అందమైన ప్రకృతిలో అనేక రకాల వన్యప్రాణులు, పక్షులు మనల్ని అలరిస్తూ ఉంటాయి. ఇవి ప్రకృతికి, మానవ సమాజానికి ఎంతో కొంత మేలు చేస్తాయి తప్ప కీడు చేయవు. కానీ ప్రపంచంలోని ఏకైక విషపూరిత పక్షి ఒకటి ఉంది తెలుసా. పైకి రంగు రంగుల్లో అందిస్తూ కనిపిస్తూ మానవులకు కీడు చేస్తుంది. అదేంటో? దానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలేంటో తెలుసుకుందాం.
ప్రపంచంలోనే అత్యంత అరుదైన, విషపూరితమైన పక్షి. హుడెడ్ పిటోహుయ్ (Hooded Pitohui) న్యూ గినియా (New Guinea) లోని అడవుల్లో కనిపిస్తాయి. ఇవి చూడటానికి నారింజ మరియు నలుపు రంగుల కలయికతో చాలా అందంగా ఉంటాయి. కానీ దీని ఈకలను తాకినా, లేదా దాని మాంసాన్ని ఆహారంగా తీసుకున్నాతీవ్రమైన నాడీ సంబంధిత ప్రభావాలు ఏర్పడవచ్చు. సాధారణంగా వీటిని వండుకుని తినడానికి వీలుండదు (వండితే ఘాటైన వాసన , విషం వల్ల అనారోగ్యం కలుగుతుంది)ముఖ్యంగా జలదరింపు, తిమ్మిరి లేదా తేలికపాటి పక్షవాతం వంటివి సంభవించవచ్చు.
విషపూరితమైన పక్షి ఎలా అయ్యింది?
సాధారణంగా పాములు లేదా కప్పలు విషపూరితంగా ఉండటం చూస్తుంటాం, కానీ ఈ పక్షి ఈకలు, చర్మం , మాంసంలో కూడా విషం ఉంటుంది. పిటోహుయిస్ తమ సొంత విషాన్ని తయారు చేసుకోవు. హుడెడ్ పిటోహుయిస్ గురించి అత్యంత ఆసక్తికరమైన అంశాలలో ఇదొకటి. వాటి ఆహారం నుండి సీక్వెస్ట్రేషన్ అనే ప్రక్రియ ద్వారా పాయిజన్‌ఉత్పత్తి అవుతుంది. అంటే అవితీసుకున్న ఆహారంనుంచి విషాన్ని వారి శరీరంలో నిల్వ ఉంటుంది.
ఇవి తినే ఒక రకమైన 'మెలైరిడ్' (Melyrid) బీటిల్స్ (పురుగులు) వల్ల వీటి శరీరంలోకి విషం చేరుతుందని జాక్ డంబాచర్‌తో సహా శాస్త్రవేత్తలు గుర్తించారు. హుడెడ్ పిటోహుయి కలిగి ఉన్న ఈ పురుగుల్లో విషాన్ని బాట్రాకోటాక్సిన్ (Batrachotoxin) అంటారు. ఇదే విషం కొలంబియాలోని 'పాయిజన్ డార్ట్' కప్పలలో కూడా కనిపిస్తుంది.అందుకే స్థానిక ప్రజలు వీటిని "చెత్త పక్షులు" అని పిలుస్తారు.
ఇదీ చదవండి: అమెరికాలో అదృశ్యమైన శ్రీనివాసయ్య మృత దేహం లభ్యం
మనుషులపై ప్రభావం
ఒకవేళ ఎవరైనా ఈ పక్షిని పట్టుకుంటే, ఆ విషం వల్ల చేతులు మొద్దుబారిపోవడం, మంట పుట్టడం లేదా తీవ్రమైన తుమ్ములు రావడం వంటివి జరుగుతాయి. ఈ విషపదార్థాలు పక్షి తనను తాను వేటాడే జంతువులు ,పరాన్నజీవుల నుండి రక్షించుకోవడానికి సహాయపడతాయి.పాములు లేదా ఇతర జంతువులు ఈ పక్షిని వేటాడకుండా ఈ విషం కాపాడుతుంది. అంతేకాదు వీటి ఈ ఈకల్లోని విషం వల్ల పేలు, బ్యాక్టీరియా వంటివి పక్షికి సోకవు.
ఇది విషపూరితమని ఎపుడు గుర్తించారు
శాస్త్రవేత్త జాక్ డంబాచర్ 1980ల చివరలో న్యూ గినియాలో ఫీల్డ్ వర్క్ చేస్తున్నప్పుడు మొట్టమొదటి సారిగా ఈ విషపూరిత పక్షిని కనుగొన్నాడు. అతన ఈ పక్షులను తాకినప్పుడు, తన నోటిని లేదా కళ్ళను తాకిన తర్వాత, జలదరింపు, తిమ్మిరి, మండుతున్న అనుభూతిని అనుభవించాడని డిస్కవర్ వైల్డ్‌లైఫ్ తెలిపింది. తరువాత, పక్షి ఈకలు , చర్మం విషపూరితమైనవని కూడా గ్రహించాడు. 1992లో డంబాచర్, అతని బృందం హుడెడ్ పిటోహుయ్ చర్మం, ఈకలలో బాట్రాచోటాక్సిన్ అనే శక్తివంతమైన విషం, విషపూరిత సమ్మేళనాలు ఉన్నాయని చూపించే ఒక అధ్యయనాన్ని కూడా ప్రచురించింది.
ఇదీ చదవండి: బోట్ రైడ్‌లో ఒక్కసారిగా రాకాసి అలలు, వీడియో వైరల్


