ఏర్పాట్లు పూర్తి..
తొర్రూరు: మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిషనర్ వి.శ్యాంసుందర్ తెలిపారు. డివిజన్ కేంద్రంలోని ఆర్యభట్ట హైస్కూల్‌లో ఎన్నికల సామగ్రిని మంగళవారం సిబ్బందికి పంపిణీ చేశారు. కమిషనర్ మాట్లాడుతూ.. తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులకు గాను 32 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 194 మంది సిబ్బంది ఎన్నికల విధులకు హాజరుకానున్నారన్నారు. 34 మంది అత్యవసర సేవల కింద రిజర్వ్ చేశామన్నారు. ప్రతీ వార్డుకు పీఓ, ఏపీఓ, ముగ్గురు ఓపీఓలను నియమించామన్నారు. 40మంది ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకున్నారని తెలిపారు. ఐదు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్లు చెప్పారు. ఎన్నికల సామగ్రి పంపిణీని ఆర్డీఓ గణేష్ పరిశీలించారు. కార్యక్రమంలో ఎన్నికల ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.


