2013లో విడుదలైన 'ఇవన్ వేరే మాదిరి' (Ivan Veramathiri) అనే తమిళ చిత్రం ద్వారా సురభి సినీరంగ ప్రవేశం చేసింది.
2015లో వచ్చిన 'బీరువా' సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
తెలుగులో ఎక్స్ ప్రెస్ రాజా, జెంటిల్ మ్యాన్, శశి వంటి పలు చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది.
తన తొలి తమిళ చిత్రానికి గాను ఉత్తమ మహిళా డెబ్యూగా 'సైమా' (SIIMA) అవార్డు నామినేషన్ అందుకుంది.
తెలుగు సినిమాలలో నటించిన హీరోయిన్ సురభి చివరగా 2021లో వచ్చిన 'శశి'లో కనిపించింది.
ఇన్నాళ్లకు అల్లరి నరేశ్ 'రంభ ఊర్వశి మేనక'లో హీరోయిన్‌గా చేసింది.
మంగళవారం ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా ఇందులో కనిపించింది.


