అమెరికాలో అదృశ్యమైన శ్రీనివాసయ్య మృత దేహం లభ్యం | Indian Student Found Dead 6 Days After He Went Missing In California | Sakshi
Sakshi News home page

అమెరికాలో అదృశ్యమైన శ్రీనివాసయ్య మృత దేహం లభ్యం

Feb 15 2026 9:58 AM | Updated on Feb 15 2026 10:54 AM

Indian Student Found Dead 6 Days After He Went Missing In California

అమెరికాలోని కాలిఫోర్నియాలో కనిపించకుండా పోయిన 22 ఏళ్ల భారతీయ విద్యార్థి ఉదంతం విషాదాంతమైంది.  తప్పిపోయిన ఆరు రోజుల తర్వాత  కర్నాటకకు చెందిన సాకేత్‌ శ్రీనివాసయ్య(22) మృతదేహం లభ్యమైంది. పోలీసులు అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ధృవీకరించింది. దీంతో అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

అతని మృతదేహాన్నివీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావడానికి అవసరమైన అన్ని సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది.  అత్యంత క్లిష్ట సమయంలో అతని కుటుంబానికి, ప్రియమైనవారికి తమ హృదయపూర్వక సానుభూతిని తెలియ జేస్తున్నామని  ప్రకటనలో పేర్కొంది.

 


కాలిఫోర్నియా బర్కిలీ విశ్వవిద్యాలయంలో కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య ఫిబ్రవరి 9న అదృశ్యమయ్యాడు.మద్రాస్‌ ఐఐటీ నుంచి ఇతడు 2025లో కెమికల్‌ ఇంజనీరింగ్‌ పట్టా అందుకున్నాడు. సాకేత్‌ మంగళవారం చివరిసారిగా డ్వైట్‌ వేలోని 1700 బ్లాక్‌ వద్ద కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ల్యాప్‌టాప్, పాస్‌పోర్టు తదితరాలున్న సాకేత్‌ బ్యాగు లేక్‌ ఆంజా ప్రాంతంలోని పార్క్‌హిల్స్‌లో ఓ ఇంటి ఆవరణలో పడి ఉండగా గుర్తించారు.  తమ కొడుకు ఎలాగైనా క్షేమంగా తిరిగి వస్తాడని ఎదురు చూసిన కుటుంబీకుల్లో శ్రీనివాసయ్య మరణవార్త తీరని విషాదాన్ని మిగిల్చింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement