breaking news
India A vs Sri Lanka A
-
సాయి సుదర్శన్ మరో భారీ ఇన్నింగ్స్
శ్రీలంక-ఏతో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్‌లో భారత-ఏ జట్టు ఓపెనర్ సాయి సుదర్శన్ అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ సిరీస్ తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడిన అతడు.. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో అంతకంటే భారీ ఇన్నింగ్స్ ఆడాడు. గాలే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సాయి 267 బంతుల్లో 22 ఫోర్ల సాయంతో 168 పరుగులు చేసి ఔటయ్యాడు.ఈ సుదర్ఘీ ఇన్నింగ్స్ సాయిలోని స్టామినాను మరోసారి చూపింది. సాయి భారత టెస్ట్ జట్టులో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నాడు. ఇలాంటి తరుణంలో అతడి నుండి విదేశీ గడ్డపై రెండు భారీ ఇన్నింగ్స్‌లు రావడం శుభపరిణామం. సాయి టీమిండియా తరఫున వన్‌డౌన్‌లో ఆడతాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో తాజాగా జరిగిన ఏకైక టెస్ట్‌లో అతడు 81 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా టెస్ట్ కెరీర్లో 12 ఇన్నింగ్స్‌లు ఆడిన సాయి 3 అర్ద సెంచరీల సాయంతో 383 పరుగులు చేశాడు. శ్రీలంక-ఏపై తాజా సెంచరీలు సాయికి తదుపరి టెస్ట్ మ్యాచ్‌ల్లో మంచి బూస్టప్ ఇస్తాయి.భారత జట్టు ఆగస్ట్‌లో శ్రీలంక పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సిరీస్‌లో సాయి తాజా అనుభవం టీమిండియాకు బాగా కలిసొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత-ఏ జట్టులో ఉన్న సభ్యుల్లో సాయి ఒక్కడే భారత టెస్ట్ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్నాడు.వర్షం అంతరాయంరెండో టెస్ట్ మూడో రోజు లంచ్ విరామం తర్వాత ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. భారత్ స్కోర్ 406-4 వద్ద ఉండగా వర్షం మొదలైంది. ఆ సమయానికి టీమిండియా 40 పరుగుల ఆధిక్యంలో ఉంది. సాయి సుదర్శన్ (168) డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని, దేవ్‌దత్ పడిక్కల్ (94) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నారు. కెప్టెన్ ధృవ్ జురెల్ (53) అర్ద సెంచరీతో రాణించగా.. మరో ఓపెనర్ అమన్ మోఖడే 38 పరుగులకు ఔటయ్యాడు. షేక్ రషీద్ (16), సరాన్ష్ జైన్ (2) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు లంక ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సహాన్ అరచ్చ్చిగే (127) సెంచరీతో కదంతొక్కాడు. భారత బౌలర్లలో బ్రార్, సరాన్ష్ తలో 4 వికెట్లతో రాణించారు. ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. -
భారత ఓపెనర్ భారీ శతకం!.. పాపం పడిక్కల్!
శ్రీలంక- ‘ఎ’ జట్టుతో రెండో అనధికారిక టెస్టులో భారత్ జోరు కొనసాగిస్తోంది. గాలె వేదికగా శనివారం నాటి మూడో రోజు ఆటలో భోజన విరామ సమయానికి.. 88 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 343 పరుగులు సాధించింది. శ్రీలంక కంటే తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగులు వెనుకబడి ఉన్నప్పటికీ తేలికగానే ఆధిక్యంలోకి వచ్చే స్థితిలో నిలిచింది.కాగా 247/1 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఆట మొదలుపెట్టింది భారత్. ఈ క్రమంలో శతక వీరుడు, ఓపెనర్ సాయి సుదర్శన్ లంచ్ బ్రేక్ సమయానికి 153 పరుగులతో క్రీజులో నిలిచాడు. అయితే, దేవ్‌దత్ పడిక్కల్ మాత్రం సెంచరీకి ఆరు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. తన ఓవర్‌నైట్ స్కోరుకు ఒక్క పరుగు కూడా జతచేయకుండానే 94 పరుగుల వద్ద కేశర నువంతా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్ 13 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగగా.. కెప్టెన్ ధ్రువ్ జురెల్ 25 పరుగులతో.. సాయి సుదర్శన్‌తో కలిసి క్రీజులో ఉన్నాడు.రెండోరోజు ఆట సాగిందిలా..శ్రీలంకతో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో సాయి సుదర్శన్ (184 బంతుల్లో 104 బ్యాటింగ్; 13 ఫోర్లు) సెంచరీతో కదంతొక్కాడు. అతడితో పాటు దేవదత్ పడిక్కల్ (151 బంతుల్లో 94 బ్యాటింగ్; 11 ఫోర్లు) కూడా రాణించాడు. ఈ ఇద్దరితో పాటు అమోన్ మోఖడే (38; 6 ఫోర్లు) కూడా ఫర్వాలేదనిపించడంతో శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత ‘ఎ’ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 63 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 247 పరుగులు చేసింది.తొలి వికెట్‌కు 66 పరుగులు జోడించిన అనంతరం అమన్ అవుట్ కాగా... పడిక్కల్‌తో కలిసి సుదర్శన్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన ఈ జోడీ... నిలదొక్కుకున్న తర్వాత వేగం పెంచింది. లంక బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోగా... భారత బ్యాటర్లు పరుగుల వరద పారించారు. రెండో వికెట్‌కు 181 పరుగులుఈ క్రమంలో గత మ్యాచ్‌లోనూ సెంచరీ బాదిన సుదర్శన్ మరో శతకం తన ఖాతాలో వేసుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అతడికిది పదో సెంచరీ. పడిక్కల్ 94 పరుగుల వద్ద నిలిచాడు.వీరిద్దరూ అబేధ్యమైన రెండో వికెట్‌కు 181 పరుగులు జోడించారు. లంక బౌలర్లలో కేశర నువంతా ఒక వికెట్ తీశాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 288/5తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక జట్టు చివరకు 110 ఓవర్లలో 366 పరుగులకు ఆలౌటైంది. లంక కెప్టెన్ సెంచరీకెప్టెన్ సహాన్ అరాచిగే (207 బంతుల్లో 127; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించగా... తక్కినవాళ్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, సారాన్ష్ జైన్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టగా... యశ్ ఠాకూర్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి అనధికారిక టెస్టు ‘డ్రా’గా ముగిసిన సంగతి తెలిసిందే.చదవండి: నిన్ను ఆడించడం కుదరదని అతడికి చెప్పేయండి! -
పుంజుకున్న టీమిండియా బౌలర్లు.. లంక బ్యాటర్లు కట్టడి
శ్రీలంక-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్‌లో భారత బౌలర్లు పుంజుకున్నారు. తొలి రోజు పెద్ద ప్రభావం చూపని వీరు, రెండో రోజు లంక బ్యాటర్లను కట్టడి చేశారు. ఫలితంగా ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 366 పరుగుల నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది.తొలి రోజు ఆట ముగిసే సమయానికి లంక స్కోర్ 288-5గా ఉండింది. రెండో రోజు ఆట తొలి సెషన్లోనే గుర్నూర్ బ్రార్ (22-277-4), సరాన్ష్ జైన్ (30-2-92-4) చెలరేగడంతో ఆ జట్టు 61 పరుగుల వ్యవధిలో మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. 83 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రెండో రోజు బరిలోకి దిగిన లంక కెప్టెన్ సహన్ అరచ్చిగే (127) సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత గుర్నూర్ బ్రార్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో ఓవర్‌నైట్ బ్యాటర్ అంజల బండార (42) అదే స్కోర్ వద్ద ఔటయ్యాడు. లంక ఇన్నింగ్స్‌లో పవంత వీరసింఘే 39, సోహన్ డి లివెరా 28, నువనిదు ఫెర్నాండో 44, అషేన్ బండార 34, చమిక గుణశేఖర 13, కేశర నువంత 1, దిలుమ్ సుదీర 20, అసంక మనోజ్ 4, దులజ్ సముదిత 2 (నాటౌట్) పరుగులు చేశారు. భారత బౌలర్లలో బ్రార్, సరాన్ష్ కాకుండా యశ్ ఠాకూర్ 2 వికెట్లు తీశాడు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. -
శ్రీలంకతో రెండో టెస్టు: భారత క్రికెట్ రికార్డు వీరుడి ‘అరంగేట్రం’!
భారత్- శ్రీలంక ‘ఎ’ జట్ల మధ్య రెండో అనధికారిక టెస్టు మ్యాచ్ గురువారం మొదలైంది. గాలే వేదికగా టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ ధ్రువ్ జురెల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య శ్రీలంక భోజన విరామ సమయానికి 25 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది.ఓపెనర్లలో సోహాన్ డి లివెరా (28)ను యశ్ ఠాకూర్ పెవిలియన్‌కు పంపగా.. పవంత వీరసింగే (39) వికెట్‌ను గుర్నూర్ బ్రార్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. శ్రీలంక- ‘ఎ’తో రెండో అనధికారిక టెస్టు సందర్భంగా భారత్- ‘ఎ’ తరఫున విదర్భ స్టార్ అమన్ మోఖడే ‘అరంగేట్రం’ చేశాడు.ఎవరీ అమన్ మోఖడే?విదర్భ తరఫున 2022లో అమన్ మోఖడే దేశవాళీ క్రికెట్లో అడుగుపెట్టాడు. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా అరంగేట్రం చేసిన అతడు.. అదే ఏడాది ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోనూ అడుగుపెట్టాడు.ఆ మరుసటి ఏడాది లిస్ట్-‘ఎ’ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చిన అమన్ మోఖడే.. రంజీ తాజా ఎడిషన్, దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో అదరగొట్టాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్లో కేవలం పది ఇన్నింగ్స్‌లోనే ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఏకంగా 814 పరుగులు సాధించాడు.ప్రపంచ రికార్డు సమం చేసిన వీరుడుతద్వారా సీజన్లో టాప్ రన్ స్కోరర్‌గా నిలవడంతో పాటు విదర్భ ట్రోఫీ గెలవడంలోనూ ఓపెనింగ్ బ్యాటర్ అమన్ మోఖడే కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు.. భారత లిస్ట్- ‘ఎ’ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా వెయ్యి పరుగుల మార్కు అందుకున్న క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.కేవలం 16 ఇన్నింగ్స్‌లోనే అమన్ మోఖడే ఈ మైలురాయిని అందుకున్నాడు. తద్వారా సౌతాఫ్రికాకు చెందిన గ్రేమ్ పొలాక్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును సమం చేశాడు. కాగా దేవ్‌దత్ పడిక్కల్, అభినవ్ ముకుంద్ పదిహేడు ఇన్నింగ్స్‌లో లిస్ట్-ఎ క్రికెట్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకోగా.. అమన్ వారిద్దరిని అధిగమించడమే కాకుండా.. పొలాక్ రికార్డును సమం చేయడం విశేషం.రంజీలోనూ రాణించి..సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కర్ణాటకపై శతక్కొట్టి.. అమన్ మోఖడే ఈ ఫీట్ అందుకున్నాడు. ఇక రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో పదకొండు ఇన్నింగ్స్ ఆడిన 25 ఏళ్ల అమన్ మోఖడే.. 760 పరుగులు సాధించాడు. 🚨 VIDARBHA QUALIFIED INTO THE FINAL OF VIJAY HAZARE TROPHY 🚨- They beat Mighty Karnataka, Aman Mokhade is the star of the Semi final. 🦁 pic.twitter.com/aKcyclAwhn— Johns. (@CricCrazyJohns) January 15, 2026ఈ క్రమంలోనే శ్రీలంక పర్యటనలో భాగంగా భారత్- ‘ఎ’ జట్టుకు తొలిసారి ఎంపికయ్యాడు. దేశీ క్రికెట్లో సత్తా చాటిన అమన్.. భారత్- ‘ఎ’ జట్టు తరఫున వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుని.. త్వరలోనే టీమిండియాకూ ఆడే స్థాయికి చేరుకోవాలని ఆశిద్దాం!!చదవండి: ‘వైభవ్‌ను ఇపుడే ఆడించొద్దు’ -
భారత్- శ్రీలంక మ్యాచ్ డ్రా
గాలే వేదికగా శ్రీలంక-ఏతో జరుగుతున్న అనధికారిక టెస్టు మ్యాచ్‌లో ఇండియా-ఏ రెండో ఇన్నింగ్స్‌ను 8 వికెట్ల నష్టానికి 189 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో లంక-ఏ ముందు 312 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. భారత బ్యాటర్లలో దేవదత్ పడిక్కల్ (67) అర్ధసెంచరీ చేయగా, ఓపెనర్ ఆయుశ్ పాండే (38) పర్వాలేదనిపించాడు. లోయర్ ఆర్డర్లో షేక్ రషీద్ (20), హర్ష్ దూబే (29) పరుగులు చేయడంతో ఇండియా-ఏ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్ 172 పరుగుల ఆధిక్యం కలుపుకొని ఇండియా-ఏ 311 పరుగులు సాధించింది. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక వర్షం అంతరాయం కలిగించే సమయానికి 6.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది. నువానిదు ఫెర్నాండో (2), ఆషెన్ బండారా (1) క్రీజులో ఉన్నారు. ఇండియా-ఏ విజయానికి 8 వికెట్లు అవసరం కాగా.. లంక విజయానికి 275 పరుగులు చేయాల్సి ఉంది. అంతకముందు శ్రీలంక-ఏ తమ తొలి ఇన్నింగ్స్‌లో 330 పరుగులకు ఆలౌటైంది. నువానిదు ఫెర్నాండో (84), ఆషెన్ బండారా (70), కెప్టెన్ సహన్ అరాచిగె (72) అర్ధశతకాలతో రాణించారు. ఇండియా-ఏ బౌలర్లలో అకిబ్ నబీ 4 వికెట్లతో చెలరేగగా, యష్ ఠాకూర్, హర్ష్ దూబే చెరో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా-ఏ జట్టు 452 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ధ్రువ్ జురేల్‌తో పాటు ఓపెనర్ సాయి సుదర్శన్ భారీ శతకాలతో మెరిశారు.UPDATE: మ్యాచ్ డ్రావర్షం వల్ల ఆటకు అంతరాయం కలగగా.. మ్యాచ్ సాగే పరిస్థితి కనిపించలేదు. ఫలితంగా ఇరుజట్ల సారథులు డ్రాకు అంగీకరించారు. కాగా భారత్- శ్రీలంక మధ్య రెండో అనధికారిక టెస్టు జూలై 2న మొదలుకానుంది.సంక్షిప్త స్కోర్లుభారత్- 452/6d &189/8dశ్రీలంక- 330 & 70/2.Read: ఆసీస్‌తో 'డూ ఆర్ డై' మ్యాచ్.. మంధాన కీలక వ్యాఖ్యలు -
లంక-ఏతో మ్యాచ్.. భారీ ఆధిక్యం దిశగా ఇండియా-ఏ
గాలే వేదికగా శ్రీలంక-ఏతో జరుగుతున్న అనధికారిక టెస్టులో ఇండియా-ఏ జట్టు భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. ఓవర్‌నైట్ స్కోరు 48/0తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇండియా-ఏ జట్టు 45 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన దేవదత్ పడిక్కల్ (67) అర్ధసెంచరీ సాధించాడు. ఓపెనర్ ఆయుష్ పాండే 38 పరుగులు చేసి దులజ్ సముదితా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అంతకముందు సాయి సుదర్శన్ (7) తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ 172 పరుగుల ఆధిక్యం కలుపుకొని 271 పరుగుల లీడ్‌లో కొనసాగుతోంది. టీ సెషన్ వరకు వీలైనంత ఎక్కువ పరుగులు చేసి లంక-ఏ ముంగిట 400కు పైగా లక్ష్యాన్ని ఉంచాలని ఇండియా-ఏ భావిస్తోంది. అంతకముందు శ్రీలంక-ఏ తమ తొలి ఇన్నింగ్స్‌లో 330 పరుగులకు ఆలౌటైంది. నువానిదు ఫెర్నాండో (84), ఆషెన్ బండారా (70), కెప్టెన్ సహన్ అరాచిగె (72) అర్ధశతకాలతో రాణించారు. ఇండియా-ఏ బౌలర్లలో అకిబ్ నబీ 4 వికెట్లతో చెలరేగగా, యష్ ఠాకూర్, హర్ష్ దూబే చెరో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా-ఏ జట్టు 452 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ధ్రువ్ జురేల్‌తో పాటు ఓపెనర్ సాయి సుదర్శన్ భారీ శతకాలతో మెరిశారు. -
నిప్పులు చెరిగిన నబీ.. టీమిండియాదే పైచేయి
గాలే వేదికగా శ్రీలంక-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో భారత-ఏ జట్టు పైచేయి సాధించింది. 122 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్ కలుపుకొని, 170 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 48 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (7) రిటైర్డ్ హర్ట్ కాగా.. ఆయుశ్ పాండే, దేవ్‌దత్ పడిక్కల్ తలో 20 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.నిప్పులు చెరిగిన నబీశ్రీలంక జట్టు భారత బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 330 పరుగులకు ఆలౌటైంది. పేసర్ అకిబ్ నబీ (4-58) నిప్పులు చెరిగే బంతులతో లంక బ్యాటర్ల భరతం పట్టాడు. మిగతా పేసర్లు యశ్ ఠాకూర్ (2-51), అన్షుల్ కంబోజ్ (1-43) కూడా సత్తా చాటారు. స్పిన్నర్లు హర్ష్ దూబే (2-84), సరాన్ష్ జైన్ (1-83) కూడా తమ పాత్రకు న్యాయం చేశారు. లంక ఇన్నింగ్స్‌లో నువనిదు ఫెర్నాండో (84), అషేన్ బండార (70), కెప్టెన్ సహాన్ అరాచ్చిగే (72) అర్ద సెంచరీలతో రాణించారు.సాయి సుదర్శన్, జురెల్ శతకాలుతొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సాయి సుదర్శన్ (132), కెప్టెన్ ధృవ్ జురెల్ (141 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కడంతో 6 వికెట్ల నష్టానికి 452 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. మిగతా బ్యాటర్లలో షేక్ రషీద్ (63) అర్ద సెంచరీతో రాణించగా.. ఆయుశ్ పాండే 25, పడిక్కల్ 12, రుతురాజ్ 22, హర్ష్ దూబే 30, సరాన్ష్ 3 (నాటౌట్) పరుగులు చేశారు. లంక బౌలర్లలో గుణశేఖర 3, సుధీర 2, రవిందు ఓ వికెట్ తీశారు. -
రెండో రోజు ముగిసిన ఆట.. లంక-ఏ జట్టు స్కోరెంతంటే?
ఇండియా-ఏతో జరుగుతున్న అనధికారిక టెస్టులో శ్రీలంక-ఏ జట్టు ఎదురీదుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 31 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. ప్రస్తుతం శ్రీలంక-ఏ జట్టు 339 పరుగులు వెనుకబడి ఉంది. నువానిదు ఫశ్రీర్నాండో (65 నాటౌట్), ఆషెన్ బండారా (18 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఇండియా-ఏ బౌలర్లలో అన్షుల్ కంబోజ్, యష్ ఠాకూర్ చెరొక వికెట్ తీశారు. అంతకముందు ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్‌ను 6 వికెట్ల నష్టానికి 452 పరుగుల వద్ద డిక్లెర్ చేసింది. కెప్టెన్ ధ్రువ్ జురేల్ (141 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా, ఓపెనర్ సాయి సుదర్శన్ (132) సెంచరీతో రాణించాడు. చివర్లో షేక్ రషీద్ (63) అర్ధసెంచరీ సాధించగా, హర్ష్ దూబే (30) పర్వాలేదనిపించాడు. లంక బౌలర్లలో చమికా గుణశేఖరా మూడు వికెట్లు తీయగా, దిలుమ్ సుదీరా రెండు వికెట్లు పడగొట్టాడు. Stumps on Day 2️⃣ in Galle!India A lead by 3️⃣3️⃣9️⃣ runs on the back of a strong 1st innings total of 452/6 d, with Sri Lanka A 113/2 at stumps 👏Captain Dhruv Jurel led the charge with a fantastic 141(215) 💯#SLAvINDA pic.twitter.com/nBNAGOPItM— BCCI (@BCCI) June 26, 2026 -
కెప్టెన్ సూపర్ సెంచరీ.. భారత్ స్కోరెంతంటే?
శ్రీలంక- ‘ఎ’ జట్టుతో తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత్- ‘ఎ’ కెప్టెన్ ధ్రువ్ జురెల్ అద్భుత శతకం సాధించాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 181 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. కాగా రెండు అనధికారిక టెస్టుల సిరీస్ ఆడేందుకు భారత జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.తొలిరోజు ఇలాఇందులో భాగంగా శ్రీలంక- భారత్ మధ్య గురువారం గాలేలో తొలి టెస్టు మొదలు కాగా.. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలిరోజు ఆటలో ఓపెనర్ సాయి సుదర్శన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మొత్తంగా 175 బంతులు ఎదుర్కొని పందొమ్మిది ఫోర్ల సాయంతో 132 పరుగులు సాధించాడు.మిగిలిన వారిలో ఓపెనర్ ఆయుశ్ పాండే (25) ఫర్వాలేదనిపించగా.. దేవ్‌దత్ పడిక్కల్ (12), రుతురాజ్ గైక్వాడ్ (22) మాత్రం నిరాశపరిచారు. అయితే, ధ్రువ్ జురెల్‌తో పాటు షేక్ రషీద్ అర్ధ శతకాలతో రాణంచడంతో.. గురువారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి భారత్ 86 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది.శతక్కొట్టిన కెప్టెన్‌ఇక 333/4 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం రెండో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. కాసేపటికే షేక్ రషీద్ (63) వికెట్ కోల్పోయింది. అయితే, కెప్టెన్ జురెల్ మాత్రం జోరు కొనసాగించాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 97 పరుగుల వద్ద ఉండగా వర్షం అంతరాయం కలిగించడంతో చాలాసేపు ఆటను నిలిపివేశారు.అయితే.. ఆ తర్వాత వర్షం తెరిపినిచ్చినా వెట్ఫీల్డ్ కారణంగా మరికొంతసేపు ఆట నిలిచిపోయింది. ఈ క్రమంలో కాసేపటికి మళ్లీ ఆట మొదలుకాగా.. జురెల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు.. హర్ష్ దూబే 30 పరుగులు చేసి అవుటయ్యాడు.ఈ క్రమంలో టీ బ్రేక్ సమయానికి భారత్ 111.4 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 452 పరుగులు స్కోరు చేసింది. ధ్రువ్ జురెల్ 141, సారాంశ్ జైన్ 3 పరుగులతో క్రీజులో నిలిచారు. ఇక టీ బ్రేక్ తర్వాత భారత్.. అదే స్కోరు (452/6) వద్ద తమ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.చదవండి: వైభవ్ అరంగేట్రం కోసం వాళ్లను బలిచేయలేము -
శ్రీలంకతో తొలి టెస్టు: వర్షం వల్ల అంతరాయం
శ్రీలంక- ‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ ధ్రువ్ జురెల్ జోరు కొనసాగిస్తున్నాడు. గాలె వేదికగా రెండో రోజు నాటి ఆట సందర్భంగా ఈ వికెట్ కీపర్ బ్యాటర్ శతకానికి చేరువయ్యాడు. అయితే, ఊహించని విధంగా ఆటకు వర్షం అంతరాయం కలిగించింది.వాన పడిందిఅప్పటికి ధ్రువ్ జురెల్ 177 బంతుల్లో ఎనిమిది ఫోర్ల సాయంతో 97 పరుగులు చేశాడు. ఇంతలో వర్షం రావడంతో ఆటను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక వాన పడే సమయానికి భారత్- ‘ఎ’ జట్టు 99 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. అప్పటికి జురెల్‌తో పాటు హర్ష్ దూబే (7*) క్రీజులో ఉన్నాడు.కాగా రెండు అనధికారిక టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు భారత్- ‘ఎ’ జట్టు శ్రీలంకలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా గురువారం గాలె అంతర్జాతీయ స్టేడియంలో గురువారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ ధ్రువ్ జురెల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.సుదర్శన్ అద్భుత శతకంఈ క్రమంలో టాపార్డర్‌లో ఓపెనర్ ఆయుశ్ పాండే (25).. వన్‌డౌన్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ (12) విఫలం కాగా.. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ అద్భుత శతకం సాధించాడు. మొత్తంగా 175 బంతుల్లో 19 బౌండరీలు బాదిల 132 పరుగులు చేశాడు.మిగిలిన వారిలో రుతురాజ్ గైక్వాడ్ (22) కూడా విఫలం కాగా.. జురెల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అతడికి తోడుగా గుంటూరు అబ్బాయి షేక్ రషీద్ అర్ధ శతకం (63)తో రాణించాడు. వీరిద్దరు కలిసి ఐదో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. ఫలితంగా తొలిరోజు ఆట ముగిసే సరికి భారత్ 86 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది. ఈ క్రమంలో 333/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట మొదలుపెట్టిన భారత్ 92వ ఓవర్లో షేక్ రషీద్ వికెట్ కోల్పోయింది. చదవండి: వైభవ్ అరంగేట్రం కోసం వాళ్లను బలిచేయలేము -
భారీ స్కోర్ దిశగా టీమిండియా
భారత్-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్ ఇవాల్టి నుంచి (జూన్ 25) ప్రారంభమైంది. గాలే వేదికగా మొదలైన తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఓపెనర్ సాయి సుదర్శన్ (132) సెంచరీతో.. మిడిలార్డర్ బ్యాటర్లు ధృవ్ జురెల్ (68 నాటౌట్), షేక్ రషీద్ (53 నాటౌట్) అర్ద శతకాలతో సత్తా చాటడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 333 పరుగులు (86 ఓవర్లు) చేసింది.స్టార్ బ్యాటర్లు రుతురాజ్ గైక్వాడ్ (22), దేవ్‌దత్ పడిక్కల్ (12) నిరాశపరిచినా భారత్ భారీ స్కోర్ దిశగా సాగడం విశేషం. ఇవాళ ఔటైన మరో భారత బ్యాటర్ ఆయుశ్ పాండే. అతడు 25 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు.లంక బౌలర్లలో దిలుమ్ సుదీర 2 వికెట్లు తీయగా.. చమిక గుణశేఖర, రవిందు ఫెర్నాంతో తలో వికెట్ దక్కించుకున్నారు.కాగా, ఈ మ్యాచ్‌కు ముందు భారత-ఏ జట్టు లంకలోనే ట్రై నేషన్ (ఆఫ్ఘనిస్తాన్ సహా) వన్డే సిరీస్ ఆడింది. ఈ టోర్నీలో భారత్ విజేతగా అవతరించింది. ఫైనల్లో ఆతిథ్య లంక జట్టును చిత్తు చేసి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగి (29 బంతుల్లో 94 పరుగులు) భారత్‌కు టైటిల్ అందించాడు. -
శ్రీలంకతో టెస్టు.. శతక్కొట్టిన భారత ఓపెనర్
శ్రీలంక- ‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టులో భారత్- ‘ఎ’ ఓపెనర్ సాయి సుదర్శన్ శతక్కొట్టాడు. దిలుమ్ సుదీర బౌలింగ్‌లో సింగిల్ తీసి వంద పరుగుల మార్కు అందుకున్నాడు. 130 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.తొలుత బ్యాటింగ్ రెండు టెస్టు మ్యాచ్‌ల అనధికారిక సిరీస్ ఆడేందుకు భారత్- ‘ఎ’ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. టీమిండియా స్టార్ ధ్రువ్ జురెల్ ఈ సిరీస్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇరుజట్ల మధ్య గాలే అంతర్జాతీయ స్టేడియం వేదికగా తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఈ క్రమంలో ఓపెనర్లలో ఆయుశ్ పాండే (25) నామమాత్రపు స్కోరుకే వెనుదిరగగా.. వన్‌డౌన్‌లో వచ్చిన దేవ్‌దత్ పడిక్కల్ (12) కూడా విఫలమయ్యాడు. ఇలాంటి తరుణంలో ఓపెనర్ సాయి సుదర్శన్ బాధ్యతాయుతంగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు.ఇక రుతురాజ్ గైక్వాడ్ 53 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే. . తొలి ఇన్నింగ్స్‌లో మొత్తంగా 175 బంతులు ఎదుర్కొన్న సాయి సుదర్శన్.. 19 ఫోర్ల సాయంతో 132 పరుగులు సాధించాడు. చమిక గుణశేఖర బౌలింగ్‌లో దులాజ్ సముదితకు క్యాచ్ ఇచ్చి సాయి పెవిలియన్ చేరాడు.తుదిజట్లుభారత్సాయి సుదర్శన్, ఆయుశ్ పాండే, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, ధృవ్ జురెల్(కెప్టెన్/ వికెట్ కీపర్), షేక్ రషీద్, హర్ష్ దూబే, సారాంశ్ జైన్, అన్షుల్ కాంబోజ్, యశ్ ఠాకూర్, ఆకిబ్ నబీ దర్శ్రీలంకపవంత వీరసింగే, నిరోషన్ డిక్విల్లా (వికెట్ కీపర్), నునానిదు ఫెర్నాండో, ఆషేన్ బండారా, సహాన్ అరాచిగే (కెప్టెన్), రవిందు ఫెర్నాండో, అంజాలా బండారా, కవిందు పతిరత్నె, దులాజ్ సముదిత, చమిక గుణశేఖర, దిలుమ్ సుదీర.చదవండి: కన్నీటి పర్యంతమైన నెయ్మార్ -
శ్రీలంకతో తొలి టెస్టు.. భారత్ బ్యాటింగ్
శ్రీలంక పర్యటనలో ముక్కోణపు వన్డే సిరీస్‌ను భారత్- ‘ఎ’ జట్టు ఇటీవలే ముగించుకుంది. ఈ క్రమంలో తాజాగా లంకతో అనధికారిక టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య శ్రీలంక- ‘ఎ’ జట్టుతో భారత్ రెండు అనధికారిక టెస్టులు ఆడనుంది.ధ్రువ్ జురెల్ సారథ్యంలో..ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య గురువారం తొలి టెస్టు మొదలైంది. గాలే అంతర్జాతీయ స్టేడియం వేదికగా టాస్ గెలిచిన భారత్ లుత బ్యాటింగ్ ఎంచుకుంది. యువ ఆటగాడు ధ్రువ్ జురెల్ ఈ సిరీస్‌లో భారత జట్టుకు కెప్టెన్, వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తున్నాడు.వన్డే సిరీస్‌లో విజేతగాఈ జట్టులో జురెల్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, గుర్నూర్ బ్రార్ తదితర టీమిండియా స్టార్లు కూడా ఉన్నారు. కాగా శ్రీలంక, అఫ్గానిస్తాన్ ‘ఎ’ జట్లతో జరిగిన అనధికారిక వన్డే సిరీస్‌లో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. లీగ్ దశలో లంక, అఫ్గాన్లపై ఒక్కో మ్యాచ్ గెలవడంతో పాటు.. ఒక్కో మ్యాచ్ ఓడిపోయినప్పటికీ.. అద్భుతమైన రన్‌రేటు కారణంగా తిలక్ వర్మ సేన ఫైనల్లో అడుగుపెట్టింది.టైటిల్ పోరులో శ్రీలంకపై ఘన విజయం సాధించి చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 29 బంతుల్లోనే 94 పరుగులు సాధించి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. ఇక ఈ సిరీస్ తర్వాత తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ టీమిండియాతో కలిశారు. సీనియర్ జట్టుతో కలిసి టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్‌లో అడుగుపెట్టారు.తుదిజట్లుభారత్సాయి సుదర్శన్, ఆయుశ్ పాండే, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, ధృవ్ జురెల్(కెప్టెన్/ వికెట్ కీపర్), షేక్ రషీద్, హర్ష్ దూబే, సారాంశ్ జైన్, అన్షుల్ కాంబోజ్, యశ్ ఠాకూర్, ఆకిబ్ నబీ దర్శ్రీలంకపవంత వీరసింగే, నిరోషన్ డిక్విల్లా (వికెట్ కీపర్), నునానిదు ఫెర్నాండో, ఆషేన్ బండారా, సహాన్ అరాచిగే (కెప్టెన్), రవిందు ఫెర్నాండో, అంజాలా బండారా, కవిందు పతిరత్నె, దులాజ్ సముదిత, చమిక గుణశేఖర, దిలుమ్ సుదీర.చదవండి: రాణించిన నితీశ్ రెడ్డి.. కరీంనగర్‌పై నల్గొండ గెలుపు -
రేపటి నుంచి భారత్-శ్రీలంక తొలి టెస్ట్
శ్రీలంక పర్యటనలో వన్డే ట్రై-నేషన్ సిరీస్‌ను విజయవంతంగా ముగించిన భారత్-ఏ జట్టు ఇప్పుడు రెడ్‌బాల్ క్రికెట్‌పై దృష్టి సారించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య తొలి నాలుగు రోజుల అనధికారిక టెస్టు మ్యాచ్ రేపటి నుంచి (జూన్ 25) గాలే అంతర్జాతీయ స్టేడియం వేదికగా ప్రారంభం కానుంది. భారత్-ఏ జట్టుకు వికెట్‌కీపర్-బ్యాటర్ ధృవ్ జురెల్ నాయకత్వం వహిస్తున్నాడు. ఇటీవల దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న జురెల్‌కు ఇది కెప్టెన్‌గా కీలక అవకాశం. జట్టు వైస్ కెప్టెన్‌గా దేవదత్ పడిక్కల్ వ్యవహరించనున్నాడు. ఇటీవల ముగిసిన ట్రై-నేషన్ ‘ఏ’ సిరీస్‌లో భారత్-ఏ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఫైనల్లో శ్రీలంక-ఏను 66 పరుగుల తేడాతో ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఆ విజయంతో జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇప్పుడు అదే జోరును నాలుగు రోజుల ఫార్మాట్లో కొనసాగించాలని భారత్-ఏ లక్ష్యంగా పెట్టుకుంది. గాలే పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉండటంతో బ్యాటర్లకు ఇది కఠిన పరీక్షగా మారే అవకాశం ఉంది. మరోవైపు స్వదేశంలో ఆడుతున్న శ్రీలంక-ఏ జట్టు కూడా ప్రతిఘటన చూపేందుకు సిద్ధమవుతోంది.తొలి మ్యాచ్ రేపటి నుంచి 28 వరకు జరుగుతుండగా, రెండో మ్యాచ్ జూలై 2 నుంచి 5 వరకు గాలే వేదికగానే నిర్వహించబడుతుంది.జట్ల వివరాలు..భారత ఏ జట్టు: సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, అమన్ మోఖడే, ఆయుశ్ పాండే, షేక్ రషీద్, రుతురాజ్ గైక్వాడ్, హర్షిత్ దూబే, అన్షుల్ కంబోజ్, సరాన్ష్ జైన్, ఆకిబ్ నబీ దార్, ధృవ్ జురెల్, ఎన్ జగదీశన్, గుర్నూర్ బ్రార్, యశ్ ఠాకూర్, జీషన్ అన్సారీశ్రీలంక ఏ జట్టు: నువనిదు ఫెర్నాండో, అషెన్ బండార, అహాన్ విక్రమసింఘే, అసంక మనోజ్, పవంత వీరసింఘే, సహాన్ అరచ్చిగే (కెప్టెన్), రవిందు ఫెర్నాండో, దిలుమ్ సుదీర, ప్రవీణ్ మనీషా, కేషారా నువంత, సోహన్ డి లివేరా, నిరోషన్ డిక్వెల్లా, కవిందు పతిరత్నే, మొహమ్మద్ షిరాజ్, చమిక గుణశేఖర, దులాజ్ సముదిత, -
తిలక్ వర్మపై విమర్శలు.. అశ్విన్ ఏమన్నాడంటే?!
టీమిండియా స్టార్ తిలక్ వర్మకు భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ మద్దతుగా నిలిచాడు. శ్రీలంక- ‘ఎ’, అఫ్గానిస్తాన్- ‘ఎ’ జట్లతో ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఈ హైదరాబాదీ స్టార్ అద్భుతంగా రాణించాడని కొనియాడాడు. అయినప్పటికీ కొంతమంది తిలక్ వర్మను విమర్శించడం తనను ఆశ్చర్యపరిచిందన్నాడు.భారత్‌దే టైటిల్‌కాగా తిలక్ వర్మ సారథ్యంలో భారత్- ‘ఎ’ జట్టు ఇటీవల శ్రీలంకలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ అనధికారిక వన్డే సిరీస్‌లో అఫ్గాన్, శ్రీలంకపై పైచేయి సాధించిన భారత జట్టు.. ఫైనల్లోనూ లంకను చిత్తు చేసి టైటిల్ గెలుచుకుంది.ఈ సిరీస్‌లో తిలక్ వర్మ నాలుగు అర్ధ శతకాల సాయంతో 275 పరుగులు సాధించాడు. తద్వారా భారత్- ‘ఎ’ లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. అతడి స్ట్రైక్‌రేటు 74.93. ఇక శ్రీలంకతో ఫైనల్లో భారత ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 324కు పైగా స్ట్రైక్‌రేటుతో (29 బంతుల్లో 94) విధ్వంసం సృష్టించగా.. నాలుగో స్థానంలో ఆడిన తిలక్ వర్మ కాస్త నెమ్మదిగానే ఆడాడు.వైభవ్ అలా.. తిలక్ ఇలాఈ మ్యాచ్‌లో తిలక్ 74 స్ట్రైక్‌రేటుతో (90 బంతుల్లో) 67 పరుగులు చేశాడు. ఈ క్రమంలో వైభవ్‌ను ప్రశంసిస్తూ.. తిలక్ ఆట తీరుపై కొద్దిమంది సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. ఈ విషయంపై అశ్విన్ తాజాగా స్పందించాడు. ‘‘కొంతమంది కామెంట్ల రూపంలో తిలక్ వర్మ స్ట్రైక్‌రేటును విమర్శించడం నా కంటపడింది.అవును నిజమే.. అయితే ఏంటి?నిజమే అతడు కాస్త నెమ్మదిగానే ఆడాడు. అయినా సరే ఇంత ద్వేషం ఎందుకో అర్థం కావడం లేదు. వైభవ్ సూర్యవంశీ వేగంగా ఆడుతూ ఉంటే.. మరో ఎండ్‌లో తిలక్ వర్మ అతడిని కాంప్లిమెంట్ చేస్తూ.. అతడు భారీ స్కోరు సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు’’ అని అశ్విన్.. తిలక్ వర్మకు మద్దతుగా నిలిచాడు.చదవండి: టీమిండియాలోకి డేంజరస్ ప్లేయర్! -
నోళ్లు మూయండి.. రెచ్చగొడితే ఇలాగే చితక్కొడతా!
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్- ‘ఎ’ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఫైనల్ అవకాశాలు సన్నగిల్లిన వేళ అఫ్గానిస్తాన్- ‘ఎ’ను చిత్తుగా ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో ఆతిథ్య శ్రీలంక ‘ఎ’ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది.ఇందుకు ప్రధాన కారణం ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్. దంబుల్లాలో ఆదివారం కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 29 బంతుల్లోనే 94 పరుగులు సాధించాడు. దురదృష్టవశాత్తూ తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు.అయితే, జట్టును గెలిపించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకోవడంతో పాటు.. గత మ్యాచ్‌లో తనను కవ్వించిన శ్రీలంక ఆటగాళ్లపై ప్రతీకారం తీర్చుకున్నాడు వైభవ్. ఈ నేపథ్యంలో పదిహేనేళ్ల ఈ పిల్లాడిపై టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసలు కురిపించాడు.తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం. వైభవ్ విషయంలో ఎవరైనా జోక్ చేయాలనుకుంటే వారికి అతడు బ్యాట్‌తోనే సమాధానం ఇస్తూ ఉంటాడు.శ్రీలంక ప్లేయర్లు గత మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో వైభవ్ పరుగులు చేయకపోవడంపై జోకులు వేశారు. భారీగా సంబరాలు చేసుకున్నారు. వారికి కూడా వైభవ్ గట్టిగానే సమాధానం ఇచ్చాడు.‘యువ ఆటగాళ్లు.. ముఖ్యంగా పదిహేనేళ్ల పిల్లాడితో పెట్టుకుంటే.. ఏం జరిగిందో చూశారు కదా!.. కాబట్టి ఇకపై నోరు మూసుకుని ఉంటే మంచిది’ అనే సందేశాన్ని ఇచ్చాడు. వైభవ్ ఇన్నింగ్స్ వల్లే ఇండియా మ్యాచ్ గెలిచింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో వైభవ్ దంచికొట్టకుంటే ఇండియా కచ్చితంగా ఓడిపోయేదే.నిజంగా అతడు దేవుడి బిడ్డ. వైభవ్‌తో పెట్టుకుంటే ఏం జరుగుతుందో శ్రీలంక ప్లేయర్లకు బాగా తెలిసి వచ్చింది. నిజానికి ఆరోజు వైభవ్‌ను రెచ్చగొట్టకపోయి ఉంటే బహుశా వాళ్లకు ఫైనల్లో గెలుపు అవకాశాలు ఉండేవేమో!ఇది ఐపీఎల్ కాదు! అంటూ అతడిని ఏడిపిస్తారా? బదులుగా అతడు మీ బౌలింగ్ విభాగాన్ని చితక్కొట్టాడు’’ అంటూ చిక్కా వైభవ్ సూర్యవంశీని ఆకాశానికెత్తాడు. కాగా శ్రీలంకతో ఫైనల్లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో శ్రీలం 311 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా 66 పరుగుల తేడాతో గెలుపొందిన తిలక్ వర్మ సేన.. సిరీస్‌ను సొంతం చేసుకుంది. -
ఆ విషయం చాలా మందికి తెలియదు: వైభవ్
భారత నయా సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి సత్తా చాటాడు. ముక్కోణపు వన్డే సిరీస్‌లో వైఫల్యాలకు చెక్ పెడుతూ.. శ్రీలంక -‘ఎ’తో ఫైనల్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఉపమానాలే ఈర్ష్య పడేలా... అలంకారాలే అసూయపడేలా... బిరుదులే చిన్నబోయేలా... 15 ఏళ్ల ఈ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ ఆదివారం దంబుల్లాలో విధ్వంస రచన చేశాడు.లంక బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపాడు. మెరుపుల్లాంటి ఫోర్లు, పిడుగుల్లాంటి సిక్స్‌లతో లంక తీరంలో పరుగుల తుఫాన్ సృష్టించాడు. బౌలర్ చేతి నుంచి బంతి వచ్చిందే తడువు దాన్ని స్టాండ్స్‌లోకి పంపడమే తన కర్తవ్యం అన్నట్లు విరుచుకుపడ్డాడు.కేవలం 11 బంతుల్లోనేకేవలం 11 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకొని లిస్ట్ ‘ఎ’క్రికెట్లో సరికొత్త రికార్డు నెలకొల్పిన వైభవ్... ఒక్క షాట్ దూరంలో రికార్డు సెంచరీని కోల్పోయాడు. వైభవ్ (Vaibhav Suryavanshi) తో పోటు మిగిలినవాళ్లు కూడా రాణించడంతో ముక్కోణపు వన్డే టోర్నీ ఫైనల్లో శ్రీలంక ‘ఎ’ జట్టును ఓడించి భారత ‘ఎ’ జట్టు విజేతగా నిలిచింది.నిజానికి శ్రీలంకతో గత మ్యాచ్‌లో భారత్ సూపర్ ఓవర్లో పరాజయం పాలైన వేళ.. వైభవ్‌ను లంక ప్లేయర్ విశేన్ రెచ్చగొట్టాడు. అందుకు ఫలితంగా ఫైనల్లో ఆ జట్టు మొత్తాన్ని తన ఆట తీరుతో శిక్షించాడు వైభవ్. మొత్తంగా 29 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్లు బాది ఏకంగా 324కు పైగా స్ట్రైక్‌రేటుతో 94 పరుగులు సాధించాడు.ఈ నేపథ్యంలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న వైభవ్ సూర్యవంశీ.. తన ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. అదే విధంగా తాను బయటి విషయాలేమీ పట్టించుకోనని.. వన్డేల్లోనూ ఆడగల సత్తా తనకు ఉందని పేర్కొన్నాడు.పరుగులు చేయలేదని తెలుసు‘‘ఓపెనర్‌గా మొదటి పది ఓవర్లలో వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టాలనేది నా ఆలోచన. ఈరోజు ఆ ప్రణాళికను పక్కాగా అమలు చేశాను. సిరీస్ మొదట్లో ఆశించినంతగా పరుగులు చేయలేదని తెలుసు. అప్పుడు కోచ్‌లతో చర్చించాను.లోపాలు సరిదిద్దుకుని.. గట్టిగానే ప్రాక్టీస్ చేశాను. అందుకు తగ్గ ఫలితం ఫైనల్లో వచ్చింది. ఈ సిరీస్ నుంచి చాలానే నేర్చుకున్నాను. అయితే, చాలా మందికి నేను 50 ఓవర్ల మ్యాచ్‌లు ఆడినట్లు తెలియదు. ఏదేమైనా విభిన్నమైన పిచ్‌ల మీద ఆడటం కాస్త సరదాగా.. మరికాస్త సవాలుగా అనిపించింది. ఈ సిరీస్ నాకు మంచి అనుభవాన్ని ఇచ్చింది’’ అని వైభవ్ సూర్యవంశీ పేర్కొన్నాడు. కాగా ఈ సిరీస్‌లో భారత్, శ్రీలంక, అఫ్గనిస్తాన్ ‘ఎ’ జట్లు పాల్గొనగా భారత్ ఫైనల్లో శ్రీలంకను ఓడించి టైటిల్ గెలిచింది. ఇక ఈ సిరీస్‌లో వైభవ్ చేసిన పరుగులు వరుసగా.. 14, 44, 21, 38, 94.చదవండి: నల్గొండను చిత్తు చేసిన రంగారెడ్డి -
వైభవ్, తిలక్ మెరుపులు.. శ్రీలంక-ఏ టార్గెట్ 378 రన్స్
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా శ్రీలంక-ఏతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా-ఏ జట్టు భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా-ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ (29 బంతుల్లో 94 పరుగులు, 10 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ తిలక్ వర్మ (90 బంతుల్లో 67, 4 ఫోర్లు, 1 సిక్సర్) క్లాస్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మిగిలిన బ్యాటర్లలో రుతురాజ్ గైక్వాడ్ (40), ప్రియాన్ష్ ఆర్య (39) రాణించారు. ఆఖర్లో విప్రజ్ నిగమ్ (27), అనుకుల్ రాయ్ (15 బంతుల్లో 39, 1 ఫోర్, 4 సిక్సర్లు) ధాటిగా ఆడడంతో ఇండియా-ఏ స్కోరు 370 పరుగుల మార్క్‌ను దాటింది. లంక బౌలర్లలో రవిందు ఫెర్నాండో, వనుజా సాహన్చె, కుగతా మథులన్ 2 వికెట్లు తీయగా, మొహమ్మద్ షిరాజ్, సహన్ అరాచిగే, దులజ్ సముదితా తలా ఒక వికెట్ పడగొట్టారు.వైభవ్ జోరు.. లంక బేజారుటాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా-ఏ జట్టుకు వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. ఆరంభం నుంచే లంక బౌలర్లను ఉతికారేసిన సూర్యవంశీ 11 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించి ప్రపంచ రికార్డు సాధించాడు. ఆ తరవ్ఆత కూడా తన విధ్వంసాన్ని కొనసాగించిన వైభవ్ 29 బంతుల్లో 94 పరుగుల వద్ద ఔటవ్వడంతో అతడి జోరుకు బ్రేకులు పడ్డాయి. వైభవ్ దెబ్బకు 8.5 ఓవర్లలో 132 పరుగులు రాగా.. అందులో వైభవ్ సూర్యవంశీవే 94 పరుగులు ఉండడం గమనార్హం. సూర్యవంశీ ఔటైన తర్వాత ప్రియాన్ష్ ఆర్య కూడా వెనుదిరిగాడు. ఈ దశలో రుతురాజ్‌కు జత కలిసిన తిలక్ వర్మ కాస్త నిధానంగా ఆడడంతో పరుగులు రావడం మందగించింది. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 84 పరుగులు జోడించారు. అనంతరం 220 పరుగుల వద్ద రుతురాజ్ వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన కుమార్ కుషాగ్ర కూడా పర్వాలేదనిపించడంతో స్కోరు నత్తనడకనే సాగింది. ఈ దశలో హాఫ్ సెంచరీ చేసిన తిలక్ వర్మ 67 పరుగుల వద్ద ఔటవ్వడంతో ఇండియా-ఏ ఐదో వికెట్ కోల్పోయింది. తిలక్ ఔటైన తర్వాత ఇండియా-ఏకు పరుగులు రాలేదు. వైభవ్ విధ్వంసంతో 400 పరుగులు ఈజీగా వస్తాయనిపించింది. అయితే చివర్లో విప్రజ్, అనుకుల్ రాయ్ మెరుపులతో ఇండియా-ఏ 370 పరుగుల మార్క్‌ను దాటింది. The journey to the Final has been built on knocks like these.💥Now Tilak Varma and India 'A' are one win away from glory.🔥Watch #SLvIND in the #TalentTVCup Final, on 21st June, 10 AM onwards, LIVE on Sony Sports Network TV channels & Sony LIV. 📺🏏 pic.twitter.com/yJlAC3IjrB— Sony Sports Network (@SonySportsNetwk) June 19, 2026చదవండి: కవ్వించి తప్పు చేశారు.. వైభవ్ ప్రతీకారం! -
కవ్వించి తప్పు చేశారు.. వైభవ్ ప్రతీకారం!
ముక్కోణపు వన్డే టోర్నీలో భాగంగా భారత సంచలనం వైభవ్ సూర్యవంశీ తనకు కోపమొస్తే ఆ విధ్వంసం ఎంతలా ఉంటుందో లంక ఆటగాళ్లకు రుచి చూపించాడు. మొన్నటికి మొన్న లంక-ఏ ఆటగాళ్లతో గొడవకు దిగి వైభవ్ సూర్యవంశీ విమర్శలకు గురయ్యాడు. బ్యాటింగ్‌లో విఫలం కావడానికి తోడు తన చర్యతో చెడ్డ పేరు మూటగట్టుకున్నాడు. అయితే తనపై వచ్చిన విమర్శలకు, అనవసరంగా గెలికిన లంక ఆటగాళ్లకు ఒక్క ఇన్నింగ్స్‌తో దిమ్మతిరిగిపోయే సమాధానమిచ్చాడు. ఎందుకురా అనసవరంగా పెట్టుకున్నాం వీడితో అనేంతలా వైభవ్ రెచ్చిపోయాడు. క్రీజులోకి దిగిందే మొదలు బాదడమే పరమావధిగా పెట్టుకున్న వైభవ్ తాను ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీగా మలచిన వైభవ్ 28 బంతుల వరకు విధ్వంసాన్ని కొనసాగించాడు. ఇక తొలి 11 బంతుల్లో వైభవ్ వరుసగా 4,4,4,6,6,0,6,4,4,6,6 బాదడం విశేషం. తాను ఎదుర్కొన్న 11 బంతుల్లో ఒక డాట్ బాల్ మినహా మిగతా అన్ని బంతులను గమనిస్తే ఫోర్లు, సిక్సర్లే కనిపిస్తాయి. దీన్నిబట్టే వైభవ్ విధ్వంసం ఎలా సాగిందనేది అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును తన పేరిట లిఖించుకున్న వైభవ్ ఆ తర్వాత సెంచరీ వైపు పరిగెత్తాడు. చూస్తుండగానే 90ల్లోకి వచ్చిన వైభవ్ 29 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేసి ఔటయ్యాడు. వైభవ్ కాస్త కొంచెం ఓపిక వహించి ఉండుంటే లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు కూడా తన పేరిట లిఖించుకునేవాడు. అయితే తృటిలో శతకం చేజార్చుకున్నప్పటికీ వైభవ్ ఆడిన 94 పరుగుల ఇన్నింగ్స్ తన కెరీర్లోనే కాదు ప్రపంచ క్రికెట్లో సైతం ఎప్పటికీ గుర్తుండిపోతుందనడంలో సందేహం లేదు. అయితే అండర్-19 క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ 52 బంతుల్లో సెంచరీ బాదిన సంగతి తెలిసిందే. ఇక లిస్ట్-ఏ క్రికెట్లో మాత్రం ఆస్ట్రేలియా క్రికెటర్ జేమ్స్ మెక్‌గుర్క్ 29 బంతుల్లో సెంచరీ సాధించడం ఇప్పటికీ ప్రపంచ రికార్డుగా ఉంది. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఏబీ డివిలియర్స్ 31 బంతుల్లో అందుకున్న రికార్డు శతకం ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఇక దేశవాలీ క్రికెట్లో 2025-26 విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్‌ప్రదేశ్‌పై 36 బంతుల్లోనే సెంచరీ బాదిన వైభవ్ లిస్ట్-ఏ క్రికెట్లో శతక్కొట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డులకెక్కాడు. మొత్తం మీద తృటిలో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు మిస్‌చేసుకున్న వైభవ్ తనను అనవసరంగా గెలికి తప్పు చేసిన లంక ఆటగాళ్లకు బ్యాటింగ్ పవర్ రుచి చూపించడంతో పాటు ప్రతీకారం తీర్చుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే 25 ఓవర్లు ముగిసేసరికి ఇండియా-ఏ 2 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. కెప్టెన్ తిలక్ వర్మ (40), రుతురాజ్ గైక్వాడ్ (31 పరుగులు) క్రీజులో ఉన్నారు. Never mess with a Ego kid😭🔥🔥🔥Scored 11 balls 50 in IND A Finals😭😭With 5 sixes and 5 fours🥵🥵🥵🥵🥵#INDAvsSLA #vaibhav pic.twitter.com/rGQdowLjhh— Prabhas Devotee 🔥 (@SainathPb45) June 21, 20264,4,4,6,6,0,6,4,4,6,6 BY VAIBHAV SOORYAVANSHI IN HIS FIRST 11 BALLS 🥹- 15 YEAR OLD KID IS HAMMERING SRI LANKA. #indvssla pic.twitter.com/VzO2tm9uUb— Arman Cricket Updates (@arman7590) June 21, 2026Read: వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు -
లంకతో ఫైనల్ మ్యాచ్.. 11 బంతుల్లోనే ఫిఫ్టీ బాదిన వైభవ్
శ్రీలంక పర్యటనలో ట్రై సిరీస్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ముక్కోణపు వన్డే టోర్నీ ఫైనల్లో శ్రీలంక-ఏ, ఇండియా-ఏ జట్టు తలప డుతున్నాయి. టాస్ గెలిచిన శ్రీలంక-ఏ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా-ఏ దూకుడుగా ఆడుతోంది. వైభవ్ ధాటికి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ 11 బంతుల్లోనే అర్ధసెంచరీ మార్క్ సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అతడికి ప్రియాన్ష్ ఆర్య (22 బ్యాటింగ్) సహకరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న రికార్డును వైభవ్ బద్దలుకొట్టాడు.తుది జట్లు:ఇండియా-ఏ: ప్రియాంష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ(సి), కుమార్ కుషాగ్రా(w), సూర్యాంశ్ షెడ్గే, నిశాంత్ సింధు, అనుకుల్ రాయ్, విప్రజ్ నిగమ్, అశోక్ శర్మ, యశ్ ఠాకూర్శ్రీలంక-ఏ: నిరోషన్ డిక్వెల్లా(w), అవిష్క ఫెర్నాండో, నువానీదు ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, సహన్ అరాచ్చిగే(సి), రవిందు ఫెర్నాండో, వనుజా సహన్, మహ్మద్ షిరాజ్, విజయకాంత్ వియాస్కాంత్, దులజ్ సముదిత, కుగతస్ మతులన్ -
వైభవ్‌కు ఉన్న సంస్కారం మా వాళ్లకెక్కడిది?: శ్రీలంక దిగ్గజం
భారత నయా సంచలనం వైభవ్ సూర్యవంశీకి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పద్నాలుగేళ్లకే ఐపీఎల్లో సంచలనాలు సృష్టించిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. భారత అండర్-19 జట్టు తరఫునా దుమ్ములేపాడు.ఇక ఈ ఏడాది ఐపీఎల్ రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ.. 16 మ్యాచ్‌లలో కలిపి 776 పరుగులు సాధించాడు. తద్వారా 2026 సీజన్లో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచి.. పదిహేనేళ్లకే ఆరెంజ్‌క్యాప్ అందుకుని చరిత్ర సృష్టించాడు.శ్రీలంక పర్యటనలోఈ క్రమంలో తొలిసారి భారత్- ‘ఎ’ జట్టు, టీమిండియాకు ఎంపికైన వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో బిజీగా ఉన్నాడు. శ్రీలంక, భారత్, అఫ్గానిస్తాన్ ‘ఎ’ జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్‌లో వైభవ్ పెద్దగా ఆకట్టుకోలేదు. నాలుగు లీగ్ మ్యాచ్‌లలో వరుసగా 14, 44, 21, 38 పరుగులే చేశాడు.ఇదిలా ఉంటే.. వైభవ్‌ను చూసేందుకు శ్రీలంక ప్రేక్షకులు ఎగబడ్డారు. ఎయిర్‌పోర్టులో అతడి కోసం వేచి ఉండి మరీ ఫొటోలు దిగారు. హోటల్లోనూ ఫొటోల కోసం అభిమానులు రాగా.. వైభవ్ కొన్నిసార్లు సున్నితంగా తిరస్కరించాడు.గంటసేపు ఎదురుచూసి మరీఅయితే, అందరింకంటే ప్రత్యేకమైన అభిమాని ఒకరు వైభవ్ కోసం దాదాపు గంటసేపు ఎదురుచూసి మరీ అతడిని కలిశారు. ఆయన మరెవరో కాదు.. శ్రీలంక జాతీయ జట్టుకు మొట్టమొదటి వన్డే కెప్టెన్‌గా పనిచేసిన అనురా తెనాకూన్.Former great of Sri Lanka and one of the finest batters of the country and the captain of the 1st ever World cup in 1975, Anura Tennekoon met a potential future great Vaibhav Sooryavanshi during the Triangular A team series in Dambulla. pic.twitter.com/xYOWMcO6AM— Roshan Abeysinghe (@RoshanCricket) June 16, 2026ఇరుజట్ల ఆటగాళ్లదీ తప్పేశ్రీలంక- భారత్ ‘ఎ’ జట్ల మధ్య సోమవారం నాటి అనధికారిక వన్డే సందర్భంగా అనురా వైభవ్‌ను కలిశారు. ఈ సందర్భంగా తమ మధ్య జరిగిన సంభాషణను తాజాగా వెల్లడించారు. ‘‘ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన చూసి నేను ముగ్ధుడినయ్యాను.అతడి బ్యాటింగ్ చూసేందుకే దంబుల్లా స్టేడియానికి వెళ్లాను. కానీ దురదృష్టవశాత్తూ అతడి బ్యాట్ నుంచి మెరుపులు చూడలేకపోయాను. మా ఆటగాళ్లు అతడిని చుట్టుముట్టి రెచ్చగొట్టారు. అతడింకా పిల్లాడే.అప్పటికే మ్యాచ్ ఓడిన కోపంలో ఉన్నాడు. మా వాళ్లు కవ్వించడంతో తానూ రెచ్చిపోయాడు. భావోద్వేగాలు నియంత్రించుకోలేకపోయాడు. దురదృష్టవశాత్తూ ఆ ఘటన జరిగిపోయింది. ఇరుజట్ల ఆటగాళ్లదీ తప్పే.మా శ్రీలంక ఆటగాళ్లు ఎప్పుడూ కూడాఆరోజు నన్ను కలిసినపుడు వైభవ్ నా దగ్గరికొచ్చి.. ‘సర్. మీ ఆశీసులు కావాలి. మిమ్మల్ని కలవడం నా అదృష్టం’ అంటూ నా పాదాలకు నమస్కరించాడు. మా శ్రీలంక ఆటగాళ్లు ఎప్పుడూ కూడా ఇలా నా పాదాలు తాకి ఆశీసులు తీసుకున్న దాఖలాలే లేవు. వైభవ్‌ను ఆరోజు రెచ్చగొట్టినందు వల్లే అలా ప్రవర్తించాడు’’ అని అనురా తెనాకూన్ పేర్కొన్నారు.కాగా శ్రీలంకతో సోమవారం నాటి మ్యాచ్ ‘టై’ కాగా.. సూపర్ ఓవర్లో భారత్ ఓడిపోయింది. ఈ క్రమంలో లంక ప్లేయర్ విశేన్.. వైభవ్‌ను ఉద్దేశించి ‘ఇంటికి వెళ్లిపో’ అంటూ రెచ్చగొట్టగా.. అతడూ తిరిగి బదులిచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరూ పరస్పరం నెట్టేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరికీ శిక్ష పడింది. ఇక ఈ ఘటన గురించి తాజాగా అనురా తెనాకూన్ వద్ద ప్రస్తావించగా.. పైవిధంగా స్పందించారు.చదవండి: వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?🚨 BIG TROUBLE FOR VAIBHAV & TILAK 😭Vaibhav Sooryavanshi and Tilak Varma could face a 1-2 match ban after their heated argument with the umpires 😳- Suryavanshi's physical altercation with Sri Lanka A players after the match might cost him dearly 😥 pic.twitter.com/Fc5zLXYL91— Jara (@JARA_Memer) June 15, 2026 -
వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఏమన్నాడంటే..
శ్రీలంక, భారత్, అఫ్గానిస్తాన్ ‘ఎ’ జట్ల మధ్య ముక్కోణపు సిరీస్ తుది అంకానికి చేరుకుంది. భారత్- శ్రీలంక టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. దంబుల్లా వేదికగా ఆదివారం ఇరుజట్ల మధ్య సిరీస్‌లో ఆఖరి అనధికారిక వన్డే సిరిస్ జరుగనుంది.ఈ నేపథ్యంలో శ్రీలంక- ‘ఎ’ జట్టు కెప్టెన్ సహాన్ అరాచిగే భారత స్టార్ వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. తాము ఫైనల్లో అతడిని టార్గెట్ చేయబోమని స్పష్టం చేశాడు. కాగా శ్రీలంక- భారత్ జట్ల మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ ‘టై’ కాగా.. సూపర్ ఓవర్ నిర్వహించారు.ఇందులో శ్రీలంక విజయం సాధించగా.. ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ఈ క్రమంలోనే లంక ప్లేయర్ కవ్వింపు చర్యలకు దిగగా.. వైభవ్ సూర్యవంశీ అతడి మీదకు దూసుకువెళ్లాడు. ఆ తర్వాత ఇద్దరూ పరస్పరం నెట్టేసుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. అంపైర్ వచ్చి ఆటగాళ్లను విడదీశాడు.ఈ ఘటన నేపథ్యంలో లంక ప్లేయర్‌తో పాటు వైభవ్కూ మొట్టికాయలు పడ్డాయి. ఇక ఫైనల్లో ఇరుజట్లు మరోసారి తలపడనున్న తరుణంలో వైభవ్ సూర్యవంశీ ఆట తీరు, అతడి ప్రవర్తనపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.ఈ విషయం గురించి శ్రీలంక కెప్టెన్ సహాన్ అరాచిగే వద్ద స్పోర్ట్స్‌స్టార్ ప్రస్తావించగా.. ‘‘మా వాళ్లు ఎవరినీ, ఏ విషయాన్ని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకోరు. మా ఆటను మేము ఆస్వాదిస్తున్నాము. సూపర్ ఓవర్ లాంటి సందర్భాల్లో ఆటగాళ్లు భావోద్వేగాలకు లోనుకావడం సహజం. ఆటలో ఇలాంటివి సాధారణం’’ అని స్పష్టం చేశాడు.ఇక భారత్‌తో ఫైనల్‌కు తాము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామన్న అరాచిగే.. ‘‘బ్యాటింగ్ విషయంలో మాకు ఎలాంటి సమస్యా లేదు. మా బౌలింగ్ విభాగంలో ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు మెరుగ్గా రాణిస్తున్నారు. మా జట్టు బాగుంది’’ అని పేర్కొన్నాడు. భారత్‌తో పోటీ కోసం తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.కాగా లీగ్ దశలో తొలుత శ్రీలంకపై భారత్ ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కగా.. రెండో మ్యాచ్‌లో లంక సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఇక ఇరుజట్లు అఫ్గానిస్తాన్‌పై గెలుపుతో ఫైనల్లో అడుగుపెట్టాయి. చదవండి: శ్రీలంక ఫైనల్ చేరిందిలా! -
SL vs AFG: ఫైనల్లో భారత్ ప్రత్యర్థి ఎవరంటే?
ముక్కోణపు సిరీస్‌లో అఫ్గానిస్తాన్- ‘ఎ’ ప్రయాణం ముగిసింది. శ్రీలంక- ‘ఎ’తో శుక్రవారం జరిగిన అనధికారిక వన్డేలో అఫ్గాన్ చిత్తుగా ఓడిపోయింది. శ్రీలంక వేదికగా భారత్, లంక, అఫ్గాన్ జట్ల మధ్య ట్రై సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై గెలిచిన భారత్.. తర్వాత అఫ్గాన్, శ్రీలంక చేతిలో ఓడిపోయింది. అయితే, లీగ్ దశలో చివరగా అఫ్గనిస్తాన్‌పై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఏకంగా 101 పరుగులతో గెలిచి.. ఫైనల్‌కు దూసుకువెళ్లింది.ఈ క్రమంలో దంబుల్లా వేదికగా మరో ఫైనల్ బెర్తు కోసం శ్రీలంక- అఫ్గాన్ తలపడ్డాయి. టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా శ్రీలంక బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో నిరోషన్ డిక్విల్లా అర్ధ శతకం (66)తో ఆకట్టుకోగా.. అవిష్క ఫెర్నాండో సెంచరీ (110)తో దుమ్ములేపాడు. వన్‌డౌన్ బ్యాటర్ నువానిదు ఫెర్నాండో 45 పరుగులతో రాణించగా.. లోయర్ ఆర్డర్లో రవిందు ఫెర్నాండో 25 రన్స్ రాబట్టాడు.ఫలితంగా శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 322 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. అఫ్గాన్ బౌలర్లలో ఫరీదూన్ దావూద్జాయ్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. ఫర్మానుల్లా సఫీ మూడు, మహ్మద్ ఇబ్రహీం ఒక వికెట్ దక్కించుకున్నారు.భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ జట్టుకు ఆదిలోనే షాకులు తగిలాయి. ఓపెనర్, కెప్టెన్ ఇమ్రాన్ మిర్, వన్‌డౌన్ బ్యాటర్ నూర్ ఉల్ రహ్మాన్‌ను దులాజ్ సముదిత డకౌట్ చేశాడు. ఇలాంటి తరుణంలో మరో ఓపెనర్ హసన్ ఎసాఖిల్ ఒంటరి పోరాటం (74) చేయగా.. బహీర్ షా 35, ఫర్మానుల్లా సఫీ 43 పరుగులతో రాణించారు. అయితే, మిగతా వారి నుంచి వీరికి పెద్దగా సహకారం లభించలేదు. దీంతో 42.5 ఓవర్లలో కేవలం 219 పరుగుల చేసి అఫ్గాన్ ఆలౌట్ అయింది. శ్రీలంక బౌలర్లలో దులాజ్ సముదిత్ ఐదు వికెట్లతో చెలరేగి అఫ్గాన్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. కుగాతస్ మతూలన్ మూడు, రవిందు ఫెర్నాండో, విజయకాంత్ వియస్కాంత్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఈ క్రమంలో 103 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన శ్రీలంక- ‘ఎ’ జట్టు ఫైనల్‌కు దూసుకుపోయింది. భారత్- ‘ఎ’తో ఆదివారం నాటి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఇరుజట్ల మధ్య ఫైనల్‌కు దంబుల్లా వేదిక. -
వైభవ్ వివాదం.. స్పందించిన బీసీసీఐ
గత కొన్నాళ్లుగా తన ఆట తీరుతో హాట్‌టాపిక్‌గా మారిన భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ.. ఇప్పుడు తన ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు. భారత్- ‘ఎ’ జట్టు తరఫున శ్రీలంక పర్యటనలో ఉన్న ఈ పిల్లాడు.. ముక్కోణపు వన్డే సిరీస్ ఆడుతున్నాడు.సూపర్ ఓవర్లో లంక విజయంఇందులో భాగంగా శ్రీలంక- ‘ఎ’ జట్టుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. దంబుల్లా వేదికగా ఈ మ్యాచ్‌లో శ్రీలంక భారత్- ‘ఎ’ జట్టుపై సూపర్ ఓవర్లో విజయం సాధించింది.నువ్వు ఇక ఇంటికి వెళ్లుఈ క్రమంలో లంక ప్లేయర్ విశేన్ హలంబగే.. భారత ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి.. ‘‘మ్యాచ్ అయిపోయింది. నువ్వు ఇక ఇంటికి వెళ్లు’’ అని రెచ్చగొట్టినట్లు తెలిసింది. దీంతో సహనం కోల్పోయిన వైభవ్.. అతడిపైకి దూసుకెళ్లాడు. విశేన్‌ను వెనక్కి నెట్టేయగా.. అతడూ వైభవ్‌ను తోసేశాడు.ఇంతలో లంక సీనియర్ ప్లేయర్ డిక్విల్లా ఇద్దరినీ విడదీసి.. వైభవ్‌ను అక్కడి నుంచి పంపించాడు. అయితే, వైభవ్ వెళ్తూ వెళ్తూ వేలు చూపించి బెదిరించినట్లు కనిపించింది. ఈ నేపథ్యంలో పదిహేనేళ్ల వైభవ్ వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్నాయి. అయితే, ఇది అనధికారిక మ్యాచ్ కాబట్టి ఐసీసీ పెద్దగా చర్యలు తీసుకునే అవకాశం లేనట్లు కనిపిస్తోంది.స్పందించిన బీసీసీఐఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా వైభవ్ సూర్యవంశీ వివాదం గురించి స్పందించింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఇండియా- ‘ఎ’ జట్టు కీలక టోర్నమెంట్ ఆడుతోంది. వర్దమాన క్రికెటర్లు టీమిండియాలోకి వచ్చేందుకు ఇదొక మంచి అవకాశం.ముక్కోణపు వన్డే సిరీస్ రూపంలో వారికి తమను తాము నిరూపించుకునే అవకాశం దొరికింది. కాబట్టి వాళ్లంతా కేవలం ఆటపై మాత్రమే దృష్టి పెట్టాలి. ఇతరత్రా విషయాలను పట్టించుకోకూడదు. అలా చేస్తే ఏకాగ్రత దెబ్బతింటుంది.ఆటపైనే దృష్టి పెట్టండిఅక్కడికి ఎందుకు వెళ్లారో ఆ విషయంపై మాత్రమే దృష్టి పెట్టండి. ప్రతి ఒక్కరు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా ఈ ట్రై సిరీస్‌లో ఇండియా విజేతగా నిలవగలదు. మా దృష్టి మొత్తం విజయం మీదే కేంద్రీకృతమై ఉంది. ఆటగాళ్లు అందుకు అనుగుణంగా నడుచుకోవాలి’’ అని దేవజిత్ సైకియా పరోక్షంగా భారత క్రికెటర్లను హెచ్చరించాడు.కాగా ఈ మ్యాచ్ సందర్భంగా సూపర్ ఓవర్ విషయంలో కెప్టెన్ తిలక్ వర్మ సైతం అంపైర్లతో వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. లంక, భారత్‌తో పాటు అఫ్గనిస్తాన్ కూడా ఈ ట్రై సిరీస్‌లో భాగమైంది. భారత్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడి రెండు ఓడిపోయింది. తద్వారా ఫైనల్ చేరే అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. -
పల్లెటూరోడు!.. పెంపకం సరిగ్గా లేదు.. వైభవ్‌పై సంచలన వ్యాఖ్యలు
అతి పిన్న వయసులోనే క్రికెట్ ప్రపంచంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఫార్మాట్లకు అతీతంగా విధ్వంసకర బ్యాటింగ్‌తో అలరిస్తూ నీరాజనాలు అందుకుంటున్నాడు. ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్.. ఏకంగా 776 పరుగులు సాధించాడు.పదిహేనేళ్ల వయసులోనే ఆరెంజ్ క్యాప్తద్వారా అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచి పదిహేనేళ్ల వయసులోనే ఆరెంజ్ క్యాప్ దక్కించుకుని చరిత్ర సృష్టించాడు వైభవ్ సూర్యవంశీ. ఈ నేపథ్యంలో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ టీమిండియాకు కూడా ఎంపికయ్యాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్‌లో పర్యటించే, ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత టీ20 జట్టులో అతడికి స్థానం దక్కింది.ముక్కోణపు వన్డే సిరీస్లోఇక ప్రస్తుతం భారత్- ‘ఎ’ తరఫున వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) శ్రీలంక పర్యటనలో ఉన్నాడు. భారత్, లంక, అఫ్గనిస్తాన్ ‘ఎ’ జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్‌తో ఈ ఓపెనింగ్ బ్యాటర్ బిజీగా ఉన్నాడు. అయితే, సోమవారం శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ సహనం కోల్పోయాడు. సూపర్ ఓవర్లో విజయం సాధించిన తర్వాత శ్రీలంక ప్లేయర్ విశేన్ హలంబగే వైభవ్, సూర్యాంశ్ షెడ్గేలను ఉద్దేశించి ఏదో అన్నాడు.దీంతో వైభవ్, సూర్యాంశ్ లంక ప్లేయర్లతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పరస్పరం నెట్టేసుకున్నారు. లంక ఆటగాడి ఛాతీపై చేయి వేసి వైభవ్ వెనక్కి నెట్టాడు. అంతేకాదు వెళ్తూ వెళ్తూ వేలు చూపిస్తూ బెదిరించినట్లుగా ఉన్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.🚨 BIG TROUBLE FOR VAIBHAV & TILAK 😭Vaibhav Sooryavanshi and Tilak Varma could face a 1-2 match ban after their heated argument with the umpires 😳- Suryavanshi's physical altercation with Sri Lanka A players after the match might cost him dearly 😥 pic.twitter.com/Fc5zLXYL91— Jara (@JARA_Memer) June 15, 2026వైభవ్ ప్రవర్తనపై విమర్శలుఈ నేపథ్యంలో వైభవ్ ప్రవర్తనపై విమర్శలు వస్తున్నాయి. చిన్న వయసులో ఇంత దూకుడు పనికిరాదని.. కాస్త ఓర్పుతో ఉండాలని మాజీ క్రికెటర్లు సద్విమర్శలు చేస్తున్నారు. అయితే, శ్రీలంక క్రికెట్ బోర్డు మీడియా మాజీ మేనేజర్ బ్రేన్ థామస్ మాత్రం శ్రుతిమించాడు. సూర్యవంశీతో పాటు భారత ప్రజల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు.పల్లెటూరోడు!.. పెంపకం సరిగ్గా లేదంటూ ఓవరాక్షన్‘‘సూర్యవంశీ.. అతడి చెత్త కోపానికి సంబంధించిన ఫుటేజీని ఇప్పుడే చూశాను. క్రికెట్లో యెల్లో, రెడ్ కార్డులు లేకపోవడం విచారకరం. ఒకవేళ మ్యాచ్ రిఫరీ గనుక ఈ కౌబాయ్‌ను తదుపరి మ్యాచ్ ఆడకుండా నిషేధం విధిస్తే బాగుంటుంది.అప్పుడే ఎలా ప్రవర్తించాలో అతడికి తెలిసి వస్తుంది. అయినా.. ఇండియాలోని గ్రామానికి చెందిన పిల్లాడి నుంచి ఇంతకంటే ఎక్కువగా ఏం ఆశించగలము? శ్రీలంకలో మాదిరి అక్కడి పిల్లల పెంపకం అంత గొప్పగా ఏమీ ఉండదు.హేయ్ సూర్యవంశీ నువ్వు గనుక సంతోషంగా లేకుంటే.. ఇండియాలో నిన్ను పొగుడుతూ నెత్తికెక్కించుకునే వాళ్ల దగ్గరికి వెళ్లిపో. మీ ఇంటికి పో. ఇది జెంటిల్మెన్ గేమ్’’ అంటూ బ్రేన్ థామస్ పరుష పదజాలంతో వైభవ్‌ను కించపరిచాడు. దీంతో భారత నెటిజన్లు సైతం థామస్‌కు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. ‘స్పెల్లింగ్ సరిగా రాయడం రాని నువ్వు చదువు గురించి మాట్లాడుతున్నావా? 15 ఏళ్ల పిల్లాడిపై ఇంత విషం చిమ్ముతావా?’ అంటూ చురకలు అంటిస్తున్నారు. కాగా ఈ సిరీస్‌లో వైభవ్ ఇప్పటికి మూడు మ్యాచ్‌లలో వరుసగా.. 14, 44, 21 పరుగులు చేశాడు.చదవండి: వైభవ్ సూర్యవంశీ.. నువ్విక ఇంటికి వెళ్లు!భారత జట్టుపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అక్కసు -
వైభవ్ సూర్యవంశీ.. నువ్విక ఇంటికి వెళ్లవచ్చు!
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్- ‘ఎ’ జట్టు చిక్కుల్లో పడింది. ఇప్పటికి మూడు మ్యాచ్‌లు ఆడిన తిలక్ వర్మ సేన.. రెండింట ఓడిపోయింది. తొలుత అఫ్గనిస్తాన్ -‘ఎ’ చేతిలో ఓడిన భారత జట్టు.. సోమవారం నాటి పోరులో లంక చేతిలో పరాజయం పాలైంది.దంబుల్లా వేదికగా ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు 265 పరుగులు చేయగా.. మ్యాచ్ టై అయింది. దీంతో సూపర్ ఓవర్ నిర్వహించగా.. భారత్ అనూహ్య రీతిలో ఓడిపోయింది. అయితే, వెలుతురులేమి కారణంగా తొలుత సూపర్ ఓవర్ నిర్వహించడం సాధ్యం కాదని అంతా భావించారు.వెలుతురులేమి సమస్యభారత జట్టు కెప్టెన్ తిలక్ వర్మ సైతం ఇదే విషయంపై అంపైర్లతో వాదించినట్లు సమాచారం. కానీ వెలుతురు మరీ తగ్గిపోతే సూపర్ ఓవర్ మొదలైనప్పటికీ మ్యాచ్ నిలిపివేస్తామని అంపైర్లు భారత శిబిరానికి చెప్పినట్లు క్రిక్‌బజ్ తన కథనంలో పేర్కొంది. అయితే, తొలుత శ్రీలంక బ్యాటింగ్ చేయగా.. భారత్ లక్ష్య ఛేదనకు దిగిన సమయంలో మరింతగా చీకటి అలుముకుంది.కొట్టుకోవడం ఒక్కటే తక్కువఅయినప్పటికీ సూపర్ ఓవర్ నిర్వహించగా.. భారత జట్టు ఓటమిపాలైంది. ఆద్యంతం ఆసక్తిరేపిన ఈ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ ముగిసిన తర్వాత భారత ఓపెనర్ వైభవ్ సూర్యవంశీతో శ్రీలంక ఆటగాళ్లు వ్యవహరించిన తీరు.. అందుకు వైభవ్ బదులిచ్చిన విధానం విమర్శలకు దారితీసింది.వైభవ్ సూర్యవంశీ.. నువ్విక ఇంటికి వెళ్లవచ్చు!వైభవ్- శ్రీలంక ఆటగాళ్లు పరస్పరం మీదమీదకు వెళ్తూ కొట్టుకున్నంత పనిచేశారు. అయితే, వారి మధ్య గొడవకు కారణం ఏమిటన్న అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. శ్రీలంక ప్లేయర్ విశేన్ హలంబగే వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి.. ‘‘మ్యాచ్ అయిపోయింది.. ఇక నువ్వు ఇంటికి వెళ్లిపోవచ్చు’’ అన్నట్లు సమాచారం.దీంతో కోపోద్రిక్తుడైన వైభవ్.. ‘‘ఏమంటున్నావు’’ అంటూ మీదకు వెళ్లగా ఇద్దరూ పరస్పరం నెట్టేసుకున్నారు. ఆ తర్వాత లంక సీనియర్ ప్లేయర్ ఒకరు వచ్చి ఇద్దరినీ విడదీశారు. అనంతరం ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకున్నారు. అయితే, ఈ విషయం గురించి శ్రీలంక డ్రెసింగ్‌రూమ్‌లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.క్షమాపణ అడుగుదాం!చీకటి పడిన తర్వాత కూడా సూపర్ ఓవర్లో ఆడేందుకు సహకరించిన భారత జట్టుకు ధన్యవాదాలు చెప్పడంతో పాటు.. వైభవ్ విషయంలో జరిగినదానికి క్షమాపణలు కోరాలనే చర్చ నడిచినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజా ఓటమితో భారత్ ఫైనల్ చేరే అవకాశాలు సన్నగిల్లాయి.చదవండి: 29 బంతుల్లోనే సెంచరీ చేసిన చహల్🚨 BIG TROUBLE FOR VAIBHAV & TILAK 😭Vaibhav Sooryavanshi and Tilak Varma could face a 1-2 match ban after their heated argument with the umpires 😳- Suryavanshi's physical altercation with Sri Lanka A players after the match might cost him dearly 😥 pic.twitter.com/Fc5zLXYL91— Jara (@JARA_Memer) June 15, 2026 -
అంపైర్లతో తిలక్ వర్మ, వైభవ్ వాగ్వాదం.. తిలక్‌ను తోసేసి..
భారత్- ‘ఎ’ జట్టు కెప్టెన్ తిలక్ వర్మ, యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అంపైర్లతో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా శ్రీలంక వేదికగా ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్- ‘ఎ’ జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది.దంబుల్లా వేదికగా గురువారం అఫ్గనిస్తాన్- ‘ఎ’ జట్టు చేతిలో ఓడిన భారత్.. సోమవారం శ్రీలంక చేతిలోనూ ఓటమి పాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో సరిగ్గా 265 పరుగులు చేయడంతో మ్యాచ్ ‘టై’ అయింది.అయితే, శ్రీలంక ఇన్నింగ్స్‌లో ఆఖరి బంతిని ఎదుర్కొన్న గుణశేఖర బాల్‌ను ఫ్లిక్ చేయకుండానే.. సింగిల్ తీసి రనౌట్ అయ్యాడు. దీంతో స్కోరు సమం కాగా.. భారత శిబిరం మాత్రం ఆ పరుగును ఎలా పరిగణిస్తారని అంపైర్లను ప్రశ్నించింది. మరోవైపు.. సూపర్ ఓవర్ నిర్వహించాల్సి ఉండగా అప్పటికే చీకటి పడిపోయింది.ఈ నేపథ్యంలో కెప్టెన్ తిలక్ వర్మ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. గుణశేఖర బంతిని బాదనపుడు తొలి పరుగును ఎలా లెక్కలోకి తీసుకుంటారని వాదించినట్లు కనిపించింది. ఆ సమయంలో వైభవ్ సూర్యవంశీ కూడా తిలక్‌కు మద్దతుగా వచ్చి నిలబడ్డాడు.Vaibhav Sooryavanshi sending off Captain Tilak Varma from arguing with Umpire.pic.twitter.com/067cYfhmo2— Maina Singh (@Maina_Singhx77) June 15, 2026అయితే, కాసేటికే తిలక్‌ను సముదాయించినట్లు వెనక్కి నెడుతూ అక్కడి నుంచి తీసుకెళ్లాడు. ఇక సూపర్ ఓవర్లో తిలక్ బంతిని అర్షద్ ఖాన్‌కు ఇవ్వగా.. లంక కెప్టెన్ సహన్ అరాచిగే తొలి బంతికే రెండు పరుగులు రాబట్టాడు. రెండో బంతి వైడ్‌కాగా.. తదుపరి మరో సింగిల్ వచ్చింది.మూడో బంతికి అవిష్క ఫెర్నాండో సింగిల్ తీయగా.. నాలుగో బంతికి అరాచిగే మూడు పరుగులు రాబట్టాడు. ఐదో బంతిని ఫెర్నాండో సిక్సర్‌గా మలచగా.. ఆరో బంతి నోబాల్ అయింది. దీంతో ఫ్రీ హిట్ రాగా.. మొత్తంగా లంక 16 పరుగులు చేసింది. అయితే, నోబాల్ విషయంలో కూడా తిలక్ వర్మ వాదనకు దిగాడు. అనంతరం భారత్ తరఫున వైభవ్ సూర్యవంశీ, సూర్యాంశ్ షెడ్గే బ్యాటింగ్‌కు దిగగా.. భారత్‌కు ఓటమే ఎదురైంది. A heated moment between Tilak Verma and Umpire. 🤯 pic.twitter.com/pe67HdkoHK— Qamar. (@Qamar5618) June 15, 2026చదవండి: శ్రీలంక ప్లేయర్‌ను నెట్టేసిన వైభవ్.. వీడియో వైరల్ -
శ్రీలంక ప్లేయర్‌ను నెట్టేసిన వైభవ్.. కోపంతో ఊగిపోతూ..
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా ఆతిథ్య శ్రీలంక- ‘ఎ’- భారత్ -‘ఎ’ జట్ల మధ్య మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. దంబుల్లాలో సోమవారం టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్‌కు దిగింది. లంక బౌలర్ల ధాటికి 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్ అయింది.మ్యాచ్ ‘టై’ఆల్‌రౌండర్లు సూర్యాంశ్ షెడ్గే (72), విప్రాజ్ నిగమ్ (51) అర్ధ శతకాల వల్ల భారత్‌కు ఈ మాత్రం స్కోరు సాధ్యమైంది. అయితే, విప్రాజ్ నిగమ్ పిచ్ మధ్యభాగంలో రెండుసార్లు పరిగెత్తడం వల్ల భారత్‌కు పది పరుగుల పెనాల్టీ పడింది. దీంతో 10/0తో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన శ్రీలంక.. నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి సరిగ్గా 265 పరుగులే చేసింది.ఫలితంగా మ్యాచ్ ‘టై’ కాగా.. సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 19 పరుగులు చేసింది. అనంతరం భారత్ తరఫున బ్యాటింగ్‌కు దిగిన వైభవ్ సూర్యవంశీ, సూర్యాంశ్ షెడ్గే లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమయ్యారు. తొలి బంతికి సూర్యాంశ్ రెండు పరుగులు తీయగా.. తర్వాత పరుగేమీ రాలేదు.భారత్ ఓటమిఆ తర్వాత వైభవ్ రెండు పరుగులు తీయగా.. మరుసటి బంతికి ఫోర్ బాదాడు. ఆఖరి బంతికి ఎనిమిది పరుగులు అవసరం కాగా.. వైభవ్ పరుగులేమీ తీయలేకపోయాడు. దీంతో భారత్ ఓటమి ఖరారైంది. ఈ క్రమంలో వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్న శ్రీలంక ప్లేయర్లలో ఎవరో వైభవ్‌ను ఏదో అన్నట్లుగా కనిపించింది.శ్రీలంక ప్లేయర్‌ను నెట్టేసిన వైభవ్దీంతో కోపంతో శ్రీలంక ఆటగాళ్లపై దూసుకువెళ్లిన పదిహేనేళ్ల వైభవ్ వారిని నెట్టేశాడు. ఇంతలో అంపైర్, సూర్యాంశ్ వచ్చి అతడిని వారి నుంచి విడదీశారు. ఆ తర్వాత కూడా వైభవ్ చేయి చూపిస్తూ కోపంతో ఊగిపోతూ మైదానం వీడాడు. అనంతరం ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకున్నారు. వైభవ్ దూకుడుగా వ్యవహరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.చదవండి: నరాలు తెగే ఉత్కంఠ.. ట్విస్టులు.. హైడ్రామా🚨 BIG TROUBLE FOR VAIBHAV & TILAK 😭Vaibhav Sooryavanshi and Tilak Varma could face a 1-2 match ban after their heated argument with the umpires 😳- Suryavanshi's physical altercation with Sri Lanka A players after the match might cost him dearly 😥 pic.twitter.com/Fc5zLXYL91— Jara (@JARA_Memer) June 15, 2026 -
IND vs SL: నరాలు తెగే ఉత్కంఠ.. ట్విస్టులే ట్విస్టులు.. ఆఖరికి
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్-‘ఎ’ జట్టుకు మరో పరాభవం ఎదురైంది. తొలుత అఫ్గనిస్తాన్ చేతిలో ఓడిన భారత జట్టు తాజాగా.. సోమవారం నాటి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలోనూ పరాజయం పాలైంది.ముక్కోణపు వన్డే సిరీస్‌కాగా శ్రీలంక వేదికగా ఆతిథ్య లంక, భారత్, అఫ్గనిస్తాన్ ‘ఎ’ జట్ల మధ్య జూన్ 9న ముక్కోణపు వన్డే సిరీస్ మొదలైంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ 8 పరుగుల తేడాతో గెలవగా.. రెండో మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్ భారత్‌పై 4 పరుగుల తేడాతో గట్టెక్కింది.ఇక మూడో మ్యాచ్‌లో శ్రీలంక అఫ్గనిస్తాన్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించగా.. నాలుగో మ్యాచ్‌లో భాగంగా సోమవారం భారత్- శ్రీలంక రెండోసారి తలపడ్డాయి. టాస్ గెలిచిన శ్రీలంక ఆహ్వానం మేరకు.. తిలక్ వర్మ సేన తొలుత బ్యాటింగ్‌కు దిగింది.265 పరుగులు చేసి ఆలౌట్గత మ్యాచ్‌లో ఆకట్టుకున్న భారత ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (11), వైభవ్ సూర్యవంశీ (21) ఈసారి నిరాశపరిచారు. ఫామ్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ ఈసారి 37 పరుగులకే పరిమితం కాగా.. కెప్టెన్ తిలక్ వర్మ కేవలం 23 పరుగులే చేశాడు. ఆయుశ్ బదోని 15, నిశాంత్ సింధు 6, అనుకుల్ రాయ్ 8, అర్షద్ ఖాన్ 2 పరుగులు చేసి నిష్క్రమించారు.అయితే, ఆల్‌రౌండర్లు సూర్యాంశ్ షెడ్గే 66 బంతుల్లో 72, విప్రాజ్ నిగమ్ 49 బంతుల్లో 51 పరుగులు సాధించి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరి అర్ద శతకాల కారణంగా భారత్ 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్ అయింది.పది పరుగుల పెనాల్టీశ్రీలంక బౌలర్లలో విజయకాంత్ వియస్కాంత్, మొహ్మద్ షిరాజ్ చెరో మూడు వికెట్లు తీసి సత్తా చాటగా.. కెప్టెన్ సహన్ అరాచిగే, వనుజా సహన్, కుగాతస్ మతూలన్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. అయితే, విప్రాజ్ నిగమ్ పరుగులు తీసే క్రమంలో రెండుసార్లు పిచ్ మధ్యభాగంలోకి వచ్చాడు. దీంతో భారత జట్టుకు పది పరుగుల పెనాల్టీ పడింది.Not every day you see 5 runs off a helmet hit😅 Watch #SLvIND in the #TalentTVCup, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV 📺 #SonySportsNetwork #SonyLIV #TeamIndia pic.twitter.com/2db4eMFJpL— Sony Sports Network (@SonySportsNetwk) June 15, 2026ఫలితంగా శ్రీలంక 10/0తో తమ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. అయితే, బౌలింగ్ సమయంలో బంతి వికెట్ కీపర్ హెల్మెట్‌కు తాకడంతో శ్రీలంకకు కూడా పెనాల్టీ పడింది.ఇదిలా ఉంటే.. లక్ష్య ఛేదనలో ఓపెనర్లు నిరోషన్ డిక్విల్లా (37), అవిష్క ఫెర్నాండో (22) మెరుగైన ఆరంభం అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్ విశేన్ హలంబగే (17) విఫలమయ్యాడు. కెప్టెన్ సహన్ అరాచిగే 8 పరుగులకే నిష్క్రమించగా.. అహాన్ విక్రమసింఘే 6 పరుగులు చేసి అవుటయ్యాడు.ఇలాంటి తరుణంలో నాలుగో నంబర్ బ్యాటర్ సదీర సమరవిక్రమ ఒంటరి పోరాటం చేశాడు. అతడికి తోడుగా వనుజా సహన్ (25) రాణించగా.. విజయకాంత్ వియస్కాంత్ 39 బంతుల్లో 18 పరుగులు చేయగలిగాడు.నరాలు తెగే ఉత్కంఠఇక 47 ఓవర్లు పూర్తయ్యేసరికి శ్రీలంక ఏడు వికెట్ల నష్టానికి 248 పరుగులు చేయగా.. విజయానికి 18 బంతుల్లో 18 పరుగులు అవసరమయ్యాయి. అప్పటికి సదీర సమరవిక్రమ 104 బంతుల్లో 88 పరుగుల వద్ద ఉన్నాడు.ఈ క్రమంలో 48వ ఓవర్లో ఆరు పరుగులు రాగా.. శ్రీలంక విజయానికి 12 బంతుల్లో 12 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో సదీర ఆచితూచి ఆడాడు. ఇలాంటి తరుణంలో యశ్ ఠాకూర్ నోబాల్‌తో 48వ ఓవర్ ఆఖరి బంతికి లంకకు ఫ్రీహిట్ రాగా.. గుణశేఖర ఫోర్ బాదాడు. దీంతో చివరి ఓవర్లో ఐదు పరుగులు అవసరం కాగా.. అర్షద్ ఖాన్ బంతితో రంగంలోకి దిగాడు.తొలి బంతికి పరుగులేమీ ఇవ్వని.. అర్షద్ రెండో బంతికి సదీర సమరవిక్రమను బౌల్డ్ చేశాడు. దీంతో 93 పరుగుల వద్ద సదీర నిష్క్రమించగా.. నాలుగు బంతుల్లో ఐదు పరుగులుగా లంక విజయ సమీకరణం మారింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన షిరాజ్ మూడో బంతికి సింగిల్ తీయగా.. ఆ తర్వాత గుణశేఖర సైతం సింగిల్ పూర్తి చేశాడు.దీంతో రెండు బంతుల్లో మూడు పరుగులు అవసరం కాగా.. అర్షద్‌పై ఒత్తిడి పెరిగింది. ఐదో బంతికి షిరాజ్ సింగ్ తీయడంతో సమీకరణం ఆఖరి బంతికి రెండు పరుగులుగా మారింది. అయితే, ఆఖరి బంతికి పరుగు తీసిన గుణశేఖర రెండో పరుగు కోసం రాగా.. రనౌట్ అయ్యాడు. దీంతో స్కోర్లు సమం అయ్యాయి.సూపర్ ఓవర్ ముగిసిందిలా..అయితే, గుణశేఖర షాట్ ఆడినట్లు కనిపించలేదని.. బంతి ఫ్లిక్ అయి కీపర్ వైపు వెళ్లింది కాబట్టి దీనిని రన్‌గా పరిగణించవద్దని భారత శిబిరం కోరగా.. ప్రతికూల నిర్ణయమే వచ్చింది. ఇక ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించాల్సి ఉండగా.. వెలుతురులేమి సమస్యగా మారింది. అయినప్పటికీ సూపర్ కోసం పట్టుపట్టగా.. ఫ్లడ్‌లైట్లు లేకుండానే శ్రీలంక తొలుత బ్యాటింగ్‌కు దిగింది.భారత కెప్టెన్ తిలక్ వర్మ అర్షద్ ఖాన్ చేతికి బంతినివ్వగా.. వైడ్, నోబాల్ రూపంలో భారత్ మూల్యం చెల్లించింది. శ్రీలంక 16 పరుగులు చేసింది. అయితే, నోబ్ విషయంలో తిలక్ వర్మ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. కానీ మ్యాచ్ కొనసాగింది. 17 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 9 పరుగులే చేయడంతో ఓటమి ఖరారైంది. -
IND vs SL: కొంపముంచేశాడు.. భారత్‌కు భారీ షాక్!
శ్రీలంక, అఫ్గనిస్తాన్‌లతో ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్- ‘ఎ’ ఇప్పటికి రెండు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. తొలుత ఆతిథ్య లంక జట్టుతో తలపడ్డ తిలక్ వర్మ సేన.. ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది.అఫ్గన్ చేతిలో ఓటమిఅనంతరం అఫ్గన్-‘ఎ’ జట్టుతో మ్యాచ్‌లో 349 పరుగుల మేర భారీ స్కోరు సాధించినప్పటికీ.. భారత జట్టుకు పరాభవం తప్పలేదు. వర్షం పదేపదే అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో అఫ్గన్ జట్టు డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం.. నాలుగు పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది.ఫలితంగా పాయింట్ల పట్టికలో అఫ్గనిస్తాన్ అగ్రస్థానానికి దూసుకుపోగా.. భారత్, శ్రీలంక రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. అయితే, తర్వాతి మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌పై గెలిచి లంక టాప్కు దూసుకెళ్లగా.. భారత్ రెండు, అఫ్గన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాయి.మరోసారి శ్రీలంకతోఈ ట్రై సిరీస్‌లో భాగంగా భారత్ సోమవారం నాటి మ్యాచ్‌లో మరోసారి శ్రీలంకతో తలపడుతోంది. దంబుల్లా వేదికగా టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన భారత్ 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్ అయింది.ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (11), వైభవ్ సూర్యవంశీ (21) విఫలం కాగా.. రుతురాజ్ గైక్వాడ్ 37, కెప్టెన్ తిలక్ వర్మ 23 పరుగులు చేశారు. మిగతా వారిలో ఆల్‌రౌండర్లు సూర్యాంశ్ షెడ్గే (72), విప్రాజ్ నిగమ్ (51) అర్ధ శతకాలతో రాణించడంతో భారత్‌కు గౌరవప్రదమైన స్కోరు దక్కింది.రెండుసార్లు అదే తప్పుఅయితే, విప్రాజ్ చేసిన పొరపాటు వల్ల భారత్ భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. భారత్-‘ఎ’ ఇన్నింగ్స్‌లో 35వ, 37వ ఓవర్లలో విప్రాజ్.. సింగిల్ తీసే క్రమంలో పిచ్ మధ్యలో పరిగెత్తాడు. ఎంసీసీ నిబంధన 41.14 ప్రకారం.. ఉద్వేశపూర్వకంగా గానీ, అనుకోకుండా గానీ పిచ్ మధ్యలో (ప్రొటెక్టెడ్ ఏరియా)కి వచ్చి డ్యామేజ్‌కు కారణమయ్యే పరిస్థితి తలెత్తితే తొలుత అంపైర్ సదరు స్ట్రైకర్‌ను హెచ్చరిస్తాడు.ఇదే తప్పు పునరావృతం చేస్తే బ్యాటింగ్ చేసే జట్టు స్కోరులో ఐదు పరుగుల మేర కోత విధిస్తారు. అయితే, ఇక్కడ తొలుత అనుకుల్ రాయ్ కూడా ఇలాంటి తప్పిదానికే పాల్పడగా.. అంపైర్ వార్నింగ్‌తో వదిలేశాడు. అయితే, విప్రాజ్ ఒకటి కాకుండా.. ఏకంగా రెండుసార్లు పిచ్ మధ్యలోకి రావడంతో మొత్తంగా భారత్‌కు పది పరుగుల మేర నష్టం కలిగింది.పది పరుగుల నష్టంఫలితంగా శ్రీలంక తమ ఇన్నింగ్స్‌ను 10/0తో మొదలుపెట్టింది. అంటే విప్రాజ్ తప్పిదం వల్ల ప్రత్యర్థికి అదనంగా పది పరుగుల మేర లాభం చేకూరింది. ఫైనల్ రేసులో ఉండాలంటే భారత్ తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఈ ఆల్‌రౌండర్ చేసిన తప్పిదం దేనికి దారితీస్తుందో చూడాలి మరి!!చదవండి: హోల్డర్ సిక్సర్ల వర్షం.. సిరీస్ విండీస్ కైవసం -
అఫ్గనిస్తాన్‌తో వన్డే.. వైభవ్ సూర్యవంశీ ఉంటాడు!
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ‘ఎ’ జట్టు తరఫున తొలి మ్యాచ్‌లోనే విఫలమయ్యాడు. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా శ్రీలంక- ‘ఎ’ జట్టుతో మంగళవారం నాటి వన్డేలో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు ఈ లెప్టాండర్ బ్యాటర్.వైభవ్ విఫలంఆరంభంలో బౌండరీలతో అలరించిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. కాసేపటికే అవుటై ఉసూరుమనిపించాడు. మొత్తంగా 12 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్ల సాయంతో కేవలం 14 పరుగులు చేసి మహ్మద్ షిరాజ్ బౌలింగ్‌లో నిష్క్రమించాడు. ఇక మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (11 బంతుల్లో 2) విఫలమయ్యాడు.Bossing From Ball 1 😎Vaibhav Sooryavanshi - making a 𝙍𝙐𝙏𝙃𝙇𝙀𝙎𝙎 entry on the world stage. 💥 #SonySportsNetwork #SonyLIV #TalentTVCup #TeamIndia #SLvIND pic.twitter.com/tLBkRO2ySF— Sony Sports Network (@SonySportsNetwk) June 9, 2026రుతురాజ్ గైక్వాడ్ సెంచరీసాధారణంగా ఓపెనర్‌గా బరిలోకి దిగే ప్రియాన్ష్ ఆర్య లంకతో మ్యాచ్‌లో మూడో స్థానంలో వచ్చి (32 బంతుల్లో 32) ఫర్వాలేదనిపించాడు. టాపార్డర్ విఫలమైనా నాలుగో నంబర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ(101)తో రాణించడంతో భారత్ గట్టెక్కింది. నిర్ణీత 50 ఓవర్లలో 277 పరుగులు చేయగలిగింది.అయితే, విజయం కోసం మాత్రం చివరి వరకు తీవ్రంగా పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. భారత్ విధించిన 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 47 ఓవర్లు ముగిసే సరికి లంక 261/6తో పటిష్టంగా ఉంది. ఆఖరి మూడు ఓవర్లలో 17 పరుగులే రావాల్సి ఉండగా.. విజయం లాంఛనమే అనుకున్నారు.బౌలర్ల విజృంభణతో..కానీ భారత బౌలర్లు ఆఖర్లో పది బంతుల్లోనే నాలుగు వికెట్లు కూల్చి ఆతిథ్య లంక జట్టు ఓటమిని శాసించారు. అర్షద్ ఖాన్, అనుకుల్ రాయ్, ఆయుశ్ బదోని, విప్రాజ్ నిగమ్ రెండేసి వికెట్లు తీయగా... అన్షుల్ కాంబోజ్ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ క్రమంలో తిలక్ వర్మ సేన ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించి.. సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది.ఇక తమ రెండో మ్యాచ్‌లో భాగంగా భారత్- ‘ఎ’ జట్టు గురువారం అఫ్గనిస్తాన్-‘ఎ’ జట్టుతో తలపడనుంది. ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పుపై చర్చ మొదలైంది. ఓపెనర్లుగా వైభవ్, ప్రభ్‌సిమ్రన్ విఫలమైనా వారిద్దరిని కొనసాగించాలని నాయకత్వ బృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తద్వారా లంకపై గెలిచిన తుది జట్టుతోనే భారత్ అఫ్గన్‌తో వన్డే బరిలోనూ దిగనున్నట్లు తేలిపోయింది.అఫ్గనిస్తాన్-‘ఎ’తో వన్డేకు భారత తుదిజట్టు (అంచనా)వైభవ్ సూర్యవంశీ, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాన్ష్ ఆర్య, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ (కెప్టెన్), ఆయుశ్ బదోని, అనుకుల్ రాయ్, సూయాన్ష్ షెడ్గే, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్, విప్రాజ్ నిగమ్.చదవండి: వాళ్లకే దిక్కు లేదు.. అతడిని ఎలా ఎంపిక చేస్తారు? -
గైక్వాడ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో టీమిండియా గెలుపు
శ్రీలంకలో జరుగుతున్న ఏ-జట్ల ముక్కోణపు టోర్నీలో టీమిండియా బోణీ కొట్టింది. డంబుల్లా వేదికగా శ్రీలంక-ఏతో ఇవాళ (జూన్ 9) జరిగిన మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రుతురాజ్ గైక్వాడ్ (101) సూపర్ సెంచరీతో, కెప్టెన్ తిలక్ వర్మ (60) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆఖర్లో ఆయుశ్ బదోని (24), సూర్యాంశ్ షేడ్గే (26 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లతో అలరించారు. మిగతా ఆటగాళ్లలో ప్రియాంశ్ ఆర్మ 32, ప్రభ్‌సిమ్రన్ సింగ్ 2, అనుకూల్ రాయ్ 1 (నాటౌట్) పరుగు చేయగా.. ఐపీఎల్ 2026 తర్వాత భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ 14 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.లంక బౌలర్లలో మొహమ్మద్ షిరాజ్ 2 వికెట్లు తీయగా.. కరుణరత్నే, సంకేత్, వనుజ సహాన్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక, సాహన్ అరచ్చిగే (74), నిరోషన్ డిక్వెల్లా (47), సమరవిక్రమ (46) రాణించడంతో ఓ దశలో (262/6) గెలుపు దిశగా దూసుకెళ్లింది. అయితే చివరి రెండు ఓవర్లలో (7 పరుగుల వ్యవధిలో) కేవలం 10 పరుగులు అవసరమైన సమయంలో శ్రీలంక వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయి 269 పరుగులకే ఆలౌటై, ఓటమిపాలైంది.అర్షద్ ఖాన్, ఆయుష్ బదోని, అనుకూల్ రాయ్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా, అన్షుల్ కంబోజ్ ఓ వికెట్ పడగొట్టింది. జూన్ 11న జరిగే తదుపరి మ్యాచ్‌లో భారత్-ఏ, ఆఫ్ఘనిస్తాన్-ఏ తలపడనున్నాయి. -
టీమిండియాలో చోటివ్వరా? శతకంతో కదం తొక్కాడు!
టీమిండియా స్టార్ రుతురాజ్ గైక్వాడ్ శతక్కొట్టాడు. శ్రీలంక-‘ఎ’ జట్టుతో తొలి వన్డేలో సెంచరీతో మెరిసి జట్టును ఆదుకున్నాడు. ముక్కోణపు వన్డే సిరీస్ ఆడేందుకు భారత్- ‘ఎ’ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో పాటు అఫ్గనిస్తాన్‌తో భారత్ వన్డేలు ఆడనుంది. ఈ క్రమంలో తొలుత శ్రీలంకతో పోరుకు భారత్ సిద్ధమైంది. దంబుల్లా వేదికగా మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ తిలక్ వర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.వైభవ్ విఫలం..అయితే, ఆదిలోనే శ్రీలంక భారత్‌కు షాకిచ్చింది. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (11 బంతుల్లో 2), వైభవ్ సూర్యవంశీ (12 బంతుల్లో 14)లను పెవిలియన్‌కు పంపి దెబ్బకొట్టింది. వన్‌డౌన్‌లో వచ్చిన ప్రియాంశ్ ఆర్య 32 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.శతకంతో కదంతొక్కాడుఇలాంటి తరుణంలో నాలుగో నంబర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ శతకంతో కదంతొక్కాడు. మొత్తంగా 114 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 101 పరుగులు సాధించాడు. కెప్టెన్ తిలక్ వర్మ (97 బంతుల్లో 60)తో కలిసి 185 బంతుల్లో 150 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నాడు.మిగిలిన వారిలో ఆయుశ్ బదోని 24, సూర్యాంశ్ షెడ్గే 26 పరుగులతో రాణించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయిన భారత్ 277 పరుగులు చేయగలిగింది. శ్రీలంక బౌలర్లలో మహ్మద్ షిరాజ్ రెండు వికెట్లు దక్కించుకోగా.. చమిక కరుణరత్నె, గరుక సంకేత్, వనుజా సాహన్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.అఫ్గనిస్తాన్‌తో వన్డేలకు ఎంపిక చేయని సెలక్టర్లుచివరగా సౌతాఫ్రికాతో వన్డేలో టీమిండియా తరఫున రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయినప్పటికీ ఆ తర్వాత సెలక్టర్లు అతడిని పక్కనపెట్టారు. అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో జూన్ సిరీస్‌కు రుతురాజ్‌ను ఎంపిక చేయలేదు.స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయపడగా.. అతడి స్థానంలో యశస్వి జైస్వాల్‌కు ఆఖరి నిమిషంలో చోటిచ్చారు. ఇలాంటి తరుణంలో రుతురాజ్ భారత్-ఎ తరఫున శతక్కొట్టడం విశేషం. దీంతో తనను విస్మరించిన టీమిండియా సెలక్టర్లకు రుతు బ్యాట్‌తోనే గట్టి సమాధానం ఇచ్చాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.చదవండి: కొడితే సెంచరీ.. లేదంటే డకౌట్! -
వన్డే సిరీస్‌కు అఫ్గనిస్తాన్ జట్టు ప్రకటన
ముక్కోణపు వన్డే సిరీస్‌కు అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) తమ జట్టును ప్రకటించింది. శ్రీలంక- ‘ఎ’, భారత్- ‘ఎ’ జట్లతో తలపడే అఫ్గన్- ‘ఎ’ జట్టు వివరాలను గురువారం వెల్లడించింది. ఈ జట్టుకు ఇమ్రాన్ మిర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని ఏసీబీ తెలిపింది. వికెట్ కీపర్ల కోటాలో నూర్ రహ్మాన్‌తో పాటు మొహమ్మద్ ఇషాక్లకు సెలక్టర్లు చోటిచ్చారు. బ్యాటింగ్ విభాగంలో హసన్ ఐసాఖిల్, ఖలీద్ తనీవాల్, ఐజాజ్ అహ్మద్జాయ్, బహీర్ షా మెహబూబ్, ఫైజల్ ఖాన్ షినోజదా స్థానం సంపాదించుకున్నారు.ఆల్‌రౌండర్ల జాబితాలో ఫర్మానుల్లా సూఫీ, షామ్స్ ఉర్ రహ్మాన్ ఎంపికయ్యారు. వీరు సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు కాగా.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఖలీల్ గుర్బాజ్‌కు కూడా సెలక్టర్లు ఈ జట్టులో చోటిచ్చారు.ఇక స్పిన్ దళంలో రిస్ట్ స్పిన్నర్ జహీర్ ఖాన్ పక్టీన్ ఒక్కడే ఉండగా.. పేస్ విభాగంలో మహ్మద్ ఇబ్రహీం, అబ్దుల్లా అహ్మద్జాయ్, ఫరీదూన్ దావూద్జాయ్ సేవలు అందించనున్నారు. కాగా జూన్ 9 నుంచి 21 వరకు శ్రీలంక వేదికగా ఈ ముక్కోణపు వన్డే సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్‌లో భారత్-‘ఎ’ జట్టుకు హైదరాబాదీ తిలక్ వర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అదే విధంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. దంబుల్లా వేదికగా భారత్- శ్రీలంక- అఫ్గన్ ‘ఎ’ జట్ల మధ్య మ్యాచ్‌లు జరుగనున్నాయి.శ్రీలంక- భారత్‌లతో ముక్కోణపు వన్డే సిరీస్‌కు అఫ్గన్-‘ఎ’ జట్టు ఇదేఇమ్రాన్ మిర్ (కెప్టెన్), నూర్ రహ్మాన్, మొహమ్మద్ ఇషాక్, హసన్ ఐసాఖిల్, ఖలీద్ తనీవాల్, ఐజాజ్ అహ్మద్జాయ్, బహీర్ షా మెహబూబ్, ఫైజల్ ఖాన్ షినోజదా, ఫర్మానుల్లా సూఫీ, షామ్స్ ఉర్ రహ్మాన్, జహీర్ ఖాన్ పక్టీన్, ఫరీదూన్ దావూద్జాయ్, మహ్మద్ ఇబ్రహీం, అబ్దుల్లా అహ్మద్జాయ్.సిరీస్ షెడ్యూల్ ఇదేజూన్ 9: భారత్ వర్సెస్ శ్రీలంకజూన్ 11: భారత్ వర్సెస్ అఫ్గన్జూన్ 13: అఫ్గన్ వర్సెస్ శ్రీలంకజూన్ 15: భారత్ వర్సెస్ శ్రీలంకజూన్ 17: భారత్ వర్సెస్ అఫ్గన్జూన్ 19: అఫ్గన్ వర్సెస్ శ్రీలంకజూన్ 12: ఫైనల్. -
భారత జట్టులో మార్పు.. కేకేఆర్ స్టార్‌కు లక్కీ ఛాన్స్
కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ అనుకుల్ రాయ్‌కు సువర్ణావకాశం వచ్చింది. భారత్-‘ఎ’ జట్టులో అతడు చోటు దక్కించుకున్నాడు. హర్ష్ దూబే స్థానంలో శ్రీలంక, అఫ్గనిస్తాన్ ‘ఎ’ జట్లతో జరిగే త్రైపాక్షిక సిరీస్‌కు అనుకుల్ రాయ్ ఎంపికయ్యాడు.హర్ష్ దూబే స్థానంలో..ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గురువారం వెల్లడించింది. కాగా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హర్ష్ దూబే ఇటీవలే టీమిండియా నుంచి పిలుపు అందుకున్న సంగతి తెలిసిందే. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో జరిగే ఏకైక టెస్టు, వన్డే సిరీస్‌కు సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు.కారణం ఇదేకాగా హర్ష్ దూబే జాతీయ జట్టుకు ఎంపిక కావడం ఇదే తొలిసారి. అయితే, అఫ్గన్‌తో సిరీస్ కంటే ముందు ప్రకటించిన భారత జట్టులో హర్ష్ దూబేకు చోటిచ్చారు సెలక్టర్లు. తాజాగా అతడి స్థానంలో అనుకుల్ రాయ్‌ను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.జార్ఖండ్‌కు చెందిన 27 ఏళ్ల అనుకుల్ రాయ్ స్పిన్ ఆల్‌రౌండర్. ఎడమచేతి వాటం గల ఈ ఆటగాడు ఐపీఎల్-2026లో కోల్‌కతాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటికి 13 మ్యాచ్‌లు ఆడి 43 పరుగులు చేయడంతో పాటు.. ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.తిలక్ వర్మ సారథ్యంలోఇదిలా ఉంటే.. శ్రీలంకలో జరిగే వన్డే ముక్కోణపు సిరీస్‌లో ఆతిథ్య జట్టుతో పాటు భారత్-‘ఎ’, అఫ్గన్-‘ఎ’ జట్లు పాల్గొంటాయి. జూన్ 9- జూన్ 21 మధ్య ఈ సిరీస్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు డంబుల్లా వేదిక. ఇక ఈ సిరీస్‌లో భారత జట్టుకు హైదరాబాదీ తిలక్ వర్మ కెప్టెన్‌గా ఎంపిక కాగా.. చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ తొలిసారిగా ‘ఎ’ జట్టులో చోటు దక్కించుకున్నాడు.ముక్కోణపు వన్డే సిరీస్‌కు భారత్-‘ఎ’ జట్టు (అప్డేటెడ్)తిలక్ వర్మ (కెప్టెన్), ప్రియాన్ష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (వైస్ కెప్టెన్), ఆయుశ్ బదోని, నిశాంత్ సంధు, సూయాన్ష్ షెడ్గే, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), కుమార్ కుశాగ్రా (వికెట్ కీపర్), విప్రాజ్ నిగమ్, యశ్ ఠాకూర్, యుధ్వీర్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్, అనుకుల్ రాయ్. -
Asia Cup 2026: ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్
మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్- 2026 టోర్నీలో భారత్ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. తొలి సెమీస్ మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ వేదికగా ఈ టీ20 టోర్నీ ఫిబ్రవరి 13న మొదలైంది.ఎనిమిది జట్లుగ్రూప్-ఎ నుంచి భారత్-ఎ, పాకిస్తాన్-ఎ.. యూఏఈ, నేపాల్ మహిళా జట్లు పాల్గొనగా.. గ్రూప్-బి నుంచి బంగ్లాదేశ-ఎ, శ్రీలంక-ఎ, థాయ్‌లాండ్, మలేషియా మహిళా జట్లు బరిలో నిలిచాయి. ఈ నేపథ్యంలో గ్రూప్-ఎ టాపర్లు భారత్, పాక్.. గ్రూప్-బి టాపర్లు బంగ్లాదేశ్, శ్రీలంక సెమీ ఫైనల్ చేరాయి.118 పరుగులకే ఆలౌట్‌ఈ క్రమంలో తొలి సెమీ ఫైనల్లో భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్లు శుక్రవారం తలపడ్డాయి. టెర్థాయ్ స్టేడియంలో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత బౌలర్ల ధాటికి తాళలేక 19.4 ఓవర్లలో కేవలం 118 పరుగులే చేసి లంక బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది.రాధా యాదవ్‌కు నాలుగుఓపెనర్లు సంజనా కావింది (31), హన్సిమ కరుణరత్నె (14)లతో పాటు సత్య సందీపణి (15), షాశిని గిమ్హాని (22) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో కెప్టెన్ రాధా యాదవ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. తనుజా కణ్వార్, ప్రేమా రావత్ చెరో రెండు వికెట్లు కూల్చారు. సైమా ఠాకూర్, మిన్ను మణి తలా ఒక వికెట్ పడగొట్టారు.బ్యాటింగ్‌లోనూ ఇరగదీసిన కెప్టెన్ ఇక లక్ష్య ఛేదనలోనూ భారత మహిళా జట్టు అదరగొట్టింది. ఓపెనర్లలో నందిని కశ్యప్ (13) నిరాశపరిచినా.. వ్రిందా దినేశ్ మెరుపు ఇన్నింగ్స్ (20 బంతుల్లో 42)తో ఆకట్టుకుంది. వన్‌డౌన్ బ్యాటర్ల అనుష్క శర్మ (18 బంతుల్లో 27) ఫర్వాలేదనిపించగా.. రాధా యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్ (18 బంతుల్లో 31 నాటౌట్)తో మెరిసింది.𝐅𝐢𝐧𝐚𝐥𝐬, 𝐡𝐞𝐫𝐞 𝐰𝐞 𝐜𝐨𝐦𝐞 🇮🇳Radha Yadav seals it with a boundary as India book their place in the final 😍#SonySportsNetwork #GirlsRising | DP World Women’s Asia Cup Rising Stars 2026 pic.twitter.com/vuMvuCPhUH— Sony Sports Network (@SonySportsNetwk) February 20, 2026ఫైనల్లో భారత్మిగిలిన వాళ్లలో తేజల్ హసాబ్నిస్ (3), మిన్ను మణి (2) విఫలమయ్యారు. అయితే, వ్రిందా వేసిన పునాదిపై అనుష్క, రాధా ఇన్నింగ్స్ నిర్మించడంతో 13.3 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 119 పరుగుల టార్గెట్‌ను భారత్ పూర్తి చేసింది. తద్వారా శ్రీలంకను ఐదు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది.లంక బౌలర్లలో షాశిని రెండు వికెట్లు తీయగా.. యసాంతి నిమంతికకు ఒక వికెట్ దక్కింది. ఇక ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దుమ్ములేపిన రాధా యాదవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. బంగ్లాదేశ్- పాకిస్తాన్ మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్లో విజేతతో భారత్ ఆదివారం నాటి టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకుంటుంది. చదవండి: పాకిస్తాన్ క్రికెటర్లకు భారీ షాక్!


