ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత ఫలితాల్లో జనసేన పార్టీ రాజకీయ బలంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. కేవలం 189 స్థానాలకే జనసేన పరిమితం కావడంతో కూటమిలో జనసేన అసలు బలం ఎంత?.. క్షేత్రస్థాయిలో జనసేన స్వతంత్ర ప్రభావమెంత? గ్రామస్థాయిలో పార్టీ ప్రభావం ఎక్కడుంది? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. దీనిపై సోషల్ మీడియాలో సైతం గట్టిగానే చర్చ మొదలైంది. 100 శాతం స్ట్రైక్‌రేట్ అని చెప్పుకునే జనసేన పంచాయతీ ఎన్నికల్లో చలకిలపడటంతో స్ట్రైక్‌రేట్ ఏమైందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. స్వతంత్రుల కన్నా తక్కువ స్థానాలు గెలవడంతో చర్చ మరింత ఆసక్తికరంగా మారింది.
అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేనకు రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీతో పోలిస్తే చాలా తక్కువ సర్పంచ్ స్థానాలు దక్కాయి. కూటమి విజయాల్లో టీడీపీ ప్రధాన వాటా కనిపించగా, జనసేన సాధించిన స్థానాలు 189కే పరిమితమయ్యాయి. దీంతో క్షేత్రస్థాయిలో జనసేన స్వతంత్ర బలం ఎంత? అన్న ప్రశ్న మరోసారి తైరపపైకి వచ్చింది. గత ఎన్నికల్లో సాధించిన విజయాలను జనసేన నేతలు తరచూ ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిందంటూ డబ్బా కొడుతుంటారు. కానీ, గ్రామీణ ఎన్నికల తొలి విడతలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపించింది. జనసేన ప్రభావం ఏ మాత్రం కనిపించలేదు. దీంతో, డిప్యూటీ సీఎం పవన్‌కు గట్టి దెబ్బే తగిలింది.
ఏయే జిల్లాల్లో జనసేనకు ఎక్కువ స్థానాలు?
జిల్లాలవారీగా చూస్తే జనసేనకు కోనసీమలో అత్యధికంగా 37 సర్పంచ్ స్థానాలు దక్కాయి. కాకినాడలో 29, అనకాపల్లిలో 25, పశ్చిమ గోదావరిలో 24 స్థానాలు గెలుచుకుంది. ఏలూరు జిల్లాలో 15 స్థానాలతో సరిపెట్టుకుంది. ప్రకాశం, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఒక్క సర్పంచ్ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. మరికొన్ని జిల్లాల్లో సింగిల్ డిజిట్ స్థానాలకే పరిమితమైంది. మొత్తం కూటమి సాధించిన విజయాలను పరిశీలిస్తే అందులో టీడీపీ వాటా అత్యధికంగా ఉంది. జనసేన, బీజేపీ కంటే టీడీపీ మద్దతుతో గెలిచిన అభ్యర్థుల సంఖ్య భారీగా ఉండటం గ్రామస్థాయిలో పార్టీల మధ్య ఉన్న బలాబలాలపై చర్చకు కారణమైంది. మరోవైపు వైఎస్సార్‌సీపీ మద్దతుతో 1,111 మంది అభ్యర్థులు విజయం సాధించడం పార్టీకి ఉన్న బలాన్ని నిరూపించింది. అంటే అధికార కూటమి మొత్తం ఆధిక్యంలో ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీకి గణనీయమైన మద్దతు కొనసాగుతున్నట్లు ఈ ఫలితాలు సూచిస్తున్నాయి.
తెగులుదేశం + బీజేపీ మద్దతుతో మొదటి ఫేజ్ లో జనసేన గెలిచిన మొత్తం పంచాయతీలు: 188 (5.89%) అధికారం అడ్డం పెట్టుకొని తెగులుదేశం: 1598 (50.10%) బీజేపీ: 25 (0.78%) కూటమి: 1811 (56.77%) వైసీపీ: 1103 (34.58%) ఇతరులు: 295 (9.25%) https://t.co/GiqgLQQ2gs
— ప్రశ్నిస్తాం మాది ప్రతిపక్షం (@VijayPidugu4) November 27, 2026
నెటిజన్ల సెటైర్లు..
ఇదిలా ఉంటే.. వైఎస్సార్‌సీపీ రాజకీయంగా చచ్చిపోయిందంటూ జనసేన నేత నాగబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి చర్చకు వస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల తొలి విడత ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లకు దిగుతున్నారు. పార్టీ చచ్చిపోయిందని చెప్పిన నేతలకు ఈ ఫలితాలు కనిపించడం లేదా? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. దీంతో నాగబాబు వ్యాఖ్యలు, తాజా పంచాయతీ ఫలితాలు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి.
చ**చ్చిపోయిన పార్టీ ఎవరిదీ?... జనసేననా… వైసీపీనా? నాగబాబు పాత వ్యాఖ్యలపై వైసీపీ నేతల కౌంటర్ చచ్చిపోయిన పార్టీ ఏదో ఇప్పుడు చెప్పాలంటూ వైసీపీ శ్రేణుల చురకలు అల్లూరి జిల్లాలో వైసీపీకి 29 పంచాయతీలు అల్లూరి జిల్లాలో కూటమికి 26 పంచాయతీలు తిరుపతి జిల్లాలో వైసీపీ మద్దతుదారులదే మెజార్టీ కృష్ణా జిల్లాలో వైసీపీ గట్టి పోటీ గన్నవరంలో వైసీపీ ఆధిక్యత ఏలూరు జిల్లాలోనూ వైసీపీ బలప్రదర్శన తిరుపతి మినహా రాయలసీమలో కూటమి ఆధిక్యత జగన్ సొంత గ్రామం బలపూరులో టీడీపీ మద్దతుదారుడి విజయం పంచాయతీ ఫలితాలతో నాగబాబు వ్యాఖ్యలపై మళ్లీ రాజకీయ దుమారం #nagababu #ycp #ysjagan #pawankalyan #appanchayatelections #volgatimes
— Volga Breaking News (@volgabreaking) November 27, 2026
మరోవైపు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉండటంతో పాటు పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఆయన పార్టీకి, క్షేత్రస్థాయి నాయకత్వానికి కీలకమైన పరీక్షగా మారాయి. ఇంకా రెండు విడతల ఎన్నికలు జరగాల్సి ఉండటంతో జనసేన తదుపరి దశల్లో ఎలాంటి ఫలితాలు సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
🚨 జనసేన బ్రతుకు.. టీడీపీ కాళ్ళ కిందే.. సంచలన విషయాలు వెల్లడించిన.. - జనసేన వీర మహిళ వినుత కోటా #VinuthaKota https://t.co/sQ1qhdnces
— UttarandhraNow (@UttarandhraNow) November 27, 2026
ఇదీ చదవండి: బాబు సర్కారు మరో రూ.2,000 కోట్ల అప్పు


