ్రూప్ విద్యార్థులు రోబోటిక్స్ ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్, ఆటోకేడ్, కెటియా కోర్సులు పూర్తి చేయాలి. ఇవి మూడు నుంచి ఆరు నెలలు కోర్సులుగా ఉంటాయి. ఈకోర్సులు పూర్తి చేస్తేనే ఇంటర్వ్యూల్లో ప్రాధాన్యం ఉంటుంది. ఈకోర్సులు హైదరాబాద్, బెంగళూరులోనే.. చదువు పూర్తయిన విద్యార్థులు వెంటనే ఇంజనీరింగ్‌కు సంబంధించిన కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవాలి. ఆ కోర్సులు హైదరాబాద్, బెంగళూరు, చైన్నె వంటి నగరాల్లోనే నేర్చుకోవాలి. ఎందుకంటే అక్కడ కంప్యూటర్ కోర్సులు నేర్పేవారు అనుభవం కలిగి ఉంటారు. వారి సూచనలు ఉద్యోగం సాధించడానికి ఉపయోపడతాయి. కంప్యూటర్ నాలెడ్జ్ అప్పుడే కొలువు సాధ్యం..లేనిపక్షంలో కలే.. చదువుతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలంటున్న నిపుణులుఇతర కోర్సులపై అవగాహన పెంచుకోవాలి విద్యార్థులు ఇంజనీరింగ్ పూర్తి చేసినా ఇతర కోర్సులపై కూడా అవగాహన కలిగి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్, క మ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవాలి. క్యాంపస్ ఇంటర్వ్యూలకు హాజరుకావాలి. అంతేకాదు చదువుకున్న కోర్సులపై పట్టు ఉండాలి. దీని వల్ల ఇంటర్వ్యూకు వెళ్లినప్పుడు ఏ ఉద్యోగానికై నా ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. – ఎస్‌ఎస్‌వీఎన్ శర్మ, రిటైర్డ్ ప్రొఫెసర్, ప్లేస్‌మెంట్స్ డీన్, వరంగల్ -
రౌడీషీటర్ దారుణ హత్య
● ఆర్థిక లావాదేవీలే కారణం.. ● పోలీసుల అదుపులో నిందితులు ● నిందితుల్లో ఓ మాజీ పోలీస్ కానిస్టేబుల్.. వరంగల్ క్రైం : నగరంలోని వడ్డేపల్లికి చెందిన రౌడీషీటర్ మహ్మద్ సాధిక్ హుస్సేన్(48) దారుణ హ త్యకు గురయ్యాడు. ఈ ఘటన బుధవారం రాత్రి సుబేదారి పీఎస్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ఎం.రంజిత్‌కుమార్ కథనం ప్రకారం.. మహ్మద్ సాధిక్ హుస్సేన్ తన పెద్దనాన్న కొడుకు ఖాదర్ హుస్సేన్‌కు రూ. 3 లక్షలు అప్పు ఇచ్చాడు. ఇందులో రూ. లక్ష ఇచ్చిన అనంతరం ఖాదర్ హుస్సేన్ మృతి చెందాడు. దీంతో సాధిక్ హుస్సేన్ తన మిగతా డబ్బులు తిరిగి ఇవ్వాలని ఇటీవల ఖాదర్ హు స్సేన్ కుమారులు మహ్మద్ సోహెల్, మహ్మద్ బషీర్‌ను అడిగాడు. దీంతో బుధవారం రాత్రి సాధిక్ హుస్సేన్ ఇంటికెళ్లిన మహ్మద్ సోహెల్, మహ్మద్ బషీర్.. మాట్లాడాలని సాధిక్ హుస్సేన్‌ను శ్మశాన వాటిక దగ్గరకు తీసుకొచ్చి మరో నిందితుడు అక్రమ్‌తో కలిసి హత్య చేశారు. సా ధిక్ హుస్సేన్‌ను హత్య చేస్తే డబ్బులు అడిగే వారు ఎవరూ ఉండరనే కారణంతో ఇంటి నుంచి తీసుకొచ్చి బండరాయితో మోది హత్య చేశారు. నిందితుల్లో అక్రమ్ గతంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించి ఓ హత్యకేసులో నిందితుడిగా ఉండడంతో సర్వీస్ నుంచి తొలగించినట్లు ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు.మృతుడి చెల్లి తస్లీమా బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. పోలీసుల అదుపులో నిందితులు? రౌడీషీటర్ మహ్మద్ సాధిక్ హుస్సేన్ హత్య కేసులో నిందితులుగా ఉన్న మహ్మద్ సోహెల్, మహ్మద్ బషీర్, మహ్మద్ అక్రమ్ పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలిసింది. సాధిక్ హుస్సేన్ హత్య విషయం తెలిసి న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్‌కుమార్ ఎదుట నిందితులు నేరుగా వచ్చి నేరం అంగీకరించి లొంగిపోయినట్లు తెలిసింది. పోలీసులు మాత్రం ధ్రువీకరించలేదు. -
పెరుగుతున్న వరద ప్రవాహం
కాళేశ్వరం: మహదేవపూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీకి గురువారం వరద ప్రవాహం పెరిగింది. మహారాష్ట్రలో కరుస్తున్న వర్షాలతో వరద కాళేశ్వరం మీదుగా తరలివస్తోంది. దీంతో మేడిగడ్డ వ ద్ద 85 గేట్లను ఎత్తి ఉంచడంతో 5,400 క్యూసెక్కుల నీరు దిగువకు తరలుతోంది. మొత్తం 16.17 టీ ఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల బ్యారేజీలో ప్రస్తుత వరద ప్రవాహం నది మట్టానికి 89.10 మీటర్ల ఎత్తులో ఉందని అధికారులు పేర్కొంటున్నారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద ప్రవాహం -
ఎమ్మెల్యే మావోడే..!
సాక్షి, మహబూబాబాద్: ఎమ్మెల్యే మా బాబాయ్.. మా బావ.. మా అన్న.. మాకు దగ్గరి బంధువు.. ఆ యన కుటుంబంతో మాకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు చెప్పుకుంటూ మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ పేరుతో పలు దందాలు చేస్తున్నారు. ఈ విషయం ఆనోట..ఈనోట ఎమ్మెల్యే వరకు చేరింది. దీంతో ఆయన ఏకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన పేరు వాడుకొని దందాలు చేస్తే సహించేది లేదని హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. మండలానికో షాడో ఎమ్మెల్యే.. మహబూబాబాద్ నియోజకవర్గంలోని మహబూ బాబాద్ పట్టణం, మహబూబాబాద్, నెల్లికుదురు, కేసముద్రం, గూడూరు మండలాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యే పేరుతో పలువురు నాయకులు అక్రమ మార్గంలో దందాలు చేస్తూ పార్టీకి, ఆయనకు చెడ్డపేరు తెస్తున్నారని గతంలో విమర్శలు వచ్చాయి. కాగా మండలాల్లో కొందరు తాము షాడో ఎమ్మెల్యే అని చెప్పుకుంటూ దందాలు చేస్తున్నారు. తాము చెప్పిందే వేదం అనే స్థాయికి చేరినట్లు సమాచారం. కాగా వారు పార్టీకి కార్యకర్తలను దూరం చేస్తున్నట్లు పలువురు ముఖ్య కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఆగ్రహం.. తన పేరు చెప్పి అక్రమ దందాలు, డబ్బులు వసూలు చేస్తున్న విషయాన్ని కొందరు కార్యకర్తలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అలాగే మండలాలు, మహబూబాబాద్ పట్టణంలో తన పేరు చెప్పి ఇబ్బందులు పెడుతున్నారని కొందరు అధికారులు కూడా ఎమ్మెల్యేకు తెలిపినట్లు సమాచారం. అలాగే ముఖ్యకార్యకర్తల ఎదుట వాపోయి నట్లు తెలిసింది. దీంతో ఎమ్మెల్యే కొందరికి ఫోన్‌చేసి మందలించడంతో పాటు మరికొందరిని హెచ్చరించినట్లు తెలిసింది. ఇంతటితో ఆగకుండా గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎవరైనా తన పేరు వాడుకొని దందాలు చేస్తే నేరుగా చెప్పండి అంటూ ఎమ్మెల్యే టోల్ ఫ్రీ నంబర్ కూడా ప్రకటించడం గమనార్హం. పైరవీలు.. దందాలు.. ఎమ్మెల్యేతో దిగిన ఫొటోలు చూపించడం, ఎమ్మెల్యే ఫోన్లో చనువుగా మాట్లాడిన తీరును రికార్డు చేసి వినిపించి పలువురు పైరవీలకు తెరతీసినట్లు ప్రచారం. కేసముద్రం, నెల్లికుదురు మండలాల్లో ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామని పలువురు కాంగ్రెస్ నాయకులు డబ్బులు వసూలు చేశారు. తీరా లబ్ధిదారుల తుది జాబితాలో సదరు వ్యక్తి పేరు లేకపోవడంతో పైరవీ చేసిన నాయకుడితో గొడవ పడినట్లు తెలిసింది. మహబూబాబాద్, కేసముద్రం మండలాల్లో రాజీవ్ యువ వికాసం డబ్బులు ఇప్పిస్తామని, ముందుగా కొంత మేరకు ముట్టచెప్పాలని వసూలు చేసినట్లు తెలిసింది. అయితే డబ్బులు ఇచ్చిన వాళ్లు రూ.లక్షపైగా రుణాలకు దరఖాస్తు చేసుకోగా.. మొదటి విడత రూ. 50వేల నుంచి రూ.లక్ష వరకే ఇస్తారని ప్రచారం జరగడంతో పైరవీ చేసిన వ్యక్తి చేతులు ఎత్తేసినట్లు ఆయా మండలాల్లో ప్రచారం జరిగింది. నెల్లికుదురు మండలంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారితో ఓ నాయకుడు చేతులు కలిపి ఎమ్మెల్యే పేరు అధికారుల ఎదుట వాడుకున్నట్లు ప్రచారం. తమకు నచ్చిన వారి ట్రాక్టర్లే నడవాలని, లేకపోతే కేసులు పెట్టాల ని, అంతా ఎమ్మెల్యే చూసుకుంటారని సదరు నాయకుడు స్థానిక అధికారులకు హుకుం జారీ చేసినట్లు సమాచారం. మహబూబాబాద్ పట్టణంలో పలువురు నాయకులు తమ బినామీల పేర్లతో ట్రాక్టర్లు పెట్టి నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు చేసి అమ్ముతున్నట్లు చర్చ జరుగుతోంది. మహబూబాబాద్ మున్సిపాలిటీలో డోర్ నంబర్లు ఇప్పిస్తామని కొందరు పేదల నుంచి డబ్బులు వసూలు చేసిన విషయంపై కాంగ్రెస్ పార్టీలో చర్చగా మారింది. మహబూబాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పేరుతో దందాలు అధికారుల ముందు శాసనసభ్యుడి పేరు చెప్పి బెదిరింపులు రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామని డబ్బుల వసూలు మున్సిపాలిటీలో డోర్ నంబర్లు ఇప్పిస్తామని పేదలకు ఆశ ఎమ్మెల్యే వరకు వెళ్లిన వ్యవహారం -
సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి
పాలకుర్తి టౌన్: సేంద్రియ వ్యవసాయ విధానంపై రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. గురువారం స్థానిక క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, తొ ర్రూరు, పెద్దవంగర, రాయపర్తి మండలాలకు చెందిన వ్యవసాయశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. సేంద్రియ వ్యవసాయంతోనే మానవ మనుగడ సాధ్యమని, అఽత్యధికశాతం ఈ దిశగా అవగాహన కల్పించి రైతులను ప్రోత్సహించాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని చెప్పారు. ప్రతీ గ్రామంలో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో జనగామ డీఏఓ రామారావునాయక్, ఏడీఏ అజ్మీరా పరశురాంనాయక్, ఏఓలు శరత్చంద్ర, దివ్య, విజయ్‌రెడ్డి, వీరభద్రం, రామనర్సయ్య పాల్గొన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి -
విషసర్పాలతో తీరని విషాదం..
టేకుమట్ల: జయశంకర్భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రానికి చెందిన బొల్లు శ్రీనివాస్(55) కొన్ని సంవత్సరాలుగా మండల కేంద్ర సమీప గ్రామం అంకుషాపూర్‌లో ఉంటున్నాడు. భార్య, కుమారుడు హైదరాబాద్‌లో ఉండగా శ్రీనివాస్ ఒంటరిగా కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో శ్రీనివాస్ మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాము కాటుకు గురయ్యాడు. తెల్లవారుజామున స్థానికులకు తెలపడంతో వారు చికిత్స నిమిత్తం చిట్యాల సివిల్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దంట్లకుంటతండాలో బాలుడు.. మరిపెడ రూరల్: మహబూ బాబాద్ జిల్లా మరిపెడ మండలం దంట్లకుంటతండాకు చెందిన గుగులోత్ భీమ్య, నీల దంపతులు కవల కుమారుడు రమేశ్ (4) తల్లి నీలతో కలిసి బుధవారం అర్ధరాత్రి ఇంట్లో కింద నిద్రిస్తున్నాడు. ఈ సమయంలో రమేశ్‌ను పాము కాటు వేసింది. అ నంతరం అదే పాము ఇంటి ఎదుట ఉన్న కోళ్ల గూ టిలోకి వెళ్లడంతో కోళ్లు అరిచాయి. దీంతో కుటుంబ సభ్యులు నిద్ర లేచి గూటిలో చూడగా పాము కాటుతో రెండు కోడి పిల్లలు మృతి చెంది కనిపించాయి. అనుమానంతో తల్లిదండ్రులు ఇంట్లోకి వచ్చి చూడగా బాలుడికి పాము కాటు గుర్తులు, రక్తం కనిపించింది. దీంతో లబోదిబోమంటూ చికిత్స నిమిత్తం అదేరోజు రాత్రి ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ గురువారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. విషసర్పాలతో తీవ్ర విషాదం అలుముకుంది. అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాములు కాటు వేయడంతో ఓ వ్యక్తి, ఓ బాలుడు మృతి చెందాడు. దీంతో ఆ రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి. ఈ ఘటనలు జయశంకర్భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో చోటు చేసుకున్నాయి. పాముకాటుతో ఇద్దరి మృతి టేకుమట్ల, దంట్లకుంటతండాలో ఘటనలు శోకసంద్రంలో మృతుల కుటుంబాలు -
మత్తు పదార్థాల నిర్మూలన ప్రతీ ఒక్కరి బాధ్యత
కేయూ క్యాంపస్ : మత్తు పదార్థాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యతని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె.ప్రతాప్ రెడ్డి అన్నారు. కేయూ ఎన్ఎస్ఎస్, హనుమకొండ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సంయుక్తంగా ‘అంతర్జాతీయ డ్రగ్ వ్యతిరేక దినోత్సవం’ సందర్భంగా గురువారం కేయూలోని సెనేట్ హాల్లో జాతీయ సేవా పథకం ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఈసం నారాయణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వీసీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేయూ డ్రగ్ ఫ్రీ యూనివర్సిటీ అని, క్షణికానందం కోసం యువత తప్పటడుగు వేయొద్దన్నారు. మత్తు పదార్థాలతో వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబ, దేశంపై ప్రభావం ఉంటుందన్నారు. హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ డాక్టర్ కె.పట్టాభి రామారావు మాట్లాడుతూ భావిభారత యువత మత్తు పదార్థాలపై యుద్ధం చేయాలన్నారు. అవగాహనతో శారీకక, మానసిక ఆరోగ్యం పొందొచ్చని, తద్వారా ఏదైనా సాధించొచ్చన్నారు. రిజిస్ట్రార్ రామచంద్రం మాట్లాడుతూ డ్రగ్స్‌కు జీవితాన్ని బానిస చేసుకోవద్దని, తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను కనిపెడుతూ ఉండాలన్నారు. వరంగల్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ దేశాభివృద్ధికి మాదక ద్రవ్యాల వినియోగం గొడ్డలిపెట్టు అన్నారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ‘యాంటీ డ్రగ్స్’, ‘సే నో టు డ్రగ్స్’ పోస్టర్లను ఆవిష్కరించారు. క్యాంపస్‌లో ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో హనుమకొండ డీఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమా దేశ్‌పాండే, పాలకమండలి సభ్యురాలు కె.అనితారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి -
పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి
మహబూబాబాద్: గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రవి డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం డీపీఓ కార్యాలయంలో డీపీఓ హరిప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా రవి మాట్లాడుతూ.. మూడు నెలల వేతనాలు పెండింగ్ ఉండడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వాప్తంగా 60,000మంది కార్మికులు ఉన్నారని, వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రతీనెల ఒకటో తేదీన వేతనాలు ఇవ్వాలన్నారు. జీఓ 54ను రద్దు చేసి అందరిని రెగ్యులర్ చేయాలన్నారు. కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలన్నారు. పీఎఫ్, ఈఎస్ఐతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కార్యక్రమంలో శ్రీకాంత్, పరుషరాములు, సర్సయ్య, బీకు తదితరులు పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్డోర్నకల్: డోర్నకల్ మున్సిపల్ కమిషనర్‌గా బి.నిరంజన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మున్సిపల్ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. తొర్రూరు కమిషనర్.. తొర్రూరు: తొర్రూ రు మున్సిపల్ కమిషనర్‌గా నియమితులైన వక్కాల శ్యాంసుందర్ గురువారం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలినెహ్రూసెంటర్: ఎన్హెచ్ఎం పరిధిలో పని చేస్తున్న ఉద్యోగులకు నెలనెలా వేతనాలు చెల్లించాలని తెలంగాణ ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కరుణాకర్ బుధవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలీ చాలని వేతనాలతో పని చేస్తున్న ఉద్యోగులకు ఇంక్రిమెంట్, పదోన్నతి, ఉద్యగ భద్రత కల్పించాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న రెండు నెలల జీతాలు అందజేయాలన్నారు. రాష్ట్ర బృందం సందర్శననెహ్రూసెంటర్: మహబూబాబాద్ పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని మెడికల్ కళాశాల మానిటరింగ్ బృందం గురువారం సందర్శించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిశీలనలో భాగంగా మేనేజింగ్ డైరెక్టర్ ఫణింద్రారెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, ఓయూ ప్రిన్సిపాల్ రాజారావు ప్రభు త్వ మెడికల్ కళాశాల, జీజీహెచ్‌లోని మౌలిక వసతులు, బిల్డింగ్, తరగతి గదులు, అన్ని విభాగాలను పరిశీలించారు. మెడికల్ విద్యార్థులు, రోగులకు అందుతున్న సేవలు, సౌకర్యాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జీఎంసీ, జీజీహెచ్‌పై ప్రభుత్వానికి నివేదికను సమర్పించనున్నట్లు వారు పేర్కొన్నారు. రేపు బెస్ట్ అవైలబుల్ స్కీం ఎంపికలుమహబూబాబాద్ అర్బన్: ఈ నెల 28వ తేదీ ఉదయం 11గంటలకు 2025–26 విద్యా సంవత్సరానికి గిరిజన విద్యార్థుల బెస్ట్ అవైలబుల్ స్కీం ఎంపికలు లాటరీ పద్ధతిలో ములుగు జిల్లా ఏటూరునాగరం ఐటీడీఓ ఐడీఓసీ కార్యాలయంలో జరుగుతాయని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా గురువారం పేర్కొన్నారు. మానుకోట జిల్లా నుంచి దరఖాస్తు చేసుకున్న గిరిజన వి ద్యార్థులు, తల్లిదండ్రులు ఎంపికలకు హాజరుకావాలని సూచించారు. -
ప్రాణాలతో చెలగాటం
కొత్తగూడ: ప్రభుత్వ ఉద్యోగం సాధించడం యువత కల. ఆ కలను సాకారం చేసుకొని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగంలో చేరిన విద్యుత్‌శాఖ ఉద్యోగులు మాత్రం ఇటీవల జరుగుతున్న విద్యుత్ ప్రమాదాలను చూసి వణికిపోతున్నారు. గంగారం మండలంలో బుధవారం జేఎల్ఎం చిలుక ప్రవీణ్(25) విద్యుదాఘాతంతో మృతి చెందడంతో ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఎల్సీ తీసుకున్నప్పటికీ విద్యుత్‌షాక్ తగిలి మృతి చెందడం ఏంటని, తమ పరిస్థితి ఏమిటని తర్జనభర్జన పడుతున్నారు. వేసవిలో గాలిదుమారం, వానాకాలంలో వర్షాలతో.. ఏజెన్సీ గ్రామాలకు విద్యుత్ లైన్లు అడవి మార్గాన కిలోమీటర్ల మేర వెళ్తున్నాయి. దీంతో ఎండాకాలం గాలి దుమారాలు, వానాకాలంలో వర్షాలతో చెట్లు, కొమ్మల వల్ల తీగలు తెగడం, విద్యుత్ స్తంభాల కాసారాలు పగిలిపోతుంటాయి. దీంతో ఆయా గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడుంది. వీటిని సరిచేసేందుకు విద్యుత్ సిబ్బంది రాత్రినక, పగలనక అడవుల్లో తిరగాల్సి వస్తోంది. అనుమానం వచ్చిన స్తంభం పైకి ఎక్కి పరిశీలిస్తుంటారు. ఈక్రమంలో ఎల్సీ తీసుకున్నప్పటికీ ఒక్కోసారి వివిధ కారణాల వల్ల విద్యుత్ సరఫరా అయి ప్రాణాల మీదకు వస్తుంది. గత సంవత్సరం ఓటాయి గ్రామానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి రవి విద్యుత్ షాక్ తగిలి చెయ్యి కోల్పోయాడు. ఇలా చాలా వరకు విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయి. విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా లైన్ కింద ఉన్న చెట్లను తొలగిస్తే విద్యుత్ సిబ్బందిపై అటవీశాఖ అధికారులు కేసులు పెట్టిన సంఘటనలు ఉన్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో పని చేయాలంటేనే విద్యుత్ ఉద్యోగులు జంకుతున్నారు. విద్యుత్ ఉద్యోగులకు కోటి రూపాయల బీమా.. విధి నిర్వహణలో ప్రమాదం జరిగి మృతి చెందిన ఉద్యోగులకు ప్రభుత్వం కోటి రూపాయల ఉచిత బీమా ప్రకటించింది. ఈమేరకు ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉన్నా.. పని ఒత్తిడి వల్ల చాలా మంది దరఖాస్తు చేసుకోలేదు. కాగా,ఇప్పటికై నా దరఖాస్తు చేసుకోవాలని ఉన్నతాధికారులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.గంగారంలో విద్యుత్ షాక్‌తో జేఎల్ఎం మృతి ఏజెన్సీలో ఉద్యోగమంటే వణుకుతున్న విద్యుత్‌శాఖ ఉద్యోగులు అడవుల్లో లైన్ల మరమ్మతులతో సతమతం -
గడ్డం కేశవమూర్తికి ఎన్టీఆర్ అవార్డు
హన్మకొండ అర్బన్ : సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రచయిత గడ్డం కేశవమూర్తికి విజయవాడకు చెందిన ఎక్స్ రే సాహిత్య సాంస్కతిక సేవా సంస్థ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని పద్మశ్రీ ఎన్టీ రామారావు స్మారక అవార్డు ప్రకటించింది. ప్రముఖ సినీ నటు డు డాక్టర్ రాజేంద్రప్రసాద్‌తోపాటు గడ్డం కేశవమూర్తికి ఈ అవార్డును ప్రదానం చేసింది. ఈ మేర కు గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణా భివృద్ధి శాఖల మంత్రి ధనసరి సీతక్క చేతుల మీదుగా కేశవమూర్తి ఈ అవార్డును అందుకున్నారు. కేశవమూర్తికి అవార్డు లభించడం పట్ల వివిధ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. కన్సల్టెన్సీల కార్మిక దోపిడీ అరికట్టాలిహన్మకొండ: ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల కన్సల్టెన్సీల కార్మిక దోపిడీని అరికట్టాలని టీజీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న డిమాండ్ చేశారు. జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులకు డ్రైవర్లను సరఫరా చేస్తున్న శ్రీ బాలాజీ కన్సల్టెన్సీ , సిస్కాన్ సంస్థలు డ్రైవర్ల జీతాల నుంచి పీఎఫ్ డబ్బులు కోత విధించి 5 నెలలుగా ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో జమ చేయకుండా సొంతానికి వాడుకోవడం అన్యాయమని గురువారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 5 నెలల నుంచి జేబీఎం బస్సులపై పని చేస్తున్న కార్మికుల జీతాల నుంచి పీఎఫ్ పేరుతో నెలకు రూ.3 వేల చొప్పున వసూలు చేసి ఖాతాలో జమ చేయకపోవడాన్ని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. పీఎఫ్ సొమ్ము దుర్వినియోగంపై జేబీఎం, ఆర్టీసీ యాజమాన్యం వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకుని ఆ సొమ్మును పీఎఫ్ ఖాతా లో జమ చేయించాలని డిమాండ్ చేశారు. కేయూ పీజీ కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షలుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో పీజీ కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షలు జూలై 25నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి సౌజన్య గురువారం తెలిపారు. ఈ మేరకు గురువారం టైం టేబుల్ విడుదల చేశారు. పీజీ కోర్సుల ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్, ఎంఎల్ఐఎస్సీ, ఎంటీఎం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు. జూలై 25, 28, 30, అగస్టు 1, 4, 6వ తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు సౌజన్య తెలిపారు. -
ఇందిరమ్మ ఇళ్లకు డబ్బులడిగితే కేసులు
● టోల్ ఫ్రీ నంబర్ 83284 73007కు సమాచారం ఇవ్వండి ● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్మహబూబాబాద్ రూరల్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి దారుల ఎంపికలో అవకతవకలు, అక్రమాలు, అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేదిలేదని, క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లలో అవినీతికి పాల్పడితే టోల్ ఫ్రీ నంబర్ 83284 73007 కు ప్రజలు సమాచారం అందించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో లబ్ధిదారుల నుంచి వసూళ్లకు పాల్పడినా, తన పేరు చెప్పి అధికారులను, ఇతర వ్యక్తులను బెదిరించినా సహించేదిలేదన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని, అర్హులకే సంక్షేమ పథకాలు అందుతాయని, దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. త్వరలో మంత్రుల రాక.. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంతో ప్రజాపాలన కొనసాగిస్తుందని, త్వరలో మహబూబాబాద్ నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేపడుతామని ఎమ్మెల్యే తెలిపారు. అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరవుతున్నారన్నారు. సమావేశంలో కేసముద్రం ఏఎంసీ చైర్మన్ ఘంట సంజీవరెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఖలీల్, మిట్టకంటి రామిరెడ్డి, ఎడ్ల రమేశ్, నీరుటి లక్ష్మీనారాయణ, సురేశ్, అంబటి మహేందర్ రెడ్డి, బండారు వెంకన్న, భువనగిరి గిరిధర్ గుప్తా, చలమల్ల నారాయణ, పోతురాజు రాజు, బోడ రవి, శంతన్ రామరాజు, రామగోని రాజు, మానుకోట ఏఎంసీ డైరెక్టర్ దేశెట్టి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
సర్వే ప్రకారం పాస్‌పుస్తకాలు అందించాలి
కేసముద్రం: ఎంజాయ్మెంట్ సర్వే ప్రకారం తమ భూములకు పట్టాదారు పాస్‌పుస్తకాలు అందించాలని గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నారాయణపురం గ్రామ రైతులు వంటావార్పు కార్యక్రమం చేపట్టి, ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆ గ్రామ మాజీ ఎంపీటీసీ దారావత్ రవి, పలువురు రైతులు మాట్లాడుతూ... 60 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న 1,827 ఎకరాల పట్టా భూములను 2017లో గత ప్రభుత్వం భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా ఫారెస్టు భూములుగా పేర్కొంటూ పట్టాలను రద్దు చేసిందన్నారు. అప్పటి నుంచి తమకు ప్రభుత్వ పథకాలు అందడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జీఓ 94 జారీ చేసి, రైతు పేరు, తండ్రి పేరు కు బదులు వస్తున్న అడవి అనే పదాన్ని తొలగించిందన్నారు. అధికారుల బృందం ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించి ఆరునెలలు కావొస్తున్నా పాస్ పుస్తకాలు జారీ చేయలేదన్నారు. సుమారు 600మంది రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు లేకపోవడంతో నష్టపోవాల్సి వస్తుందని, ఇప్పటికై నా అధికారులు స్పందించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్ ఎదుట వంటావార్పు చేసి రైతులంతా సహపంక్తి భోజనాలు చేశారు. అనంతరం తహసీల్దార్ వివేక్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతులు వెంకన్న, బాషా, వెంకట్‌రెడ్డి, విష్ణురెడ్డి, రవి, రాములు, యాకూబ్‌రెడ్డి, యాకూబ్, లక్పతి, దేవా, సరిత, నవీన్ తదితరులు పాల్గొన్నారు. తహసీల్ ఎదుట నారాయణపురం రైతుల వంటావార్పు -
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే ధ్యేయం
మహబూబాబాద్ రూరల్: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే ధ్యేయంగా ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో గురువారం భారీర్యాలీ నిర్వహించారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పోతో కలిసి కలెక్టర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత మత్తు పదార్థాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో మత్తు పదా ర్థాలను నియంత్రించవచ్చన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తమ పిల్లలతో ప్రతీరోజు మాట్లాడటం ద్వారా ఇష్టాలు, లక్ష్యాలు తెలుస్తాయని, ఒకవేళ మంచికి భిన్నమైన ఆలోచనలతో ఉంటే వాటిని ఆపే అవకాశం ఉంటుందన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో ఎంతో ముఖ్యమైందన్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మాట్లాడుతూ.. డ్రగ్స్ నియంత్రణలో పోలీసుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు, పాఠశాల స్థాయి నుంచే డ్రగ్స్‌పై అవగాహన ఉండాలని, తద్వారా డ్రగ్స్ రహిత స మాజాన్ని చూడగలుగుతామన్నారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ ధనమ్మ, డీఎంహెచ్ఓ రవిరాథోడ్, జిల్లా ఎకై ్సజ్ అధికారి కిరణ్, డీఎస్పీ తిరుపతిరావు, తహసీల్దార్ చంద్రరాజేశ్వర్, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ ఎస్.నాగవాణి, టౌన్ సీఐ మహేందర్ రెడ్డి, విద్యార్థులు, అంగన్వాడీ టీచర్లు, ఆశవర్కర్లు, సఖీ సిబ్బ ంది, మహిళలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ -
కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షల ఫలితాలు విడుదల
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో ఏప్రిల్, మేలో నిర్వహించిన డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బి ఒకేషనల్, బీఏ ఎల్ ఐదవ, ఆరవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను గు రువారం క్యాంపస్‌లో వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం, పరీక్షల విభాగం అధికారులతో కలిసి విడుదల చేశారు. ఆయా కోర్సుల్లో ఐదవ సెమిస్టర్ పరీక్షల ఫలితాల్లో మొత్తం 13,963 మంది విద్యార్థులకుగాను 7,059 మంది (50.56శాతం) ఉత్తీర్ణులయ్యారని పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ తెలిపారు. ఆరవ సెమిస్టర్ పరీక్షలకు 37,999మంది విద్యార్థులు హాజరుకాగా, 19,060 (50.16శాతం) మంది ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. ఆయా పరీక్షల ఫలితాలను కేయూ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. కార్యక్రమంలో అదనపు పరీక్షల నియంత్రణాధికారులు తిరుమలాదేవి, వెంకటయ్య, సౌజన్య, పద్మజ, ఆసిం ఆక్బాల్, నాగరాజు, కేయూ అభివృద్ధి అధికారి వాసుదేవరెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు , తదితరులు పాల్గొన్నారు. రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.. ఆయా డిగ్రీ కోర్సుల సెమిస్టర్ల విద్యార్థులకు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 15 రోజుల సమయం ఉంటుంది. ఆన్లైన్లోనే సంబంధిత వెబ్సైట్ద్వారా దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. వివరాలు కూడా అందులోనే ఉంటాయి. త్వరలో 2,4 సెమిస్టర్ల వాల్యుయేషన్ ప్రక్రియ.. డిగ్రీ కోర్సుల రెండు, నాలుగు, ఐదవ, ఆరవ సెమిస్టర్ల పరీక్షలు ఒకేసారి జరిగినా తొలుత ఫైనలియర్ విద్యార్థులకు సంబంధించిన ఆరవ సెమిస్టర్ పరీక్షలు, బ్యాక్లాగ్ ఐదవ సెమిస్టర్ పరీక్షల జవాబుపత్రాలు మూల్యాంకనం చేయించారు. తద్వారా ఆయా విద్యార్థులు వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం ఉంటుంది. వాస్తవంగా ఈసారి ప్రైవేట్ యాజమాన్యాలకు రీయింబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో పరీక్షల ఫీజులు చెల్లించడంలో జాప్యం చేసిన విషయం తెలిసిందే. దీంతో పరీక్షలు ఆలస్యంగా జరిగాయి. 2, 4 సెమిస్టర్ల పరీక్షల జవాబుపత్రాలకు సంబంధించిన మూల్యాంకనం త్వరలోనే నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఈ ఫలితాలు వచ్చేసరికి కొంతసమయం పట్టే అవకాశం ఉంది. డిగ్రీ కోర్సుల ఒకటి, మూడో సెమిస్టర్‌కు సంబంధించిన బ్యాక్ లాగ్ సబ్జెక్ట్‌ల పరీక్షలు ఇటీవలే ముగిశాయి. ఐదవ సెమిస్టర్లో 50.56 శాతం.. ఆరవ సెమిస్టర్లో 50.16శాతం ఉత్తీర్ణత -
భద్రకాళి అమ్మవారికి సహస్ర కలశాభిషేకం
● శాకంబరి ఉత్సవాలు ప్రారంభం హన్మకొండ కల్చరల్: వరంగల్ నగరంలోని శ్రీభద్రకాళి దేవాలయంలో శాకంబరి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారికి సహస్ర కలశాభిషేకోత్సవం శోభాయమానంగా జరిగింది. కుడా చెర్మన్ ఇనుగాల వెంక్రటామిరెడ్డి, దేవాలయం ధర్మకర్తల మండలి చైర్మన్ డాక్టర్ శివసుబ్రహ్మణ్యం అమ్మవారి సన్నిధిలో జ్యోతిప్రజ్వలనం చేసి ఉత్సవాలను ప్రారంభించారు. సహస్ర కళశాభిషేకం మధ్యాహ్నం ప్రారంభమైంది. భద్రకాళి పంచమూర్తులకు, శ్రీచక్రానికి అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారిని కాళీక్రమంలో అలంకరించారు. రాత్రి కామేశ్వరీనిత్యాక్రమంలో ఆవరణార్చనలు జరిపా రు. భక్తులతో దేవాలయం కిక్కిరిసిపోయింది. భద్రకాళి శరణంమమ అంటూ జయజయధ్వానాలు చేస్తూ పులకించిపోయారు. ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ శేషు భారతి, సూపరింటెండెంట్ అద్దంకి విజయ్‌కుమార్, ఆలయ ధర్మకర్తలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని శుక్రవారం ఉదయం కపాలినీ క్రమంలో, సాయంత్రం భగమాలినిక్రమంలో పూజలు జరపనున్నారు. -
ప్రభుత్వ విధానాలపై సమరశీల పోరాటాలు
నెహ్రూసెంటర్: ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక ప్రభుత్వ విధానాలపై సమరశీల పోరాటాలు నిర్వహించాలని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి పాయం చిన్న చంద్రన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన సంస్కరణలతో కార్మికులు, రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి డీవీ కృష్ణ వర్ధంతి సభలను నేటి నుంచి 29వ తేదీ వరకు గ్రామగ్రామాన నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రవి, నాయకులు పూనెం ప్రభాకర్, ముంజంపల్లి వీరన్న, బిల్లకంటి సూర్యం, ఉమ్మగాని సత్యం, తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి
తొర్రూరు: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని వేటా (ఉమెన్ ఎంపవర్మెంట్ ఆఫ్ తెలుగు ఆసోసియేషన్) అధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి అన్నారు. డివిజన్ కేంద్రంలోని నితిన్ భవన్లో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్షరాభ్యాస కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలకు 10వేల పలకల పంపిణీని ప్రారంభించారు. పలువురు చిన్నారులకు ఝాన్సీరెడ్డితో అక్షరాభ్యాసం చేయించారు. ఫౌండేషన్ డైరెక్టర్ తక్కెళ్లపల్లి రవీంద్రతో కలిసి ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బిడ్డల అభ్యున్నతికి వందేమాతరం ఫౌండేషన్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పాటుపడుతుందని, దానిలో భాగంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకులాలను ఏర్పాటు చేస్తోందన్నారు.ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలకు చేయూతనందించేందుకు ఝాన్సీరెడ్డి రూ.లక్ష విరాళం ప్రకటించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, వీఎంఎఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
పేదల ఐక్యతను దెబ్బతీస్తున్న కులవ్యవస్థ
నెహ్రూసెంటర్: సమాజంలో పేదల ఐక్యతను దెబ్బతీసే విధంగా కుల వ్యవస్థ తీవ్రంగా పని చేస్తుందని, సమాజంలో అంటరాని తనం, కుల వ్యవస్థతకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్‌బాబు అన్నారు. సంఘం జిల్లాస్థాయి శిక్షణ తరగతులు జిల్లా కేంద్రంలో బుధవారం ప్రారంభమయ్యాయి. ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ కార్పొరేషన్, సబ్‌ప్లాన్ అమలు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్నారు. ప్రభుత్వ వైద్యం ప్రజలకు అందుబాటులో లేకుండా పోతుందని, సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలకు సౌకర్యాలు కల్పించాలని సంఘం పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, చీపిరి యాకయ్య, దుడ్డెల రామ్మూర్తి, చింత ఎల్లయ్య, జిన్న లచ్చయ్య, మందుల యాకుబ్, నిదిగొండ చంటి పాల్గొన్నారు. -
సంక్షిప్త సమాచారం
ఆలయ అభివృద్ధికి విరాళం గార్ల: గార్లలోని ముత్యాలమ్మ ఆలయ అభివృద్ధికి దాత పతంగి సురేష్ ఆయన తల్లితండ్రులు దేవోజీ, సక్కుబాయిల జ్ఞాపకార్థం రూ.25వేలను ఆలయ నిర్వాహకులకు అందజేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగావత్ లక్ష్మణ్‌నాయక్ తన సొంత ఖర్చులతో తాగునీటి కోసం బోరు వేయిస్తానని హామీ ఇచ్చారు. అభినందనీయం మరిపెడ రూరల్: పేద విద్యార్థులకు దాతలు చేయూతనందించడం అభినందనీయమని బావోజిగూడెం యూపీఎస్ హెచ్ఎం గుగులోతు మంగు అన్నారు. బుధవారం పాఠశాల విద్యార్థులకు వందేమాతం ఫౌండేషన్ తొర్రూరు వారి సహకారంతో పలకలు పంపిణీ చేశారు. ఫౌండేషన్ అధ్యక్షుడు రవీందర్, ఉపాధ్యాయులు నవీత, లక్ష్మీనారాయణ, శ్రావణ్‌కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. పార్ట్ టైం ఉద్యోగులను రెన్యువల్ చేయాలి మహబూబాబాద్ రూరల్: తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకులాల్లో పనిచేస్తున్న తమను రెన్యువల్ చేయాలని కోరుతూ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పార్ట్ టైం ఉద్యోగుల సంఘం బాధ్యులు ఈశ్వరయ్య, ఉప్పలయ్య, మల్లయ్య బుధవారం హైదరాబాదులో కలిసి వినతిపత్రం అందజేశారు. రోడ్డు వెడల్పు తగ్గించాలి కేసముద్రం: మున్సిపాలిటీ పరిధిలో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులను 100 పీట్లు కాకుండా, 60 ఫీట్ల వెడల్పు వరకే రోడ్డును ఏర్పాటు చేయాలంటూ బుధవారం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వోలం శ్రీనివాస్, శ్రీనివాసరావు, గుణగంటి అశోక్, యాదగిరి పాల్గొన్నారు. విద్యా సామర్థ్యాల పెంపునకు కృషి చేయాలి దంతాలపల్లి: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో హెచ్ఎంలు ముందుండాలని ఎంఈఓ శ్రీదేవి అన్నారు. మండలకేంద్రంలో గల జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో బుధవారం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. విద్యా సామర్థ్యాల పెంపునకు ఉపాధ్యాయులు ప్రణాళికతో కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో హెచ్ఎంలు వేణుమాధవరెడ్డి, కృష్ణయ్య పాల్గొన్నారు. ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలి దంతాలపల్లి: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తమ ఇంటిని త్వరగా పూర్తి చేసుకోవాలని ఎంపీడీఓ వివేక్‌రామ్ అన్నారు. మండలంలోని కుమ్మరికుంట్ల, బొడ్లాడ గ్రామాలలో బుధవారం ఆయన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. త్వరగా ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకుంటే ప్రభుత్వం బిల్లులు ఇస్తుందన్నారు. ఇందిరమ్మ ఇంటి పత్రాల పంపిణీ కురవి: మండలంలోని రాజోలు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బుధవారం ఇళ్ల పట్టాలను కాంగ్రెస్ డోర్నకల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ బండి శ్రీనివాస్ గౌడ్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి మంజుల, నాయకులు అంబటి గోవర్ధన్ గౌడ్, అంబటి అనూష విష్ణువర్ధన్ గౌడ్, కొక్కు శ్రీనివాస్, మేకల గంగాధర్ యాదవ్ పాల్గొన్నారు. సమ్మె నోటీస్ అందజేత గూడూరు/గార్ల: కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు, లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 9న దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకుడు ఎండి. మోహినోద్దిన్ అన్నారు. బుధవారం ఎంపీడీఓ వీరస్వామికి సమ్మె నోటీస్ అందించారు. కాంగ్రెస్‌వి మోసపూరిత హామీలు చిన్నగూడూరు: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మోసపూరిత హామీలు ఇచ్చి రైతు పేరిట సంబురాలు జరుపుకోవడం విడ్డూరమని సేవాలాల్ సేన మండల ఇన్చార్జ్ బాదావత్ సురేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శాంతిచర్చలు జరపాలి బయ్యారం: మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతిచర్చలు జరపాలని సీపీఎం జిల్లా నాయకుడు మండా రాజన్న డిమాండ్ చేశారు. బుధవారం బయ్యారంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు మధు, నాగేశ్వరరావు, వెంకన్న, తిరుపతిరావు, పురుషోత్తం పాల్గొన్నారు. సౌండ్ సిస్టం బహూకరణ డోర్నకల్: స్థానిక మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలకు ప్రముఖ వ్యాపారి సురేందర్ జైన్ సౌండ్ సిస్టంను బుధవారం బహూకరించాడు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రిజ్వూనా, జ్యోత్స్న, రేచెల్, అనూష, రమ, దీప్తి పాల్గొన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటాం.. తొర్రూరు రూరల్: కాంగ్రెస్ బలోపెతం కోసం నిరంతరం పని చేస్తూ, ఆపదలో ఉన్న కార్యకర్తలకు అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝూన్సీరెడ్డి హమీ ఇచ్చారు. బుధవారం మండలంలోని తొర్రూరు, అమ్మాపురం, గుర్తూరు గ్రామాల్లో పలు బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం చేశారు. పాఠశాల తనిఖీ కేసముద్రం: మండలంలోని అన్నారం యూపీఎస్, ధర్మారంతండా, తాళ్లపూసపల్లి ప్రాథమిక పాఠశాలలను ఎంఈఓ కాలేరు యాదగిరి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో హెచ్ఎంలు బత్తుల శ్రీధర్, నాగనబోయిన వెంకటేశ్వర్లు, బాణాల ప్రమీల, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులను అరికట్టాలి గార్ల: గ్రామాల్లో సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కార్యదర్శులకు బుధవారం వినతిపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గంగావత్ లక్ష్మణ్‌నాయక్, శీలంశెట్టి రమేష్, గాజుల గణేష్, ధరావత్ సక్రు పాల్గొన్నారు. -
మద్యం, గుట్కా ప్యాకెట్ల స్వాధీనం
బయ్యారం: మండలంలోని రామచంద్రాపురం(రామగుండాల)లో బుధవారం ఎస్సై తిరుపతి ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బెల్ట్‌షాపుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 7వేల విలువైన మద్యం, 5వేల విలువైన గుట్కా, 10లీటర్ల గుడుంబా, 500లీటర్ల బెల్లంపానకంను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గ్రామస్తులకు ట్రాఫిక్‌రూల్స్, సైబర్‌క్రైం గురించి ఎస్సై అవగాహన కల్పించారు. ఇదేవిధంగా సరైన అనుమతి పత్రాలు లేని 20వాహనాలను సీజ్ చేయడంతోపాటు గుడుంబా, గుట్కాలు విక్రయిస్తున్న నలుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఎస్సై పుల్లారావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
మొండి బకాయిలు వసూలు చేయాలి
మరిపెడ రూరల్: మరిపెడ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని షాపుంగ్ కాంప్లెక్స్ లక్షల రూపాయల మొండి బకాయిలను తక్షణ వసూలు చేయాలని సీపీఐ మండల కార్యదర్శి బాలకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. కాంప్లెక్స్‌లో 20 షాపులు యజమానులు నెలల తరబడి కిరాయిలు చెల్లించడం లేదన్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుందని మండిపడ్డారు. సమయానికి కిరాయిలు చెల్లించని షాపులకు తక్షణమే నోటీసులు ఇచ్చి ఖాళీ చేయించాని ఎంపీడీఓను కోరారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఎండీ అబ్దుల్ రషీద్, పట్టణ కార్యదర్శి మల్లెపాక యాకన్న, సత్తెయ్య తదితరులు పాల్గొన్నారు. -
బడుల అభివృద్ధికి సహకారం అవసరం
కురవి: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే ఉత్తమ బోధన అందుతున్నదని బడుల అభివృద్ధికి దాతలు, తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరమని డీఈఓ రవీందర్‌రెడ్డి అన్నారు. పాఠశాలలో హెచ్ఎం తేలుకుంట్ల సునీత అధ్యక్షతన జరిగిన బడిబాట 2025–2026 విద్యాసంవత్సరానికి గాను ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే 54 మంది విద్యార్థులను ప్రాథమిక పాఠశాలలో చేర్చుకున్నారు. విద్యార్థులను బడిలో చేర్పించిన హెచ్ఎం సునీతను, బడిబాటలో పాల్గొని విద్యార్థుల నమోదు కోసం కృషి చేసిన నామ వెంకటేశ్వర్లు, దైద వెంకటేశ్వర్లు, లోడంగి పురుషలింగం, పత్తేపురపు నాగరాజు, పయ్యావుల వెంకటేశ్వర్లు, ఈడిగిరాల విష్ణువర్థన్, పొన్నం ఉపేందర్, కన్నోజు నవీన్, బరిగెల ఉమ, చెరుకుపల్లి పద్మలను సన్మానించారు. కార్యక్రమంలో ఎంఈఓ వి.బాలాజీ, హెచ్ఎంలు మధుసూదన్ రెడ్డి, షమదాన్వాడీ పాల్గొన్నారు. డీఈఓ రవీందర్‌రెడ్డి -
ఒంటికి, రెంటికి ఇబ్బందులు..
కురవి: మండలంలోని పలు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో టాయ్‌లెట్స్ నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. మండల కేంద్రంతోపాటు సూదనపల్లి తదితర గ్రామాల్లోని పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణ పనులను గత ప్రభుత్వ హయాంలో మన ఊరు–మనబడి కార్యక్రమంలో ప్రారంభించారు. వాటికి నిధులు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్టర్లు పనులను మధ్యలో నిలిపివేశారు. దీంతో పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో మూత్రశాలలు, మరుగుదొడ్లు వినియోగంలోకి రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. బాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. వీరికి తోడు మహిళా ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. నిధులు కేటాయించి పనులను పూర్తి చేస్తేనే అందరికి ఉపయోగపడుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. లేకుంటే వానాకాలంలో విద్యార్థులు నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అసంపూర్తిగా మరుగుదొడ్ల నిర్మాణాలు నిధుల లేమితో మధ్యలోనే ఆగిన పనులు ఆందోళన చేస్తాం.. ప్రభుత్వ పాఠశాలల్లో మూత్రశాలల సమస్యను పరిష్కరించాలి. జిల్లాలో అసంపూర్తిగా ఉన్న మరుగుదొడ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయించాలి. లేకుంటే పాఠశాలల సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. – గంధసిరి జ్యోతిబసు, ఎస్ఎఫ్ఐ నాయకుడు -
మాదకద్రవ్యాలతో జీవితాలు చిన్నాభిన్నం
మహబూబాబాద్ అర్బన్: మత్తుపదార్థాలతో విద్యార్థులు, యువత బతుకులు చిన్నాభిన్నం అవుతున్నాయని, యువత బంగారు భవిష్యత్ నాశనం చేసుకోవద్దని షీటీం ఎస్సై సునంద అన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో డ్రగ్స్ నియంత్రణ వారోత్సవాల సందర్భంగా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెచ్ఎం సిరి నాయక్, ఉపాధ్యాయులు వాసుదేవ్, రవీందర్, ఉమెన్ సెల్ ఎస్సై ఆనందం, రమేశ్, పార్వతి, సౌభాగ్య పాల్గొన్నారు. బయ్యారం: విద్యార్థులు మాదకద్రవ్యాలకు అలవాటు పడితే బంగారం లాంటి జీవితాలు చిన్నాభిన్నం అవుతాయని డీఎస్పీ తిరుపతిరావు అన్నారు. మండలంలోని నామాలపాడు ఏకలవ్య పాఠశాల ఆవరణంలో బుధవారం మాదకద్రవ్యాల వినియోగంకు వ్యతిరేకంగా నిర్వహించిన అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటారు. సీఐ రవికుమార్, ఎస్సై తిరుపతి పాల్గొన్నారు. వ్యసనాలకు బానిసలు కావద్దు డోర్నకల్: యువత మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని డోర్నకల్ సీఐ బి.రాజేష్ కోరారు. స్థానిక పోలీస్‌స్టేషన్ ఆవరణలో బుధవారం డ్రగ్స్, మత్తు పదార్థాలపై స్థానికులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్సై గడ్డం ఉమా, ఏఎస్సై కోటేశ్వరరావు పాల్గొన్నారు. కురవి: మత్తు యువత భవిష్యత్‌ను చిత్తుచేస్తుందని ఎస్సై గండ్రాతి సతీష్ అన్నారు. బుధవారం మండలంలోని నేరడ మోడల్ స్కూల్, కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్ వలన కలిగే అనర్థాలపై అవగాహన సమావేశం నిర్వహించారు. గూడూరు: డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతీ ఒక్కరు పోరాడాలని సీఐ సూర్యప్రకాష్ అన్నారు. మండల కేంద్రంలోని అరవింద, ప్రభుత్వ బాలుర హైస్కూల్లో బుధవారం డ్రగ్స్ వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్సై గిరిధర్‌రెడ్డి, పీఎస్సై, ఏఎస్సై, హెడ్‌కానిస్టేబుల్, సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. యువత సన్మార్గంలో పయనించాలి నెహ్రూసెంటర్: యువత, విద్యార్థులు డ్రగ్స్, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ సన్మార్గంలో పయనించాలని టౌన్ సీఐ జి.మహేందర్‌రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యార్థులకు బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచిస్తూ పోస్టర్లను ఆవిష్కరించారు. కొత్తగూడ: మండలంలోని క్రీడా పాఠశాల, ఏకలవ్య గురుకుల జూనియర్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఎస్సై కుశకుమార్ మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కల్పించారు. -
ఎమర్జెన్సీతో కాంగ్రెస్ నిరంకుశ పాలన
మహబూబాబాద్ అర్బన్: కాంగ్రెస్ పార్టీ నిరంకుశ పాలనకు ఆనాటి ఎమర్జెన్సీ విధించడం కాంగ్రెస్ పార్టీ చేసిన చారిత్రక తప్పిదమని బీజేపి జిల్లా కౌన్సిల్ సభ్యులు గడ్డం అశోక్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం పట్టణ అధ్యక్షుడు వెన్నమల అజయ్ అధ్యక్షతన ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు అయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి గడ్డం అశోక్ కుమార్ హాజరై మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ ప్రభుత్వం నిరంకుశంగా ప్రభుత్వ సొమ్మును వాడుకొని ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా ఆమె గెలుపునకు అలహాబాద్ కోర్టు చెల్లదని తీర్పు ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్యామ్ సుందర్ శర్మ, సందీప్, పట్టణ నాయకులు నరేష్ నాయక్, నాయని కృష్ణమోహన్, సుధాకర్, రవి, శ్యాంప్రసాద్ పాల్గొన్నారు. కేసముద్రం: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ చీకటి అధ్యాయానికి నేటితో 50 ఏళ్లు అయిందని బీజేపీ మండల అధ్యక్షుడు ఉప్పునూతల రమేశ్ విమర్శించారు. బుధవారం మున్సిపల్ కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి వోలం శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు రడం వెంకన్న, సహాయ కార్యదర్శి రామడుగు వెంకటాచారి, నాగేశ్వరాచారి పాల్గొన్నారు. -
మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
మహబూబాబాద్ రూరల్: గ్రామీణ ప్రాంతాల స్వయం సహాయక బృందాల మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాస్ అన్నారు. మానుకోట జిల్లా సమాఖ్య కార్యాలయంలో ఆర్‌ఏఎంపీ అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ఈసందర్భంగా అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎస్‌హెచ్‌జీ బృందాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఒక రోజు అవగాహన సదస్సు నిర్వహించామని తెలిపారు. ఔత్సాహిక మహిళలకు అవగాహన సదస్సు అనంతరం పదిహేను రోజుల పరిశ్రమ నిర్వహణ, ఉత్పత్తుల మార్కెటింగ్ మెలకువలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తారని తెలిపారు. ఈ సదస్సులో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీమన్నారాయణ, ఏపీఎంలు తిలక్, శ్రీనివాసరావు, బాబు, జిల్లా సమాఖ్య అధ్యక్షులు, అలీప్ కమిటీ సభ్యురాలు, అన్నపూర్ణ, తదితరులు పాల్గొన్నారు. తొర్రూరు: మహిళలు పారిశ్రామికవేత్తలు ఎదగాలని అలీప్ సంస్థ చైర్పర్సన్ రజినికుమారి తెలిపారు. డీఆర్డీఏ, అలీప్ సంస్థల ఆధ్వర్యంలో బుధవారం డివిజన్ కేంద్రంలోని రైతువేదికలో మహిళా స్వయం సహాయక సభ్యులకు చిరు పరిశ్రమల ఏర్పాటుపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీఎం సంజీవరావు, సంస్థ కోఆర్డినేటర్ రాధ, ఏపీఎం వీరయ్య, డీఆర్డీఏ ఈజీఎంఎం గణేష్ పాల్గొన్నారు. అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాస్ -
అధిక కరెంట్ బిల్లు తెచ్చిన విషాదం..
● బిల్లుపై అధికారిని అడిగొస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం ● వృద్ధురాలి దుర్మరణం ● మరొకరికి తీవ్రగాయాలు మహబూబాబాద్ రూరల్ : ఇంటికి అధిక కరెంట్ బిల్లు రాగా ఎందుకొచ్చిందని తెలుసుకునేందుకు వెళ్లిన సందర్భంలో ఓ వృద్ధురాలు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. ఈ ఘటన బుధవారం మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కంచర్లగూడెంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అవిరబోయిన ఐలమ్మ (69) ఇంటికి కరెంట్ బిల్లు అధికంగా (రూ.28 వేలు) వచ్చింది. దీంతో ఐలమ్మ, తన కుమారుడు నాగేశ్ ఆ విషయం తెలుసుకునేందుకు ఆటోలో ఉదయం కురవి మండల కేంద్రానికి వెళ్లి విద్యుత్ శాఖ అధికారితో మాట్లాడారు. అనంతరం తిరుగు ప్రయాణంలో నరేశ్.. తన తల్లి ఐలమ్మను ఆటోలో తీసుకొచ్చి మానుకోటలోని కురవి గేట్ ప్రాంతంలో వదిలిపెట్టాడు. తన ఆటో సీరియల్ ఆలస్యమవుతుందని పోలంపల్లి తండాకు చెందిన బాలు ఆటోలో తల్లిని ఇంటికి పంపించగా ఇదే ఆటోలో మరో ప్రయాణికుడు కూడా వెళ్లాడు. ఆటో మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి సాలార్ తండా దాటి రాజోలు వైపునకు వెళ్తుండగా ఎదురుగా కురవి నుంచి మహబూబాబాద్ వైపునకు వస్తున్న బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐలమ్మ ఆటో నుంచి కింద పడి అక్కడికక్కడే దుర్మరణం చెందగా ద్విచక్రవాహనంపై ఉన్న మానుకోట పట్టణానికి చెందిన పుచ్చకాయల తరుణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఐలమ్మ, తరుణ్‌ను ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. తరుణ్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ తరలించారు. కురవి ఎస్సై సతీశ్ ఘటనాస్థలిని సందర్శించి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వృద్ధురాలి ప్రాణం తీసిన చింతచెట్టు
వాజేడు: పంట సాగు చేస్తున్నప్పుడల్లా చింతచెట్టు నీడ పడి పంట మంచిగా రావడం లేదని, ఆ చెట్టును తొలగిస్తే పంట బాగుంటుందని భావించారు వృద్ధ దంపతులు. కానీ, ఆ చెట్టు రూపంలోనే దూసుకొచ్చిన మృత్యువు ఆ దంపతుల్లో భార్య ప్రాణం తీసింది. ఈ ఘటన ములుగు జిల్లా వాజేడు మండలం మోతుకులగూడెంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతుకులగూడెం గ్రామానికి చెందిన బండి నారాయణ, రాజమ్మ(65) దంపతులు ఆ గ్రామంనుంచి వచ్చి రేగులపాడులో కొడుకు, కోడలితో కలిసి ఉంటున్నారు. మోతుకులగూడెం గ్రామంలో ఉన్న ఇంటి స్థలాన్ని బాగు చేసి కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు. ఆ స్థలంలో ఒక పక్కన చింతచెట్టు ఉండడంతో సాగుకు ఇబ్బంది లేకుండా ఉండాలనే ఆలోచనతో దానిని కూలీలను పెట్టి నరికిస్తున్నారు. తెగిన కొమ్మలను తాడుకట్టి పక్కకు లాగడంతో కొమ్మ తెగి విద్యుత్ తీగల మీద పడ్డాయి. దీంతో తీగలు తెగి కిందపడ్డాయి. తీగలు పడిన వైపు ఉన్న రాజమ్మ.. అటువైపుగా వస్తున్న రామక్క అనే మరో మహిళతో మాట్లాడుతూ తెగిపడిన తీగలను పక్కకు వేయాలనే ఉద్దేశంతో వాటిని పట్టుకుంది. వ్యవసాయ పనుల కోసం ఏర్పాటు చేసిన త్రీఫేజ్ విద్యుత్ లైన్ కావడంతో రాజమ్మ పట్టుకున్న తీగ చేతిలో ఉండగానే అక్కడికక్కడే మృతిచెందింది. అక్కడే మేస్తున్న పశువులు నాలుగు తెగిపడిన విద్యుత్ తీగలు తగిలి మృత్యువాత పడ్డాయి. వెంటనే అక్కడికి చేరుకున్న గ్రామస్తులు మిగతా పశువుల గుంపును దూరంగా పంపించి విద్యుత్ సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇచ్చారు. భర్త నారాయణ విద్యుత్ తీగలు తెగిపడిన వైపు కాకుండా మరోవైపు ఉండడంతో అతనికి ఏమీ కాలేదు. కాగా, ఇన్ని రోజులు త్రీ ఫేజ్ విద్యుత్ లైన్‌కు సరఫరా లేకపోగా, వరి నార్లు పోసుకుంటామని కొందరు రైతులు కోరడంతో విద్యుత్ సరఫరా చేసినట్లు సిబ్బంది తెలిపారు. అనంతరం అక్కడికి వచ్చిన పోలీసులు వివరాలు సేకరించారు. విద్యుత్ తీగల బారిన పడి తల్లి మృతిచెందడంతో కొడుకు, కోడలు, కూతురు రోదిస్తున్న తీరు స్థానికులను కంట తడి పెట్టించింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
పండుగకు సరుకులు కొనడానికి వస్తూ.. మృత్యుఒడికి
చిట్యాల : మొహర్రం పండుగ కు సరుకులు కొనడానికి వస్తు న్న ఇద్దరు యువకులు మృత్యుఒడికి చేరారు. డీసీఎం, బైక్ ఢీకొన్న ప్రమాదంలో అ క్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం బుధవా రం సాయంత్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చి ట్యాల మండలం ఏలేటిరామయ్యపల్లి గ్రామ శివా రు కర్ణాలకుంట వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని నవాబుపేటకు చెందిన ఎండి.హకీం పాషా(20), కై లాపూర్‌కు చెందిన సకినాల కుమారస్వామి (21) పని నిమిత్తం బైక్‌పై నవాబుపేట నుంచి చిట్యాలకు వస్తున్నారు. ఈ క్రమంలో చిట్యాల నుంచి నవాబుపేట వైపునకు వెళ్తున్న డీసీఏం కర్ణాలకుంట వద్ద ఎదురుగా ఢీకొ న్నాయి. ఈ ప్రమాదంలో ఎండి. హకీం పాషా, కుమారస్వామి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కాగా, కుమారస్వామి హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఎండి.హకీం పాషా గ్రా మంలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. నవాబు పేటలో ప్రతీ సంవత్సరం జరిగే మొహర్రం వేడుకలకు కుమారస్వామి హాజ రయ్యేవాడు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు తన స్వగ్రామం కైలా పూర్ వచ్చాడు. ఈ క్రమంలో కమారస్వామి నవాబుపేటకు వె ళ్లాడు. అనంతరం ఇద్దరు కలిసి మెహర్రం పండుగకు కావాల్సి న సరుకులు కొనుగోలు చేసేందుకు బైక్‌పై చిట్యా లకు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ స మాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకుని బోరున విలపించారు. ఇద్దరి మృత దేహాల మీద పడి గుండెలవిసేలా రోదించారు. ఈ విషయం తెలుసుకున్న చిట్యాల ఎస్సై –2 ఈశ్వర య్య సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాలను సివిల్ ఆస్పత్రికి తరలించారు. కాగా, డీసీఎం డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డీసీఎం, బైక్ ఢీ.. అక్కడికక్కడే ఇద్దరు యువకుల దుర్మరణం కర్ణాలకుంట వద్ద ఘటన -
రైతుల గోస అర్థం చేసుకోండి..
సారూ.. 600 మంది మహబూబాబాద్: రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు మానవతా ధృక్పథంతో స్పందించి 600 మంది రైతులకు న్యాయం చేయాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం రైతులు బుధవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. రైతులు లకుపతి, బాషా, జాన్ అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా, ఓ మహిళా రైతు పోలీస్ అధికారి కాళ్లపై పడి తమకు సహకరించాలని, 600మంది రైతుల గోస అర్థం చేసుకోవాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నారాయణపురం గ్రామంలో 60 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న 1,827 ఎకరాలను 2017లో అప్పటి ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా అటవీ భూములని పేర్కొని పట్టాలు రద్దు చేసిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే జీఓ 94 జారీ చేసి రైతు పేరు, తండ్రిపేరున ఉన్న అడవి అనే పదం తొలగించిందన్నారు. గ్రామంలో ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించి ఆరు నెలలు పూర్తయినా పట్టాలు జారీ చేయలేన్నారు. దీంతో పాస్ పుస్తకాలు లేకపోవడంతో దాదాపు 600 మంది రైతులకు పంట రుణాలు, రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా, ఇతరత్రా పథకాలు అందడం లేదన్నారు. వెంటనే సర్వే ప్రకారం పట్టాలు ఇవ్వాలని లేని పక్షంలో ఆందోళనలు ఉధృం చేస్తామని హెచ్చరించారు. అనంతరం అదనపు కలెక్టర్ కె.వీరబ్రహ్మచారికి వినతి పత్రం అందజేశారు. డీఎస్పీ తిరుపతి రావు ఆధ్వర్యంలో సీఐలు మహేందర్‌రెడ్డి, సర్వయ్య బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు ధారవత్ రవి, నాయకులు, రైతులు శ్రీనివాస్, శంకర్, వెంకట్‌రెడ్డి, వీరన్న, సురేశ్, కిషన్, వీరన్న తదితరులు పాల్గొన్నారు. పోలీస్ అధికారి కాళ్లు పట్టుకుని వేడుకున్న మహిళా రైతు మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట నారాయణపురం రైతుల ఆందోళన -
రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందవేమోనని...
నెల్లికుదురు: ఆయనో ప్రధానోపాధ్యాయుడు. ఉద్యోగ విరమణ పొంది 9 నెలలైంది. ఇంకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదు. దీంతో మనోవేదనకు గురై అనారోగ్యం బారిన పడి చనిపోయాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రాజులకొత్తపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజులకొత్తపల్లి గ్రామానికి చెందిన కొండేటి సోమిరెడ్డి (63) హెచ్ఎంగా విధులు నిర్వహిస్తూ గత ఏడాది సెప్టెంబర్ 30న విరమణ పొందాడు. నాలుగు నెలలలోపు ప్రభుత్వంనుంచి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ సుమారు రూ.56 లక్షలు 9నెలలైనా అందలేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందేవారు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8వేల మంది ఉన్నారని, వారిలో నీకు అందే వరకు ఎన్నేళ్లు పడుతుందోనని స్థానికులు రకరకాలుగా మాట్లాడారు. దీంతో తనకు ఆ డబ్బులు వస్తాయో..రావోనని, కూతురుకు, ఇతరులకు సెటిల్మెంట్లు చేయాల్సి ఉందని మదనపడుతుండేవాడు. ఇలా మనోవేదనకు గురైన సోమిరెడ్డి కొన్ని రోజులుగా అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చించారు. అనంతరం నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమిరెడ్డి మంగళవారం రాత్రి చనిపోయాడు. ఉద్యోగ విరమణ పొందిన నాలుగు నెలలలోపే అందించాల్సిన రిటైర్ మెంట్ బెనిఫిట్స్ అందలేదని, సమయానికి బెనిఫిట్స్ ప్రభుత్వం అందిస్తే తమ నాన్న బతికేవాడని మృతుడి కుమారుడు కొండేటి కిశోర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడికి భార్య సునీత, ఒక కొడుకు కిశోర్‌రెడ్డి, కూతురు ఉన్నారు. అనారోగ్యంతో ఉపాధ్యాయుడి మృతి హెచ్ఎంగా 9నెలల క్రితం ఉద్యోగ విరమణ పొందిన సోమిరెడ్డి మహబూబాబాద్ జిల్లాలో ఘటన -
మోడల్ షాదీఖానాగా తీర్చిదిద్దుతాం
● ఉర్దూ అకాడమీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ న్యూశాయంపేట : వరంగల్ ఎల్బీనగర్లోని షాదీఖానాను రాష్ట్రంలో మోడల్‌గా తీర్చిదిద్దుతామని ఉర్దూ అకాడమీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ అన్నారు. వరంగల్‌లో నిర్మిస్తున్న ఉర్దూఘర్ కమ్ షాదీఖానాను బుధవారం పరిశీలించారు. నిర్మాణం ఆలస్యంపై అధికారులను ఆరాతీశారు. ఇప్పటివరకు కేటాయించిన నిధులను ఏ మేరకు ఖర్చు చేశారో ‘కుడా’ ఏఈని వివరాలు అడిగారు. షాదీఖాన నిర్మాణం కోసం ‘కుడా’ రూ.3కోట్ల 50 లక్షల అంచనాతో పనులు చేపట్టామని, ఇప్పటివరకు గ్రౌండ్‌ఫ్లోర్, మొదటి, రెండో అంతస్తులు స్లాబ్ వరకు పనులు పూర్తి అయినట్లు ఏఈ భరత్ వివరించారు. పూర్తిస్థాయిలో పనులు పూర్తికావాలంటే ఏమేరకు నిధులు అవసరమవుతాయో అంచనా వేసి తనకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కొండా సురేఖ సహకారంతో అద్భుత షాదీఖాన నిర్మిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ ఏడీ వి.కృష్ణ, కార్పొరేటర్లు సురేశ్‌జోషి, మహ్మద్ ఫుర్ఖాన్, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి టి.రమేశ్, వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్, సూపరింటెండెంట్ విజయపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఆయూబ్, చాంద్‌పాషా, ఆజం, యాకూబ్‌పాషా, సిరాజ్ అహ్మద్ పాల్గొన్నారు. ఎంఏ తెలుగులో ప్రవేశాలకు గడువు పెంపుహన్మకొండ కల్చరల్: వరంగల్ హంటర్ రోడ్డులోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, జానపద గిరిజన విజ్ఞాన పీఠంలో 2025–26 విద్యాసంవత్సరానికి రెగ్యులర్ ఎంఏ తెలుగు కోర్సులో ప్రవేశానికి గడువు ఈనెల 24తో ముగిసింది. రూ.100 ఆలస్య రుసుముతో జూన్ 30 వరకు ప్రవేశాలకు గడువు పొడిగించినట్లు జానపద గిరిజన విజ్ఞాన పీఠం పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈఅవకాశాన్ని వినియోగించుకోవాలని.. ప్రవేశం పొందేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాల కోసం 99894 17299, 99891 39136 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. సోమిడిలో చోరీ● రూ.2.50 లక్షల విలువైన ఆభరణాల అపహరణ కాజీపేట: కాజీపేట 62వ డివిజన్ సోమిడి గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం చొరబడి తులం బంగారం, 49 తులాల వెండి నగలు, రూ.లక్ష నగదును అపహరించుకెళ్లారు. సీఐ సుధాకర్ రెడ్డి కథనం ప్రకారం.. మేకల రమ తన ఇంటికి తాళం వేసి డ్యూటీకి వెళ్లి వచ్చేసరికి తాళం పగులగొట్టి ఉంది. ఈక్రమంలో బంగారు, వెండి నగలతో పాటు నగదు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. -
బ్రాహ్మణీయ, హిందూ ఫాసిస్ట్‌కు వ్యతిరేకంగా పోరాడుదాం
వరంగల్ చౌరస్తా : బ్రాహ్మణీయ, హిందూ ఫాసిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వామపక్షాలు, ప్రజాసంఘాలు పోరాడాలని, ఇందుకు సమయం ఆసన్నమైందని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు చలపతిరావు పిలుపునిచ్చారు. గురువారం వరంగల్‌లోని అబ్నూస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పార్టీ రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా పనిచేస్తోందని విమర్శించారు. బడా కార్పొరేట్లు అంబానీ, ఆదానీలకు ప్రధాని మోదీ సీఈఓ పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. మధ్య భారతంలో మావోయిస్టులు, ఆదివాసీలపై జరుగుతున్న హత్యాకాండ దీనికి నిదర్శనమన్నారు. అనంతరం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సాధినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భారత ప్రభుత్వం శత్రువు దేశంగా ప్రకటించిన పాకిస్తాన్, ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ ఉద్యమాలు చేస్తున్న సంస్థలతో చర్చలు జరిపిందన్నారు. కానీ మావోయిస్టులతో మాత్రం చర్చలు ఉండవని ప్రకటించడం సిగ్గు చేటన్నారు. ఇప్పటికై నా మధ్య భారతంలో హత్యాకాండను ఆపి మావోయిస్టులతో బేషరతుగా శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు మండల వెంకన్న, కె.గోవర్ధన్, ఆవునూరి మధు, గౌని ఐలయ్య, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్ ముక్తి, సత్యం, రాచర్ల బాలరాజు, గంగుల దయాకర్, ఎలకంటి రాజేందర్, బండి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ రాష్ట్ర సదస్సుకు ఆ పార్టీ నాయకులు వారం క్రితం పోలీసు అధికారుల అనుమతి కోరగా వారు నిరాకరించారు. అయితే మరోసారి పార్టీ నాయకులు విజ్ఞప్తి మేరకు అనుమతి ఇవ్వగా సదస్సు మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు జరిగింది. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు చలపతిరావు -
మరణంలోనూ నీ వెంటే..
● భార్య సమాధి వద్ద.. గడ్డి మందుతాగిన భర్త ● 20 రోజుల వ్యవధిలో దంపతుల ఆత్మహత్య కేసముద్రం: పురుగుల మందు తాగి భార్య ఆత్మహత్య చేసుకోగా.. ఇది జీర్ణించుకోలేక ఆమె సమాధి వద్ద గడ్డిమందు తాగి భర్త ఆత్మహత్యకు పాల్ప డిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో జరిగింది. 20రోజుల వ్యవధిలో భార్యాభర్తలు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎస్సై మురళీధర్‌రాజు తెలిపిన వివరాల ప్రకారం.. జల్లి బాబు(40)–నిర్మల(38) దంపతులకు కూతురు మధుప్రియ ఉంది. దంపతులు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. కాగా గత నెల 30న నిర్మల.. తన సమీప బంధువుల మధ్య ఇంటిస్థలం విషయంలో గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను వరంగల్‌లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. ఈనెల 4న మృతి చెందింది. కాగా భార్య మృతిని తట్టుకోలేక బాబు మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం ఆమె సమాధి వద్దకు వెళ్లి గడ్డిమందు తాగాడు. ఇది గమనించిన స్థానికులు అతడిని 108లో మానుకోట జనరల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. 20 రోజుల వ్యవధిలో తల్లిదండ్రులిద్దరూ కానరానిలోకాలకు వెళ్లడంతో కూతురు కన్నీరుమున్నీరుగా విలపించింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
రాష్ట్రస్థాయిలో 3వ స్థానం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మెరుగైన విద్య, ఉత్తమ ఫలితాలతో ముందుకు సాగుతున్నాం. ఎక్కడ అధ్యాపకుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, వృత్తి, జనరల్ కోర్సుల్లో ఉత్తమ ఫలితాలు సాధించాం. దాతల సహకారంతో గత ఏడాది వార్షిక పరీక్షల సమయంలో కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశాం. సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా 3వ స్థానం సాధించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్ధులు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరాలి. – సీహెచ్.మదార్ గౌడ్, డీఐఈఓ -
మందులు అందుబాటులో ఉంచుకోవాలి
బయ్యారం: వానాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తిచెందే అవకాశం ఉంటుందని, పీహెచ్‌సీల్లో మందులు అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ వైద్య సిబ్బందికి సూచించారు. మండలంలోని బయ్యారం, నామాలపాడు గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. బయ్యారం పీహెచ్‌సీని తనిఖీ చేసి రోగుల బెడ్లు, మందుల గది, టీకాల గదిని పరిశీలించారు అనంతరం సిబ్బ ందితో మాట్లాడుతూ.. ఏజెన్సీ గ్రామాల ప్రజ లకు వైద్య సేవలు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మండలంలో పైలె ట్ ప్రాజెక్ట్‌గా ఎంపికై న నామాలపాడులో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు. మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదా రులకు రూ.లక్ష చొప్పున బ్యాంకు రుణం మంజూరు చేయాలన్నారు. తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ విజయలక్ష్మి, ఏఓ రాంజీ పాల్గొన్నారు. లక్ష్యాలను పూర్తి చేయాలి మహబూబాబాద్: ఆయిల్‌పామ్ పంట సాగు విస్తీర్ణ లక్ష్యాలు పూర్తి చేయాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో బుధవారం వ్యవసాయం, హార్టికల్చ ర్, సహకార శాఖ, ఫర్టిౖలైజర్ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆయిల్ పామ్ పంట సాగుపై అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సబ్సిడీ రాయితీలను రైతులకు వివరించాలన్నారు. జిల్లాలో 4,500 ఎకరాల లక్ష్యం కాగా ఇప్పటి వరకు 542 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేశారన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా యూరియా, ఇతర ఎరువులను సిద్ధంగా ఉంచాలన్నారు. అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, డీఏఓ విజయనిర్మల, ఉద్యావశాఖ అధికారి మరియన్న పాల్గొన్నారు. చర్యలు తీసుకోవాలి.. భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వ సూచనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో భూ భారతి దరఖాస్తులు, ఇతర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి రెవెన్యూ చట్టా న్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. రెవె న్యూ సదస్సులు ముగిశాయని, తర్వాత నోటీస్‌లు అందజేసి విచారణ చేపట్టి, భూసమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. జిల్లాలో 39,513 దరఖాస్తులు వచ్చాయన్నారు. కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ -
మార్పు వచ్చింది..
గురువారం శ్రీ 26 శ్రీ జూన్ శ్రీ 2025–8లోuసాక్షి, మహబూబాబాద్: జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం.. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పనితీరు, విద్యార్థుల సామర్థ్యాలు మొదలైన ఆరు అంశాలపై నిర్వహించిన ఫెర్మార్మింగ్ గ్రేడ్ ఇండెక్స్(ఎఫ్‌జీఐ) నివేదిక మెరుగ్గా ఉంది. గత రెండు సంవత్సరాల కంటే.. గడిచిన విద్యాసంవత్సరంలో ఫలితాలు మెరుగ్గా ఉన్నట్లు స్పష్టం చేసింది. ఆరు అంశాల్లో 74 సూచికలకు 600 మార్కులు కేటాయించారు. ప్రతీ పాఠశాల నుంచి యూడైస్‌లో పొందుపర్చిన అంశాలను పరిశీలించి, సేకరించిన వివరాల ప్రకారం జాతీయ స్థాయిలో జిల్లాల వారీగా మార్కులు కేటాయించారు. ఆరు అంశాలుగా పరిశీలన.. ప్రభుత్వ పాఠశాల పనితీరుకు అద్దం పట్టే ప్రధాన అంశాలను పరిశీలించారు. ఇందులో ఆరు అంశాల్లో 74 సూచికలను పేర్కొని మార్కులు వేశారు. మొదటి అంశంగా.. అభ్యసన ఫలితాలు, సామర్థ్యాలు, సంబంధాలు, ఉపాధ్యాయుల లక్ష్యాలు, నైపుణ్యాలు, రెండో అంశం.. బోధన నిర్వహణ, పిల్లల ప్రతిస్పందన, మూడో అంశం.. మౌలిక సదుపాయాల కల్పన, సౌకర్యాలను పరిశీలించారు. అలాగే పాఠశాలల భద్రత, పిల్లల రక్షణ, డిజిటల్ లర్నింగ్, నిధుల వినియోగం, హాజరు పర్యవేక్షణ, పాఠశాలల్లో నాయకత్వ లక్షణాలు మొదలైన విషయాలను పరిశీలించారు. మొదటి రెండు అంశాల్లో గతం కంటే మెరుగైన మార్కులు సాధించగా.. మౌలిక వసతుల కల్పన, డిజిటల్ లర్నింగ్‌లో 2022–23 విద్యా సంవత్సరం కంటే 2023–24 విద్యా సంవత్సరంలో వెనకబడినట్లు తేలింది. అయితే గత విదా సంవత్సరం 2024–25లో మాత్రం అన్ని అంశాల్లో మెరుగుపడ్డామని, ఇందుకు ఈ ఏడాది పదో తరగతిలో సాధించిన ఫలితాలే నిదర్శనమని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. గతం కన్నా మెరుగు.. ఆరు అంశాల్లో 2022–23 విద్యా సంవత్సరం కంటే 2023–24 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల పనితీరు మెరుగు పడినట్లు స్పష్టమవుతోంది. ప్రధానంగా అభ్యసన ఫలితాలు, సమన్వయం, ఉపాధ్యాయుల పనితీరుపై మొత్తం 24 సూచికలకు 290 మార్కులు కేటాయించగా 2022–23 సంవత్సరంలో హనుమకొండ జిల్లా 109 మార్కులు సాధించింది. అత్యల్పంగా మహబూబాబాద్ జిల్లాకు 79 మార్కులు వచ్చాయి. అయితే 2023–24లో హనుమకొండ జిల్లాకు 122 మార్కులు రాగా మహబూబాబాద్‌కు 95 మార్కులొచ్చాయి. అలాగే మౌలిక సదుపాయాల కల్పనపై 12 సూచికల్లో 51 మార్కులకు 2022–23లో మహబూబాబాద్, హనుమకొండ జిల్లాలకు 29 మార్కుల చొప్పున వచ్చాయి. అదే మరుసటి సంవత్సరం హనుమకొండకు 29 మార్కులు రాగా మహబూబాబాద్ జిల్లాకు 27 మార్కులు వచ్చాయి. పాఠశాలల్లో పిల్ల ల భద్రతపై 31 మార్కులకు జనగామ, హనుమకొండ, ములుగు జిల్లాలకు 10 మార్కులకు పైగా రాగా మిగిలిన జిల్లాల్లో తక్కువగా వచ్చాయి.న్యూస్రీల్ప్రభుత్వ పాఠశాలలపై ఆరు అంశాలతో పీజీఐ సర్వే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2022–23 కన్నా 2023–24 మెరుగ్గా ఫలితాలు శుభ సూచికం అంటున్న విద్యావేత్తలు ఉమ్మడి జిల్లాల వారీగా ఆరు అంశాల్లో సాధించిన మార్కుల వివరాలు జిల్లా మొత్తం 2022–23 2023–24 మార్కులు వరంగల్ 600 226 245హనుమకొండ 600 250 275మహబూబాబాద్ 600 210 229జనగామ 600 235 271జేఎస్.భూపాలపల్లి 600 220 253ములుగు 600 214 231 -
పోటీల్లో ముందుండేలా చూస్తున్నాం..
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కోఎడ్యుకేషన్ ఉంది. విద్యార్థుల ప్రగతికి అకాడమిక్ గైడెన్స్, మానిటరింగ్ సెల్ నిర్వహణ, ప్రత్యేక స్టడీ అవర్స్ ఏర్పాటు చేస్తున్నాం. మన టీవీ ప్రొజెక్టర్ ద్వారా విద్యాబోధన అందిస్తూ, ఎన్ఎస్ఎస్ ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తున్నాం. సాహిత్యం, సాంస్కృతిక పోటీల్లో ముందుండే విధంగా చూస్తున్నాం. విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పిస్తున్నాం. –డిపి.గణేష్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్, మానుకోట -
బాలాజీ.. పీఎఫ్ బోలోజీ
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతున్న జేబీఎంకు డ్రైవర్లను సమకూర్చిన శ్రీ బాలాజీ కన్సల్టెన్సీ పీఎఫ్, ఈఎస్ఐ పేరుతో జీతంలో కోత పెట్టింది. కానీ ఆ సొమ్మును పీఎఫ్ ఖాతాలో జమ చేయలేదు. మూడు నెలల పాటు జేబీఎంకు డ్రైవర్లను సమకూర్చిన శ్రీ బాలాజీ కన్సల్టెన్సీ తప్పుకున్న తర్వాత సిస్కాన్ ప్రస్తుతం రెండు నెలలకు పైగా డ్రైవర్లను సమకూరుస్తోంది. ఈ రెండు సంస్థలు గత ఐదు నెలలకుపైగా పీఎఫ్ ఖాతాలు ప్రారంభించలేదని, కానీ, జీతాల్లో కోత పెడుతున్నాయని డ్రైవర్లు వాపోతున్నారు. ఈ రెండు సంస్థలు కలిపి ఇప్పటివరకు ఐదు నెలల కాలానికి ఒక్కో డ్రైవర్నుంచి నెలకు రూ.3వేల చొప్పున కట్ చేశారు. 287మంది డ్రైవర్లు జేబీఎం బస్సులు నడుపుతున్నారు. ఈ లెక్కన నెలకు రూ.8.61 లక్షలు వసూలు చేశారు. ఐదు నెలలకు 287మందినుంచి రూ.43.05లక్షలు కోత పెట్టారు. ఈ సొమ్ము ఎవరి చేతుల్లోకి వెళ్లిందని జేబీఎం డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు. 112 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయింపు.. టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజియన్‌కు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం 112 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించింది. వీటిలో 19 సూపర్ లగ్జరీ, 18 డీలక్స్, 75 ఎక్స్‌ప్రెస్ బస్సులు ఉన్నాయి. జేబీఎం సంస్థ నిర్వహణలో ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. ఈ మేరకు టీజీఎస్ ఆర్టీసీతో ఒప్పందం చేసుకుంది. వీటిని జనవరి 6న రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ప్రారంభించారు. కన్సల్టెన్సీ ప్రతినిధి ఏమంటున్నారంటే.. ఈ విషయమై గతంలో శ్రీ బాలాజీ కన్సల్టెన్సీ ప్రతినిధిగా, ప్రస్తుతం సిస్కాన్ బాధ్యుడిగా పని చేస్తున్న వేణుమాధవ్‌ను వివరణ కోరగా త్వరలో డ్రైవర్లకు పీఎఫ్ ఖాతాలు ఓపెన్ చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా పీఎఫ్, ఈఎస్ఐ పేరుతో వసూలు చేసిన సొమ్మును తిరిగి డ్రైవర్లకు జీతాలతో కలిపి చెల్లించనున్నట్లు చెప్పారు.ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల పీఎఫ్ సొమ్ము కాజేస్తున్న కన్సల్టెన్సీలు.. మొదటి మూడు నెలలు జేబీఎంకు డ్రైవర్లను సమకూర్చిన శ్రీ బాలాజీ ఆ తరువాత తప్పుకుని సిస్కాన్కు అప్పగింత 287మంది డ్రైవర్ల వద్ద పీఎఫ్ కోసం రూ.3 వేల చొప్పున కోత ఐదు నెలలైనా పీఎఫ్ ఖాతాలు ప్రారంభించని శ్రీ బాలాజీ, సిస్కాన్ తమ సొమ్ము కాజేతపై ఆందోళన చెందుతున్న డ్రైవర్లు -
నేటినుంచి శాకంబరీ ఉత్సవాలు
హన్మకొండ కల్చరల్: వరంగల్‌లోని శ్రీభద్రకాళి అమ్మవారి శాకంబరీ నవరాత్రి మహోత్సవాలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 26 నుంచి జూలై 10 తేదీ వరకు కొనసాగనున్నాయి. నవరాత్రోత్సవాలను విజయవంతం చేయాలని భద్రకాళి ఆలయ ఈఓ, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శేషుభారతి అన్నారు. ఈ మేరకు ఆలయంలోని అన్నదాన సత్రం ఆవరణలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో శేషుభారతి, ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు, ధర్మకర్తల మండలి చైర్మన్ బండారు శివసుబ్రహ్మణ్యం ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం శేషుభారతి మాట్లాడుతూ 15రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలు జరగనున్నాయన్నారు. గురువారం సహస్రకలశాభిషేకంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని భక్తులు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు మాట్లాడుతూ రోజూ ఉదయం, సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, జూలై 10వతేదీ గురువారం ఉదయం 4గంటలకే మహాశాకంబరీ అలంకరణ, పూజలు జరుగుతాయన్నారు. మండలి చైర్మన్ శివసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలతో ఉత్సవాల్లో పాల్గొనాలన్నారు. ఆలయ ధర్మకర్త తొనుపూనూరి వీరన్న మాట్లాడుతూ 11 సంవత్సరాల తర్వాత దేవాలయంలో ధర్మకర్తల మండలి ఏర్పాటు అయ్యిందని, ఆలయ ధర్మకర్తల తరుపున భక్తులకు అన్నీ ఏర్పాట్లు చేస్తామన్నారు. కనీస సౌకర్యాలు కల్పించాలి... ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శాకంబరీ ఉత్సవాల్లో గతంలో భక్తులకు కనీససౌకర్యాలు కల్పించలేదని విలేకరులు ఈఓ శేషుభారతిని ప్రశ్నించారు. దేవాలయంలో శానిటేషన్, టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, క్యూలైన్లో భక్తులకు మినరల్ వాటర్, ప్రసాదాలు అందజేయాలని పేర్కొన్నారు. దీనికి ఈఓ స్పందిస్తూ భక్తులు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తానని సమాధానమిచ్చారు. -
విద్యా వ్యతిరేక విధానాలు విడనాడాలి
మహబూబాబాద్ అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సర్కారు విద్యా వ్యతిరేక విధానాలను విడనాడాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సిద్ధోజు కవిత అన్నారు. జిల్లా కేంద్రంలోని టీపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో బుధవారం చలో హైదరాబాద్ కార్యక్రమ కరపత్రాలను నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ఈనెల 27న నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం విద్యను నిర్వీర్యం చేసేందుకు నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను విధ్వంసం చేసిన గత ప్రభుత్వ విధానాలనే ప్రస్తుత పాలకులు అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో నిర్వహించే ధర్నాలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బలాష్టి రమేశ్, రాష్ట్ర కౌన్సిలర్ శ్రీశైలం, డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్ రాజు, నాయకులు శ్రీనివాస్, ఉపేందర్, భిక్షపతి, రామలింగారెడ్డి, మహేశ్, శ్రావణ్ కుమార్, అశోక్, నరసింహారావు ఉన్నారు. -
విద్యా ప్రమాణాలు మెరుగు!
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడడంతో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. ప్రైవేట్‌కు దీటుగా విద్యాబోధన సాగుతోంది. దాతల సహకారంతో మధ్యాహ్నం భోజనం, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నాణ్యమైన విద్య అందుతోంది. దంతో పేద విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం కళాశాలల అధ్యాపకులు గ్రామాల్లో తిరుగుతూ విద్యార్థుల నమోదు ప్రక్రియ చేపడుతున్నారు. ప్రత్యేకతలు.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డిప్లొమా వృత్తి విద్యా కోర్సులు సీటీ, ఈటీ, ఎంఈటీ, ఎంఎల్టీ గ్రూపులు ఉన్నాయి. అలాగే ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులు ఉండగా బాలబాలికలకు ప్రత్యేక వసతులు ఉన్నాయి. 1970లో ప్రారంభం.. మహబూబాబాద్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల 1970 సంవత్సరంలో ప్రారంభమైంది. 55 ఏళ్లుగా గ్రామీణ, పట్టణ నిరుపేద విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతోంది. ఈ కళాశాలలో విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, లాయర్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగులు ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉచిత విద్య, పాఠ్యపుస్తకాల పంపిణీ దాతల సహకారంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అడ్మిషన్లు చేపడుతున్న అధ్యాపకులుజిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల 2024–25వార్షిక ఫలితాల వివరాలు ఇయర్ పరీక్ష రాసిన పాసైన ఉత్తీర్ణత విద్యార్థులు విద్యార్థులు శాతం ఫస్టియర్ జనరల్ 2083 1497 71.8 ఫస్టియర్ ఒకేషనల్ 458 344 75.1 సెకండియర్ జనరల్ 1270 974 76.6 సెకండియర్ ఒకేషనల్ 347 270 77.8 -
సర్కారు బడుల్లో సకల సదుపాయాలు
డోర్నకల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పిస్తున్నామని డీఈఓ రవీందర్ రెడ్డి పేర్కోన్నారు.డోర్నకల్ మండల చివారు చిలుకోడు చివారు మోడల్ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన అటల్ ఒకేషనల్ ల్యాబ్‌లను బుధవారం డీఈఓ ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం పుస్తకాలు, నోట్ పుస్తకాలు, భోజనం ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్వశిక్ష అభియాన్ కోఆర్డినేటర్ సతీష్, కాంప్లెక్స్ హెచ్ఎం వీరభద్రరావు, స్కూల్ ప్రిన్సిపాల్ కృష్ణ భాను తదితరులు పాల్గొన్నారు.ప్రభుత్వ పాఠశాలలను పర్యవేక్షించాలిమహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలలను నిత్యం పర్యవేక్షించాలని, ఇందుకు డీఈ ఓ, ఎంఈఓ, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలను వినియోగించుకోవాలని, అవసరమైన చోట అ దనపు పోస్టులు మంజూరు చేయాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ అన్నా రు. జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో బుధవారం టీఎస్ యూటీఎఫ్ సభ్యత్వ నమోదు నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులను తనిఖీ అధికారులుగా నియమిస్తే క్యాడర్, సీనియారిటీ సమస్యలు వస్తాయని, విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నారు. మండల రిసోర్స్ పర్సన్స్‌గా ఉపాధ్యాయులను నియమించినప్పుడు వచ్చిన ప్రతికూల ఫలితా లను దృష్టిలో ఉంచుకొని మరోసారి అటువంటి విఫల ప్రయోగాన్ని ఉపసంహరించుకోవా లని కోరారు. జిల్లా కార్యదర్శి హరినాయక్, మండల అధ్యక్ష, కార్యదర్శులు కుమార్, రాజశేఖర్, నాయకులు శ్రీనివాస్, సోమేశ్వర,షబ్బీర్, భారత్,రాంబాబు, వీరబ్రహ్మం పాల్గొన్నారు.ఏపీ ట్రిపుల్ ఐటీకి కల్వల విద్యార్థిని ఎంపికకేసముద్రం: మండలంలోని కల్వల జెడ్పీ హై స్కూల్‌కు చెందిన విద్యార్థిని యాసారపు వెన్నె ల పదో తరగతిలో 567 మార్కులు సాధించి ట్రిపుల్ ఐటీకి ఎంపికై ంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈనెల 23న ప్రకటించిన ట్రిపుల్ ఐటీ జాబితాలో విద్యార్థిని వెన్నెల ఒంగోలు క్యాంపస్‌కు ఎంపికై నట్లు హెచ్ఎం బండారు నరేందర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.శాంతి భద్రతల పరిరక్షణకు కార్యాచరణతొర్రూరు: శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. డివిజన్ కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను బుధవారం ఎస్పీ సందర్శించారు. కేసుల పురోగతి, శాంతి భద్రతల అంశాలపై చర్చించారు. అనంతరం ఆర్టీసీ ఆధ్వర్యంలో పుణ్య క్షేత్రాలకు ప్రత్యేక బస్సుల ఏర్పాటుపై ముద్రించిన పోస్టర్లను డీఎం పద్మావతితో కలిసి ఎస్పీ ఆవిష్కరించారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నేరాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ అన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణకు కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. గంజాయి తరలించేవారు ఎంతటివారైనా గుర్తించి కేసులు నమోదు చేస్తామన్నారు. డీఎస్పీ కృష్ణకిశోర్, సీఐ గణేశ్, ఎక్సైజ్ సీఐ అశోక్, ఎస్సై ఉపేందర్ పాల్గొన్నారు.సమస్యల పరిష్కారానికి కృషికాజీపేట రూరల్: కాజీపేటలో రైల్వే సంబంధిత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఏడీఆర్ఎం గోపాలకృష్ణన్ అన్నారు. సికింద్రాబాద్‌లో మజ్దూర్ యూనియన్‌తో బుధవారం జరిగిన 164వ రివ్యూ రైల్వే ఏడీఆర్ఎం పీఎన్ఎం సమావేశంలో పాల్గొంనేందుకు కాజీపేట నుంచి యూనియన్ నాయకులు బుధవారం తరలివెళ్లారు. రైల్వే సంబంధిత, కార్మికులు, ఉద్యోగులు, అధికారుల సమస్యలను ప్రస్తావించగా, పరిష్కారానికి ఏడీఆర్ఎం హామీ ఇచ్చినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజన్ సెక్రటరీ పి.రవీందర్ తెలిపారు. కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్ లోకో షెడ్ వద్ద కార్మికుల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్ లోకో షెడ్లో క్యాంటీన్ విస్తరణకు గోపాలకృష్ణన్ అంగీకరించినట్లు రవీందర్ వివరించారు. -
సివిల్స్‌లో ఉచిత శిక్షణ దరఖాస్తుల కరపత్రం ఆవిష్కరణ
కేయూ క్యాంపస్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద విద్యార్థులకు సివిల్స్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్న నేపథ్యంలో ఆ శిక్షణకు సంబంధించిన దరఖాస్తుల ఆహ్వాన కరపత్రాలను కాకతీయ యూనివర్సిటీలో వీసీ కె. ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి. రామచంద్రం మంగళవారం ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ రోడ్ నంబర్14 కేబీఆర్ పార్క్ ఎదుట ఉన్న షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ అధ్యయన కేంద్రంలో 2025–2026 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు ఆన్లైన్లో జూలై 7వరకు దరఖాస్తులు చేసుకోవాలని సంబంధిత అధికారులు కోరారు. ఉచిత శిక్షణకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు జూలై 13న ఎంపిక పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఎంపికై న వారికి ఎస్సీ స్టడీ సర్కిల్లో ప్రవేశం కల్పించి ఉచిత భోజనంతోపాటు శిక్షణ ఇస్తారు. ఈ కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ ఉమ్మడి వరంగల్ జిలా శాఖ డైరెక్టర్ జగన్మోహన్, కేయూ హాస్టళ్ల డైరెక్టర్ ఎల్పి. రాజ్‌కుమార్,అంబేడ్కర్ స్టడీసెంటర్ డైరెక్టర్ సిహెచ్. రాజ్‌కుమార్, డాక్టర్ సూరాసి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఆయన మరణం.. ఐదుగురికి జీవం
దేవరుప్పుల : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వృద్ధుడు.. తాను చనిపోయి ఐదుగురికి జీవం పోశాడు. బ్రెయిన్‌డెడ్ అయిన ఆ వృద్ధుడి అవయవాలు దానం చేశారు. దీంతో ఆ కుటుంబీకులను గ్రామస్తులు, బంధువులు అభినందించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండికి చెందిన బొందుగుల కొండయ్య (60) ఈ నెల 20వ తేదీన జనగామ–సూర్యాపేట రహదారి సీతారాంపురం స్టేజీ సమీపంలో కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో అపస్మారక స్థితిలోకి వెళ్లిన కొండయ్యను మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు నాలుగు రోజులు చికిత్స చేసినా కొండయ్య అచేతన(బ్రెయిన్‌డెడ్) స్థితిలోకి వెళ్లాడు. దీంతో మృతుడి భార్య అంజమ్మ, కుమారుడు మహేశ్, కూతురు వైష్ణవి అంగీకారంతో ఆస్పత్రి వైద్యులు కొండయ్య అవయవాలు తీశారు. వీటిని శస్త్రచిక్సిత ద్వారా ఐదుగురికి అమర్చనున్నారు. కాగా, కొండయ్య మృతదేహాన్ని మంగళవారం సాయంత్రం స్వగ్రామం కడవెండికి తీసుకురాగా కటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు అంత్యక్రియలు నిర్వహించారు. వృద్ధుడి అవయవాలు దానం కుటుంబీకులను అభినందించిన బంధువులు, గ్రామస్తులు -
ఎట్టకేలకు డైరెక్టర్ల నియామకం..
హన్మకొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు రాష్ట్రంలోని డిస్కంలకు డైరెక్టర్ పోస్టులను నియమించింది. ఇందులో భాగంగా నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీజీఎన్పీడీసీఎల్)కు నలుగురిని నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభు త్వ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్‌మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రా గానే అప్పటి వరకు ఉన్న టీజీ ఎన్పీడీసీఎల్ పాలక మండలిని తొలగించింది. 2024 జనవరి 29న కొత్త పాలక మండలి నియామకంలో భాగంగా డైరెక్టర్ పోస్టుల నియామకానికి 2024 జనవరి 30న నోటిఫికేషన్‌కు జారీ చేసింది. అప్పటికే ఐఏఎస్ అధికారి కర్నాటి వరుణ్ రెడ్డిని చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. అప్పటి వరకు సీనియర్ సీజీఎంలను ఇన్చార్జ్ డైరెక్టర్లుగా నియమించగా వారు ఈ పదవుల్లో కొనసాగుతూ వస్తున్నారు. దీంతో 18 నెలలుగా డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ క్రమంలో ఎట్టకేలకు డైరెక్టర్ పోస్టులను భర్తీ చేసింది. కాగా, వంటేరు తిరుపతి రెడ్డి (ఫైనాన్స్), టి.మధుసూదన్ (ఆపరేషన్స్), వంగూరు మోహన్ రావు (ప్రాజెక్ట్స్), సి.ప్రభాకర్ (హెచ్ఆర్డీ–ఐఆర్)ను డైరెక్టర్లగా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఇద్దరు బీసీలు, ఓసీ, ఎస్సీ ఒక్కొక్కరున్నారు. ఈ నెల 27న కొత్త డైరెక్టర్లు బాధ్యతలు స్వీకరించనున్నారు. 17 జిల్లాల పరిధిలో విస్తరణ.. రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలుండగా టీజీ ఎన్పీడీసీఎల్ 17 జిల్లాలు, 299 మండలాల్లో విస్తరించి ఉంది. 5,580 గ్రామాలు, 7,474 హామ్లేట్లకు విద్యుత్ పంపిణీ చేస్తుంది. 68,62,858 విద్యుత్ సర్వీస్‌లున్నాయి. 9 వేలకు పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. 2024 జనవరి 30న నాలుగు డైరెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం.. 2024 మార్చి 2వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించింది. దాదాపు 83 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఇందులో టీజీ ఎన్పీడీసీఎల్లో సీజీఎంలుగా పని చేస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇద్దరికి మాత్రమే అవకాశం లభించింది. ఇదే కంపెనీలో సీజీఎం (సీఈ)లుగా పని చేసి రిటైర్డ్ అయిన ఇద్దరికి డైరెక్టర్లుగా అవకాశం లభించింది. ప్రస్తుతం సీజీఎంలు, చీఫ్ ఇంజనీర్లుగా కొనసాగుతున్న వంటేరు తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సదర్లాల్, అశోక్ కుమార్, రాజు చౌహాన్ డైరెక్టర్ పదవి కోసం దరఖాస్తు చేసుకోగా ఇందులో వంటేరు తిరుపతి రెడ్డికి ఫైనాన్స్ డైరెక్టర్‌గా, టి.మధుసూదన్‌ను ఆపరేషన్ డైరెక్టర్‌గా నియమించింది. అదే విధంగా హెచ్ఆర్డీ సీజీఎంగా రిటైర్డ్ అయిన సి.ప్రభాకర్‌ను హెచ్ఆర్డీ–ఐఆర్ డైరెక్టర్‌గా, ప్రాజెక్టు సీజీఎంగా ఇన్చార్జ్ డైరెక్టర్‌గా కొనసాగుతూ రిటైర్డ్ అయిన వంగూరు మోహన్ రావును ప్రాజెక్టు డైరెక్టర్‌గా నియమించింది. కాగా, డైరెక్టర్ పదవిని ఆశించిన సదర్లాల్, అశోక్ కుమార్, రాజు చౌహాన్‌కు నిరాశే మిగిలింది. ఇందులో సదర్ లాల్, అశోక్‌కుమార్, ఇన్చార్జ్ డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ఇక నుంచి వీరు సీజీఎంలుగా మాత్రమే కొనసాగనున్నారు. టీజీ ఎన్పీడీసీఎల్లో 18 నెలల తర్వాత పోస్టుల భర్తీ.. డైరెక్టర్లుగా నలుగురు నియామకం ఇందులో ఇద్దరు ప్రస్తుత ఇన్చార్జ్ డైరెక్టర్లు.. మరో ఇద్దరు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లుసీజీఎంలు, రిటైర్డ్ సీజీఎంలు దరఖాస్తులు.. డైరెక్టర్ పోస్టుల కోసం జెన్కో, ట్రాన్స్‌కో, టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్లో పని చేస్తున్న సీజీఎంలు, రిటైర్డ్ సీజీఎంలు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు పెద్ద ఎత్తున రావడంతో తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలో దరఖాస్తులదారులపై ఇంటెలిజెన్స్ అధికారులు సుదీర్ఘంగా అధ్యయనం చేసి నివేదిక సమర్పించారు. ప్రభుత్వం ఈ నివేదికను పరిశీలించి నియామకాలు చేపట్టినట్లు తెలిసింది. -
తూకంలో తేడాలు వస్తే చర్యలు
తొర్రూరు: తూకం, కొలతల్లో తేడా వస్తే చర్యలు తీసుకుంటామని తూనికలు, కొలతల శాఖ జిల్లా అధికారి విజయ్‌కుమార్ తెలిపారు. డివిజన్ కేంద్రంలోని ఎరువుల దుకాణాలు, కిరాణా దుకా ణాల్లో మంగళవారం తనిఖీ చేపట్టారు. పలువురికి నోటీసులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్యాక్ చేసిన విత్తనాలు, ఎరువులు, నిత్యావసర సరుకుల తూకం తక్కువ ఉందని అనుమానం వస్తే వ్యాపారి వద్ద ఉన్న కాంటా రాళ్లతో సరి చూసుకోవాలన్నారు. నిరంతరం అన్ని రకాల వ్యాపారాల విక్రయ కేంద్రాలపై ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నామని, నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీసీఐసీ చైర్మన్ వింజమూరి సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
కాజీపేట జంక్షన్ మీదుగా ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాజీపేట జంక్షన్ మీదుగా ప్ర త్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ మంగళవారం తెలిపారు.ప్రత్యేక రైళ్ల వివరాలు..జూన్ 26 నుంచి జూలై 31వ తేదీ వరకు సుబేదార్‌గంజ్–చర్లపల్లి (04121) ఎక్స్‌ప్రెస్ ప్రతీ శుక్రవారం కాజీపేటకు 18.00 గంటలకు చేరుతుంది. జూన్ 28 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు చర్లపల్లి–సుబేదార్‌గంజ్ (04122) ఎక్స్‌ప్రెస్ ప్రతీ శనివారం 6.30 గంటలకు కాజీపేటకు చేరుతుంది. ఈ రైళ్లకు దక్షిణ మధ్య రైల్వే పరిధి నాగ్‌పూర్, బల్లార్షా, సిర్పూర్కాగజ్నగర్, మంచిర్యాల, పెద్దపల్లి, కాజీపేట స్టేషన్లలో అప్ అండ్ డౌన్ రూట్లో హాల్టింగ్ కల్పించారు. జూన్ 26 నుంచి జూలై 2వ తేదీ వరకు యశ్వంత్‌పూర్–యోగ్నగరి రిషికేశ్ (06597) ఎక్స్‌ప్రెస్ ప్రతీ శనివారం కాజీపేటకు చేరుతుంది. జూన్ 28 నుంచి జూలై 5వ తేదీ వరకు యోగ్నగరి రిషికేశ్–యశ్వంత్‌పూర్ (08598) ఎక్స్‌ప్రెస్ ప్రతీ మంగళవారం కాజీపేటకు చేరుతుంది. ఈ రైళ్లకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఎలహంకా, హిందుపురం, ధర్మవరం, అనంతపురం, డోన్, కర్నూల్ సిటీ, కాచిగూడ, కాజీపేట, బల్లార్షా, నాగ్‌పూర్‌లో అప్ అండ్ డౌన్ రూట్లో హాల్టింగ్ కల్పించారు.కేయూలో సేంద్రియ పద్ధతిలో మల్బరీ సాగుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో సెరికల్చర్ విభాగం ఆధ్వర్యంలో సేంద్రియ పద్ధతిలో మల్బరీ సాగు చేస్తున్నారు. విశ్వవిద్యాలయం ప్రాంగణంలో అభివృద్ధి చేసిన రెండున్నర ఎకరాల్లో సాగు చేయిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఈ సాగుపై ప్రాక్టికల్ శిక్షణ పొందుతున్నారు. సేంద్రియ ఎరువుతో మల్బ రీ ఆకులు దిగుబడి పెంపుతోపాటు నేల, తేమ నిలుపుదల, పోషకాల లభ్యత మెరుగు పరుస్తున్నామని కేయూ సెరికల్చర్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్లు కె. సుజాత, కనీజ్ఫాతిమా మంగళవారం తెలిపారు. ఈ క్షేత్రంలో విద్యార్థులకు నేరుగా వ్యవసాయ అనుభవాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం రెండున్నర ఎకరాల్లో మల్బరీ వనరులతోపాటు టస్సర్ సిల్క్ వార్మ్ కోసం అవసరమైన ఫుడ్ ప్లాంట్లు పెంచుతున్నారు. ఇందులో 7 నుంచి 8 రకాల మల్బరీ రకాలున్నాయి. 2010లో యూజీసీ మేజర్ రీసెర్చ్ ప్రాజెక్టు నిధులతో ఈఫీల్డ్ అభివృద్ధి చేశారు. కాగా, కాకతీయ యూనివర్సిటీ సెరికల్చర్ రీసెర్చ్ యూనిట్స్, ఎమ్మెస్సీ సెరికల్చర్ కోర్సు అందిస్తోంది. -
రైతులు పంట మార్పిడి చేపట్టాలి
మహబూబాబాద్ రూరల్ : రైతులు పంట మార్పిడి చేపట్టాలని, వరి, మిర్చి, పత్తికి ప్రత్యామ్నాయంగా కూరగాయలు, పండ్లు, ఆయిల్ పామ్ సాగు చేపట్టాలని మహబూబాబాద్ జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు. ఈమేరకు పంటమార్పిడి విధానం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు పలు సూచనలు చేశారు. పంట మార్పిడితో రైతులకు ఆదాయ మార్గాలు ఏర్పడుతాయని, మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు సాగుచేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఆయిల్ పామ్ సాగు చేస్తూ పలువురు రైతులు ఎకరానికి రూ. లక్షకు పైగా ఆదాయం పొందుతున్నారన్నారు. యాజమాన్య పద్ధతులు పాటించాలి.. బోర్ల కింద కూరగాయలు, పండ్లు, ఆయిల్ పామ్, పూలు, మల్బరీ, పలు రకాల ఉద్యాన పంటలు సాగు చేయాలన్నారు. ప్రతీ రైతు పొలం గట్ల మీద, పొలం చుట్టూ, పెరట్లో, ఆయిల్ పామ్, పండ్ల తోటల్లో అంతర పంటలుగా, డాబాల మీద, ఇంటి ముంగిట రోజువారి అవసరాల నిమిత్తం అన్ని రకాల కూరగాయలను సాగు చేసుకోవాలన్నారు. కూరగాయల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలని మరియన్న తెలిపారు. మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు సాగుచేయాలి జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి జినుగు మరియన్న -
ఇనుగుర్తిలో విషాదఛాయలు
● హైదరాబాద్‌లో గ్రామవాసి అంజలి హత్య ● మిన్నంటిన కుటుంబీకులు, గ్రామస్తుల రోదనలు కేసముద్రం: ఇనుగుర్తిలో విషాదఛాయలు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన సట్ల అంజలి(39)హైదరాబాద్‌లో తన పెద్ద కూతురు, ఆమె ప్రియుడి చేతిలో సోమవారం రాత్రి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె మృతదేహం మంగళవారం రాత్రి తన స్వగ్రామం ఇనుగుర్తికి చేరింది. ఆమె మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు బోరున విలపించారు. గ్రామానికి చెందిన సట్ల ధనమ్మ, మల్లయ్య దంపతుల రెండో కూతురు అంజలికి 18 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని జీడిమెట్లలో కుటుంబ సభ్యులతో కలిసి జీవనం సాగిస్తూ, తెలంగాణ సాంస్కృతిక సారథిలో గాయకురాలిగా పనిచేస్తోంది. రెండేళ్ల క్రితం ఆమె భర్త మృతి చెందాడు. కాగా, అంజలి పెద్దకూతురు ఓ యువకుడితో ప్రేమలో పడింది. దీనిని అంజలి నిరాకరించగా, పెద్దకూతురు, తన ప్రియుడితో కలిసి ఆమెను హత్య చేశారు. కాగా, ఇనుగుర్తిలో అంజలి మృతదేహంపై పీఆర్ఓ రాజేంద్రప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాంస్కృతిక కళాబృందం సభ్యులు గీతాలు ఆలపించి నివాళులర్పించారు. అంజలికి.. చాకలి ఐలమ్మతో ఎలాంటి సంబంధమూ లేదు.. పాలకుర్తి టౌన్: అంజలి.. వీరనారి చాకలి ఐలమ్మ మునిమనుమరాలిగా సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. దీనిపై ఐలమ్మ మనుమడు చిట్యాల సంపత్ స్పందించారు. సట్ల అంజలికి, ఐలమ్మకు ఎలాంటి సంబంధమూ లేదని, ఇద్దరూ ఒకటే సామాజికవర్గం అయినంత మాత్రాన కుటుంబ వారసురాలిగా వైరల్ చేయడం సరికాదని తెలిపారు. గతంలోనూ తన నాయనమ్మ పేరు వాడితే మా తండ్రి రామచంద్రు ఆమెను హెచ్చరించారని గుర్తు చేశారు. -
క్రెడాయి నూతన కార్యవర్గం ఎన్నిక
నయీంనగర్: దేశంలో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరుగాంచిన ‘ది కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ (క్రెడాయి) ఉమ్మడి వరంగల్ జిల్లా శాఖ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. చైర్మన్‌గా ఎర్రబెల్లి తిరుపతి రెడ్డి, అధ్యక్షుడిగా నాయిని అమరేందర్ రెడ్డి, ప్రెసిడెంట్ ఎలక్టెడ్గా కంది శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా శాఖమూరి అమర్, ఉపాధ్యక్షులుగా రాజేందర్ రెడ్డి, రజనీకాంత్ రెడ్డి, రవీందర్ రెడ్డి, కోశాధికా రిగా వరుణ్‌కుమార్ అగర్వాల్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ గా రాజ్‌కుమార్, సంయుక్త కార్యదర్శులుగా కొండా రెడ్డి, నాగరాజు, మల్లారెడ్డి, తదితర పాలకవర్గ స భ్యులు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సమావేశానికి క్రెడాయి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రేమ్ సాగర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూ తన కార్యవర్గాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ప్రేమ్ సాగర్ రెడ్డి మాట్లాడుతూ నిర్మాణ రంగంలో పారదర్శకత, నాణ్యత, వినియోగదారుల విశ్వా సం నిలబెట్టే దిశగా క్రెడాయి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అనంతరం నూతన చైర్మన్ తిరుపతి రెడ్డి, అధ్యక్షుడు నాయిని అమరేందర్ రెడ్డి మా ట్లాడుతూ నిర్మాణ రంగం ప్రాంతీయ అభివృద్ధికి కీలక చక్రంగా నిలుస్తుందన్నారు. నూతన కార్యవర్గం స్థిరాస్తి రంగాన్ని మరింత న్యాయంగా, పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుందన్నారు. కస్టమర్ల విశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వ సంస్థలతో సమన్వయం, బిల్డర్ల సమస్యల పరిష్కారం కోసం క్రెడాయి అంకితభావంతో పనిచేస్తుందన్నారు. ‘కుడా’, డీటీసీపీ, జీడబ్ల్యూఎంసీ వంటి సంస్థలతో సమన్వయానికి క్రెడాయి పటిష్ట వే దికగా నిలుస్తుందని తెలిపారు. పరిశుభ్రత, నా ణ్య త, నిబంధనలు పాటిస్తామన్నారు. త్వరలో చిన్న డెవలపర్లకు ప్రోత్సాహం, యూత్ ఆర్మ్, మహిళా బిల్డర్లకు ప్రాధాన్యం, వృత్తిపర శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని వారు పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా నాయిని అమరేందర్ రెడ్డి -
బైలాకు విరుద్ధంగా ఎంపికై న కమిటీ చెల్లదు
హన్మకొండ: బైలాకు విరుద్ధంగా ఎలాంటి ఎన్నికల నోటిఫికేషన్ లేకుండా కమిటీని ఎంపిక చేశారని, ఇది చెల్లదని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ టీజీ ఎన్పీడీసీఎల్ కంపెనీ కార్యదర్శి బక్క దానయ్య, ఇతర నాయకులు స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండ బాలసముద్రంలో అసోసియేషన్ ఎన్పీడీసీఎల్ శాఖ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ అసోసియేషన్లోనైనా ఎన్నికలు నిర్వహించడానికి ముందు పాత కమిటీలను రద్దు చేసి కొత్త కమిటీలు ఎన్నుకుంటారన్నారు. ఈ పద్ధతిలో ఎన్నికై న కమిటీని మాత్రమే సంబంధిత అధికారులకు పరిచయం చేస్తారన్నారు. అయితే అసోసియేషన్ నుంచి బహిష్కరణకు గురైన మాతంగి శ్రీనివాస్ అనే వ్యక్తి మాత్రం బైలాకు వ్యతిరేకంగా ఎన్పీడీసీఎల్ శాఖ నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు సీఎండీకి పరిచయం చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ కమిటీ చెల్లదని స్పష్టం చేశారు. ఈ కమిటీని అధికారులు పరిగణనలోకి తీసుకోవద్దని వారు కోరారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతల స్పష్టీకరణ -
డీసీసీబీ టర్నోవర్ రూ.2,230 కోట్లు
హన్మకొండ: వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు రూ.2,230.56 కోట్ల టర్నోవర్‌కు చేరుకుందని తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు, వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు అన్నారు. మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో మహాజన సభ జరిగింది. పూర్వ వరంగల్ జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, సభ్య సంఘాల చైర్మన్లు పాల్గొన్న ఈ సభకు మార్నేని రవీందర్ రావు అధ్యక్షత వహించి మాట్లాడారు. 2024–2025 ఆర్థిక సంవత్సరంలో వరంగల్ డీసీసీబీ రూ.5.10 కోట్ల లాభాలు గడిచిందన్నారు. రూ.1,634.79 కోట్ల రుణాలు అందించినట్లు తెలిపారు. రూ.595.77 డిపాజిట్లు సేకరించినట్లు వివరించారు. రైతులు, వ్యవసాయ అనుబంధ రంగాలకు అందించిన ఆర్థిక సేవలు, క్వాలిటీ మేనేజిమెంట్ సిస్టమ్‌ను గుర్తించిన అంతర్జాతీయ ప్రామాణిక సంస్థ ఐఎస్ఓ 9001 సర్టిఫికెట్ జారీ చేసిందన్నారు. వరంగల్ డీసీసీబీ పరిధిలోని పీఏసీఎస్‌లు, రైతు సేవ సహకార సంఘాలను బహుళార్థక సేవా కేంద్రాలు (ఎంఎస్సీ)గా పరివర్తింపజేస్తూ ఆర్థికంగా బలపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పథకం కింద డీసీసీబీకి అతి తక్కువ వడ్డీ 4శాతంతో రుణాలు ఇచ్చిందని, 70 పీఏసీఎస్‌లకు గాను 50 సంఘాలకు 129 ఆక్టివిటీస్‌కు రూ.54.72 కోట్ల రుణం మంజూరు చేసిందన్నారు. ఈ రుణంతో ఆదాయం పెంచుకుని సంఘాలు ఆర్థికాభివృద్ధ్ది సాధిస్తున్నాయన్నారు. ఎంఎస్సీలో దేశంలో వరంగల్ డీసీసీబీ ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నాబార్డు ఆధ్వర్యంలో పీఏసీఎస్‌ల ద్వారా అన్ని రకాల సేవలు అందించేందుకు ఫాక్స్ ఆక్సిలేటర్ ప్రోగ్రామ్‌ను ప్రవేశ పెట్టిందన్నారు. ఈ కార్యక్రమం కింద దేశంలోని మూడు రాష్ట్రాల్లో 35 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఎంపిక చేసిందన్నారు. రాష్ట్రంలో వరంగల్, కరీంనగర్ డీసీసీబీల్లో 12 పీఏసీఎస్‌లను ఎంపిక చేసిందన్నారు. వరంగల్ డీసీసీబీలో నందనం, నల్లబెల్లి, మహబూబాబాద్, ధనసరి పీఏసీఎస్‌లను ఎంపిక చేశారని వివరించారు. 2025–2026 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు టర్నోవర్‌ను రూ. 2,230. 56 నుంచి రూ.2,600 కోట్లు సాధించాలని లక్ష్యం విధించుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆయా సంఘాల చైర్మన్లు మాట్లాడుతూ పీఏసీఎస్‌లకు అవసరమైన ఎరువులు సరఫరా కావడం లేదని, దీనిపై స్పందించి వ్యవసాయాధికారులతో మాట్లాడి ఎరువులు సరఫరా చేయించాలన్నారు. అనంతరం ఇటీవల మృతి చెందిన చెన్నారావుపేట పీఏసీఎస్ చైర్మన్ ఎం.సత్యనారాయణ రెడ్డి, కంచపల్లి పీఏసీఎస్ చైర్మన్ రవీందర్‌కు నివాళులర్పించారు. సమావేశంలో సీఐఓ వజీర్ సుల్తాన్, నాబార్డ్ డీడీఎం చంద్రశేఖర్, మార్క్ ఫెడ్ డైరెక్టర్ రంగారావు, డీసీఓలు సంజీవ రెడ్డి, నీరజ , వెంకటేశ్వర రావు, రాజేందర్ రెడ్డి, వాల్యానాయక్, సర్దార్ సింగ్, నాగేశ్వర రావు, టీజీ క్యాబ్ జీఎం సుజాత, డీసీసీబీ డీజీఎం అశోక్, జీఎంలు ఉషాశ్రీ, పద్మావతి, ఏజీఎంలు మధు, గొట్టం స్రవంతి, గంప స్రవంతి, రాజు, కృష్ణ మోహన్, డైరెక్టర్లు పాల్గొన్నారు. రూ.5.10 కోట్ల లాభాలు వరంగల్ డీసీసీబీ, టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు -
విద్యాశాఖ ఉద్యోగులకు అండగా నిలుస్తాం
తొర్రూరు: విద్యాశాఖ ఉద్యోగులకు అన్ని విధాలా అండగా నిలుస్తామని డీఈఓ రవీందర్‌రెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇటీవల మృతి చెందిన సీఆర్పీ సర్వి రమేశ్ కుటుంబానికి సమగ్రశిక్ష ఉద్యోగులు, ఉపాధ్యాయులు రూ.3.20 లక్షల ఆర్థిక సాయం అందించారు. మంగళవారం డివిజన్ కేంద్రంలోని వారి నివాసంలో డీఈఓ చేతుల మీదుగా మృతుడి కుటుంబ సభ్యులకు ఆ మొత్తం అందజేశారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థుల సంఖ్య పెంచడంలో, ప్రభుత్వ పాఠశాలల బలోపేతంలో సీఆర్పీల పాత్ర మరువలేనిదన్నారు. రమేశ్ మృతి విద్యాశాఖకు తీరని లోటు అని అన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ మహంకాళి బుచ్చయ్య, సమగ్రశిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెల్తూరి మల్లేశం, ఉపాధ్యాయ నాయకులు పులి ముత్తిలింగం, కొలుపుల శ్రీనివాస్, తిరుమలేష్, భీమా నాయక్ తదితరులు పాల్గొన్నారు. డీఈఓ రవీందర్‌రెడ్డి -
రైతును రాజు చేయడమే ధ్యేయం
కురవి: కాంగ్రెస్ ప్రభుత్వం రైతును రాజు చేయడం కోసం నిరంతరం పని చేస్తోందని, రైతు భరోసా నిధులు తొమ్మిది రోజుల్లోనే రూ. 9వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని డిప్యూటీ స్పీకర్ జాటోత్ రాంచంద్రునాయక్ అన్నారు. రైతు భరోసా సంబురాల్లో భాగంగా కురవి రైతు వేదికలో మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి సందేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. అనంతరం గుడి సెంటర్లో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి రాంచంద్రునాయక్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. రైతులను ఆదుకోవడమే కాంగ్రెస్ ఫ్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఉచిత విద్యుత్, ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ పథకం అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాజీవ్ యువవికాసం తర్వాత అమలు చేస్తామని చెప్పారు. ఎన్ని అడ్డకుంలు వచ్చినా ఇచ్చిన మాట ను సీఎం రేవంత్‌రెడ్డి నిలబెట్టుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ కార్యకర్తలు సమాయత్తం కావాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపనలకు పార్టీ నాయకులందరూ వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో డీఏఓ విజయలక్ష్మి, ఏడీఈ విజయచంద్ర, ఏఓలు మోహన్, శ్రీదేవి, నరసింహరావు, ఆలయ చైర్మన్ కొర్ను రవీందర్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అంబటి వీరభద్రంగౌడ్, నాయకులు బండి వెంకటరెడ్డి, గార్లపాటి భరద్వాజ్‌రెడ్డి, నారాయణ, రాజేందర్‌కుమార్, అవిరె మోహన్‌రావు, బాలగాని శ్రీనివాస్, బండి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ స్పీకర్ జాటోత్ రాంచంద్రునాయక్ రైతు భరోసా సంబురాల్లో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం -
కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి
● డీఎంహెచ్ఓ రవిరాథోడ్ నెహ్రూసెంటర్: కంటి ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ రవి రాథోడ్ అన్నారు. మంగళవారం జిలా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆప్తాలమిక్ ఆఫీ సర్స్తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల పిల్లల్లో కంటి సంబంధించి లోపాలను గుర్తించి, వరంగల్‌కు చికిత్స నిమి త్తం పంపించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్స్ లక్ష్మీనారాయణ, ఆప్తాలమిక్ ఆఫీసర్స్ సుబ్బలక్ష్మి, జోత్స్న, రాజ్‌కుమార్, కృష్ణ, డెమో ప్రసాద్, కేవీ రాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. టూర్ ప్యాకేజీలను వినియోగించుకోవాలి● అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో మహబూబాబాద్: ఆర్టీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ప్రయాణికులు వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం ఆర్టీసీ మహబూబాబాద్ డిపో ఆధ్వర్య ంలో ప్రత్యేక టూర్ ప్యాకేజీల పోస్టర్లను ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 27న రాత్రి 11 గంటలకు శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు ఆర్టీసీ స్పెషల్ టూర్ ఉందని, ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సీసీఎల్ కమిషనర్‌ను కలిసిన ఎమ్మెల్యేకేసముద్రం: మండలంలోని నారాయణపురం గ్రామ రైతుల భూ సమస్యను పరిష్కరించాల ని హైదరాబాద్‌లోని సచివాలయంలో సీసీఎల్ కమిషనర్‌ను మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ మంగళవారం కలిశారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ కారణంగా ఆన్లైన్లో వందల మంది రైతుల పట్టాభూములు అటవీ భూములుగా చూపించడం వల్ల ప్రభుత్వ పథకాలకు దూరమయ్యారన్నారు. తక్షణమే భూరికార్డులను సరిచేసి నారాయణపురం రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఇందుకు కమిషనర్ సానుకూలంగా స్పందించి, న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. స్పోర్ట్స్ స్కూల్స్‌తో విద్యార్థులకు భవిష్యత్ మహబూబాబాద్ అర్బన్: విద్యార్థులు దేశానికి ప్రాతినిధ్యం వహించేలా స్పోర్ట్స్ స్కూల్స్ తీ ర్చిదిద్దుతాయన్నాని జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి ఓలేటి జ్యోతి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో మంగళవారం జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. జిల్లా విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి క్రీడా పాఠశాలలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. మానుకోట జిల్లా క్రీడలకు పు ట్టినిల్లు లాంటిందని, ఇక్కడి నుంచి చాలామంది పలు క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారన్నారు. సుమారు 100మంది బాలబాలికలకు ఎంపికలకు హాజరయ్యారు. కార్యక్రమంలో పీడీలు, పీఈటీలు శంకర్‌నాయక్, చంప్లనాయక్, వెంకటేశ్వర్లు, విజయ్‌చందర్, సునీల్, వీరభద్రం, రాజకుమారి, కాశీనాథ్, శ్రీనివాస్, కమల్‌కిశోర్, కుమారస్వామి, వి ద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
బోనస్.. నర్వస్
సాక్షి, మహబూబాబాద్: సన్నరకం ధాన్యం సాగుచేస్తే బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు పోటీపడి పంట వేశారు. అయితే కొనుగోలు కేంద్రాల్లో అమ్మిన ధాన్యానికి బోనస్ ఇప్పటి వరకు రాలేదు. నెలరోజులకు పైగా కొనుగోళ్లు జరిగినా.. ఇప్పటి వరకు ఒక్క రైతుకు కూడా బోనస్ పడలేదు. దీంతో వారు డబ్బుల కోసం కండ్లు కాయలు కాసేలే ఎదురుచూస్తున్నారు. ఆశతో సన్నాల సాగు.. సన్నధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాకు అదనంగా రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో యాసంగిలో 1,36,236 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో అత్యధికంగా 1,12,603 ఎకరాల్లో సన్న రకాలు సాగు చేశారు. అత్యల్పంగా 23,633 ఎకరాల్లో మాత్రమే దొడ్డురకం వంగడాలు వేశారు వీటి ద్వారా మొత్తం 2,63,577 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు లెక్కించారు. ఇందులో 84,577 మెట్రిక్ టన్నులు రైతులు, కూలీల అవసరాల కోసం, అదే విధంగా మిల్లర్లు, ప్రైవేట్ వ్యాపారులకు అమ్మకాలు చేస్తారని భావించారు. ఇవి పోగా మిగిలిన 1.79లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యం పెట్టుకున్నారు. 239 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 1,76,100 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. రైతుల అరిగోస.. బోనస్‌కు ఆశపడి సన్న రకం ధాన్యం సాగుచేస్తే కొనుగోళ్లు కేంద్రాల్లో రైతులు పడని ఇబ్బందులు లేవు. ఒక కేంద్రంలో తూకంలో మోసం.. మరో కేంద్రంలో డబ్బులు ఇచ్చిన వారి ధాన్యం ముందు కాంటాలు పెట్టడం, గన్నీ సంచుల కొరత, కాంటాలు పెట్టిన ధాన్యం ఎగుమతి చేసేందుకు లారీల కొరత.. ఆపై ఉరుములు మెరుపులతో అకాల వర్షాల భయం.. టార్పాలిన్లు లేక భూమి మీద పోసిన ధాన్యం తడిసిన సంఘటనలు ఉన్నాయి. కాంటాలు పెట్టిన ధాన్యం పలుచోట్ల మొలకెత్తింది. నెలల తరబడి కేంద్రాల్లో ఉండలేక ధాన్యానికి నిప్పు పెట్టి.. తాను నిప్పు పెట్టుకుంటానని రైతులు సిద్ధమైన సంఘటనలు ఉన్నాయి. ఇన్ని ఇబ్బందులు పడి ధాన్యం అమ్మితే ఇప్పటి వరకు బోనస్ అందలేదు. రూ.70కోట్లు పెండింగ్.. ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 239 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా 35,207 మంది రైతుల నుంచి 1,76,100 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఇందులో 35,970 మెట్రిక్ టన్నులు దొడ్డు రకం కాగా.. 1,40,130 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం కొన్నారు. వీటికి మొత్త రూ. 4,08.48కోట్లు చెల్లించారు. సన్న రకం ధాన్యంపై ప్రభుత్వం ప్రకటించిన క్వింటాకు రూ. 500 చొప్పున 28,016 మంది రైతులకు రూ.70కోట్ల మేరకు బోనస్ డబ్బులు ఇప్పటి వరకు రాలేదు. నెలలు గడిచినా జమకాని సన్నధాన్యం బోనస్ కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న రైతులు జిల్లాలో రూ.70కోట్ల మేర బకాయి ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితిజిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు వివరాలు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు : 239కొనుగోలు లక్ష్యం : 1.79 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం అమ్మిన రైతులు : 35,207 మంది కొనుగోలు చేసిన ధాన్యం : 1,76,100 మెట్రిక్ టన్నులు సన్నరకం ధాన్యం : 1,40,130 మెట్రిక్ టన్నులు దొడ్డురకం ధాన్యం : 35,970 మెట్రిక్ టన్నులు ధాన్యం విలువ : రూ. 408.48 కోట్లు బోనస్ విలువ : రూ. 70,06,50,000బోనస్ రావాల్సిన రైతులు : 28,016బోనస్ పడలేదు.. నాకు 4 ఎకరాల పొలం ఉంది. అందులో 85 క్వింటాళ్ల సన్నధాన్యం పండింది. నెలరోజుల క్రితం పంటను గూడూరు ఐకేపీ కొనుగోలు కేంద్రంలో అమ్మాను. బ్యాంకు ఖాతా, ఆధార్‌కార్డు జిరాక్స్‌లు తీసుకున్నారు. వారంలో బోనస్ డబ్బులు పడతాయన్నారు. కానీ ఇంత వరకు పడలేదు. సుమారు రూ.42,500 రావాలి. ఎప్పడు పడతాయా అని ఎదురుచూస్తున్నా. – ఓర్సు శ్రీనివాస్, రైతు, వడ్డెరగూడెం -
కేయూ వీసీని కలిసిన రీసెర్చ్ ప్రాజెక్ట్ సభ్యులు
కేయూ క్యాంపస్: రుసా 2.0 ప్రాజెక్ట్ కింద మంజూరైన శ్రీసెంటర్ ఆఫ్ మాలిక్యూల్స్ అండ్ మెటీరియల్స్శ్రీ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఫెల్లోస్ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకట్రామ్‌రెడ్డితో కలిసి మంగళవారం కేయూ వైస్ చాన్స్‌లర్ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రంలను మర్యాద పూర్వకంగా కలిశారు. రుసా 2.0లో భాగంగా ఐదు కేంద్రాల్లో ఒకటిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సెంటర్లో అధిక ప్రభావం చూపే మంచి జర్నల్స్‌లో మెరుగైన ఫలితాలను ప్రచురించడానికి, నాణ్యమైన పరిశోధన నిర్వహించాలని వీసీ ప్రతాప్‌రెడ్డి.. ప్రాజెక్ట్ ఫెల్లోలకు సూచించారు. కార్యక్రమంలో శ్రీలత, అడిషనల్ కంట్రోలర్ డాక్టర్ పద్మజ, విభాగాధిపతి మంజుల, నరేందర్, రాజు, శ్రీలత, నర్సింహులు పాల్గొన్నారు. -
వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి
మహబూబాబాద్: ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని సీఎస్ రామకృష్ణారావు అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి సీఎస్ రామకృష్ణారావు ప్రభు త్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై కలెక్టర్లతో వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 2,30,000లకు పైగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలు పంపిణీ చేశామన్నారు. ప్రతీ పట్టణంలో కనీసం 500 మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. రైతులకు సమృద్ధిగా ఎరువుల సరఫరాకు పకడ్బందీ చర్యలు తీసుకున్నామన్నారు. 1,25,000 ఎకరాల్లో ఆయిల్‌పామ్ పంట సాగు విస్తీర్ణం లక్ష్యంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆగస్టు 15 నాటికి భూభారతి రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల పరిష్కారం పూర్తి అవుతుందన్నారు. వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, వీరబ్రహ్మచారి, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, డీఏఓ విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు. -
కనీస సౌకర్యాలు కరువు
మహబూబాబాద్: ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థ బలోపేతం కోసం ఈ ఏడాది అమ్మ మాట–అంగన్వాడీ కార్యక్రమం చేపట్టింది. కేంద్రాల ద్వారా కొనసాగుతున్న కార్యక్రమాలపై తల్లిదండ్రులకు తెలి యజేసి పిల్లల పేర్లు నమోదు చేశారు. ప్రీ ప్రైమ రీ విద్యా ప్రాధాన్యతను వివరిస్తున్నారు. అయితే కేంద్రాల్లో మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం లాంటి విషయాలపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. అలాగే పోస్టుల ఖాళీలతో పర్యవేక్షణ సక్రమ ంగా లేక నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంది. 1,435 కేంద్రాలు.. జిల్లాలో ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,435 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. డోర్నకల్ ప్రాజెక్ట్ పరిధిలో డోర్నకల్,గార్ల,కురవి,గూడూరు ప్రాజెక్ట్ ప రిధిలో గూడూరు, గంగారం, కొత్తగూడ, మానుకో ట ప్రాజెక్ట్ పరిధిలో బయ్యారం,కేసముద్రం, మానుకోట, మరిపెడ ప్రాజెక్ట్ పరిధిలో చిన్నగూడూరు, దంతాలపల్లి, మరిపెడ, నర్సింహులపేట, తొర్రూ రు ప్రాజెక్ట్ పరిధిలో నెల్లికుదురు, తొర్రూరు పెద్దవంగర మండలాలు ఉన్నాయి. ఆ కేంద్రాల్లో జీరో నుంచి ఆరు నెలలోపు పిల్లలు 3,604మంది, ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాలలోపు పిల్లలు 20,295మంది, మూడేళ్ల నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు 16,181 మంది ఉన్నారు. 330 కేంద్రాలు సొంత భవనాలు, 625 కేంద్రాలు అద్దె లేకుండా(ఫ్రీ రెటెండ్)భవనాలు, 80కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. మరుగుదొడ్లు లేని కేంద్రాలు 732.. జిల్లాలో 1,435 అంగన్వాడీ కేంద్రాలకు గాను 732 సెంటర్లలో మరుగుదొడ్లు లేవు. 703 కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం లేదు. 397 కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం లేక టీచర్లు, ఆయాలు, పిల్లలు, బాలింతలు, గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో 302 సెంటర్లు సొంత భవనాల్లో కొనసాగుతుండగా.. 206 కేంద్రాల్లో మరుగుదొడ్లు, 272 కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం, 137 కేంద్రాల్లో తాగు నీటి సౌకర్యం లేదు. కనీసం సొంత భవనాల్లో కూడా కనీస సౌకర్యాలు లేకపోవడంతో పిల్లల తల్లిదండ్రులు అదికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ సంవత్సరం జూన్‌లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం లేని కేంద్రాల వివరాలు ఇవ్వాలని ఆశాఖ కమిషనర్ నుంచి ఆదేశాలు రాగానే నివేదిక పంపిస్తారు. అయితే ఇవి ప్రతిపాదలకే పరిమితమవుతున్నాయి. భారీగా ఖాళీలు.. జిల్లాలో 116 టీచర్, 576 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే 58 మంది సూపర్వైజర్లకు 46 మంది మాత్రమే ఉన్నారు. ఖాళీలతో పర్యవేక్షణ సక్రమంగా లేదు. చాలా మంది టీచర్లు సమయపాలన పాటించడం లేదు. కొంత మంది టీచర్లు, ఆయాలు తప్పులు చేసినా కేవలం మోమోలు జారీ చేసి వదిలేస్తున్నారు. నివేదిక తయారు చేస్తున్నాం.. జిల్లాలో మరుగుదొడ్లు, విద్యుత్, తాగునీటి సౌకర్యం లేని కేంద్రాలను గుర్తించి నివేదిక తయారు చేస్తున్నాం. కమిషనర్‌కు నివేదిక పంపిస్తాం. అత్యవసరం ఉన్న కొన్ని కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. కేంద్రాల బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. సమయపాలన పాటించని సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నాం. – ధనమ్మ, డీడబ్ల్యూఓఅంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు లేక అవస్థలు జిల్లాలో 732 సెంటర్లలో లేని మరుగుదొడ్లు ప్రతిపాదనలకే పరిమితం వేధిస్తున్న సిబ్బంది కొరత -
నిరంతర వైద్య సేవలు అందించాలి
● కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ నెహ్రూసెంటర్: వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సీజనల్ వ్యాధులతో ఆస్పత్రికి వచ్చే రోగులకు ని రంతరం నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. జిల్లా ప్రభు త్వ జనరల్ ఆస్పత్రిని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ఆస్పత్రిలో కావాల్సిన మందులను సిద్ధం చే సుకోవాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, ఎప్పటికప్పుడు శానిటేషన్ నిర్వహించాలని సూచించారు. ఆస్పత్రిలో మెడికల్, ఫీవర్, క్యాజువాలిటీ, ఐసీయూ,మెడికల్కేర్, పిడియాట్రిక్, జనరల్ సర్జిక ల్ వార్డులను పరిశీలించారు. ప్రభుత్వ ఆస్పత్రి, మెడికల్ కళాశాల నిర్మాణ పనులను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతంగా పూర్తి చేసేలా కాంట్రాక్టర్లు సమన్వయంతో పని చేయాలన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివా సరావు, ఆర్ఎంఓ జగదీశ్వర్ పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికలకు సై..
జూలైలో ఎన్నికలు ఉండొచ్చని సంకేతాలుసాక్షి, మహబూబాబాద్: రాష్ట్రంలో ఏడాది తర్వాత మళ్లీ రాజకీయ పార్టీల్లో ఎన్నికల సందడి మొదలైంది. వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయనే సంకేతాలు రావడంతో ఆశావహులు పోటీకి సిద్ధమని ప్రకటనలు చేస్తున్నారు. అలాగే అధికారులు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామని చెబుతున్నారు. ముందు ఆ ఎన్నికలే.. గత ఏడాదిన్నర నుంచి స్థానిక సంస్థలు, మున్సిపాలిటీల పదవీకాలం ముగిసింది. గత ఏడాది జనవరిలో సర్పంచ్, జూలైలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఈ ఏడాది జనవరిలో మున్సిపల్ కౌన్సిల్ పదవీకాలం ముగిసింది. ప్రస్తుతం వరుసగా అన్ని ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే ముందుగా గ్రామ పంచాయతీలకు కాకుండా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందనే సంకేతాలు వస్తున్నాయి. ఆశావహుల హడావుడి.. ఏడాదికాలంగా ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్న ఆశావహులు ఇటీవల మంత్రులు, ప్రజాప్రతినిధుల ప్రకటనలతో హడావుడి చేస్తున్నారు. జిల్లాలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు వామపక్ష పార్టీలు సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీలో కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇందుకోసం అధికార కాంగ్రెస్ పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీలోని కీలక నాయకులు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం గెలుపు గుర్రాలకు టికెట్ ఇచ్చేందుకు అన్వేషణ మొదలు పెట్టారు. కొందరికి అంతా సిద్ధం చేసుకోండి అని చెప్పినట్లు తెలిసింది. ఇక బీఆర్ఎస్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వ వ్యతిరేకతనే బలంగా ముందుకు సాగాలని, అత్యధిక సీట్లు గెలవాలని అధినాయకత్వం చెప్పడంతో అంతా అప్రమత్తమయ్యారు. బీజేపీ కూడా తమ బల నిరూపనకు ఇదే అదునుగా భావించి గెలిచే స్థానాలు గుర్తించి బలమైన అభ్యర్థులను బరిలో దింపే పనిలో ఉన్నారు. వీరితోపాటు మొదటి నుంచి వామపక్ష పార్టీల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో బలమైన అభ్యర్థులను బరిలో దింపి గెలిపించుకునేందుకు ఇప్పటి నుంచే ప్యూహ రచన చేస్తున్నారు. ప్రజా సమస్యలపై గళం వినిపిస్తూ ప్రజల మద్దతు కూడగట్టుకుంటున్నారు. అయితే ఈ సారి ఏ ఎన్నికై నా.. ఏ పార్టీ నుంచేనా.. పోటీలో నిలిచేవారిలో అధికశాతం యువతే ఉండే అవకాశం ఉంది. ఈమేరకు గాడ్‌ఫాదర్స్ వద్దకు వెళ్లి టికెట్ ఇప్పించాలని కోరుతున్నారు. రిజర్వేషన్లపై చర్చ.. ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియ ఎలా ఉంటుందనేది అన్ని రాజకీయ పార్టీల్లో చర్చగా మారింది. బీసీ కులగణన ప్రక్రియపై ప్రస్తుతం చర్చ జరుగుతున్న నేపథ్యంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ వస్తుందా.. ఇలా అయితే రిజర్వేషన్ 50శాతానికి మించే అవకాశం ఉంది. ఇది రాజ్యాంగ విరుద్ధం. అసలు బీసీ రిజర్వేషన్ ఉంటుందో.. లేదో.. ఉంటే ఎంత మేరకు ఇస్తారో అనేది చర్చ. దీంతోపాటు గత ఎన్నికలకు ముందు ప్రకటించిన రిజర్వేషన్ రెండు విడతలుగా ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతుంది. అదే నిజమైతే గత ఎన్నికల్లో ఉన్న రిజర్వేషనే ఇప్పుడు కూడా అమలయ్యే అవకాశం లేకపోలేదు. మేం సిద్ధంగా ఉన్నాం.. ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన ఆదేశాలను తూచ తప్పకుండా అమలు చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. జిల్లాలోని 18 మండలాల్లోని 193 ఎంపీటీసీ స్థానాల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేశాం. 1066 పోలింగ్ స్టేషన్లను గుర్తించాం. బ్యాలెట్ బాక్స్‌లు, ఆర్ఓ బుక్స్, ఇతర మెటీరియల్ సిద్ధంగా ఉంది. ఆర్ఓ, ఏఆర్ఓలకు శిక్షణ ఇచ్చాం. –పురుషోత్తం, జెడ్పీ సీఈఓ అన్ని రాజకీయ పార్టీల్లో సందడి పోటీకి సిద్ధపడుతున్న ఆశావహులు సర్వం సిద్ధం చేశామంటున్న అధికారులు రిజర్వేషన్లపై చర్చపోలింగ్ స్టేషన్లు: 1,066 గ్రామ పంచాయతీలు: 482 వార్డులు : 4,110మండలాలు: 18 జెడ్పీటీసీలు: 18ఎంపీపీలు: 18 ఎంపీటీసీలు: 193 -
విద్యుత్ సమస్యల పరిష్కారమే ధ్యేయం
మహబూబాబాద్ అర్బన్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం ప్రతీ సోమవారం చేపడుతున్నామని మహబూబాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఇనుగుర్తి శ్రీనివాసాచారి అన్నారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్‌శాఖ కార్యాలయంలో సోమవారం వినియోగదారుల నుంచి అధికారులు ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసాచారి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు విద్యుత్ ప్రజావాణిలో 512 ఫిర్యాదులు రాగా, 442 పరిష్కరించామన్నారు. విద్యుత్ బిల్లులు, మీటర్ల సమస్యలు, విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు, కేటగిరీ మార్పు, పేరు మార్పు, ప్రమాదకరంగా ఉన్న స్తంభాలు తదితర విద్యుత్ సంబంధిత ఫిర్యాదులు వచ్చాయన్నారు. జిల్లా సర్కిల్ పరిధిలోని అన్ని ముఖ్య కార్యాలయాలు, సర్కిల్, డివిజన్, ఈఆర్వో, సబ్ డివిజన్, సెక్షన్ ఆఫీస్‌ల్లో విద్యుత్ ప్రజావాణి ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ సోమవారం ఉదయం 10నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 5గంటల వరకు విద్యుత్ ప్రజావాణి నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
నిషేధం.. ఉత్తిమాటే!
తొర్రూరు: పర్యావరణానికి పెను ముప్పుగా మారిన ప్లాస్టిక్ వస్తువులు, పాలిథిన్ కవర్ల వినియోగం పట్టణాల్లో యథేచ్ఛగా సాగుతోంది. 2022 జూలై 1నుంచి ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను నిషేధిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి. అప్పటి నుంచి కఠిన ఆంక్షలు అమల్లోకి రాగా తనిఖీలు చేస్తూ చర్యలు చేపట్టారు. కొద్ది రోజుల పాటు హడావుడి చేసిన అధికార యంత్రాంగం ఆ తర్వాత అటకెక్కించారు. జిల్లాలోని మహబూబాబాద్, తొర్రూరు, డోర్నకల్, మరిపెడ, కేసముద్రం మున్సిపాలిటీల్లో ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ కవర్లు, వస్తువులను నిషేధించారు. 120 మైక్రాన్ల లోపు కవర్లను, వస్తువులను తయారు చేయడం, అమ్మడం, వినియోగించుకోవడానికి వీలు లేదు. నెల రోజుల పాటు మున్సిపాలిటీల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ వ్యాపారుల దగ్గర ఉన్న ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. మార్పు వచ్చే సమయంలో... జిల్లాలోని మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్‌ను నిషేధించడంతో వ్యాపారులు సైతం పాలిథిన్ కవర్లను వినియోగించడాన్ని నిలిపివేశారు. ఇంటి నుంచే సంచులు తీసుకురావాలని వ్యాపారులు సూచించడంతో ప్రజలు పాటించారు. ఆ తర్వాత వ్యాపారులు అన్ని వస్తువులు ప్లాస్టిక్ కవర్లలోనే ఇస్తుండడంతో మళ్లీ మొదటికొచ్చింది. మున్సిపాలిటీల్లో తనిఖీలు వది లేయడంతో ఎక్కడ చూసినా ప్లాస్టిక్మయమైంది. ఒకసారి వాడి పడేసే వస్తువులు విపరీతంగా వాడుతున్నారు. కూరగాయలు, పూలు, పండ్ల వ్యాపారులు పల్చని సంచులు వాడుతున్నారు. ఏ శుభకార్యం జరిగినా కల్యాణ మండపాలు, హోటళ్లు, కర్రీ పాయింట్ల నుంచి ప్యాకింగ్ సంచులు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు, చెంచాలు, మిఠాయి డబ్బాలు, కప్పులు వేల సంఖ్యలో బయటకు వస్తున్నాయి. నేరుగా వ్యాపారులకు సరఫరా.. హోల్‌సేల్, రిటేల్ ప్లాస్టిక్ దుకాణాల్లో ఒకసారి వాడి పడేసిన వస్తువులను మున్సిపాలిటీ అధికారులు స్వాధీనం చేసుకుంటుండడంతో కొందరు కొత్త తరహాలో వ్యాపారానికి తెర లేపారు. ద్విచక్ర వాహనంపై సంచుల్లో పెట్టుకుని వ్యాపారుల దగ్గరికి వచ్చి పాలిథిన్ సంచులు సరఫరా చేస్తున్నారు. ఈ దందా ఎప్పటి నుంచో ఉండగా గత రెండు నెలలుగా పట్టణాల్లో తిరుగుతూ ప్లాస్టిక్ సంచులు విక్రయించే వారి సంఖ్య పెరిగినట్లుగా తెలుస్తోంది. జిల్లాలోని మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ నియంత్రణ చర్యలు నామమాత్రంగా కనిపిస్తున్నాయి. తనిఖీలు చేస్తున్న సమయంలో రాజకీయ ఒత్తిళ్లు పెరగడంతో చేసేదేమి లేక వెనక్కి వస్తున్నట్లుగా కార్మికులు చెబుతున్నారు. కమిటీ, తనిఖీలు ఏమైనట్లో? ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ కవర్లు, వస్తువులను పూర్తిగా నిషేధించడంతో మున్సిపాలిటీల్లో అమలు చేసేందుకు టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. కమిషనర్, శానిటరీ సూపర్వైజర్లు, ఎన్జీఓ, పోలీస్ కానిస్టేబుల్ కమిటీలో ఉంటారు. వీరంతా రోజూ పరిశీలించడంతో పాటు ప్రజలకు ప్రత్యామ్నాయంగా వాడుకునే వస్తువులను వివరించాల్సి ఉంటుంది. ఈ కమిటీ ఎక్కడ ఉందో కనిపించడం లేదు. శానిటేషన్ సిబ్బంది పలు దుకాణాలు తిరిగి వస్తున్నారు. సిబ్బంది పూర్తిగా పారిశుద్ధ్య నిర్వహణ పనులకే పరిమితమవ్వగా ప్లాస్టిక్ నియంత్రణ చర్యలు పట్టించుకోవడం లేదు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ సేకరణ కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. ప్లాస్టిక్ నియంత్రణకు సహకరించాలి నిషేధిత ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించినా, విక్రయించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే విక్రయదారులకు అవగాహన కల్పించాం. తనిఖీలు ముమ్మరం చేసి ప్లాస్టిక్‌ను స్వాధీనం చేసుకుంటున్నాం. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించేందుకు అందరూ సహకరించాలి. –శాంతికుమార్, మున్సిపల్ కమిషనర్, తొర్రూరు యథేచ్ఛగా ప్లాస్టిక్ వినియోగం నియంత్రణ చర్యలపై నిర్లక్ష్యం మున్సిపాలిటీల్లో పర్యవేక్షణ కరువు -
చోరీ కేసులో నిందితుల అరెస్ట్
జనగామ రూరల్ : జనగామ మండలం తుకుంబాయి తండాలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమేరకు సోమవారం డీసీపీ రాజమహేంద్ర నాయక్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. జనగామ పట్టణానికి చెందిన సామాను శివ, ప్యారాల సంపత్, ఒగ్గు మహేష్, మాదాసు శివ, కోమటి రాజశేఖర్ మద్యం తాగి పథకం ప్రకారం దొంగతనానికి పాల్పడ్డారని తెలిపారు. పాత నేరస్తుడైన సామాను శివతో స్నేహం చేసి, మిగతావారు కూడా శివ లాగానే దొంగతనం చేయాలని నిర్ణయించారు. ఈనెల 19వ తేదీరాత్రి దొంగతనం చేద్దామని మద్యం తాగి తిరుగుతుండగా, వెంకిర్యాల తుకుంబాయితండాకు చెందిన వాకిటి రామకృష్ణ రెడ్డి ఇంటికి తాళం వేసిఉండగా దాన్ని పగులగొట్టి, లోపలికి వెళ్లి బీరువాలో ఉన్న బంగారు వస్తువులను దొంగలించారు. బాధితుడు రామకృష్ణ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ సూచనల మేరకు ఏఎస్పీ పండరిచేతన్ నితిన్, సీఐ దామోదర్ రెడ్డి పర్యవేక్షణలో సోమవారం ఎస్సై చెన్నకేశవులు తన సిబ్బందితో యశ్వంతపూర్‌లో పెట్రోలింగ్ చేస్తున్నారు. ఈక్రమంలో నిందితులు బైక్‌పై వస్తుండగా అనుమానాస్పదంగా కనిపించారు. వెంటనే సిబ్బందితో పట్టుకొని వారిని విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకున్నారు. వారి బంగారు ఆభరణాలు, టీవీఎస్, బజాజ్ పల్సర్, లక్ష రూపాయల నగదు, మణప్పురం గోల్డ్ లోన్ రశీదు, 4తులాల గొలుసు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూసిన జనగామ సీఐ పి.దామోదర్ రెడ్డి, ఎస్సై చెన్నకేశవులు, కానిస్టేబుళ్లను వరంగల్ సీపీ అభినందించారు. పోలీసులను అభినందించిన వరంగల్ సీపీ -
ఓపెన్ స్కూల్.. ఓ వరం
విద్యారణ్యపురి : ఆర్థిక పరిస్థితులు, కుటుంబ కారణాల వల్ల పాఠశాల స్థాయిలోనే కొందరు చదువును మధ్యలో మానేస్తున్నారు. మరికొందరు పదోతరగతి పూర్తయ్యాక ఇంటర్ చదువును కొనసాగించలేక పోతున్నారు. చదువుకోవాల్సిన వయస్సులోనే ఆడపిల్లలకు పెళ్లిలు చేయడంతో చదువుకోనే అవకాశం లేదు. ఇలాంటి వారికి తెలంగాణ రాష్ట్ర ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ద్వారా మళ్లీ చదివేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇది ఓ రకంగా చదువును మధ్యలో మానేసిన వారికి వరం లాంటిదంటే అతిశయోక్తి కాదు. సార్వత్రిక విద్యను దూరవిద్య విధానంలో అందిస్తోంది. ఓపెన్ స్కూల్ విధానంలో టెన్త్, ఇంటర్లో ప్రవేశాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో హనుమకొండ, వరంగల్, ములుగు, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తంగా 117 అధ్యయన కేంద్రాలు (ప్రభుత్వ, జిల్లా పరిషత్ హైస్కూల్స్, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు)ఉన్నాయి. 2008–09 విద్యా సంవత్సరం నుంచి ఓపెన్ స్కూల్ విధానంలో పదోతరగతిలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. 2010–11 నుంచి ఇంటర్లో ప్రవేశాలు అందుబాటులోకి వచ్చాయి. ఆగస్టు12వరకు అడ్మిషన్లు.. గతంలో ప్రతి ఏటా జూలై–ఆగస్టులో ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్లో ప్రవేశాలు కల్పించే ప్రక్రియ ప్రా రంభమయ్యేది. ఈసారి అలా కాకుండా రెగ్యులర్ విధానం వల్లే ఈ విద్యాసంవత్సరం 2025–26లో ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్లో ప్రవేశాల ప్రక్రియ ను అధికారులు ప్రారంభించి ఆగస్టు 12వ తేదీవరకు అడ్మిషన్లు కల్పిస్తారు. ఆన్లైన్లో సంబంధిత వెబ్సైట్ ద్వారా మీసేవా సెంటర్లలోనే ఫీజు చెల్లించి అధ్యయన కేంద్రాల్లో అడ్మిషన్లు పొందవచ్చు. అక్షరాస్యత శాతం పెంచేందుకు.. ఓపెన్ స్కూల్ విధానంలో టెన్త్, ఇంటర్లో అడ్మిషన్ల ప్రక్రియకు అర్హులైన అభ్యాసకులు దరఖాస్తు చేసుకుంటారు. రాష్ట్రంలో అక్షరాస్యతను పెంచేందుకు ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ) ప్రాజెక్టు ద్వారా ఓపెన్ స్కూల్లో ప్రవేశాలకు అర్హులైన వారిని కూడా సంబంధిత అధికారులు గుర్తిస్తున్నారు. ఉల్లాస్ ప్రాజెక్టు ఆఫీసర్, డీడీలను, సెర్ప్, మెప్మా, సెల్ప్ హెల్ప్ గ్రూప్స్, వీఓ, సీఆర్పీలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఎంఈఓలు, ఏఐ కోఆర్డినేటర్ల సహాయంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో టెన్త్, ఇంటర్మీడియట్ చదివేందుకు అర్హులైన వారిని గుర్తిస్తున్నారు. టాస్‌లో అడ్మిషన్లు కల్పించేందుకు సర్వే ప్రక్రియ సైతం మొదలెట్టారు. అలా ఇప్పటి వరకు టెన్త్‌కు 1,581మందిని, ఇంటర్లో 1,952 మందిని గుర్తించారు. అడ్మిషన్లు పొందిన వారు ఎంపిక చేసుకున్న అధ్యయన కేంద్రాల్లో తరగతులకు హాజరు కావాల్సింటుంది. పాఠ్యపుస్తకాలు అందజేస్తారు. అలాగే ప్రతి రెండో శనివారం, ఆదివారం తరగతులు నిర్వహిస్తారు. ఉమ్మడి జిల్లాకు అడ్మిషన్ల టార్గెట్ 11,616 ఈ విద్యాసంవత్సరంలో ఓపెన్ స్కూల్ విధానంలో టెన్త్, ఇంటర్లో ప్రవేశాలకు 11,616 మంది అడ్మిషన్లను నిర్దేశించారు. గతేడాది టెన్త్, ఇంటర్లో 6,849 మంది అడ్మిషన్లు పొందారు. అందులో టెన్త్‌లో 2,401మంది, ఇంటర్లో 4,448 మంది ఉన్నారు. చదువు మానేసిన వారికి సువర్ణావకాశం ఈసారి ముందస్తుగానే టెన్త్, ఇంటర్లో ప్రవేశాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 117 అధ్యయన కేంద్రాలుదరఖాస్తులు ఇలా.. ఓపెన్ స్కూల్ టెన్త్‌లో ప్రవేశాలకు ఎలాంటి విద్యార్హత అవసరం లేదు. కనీస వయస్సు 15ఏళ్లు నిండి ఉండాలి. ఆపై వయస్సుగలవారు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చును. గరిష్ట వయోపరిమితి లేదు. తెలుగు, ఉర్దూ, ఆంగ్లం, హిందీ మీడియంలో ఏదైనా ఒక మాధ్యమాన్ని ఎంపిక చేసుకోవచ్చు. తహసీల్దార్ లేదా మున్సిపల్ నుంచి జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది. పాఠశాల స్థాయిలో చదువు మానేస్తే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టీసీ), ఆధార్ కార్డుతో ప్రవేశం పొందవచ్చు. ఇంటర్లో ప్రవేశాలకు తప్పనిసరిగా పదో తరగతి పాస్ కావాల్సి ఉంటుంది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఆగస్టు 12వతేదీ వరకు అడ్మిషన్లు పొందాలి. పదోతరగతిలో ప్రవేశాలకు ఫీజు ఓసీ అభ్యాసకులకు రూ.1,550, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ.1,150 చెల్లించాలి. ఇంటర్లో అడ్మిషన్లకు ఓసీలకు రూ.1,800, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యాసకులు రూ.1,500లు చెల్లించాల్సి ఉంటుంది. టీజీ ఆన్లైన్లో మీసేవా కేంద్రాల ద్వారా లేదా ఏపీ ఆన్లైన్ ద్వారా ఫీజులు చెల్లించి తమకు సమీపంలోని ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాల్లో దరఖాస్తులు సమర్పించి అడ్మిషన్లు తీసుకోవాలి.రెగ్యులర్ విద్యతో సమానం.. ఓపెన్ స్కూల్లో టెన్త్, ఇంటర్‌ను పూర్తి చేసిన వారికి రెగ్యులర్ చదువుతో సమానమైన గుర్తింపు ఉంటుంది. ఆగస్టు 12వరకు అడ్మిషన్లు కొనసాగుతాయి. ఓపెన్ స్కూల్ టెన్త్ పూర్తి చేసిన వారు ఆపై విద్యకు, ఇంటర్ పూర్తిచేసిన వారు ఉన్నత విద్యకు కూడా అర్హులే. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ తెలంగాణ ఓపెన్ స్కూల్. ఓఆర్జీ వెబ్సైట్లో కూడా పూర్తి వివరాలు లభిస్తాయి. ఉల్లాస్ ప్రాజెక్టు ద్వారా అర్హులైన వారిని గుర్తిస్తున్నాం. వారిని కూడా అడ్మిసన్లకు ప్రోత్సహించే ప్రక్రియ చేపట్టాం. ఆసక్తి గల వారికి ఇది ఒక అవకాశంగా భావించాలి – అనగోని సదానందం, ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ -
అనాథ చిన్నారులను చదివిస్తాం..
విద్యారణ్యపురి : తల్లిదండ్రుల మృతితో అనాథలైన చిన్నారులను న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) హనుమకొండ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి క్షమాదేశ్ పాండే, డీఎల్ఎస్ఏ వరంగల్ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సాయికుమార్ సోమవారం హనుమకొండలోని వివేకానందనగర్‌లోని సాయిట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాయిస్పందన హైస్కూల్లో చేర్పించారు. వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం పోతరాజుపల్లికి చెందిన ఓని రమేశ్, అతడి భార్య తిరుపతమ్మ ఆరునెలల క్రితం మరణించారు. వీరికి కుమారులు గౌతమ్, గర్విక్ ఉన్నారు. కాగా రమేశ్ అన్న విజయ్ ప్రస్తుతం హనుమకొండలోని భవానినగర్‌లో ఉంటున్నాడు. తమ్ముడి పిల్లల ఆలనాపాలనకు తాము గార్డియన్‌గా ఉన్నామని అయితే వీరిని చదివించే స్థోమత తమకు లేదని వీరికి హాస్టల్ వసతితో పాటుగా విద్యను అందించే సదుపాయం కల్పించాలని ఇటీవల విజయ్ హనుమకొండ జిల్లా న్యాయసేవాధికారి సంస్థకు వినతి పత్రం అందజేశారు. దీంతో స్పందించిన డీఎల్ఎస్ఏ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి హనుమకొండ కార్యదర్శి క్షమాదేశ్‌పాండే, వరంగల్ డీఎల్ఎస్ఏ సెక్రటరీ సాయికుమార్ చైల్డ్వెల్ఫేర్ కమిటీ సహకారంతో సోమవారం ఇద్దరు చిన్నారులను వివేకానందనగర్‌లోని సాయిస్పందన హైస్కూల్లో చేర్పించారు. గౌతమ్‌ను 5వ తరగతిలో, గర్విక్ను ఒకటోతరగతిలో చేర్పించారు. పాఠశాలలో చేర్పించిన సీనియర్ సివిల్ జడ్జిలు -
వినతులు త్వరగా పరిష్కరించాలి
మహబూబాబాద్: ప్రజావాణి వినతులను నిర్లక్ష్యం చేయకుండా త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా.. అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె.వీరబ్రహ్మచారి వినతులు స్వీకరించారు. ఈసందర్బంగా లెనిన్ వత్సల్ టొప్పో మాట్లాడుతూ.. పెండింగ్ వినతులు కూడా వెంటనే పరిష్కరించాలన్నారు. సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి అనే విషయాన్ని గుర్తు పెట్టుకొని అధికారులు పని చేయాలన్నారు. మొత్తం 106 వినతులు వచ్చినట్లు అదికారులు వెల్లడించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ పురుషోత్తం, హౌసింగ్ డీఈ రాజయ్య, డీపీఓ హరిప్రసాద్, డీసీఓ వెంకటేశ్వర్లు తదతరులు పాల్గొన్నారు. కొన్ని వినతులు పరిశీలిస్తే.. ●గూడూరు మండలం ఏపూర్ గ్రామ శివారు రేకులతండాకు చెందిన మోతీరాం తన రెండున్నర ఎకరాల భూమికి పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వాలని వినతి ఇచ్చారు. ● మానుకోటలోని కేజీబీవీలో హెడ్ కుక్‌గా కొంత కాలం పని చేశామని, వేతనం ఇవ్వలేదని, ప్రస్తుతం ఇప్పించాలని ఎస్కె.షహీన్, పి నాగమణి వినతిలో పేర్కొన్నారు. ● గార్ల మండలం సీతంపేట గ్రామానికి చెందిన కృష్ణ చైతన్య తనకు ఉపాధి కల్పించాలని వినతి అందజేశారు. ● మానుకోట మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన శ్రవంతి తనకు కాంట్రాక్ట్ ఉద్యోగం ఇప్పించాలని వినతిలో పేర్కొంది. అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ప్రజావాణిలో 106 వినతులు -
విద్యారంగానికి అధిక ప్రాధాన్యం
మహబూబాబాద్ రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని డీఈఓ రవీందర్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి ఎంపీపీఎస్ అభివృద్ధికి సోమవారం తెలంగాణ సాంస్కృతిక సారథి జిల్లా అధ్యక్షుడు కోలిశెట్టి సత్యనారాయణ, ఉమ దంపతులు రూ.20 వేలు విరాళంగా అందజేశారు. అదే విధంగా వారి కుమార్తె భవిష్య పటేల్‌ను ప్రభుత్వ బడిలో నాలుగో తరగతిలో చేర్పించగా.. డీఈఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో డీపీఆర్ఓ రాజేంద్రప్రసాద్, బీసీ సంక్షేమ అధికారి నరసింహారావు, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం లక్ష్మి, జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ పూర్ణ చందర్, స్పూర్తి ఫౌండేషన్ కన్వీనర్ శ్రీధర్ రెడ్డి, టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆవునూరి రవి, రాధిక, సువర్ణ, శ్రీజ, గ్రామ ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
‘బెస్ట్ అవైలబుల్’ బకాయిలు చెల్లించాలి
తొర్రూరు: బెస్ట్ అవైలబుల్ పథకం కింద తమ పిల్లలు చదువుతున్న ప్రైవేట్ పాఠశాలలకు బకాయిలు చెల్లించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ పథకం కింద విద్యార్థులకు విద్యనందిస్తున్న డివిజన్ కేంద్రంలోని లిటిల్‌ఫ్లవర్ హైస్కూ ల్ ఎదుట సోమవారం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో ప్రైవేట్ పాఠశాలల యాజ మాన్యాలు భోజనం, వసతి, విద్య అందించడం కష్టంగా మారిందని తల్లిదండ్రులు వాపోయారు. ఎస్సీ, ఎస్టీ పిల్లలు చదివే పాఠశాలలకు బకాయిలు చెల్లించకపోవడం సరికాదన్నారు. ఈ విషయమై పాఠశాల కరస్పాండెంట్ దేవేందర్‌రెడ్డి వివరణ కోరగా.. గురుకులాల్లో చదివే ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.1.25 లక్షల మేర ఖర్చు చేస్తుందని, బెస్ట్ అవైలబుల్ పథకం కింద ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థికి కేవల రూ.40 వేలు ఖర్చు చేస్తుందన్నారు. దానికి అంగీకరించి నాణ్యమైన విద్య, భోజ నం, వసతి అందిస్తున్న పాఠశాలలకు బకాయిలు చెల్లించకపోవడం ఇబ్బందిగా మారిందన్నారు. ఈ విషయమై గతంలో పలు పర్యాయాలు ప్రభుత్వ పెద్దలను కలిసినా ఫలితం లేకపోయిందన్నారు. -
పాకిస్తానీ వలసదారుల భూములకు కోర్టు ఉత్తర్వులు
జనగామ రూరల్: దేశ విభజన అనంతరం పాకిస్తానీలు దేశం విడిచి వెళ్లిపోయిన నేపథ్యంలో వారి ఆధీనంలో ఉన్న అప్పటి భూములకు పట్టాలు పొందిన లింగాలఘణపురం మండలం కుందారం గ్రామానికి చెందిన రైతులకు నేడు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాంటి లావాదేవీలు నిర్వహించకుండా చేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. సోమవారం జనగామ కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో బాధిత రైతులు తమ గోడును కలెక్టర్ ఎదుట వెళ్లబోసుకున్నా ఫలితం లేకుండా పోయింది. వివరాలిలా ఉన్నాయి.. జలాలుద్దీన్ అన్వర్ పేరుతో సీటీ సివిల్ కోర్టు సదరు భూముల్లో ఎలాంటి లావాదేవీలు నిర్వహించద్దని స్టే తీసుకురావడంతో రైతులు ఆ వ్యక్తి ఎవరో తమకు తెలియదని, అలాంటి వ్యక్తికి కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. 1952లో మున్వర్ హైదర్ అనే వ్యక్తి పాకిస్తాన్‌కు వెళ్లిపోగా అప్పటి నుంచి ఆ భూములు తమ ఆధీనంలో ఉన్నాయని, 1989లోనే కస్టోడియన్ ఆఫ్ ప్రాపర్టీ కింద అప్పటి ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని చెప్పారు. 2018లో టీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పాసుపుస్తకాలు కూడా జారీ చేసిందని, ఇటీవల రైతు భరోసా రావడంలేదని, రిజిస్ట్రేషన్ కావడంలేదని వాపోయారు. జిల్లాలో లింగాలఘణపురం, రఘునాథపల్లి, జఫర్‌గఢ్, పాలకుర్తి, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ మండలాల్లో వందలాది ఎకరాల భూములకు ఇలాంటి పరిస్థితి ఉంది. లబోదిబోమంటున్న రైతులు 70ఏళ్లకు పైగా సాగులో ఉన్నామని ఆవేదన -
నేడు డీసీసీబీ మహాజన సభ
హన్మకొండ : వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) మహాజన సభ నేడు (మంగళవారం) నిర్వహిస్తున్నట్లు ఆ బ్యాంక్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వజీర్ సుల్తాన్ తెలిపా రు. ఉదయం 11గంటలకు హనుమకొండ నక్కలగుట్టలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో చైర్మన్ మార్నేని రవీందర్ రావు అధ్యక్షతన ఈ సభ జరుగుతుందని ఆయన ఒక ప్రకటనలో వివరించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రుణాల పంపిణీ, వ్యవసాయ, విద్య రుణాల జారీ, వసూళ్లు వివిధ పథకాలపై చర్చించనున్నట్లు ఆయన వివరించారు. పూర్వ వరంగల్ జిల్లా పరిధిలోని పీఏసీఎస్ చైర్మన్లు, వ్యవసాయ శాఖ, ఉద్యానశాఖ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొనాలని కోరారు. విద్యావేత్తలు రాజకీయాల్లోకి రావాలి ● ఆల్ ఇండియా ఓబీసీ జేఏసీ చైర్మన్ నరేందర్ కేయూ క్యాంపస్ : విద్యావేత్తలు రాజకీయాల్లోకి రావాలని అప్పుడే దేశంలో విలువల పాలన నిర్మితమవుతుందని ఆల్ ఇండియా ఓబీసీ జేఏసీ చైర్మన్ సాయిని నరేందర్ పేర్కొన్నారు. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్ కాలేజీలో డాక్టర్ చింతం ప్రవీణ్‌కుమార్ తెలుగు విభాగం అధిపతిగా సోమవారం బాధ్యతలు స్వీకరించగా, సన్మానించారు. ఓబీసీ జాక్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు తాడిశెట్టి క్రాంతికుమార్, బీసీ ఉద్యోగ సంఘాల బాధ్యులు బుసగొండ ఓంకార్, చాపర్తికుమార్, వల్లాల జగన్‌గౌడ్, రాసమల్ల శ్రీనివాస్, నారాయణగిరి రాజు, నలుబాల రవికుమార్, సుధాకర్ పాల్గొన్నారు. కాజీపేట మీదుగా 8 ప్రత్యేక రైళ్లు ● నేటినుంచి ప్రారంభం కాజీపేట రూరల్ : ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా కాజీపేట జంక్షన్ మీదుగా దక్షిణ మధ్య రైల్వే, బిలాస్పూర్ రైల్వే అధికారులు కాచిగూడ–బిలాస్పూర్ మధ్య 8 ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ సోమవారం తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు.. జూన్ 23 నుంచి జూలై 7వ తేదీ వరకు బిలాస్పూర్లో ప్రతి సోమవారం బయలుదేరే బిలాస్పూర్–కాచిగూడ (08263) వెళ్లే ఎక్స్‌ప్రెస్ మంగళవారం కాజీపేటకు చేరుకొని వెళ్తుంది. అదేవిధంగా జూన్ 24వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు కాచిగూడ–బిలాస్పూర్ (08264) వెళ్లే ఎక్స్‌ప్రెస్ ప్రతి మంగళవారం కాజీపేట జంక్షన్‌కు చేరుకొని వెళ్తుంది. 3 ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో ప్రయాణించే ఈ రైళ్ల సర్వీస్‌లకు బిలాస్పూర్, రాయ్‌పూర్, దుర్గ్, రాజ్‌నందగాం, డోంగ్ర, గోండియా, వడ్సా, చాంద ఫోర్ట్, బలర్షా, సిర్పూర్ కాగజ్‌నగర్, మంచిర్యాల, రామగుండం, కాజీపేట, చర్లపల్లి, మల్కాజ్గిరి స్టేషన్లలో హాల్టింగ్ కల్పించినట్లు సీపీఆర్వో తెలిపారు. -
ఉమ్మడి జిల్లాస్థాయి బాల్ బ్యాడ్మింటన్ విజేత కానిపర్తి
కమలాపూర్ : ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని కానిపర్తి జట్టు నిలిచింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం దౌలత్‌నగర్‌లో నిర్వహించిన ఆరు జిల్లాల స్థాయి ఆహ్వానిత బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మొత్తం 12 జట్లు పాల్గొనగా కానిపర్తి, భూపాలపల్లి జట్లు ఫైనల్‌కు చేరాయి. ఆదివారం జరిగిన ఫైనల్లో భూపాలపల్లి జట్టుపై కానిపర్తి జట్టు గెలిచి టోర్నీని కై వసం చేసుకుంది. విజేతగా నిలిచిన జట్టుకు నిర్వాహకులు ట్రోఫీతో పాటు నగదు బహుమతి అందజేశారు. కానిపర్తి జట్టుకు కోచ్‌గా కన్నెబోయిన కిరణ్‌యాదవ్, కెప్టెన్‌గా దాసరి రమేష్ వ్యవహరించారు. -
ప్రైవేట్ బడులకు పంపకండి
మహబూబాబాద్ రూరల్ : తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ బడులకు పంపవద్దని పర్వతగిరి జెడ్పీ, ఎంపీపీఎస్ పాఠశాలల హెచ్ఎంలు మందుల శ్రీరాములు, పంజాల లింగమూర్తి కోరారు. బడిబాటలో భాగంగా మహబూబాబాద్ మండలంలోని పర్వతగిరి గ్రామస్తులు, యువకులు పిల్లలను స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ప్రైవేట్ పాఠశాల బస్సు ఎక్కిస్తున్న మునీందర్ కుమార్తె 3వ తరగతి విద్యార్థిని రిక్తికను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించుకున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవి, గీత, రామాచారి, హరి, రాధిక, గ్రామస్తులు చల్ల వెంకన్న, అశోక్, నవీన, సలీం, సాయి, మహేశ్, నారాయణ సింగ్, అబ్రహం, మధు, సంపత్, నరేశ్, రాజు, రంజిత్, రామన్న, కిరణ్, వేణు, అనిల్ యాకన్న తదితరులు పాల్గొన్నారు. -
తెరుచుకోని ప్రభుత్వ గిరిజన పాఠశాల
గార్ల : ఇద్దరు ఉపాధ్యాయులు సోమవారం విధులకు హాజరు కాకపోవడంతో ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల తాళం తెరుచుకోలేదు. అసలే ఈ పాఠశాల తెరిచిన నాటి నుంచి ఒక్క విద్యార్థి సైతం చేరలేదు. గార్ల మండలంలోని చిన్నకిష్టాపురం పంచాయతీ సర్వన్తండా పాఠశాలలో ఉపాధ్యాయులే విధులకు డుమ్మా కొడుతుంటే, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించకుండా ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారు. ఇదే పాఠశాలలో ఆవరణలో కొనసాగుతున్న అంగన్వాడీ టీచర్‌ను వివరణ కోరగా ఇద్దరు ఉపాధ్యాయులు పాఠశాలకు రాలేదని తెలిపారు. ఇప్పటికై నా సంబంధిత ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు స్పందించి ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలపై పర్యవేక్షణ పెంచాల్సిన అవసరం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై హెచ్ఎం సీహెచ్ జోగయ్యను ‘సాక్షి’ వివరణ కోరగా సర్వన్తండా జీపీఎస్ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు సోమవారం విధులకు హాజరు కాలేదని వివరించారు. విధులకు ఉపాధ్యాయుల గైర్హాజరు -
అవినీతిపై విచారణ చేపట్టాలి
మహబూబాబాద్: గార్ల మండలం మద్దివంచ గ్రామంలో ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని, కూలీలకు న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు కట్టెబోయిన శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మద్దివంచ గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి కార్యాలయంలో వినతిప్రతం అందజేశారు. ఈసందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆ గ్రామంలో ఏపీఓ, ఎఫ్ఏ, కంప్యూటర్ ఆపరేటర్లు కలిసి బినామీ పేర్లతో కూలీల డబ్బులు కాజేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుమారు రెండు నెలల పాటు 200మంది కూలీలు డబ్బులు సుమారు రూ.8 లక్షలు మాయం చేశారని, వెంటనే విచారణ చేసి డబ్బులు వారి ఖాతాల్లోజమ చేయాలన్నారు. ఎంపీడీఓ, సంబంధిత కార్యాలయాల ఎదుట ఆందోళన చేసినా ఫలితం లేకపోవడంతో కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశామన్నారు. కూలీలకు న్యాయం చేయకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు మల్లేష్, రమేశ్, బాబురావు, లోకేష్, నాగేశ్వర్, కూలీలు వినోద, బుచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ బోల్తా.. అన్నదాత దుర్మరణం
● లక్ష్మారెడ్డిపల్లెలో ఘటన గణపురం : సొంత వ్యవసాయ భూమిలో కల్టివేటర్‌తో దున్నుతుండగా ట్రాక్టర్ బోల్తాపడి రైతు ఓద్దుల రాంరెడ్డి (46) అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషాద ఘటన సోమవారం గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లెలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు రాంరెడ్డి తన భూమిలో సొంత ట్రాక్టర్‌తో దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు రాంరెడ్డిని బయటకు తీసే ప్రయత్నం చేసిన సాధ్యపడలేదు. వెంటనే క్రేన్ సహాయంతో ట్రాక్టర్‌ను పక్కకు జరిపి రాంరెడ్డి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి భార్య జ్యోతి, కుమారుడు, కూతురు ఉన్నారు. జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. అందరితో కలిసిమెలిసి ఉండే రాంరెడ్డి మృతితో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. బైక్ అదుపుతప్పి ఆర్ఎంపీ మృతి ఎల్కతుర్తి : బంధువుల వేడుకకు వెళ్లి వస్తుండగా బైక్ అదుపుతప్పి ఓ ఆర్ఎంపీ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సోమవారం భీమదేవపల్లి మండలం గట్లనర్సింగాపూర్ శివారులో జరిగింది. ఎస్సై సాయిబాబు కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం జగన్నాథపూర్ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ చిర్ర సుదర్శన్ (60) ఆదివారం హుస్నాబాద్‌లో జరిగిన బంధువుల ఫంక్షన్‌కు ద్విచక్ర వాహనంపై వెళ్లి అర్ధరాత్రి 1గంటకు తిరిగి వస్తున్నాడు. ఈక్రమంలో బైక్ అదుపుతప్పి కిందపడి పోయాడు. దీంతో అతడి తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుమారుడు విజయ్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. బంగారు గొలుసు లాక్కెళ్ల్లిన దుండగుడు రాయపర్తి : వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లిన సంఘటన మండలంలోని మైలారంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన కథనం ప్రకారం.. మైలారం గ్రామానికి చెందిన తుమ్మ సావిత్రమ్మ తెల్లవారుజామున 3గంటలకు ఇంటి తలుపు తెరిచి బాత్రూంకు వెళ్లింది. ఈక్రమంలో వెనకాలే వచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. బాధితురాలి కుమారుడు తుమ్మ యాకూబ్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై ముత్యం రాజేందర్ తెలిపారు. వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్, సీసీఎస్ డీసీపీ బోనాల కిషన్, ఏసీపీ సదయ్య, వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ శ్రీనివాస్‌లు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. వివరాలను బాధితురాలిని అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు. -
మాదకద్రవ్యాలతో అనర్థాలు
మహబూబాబాద్ రూరల్ : మాదకద్రవ్యాలు మన జీవితాలను నాశనం చేస్తాయని, యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. యాంటీ నార్కొటిక్స్ వారోత్సవాల్లో భాగంగా యాంటీడ్రగ్స్ పోస్టర్లను జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. మత్తు పదార్థాలను అరికట్టేందుకు ప్రజలు, యువత, విద్యార్థులు కలిసికట్టుగా ముందడుగు వేయాలని కోరారు. గంజాయిలాంటి మత్తుపదార్థాలకు సంబంధించిన సమాచారాన్ని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో నంబర్ 87126 71111కి లేదా డయల్ 100 లేదా తమ పరిధిలో ఉన్న పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, ఎస్బీ సీఐ చంద్రమౌళి, ఐటీ కోర్ సీఐ నరేందర్, డీసీఆర్బీ సీఐ సత్యనారాయణ, ఆర్ఐలు అనిల్, భాస్కర్, నాగేశ్వర్ రావు, సోములు పాల్గొన్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ -
ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు
హన్మకొండ : విద్యుత్ ఉద్యోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ కార్యాలయంలో నిర్మించిన విద్యుత్ ఉద్యోగ అమరుల స్మృతి చిహ్నాన్ని సీఎండీ వరుణ్ రెడ్డి ఆవిష్కరించారు. సీ ఎండీతో పాటు డైరెక్టర్లు, అధికారులు, ఉద్యోగులు పూలమాల వేసి విద్యుత్ అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ ప్రమాదకరమైనదని తెలిసి నిర్లక్ష్యంగా ఉంటూ ప్రాణాల మీదికి తెచ్చుకోవడం బా ధాకరమన్నారు. ఎల్సీ యాప్‌ను విధిగా వాడాలన్నారు. విద్యుత్ ఉద్యోగులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విధినిర్వహణలో విద్యుత్ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పుతున్న వారి జ్ఞాపకార్థం 16 సర్కిళ్లలో స్మృతి చిహ్నాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ క్రమంలో ముందుగా హనుమకొండ సర్కిల్లో నిర్మించామని తెలిపారు. ప్రతి ఏటా విద్యుత్ ఉద్యోగుల సంస్మరణ దినాన్ని నిర్వహించనున్నట్లు, మృతిచెందిన ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాలన్ని 45 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా క్షేత్రస్థాయి వరకు ఉద్యోగులచే ప్రతిజ్ఞ చేయించాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, టి.సదర్ లాల్, టి.మధుసూదన్, వి.తిరుపతి రెడ్డి, సీఈలు కె.తిరుమల్ రావు, రాజు చౌహన్, రవీంద్రనాధ్, హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్ రావు, వరంగల్ ఎస్ఈ కె.గౌతమ్ రెడ్డి, డీఈలు ఎ.విజేందర్ రెడ్డి, జి.సాంబరెడ్డి, సామ్య నాయక్, దర్శన్ కుమార్, భిక్షపతి, ఆనందం, హర్జి, ఎస్ఏఓ నవీన్ కుమార్, ట్రేడ్ యూనియన్ నాయకులు ఇనుగాల శ్రీధర్, కె.వి.జాన్సన్, మన్నె శశి కుమార్, అజ్మీరా శ్రీరామ్ నాయక్, బి.దానయ్య, కుమార స్వామి పాల్గొన్నారు. సమస్యలపై సీఎండీ సానుకూల స్పందన విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్, ఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలువాల స్వామి, ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు బొల్లి వెంకటరాజు, కార్యదర్శి ఎ.ఆంజనేయులు తెలిపారు. సోమవారం హనుమకొండలోని ప్రధాన కార్యాలయంలో వారు సీఎండీని కలిసి వినతిపత్రాన్ని అందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. తమ సమస్యలు విన్న సీఎండీ సానుకూలంగా స్పందించారని తెలిపారు. వచ్చే నెలలో విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్ల బదిలీలు ఉంటాయని చెప్పారన్నారు. టీయూఈఈయూ నాయకులు శ్రీనివాస్, సుదర్శన్ వర్మ, సంతోష్, కర్నాల అనిల్ కుమార్, మధుసూదనరావు పాల్గొన్నారు. ఎల్సీ యాప్‌ను విధిగా వాడాలి టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి