మహాత్మ జ్యోతిరావ్ పూలేకి వైఎస్ జగన్ నివాళి | YS Jagan Pays Rich Tributes to Mahatma Jyotirao Phule | Sakshi
Sakshi News home page

మహాత్మ జ్యోతిరావ్ పూలేకి వైఎస్ జగన్ నివాళి

Nov 28 2026 9:56 AM | Updated on Nov 28 2026 9:56 AM

YS Jagan Pays Rich Tributes to Mahatma Jyotirao Phule

సాక్షి, తాడేపల్లి: మహాత్మా జ్యోతిరావ్ పూలేకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

ఆ ట్వీట్‌లో ‘చదువుతో బడుగు, బలహీన వర్గాల జీవితాలను మార్చవచ్చని,మహిళా విద్యతో సమాజం పురోగమిస్తుందని నమ్మి, ఆచరణలో చూపిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారు. అణగారిన వర్గాలు ఆత్మగౌరవంతో జీవించేలా, సమాన అవకాశాలు పొందేలా ఆయన సాగించిన పోరాటం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. నేడు ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement