మరో 2 రోజుల్లో హాకీ ప్రపంచకప్
యూరప్ జట్లదే ఆధిపత్యం
హాకీ పురుషుల ప్రపంచకప్‌లో ఓవరాల్‌గా 6 జట్లు ట్రోఫీని అందుకున్నాయి. వరల్డ్ కప్‌లో విజేతకు అందించే ట్రోఫీకి ఘనమైన చరిత్రే ఉంది. ఈ ట్రోఫీని పాకిస్తాన్‌కు చెందిన బషీర్ మూజిద్ డిజైన్ చేయగా పాకిస్తాన్ ఆర్మీ దీనిని రూపొందించింది. దీనికి ఒక బలమైన కారణం ఉంది. హాకీలో ప్రపంచకప్ నిర్వహించాలని ముందుగా ప్రతిపాదన చేసిన వ్యక్తి పాకిస్తాన్ ఎయిర్ మార్షల్ నూర్ ఖాన్ కాగా... తొలి వరల్డ్ కప్ 1971లో పాక్ వేదికగానే జరగాల్సింది. అయితే భారత్–పాక్ మధ్య యుద్ధ నేపథ్యం, అప్పటి పరిస్థితుల నేపథ్యంలో భారత్ అభ్యంతరం చెప్పింది. దాంతో చివరి నిమిషంలో వేదికను స్పెయిన్‌కు మార్చారు.
అయినా సరే పాక్ రూపొందించిన డిజైన్‌తో మాత్రం ట్రోఫీ సిద్ధం కావడంతో దానిని పాక్ రాయబారి మసూద్ అధికారికంగా ప్రపంచ హాకీ సమాఖ్య అధ్యక్షుడు రెనే ఫ్రాంక్‌కు అందజేశారు. అప్పటి నుంచి డిజైన్‌లో ఎలాంటి మార్పు లేకుండా ట్రోఫీ అలాగే కొనసాగుతోంది. 2018 వరల్డ్ కప్‌కు ముందు మాత్రం లండన్‌కు చెందిన బంగారు, వెండి ఆభరణాల తయారీ సంస్థ థామస్ లైట్ ట్రోఫీకి ప్రపంచ పటంలోని దేశాలు, ఖండాలు, మహా సముద్రాలు స్పష్టంగా కనిపించేలా మెరుగులు దిద్ది దానికి కొత్త తరహాలో మెరుపుదనం తెచ్చారు. – సాక్షి క్రీడావిభాగం
» పూల డిజైన్లతో చెక్కిన చిన్న సైజు వెండి పళ్లెంపై ప్రపంచ పటం (గ్లోబ్) కనిపిస్తుంది. దీనిని బంగారం, వెండితో తాపడం చేశారు. గ్లోబ్‌పై హాకీ స్టిక్ నమూనాను నిలపగా, ఏనుగు దంతాలతో డిజైనింగ్ చేసిన అడుగు భాగంపై ఈ మొత్తాన్ని ఉంచారు.
» అడుగు భాగాన్ని పక్కన పెడితే... అసలు ట్రోఫీ 4.75 అంగుళాల ఎత్తు ఉంటుంది. బేస్‌తో కలుపుకుంటే ఇది 25.59 అంగుళాలు ఉంటుంది.
» ట్రోఫీ మొత్తం బరువు 11,560 గ్రామ్‌లు. ఇందులో 895 గ్రామ్‌ల బంగారం, 6,815 గ్రామ్‌ల వెండి, 350 గ్రామ్‌లు ఏనుగు దంతపు మెటీరియల్, 3,500 గ్రామ్‌ల టేకు ఉన్నాయి.
» ప్రపంచ హాకీలో యూరోప్ జట్ల ఆధిపత్యం కనిపిస్తోంది. ఇప్పటి వరకు పురుషుల, మహిళల ప్రపంచకప్ టోర్నీ 15 సార్లు జరిగింది. పురుషుల విభాగంలో పాకిస్తాన్ జట్టు అత్యధికంగా నాలుగుసార్లు విజేతగా నిలిచింది. నెదర్లాండ్స్, జర్మనీ, ఆ్రస్టేలియా జట్లు మూడుసార్లు చొప్పున టైటిల్ అందుకోగా... భారత్, బెల్జియం జట్లు ఒక్కోసారి విన్నర్స్ ట్రోఫీని ముద్దాడాయి.

జర్మనీ జట్టు
ఈనెల 15 నుంచి జరగనున్న 16వ ప్రపంచకప్‌లో జర్మనీ జట్టు డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. మరోవైపు మహిళల ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్ జట్టుకు ఎదురునిలిచే జట్లు కనిపించడంలేదు. 15 సార్లు ప్రపంచకప్ జరగ్గా... నెదర్లాండ్స్ జట్టు ఏకంగా తొమ్మిదిసార్లు విశ్వవిజేతగా నిలిచింది. అర్జెంటీనా, ఆ్రస్టేలియా, జర్మనీ రెండుసార్లు చొప్పున టైటిల్ అందుకున్నాయి.

నెదర్లాండ్స్ జట్టు
మహిళల హాకీ వరల్డ్ కప్ ట్రోఫీ
డిజైనింగ్‌కు పెద్దగా ప్రత్యేక చరిత్ర లేదు. కానీ 1974లో నెదర్లాండ్స్ అందుకున్న తొలి ట్రోఫీ ‘13 సెంటీమీటర్ల’ఎత్తుతోనే ఉంది. దాంతో ఈ ట్రోఫీని సరదాగా ‘సలాడ్ బౌల్’ అని అందరూ పిలవడం మొదలు పెట్టారు! ఇప్పుడు మాత్రంభారీ సైజులో ఉన్న ట్రోఫీనే విజేతకు అందజేస్తున్నారు. 
మహిళల హాకీ వరల్డ్ కప్ ట్రోఫీ
డిజైనింగ్‌కు పెద్దగా ప్రత్యేక చరిత్ర లేదు. కానీ 1974లో నెదర్లాండ్స్ అందుకున్న తొలి ట్రోఫీ ‘13 సెంటీమీటర్ల’ ఎత్తుతోనే ఉంది. దాంతో ఈ ట్రోఫీని సరదాగా ‘సలాడ్ బౌల్’ అని అందరూ పిలవడం మొదలు పెట్టారు! ఇప్పుడు మాత్రంభారీ సైజులో ఉన్న ట్రోఫీనే విజేతకు అందజేస్తున్నారు.


