సమస్యల పరిష్కారానికి గ్రామసభ | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి గ్రామసభ

Apr 3 2026 7:14 AM | Updated on Apr 3 2026 7:14 AM

కలెక్టర్‌ స్నేహ శబరీష్‌

ఇనుగుర్తి: క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారానికి గ్రామ సభ బలమైన వేదిక అని కలెక్టర్‌ స్నేహ శబ రీష్‌ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భా గంగా సర్పంచ్‌ తమ్మడవల్లి కుమార్‌ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పఽథకాలు అర్హులకు చేరేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామ స్థాయిలోనే సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, విద్య, వైద్యసదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తు న్నట్లు తెలిపారు.రైతు భరోసా, గృహ జ్యోతి, మహా లక్ష్మి వంటి పఽథకాలు ప్రజలకు చేరేలా అధికారులు కృషి చేస్తున్నారన్నారు. వాణిజ్య పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని, ఆయిల్‌ పామ్‌ సాగు లాభదాయకంగా ఉందన్నారు. అంతర పంటల సాగుతో రైతులకు అధిక దిగుబడులు వస్తాయని తెలిపారు. నానో యూరియాపై ప్రత్యేక దృష్టి పెట్టి క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎంపీడీఓ పార్థసారథి, ఎంఈఓ రూపారాణి, దిశ కమిటీ మెంబర్‌ గుజ్జునూరి బాబురావు, వివిధ శాఖల అధికా రులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement