పవన్‌.. రుషికొండకో న్యాయం, సింహాచలానికో న్యాయమా? | Bolisetti Satyanarayana Full Fires On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

పవన్‌.. రుషికొండకో న్యాయం, సింహాచలానికో న్యాయమా?

Nov 28 2026 7:34 AM | Updated on Nov 28 2026 7:34 AM

Bolisetti Satyanarayana Full Fires On Pawan Kalyan

 కొండను ధ్వంసం చేసేశారంటూ నాడు గొంతెత్తి మాట్లాడారు కదా 

ఇప్పుడు విశాఖలో కొండలన్నీ పిండి చేస్తుంటే మౌనమెందుకు? 

పర్యావరణ శాఖ మంత్రిగా మీరెందుకు అడ్డుకోవడంలేదు?

తీరు మారకపోతే 2029 ఎన్నికల్లో ప్రజలు ప్రత్యామ్నాయాన్ని ఎన్నుకోక తప్పదు

 పవన్‌ని ప్రశ్నించిన జనసేన మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ

సాక్షి, విశాఖపట్నం: పర్యావరణ పరిరక్షణ విషయంలో కూటమి ప్రభుత్వ పాలకులు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని జనసేన మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ ఆరోపించారు. గతంలో రుషికొండ విషయంలో ఎక్కడపడితే అక్కడ గొంతెత్తని ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్‌కళ్యాణ్‌.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ విధ్వంసం సృష్టిస్తూ కొండలు, గుట్టలను తొలిచి చేపడుతున్న భారీ ప్రాజెక్టులపై ఎందుకు మౌనం వహిస్తున్నారని సోషల్‌ మీడియా వేదికగా బొలిశెట్టి శుక్రవారం ప్రశ్నించారు. ఈ మేరకు ఓ వీడియోను ఆయన విడుదల చేశారు. 

తూర్పు కనుమల్లో అత్యంత పర్యావరణ సున్నిత ప్రాంతమైన విశాఖలోని సింహాచలం కొండల పరిధిలో డేటా సెంటర్‌ వంటి కార్పొరేట్‌ ప్రాజెక్టుల కోసం వందలాది ఎకరాల భూములను కేటాయిస్తుంటే ప్రభుత్వం, పర్యావరణ శాఖ అధికారులు ఎందుకు అడ్డుకోవడం లేదని నిలదీశారు. ప్రకృతి, పర్యావరణ పరిరక్షణపై నిత్యం మాట్లాడే పవన్‌కళ్యాణ్‌.. సింహాచలం కొండలపై జరుగుతున్న పర్యావరణ విధ్వంసంపై ఎందుకు స్పందించడంలేదన్నారు. పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న ఆయన మౌనం దేనికి సంకేతమని.. పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలపై నోరుపెదపరేమని బొలి­శెట్టి ప్రశ్నించారు.

విశాఖ భవిష్యత్తుకు పెను ప్రమాదం.. 
పర్యావరణ శాఖ అధికారులు నిబంధనల ఉల్లంఘనలను పవన్‌ ఎందుకు అడ్డుకోవడం లేదని బొలిశెట్టి ఆక్షేపించారు. అభివృద్ధి ముసుగులో ఒకచోట పర్యావరణ విధ్వంసం జరిగిందని నివేదికలు ఇసూ్తనే.. మరోవైపు కార్పొరేట్‌ సంస్థల కోసం పచ్చని కొండలను, దేవస్థాన భూములను నాశనం చేయడం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని విమర్శించారు.

 పర్యావరణ అనుమతులు, ప్రజాభిప్రా­య సేకరణ లేకుండా సాగుతున్న ఈ పనులు విశా­ఖ భవిష్యత్తుకు పెను ప్రమాదంగా మారుతాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. పర్యావరణం ప­ట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్యపు వైఖరి కారణంగానే, ప్రతిష్టాత్మక యేల్‌ యూనివర్సిటీ–2026 అధ్యయనంలో ప్రపంచంలోని 177 దేశాల్లో భారతదేశం 176వ స్థానానికి దిగజారిందని, ఇది పాలనా విధానాలకు సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. కొండల­ను పిండి చేసి, అడవులను నాశనం చేసి సాధించే అ­భివృద్ధి ఎవరి కోసమని ప్రశ్నించిన ఆయన, ప­ర్యావరణ పరిరక్షణలో పాలకులు అనుసరిస్తున్న వైఖ­రిని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని అన్నారు.

 పాలకులు తమ తీరు మార్చుకోకపోతే 2029 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మరో ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవడానికి వెనుకాడరని ఆయన స్పష్టం చేశారు. తక్షణమే సింహాచలం కొండల పరిధిలో జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని నిలిపివేయాలని, రాష్ట్రంలోని అన్ని కొండలు, అటవీ ప్రాంతాల పరిరక్షణపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బొలిశెట్టి సత్యనారాయణ డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement