రెండో రోజు ముగిసిన ఆట‌.. లంక‌-ఏ జ‌ట్టు స్కోరెంతంటే? | SL-A Vs India-A Unofficial Test Sri Lanka Trail by 339 runs Day-2 Stumps | Sakshi
Sakshi News home page

రెండో రోజు ముగిసిన ఆట‌.. లంక‌-ఏ జ‌ట్టు స్కోరెంతంటే?

Jun 26 2026 7:09 PM | Updated on Jun 26 2026 7:39 PM

SL-A Vs India-A Unofficial Test Sri Lanka Trail by 339 runs Day-2 Stumps

ఇండియా-ఏతో జ‌రుగుతున్న‌ అన‌ధికారిక టెస్టులో శ్రీలంక‌-ఏ జ‌ట్టు ఎదురీదుతోంది. రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 31 ఓవ‌ర్ల‌లో 2 వికెట్లు కోల్పోయి 113 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం శ్రీలంక‌-ఏ జ‌ట్టు 339 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది. నువానిదు ఫ‌శ్రీ‌ర్నాండో (65 నాటౌట్‌), ఆషెన్ బండారా (18 నాటౌట్‌) క్రీజులో ఉన్నారు. 

ఇండియా-ఏ బౌల‌ర్ల‌లో అన్షుల్ కంబోజ్, య‌ష్ ఠాకూర్ చెరొక వికెట్ తీశారు. అంత‌క‌ముందు ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్‌ను 6 వికెట్ల న‌ష్టానికి 452 ప‌రుగుల వ‌ద్ద డిక్లెర్ చేసింది. కెప్టెన్ ధ్రువ్ జురేల్ (141 నాటౌట్) అజేయ సెంచ‌రీతో చెల‌రేగ‌గా, ఓపెన‌ర్ సాయి సుద‌ర్శ‌న్ (132) సెంచ‌రీతో రాణించాడు. చివ‌ర్లో షేక్ ర‌షీద్ (63) అర్ధ‌సెంచ‌రీ సాధించగా, హ‌ర్ష్ దూబే (30) ప‌ర్వాలేద‌నిపించాడు. లంక బౌల‌ర్ల‌లో చ‌మికా గుణ‌శేఖ‌రా మూడు వికెట్లు తీయ‌గా, దిలుమ్ సుదీరా రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement