డిజిటల్ మోసాలపై అప్రమత్తతే ఆయుధం
కేయూ క్యాంపస్: డిజిటల్ మోసాలపై అప్రమత్తతే ఆయుధమని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వి. రామచంద్రం అన్నారు. సోమవారం కేయూ స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ విభాగం, కంప్యూటర్ సైన్స్‌విభాగం సంయుక్తంగా ‘సైబర్ సురక్ష మొబైల్ రక్షణ’పై క్యాంపస్‌లోని సెనేట్‌హాల్‌లో అవగాహన ని ర్వహించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్య, బ్యాంకింగ్, ఆరోగ్యం, సమాచారం వ్యవహరాలు అన్ని మొబైల్‌తోనే కొనసాగుతున్నాయన్నారు. సైబర్ నేరాలు, ఆ న్‌లైన్ మోసాలు కూడా పెరిగిపోతున్నాయని, వాటి పై జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. సైబర్ క్రైం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అశోక్‌కుమార్, సబ్‌ఇన్‌స్పెక్టర్ చరణ్ మాట్లాడుతూ సైబర్ నేరాల విచారణలో ప్ర భుత్వ పోర్టల్ పాత్ర కీలకమన్నారు. వరంగల్ సైబ ర్ క్రైం పీఎస్ పరిధిలో 2024నుంచి 2026 ఫిబ్రవరి9 వరకు 223 సైబర్ కేసులు నమోదయ్యాయన్నా రు. రూ 36.91కోట్లు నష్టపోయారన్నారు. అందులో 139 కేసుల ద్వారా రూ 2.66 కోట్లు తిరిగి బాధితులకు ఇప్పించామన్నారు. 85మంది నిందితులను గుర్తించి 45 కేసుల్లో చర్యలు తీసుకున్నామన్నారు. ఈ గణాంకాలు సైబర్ నేరాల తీవ్రతను తెలియజేస్తుందన్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికామ్‌కు చెందిన డైరెక్టర్ రాఘవరెడ్డి,అసిస్టెంట్ డైరెక్టర్ సంపత్ సురక్షిత డిజిటల్ భారత్ నిర్మాణంపై మాట్లాడారు. కేయూ స్టూడెంట్ వెల్ఫేర్ అఫైర్స్ డీన్ ఇస్తారి, కంప్యూటర్ సైన్స్ విభాగం అధిపతి రమ, యూత్ వె ల్ఫేర్ ఆఫీసర్ రాధిక, అధ్యాపకులు రమేశ్, నీలి మా, ఫాతిమా, భారవిశర్మ పాల్గొన్నారు.
కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం


