● అక్కా.. అభయహస్తం ఇవ్వు.. | - | Sakshi
Sakshi News home page

● అక్కా.. అభయహస్తం ఇవ్వు..

Feb 8 2026 4:20 AM | Updated on Feb 8 2026 4:20 AM

● అక్

● అక్కా.. అభయహస్తం ఇవ్వు..

మున్సిపల్‌ ఎన్నికలకు

పకడ్బందీ ఏర్పాట్లు

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌

వరంగల్‌ క్రైం: మున్సిపల్‌ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపారు. ఈ నెల 11న వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని జనగామ, స్టేషన్‌ ఘన్‌పూర్‌, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట మున్సిపాలిటీల్లో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో శనివారం వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగేందుకు అక్రమ మద్యం కట్టడి చేయడంతోపాటు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే మార్గాలపై పోలీస్‌ అధికారులు నిఘా పెట్టాలన్నారు. ఎవరైనా ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరిస్తే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. బ్యాలెట్‌ పత్రాల పంపిణీ, పోలింగ్‌ రోజు, కౌంటింగ్‌ సందర్భంగా పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. పోలీస్‌ సిబ్బంది తమ ఓటు హక్కును పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సమావేశంలో డీసీపీలు అంకిత్‌ కుమార్‌, రాజమహేంద్రనాయక్‌, కవిత, ఏఎస్పీలు శుభం, చేతన్‌, ట్రైనీ ఐపీఎస్‌ మనీషా నెహ్ర, తదితరులు పాల్గొన్నారు.

● అక్కా.. అభయహస్తం ఇవ్వు..1
1/1

● అక్కా.. అభయహస్తం ఇవ్వు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement