breaking news
Actress
-
హైదరాబాద్‌లో షూటింగ్స్ సందడి
కొందరు సెట్స్‌లో... కొందరు నేచురల్ లొకేషన్స్‌లో... ఇలా హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తూ ఈ వారం అంతా బిజీ బిజీగా గడిపారు కొందరు స్టార్స్. ఆదివారం, దీపావళికి సోమవారం బ్రేక్ తీసుకోనున్న స్టార్స్ కొందరైతే... హాలిడే లేకుండా షూట్లో పాల్గొననున్న స్టార్స్ కూడా ఉన్నారు. ఇక గత ఆరేడు రోజులుగా హైదరాబాద్‌లో ఏయే సినిమాల షూటింగ్స్ జరి గాయో తెలుసుకుందాం.సెట్లో శంకరవరప్రసాద్... చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ‘పండక్కి వస్తున్నారు’ అనేది ఉపశీర్షిక. వెంకటేశ్ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (2025) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ మూవీలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రం తర్వాత చిరంజీవి, నయనతార జోడీగా కలిసి నటిస్తున్న సినిమా ఇది. అయితే ‘గాడ్‌ఫాదర్’ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా నయనతార నటించిన సంగతి తెలిసిందే. ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రంలో హీరో వెంకటేశ్, హీరోయిన్ కేథరిన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రం కీలక షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. అన్నపూర్ణ సెవన్ ఎకర్స్ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్లో చిరంజీవి, నయనతార, కేథరిన్, నటుడు సచిన్ ఖేడేకర్‌లతో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు అనిల్ రావిపూడి. చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి నటిస్తున్న పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం ఇది. ఈ మూవీలో చిరంజీవి–నయనతార భార్యాభర్తలుగా నటిస్తున్నారు. ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించిన ‘విశ్వంభర’ సినిమా 2026 వేసవిలో రిలీజ్ కానుంది.ఆర్ఎఫ్సీలో అడ్వెంచర్ మహేశ్‌బాబు హీరోగా అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతోన్న చిత్రం ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్). రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లతో ‘ఆర్ఆర్ఆర్’ (2022) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రధారులు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ నిర్మిస్తు్త్తన్నారు. ఈ సినిమా కోసం మహేశ్‌బాబు పొడవాటి హెయిర్ స్టైల్, గెడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్ అయిన సంగతి తెలిసిందే. ఆయన లుక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సినిమా నుంచి ఇప్పటివరకూ మహేశ్‌బాబుకి సంబంధించిన ఎలాంటి లుక్ అధికారికంగా చిత్రయూనిట్ విడుదల చేయలేదు. అయితే చిత్రీకరణ సమయంలోని కొన్ని ఫొటోలు లీక్ అయిన సంగతి తెలిసిందే.అమేజాన్ అడవుల నేపథ్యంలో భారీ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ మూవీ కోసం ప్రత్యేకంగా వేసిన సెట్లో మహేశ్‌బాబుతో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట రాజమౌళి. సూపర్ స్టార్ మహేశ్‌బాబు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో పాన్ వరల్డ్ రేంజ్లో నిర్మిస్తున్నారనే టాక్ నడుస్తోంది.ఈ చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటివరకు ఏ భారతీయ సినిమాకీ లభించని ఘనత ‘ఎస్ఎస్ఎమ్బీ 29’కి దక్కనుందని టాక్. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత కెన్యా దేశంలో ఈ సినిమా చిత్రీకరణని ΄్లాన్ చేశారు రాజమౌళి. ఇప్పటికే ఆయన అక్కడి లొకేషన్స్‌ని కూడా పరిశీలించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన మొదటి బిగ్ రివీల్ ఈ నవంబరులో రానుండటంతో అందరిలో ఎంతో క్యూరియాసిటీ నెలకొంది.యాక్షన్ ఎంటర్టైనర్... పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్‌సింగ్’ (2012) తర్వాత హీరో పవన్ కల్యాణ్– డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న ద్వితీయ చిత్రమిది. ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సీన్స్‌ని తెరకెక్కిస్తున్నారట హరీష్ శంకర్. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దాదాపు పూర్తి కావొచ్చిందట. నవంబరు చివరికల్లా చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని ఫిల్మ్‌నగర్ టాక్.హిట్ కాంబినేషన్లో... హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరిలది హిట్ కాంబినేషన్ అని చెపొ్చ్చు. వీరి ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన ‘దసరా’ (2023) మూవీ బ్లాక్‌బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ హిట్ కాంబోలో వస్తున్న ద్వితీయ చిత్రం ‘ది ΄్యారడైజ్’. ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో జరుగుతోంది. ఈ మూవీ కోసం వేసిన ప్రత్యేకమైన సెట్స్‌లో చిత్రీకరిస్తున్నారు. నానితో పాటు చిత్రంలోని ప్రధాన తారాగణం ఈ షెడ్యూల్లో పాల్గొంటోందట.ఈ చిత్రంలో నాని పాత్ర పేరు జడల్. గతంలో విడుదల చేసిన స్టిల్‌లో నాని రెండు జడలు వేసుకుని, పక్కా మాస్ లుక్‌లో కనిపించిన సంగతి తెలిసిందే. హీరో లుక్, స్టోరీ, టేకింగ్... ఇలా ప్రతిదీ వైవిధ్యంగా ఉండేలా తెరకెక్కిస్తున్నారట శ్రీకాంత్. ‘దసరా’ వంటి హిట్ కాంబినేషన్లో వస్తున్న ‘ది ΄్యారడైజ్’ పై ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో 2026 మార్చి 26న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది.ఓ వీరాభిమాని కథ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీ ఫేమ్ పి. మహేశ్‌బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ‘మిస్టర్ బచ్చన్, కింగ్డమ్’ చిత్రాల ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. ఉపేంద్ర, రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలుపోషిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి సిరీస్ ఫిలిమ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది.ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలోని రైల్వేస్టేషన్లో హీరో రామ్‌పై కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు మహేశ్‌బాబు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో జరుగుతోంది. రామ్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణంపై పలు సన్నివేశాలను తీస్తున్నారట దర్శకుడు. ఈ సినిమాలో ఉపేంద్ర ఓ స్టార్ హీరోగా నటిస్తుండగా ఆయన వీరాభిమాని పాత్రలో రామ్పోతినేని నటిస్తున్నారు. తన అభిమాన హీరో కోసం ఈ వీరాభిమాని ఏం చేశాడు? అన్నది తెలియాలంటే నవంబరు 28 వరకు వేచి ఉండాలి. ఈ చిత్రం అదే రోజు విడుదల కానుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో... హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్సీ 24’ (వర్కింగ్ టైటిల్). ‘తండేల్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకోవడంతో పాటు తొలిసారి వంద కోట్ల క్లబ్లో చేరారాయన. ‘తండేల్’ వంటి హిట్ మూవీ తర్వాత ‘విరూపాక్ష’ (2023) మూవీ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న ‘ఎన్సీ 24’ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. బాపినీడు సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. నాగచైతన్య, మీనాక్షీ చౌదరితో పాటు ఇతర నటీనటులు ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారట. ‘తండేల్’లో ఫుల్ మాస్ లుక్‌లో కనిపించిన నాగచైతన్య ‘ఎన్సీ 24’లో స్టైలిష్‌గా సరికొత్త లుక్‌తో కనిపించనున్నారు. అదే విధంగా మీనాక్షీ చౌదరి కూడా సరికొత్త పాత్రలో కనిపిస్తారు. రాయలసీమ నేపథ్యంలో... అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. ‘ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది’ కాదు అనేది ఉపశీర్షిక. కిరణ్ అబ్బవరం హీరోగా ‘వినరో భాగ్యము విష్ణుకథ’ వంటి విజయవంతమైన సినిమా తెరకెక్కించిన మురళీ కిశోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ‘లెనిన్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని బూత్ బంగ్లాలో జరుగుతోంది. అఖిల్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు మురళీ కిశోర్.రాయలసీమ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా కోసం పొడవాటి హెయిర్, గెడ్డంతో మాస్ లుక్‌లోకి మారిపోయారు అఖిల్. ఈ సినిమాలో తొలుత శ్రీలీల హీరోయిన్గా ఫిక్స్ అయ్యారు. అయితే ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. శ్రీలీల స్థానాన్ని ‘మిస్టర్ బచ్చన్, కింగ్డమ్’ సినిమాల ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే రీప్లేస్ చేశారట. అయితే హీరోయిన్ విషయంపై అధికారిక ప్రకటన చేయలేదు మేకర్స్.యాక్షన్... ఎమోషన్ విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘పూరిసేతుపతి’ (వర్కింగ్ టైటిల్) అనే పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్గా నటిస్తున్నారు. టబు, విజయ్ కుమార్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పూరి కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోల్లా నిర్మిస్తున్నారు. యాక్షన్, ఎమోషన్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. విజయ్ సేతుపతి, సంయుక్త, టబు, విజయ్‌కుమార్, బ్రహ్మాజీలతో పాటు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట పూరి జగన్నాథ్. తనదైన మాస్, కమర్షియల్ స్టయిల్లో ఒక యునిక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారట పూరి. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.ముచ్చింతల్‌లో మహాకాళి ‘హనుమాన్’ మూవీ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘మహాకాళి’. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో రూపొందిన తొలి చిత్రం ‘హను–మాన్’ (2024) పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో 12 సూపర్ హీరోస్ సినిమాలను తెరకెక్కించనున్నట్లు గతంలో ప్రకటించారు ప్రశాంత్ వర్మ. అందులో భాగంగా ఈ యూనివర్స్‌లో రూపొందుతోన్న ద్వితీయ చిత్రం ‘మహాకాళి’. ప్రశాంత్ వర్మ క్రియేటర్, షో రన్నర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు.ఆర్కే దుగ్గల్ సమర్పణలో ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై రివాజ్ రమేశ్ దుగ్గల్ నిర్మిస్తున్నారు. అమ్మవారి చుట్టూ అల్లుకున్న కథతో బెంగాల్ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోందని సమాచారం. నటీనటుల వివరాలను మేకర్స్ ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించలేదు. అయితే అసురుల గురువు శుక్రాచార్యుడిగా బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా నటిస్తున్నట్లు ప్రకటించి, ఆయన ఫస్ట్ లుక్‌ని మాత్రం ఇటీవల రిలీజ్ చేశారు మేకర్స్. ఇదిలా ఉంటే.. ‘మహాకాళి’ సినిమా షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో జరుగుతోంది. నటీనటులపై కీలకసన్నివేశాలు తీస్తున్నారు మేకర్స్. డిసెంబరు నెలాఖరుకి ఈ సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. పైన పేర్కొన్న సినిమాలే కాదు... మరికొన్ని చిత్రాలు కూడా ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవి గణపతి హోమం (ఫోటోలు)
-
ట్రెడిషనల్ శారీ లుక్‌లో ‘కూలి’ బ్యూటీ..
-
తిరుమల స్వామివారి సేవలో కృతీ శెట్టి, వెంకీ కుడుముల (ఫోటోలు)
-
‘మిత్ర మండలి’ నిహారిక.. సందడి
దేశంలో అగ్రగామి ఇన్ఫ్లుయెన్సర్ అయిన వర్థమాన నటి నిహారిక ఎన్ఎం (Niharika NM) హైదరాబాద్ నగరంలోని శరత్ సిటీ మాల్లో ఆదివారం సందడి చేశారు. ప్రస్తుతం ‘మిత్ర మండలి’ సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా అరంగేట్రం చేస్తూ తెలుగు ప్రేక్షకుల ముందుకు మరికొద్ది రోజుల్లో రానున్నారు.ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రాండెడ్ ఫుట్ వేర్ బాటా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సంస్థ తన కొత్త కలెక్షన్లో భాగంగా ‘బ్రైటర్ మూమెంట్స్’ పేరుతో కొత్త ప్రొడక్ట్‌ను శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో (Sarath City Capital Mall ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నిర్వహించిన ఇంటరాక్టివ్ గేమ్స్, పండుగ పోటీలు నిహారిక ఉత్సాహంగా పాల్గొన్నారు. అభిమానులతో సెల్పీలు దిగుతూ మీట్–అండ్–గ్రీట్ (Meet and Greet) కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: ముద్దుల కోడలితో నీతా అంబానీ.. బుల్లి బ్యాగ్ ధర ఎన్ని కోట్లో తెలుసా? -
మెరిసేదంతా బంగారమే..ఎన్నాళ్లకెన్నాళ్లకు,ఈమెను గుర్తుపట్టారా?
-
చిరునవ్వు ఉన్నచోటే ప్రశాంతత ఉంటుందన్న ఐష్ (ఫోటోలు)
-
ఇంద్రకీలాద్రి కొండపై హీరోయిన్ లయ పూజలు (ఫొటోలు)
-
ఓల్డ్ ట్రెడిషన్ ఎప్పటికీ ఫాలో అవుతా.. శారీలో నటి పూర్ణ అందాలు (ఫొటోలు)
-
సోలో ట్రిప్ జ్ఞాపకాల్లోనే అనసూయ (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ స్టార్స్ (ఫొటోలు)
-
మేకప్ లేకున్నా భాగ్యశ్రీ అందంగా ఉందే! (ఫొటోలు)
-
సినీ నటిపై దాడి.. యువకుడిపై కేసు
హైదరాబాద్: తన అపార్ట్మెంట్ ముందు పార్కింగ్ స్థలంలో ఓ వ్యక్తి బహిరంగ మూత్ర విసర్జన చేస్తుండగా ఇదేమిటని అడిగినందుకు ఆ యువకుడు కోపంతో సినీనటితో పాటు ఆమె పీఏపై దాడి చేసి గాయపర్చిన ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎల్లారెడ్డిగూడలో నివసించే సినీ నటి ఈ నెల 1వ తేదీన దైవ దర్శనం చేసుకుని ఇంటికి వస్తుండగా అపార్ట్మెంట్ ముందు పార్కింగ్ స్థలంలో దేవేందర్ అనే వ్యక్తి బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్నాడు. దీంతో నటి పీఏ బయటకు వచ్చి దేవేందర్‌ను ఇదేమి పద్ధతి అని నిలదీశాడు. దీంతో దేవేందర్ ఆగ్రహంతో ఊగిపోతూ మరో ఇద్దరు మహిళలతో కలిసి న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ దాడికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో దేవేందర్ తనపై కూడా దాడి చేశాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పంజగుట్ట పోలీసులు దాడికి పాల్పడ్డ నిందితుడిపై బీఎన్ఎస్ సెక్షన్ 74, 115 (2), 79, 292 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భర్తతో 'కూలీ' ఫేమ్ రెబా మోనిక.. మాలీవుడ్ సెలబ్రిటీలతో ఇలా (ఫొటోలు)
-
తల్లి సురేఖావాణితో కలిసి సుప్రీత దసరా సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
జ్యూవెలర్లీ ఎగ్జిబిషన్.. తళుక్కుమన్న స్టార్ హీరోయిన్స్ (ఫొటోలు)
-
నివేదా థామస్ చీరలో చాలా సింపుల్‌గా (ఫొటోలు)
-
'గూఢచారి 2' హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఆపిల్ ఫార్మ్‌లో హీరోయిన్ రీతూ వర్మ (ఫొటోలు)
-
'జాతిరత్నాలు' ఫరియా దుబాయి ట్రిప్ జ్ఞాపకాలు (ఫొటోలు)
-
క్రైమ్ థ్రిల్లర్ మూవీలో యషిక.. 25 రోజుల్లోనే ప్లాన్!
తనదైన అందాలతో యువతను ఆకట్టుకునే బ్యూటీ యషిక ఆనంద్. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం టాస్. ఈ మూవీలో తేజస్విని మరో హీరోయిన్గా నటిస్తోది. ఈ చిత్రంలో రత్నం మౌళి కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సగు పాండియన్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రం షూటింగ్ ఇటీవల తమిళనాడులోని కోవెల్ పట్టిలో పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది.ఈ సందర్భంగా టాస్ దర్శకుడు మాట్లాడుతూ.. 'ఇది ఒక ప్రాంతంలో జరిగే 3 హత్యల నేపథ్యంలో సాగే మర్డర్ మిస్టరీ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ఆ హత్యల నేపథ్యం ఏమిటి? వాటికి నటి యషిక ఆనంద్‌కు ఉన్న సంబంధం ఏంటి అన్న అంశాలతో సాగే క్రైమ్ థ్రిల్లర్ కథగా తెరకెక్కిస్తున్నాం. ఈ మూవీ షూటింగ్‌ను కోవెల్ పట్టి, బిరుదు నగర్, సాత్తూర్ ప్రాంతాల్లో నిర్వహించి 25 రోజుల్లో పూర్తి చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు చెప్పారు. అదేవిధంగా చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో గాని 2026 ప్రథమార్ధంలో గాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు' చెప్పారు.ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్మముందని దర్శకుడు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఈ చిత్రానికి శాంతన్ అనిభజనే సంగీతం అందిస్తుండగా.. ధర్మ దురై సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ మూవీలో విజయ్ టీవీ ఫేమ్ యోగి ,షన్న, సంజయ్ శంకర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని బ్లాక్ డైమండ్ స్టూడియో పతాకంపై సయ్యద్ జాఫర్ నిర్మిస్తున్నారు. -
బ్లాక్ స్కర్ట్‌లో మ్యాడ్ స్క్వేర్ బ్యూటీ రెబా మోనికా అందాలు (ఫొటోలు)
-
లండన్ ఫ్యాషన్ వీక్.. అందంగా ముస్తాబైన హీరోయిన్ (ఫొటోలు)
-
అక్కడ అన్ని బూతు సినిమాలే.. మా పేరెంట్స్ నటించవద్దని చెప్పారు: సినీ నటి
ఇంటర్నెట్ పుణ్యమా అని అడల్ట్ సినిమాలు కుప్పలు తెప్పలుగా అందుబాటులోకి వచ్చేశాయి. కానీ ఒకప్పుడు అంటే షుమారుగా 3 దశాబ్ధాల క్రితం ఈ పరిస్థితి లేదు. పెద్దలకు మాత్రమే అంటూ ఊరించే ఎ సర్టిఫికెట్ సినిమాల కోసం సదరు అడల్ట్ మూవీ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసేవారు. అలాంటి వారందరికీ ఆంగ్ల చిత్రాల తర్వాత మన దేశీయ భాషలో ఒకే ఒక చిత్ర పరిశ్రమ నుంచి సాంత్వన లభించేది. అది...ప్రస్తుతం దేశంలోనే అత్యంత వైవిధ్య భరిత చిత్రాలకు కేరాఫ్‌గా ఉన్న మళయాల చిత్ర పరిశ్రమ. అదే ఒకప్పుడు బూతు చిత్రాలకు చిరునామాగా ఉండేది. అప్పట్లో షకీలా తదితర అడల్ట్ మూవీ స్టార్స్ మళయాళ సినిమాలపై స్పష్టమైన ఆధిపత్యాన్ని చూపించేవారు. దాంతో దేశవ్యాప్తంగా బి గ్రేడ్ సినిమాలంటే మళయాళమే అనే గుర్తింపు వచ్చేసింది. బహుశా ఇప్పటి తరానికి పెద్దగా తెలియని ఆనాటి విషయాలను గుర్తుకు వచ్చేలా చేసింది తమిళ సినీనటి ఛార్మిల(Charmila)మలయాళ సినిమాలో ఒకప్పుడు ప్రముఖ తారగా వెలుగొందింది నటి చార్మిల, ఆ పరిశ్రమలో చేరడానికి ముందు తనకు ఆ పరిశ్రమ పట్ల ఉన్న అభిప్రాయం గురించి వెల్లడించింది, గతంలో అంటే 1980– 1990 మధ్య కాలంలో మళయాళ చిత్రపరిశ్రమ ఖ్యాతి బి–గ్రేడ్ చిత్రాలవెల్లువలో కొట్టుకుపోయిందని చెప్పిందామె. ఇటీవల ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన కెరీర్ ప్రారంభంలో మలయాళ సినిమా ఆఫర్లను అంగీకరించకుండా తన తల్లిదండ్రులు అడ్డుకున్నారని గుర్తుచేసుకుంది. ‘‘అప్పట్లో, మలయాళ సినిమా అంటే కేవలం బి–గ్రేడ్ చిత్రాలను మాత్రమే నిర్మిస్తుందని చాలా మంది భావించేవారు, అందుకే నా తల్లిదండ్రులు ఆ పరిశ్రమకు నన్ను పంపడానికి ఇష్టపడలేదు, అందుకే మొదటి ఆఫర్ వచ్చినప్పుడు భయపడ్డా. పేరొందిన దర్శకులు సంప్రదించినప్పుడు కూడా నటించడానికి నిరాకరించాను’’ అంటూ వెల్లడించారామె.కేరళ లోపల కాకుండా ఆ రాష్ట్రం బయట థియేటర్లలో నడిచిన మళయాళ సినిమాల వల్లనే మళయాళ చిత్ర పరిశ్రమకు ఈ రకమైన కళంకం అంటిందని ఆమె అభిప్రాయపడింది. పక్కరాష్ట్రాల్లోని జనం మలయాళ చిత్రాల గురించి మాట్లాడినప్పుడు, వారికి గుర్తుకు వచ్చేది ఎ–సర్టిఫికేట్ సినిమాలు, వాటి పోస్టర్లు మాత్రమే. ‘వారికి మళయాళ వినోదం అంటే డ్రగ్స్ లేడీస్,‘ అంటూ చెప్పిందామె. సీనియర్ నిర్మాత కె బాలాజీ తన కుటుంబాన్ని ఒప్పించిన తర్వాతే బాలాజీ అల్లుడు నేటి సూపర్ స్టార్ మోహన్ లాల్‌తో తాను నటించానంది. మలయాళ సినిమా అంతా బి–గ్రేడ్ టైప్ కాదని, మోహన్ లాల్ మమ్ముట్టి వంటి ప్రధాన నటులు మంచి చిత్రాలలో మాత్రమే పనిచేస్తారని ఆయన అర్ధం అయేలా చెప్పడంతో చార్మిల తన తొలి మలయాళ ప్రాజెక్ట్‌లో మోహన్ లాల్ సరసన నటించింది, తరువాత క్లాసిక్‌ల ద్వారా ఆ భాషలో కెరీర్‌కు బాటలు వేసుకుంది.ఆ కాలపు మళయాళ చిత్ర పరిశ్రమ గురించి గుర్తు చేసుకుంటూ ‘‘ బి–గ్రేడ్ సినిమాలో పనిచేసిన నటులు ‘పూర్తిగా భిన్నమైన వర్గానికి‘ చెందినవారని వారు బస చేసిన హోటళ్ళు మా హోటళ్ళలా ఉండేవి కావు‘ అని ఆమె చెప్పింది, తరువాత వారిలో చాలామంది సినిమాలను విడిచిపెట్టారని, కొందరు వివాహం తర్వాత విదేశాలకు వెళ్లారని లేదా ఇతర భాషలలో గ్లామర్ పాత్రలకు మారారని ఆమె చెప్పింది.ఆ సమయంలో మలయాళ సినిమా చుట్టూ వివాదాలు ఎలా ఉన్నా చార్మిల సినిమాలు స్వర్ణ యుగంలో భాగంగా పరిగణన పొందాయి. ఆమె తమిళనాడులో జన్మించినప్పటికీ, ’ధనం’లో గ్రామీణ అమ్మాయి థంకమ్ పాత్రలో తన నటనతో మలయాళ ప్రేక్షకుల హదయాలను గెలుచుకుంది. తరువాత ఆమె ’అంకుల్ బన్ ’, ’కేళి’, ’ప్రియపెట్ట కుక్కు’ మోహన్ లాల్, జయరామ్, వినీత్ వంటి తారలతో కలిసి పనిచేసింది. ప్రస్తుతం ఆమె తమిళ సినిమాల్లో పనిచేస్తోంది. అయినప్పటికీ ఆమె అత్యంత ప్రశంసలు పొందిన చిత్రాలు మాత్రం ఆమె మలయాళ విహారయాత్రలుగా మిగిలిపోయాయి. నటుడు బాబు ఆంటోనీ ఆ తరువాత విడాకులు తీసుకున్న నటుడు హోస్ట్ కిషోర్ సత్యతో ఆమె గత సంబంధాలు సహా ఆమె వ్యక్తిగత జీవితం ఆమె స్క్రీన్ కెరీర్ లాగే అందరి దృష్టినీ ఆకర్షించింది. -
నా పుట్టినరోజునాడే తను చనిపోయాడు.. జీవితంలో మర్చిపోలేని విషాదం!
శుభాకాంక్షలు, గోకులంలో సీత, పెళ్లి పందిరి, స్నేహితులు, ప్రేయసి రావే.. ఇలా పలు సినిమాలతో తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎదిగింది రాశి (Raasi). ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసింది. హీరోయిన్‌గానే కాకుండా నిజం మూవీ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలోనూ యాక్ట్ చేసి మెప్పించింది. చాలాఏళ్ల తర్వాత మళ్లీ ఆమె సినిమాలతో బిజీ అవుతోంది.చిరంజీవితో సినిమాతాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రాశి అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంది. నేను చెన్నైలోని తెలుగు కుటుంబంలో పుట్టి పెరిగాను. నాకు మేకప్ వేసుకోవడం నచ్చదు, సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఒక్కసారి యాక్టింగ్ ఫీల్డ్‌లోకి వచ్చాక నేను చేసే పనిని ఎప్పుడూ తక్కువ చూడలేదు. నా పనిని నేనెంతో గౌరవిస్తాను. ఇండస్ట్రీకి వచ్చేవారికి కూడా పనిని గౌరవించడం నేర్చుకోమని చెప్తాను. పెళ్లికూతురినయ్యాక..ఇకపోతే నేను చిరంజీవితో ఓ సినిమా చేయాల్సింది. ఆర్తి అగర్వాల్‌కు, నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కానీ దర్శకుడితో చిరంజీవి విభేదాల కారణంగా సినిమా ఆగిపోయింది. రంగస్థలం సినిమాలో సుకుమార్.. రంగమ్మత్త పాత్ర ఆఫర్ చేశారు. ఆ పాత్రలో నన్ను జనాలు యాక్సెప్ట్ చేస్తారో, లేదోనన్న భయంతో రిజెక్ట్ చేశాను. నాకు 2004లో పెళ్లయింది. ఆ సమయంలోనే సౌందర్య చనిపోయింది. నన్ను పెళ్లికూతురిని చేశాక బెంగళూరులో సౌందర్య సంతాపసభకు వెళ్లొచ్చాను.మొదటిరోజే అలాంటి సీన్పెళ్లయిన పదేళ్లకు పాప పుట్టింది. అదే నా జీవితంలో మ్యాజికల్ మూమెంట్. డైరెక్టర్ తేజ 'నిజం' సినిమాలో నా క్యారెక్టర్‌ను పాజిటివ్‌గా చెప్పాడు. తీరా సెట్‌కు వెళ్లాక మొదటి రోజే నాతో చేయకూడని సీన్ చేయించారు. అసలు ఈ సీన్ ఉంటుందనే చెప్పలేదు. చాలా హర్టయ్యాను, ఈ సినిమా చేయనన్నాను. నాకున్న ఇమేజ్‌కు ఈ సినిమా చేశానంటే కెరీర్ ఇంతటితో ఆగిపోతుంది, నా వల్ల కాదన్నాను. వాళ్లు చేయాల్సిందేనన్నారు. అయిష్టంగానే మూవీ పూర్తి చేశాను. క్షమించలేనుడబ్బింగ్ సమయంలో తేజ ఫోన్ చేసి సారీ చెప్పారు. ఈ మూవీ విషయంలో మాత్రం ఆయన్ను నేను క్షమించలేను. ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్‌ను మర్చిపోవాలనుకుంటున్నారు? అన్న ప్రశ్నకు తేజ పేరే చెప్తాను. ఆ సినిమా వల్ల నిజంగానే కెరీర్ దెబ్బతింది. నా పుట్టినరోజే నాన్న చనిపోయాడు. అది మర్చిపోలేని విషాదం. నా కెరీర్ మొదట్లో నాన్న నాకు అసిస్టెంట్‌లా, టచప్ బాయ్‌లా పనిచేసేవారు అంటూ రాశి ఎమోషనలైంది.చదవండి: ప్రముఖ నటుడి మరణం.. రోడ్డుపై డ్యాన్స్ చేసిన భార్య -
టాలీవుడ్ హీరోయిన్ కాశీ టూర్ (ఫొటోలు)
-
బీచ్‌లో చెల్లితో సాయిపల్లవి సరదాగా ఇలా (ఫొటోలు)
-
కోర్ట్ జంట రిపీట్.. ఈసారి బావమరదళ్లుగా..(ఫోటోలు)
-
ముఖంపై అవాంచిత రోమాలు.. అదే కారణమన్న తెలుగు నటి
మగరాయుడి గెటప్‌తోనే పాపులర్ అయింది తెలుగింటి అమ్మాయి స్నిగ్ధ (Actress Snigdha Nayani). 'అలా మొదలైంది' సినిమాతో తన కెరీర్ మొదలైంది. మేం వయసుకు వచ్చాం, దమ్ము, ప్రేమ ఇష్క్ కాదల్, చందమామ కథలు, టైగర్, కళ్యాణ వైభోగమే, ఓ బేబీ ఇలా అనేక సినిమాలు చేసింది. ప్రస్తుతం స్నిగ్ధ సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు.. కానీ సింగర్‌గా పలు షోలు చేస్తోంది. ఈ నటి రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా మగరాయుడిలాగే ఉంటుంది. ఆ కారణం వల్లే ముఖంపై..పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉండిపోతానని చెప్తుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్నిగ్ధకు ఓ ఇబ్బందికర ప్రశ్న ఎదురైంది. ముఖంపై గడ్డాలు, మీసాలు రావడానికి గల కారణమేంటని యాంకర్ అడిగాడు. అందుకు స్నిగ్ధ స్పందిస్తూ.. షూటింగ్స్‌కు వెళ్తున్న సమయంలోనే పీసీఓడీ వచ్చింది. దీని వల్ల అవాంచిత రోమాలు వస్తుంటాయి. అలాగే చాలామంది అమ్మాయిలకు ఫేషియల్ హెయిర్ ఉంటుంది. గుండు గీయించుకున్నా..నెలకోసారి థ్రెడింగ్ చేసుకుంటారు. ఇది చాలా మామూలు విషయం. అయితే నేను షూటింగ్స్‌కు వెళ్లినప్పుడు నా ముఖంపై హెయిర్ కనిపిస్తుందనగానే వెంటనే మేకప్‌మ్యాన్ లేజర్‌తో గీకేసేవారు. దానివల్ల అదింకా ఎక్కువైంది. మరో విషయమేంటంటే.. ఎంబీఏ అయిపోగానే నేను గుండు చేయించుకున్నాను. అప్పుడతడు నా తలపై నుంచి ముఖం మీది దవడ వరకు బ్లేడుతో గీకాడు. అప్పటినుంచే అవాంచిత రోమాలు రావడం చిన్నగా మొదలైంది. మా అమ్మక్కూడా ఫేషియల్ హెయిర్ ఉంది అని స్నిగ్ధ చెప్పుకొచ్చింది.చదవండి: సల్మాన్ ఒక గూండా, నీచుడు.. ఆ దర్శకుడిని చితకబాదిన స్టార్ హీరో -
దివినుంచి దిగి వచ్చిన తారలా ‘పరదా’ బ్యూటీ (ఫోటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మీనాక్షి చౌదరి (ఫోటోలు)
-
లండన్ వేకేషన్లో హీరోయిన్ శ్రీలీల (ఫొటోలు)
-
హీరో ధనుష్ 'ఇడ్లీ కొట్టు' ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్‌గా బ్రిగిడ సాగా (ఫొటోలు)
-
సాగర తీరాన అక్కినేని కోడలు శోభిత ధూలిపాల (ఫొటోలు)
-
అనసూయ ‘పవర్ డ్రెస్సింగ్’..చీర ఇలా కూడా కడతారా? (ఫోటోలు)
-
'కోర్ట్' బ్యూటీ.. దుబాయిలో ఫ్యామిలీతో ఎంజాయ్ (ఫొటోలు)
-
మతిపోగొడుతున్న అనుపమ అందం (ఫొటోలు)
-
ఫిల్టర్ లేకుండా డింపుల్ హయాతి.. బర్త్‌డే స్పెషల్ (ఫోటోలు)
-
చీరలో మెరిసిపోతున్న అలనాటి స్టార్ హీరోయిన్ మీనా (ఫొటోలు)
-
అత్తారిల్లు, భర్తతో టూర్స్.. నటి అభినయ ఆగస్ట్ మూమెంట్స్ (ఫొటోలు)
-
బ్లాక్ శారీలో మెరిసిపోతున్న యాంకర్ శ్రీముఖి (ఫోటోలు)
-
వచ్చే ఏడాది త్వరగా వచ్చేయ్ వినాయక.. శ్వేతాబసు ప్రసాద్ పోస్ట్ (ఫొటోలు)
-
సోషల్ మీడియాలో నటి ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు.. పోలీసులకు ఫిర్యాదు!
సినీ నటి రంగ సుధపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు వైరల్ కావడంతో ఆమె పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. రాధాకృష్ణ అనే వ్యక్తి తనపై అసభ్యకర పోస్టులు చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. తాము కలసి ఉన్న సమయంలో తీసిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫొటోలు బయట పెడతానని గతంలోనే రాధాకృష్ణ తనను బెదిరించాడని ఆమె ఫిర్యాదులో తెలిపారు. ప్రస్తుతం కొన్ని ట్విటర్ పేజీలతో పాటు రాధకృష్ణ కూడా అసభ్యకర పోస్టులు చేస్తున్నాడని నటి ఫిర్యాదులో ప్రస్తావించారు. దీంతో పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు షేర్ చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. గతంలో రాధకృష్ణతో రంగ సుధ రిలేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇద్దర మధ్య విబేధాలు రావడంతో గతకొంత కాలంగా రంగ సుధ.. రాధకృష్ణకు దూరంగా ఉంటుంది. ఈ కోపంతోనే ఆయన సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిస్తున్నట్లు తెలుస్తోంది. మోడల్ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన రంగ సుధ.. చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. మలయాళంలో హీరోయిన్ గా మారింది. తేరి మేరీ అనే మలయాళ సినిమాలో ఆమె సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈమెకు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 9 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. -
సినీ నటి రంగ సుధపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు
-
పెళ్లి కాకుండా IVF.. విషాదంలో నటి భావన
ప్రముఖ కన్నడ నటి, నృత్యకారిణి భావన రామన్న ఇటీవల ఐవీఎఫ్ విధానంలో గర్భం దాల్చి కవల పిల్లలకు జన్మనివ్వడం తెలిసిందే. అలా ఆమె మాతృత్వ ఆనందాన్ని చవిచూస్తున్న తరుణంలో విషాద సంఘటన జరిగింది. కవల పిల్లల్లో ఒకరు కన్నుమూశారు. 40 ఏళ్ల భావన ఒంటరి మహిళగానే ఉన్నారు. అయితే మాతృత్వానికి అది అడ్డంకి కాదని చాటాలనే లక్ష్యంతో ఐవీఎఫ్ విధానంలో గర్భం చేసినట్లు ఇటీవల సోషల్ మీడియాలో ప్రకటించడంతో పాటు ఫోటోలను కూడా అప్లోడ్ చేశారు.దీంతో అభిమానులు, స్త్రీవాదులు హర్షం వ్యక్తంచేశారు. రెండు వారాల క్రితం ఒకే కాన్పులో కవలలకు జన్మనిచ్చారు. ఇద్దరు అడ పిల్లలు జన్మించగా ఒక శిశువు శనివారంనాడు అస్వస్థతతో మృతి చెందినట్లు తెలిసింది. ఒక శిశువు అరోగ్యవంతురాలిగా ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 20, 30 ఏళ్లలో తాను తల్లి కావడం గురించి ఆలోచించలేదని, కానీ 40లలో ఆ భావన వెంటాడిందని ఆమె చెప్పేవారు. అందుకే పిల్లల కోసం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో ఆమె విషాదంలో మునిగిపోయారు. -
కూతురి పుట్టినరోజు వేడుకల్లో హీరోహీరోయిన్ జోడీ (ఫొటోలు)
-
శారీలో బిగ్‌బాస్ బ్యూటీ దివి అందాలు (ఫోటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ శ్వేత పరషార్ (ఫోటోలు)
-
హీరోయిన్ మృణాల్ ఠాకుర్ ఆగస్ట్ జ్ఞాపకాలు (ఫొటోలు)
-
ప్రెగ్నెన్సీ ప్రకటించిన ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)
-
మాల్దీవుల్లో కాజల్ గ్లామర్ ట్రీట్.. ఫ్యామిలీ కలిసి (ఫొటోలు)
-
హీరో అసభ్య ప్రవర్తన.. నేను ఎంజాయ్ చేయలేదు, ఏడ్చా.. ఇండస్ట్రీకో దండం!
భోజ్‌పురి స్టార్ హీరో పవన్ సింగ్ (Pawan Singh).. ఓ స్టేజీపై హీరోయిన్ అంజలి రాఘవ్ (Anjali Raghav)ను అసభ్యంగా తాకిన వీడియో సోషల్ మీడియాలో ఎంతగానో వైరలయింది. హీరోయిన్ అసౌకర్యంగా ఫీలవుతున్నా సరే పదేపదే అతడు ఆమె నడుము తాకాడు. లోలోపల ఇబ్బందిగా ఫీలైనప్పటికీ పైకి మాత్రం అంజలి నవ్వుతూ కనిపించింది. లక్నోలో 'సైయా సేవా కరే' పాట ప్రమోషనల్ ఈవెంట్లో ఈ ఘటన జరిగింది.ఏదో ఉందని చెప్పడం వల్లే..తాజాగా ఈ ఘటనపై అంజలి స్పందించింది. కొందరు నన్ను కూడా తప్పుపడుతున్నారు. ఆమె కూడా ఎంజాయ్ చేస్తోంది, నవ్వుతోంది అని కామెంట్స్ చేశారు. నా అనుమతి లేకుండా ఇష్టమొచ్చినట్లు టచ్ చేస్తుంటే నేను సంతోషపడతానా? దాన్ని ఆస్వాదిస్తానని ఎలా అనుకుంటున్నారు? పవన్ సింగ్ నా నడుము దగ్గర ఏదో ఉందన్నారు. నేను నా చీర తట్టుకుందేమో, లేదా జాకెట్ ట్యాగ్ ఏమైనా ఉందా? అని చూస్తున్నాను. ఏడ్చేశా..ట్యాగ్ అలాగే మర్చిపోయానా? ఏంటి? అని నవ్వాను. ఈవెంట్ అయిపోయాక నా టీమ్‌ను పిలిచి చూడమంటే అక్కడ ఏమీ లేదన్నారు. అప్పుడు నాకు బాధ, కోపం రెండూ తన్నుకుంటూ వచ్చాయి. ఏడ్చేశాను కూడా! అనుమతి లేకుండా ఏ ఆడపిల్లను కూడా తాకకూడదు. అందులోనూ అసభ్యంగా తాకితే అస్సలు ఒప్పుకోము. ఇకపై నేను భోజ్‌పురిలో పని చేయను అని చెప్పుకొచ్చింది. అంజలి రాఘవ్.. భోజ్‌పురిలో ప్రైవేట్ సాంగ్స్‌లో యాక్ట్ చేసింది. అలాగే పలు చిత్రాల్లోనూ నటించింది. View this post on Instagram A post shared by Anjali Raghav (@anjaliraghavonline) View this post on Instagram A post shared by Anjali Raghav (@anjaliraghavonline) చదవండి: ఎంగేజ్మెంట్తో మారిపోయా.. ఇకపై అలాంటి సీన్లు చేయను: విశాల్ -
తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ (ఫొటోలు)
-
కోలీవుడ్ క్యూట్ కపుల్ స్నేహ- ప్రసన్నకుమార్ (ఫొటోలు)
-
చీరలో మెరిసిన మెగా డాటర్.. చాలా స్పెషల్ (ఫోటోలు)
-
ఫ్రెండ్స్‌తో థాయిలాండ్ వెళ్లిన హీరోయిన్ (ఫొటోలు)
-
భయపెట్టే అందాల భామలు
హీరోయిన్లు అంటే తెరపై అందంగా కనిపించడం... హీరోలతో పాటల్లో ఆడిపాడటం... అనే ధోరణి ప్రేక్షకుల్లో ఉంది. అయితే ఇటీవల ట్రెండ్ మారింది. తామేమీ తక్కువ కాదంటూ లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు పచ్చజెండా ఊపుతున్నారు కథానాయికలు. యాక్షన్ సినిమాల్లోనే కాదు... ప్రేక్షకులను భయపెట్టే హారర్ చిత్రాల్లో నటించేందుకు కూడా ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ప్రస్తుతం రష్మికా మందన్నా, తమన్నా, పూజా హెగ్డే, నిధీ అగర్వాల్, అనూ ఇమ్మాన్యుయేల్, ఆండ్రియా, సమీరా రెడ్డి... వంటి పలువురు అందమైన భామలు థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఆ విశేషాలు...డబుల్ ధమాకా ‘ఛలో’ (2018) సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు హీరోయిన్ రష్మికా మందన్నా. తొలి చిత్రంతోనే హిట్ అందుకున్న ఈ కన్నడ బ్యూటీ టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అంతేకాదు... తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటున్న రష్మిక నేషనల్ క్రష్‌గా మారారు. ఇప్పటివరకూ తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించిన రష్మిక ఒకేసారి రెండు చిత్రాల ద్వారా ప్రేక్షకులను భయపెట్టనున్నారు. ‘థామా, మైసా’ వంటి హారర్ సినిమాల ద్వారా ఆడియన్స్‌కి డబుల్ ధమాకా ఇవ్వనున్నారామె.రష్మికా మందన్న లీడ్ రోల్లో ‘మైసా’ అనే సినిమా రూపొందుతోంది. డైరెక్టర్ హను రాఘవపూడి శిష్యుడు రవీంద్ర పుల్లె ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. అజయ్, అనిల్ సయ్యపురెడ్డి ఈ సినిమానిపాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఇటీవల తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేశారు. గోండు తెగల ప్రపంచాన్ని ఆధారంగా చేసుకుని ఎమోషనల్, హారర్, యాక్షన్ థ్రిల్లర్‌గా ‘మైసా’ రూపొందుతోంది. ఈ చిత్రంలో రష్మిక గోండు మహిళగా కనిపించనున్నారు.అదే విధంగా రష్మికా మందన్నా లీడ్ రోల్లో నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘థామా’. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా ప్రధానపాత్ర పోషిస్తున్నారు. మడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన ‘స్త్రీ’ యూనివర్స్‌లో నాలుగో చిత్రంగా ‘థామా’ని నిర్మిస్తున్నారు దినేష్ విజయన్. గతంలో వచ్చిన ‘భేడియా, స్త్రీ, ముంజ్య’ చిత్రాలు ప్రేక్షకులను బాగా అలరించడంతో ‘థామా’పై భారీ అంచనాలున్నాయి. అతీంద్రియ శక్తులతో కూడిన ఈ హారర్ రొమాంటిక్ చిత్రంలో తడ్కాపాత్రలో రష్మిక నటిస్తున్నారు. హారర్, మిస్టరీ అండ్ లవ్‌స్టోరీగా రూపొందుతోన్న ‘థామా’ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. సిద్ధంగా ఉండండి ఓ వైపు హీరోయిన్గా, మరోవైపు లీడ్ రోల్స్ చేస్తూనే ప్రత్యేకపాటల్లోనూ సందడి చేస్తుంటారు తమన్నా. తెలుగులో ఆమె లీడ్ రోల్లో నటించిన ‘ఓదెల 2’ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 17న విడుదలైంది. ఆ తర్వాత ఆమె మరో తెలుగు చిత్రానికి పచ్చజెండా ఊపకపోయినా బాలీవుడ్లో మాత్రం వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం నాలుగు సినిమాల్లో తమన్నా నటిస్తుండగా అందులో ‘వి వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ అనే చిత్రంలో ప్రధానపాత్రలో నటిస్తున్నారామె.అరుణాభ్ కుమార్, దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా కీలకపాత్ర పోషిస్తున్నారు. మైథలాజికల్ హారర్, జానపద థ్రిల్లర్ జానర్లో అడవి నేపథ్యంలో ఈ చిత్రాన్ని బాలాజీ మోషన్ పిక్చర్స్, ది వైరల్ ఫీవర్ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి.ఆ మధ్య ఈ సినిమా టీజర్ విడుదలైంది. రాత్రి వేళ ఎర్రటి చీర ధరించిన తమన్నా కారు దిగి అడవిలోకి వెళ్లి, అక్కడ ఓ దీపం వెలిగించడం, అక్కడ ఏదో దృశ్యాన్ని చూసి కళ్లు పెద్దవి చేయడం వంటి విజువల్స్ ఈ వీడియోలో కనిపించాయి. ‘అడవి పిలిచింది. నేను సమాధానం చెప్పాను. ‘వి వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’లో భాగం కావడం థ్రిల్లింగ్‌గా ఉంది. ఆ అడ్వంచర్‌ను బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు సిద్ధంగా ఉండండి’ అంటూ తమన్నా పేర్కొన్న విషయం విదితమే. ఈ సినిమా 2026 మే 15న విడుదల కానుంది.తొలిసారి హారర్ చిత్రంలో... ‘మజ్ను, అజ్ఞాతవాసి, శైలజారెడ్డి అల్లుడు, ఊర్వశివో రాక్షసివో, రావణాసుర’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు అనూ ఇమ్మాన్యుయేల్. ఇప్పటివరకూ కమర్షియల్ సినిమాల్లో సందడి చేసిన ఈ బ్యూటీ తొలిసారి ‘బూమరాంగ్’ అనే హారర్ చిత్రంలో నటిస్తున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.లండన్ గణేశ్, డా. ప్రవీణ్ రెడ్డి ఊట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హారర్ నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్‌ని లండన్‌లోని పలు ప్రదేశాల్లో జరిపారు. ‘‘సైకలాజికల్ థ్రిల్లర్, హారర్ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘బూమరాంగ్’. కర్మ సిద్ధాంతం ఆధారంగా ఈ చిత్రకథ సాగుతుంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, టీజర్ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది’’ అని మేకర్స్ తెలిపారు. ఇప్పటివరకు కమర్షియల్ హీరోయిన్గా సందడి చేసిన అనూ ఇమ్మాన్యుయేల్ ‘బూమరాంగ్’ ద్వారా ప్రేక్షకులను ఏ మేర భయపెడతారో వేచి చూడాలి.మొదటిసారి... ‘సవ్యసాచి’ (2018) సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు నిధీ అగర్వాల్. ఆ తర్వాత ‘మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్, హీరో, హరి హర వీరమల్లు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారామె. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ది రాజా సాబ్’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. నిధీ అగర్వాల్ మొదటిసారి ఓ గ్రిప్పింగ్ హారర్ సినిమాలో నటించేందుకు పచ్చజెండా ఊపారు. ఈ సినిమా ద్వారా ఎన్. నిఖిల్ కార్తీక్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.పుప్పాల అప్పలరాజు నిర్మిస్తున్న తొలి చిత్రమిది. ఈ నెల 17న నిధీ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని ప్రకటించి, ఓ స్పెషల్ పోస్టర్ని రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘నిధీ అగర్వాల్ నటిస్తున్న తొలి గ్రిప్పింగ్ హారర్ థ్రిల్లర్ సినిమా ఇది. ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. టాప్ టెక్నికల్ స్టాండర్డ్స్, హై ప్రోడక్షన్ వాల్యూస్‌తో ఈ మూవీ ఆడియన్స్‌కి విజువల్లీ స్ట్రాంగ్, ఎమోషనల్‌గా ఇంటెన్స్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోంది. ఈ సినిమా నిధీ కెరీర్లో ఓ మైలురాయి అవుతుంది. మా ప్రోడక్షన్ హౌస్‌లో ఆమె జాయిన్ అవ్వడం మాకు ఆనందం కలిగిస్తోంది. బిగ్ స్క్రీన్‌పై ఆమె చూపించబోయే మేజిక్ కోసం మేమంతా ఎదురుచూస్తున్నాం. ఈ సినిమా టైటిల్ దసరాకి రివీల్ చేస్తాం’’ అని చిత్రయూనిట్ తెలిపింది. రెండో పిశాచి ... ఓ సినిమా హిట్ అయిందంటే చాలు... ఆ చిత్రానికి సీక్వెల్ ΄్లాన్ చేస్తున్నారు మేకర్స్. మిస్కిన్ దర్శకత్వం వహించిన హారర్ చిత్రం ‘పిశాచి’ 2014లో విడుదలై, హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకి సీక్వెల్‌గా తాజాగా ‘పిశాచి 2’ రూపొందించారు మిస్కిన్. ఈ మూవీలో ఆండ్రియా లీడ్ రోల్లో నటించారు. విజయ్ సేతుపతి, పూర్ణ, అజ్మల్ అమీర్ ఇతరపాత్రలు పోషించారు. మురుగానందం నిర్మించారు. ఇప్పుటికే పలు హారర్ బ్యాక్‌డ్రాప్ మూవీస్‌లో నటించిన ఆండ్రియా ‘పిశాచి–2’లోనూ తనదైన నటనతో ప్రేక్షకులను భయపెట్టనున్నారు.ఈ చిత్రంలో ఆమెపాత్ర గత చిత్రాలకు భిన్నంగా ఉంటుందని సమాచారం. అంతేకాదు... కథకు అవసరం రీత్యా ఈ సినిమాలో ఆండ్రియా బోల్డ్‌గా నటించారని, ఓ సన్నివేశంలో నగ్నంగా నటించారనే వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని డైరెక్టర్ మిస్కిన్ ధ్రువీకరించారు. ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే రిలీజ్ విషయంలో పలు అడ్డంకులు రావడంతో ‘పిశాచి 2’ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందనే విషయంపై స్పష్టత లేదు. హారర్ చిత్రంతో రీ ఎంట్రీ ‘నరసింహుడు, జై చిరంజీవ, అశోక్’ వంటి తెలుగు చిత్రాల్లో నటించి, ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు సమీరా రెడ్డి. ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అశోక్’ (2006) చిత్రం తర్వాత ఆమె తెలుగులో నటించలేదు. అయితే క్రిష్ దర్శకత్వంలో రానా హీరోగా వచ్చిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ (2012) సినిమాలో మాత్రం ప్రత్యేకపాటలో చిందేశారామె. ఆ తర్వాత నటించలేదు. 2014లో అక్షయ్ వర్దేతో ఏడడుగులు వేసిన ఈ బ్యూటీ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. పెళ్లి, పిల్లలు కారణంగా నటనకు దూరమైన సమీర 13 సంవత్సరాల తర్వాత హిందీ చిత్రం ‘చిమ్నీ’తో రీ ఎంట్రీ ఇస్తున్నారు.అది కూడా ఓ హారర్ మూవీతో కావడం విశేషం. ఔట్ అండ్ ఔట్ హారర్ మూవీగా రూపొందుతోన్న ‘చిమ్నీ’కి గగన్ పూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘చిమ్నీ’ టీజర్ సినిమాపై ఉత్కంఠత పెంపొందించింది. ఈ సినిమా గురించి సమీరా రెడ్డి మాట్లాడుతూ– ‘‘చిమ్నీ’లాంటి హారర్ సినిమాని నేనెప్పుడూ చేయలేదు. గతంలో ‘డర్నా మనా హై’మూవీలో చేశాను.అయితే కేవలం అందులో నాది నెరేటర్పాత్ర మాత్రమే. ఆ రకంగా నేను నటిస్తున్న తొలి హారర్ మూవీ ‘చిమ్నీ’ అనుకోవచ్చు. 13 సంవత్సరాల తర్వాత తిరిగి షూటింగ్లోపాల్గొనడం కాస్తంత నెర్వస్‌గా ఫీల్ అయ్యాను. కానీ కెమెరా ఆన్ కాగానే నాలోనిపాత నటి తిరిగి బయటకు వచ్చేసింది’’ అని తెలిపారు. ఇదిలా ఉంటే.. సమీరా రెడ్డి ఇరవై యేళ్ల క్రితం నటించిన ‘నామ్’ అనే హిందీ సినిమా గత యేడాది నవంబరు 22న విడుదల కావడం విశేషం. కాంచన 4లో... అందం, అభినయంతో ఇప్పటివరకూ కమర్షియల్ సినిమాల్లో హీరోల సరసన సందడి చేస్తూ ప్రేక్షకులను అలరించిన పూజా హెగ్డే తొలిసారి హారర్ నేపథ్యంలో రూపొందుతున్న ‘కాంచన 4’ సినిమాలో నటించనున్నారు. నాగచైతన్య హీరోగా ‘ఒక లైలా కోసం’ (2014) సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రభాస్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్‌చరణ్ వంటి స్టార్ హీరోలందరితో నటించారు. ‘ఎఫ్ 3’ (2022) సినిమాలో ప్రత్యేకపాటలో నటించిన ఆమె ఆ తర్వాత ఏ తెలుగు చిత్రంలోనూ నటించలేదు.అయితే హిందీ, తమిళ సినిమాల్లో మాత్రం నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే... ‘ముని, కాంచన’ హారర్ సిరీస్‌లో రానున్న ‘కాంచన 4’ చిత్రంలో ఆమె కీలకపాత్ర పోషిస్తున్నారు. రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇప్పటివరకూ పోషించనటువంటి సరికొత్తపాత్రలో పూజ నటిస్తున్నారని కోలీవుడ్ టాక్. ఈ చిత్రంలో ఆమెది ఓ సవాల్‌తో కూడుకున్నపాత్ర అనే వార్తలు వినిపిస్తున్నాయి.మూగ, చెవిటి అమ్మాయిపాత్రలో కనిపించనున్నారట పూజా హెగ్డే. ఇంతకీ ఈ చిత్రంలో ఆమెపాత్ర ఏంటి? అన్నది తెలియాలంటే చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఫుల్ హారర్ నేపథ్యంలో వచ్చిన ‘ముని, కాంచన, కాంచన 2, కాంచన 3’ సినిమాలు మంచి విజయం సాధించడంతో ‘కాంచన 4’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.హారర్ మూవీతో తమిళ్లో ఎంట్రీ... నోరా ఫతేహి... పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు, హిందీ, మలయాళ చిత్రాల్లో ప్రత్యేకపాటలతో తనదైన డ్యాన్సులతో కుర్రకారుని ఉర్రూతలూగించారామె. తెలుగులో ‘టెంపర్, బాహుబలి: ది బిగినింగ్, కిక్, షేర్, లోఫర్, ఊపిరి’ వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేశారామె. కాగా ‘కాంచన 4’ వంటి హారర్ సినిమాతో నోరా ఫతేహి తమిళ చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ‘‘కాంచన 4’కి అవకాశం వచ్చినప్పుడు తమిళ ఇండస్ట్రీకి పరిచయం కావడానికి ఇదే సరైనcజెక్టు అనుకున్నా. స్క్రిప్టు బాగా నచ్చింది. పైగా ‘కాంచన’ ఫ్రాంచైజీకి ప్రేక్షకుల్లో గొప్ప ఆదరణ ఉంది. ‘మడ్గావ్ ఎక్స్‌ప్రెస్’ తర్వాత అలాంటి జానర్ మూవీ చేయాలనుకున్నప్పుడు ‘కాంచన 4’ అవకాశం దక్కింది. కొత్త భాషలో నటించడం సవాలే. కానీ, నేను సవాళ్లను ఇష్టపడతాను. హారర్ అండ్ కామెడీ సీన్స్‌లో నా నటనను, డాన్స్ స్కిల్స్‌ను ప్రదర్శించడానికి ఇది నాకు సరైనcజెక్ట్ అని నా అభి్రపాయం. ‘కాంచన 4’లో లారెన్స్, పూజా హెగ్డేలతో నటించడం చాలా సంతోషంగా ఉంది’’ అని నోరా ఫతేహి చెప్పారు. పై తారలే కాదు... మరికొందరు హీరోయిన్లు కూడా హారర్ చిత్రాల ద్వారా ప్రేక్షకులను భయపెట్టేందుకు సన్నద్ధం అవుతున్నారు. బాలీవుడ్లో లేడీ ఫైర్ బ్రాండ్ అనగానే హీరోయిన్ కంగనా రనౌత్ గుర్తొస్తారు. నటిగా, డైరెక్టర్‌గా, నిర్మాతగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆమె ప్రస్తుతం బీజేపీ పార్టీ నుంచి లోక్‌సభ సభ్యురాలిగా గెలుపొంది తనదైన శైలిలో దూసుకెళుతున్నారు. కాగా కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఈ మూవీ ఈ ఏడాది జనవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక΄ోతే.. తాజాగా ఆమె ‘బ్లెస్డ్ బై ది ఈవిల్’ అనే ఓ హాలీవుడ్ సినిమాలో నటించనున్నారు. అనురాగ్ రుద్ర దర్శకత్వం వహించనున్న ఈ హారర్ డ్రామా సినిమాలో ఆమె కీలక పాత్రపోషించనున్నారు. ఓ జంటని దుష్ట శక్తి ఎలాంటి తిప్పలు పెట్టిందనే కథాంశం చుట్టూ ఈ సినిమా ఉంటుందట. అతీంద్రియ శక్తులు, జానపద కథల నేపథ్యంలో అనురాగ్ రుద్ర తీర్చిదిద్దనున్నారని టాక్. టైలర్పోసీ, స్కార్లెట్ రోజ్ వంటి వారు ఈ సినిమాలో కీలక పాత్రలుపోషించనున్నారు. లయన్ మూవీస్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ న్యూయార్క్‌లో మొదలు కానుందని సమాచారం. ఈ చిత్రం షూటింగ్ దాదాపు అమెరికాలోనే జరగనుంది. కంగనా రనౌత్ ఎంపీగా గెలుపొందిన తర్వాత ఒప్పుకున్న చిత్రం ‘బ్లెస్డ్ బై ది ఈవిల్’ కావడం విశేషం. -
హోటల్ రూమ్‌కు రావాల్సిందే.. నటికి రాజకీయ నేత వేధింపులు!
తిరువనంతపురం: కేరళలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మలయాళ నటి తాజాగా.. ఓ యువ రాజకీయ నాయకుడిపై వేధింపుల ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. దీంతో, ఆరోపణలు రాజకీయంగా చర్చకు దారి తీశాయి. బాధితురాలు సదరు వ్యక్తి పేరు చెప్పకపోయినప్పటికీ కాంగ్రెస్ నేతను టార్గెట్ చేసి బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.వివరాల ప్రకారం.. కేరళలో మలయాళ నటి రీనీ ఆన్ జార్జ్ తాజాగా సంaచలన ఆరోపణలు చేశారు. తాజాగా ఆమె సోషల్ మీడియా పోస్టులో.. ‘కేరళకు చెందిన ఓ యువ రాజకీయ నాయకుడు తనను హోటల్‌కు రమ్ముంటున్నాడని అన్నారు. తనకు అభ్యంతరకరమైన సందేశాలు పంపిస్తూ వేధిస్తున్నాడని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. గత మూడేళ్లుగా ఇలా జరుగుతోందన్నారు. అయితే, సదరు నేత వేధింపులకు సంబంధించి.. ఆ పార్టీలోని సీనియర్లకు ఈ విషయంపై ఫిర్యాదు కూడా చేసినట్టు తెలిపారు. అయినా కూడా ఆయనపై చర్యలు తీసుకోకుండా.. ఉన్నత పదవులు ఇస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. సదరు నేత.. తనను మాత్రమే కాదు.. ఇప్పటి చాలా మంది యువతులను ఇలా వేధించినట్టు తనకు తెలుసంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే, పోస్ట్‌లో మాత్రం ఆమె ఎక్కడా.. అతడి పేరును, రాజకీయ పార్టీని ప్రస్తావించలేదు. దీంతో, నటి ఆరోపణలపై కేరళలో రాజకీయ దుమారం చెలరేగింది.Malayalam actor Rini Ann George accused Youth Congress state president and Palakkad MLA Rahul Mamkootathil of sending her offensive messages and of harassment. It has created a furore in Kerala politics! pic.twitter.com/puu1FRjOOP— Sreedhar Pillai (@sri50) August 21, 2025బీజేపీ మాత్రం ఆమె ఆరోపణలపై స్పందిస్తూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటథిల్ టార్గెట్ చేసింది. ఆయనే వేధింపులకు పాల్పడుతున్నారని కాషాయ నేతలు మండిపడుతున్నారు. రాహుల్ పేరు ప్రస్తావిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. తక్షణమే రాజీనామా చేయాలని బీజేపీ మార్చ్ నిర్వహించింది. కాగా, రాహుల్ మమ్కూటథిల్ ప్రస్తుతం యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నాడు.ఇదిలా ఉంటే రచయిత్రి హనీ భాస్కరన్ కూడా రాహుల్ మమ్కూటథిల్పై ఆరోపణలు చేశారు. తనను కూడా వేధింపులకు గురి చేశాడని తెలిపింది. సోషల్ మీడియాలో పదే పదే సందేశాలు పంపి వేధించాడని ఆమె ఆరోపించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. యూత్ కాంగ్రెస్‌లో మహిళలను కూడా ఇలానే వేధించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సదరు కాంగ్రెస్ నేత వేధింపుల వ్యవహారం కేరళలో కొత్త చర్చకు దారి తీసింది. -
'కూలీ'తో ఓవర్ నైట్ స్టార్డమ్.. ఎవరీ బ్యూటీ?
-
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత
మారాఠీ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి జ్యోతి చందేకర్ (69) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆగస్టు 16న సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. మరాఠీ సిరీయళ్లతో పాటు పలు చిత్రాల్లోనూ జ్యోతి నటించారు. 12 ఏళ్ల వయసులోనే కెరీర్‌ని ప్రారంభించి, తనదైన నటనతో ఇండస్ట్రీలో కి వచ్చిన అతి కొద్ది కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ‘ఛత్రీవాలీ’, ‘తూ సౌభాగ్యవతి హో’ సీరియళ్లు జ్యోతి కెరీర్‌ని మలుపు తిప్పాయి. బుల్లితెరపై వచ్చిన ఫేమ్‌తో సినిమా చాన్స్‌లు వచ్చాయి. ధోల్కీ, ‘తిచా ఉంబర్తా’. ‘మీ సింధుతాయ్ సప్కాల్’ వంటి చిత్రాలు జ్యోతికి నటిగా మంచి గుర్తింపుని సంపాదించిపెట్టాయి. మారాఠి ఇండస్ట్రీ నుంచి ఎన్నో అవార్డులను అందుకుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు పుణెలోని తమ నివాసం జ్యోతి చందేకర్ అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్లు ఆమె కూతురు, నటి తేజస్విని పండిట్ తెలిపారు. -
ఏడేళ్ల క్రితం నాటి మధుర క్షణాలు షేర్ చేసిన రష్మిక (ఫోటోలు)
-
శారీలో హీరోయిన్ వైష్ణవి చైతన్య క్యూట్ లుక్స్ (ఫొటోలు)
-
అమ్మతో కలిసి సుప్రీత బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
అనాథాశ్రమంలో హనుమాన్ నటి వరలక్ష్మీ దంపతులు (ఫొటోలు)
-
తెలుగు సీరియల్ బ్యూటీస్ వరలక్ష్మి వ్రతం (ఫొటోలు)
-
12th ఫెయిల్ హీరోయిన్ మేధా శంకర్ బర్త్ డే స్పెషల్ (ఫోటోలు)
-
ఐశ్వర్యా రాయ్.. బిజినెస్‌లోనూ ‘తారా’స్థాయి..
ఐశ్వర్యారాయ్ బచ్చన్.. సినిమాలు చూసే సామాన్యులకు కూడా ఈ పేరు తెలుసు. ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో మంచి పేరున్న తారల్లో ఒకరు. ఏ సినిమాలోనైనా ఆమె కొన్ని క్షణాలు కనిపించినా చాలు అని అభిమానులు ఆశిస్తారు. ఆకట్టుకునే అందం, అద్భుతమైన నటనతో విశేష కీర్తిని సంపాదించడమే కాదు.. చేతినిండా బ్రాండ్ ఎండార్స్మెంట్లతో బిజినెస్‌లోనూ రాణిస్తూ భారీ సంపదనూ నిర్మించుకున్నారు.భారీ నెట్వర్త్భారత సినీ ప్రపంచంలో టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఐశ్వర్య రాయ్ బచ్చన్.. సంపదలోనూ అగ్ర స్థానంలో నిలిచారు. సియాసత్ నివేదిక ప్రకారం.. మే 2025 నాటికి ఐశ్వర్య రాయ్ బచ్చన్ రూ .900 కోట్ల నెట్‌వర్త్‌తో భారతదేశంలో రెండవ ధనవంతురాలైన నటి. మిస్ వరల్డ్ కిరీటాన్నిసాధించడమే కాకుండా పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో గుర్తింపు తెచ్చుకున్న ఆమె బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే తారల్లో ఒకరు. న్యూస్ 18 ప్రకారం.. ఆమె ఒక్కో సినిమాకు దాదాపు రూ.10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందని సమాచారం. నటనతో పాటు హైఎండ్ ఇండియన్, ఇంటర్నేషనల్ బ్రాండ్లను ప్రమోట్ చేయడం ద్వారా రూ.6-7 కోట్లు సంపాదిస్తోంది.బిజినెస్ వెంచర్లు, విలాసవంతమైన ఆస్తులునటన, బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ తో పాటు వ్యాపార ప్రపంచంలోకి కూడా ఐష్ అడుగు పెట్టింది. స్మార్ట్ పెట్టుబడుల కారణంగా ఆమెను బాలీవుడ్ అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తలలో ఒకరిగా పరిగణిస్తున్నారు. పాసిబుల్, యాంబీ వంటి స్టార్టప్‌లలో ఆమె పెట్టుబడులు పెట్టారు.రియల్ ఎస్టేట్ విషయానికొస్తే ఆమెకు పలు విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె ముంబైలోని బాంద్రాలో రూ.50 కోట్లకు పైగా విలువ చేసే భారీ బంగ్లాలో నివసిస్తున్నారు. దుబాయ్ లోని జుమేరా గోల్ఫ్ ఎస్టేట్స్ లోని ఎత్తైన శాంక్చురీ ఫాల్స్ లో అద్భుతమైన విల్లా ఉంది.ఇది చదివారా? ఒక్క ఏడాదిలో రూ.8,500 కోట్లు తీసుకొచ్చా: వివేక్ ఒబెరాయ్ -
కుమారుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రమ్యకృష్ణ (ఫోటోలు)
-
పెళ్లి కూతురుగా ముస్తాబైన జాన్వీ ..‘అవే కళ్లు’ (ఫొటోలు)
-
ప్రియుడు కంటికి రెప్పలా కాపాడుకున్నాడు కానీ..రేర్ కేన్సర్ కబళించింది!
ప్రముఖ అమెరికన్ నటి, ప్రొడ్యూసర్ కెల్లీ మాక్ (kelley mack) ప్రాణాంతకమైన కేన్సర్‌తో కన్ను మూసింది.అరుదైన మెదడు కేన్సర్‌తో సుదీర్ఘ పోరాటం తర్వాత ఆమె తుది శ్వాస విడిచింది. చిన్న వయసులోనే నటిగా అనేకమంది అభిమానులను సంపాదించుకున్న కెల్లీ అకాల మరణంపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు.జూలై 10, 1992న ఒహియోలోని సిన్సినాటిలో జన్మించారు కెల్లీ మాక్. ది వాకింగ్ డెడ్, 9-1-1 , చికాగో మెడ్ వంటి మూవీలతో బాగా పాపులర్ అయ్యారు. అందమైన చిరునవ్వు, అద్భుతమైన నటనతో ఎంతోమంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. కరియర్ పీక్‌లో కొనసాగుతున్న సమయంలో, అరుదైన గ్లియోమా కారణంగా 33 ఏళ్లకే ఆమెకు నూరేళ్లు నిండిపోయాయి. కెల్లీ మాక్ సోదరి, కాథరిన్ క్లెబెనో ఇతర కుటుంబ సభ్యులు ఆమె మరణ వార్తను ఇన్స్టాగ్రామ్ ద్వారా ధృవీకరించారు.కెల్లీ మాక్ మరణ వార్త అభిమానుల హృదయాలను కలచి వేసింది. అరుదైన కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ , బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలిసిన తరువాత కూడా ఆమె చాలా ధైర్యంగా పోరాడింది. ఈ పోరాటంలో ఆమె ప్రియుడు లోగన్ లానియర్ చాలా అండగా నిలిచాడు. ఒక్క క్షణం కూడా విడిచిపెట్టలేదు. అనుక్షణం తనకు తోడుగా ఉన్నాడని స్వయంగా కెల్లీ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఈ ఏడాది జనవరిలో కెల్లీ తన గ్లియోమా వ్యాధి గురించి అది తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో పంచుకున్నారు."సెప్టెంబర్‌లో, నేను నా బాయ్‌ఫ్రెండ్ లోగన్తో కలిసి కొత్త అపార్ట్మెంట్లోకి మారాను. ఆ తర్వాత ఒక నెల పాటు, నడుము నొప్పి విపరీతంగా ఉంది. డిస్క్ జారిందనుకున్నాను. కొన్ని వారాల తర్వాత, నా కుడి క్వాడ్(తొడకు, మెకాలిపైభాగానికి మధ్యలో)లో న్యూరోపతిక్ పెయిన్, ఆపై, కాళ్ళు , వీపులో తట్టుకోలేనంత నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత కొన్ని నెలలకు అరుదైన ఆస్ట్రోసైటోమా, డిఫ్యూజ్ మిడ్లైన్ గ్లియోమా ఉన్నట్లు నిర్ధారణ అయింది’’గ్లియోమా అంటే ఏమిటి?గ్లియోమా అనేది మెదడు, వెన్నుపాములలో వచ్చే ఒక రకమైన కణితి. న్యూరోగ్లియా అని కూడా పిలిచే గ్లియల్ కణాల నుండి అభివృద్ధి చెందుతుంది. సాధారణంగా, ఈ కణాలు నరాలకు మద్దతు ఇస్తాయి . కేంద్ర నాడీ వ్యవస్థ పనికి సహాయపడతాయి. అన్ని గ్లియోమాలు కణితులు కేన్సర్‌కు దారి తీయవు కానీ చాలా గ్లియోమాలు ప్రాణాంతకమైనవి.గ్లియోమాలు సాధారణంగా మెదడులో పెరుగుతాయి. కానీ వెన్నుపాములో కూడా ఏర్పడవచ్చు. ఇందులో ఆస్ట్రోసైటోమా, గ్లియోబ్లాస్టోమా, ఒలిగోడెండ్రోగ్లియోమా, ఒలిగోడెండ్రోగ్లియోమా లాంటి అనేక రకాలు ఉన్నాయి. గ్లియోమా లక్షణాలు:గ్లియోమా లక్షణాలు కణితి ఎక్కడ ఉందో, పరిమాణం, కణితిఎంత వేగంగా పెరుగుతుందో దానిపై ఆధారపడి ఉంటాయి. నొప్పి, వాంతులు, దృష్టి సమస్యలు, బలహీనత, మూర్ఛలు సాధారణంగా కనిపించే లక్షణాలు. గ్లియోమా చికిత్స కణితి రకం, పరిమాణం, వచ్చిన ప్లేస్‌పై ఆధారపడి ఉంటుంది. శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ , కీమోథెరపీ లాంటి చికిత్సలు చేస్తారు. View this post on Instagram A post shared by Kelley Mack (@itskelleymack) -
కాజోల్ బర్త్ డే.. ఫెర్ఫెక్ట్ ఫ్యామిలీ హీరోయిన్ (ఫొటోలు)
-
మృణాల్ ఠాకూర్ బర్త్‌డే పార్టీ.. నువ్వు దొరకడం అదృష్టం! (ఫొటోలు)
-
గర్భంతో ఉండగా తల్లింట్లో.. విడాకుల వార్తలపై నటి ఏమందంటే?
యువికా చౌదరి (Yuvika Chaudhary).. మొదట్లో హీరోయిన్గా సినిమాలు చేసింది. తర్వాత సహాయనటిగా యాక్ట్ చేసింది. హిందీతో పాటు కన్నడ, పంజాబీ భాషల్లో పలు చిత్రాలు చేసింది. హిందీ బిగ్‌బాస్ 9వ సీజన్లోనూ పాల్గొంది. ఈ షోలోనే నటుడు ప్రిన్స్ నరూలాతో ప్రేమలో పడింది. షో తర్వాత కూడా వీరిద్దరూ ఆ ప్రేమను కొనసాగించారు. 2018లో పెళ్లి చేసుకున్నారు. ఐవీఎఫ్ ద్వారా 2024లో కూతురికి జన్మనిచ్చారు. అయితే గర్భంతో ఉన్న సమయంలో యువికా తల్లింట్లోనే ఉంది. దీంతో యువికా- ప్రిన్స్ విడిపోయారంటూ ప్రచారం జరిగింది.నా మనసంతా అదేఈ ప్రచారం గురించి ఇన్నాళ్లకు పెదవి విప్పింది యువికా చౌదరి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నేను గర్భం దాల్చినప్పుడు నా మెదడులో, మనసులో పుట్టబోయే బిడ్డ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాను. పనికిరాని రూమర్లకు ప్రాధాన్యత ఇవ్వకూడదనుకున్నాను. అందుకే వాటిని లైట్ తీసుకున్నాను. ఈ పుకార్లు లైఫ్‌లో వస్తుంటాయి, పోతుంటాయి. కానీ నా ప్రెగ్నెన్సీ ఎప్పుడంటే అప్పుడు రాదుగా.. అందుకే రూమర్స్‌ను పట్టించుకోలేదు. ఒకవేళ క్లారిటీ ఇచ్చినప్పటికీ పరిస్థితి చక్కబడటం కాదుకదా.. దాన్ని మరింత రచ్చ చేస్తారని భావించాను. మా మధ్య మనస్పర్థలు నిజమేఅయినా మౌనంగా ఉన్నా కూడా దాన్ని ఇంకా సాగదీశారు. ఏదేమైనా నాకు నా బిడ్డే ముఖ్యం. తనను నేను బాగా చూసుకోవాలి. తనకోసం మరింత స్ట్రాంగ్‌గా నిలబడాలి.. ఇవే నా మనసులో మెదిలేవి. నిజానికి ప్రిన్స్ నాకెంతో సపోర్ట్ చేస్తాడు. కాకపోతే అందరిలాగే మా మధ్య కూడా మనస్పర్థలు వచ్చాయి. లైఫ్‌లో ఇది కూడా ఓ ఫేజ్ అని, అదెంతో కాలం ఉండదని నాకు బాగా తెలుసు. ప్రెగ్నెన్సీలో సడన్‌గా సంతోషంగా ఉంటాం. అంతలోనే బాధగా అనిపిస్తుంది. కొన్నిసార్లు జీవిత భాగస్వామి మనపక్కనే ఉంటే బాగుండనిపిస్తుంది. కానీ మా ఇంట్లో ఇంటీరియర్ పనులు జరుగుతుండటంతో ప్రిన్స్ అవన్నీ దగ్గరుండి చూసుకున్నాడు. తల్లికంటే ఎక్కువ ఎవరు చూసుకోగలరు?మరోవైపు షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాడు. అలాంటి సమయంలో నేను మా అమ్మ దగ్గర ఉండటమే మంచిదని భావించాడు. తల్లికంటే బాగా ఎవరూ చూసుకోలేరని పుట్టింటికి పంపించాడు. ప్రెగ్నెన్సీ సమయంలో అమ్మానాన్నతో కలిసి ఉండటం పాపమేమీ కాదు, అదందరూ చేసేదే! అది అర్థం చేసుకోలేనివాళ్లు పిచ్చి పుకార్లు సృష్టించారు. కానీ ప్రిన్స్ మా విడాకుల రూమర్స్ విని బాధపడ్డాడు. నేను పుట్టింట్లో.. తనేమో నాకు దూరంగా ఉండేవాడు. ఏదేమైనా ఆ ఫేజ్ దాటేశాం. హ్యాపీగా ఉన్నాం అని యువికా చౌదరి చెప్పుకొచ్చింది.చదవండి: కొన్నిరోజులే బతుకుతా.. దీనస్థితిలో హీరో.. సాయం చేసిన కమెడియన్ -
శ్రావణ శుక్రవార వ్రతం చేసిన తెలుగు సీరియల్ బ్యూటీస్ (ఫొటోలు)
-
వాళ్లు ఒప్పుకోకపోయినా నేనింకా హీరోయిన్నే.. 60 ఏళ్ల సీనియర్ నటి
శాంతి కృష్ణ (Shanthi Krishna).. మలయాళంలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్. మలయాళంలోనే కాదు, తమిళ భాషల్లోనూ అనేక సినిమాలు చేసింది. తెలుగులో ప్రియురాలు అనే ఏకైక చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది. అయితే ఇప్పటికీ తనకు హీరోయిన్‌గానే నటించాలనుందని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శాంతి కృష్ణ మాట్లాడుతూ.. మోహన్‌లాల్, మమ్ముట్టి వంటి స్టార్ హీరోలు, దర్శకనిర్మాతలు నన్ను హీరోయిన్గా పరిగణించరు. హీరోయిన్గా చేస్తా...ఫహద్ ఫాజిల్, నివిన్ పౌలీ వంటి హీరోలకు తల్లిగా నటించాక నన్నెందుకు కథానాయికగా తీసుకోవాలనుకుంటారు? కానీ, ఇప్పటికిప్పుడు నన్ను హీరోయిన్గా పెట్టి సినిమా తీసినా.. మలయాళ ప్రేక్షకులు పెద్ద మనసుతో ఆదరిస్తారు. ఇప్పటికీ వారి మనసుల్లో నాకు ప్రత్యేక స్థానం ఉంది అని చెప్పుకొచ్చింది. శాంతి కృష్ణకు ఇప్పుడు 60 ఏళ్లు. కొన్నాళ్లపాటు బెంగళూరులో ఉన్న ఆమె ప్రస్తుతం కొచ్చిలో సెటిలైంది. ఇప్పుడు హ్యాపీగా ఉందిదీని గురించి నటి మాట్లాడుతూ.. నేను మళ్లీ కేరళకుట్టిగా మారిపోయాను. కొచ్చిలో ఇల్లు తీసుకున్నాను. దీనికి శ్రీకృష్ణం అనే పేరు పెట్టాను. శ్రీ కృష్ణుని ఆలయం పక్కనే మా ఇల్లు ఉండటంతో అదే పేరు నా నివాసానికి పెట్టుకున్నాను. పిల్లల చదువుల కోసం చాలా ఏళ్లు బెంగళూరులో ఉన్నాను. చివరకు నా మనసుకెంతో దగ్గరైన ప్రదేశంలోనే ఇల్లు తీసుకుని సంతోషంగా జీవిస్తున్నాను. ఇక్కడికి షిఫ్ట్ అవమని నా స్నేహితులు పదేపదే చెప్పారు. మొత్తానికి ఇక్కడికి వచ్చేశాక మనసుకెంతో తృప్తిగా ఉంది అని చెప్పుకొచ్చింది.చదవండి: కింగ్డమ్ తొలిరోజు కలెక్షన్స్.. విజయ్ దేవరకొండ మాస్ కమ్‌బ్యాక్ -
'ఆదిపురుష్' హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
లైఫ్ ఎంజాయ్ చేస్తున్న సమంత (ఫొటోలు)
-
నిధి అగర్వాల్.. విచిత్రమైన కండీషన్ (ఫొటోలు)
-
హీరోయిన్ రెజీనా 'ఫ్రూట్ సలాడ్' డ్రస్సింగ్ (ఫొటోలు)
-
Moinabad: సిగరెట్స్ కావాలంటూ రిసార్ట్ సిబ్బందిపై దుర్భాషలు
-
క్వీన్‌లా మెరిసిపోతున్న కింగ్డమ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)
-
ఈ హీరోయిన్‌కు అప్పట్లో ఫుల్ క్రేజ్.. ఇలా మారిపోయిందేంటి!
పైన కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? అప్పట్లో ఓ వెలుగు వెలిగింది. తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసింది. కోలీవుడ్‌లో అగ్ర కథానాయికగా స్టార్డమ్ అందుకుంది. కానీ, అందరిలాగే పెళ్లి కాగానే నటనకు గుడ్‌బై చెప్పి ఇంటికే పరిమితమైంది. 2009 తర్వాత మరే చిత్రంలోనూ కనిపించనేలేదు. ఇంతకీ ఆ కథానాయిక మరెవరో కాదు మాళవిక (Actress Malavika).పెళ్లయ్యాక సినిమాలకు గుడ్బైమాళవిక అసలు పేరు శ్వేత కొన్నూర్ మీనన్ (Shweta Konnur Menon). చాలా బాగుంది చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. దీవించండి, శుభకార్యం, నవ్వుతూ బతకాలిరా, ప్రియ నేస్తమా, అప్పారావు డ్రైవింగ్ స్కూల్, చంద్రముఖి చిత్రాల్లో నటించింది. తమిళంలో స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. బోల్డ్ పాత్రల్లోనూ కాదనకుండా యాక్ట్ చేసింది. 2007లో సుమేశ్ మీనన్‌ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఆమధ్య రీఎంట్రీకి రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా అయిపోయిందేంటి?పుష్పలో సమంతలా 'ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా..' వంటి ఐటం సాంగ్స్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. కానీ ఇంతవరకు ఏ సినిమాలోనూ కనిపించనేలేదు. అప్పట్లో నాజూకుగా ఉన్న మాళవిక ప్రస్తుతం కాస్త బొద్దుగా తయారైంది. యోగాతో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటున్న ఈమె.. ఇంతలా లావైపోవడంతో అభిమానులు వెంటనే గుర్తుపట్టలేకపోతున్నారు. మాళవిక ఇలా అయిపోయిందేంటని ఆశ్చర్యపోతున్నారు. View this post on Instagram A post shared by Shweta Konnur Menon (@shwetakonnurmenon) View this post on Instagram A post shared by Shweta Konnur Menon (@shwetakonnurmenon) చదవండి: ప్రియురాలితో ఎక్కువసేపు గడపాలనుంది: విజయ్ దేవరకొండ -
'కోర్ట్' శ్రీదేవి జూలై జ్ఞాపకాలు.. అటు ఫ్యామిలీ ఇటు కొత్త కారు (ఫొటోలు)
-
ఒక్కపూట భోజనం.. మంచినీళ్లతో కడుపు నింపుకుంటున్నా: ఏడ్చేసిన నటి
చిత్రపరిశ్రమలో రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. అప్పుడే చేతినిండా అవకాశాలున్నట్లనిపిస్తుంది. అంతలోనే ఖాళీ చేతులతో అవకాశాలకోసం ఎదురుచూడాల్సి వస్తుంది. వయసుపైబడ్డ నటీనటుల పరిస్థైతే మరీ దుర్భరంగా ఉంటుంది. తినడానికి తిండిలేక ఇబ్బందిపడుతుంటారు. నటి గుంటూరు మహాలక్ష్మి (Actress Guntur Mahalaxmi)కి అలాంటి దుస్థితే వచ్చింది. ఈమె ఇటీవలే హరిహర వీరమల్లు చిత్రంలో యాక్ట్ చేసింది.రూ.4 లక్షల అప్పుతాజాగా నటి మహాలక్ష్మి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 1998లో సీరియల్స్‌లోకి వచ్చాను. రెండు, మూడు సినిమాలు కూడా చేశాను. రూ.3 లక్షల అప్పుతో హైదరాబాద్ వచ్చాను. ఇప్పుడు ఆ అప్పు రూ.4 లక్షలై కూర్చుంది. కొన్ని సినిమాలు, సీరియల్స్‌లో చేసిన పనికి సరిగా డబ్బులివ్వడం లేదు. నాకసలే మోకాలి నొప్పి ఉంది. దానికి సర్జరీ చేయాలంటే రూ.5 లక్షలు ఖర్చవుతుందన్నారు. దానికితోడు కనీసం రెండు నెలలైనా విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది.అమ్మ కోసం వెళ్లిపోయాఇండస్ట్రీలో సెటిలయ్యే సమయంలో అమ్మ కిందపడి కాలుచేయి విరిగింది. అమ్మను చూసుకోవడం కోసం నటనను వదిలేసి ఊరెళ్లిపోయాను. అమ్మ చనిపోయిన కొద్దిరోజులకు ఇక్కడికి వచ్చేశాను. నాకు ఓ తమ్ముడు ఉండేవాడు. అతడి మానసిక స్థితి సరిగా ఉండేది కాదు. తను కూడా ఈమధ్యే చనిపోయాడు. అమ్మ, తమ్ముడు.. ఇద్దర్నీ నేనే చూసుకునేదాన్ని. ఇప్పుడు అప్పులపాలై చాలా కష్టాలుపడుతున్నాను. మంచినీళ్లతో కడుపు నింపుకుని..హైదరాబాద్ వచ్చాక కడుపు మాడ్చుకున్న రోజులెన్నో ఉన్నాయి. మంచినీళ్లు తాగి పడుకునేదాన్ని. ఎన్నోసార్లు పస్తులున్నాను. ప్రస్తుతం ఒక్కపూట భోజనమే చేస్తున్నా.. అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మహాలక్ష్మి.. నువ్వొస్తావని, సత్యం, రుతురాగాలు వంటి పలు సీరియల్స్ చేసింది. హరిహర వీరమల్లు మూవీలో జాతర సీన్లో యాక్ట్ చేసింది. రంగస్థలం, గేమ్ ఛేంజర్ సహా దాదాపు 50 చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించింది. ప్రస్తుతం డ్రాగన్, ఫౌజీ, శంబాల చిత్రాల్లో నటిస్తోంది. శంబాలలో తనకు మంచి డైలాగులున్నాయని, ఈ మూవీతోనైనా తగిన గుర్తింపు వస్తుందేమోనని ఎదురుచూస్తోంది.చదవండి: బ్లాంక్ చెక్ ఇచ్చాం.. అయినా అతడు రిజెక్ట్ చేశారు: మురళీ మోహన్ -
ఆ హీరోయిన్ లేకపోతే నేను ఉండేవాడిని కాదు: ఉపేంద్ర
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర(Upendra ) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన సినిమాలన్నీ తెలుగులో రిలీజ్ అవ్వడమే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచినవి కూడా ఉన్నాయి. ఫలితం ఎలా ఉన్నా సరే ఆయన సినిమాల్లో ఏదో ఒక కొత్త పాయింట్ కచ్చితంగా ఉంటుంది. తొలి సినిమా ‘ఏ’ నుంచే ఆయన ప్రయోగాలు ప్రారంభించాడు. అప్పటివరకు వచ్చిన చిత్రాలకు భిన్నంగా ‘ఏ’ సినిమా కథనం సాగుతుంది. అందుకే కన్నడతో పాటు తెలుగులోనూ ఆ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ఉపేంద్ర చాలా కష్టపడాల్సి వచ్చిందట. సీనియర్ నటి సరోజా దేవి లేకపోతే ఆ సినిమానే రిలీజ్ అయ్యేది కాదని, ఇప్పుడు మీ కళ్ల ముందు ఇలా హీరోగా నేను ఉండేవాడినే కాదని ఆయన అన్నారు. శుక్రవారం బెంగుళూరులో జరిగిన దివంగత నటి సరోజా దేవి సంతాప సభలో ఉపేంద్ర మాట్లాడుతూ.. సరోజ వల్లే తాను హీరో అయ్యానని చెప్పాడు. ‘నేను దర్శకత్వం వహించి నటించిన తొలి సినిమా ‘ఏ’కి సెన్సార్ సమస్య వచ్చింది. ఇలాంటి సినిమాని రిలీజ్ చేయకూడదని చాలా మంది అన్నారు. సెన్సార్ తిరస్కరించడంతో రివిజింగ్ కమిటీకి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో సరోజా దేవి నాకు తోడుగా నిలిచింది. సినిమా చూసిన తర్వాత నన్ను లోపలికి పిలిచారు. నేను వెళ్లగానే సరోజా దేవి లేచి నిలబడి చప్పట్లు కొడుతూ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఆమె కారణంగానే మా సినిమాకు సెన్సార్ పూర్తయింది. ఆమెను కలిసిన ప్రతిసారి ఈ విషయం గుర్తు చేసేవాడిని. ‘మీరే లేకపోతేను నేను హీరో అయ్యేవాడ్ని కాదు’ అని ఆమెకు చెప్పేవాడిని. రాజ్ కుమార్, విష్ణువర్థన్ మాత్రమే కాదు.. సరోజా దేవి పేరు మీద కూడా అవార్డులు ఇవ్వాలి. ఆమె రెండు సార్లు సెంట్రల్ జ్యూరీ మెంబర్‌గా కూడా పని చేశారు. ఆమె సాధించిన విజయాలు ఏంటో అందరికీ తెలుసు. వాటి గురించి మాట్లాడేంత వయసు నాకు లేదు’ అని అని ఉపేంద్ర అన్నారు. -
పెళ్లి చేసుకోలేదు.. తీవ్ర అనారోగ్యం.. ఆస్పత్రి బిల్లులు చెల్లించడానికైనా..
ఆనందం సినిమా హీరోయిన్ గుర్తుందా? రేఖ వేదవ్యాస్ (Rekha Vedavyas).. 2001లో వెండితెరకు పరిచయమైంది. తొలి సినిమా ఆనందంతోనే సెన్సేషన్ అయింది. ఒకటో నెంబర్ కుర్రాడు, దొంగోడు, జానకి వెడ్స్ శ్రీరామ్, ప్రేమించుకున్నాం.. పెళ్లికి రండి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. అయితే కన్నడలోనే ఎక్కువ సినిమాలు చేసి అక్కడ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. 2014 తర్వాత వెండితెరకు గుడ్‌బై చెప్పిన ఈ బ్యూటీ రెండేళ్లక్రితం ఓ షోలో ప్రత్యక్షమైంది.రీఎంట్రీకి రెడీ..పూర్తిగా బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేని స్థితిలో కనిపించింది. అనారోగ్యంతోనే సన్నబడినట్లు ఆ షోలో వెల్లడించింది. తాజాగా ఆమె రీఎంట్రీకి రెడీగా ఉన్నట్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేఖ వేదవ్యాస్ మాట్లాడుతూ.. చిన్నవయసులోనే కెరీర్ ప్రారంభించాను. నేను కన్నడ అమ్మాయి కావడంతో సాండల్‌వుడ్‌కు షిఫ్ట్ అయిపోయి అక్కడే ఎక్కువ సినిమాలు చేశాను. అప్పుడు నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్లు లేకపోవడంతో తెలుగులో ఎక్కువ సినిమాలు చేయలేకపోయాను. తీవ్ర అనారోగ్యంతో సమస్యలు2014 తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరమయ్యాను. ఒకానొక సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. శారీరకంగా, మానసికంగా కుంగిపోయాను. చాలా నరకం అనుభవించాను. చాలాకాలం ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఈ రోజుల్లో వైద్య ఖర్చులు భరించడం అంత ఈజీ కాదు. ఆ బిల్లులు చెల్లిండానికైనా మళ్లీ సినిమాలు చేయాల్సిందే! సినిమాలే కాదు.. యాక్టింగ్ పరంగా ఏ ప్రాజెక్టుల్లోనైనా నటిస్తాను.పెళ్లి చేసుకోలేదుఇప్పటివరకు నేను పెళ్లి చేసుకోలేదు. ఈ మధ్యకాలంలో విడాకులు పెరిగిపోతున్నాయి. అందుకే సరైన వ్యక్తి దొరికాకే వైవాహిక బంధంలో అడుగుపెట్టాలనుకుంటున్నాను. లేటుగా పెళ్లి చేసుకున్నా సరే ఆ బంధం జీవితాంతం కొనసాగేలా చూసుకుంటాను అని రేఖ వేదవ్యాస్ చెప్పుకొచ్చింది. ఇన్ని చెప్పింది కానీ, తనకు వచ్చిన వ్యాధి ఏంటన్నది మాత్రం బయటపెట్టలేదు. బాధల్ని చెప్పకపోవడమే మంచిదంటూ తన అనారోగ్యానికి గల కారణాన్ని సస్పెన్స్‌గానే ఉంచింది.చదవండి: అప్పుడంత డబ్బు లేదు.. చెట్టు వెనకాలే చీర మార్చుకున్న హీరోయిన్ -
ఐరన్ లెగ్ అని విమర్శలు.. శృతి హాసన్ @ 16 ఇయర్స్ జర్నీ (ఫోటోలు)
-
కేరళ వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న టాలీవుడ్ నటి అభినయ (ఫొటోలు)
-
కూతురితో కలిసి బెంగళూరు విమానాశ్రయంలో హీరోయిన్ ప్రణీత చిల్ (ఫొటోలు)
-
ట్రెండీ వేర్ కాదు.. చీరలో ఒకప్పటి హీరోయిన్ మీనా (ఫొటోలు)
-
ఈమెని గుర్తుపట్టారా? సిద్దార్థ్‌తో హిట్ సినిమా.. ఇప్పుడేమో ఇలా
కొందరు బ్యూటీస్ ఒకటి రెండు సినిమాలు చేసినా సరే మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. ఈమె కూడా సేమ్ అలానే అనుకోవచ్చు. తమిళంలో చాలా మూవీస్ చేసినప్పటికీ తెలుగులో ఒకే ఒక్క మూవీతో ఫేమస్ అయింది. అందులో హీరో సిద్దార్థ్. మరి ఇన్ని హింట్స్ ఇచ్చాం కదా ఈ నటి ఎవరో కనిపెట్టారా? మమ్మల్ని చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న నటి పేరు నందిత జెన్నీఫర్. తండ్రి చిన్నా కొరియోగ్రాఫర్ కావడంతో ఈమె కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచింది. కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ఎంచుకుంది. 2000కి ముందు ఓ పక్క కొరియోగ్రఫీ చేస్తూనే మరోవైపు ఐటమ్ సాంగ్స్‌లోనూ అడపాదడపా మెరిసేది. అలా దర్శకుల దృష్టిలో పడి 'రిథమ్' అనే సినిమాతో నటిగా మారింది. అలా 2022 వరకు పలు చిత్రాల్లో నటించింది. తమిళంలో పలు రియాలిటీ షోల్లోనూ పాల్గొంది.(ఇదీ చదవండి: హన్సిక వైవాహిక బంధానికి బీటలు? ఒక్కమాటలో తేల్చేసిన భర్త!)దాదాపు తమిళ సినిమాలే చేసినా ఈమె.. సిద్దార్థ్ 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమాతో తెలుగులోకి పరిచయమైంది. డాలీ పాత్రలో తనదైన యాక్టింగ్ చేసి ఆకట్టుకుంది. మూవీ చూసినా ప్రతిసారి ఈమె పాత్ర కూడా నచ్చేస్తుంది. దీని తర్వాత పవిత్ర, వేర్ ఈజ్ విద్యాబాలన్, నా రూటే సెపరేట్ చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్‌లో కనిపించింది.జెన్నీఫర్ వ్యక్తిగత జీవితానికొస్తే.. 2007లో అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ కాశీ విశ్వనాథన్‌ని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఇద్దరు కొడుకులు పుట్టారు. ప్రస్తుతం ఫ్యామిలీతో లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఈమె.. ఇన్ స్టాలోనూ యాక్టివ్గానే ఉంది. ఎప్పటికప్పుడు ఫొటోలు, రీల్స్ పోస్ట్ చేస్తూ ఉంది. అయితే అప్పట్లో సిద్ధార్థ్ సినిమాలో చూసినప్పటికీ ఇప్పటికీ ఈమెలో ఎంత మార్పు వచ్చేసింది. చాలామంది గుర్తుపట్టలేకపోతున్నారు కూడా!(ఇదీ చదవండి: డైరెక్టర్ క్రిష్ లేకుండానే 'హరిహర వీరమల్లు' మేకింగ్ వీడియో) View this post on Instagram A post shared by Jeni_Chinna (@jenniferr252) -
యూట్యూబ్‌లో ట్రెండింగ్.. రష్మిక 'నదివే' సాంగ్ HD స్టిల్స్ (ఫొటోలు)
-
గుడి ముందు భిక్షాటన చేసిన ప్రముఖ నటి నళిని
సీనియర్ నటి నళిని (Actress Nalini) వార్తల్లో నిలిచింది. మొదట్లో హీరోయిన్గా అలరించి, ఆ తర్వాత విలన్‌గా గడగడలాడిస్తూనే, కామెడీతో నవ్వించిన ఆమె చెన్నైలో భిక్షాటన చేసింది. తిరువేర్కడులో దేవి కరుమారి అమ్మవారి ఆలయం ఎదుట శుక్రవారం కొంగుపట్టుకుని భక్తుల దగ్గర భిక్షాటన చేసింది. ఆమె చేసిన పనిని చూసి చాలామంది భక్తులు, స్థానికులు ఆశ్చర్యపోయారు.కలలో కనిపించి..ఈ విషయం గురించి నళిని మాట్లాడుతూ.. అమ్మవారు కలలో కనిపించి తనకోసం ఏం చేస్తావని అడిగిందని చెప్పింది. తనకోసం ఏం చేయాలో తోచక ఇలా కొంగుపట్టి భిక్షం అడుగుతున్నానంది. వచ్చిన కానుకలను, డబ్బును ఆ తల్లికే కానుకగా సమర్పించాను అని పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.నళిని కెరీర్రజనీకాంత్, చిరంజీవి మల్టీస్టారర్ రణువ వీరన్ (1981) సినిమాతో వెండితెరపై తన ప్రయాణం ఆరంభమైంది. తర్వాత అనేక సినిమాల్లో హీరోయిన్గా నటించింది. తర్వాత సహాయనటిగా, విలన్‌గా, కమెడియన్‌గానూ యాక్ట్ చేసింది. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించింది. ఇంటిగుట్టు, వీడే, సీతయ్య, పున్నమినాగు, నువ్వెకుండటే నేనక్కడుంటా, ఒక్క అమ్మాయి తప్ప వంటి చిత్రాల్లో నటించింది.ప్రస్తుతం సీరియల్స్ చేస్తోంది. వ్యక్తిగత విషయానికి వస్తే.. నళిని 1988లో నటుడు రామరాజన్‌ను పెళ్లాడింది. వీరికి అరుణ, అరుణ్ అని కవలలు సంతానం. పదేళ్ల తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. విడిపోయినప్పటికీ అతడిని ప్రేమగా ఆరాధిస్తూనే ఉంటుంది నళిని.చదవండి: కమల్ సినిమా కాపాడడానికి రoగంలోకి రజనీకాంత్?