ప్రాణరక్షణ కోసమే హెల్మెట్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రాణరక్షణ కోసమే హెల్మెట్‌

Apr 3 2026 7:14 AM | Updated on Apr 3 2026 7:14 AM

ఎస్పీ శబరీష్‌

కేసముద్రం: వాహనాదారులు తమ ప్రాణ రక్షణ కోసం హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని ఎస్పీ శబరీష్‌ అన్నారు. గురువారం మండలంలోని వెంకటగిరి గ్రామంలో నిర్వహించిన మన గ్రామం–మన బాధ్యత కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. పోలీసుల పిలుపు మేరకు గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్దలు ముందుకు రావ డం, ద్విచక్రవాహనాలు కలిగిన వారంతా హెల్మెట్లు కొనుగోలు చేయడం సంతోషకరమన్నారు. అదే విధంగా గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, గంజాయి రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఆయన అన్నారు. డీఎస్పీ తిరుపతిరావు, సీఐ సత్యనారాయణ, ఎస్సైలు క్రాంతికిరణ్‌, నరేష్‌, గ్రామ సర్పంచ్‌ భూక్య జ్యోతి, పవన్‌, ఉపసర్పంచ్‌ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

శాంతియుత వాతావరణంలో

ముందుకు సాగాలి

కురవి: ప్రజలంతా శాంతియుత వాతావరణంలో ముందుకు సాగాలని, హెల్మెట్‌ తమ శరీరంలో అంతర్భాగం కావాలని ఎస్పీ శబరీష్‌ సూచించారు. గురువారం మండలంలోని తిర్మలాపురం గ్రామ సర్పంచ్‌ కనకటి అచ్చమ్మ ఆధ్వర్యంలో హెల్మెట్‌ లేకుంటే తమ గ్రామంలోకి నో ఎంట్రీ అంటూ ఫ్లెక్సీలతో తయారు చేసిన ముఖద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. తీర్మానం చేయడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, గంజాయి, డ్రగ్స్‌ వంటివాటిని గ్రామంలోకి రానివ్వమని చెప్పడం అభినందనీయమని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, సీఐ అంజలి, ఎస్సై గండ్రాతి సతీష్‌, గ్రామ పాలకమండలి సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement