న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 3 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
సాక్షి, మహబూబాబాద్: ప్రతీ రైతు ఇంట్లో గడ్డి మందు ఉండటం సహజం. అయితే అప్పుల బాధలు, ఇంట్లో చిన్న చిన్న గొడవలు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలతో క్షణికావేశంలో గడ్డి మందు తాగితే అంతే సంగతులు. ప్రాణా లపై ఆశలు వదలుకోవాల్సిందే. లక్షల రూపాయలు ఖర్చుచేసినా.. ఫలితం ఉండదు. ఈ మహమ్మారితో ప్రాణాలు పోవడమే కాదు.. కుటుంబం కూడా లక్షల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిన సంఘటనలు జిల్లాలో కోకొల్లలు. ఈ విషయాలను వివరిస్తూ ‘సాక్షి’ దినపత్రికలో గత ఏడాది నవంబర్ నుంచి వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. వీటిపై ప్రజాప్రతినిధుల స్పందన, ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమేయంతో ఎట్టకేలకు గడ్డి మందు అమ్మకాలను బ్యాన్ చేస్తున్నట్లు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మరణించిన వారు..
జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో పురుగుల మందు తాగుతున్న వారే అధికం. ఐదేళ్లలో 905 మంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో 800మందికి పైగా గ్లైఫోసెట్, పండిమిథాలిన్, ప్రిటిల్లాక్లోర్, నామినీ గోల్డ్, ఆల్‌మిక్స్ వంటి గడ్డి మందులు తాగిన ఘట నలు ఉన్నాయి. గడ్డిమందు తాగిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. చనిపోయే వరకు మాట్లాడుతూ ఉంటారు. దీంతో కుటుంబ సభ్యులు పేషెంట్‌ను బతికించుకునేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేసి, ఆస్తులు అమ్ముకొని అప్పుల పాలైనా ప్రాణాలు కాపాడలేని సంఘటనలు ఉన్నాయి. ఇంతటి ప్రమాదకరమైన ఈ గడ్డి మందు రైతుల ఇళ్లలో ఎక్కడ పడితే అక్కడ పెట్టడం.. ఫర్టిలైజర్ షాపు యజమానులు ఎవరికి పడితే వారికి విక్రయాలు జరపడంతో అందుబాటులో ఉంటుంది. ఆవేశంతో మందు తాగి ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ మందు ప్రభావంతో పంటలు కూడా విషతుల్యం అవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అధికంగా గడ్డి మందు వినియోగించి పండించిన పంటలు తింటే క్యాన్సర్ వంటి వ్యాధుల వారిన పడే అవకా శం ఉందని అంటున్నారు. ఇంతటి ప్రమాదకరమైన గడ్డి మ ందు విక్రయాలే కాదు.. త యారీనే నిషేధించా లని ప్రజా సంఘాలు, డాక్టర్లు కో రారు.
అసెంబ్లీలో చర్చ..
వ్యవసాయమే ఆధారంగా జీవించే వారు అధికంగా ఉన్న మహబూబాబాద్ వంటి జిల్లాలో ఆత్మహత్యలు చేసుకునే వారిలో.. అత్యధికంగా గడ్డి మందు తాగిన వారు ఉన్నారు. ఈ విషయంపై మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ అసెంబ్లీలో వివరించారు. అంతటితో ఆగకుండా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతోపాటు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా గడ్డి మందు మరణాల విషయం తీసుకెళ్లారు. దీంతో స్పందించిన సీఎం, మంత్రులతోపాటు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు గడ్డి మందు నిషేఽధించాలనిమక్తకంఠంతో చెప్పారు. దీంతో ఎట్టకేలకు గడ్డి మందు పారాక్వాట్ డైక్లోరైడ్ అమ్మకాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
‘సాక్షి’ వరుస కథనాలపై అసెంబ్లీలో
చర్చపెట్టిన ఎమ్మెల్యేలు
పారాక్వాట్ అమ్మకాలను నిషేధించాలని ఆరోగ్యశాఖ మంత్రికి వినతి
చలించిన వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల
అసెంబ్లీలో తీర్మానం, రాష్ట్రంలో అమ్మవద్దని
ఆదేశాలు
హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా ప్రజలు
సంవత్సరాలు మృతుల
సంఖ్య
14 10
14–18 69
19–30 382
31–45 426
46–60 283
60 కిపైగా 97


