వార్డుసభలతో అర్హులకు లబ్ధి | - | Sakshi
Sakshi News home page

వార్డుసభలతో అర్హులకు లబ్ధి

Apr 3 2026 7:14 AM | Updated on Apr 3 2026 7:14 AM

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుగులోత్‌ జ్యోతి

మహబూబాబాద్‌: అర్హులకు లబ్ధి చేకూర్చడానికే ప్రభుత్వం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా వార్డు సభలు నిర్వహిస్తుందని మున్సిపల్‌ చైర్‌ప్సన్‌ గుగులోత్‌ జ్యోతి అన్నారు. మానుకోట మున్సిపాలిటీ పరిధిలోని 36వార్డులకు సంబంధించి 8చోట్ల వార్డు సభలు నిర్వహించారు. హౌజింగ్‌ బోర్డు కాలనీలో 4,5,17,18 వార్డులకు సంబంధించిన వార్డు సభ నిర్వహించారు. ఈసందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ.. పేదల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, గృహజ్యోతి తదితర పథకాలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్‌ రాజేశ్వర్‌, వార్డు కౌన్సిలర్లు గుగులోత్‌ నరేష్‌, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

భాగస్వాములు కావాలి..

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని ఆర్డీఓ కృష్ణవేణి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏఎంఏ హాల్‌లో మున్సిపాలిటీలోని 8,19,20,33,34,35 వార్డులకు సంబంధించిన వార్డు సభ నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు అజయ్‌సాథిరెడ్డి, గద్డె నీరజారాణి, చిదిరాల అరుణ, బానోత్‌ పార్వతి తదితరులు పాల్గొన్నారు.

1,323 క్వింటాళ్ల మిర్చి విక్రయం

మహబూబాబాద్‌ రూరల్‌ : మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో 1,323 క్వింటాళ్ల మిర్చి విక్రయం జరిగిందని ఏఎంసీ చైర్మన్‌ ఇస్లావత్‌ సుధాకర్‌, సెక్రటరీ సుజన్‌ బాబు గురువారం తెలిపారు. మహబూబాబాద్‌ మండలంతో పాటుగా చుట్టుపక్కల మండలాలకు చెందిన రైతులు 3,781 బస్తాల మిర్చి విక్రయానికి తీసుకొచ్చారు. వ్యాపారులు కొనుగోలు చేసిన అనంతరం గరిష్ట ధర క్వింటాకు రూ.19,520, కనిష్ట ధర రూ.18,550 పలికిందని వారు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement