ల్యాబ్ టెక్నీషియన్ల పాత్ర కీలకం
నెహ్రూ సెంటర్: ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ల్యాబ్ టెక్నీషియన్ల సేవల పాత్ర అత్యంత కీలకమని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ అన్నారు. నూతనంగా రిక్రూట్ అయిన ల్యాబ్ టెక్నీషియన్లతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధ్యతగా విధులు నిర్వహిస్తూ, పరీక్షల కచ్చితత్వం, సమయపాలన, రోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని ల్యాబ్ పరీక్షలు నిర్వహించడంతో పాటు, పరికరాల సంరక్షణ, రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దని ఆదేశించారు. ప్రోగ్రాం అధికారులు డాక్టర్లు సారంగం, సుధీర్ రెడ్డి, నాగేశ్వర్ రావు, లక్ష్మీనారాయణ, శ్రవణ్, విజయ్, ప్రత్యూష, జిల్లా ఉప మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, ఆరోగ్య విద్యా బోధకులు కేవీ రాజు, పురుషోత్తం, స్వామి, అనిల్ ఉన్నారు.


