పావని గిడుతూరు అభ్యర్థి
అల్లూరి సీతారామరాజు జిల్లా: మాకవరపాలెం పంచాయతీ ఎన్నికల్లో సాధారణంగా స్థానిక నాయకులు పోటీ చేస్తుంటారు. ఈ సారి దానికి భిన్నంగా ఉన్నత విద్యావంతులు, కార్పొరేట్ ఉద్యోగులు, వైద్యులు సైతం బరిలోకి దిగడం ఆసక్తికరంగా మారింది. గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలనే లక్ష్యంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మండలంలోని గిడుతూరులో సర్పంచ్ అభ్యర్థిగా ఎంబీఏ పూర్తి చేసిన శీరంరెండ్డి పావని వైఎస్సార్‌సీపీ మద్దతుతో పోటీ చేస్తున్నారు.
పైడిపాల నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా రుత్తల శ్యాంప్రసాద్‌వంశీ ఎంబీబీఎస్(ఎండీ–గ్యాస్ట్రో సర్జన్) సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. జడ్.గంగవరం నుంచి బోలెం రాజా ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఆయన కూటమి మద్దతుతో ఎన్నికల బరిలో నిలిచారు. వీరంతా తమను గెలిపిస్తే గ్రామాలను మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యావంతులు పంచాయతీ ఎన్నికల బరిలోకి దిగడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది.


