సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు | - | Sakshi
Sakshi News home page

సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు

Apr 3 2026 7:14 AM | Updated on Apr 3 2026 7:14 AM

గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన వారి విషయం నేను డాక్టర్‌గా నేరుగా చూశాను. ఈ మందు తాగిన వ్యక్తి చనిపోగా.. లక్షల రూపాయల ఖర్చుతో కుటుంబం కూడా అప్పుల పాలు అవుతుంది. ఈ విషయంపై అసెంబ్లీలో పలుమార్లు మాట్లాడాను. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులను కలిసి తీవ్రతను చెప్పాను. వారు స్పందించి అసెంబ్లీలో తీర్మానం చేయడం.. గడ్డి మందు అమ్మకాలు నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం సంతోషకరం. సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు.

– మురళీనాయక్‌, మహబూబాబాద్‌ ఎమ్మెల్యే

గడ్డి మందు అమ్మకాలు నిషేధం

గడ్డి మందు పారాక్వాట్‌ డైక్లోరైడ్‌ తాగి ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ విషయంపై స్పందించిన రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులు అమ్మకాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో తయారీ, నిల్వ, అమ్మకాలు, వాడకం, కొనుగోళ్లపై నిషేధం ఉంది. కావునా రైతులు, వ్యాపారులు గమనించాలి. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

– బి. సరిత, జిల్లా వ్యవసాయశాఖ అధికారి

అమ్మకాల నిషేధం

సంతోషకరం

రైతుల కుటుంబాలను చిన్నాభిన్నం చేసే గడ్డి మందు పారాక్వాట్‌ డైక్లోరైడ్‌ అమ్మకాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం సంతోషకరం. శాశ్వతంగా నిషేధించాలి. ఉత్తర్వులు అమలు అయ్యేలా చూడాలి.

– డాక్టర్‌ వివేక్‌, డీఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement