మరోసారి బ్యాట్‌ ఝులిపించిన వైభవ్‌ సూర్యవంశీ | ACC Mens Asia Cup Rising Stars 2026 1st semi final IND A VS SL A: Vaibhav suryavanshi out for 40 runs | Sakshi
Sakshi News home page

మరోసారి బ్యాట్‌ ఝులిపించిన వైభవ్‌ సూర్యవంశీ

Nov 26 2026 4:21 PM | Updated on Nov 26 2026 4:21 PM

ACC Mens Asia Cup Rising Stars 2026 1st semi final IND A VS SL A: Vaibhav suryavanshi out for 40 runs

source: X

ఏసీసీ మెన్స్‌ ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ 2026 టోర్నీలో భారత-ఎ జట్టు చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. యూఏఈతో జరిగిన చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో వర్ణించలేని విధ్వంసాన్ని సృష్టించిన అతడు.. శ్రీలంక-ఎతో ఇవాళ జరుగుతున్న తొలి సెమీఫైనల్లో ఓ మోస్తరు విధ్వంసంతో సరిపెట్టాడు.

ఈ మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగగా.. వైభవ్‌ తన సహజ శైలిలో రెచ్చిపోయాడు. 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 40 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారీ విధ్వంసం ఖాయమనుకున్న తరుణంలో జనిత్‌ లియనాగే బౌలింగ్‌లో లసిత్‌ క్రూస్‌పుల్లేకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

11 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 97-1గా ఉంది. అభిషేక్‌ శర్మ 28 బంతుల్లో 39, తిలక్‌ వర్మ 11 బంతుల్లో 9 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

ఇదిలా ఉంటే, యూఏఈతో జరిగిన గత మ్యాచ్‌లో వైభవ్‌ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగి రికార్డు డబుల్‌ సెంచరీ (53 బంతుల్లో 204; 7 ఫోర్లు, 28 సిక్సర్లు)తో విరుచుకుపడ్డాడు. ఈ విధ్వంసం ధాటి​కి లిస్ట్‌-ఎ క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ, 150, డబుల్‌ సెంచరీ.. ఇలా చాలావరకు బ్యాటింగ్‌ రికార్డులు బద్దలయ్యాయి.

ఇదీ చదవండి: కృనాల్ పాండ్యాపై బూట్లు విసిరిన ప్రేక్షకుడు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement