గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు | - | Sakshi
Sakshi News home page

గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు

Apr 3 2026 7:14 AM | Updated on Apr 3 2026 7:14 AM

జీజీహెచ్‌లో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌

ప్రారంభం

నెహ్రూసెంటర్‌: ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జీజీహెచ్‌లో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్‌, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు తెలిపారు. జీజీహెచ్‌లో గురువారం ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆస్పత్రికి వచ్చిన గర్భిణులకు అవసరమైన సూచనలు, పరీక్షలు, వైద్య సేవలపై సమాచారం అందించడమే హెల్ప్‌డెస్క్‌ ప్రధాన లక్ష్యమన్నారు. హెల్ప్‌డెస్క్‌ 24 గంటలు అందుబాటులో ఉంటుందని, 79931 54429 నంబర్‌ సంప్రదించి సమాచారం పొందవచ్చన్నారు. 102 అంబులెన్స్‌ సేవలు అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులు, తల్లిశిశువుకు సహాయం అందజేస్తుందని పేర్కొన్నారు. గర్భిణులు సురక్షిత ప్రసవం కోసం సేవలను వినియోగించుకోలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అఽఽధికారి సారంగం, ఆర్‌ఎంఓ డాక్టర్‌ జగదీశ్వర్‌, డాక్టర్‌ రాధిక, శశిజోత్స్న, డాక్టర్‌ సంజయ్‌, మీడియా అధికారి కొప్పు ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

బాబు జగ్జీవన్‌రామ్‌

జయంతి నిర్వహించాలి

మహబూబాబాద్‌ అర్బన్‌: భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్‌ బాబుజగ్జీవన్‌ రామ్‌ జయంతి పండుగలా జరుపుకోవాలని జిల్లా షెడ్యూల్డ్‌ కులా ల అభివృద్ధిశాఖ అధికారి కె. శ్రీని వాస్‌రావు గురువారం తెలిపారు. ఈనెల 5న ఉయదం 9గంటలకు జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌ పాలబజార్‌ సమీపంలో బాబుజగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పి ంచాలని, సభావేదిక కలెక్టర్‌ కార్యాలయంలో ఉంటుందని, అన్ని కుల సంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులు, అధికారులు హాజరై విజయవంతం చేయాలని ఆయన కొరారు.

దళిత కాలనీలో గ్రామసభ

కురవి: గ్రామం ఆవిర్భవించి సుమారు 40 ఏళ్లు కావొస్తుంది.. సాధారణంగా గ్రామసభలు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జరుగుతుంటాయి.. అందుకు భిన్నంగా మండలంలోని కొత్తూరు(సీ)లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం గ్రామసభ దళితకాలనీలో జరగడం విశేషం. కొత్తూరు(సీ) సర్పంచ్‌గా గిరిజన మహిళ బాదావత్‌ చిన్ని విజయం సాధించిన తర్వాత ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామసభను దళిత కాలనీలో నిర్వహించి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. దళిత కాలనీలో జరిగిన గ్రామసభకు అధికారులు హాజరయ్యారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను పంచాయతీ కార్యదర్శి అశోక్‌ చదివి వినిపించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ చిన్ని మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలను ప్రజలకు అందిస్తామని, గ్రామాన్ని ప్లాస్టిక్‌రహిత గ్రామంగా తయారు చేయాలని, ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నట్లు తీర్మానం చేశారు. అంగన్‌వాడీ సిబ్బంది శ్రీదేవి, ద్రౌపది, ఏఎన్‌ఎం జ్యోతి, లైన్‌మెన్‌ హరిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు కేయూలో దొడ్డి కొమురయ్య జయంతి

కేయూ క్యాంపస్‌: తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 99వ జయంతిని శుక్రవారం కాకతీయ యూనివర్సిటీలోని పరిపాలన భనంలో నిర్వహించనున్నట్లు బీసీ సెల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బొడిగ సతీశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ వి.రామచంద్రం, పాలకమండలి సభ్యులు పాల్గొంటారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement