వీడియో వైరల్‌: జర్మనీలో పాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌కు అవమానం | Show Id: Pak Army Chief Asim Munir Nearly Stopped At Munich Event | Sakshi
Sakshi News home page

వీడియో వైరల్‌: జర్మనీలో పాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌కు అవమానం

Feb 15 2026 1:00 PM | Updated on Feb 15 2026 8:56 PM

Show Id: Pak Army Chief Asim Munir Nearly Stopped At Munich Event

జర్మనీలోని మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఒక సెక్యూరిటీ ఆఫీసర్ గుర్తింపు కార్డు విషయంలో ఆయన్ని దాదాపుగా అడ్డుకున్నంత పని చేశారు. మ్యూనిచ్‌ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌కు హాజరైన అసిమ్ మునీర్‌ను అక్కడి సెక్యూరిటీ సిబ్బంది పట్టించుకోలేదు.

తన బృందంతో కలిసి జర్మనీ నగరానికి అసిమ్ మునీర్‌ చేరుకున్నారు. కాన్ఫరెన్స్ ప్రవేశ ద్వారానికి కొద్ది అడుగుల దూరంలో ఉండగా, సెక్యూరిటీ సిబ్బంది.. ఆయన మెడలో వేలాడుతున్న ఐడీ కార్డును చూపించాలని కోరింది.  ‘‘మీ ఐడీ కార్డును తిప్పి చూపగలరా?(ముందుకి కనిపించేలా)’’ అంటూ సెక్యూరిటీ కోరడం వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

మరోవైపు, జర్మనీలోని సింధీ రాజకీయ సంస్థ జై సింధ్ ముత్తాహిదా మహాజ్(JSMM) అసిమ్ మునీర్‌ను ఆహ్వానించడంపై తీవ్రంగా వ్యతిరేకించింది. కార్యక్రమ వేదిక వద్ద జెఎస్‌ఎంఎం సభ్యులు నిరసన చేపట్టారు. పాకిస్తాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ ఈ సమావేశంలో మునీర్ పాల్గొనడం పట్ల అభ్యంతరం తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement