ఇండస్ట్రీలో విషాదం మిగిల్చిన అక్టోబరు | Bollywood Celebrities Deaths October 2025 | Sakshi
Sakshi News home page

Bollywood: ఒక్క నెలలో ఆరుగురి మరణం.. తీవ్ర విషాదం

Oct 27 2025 5:49 PM | Updated on Oct 27 2025 7:32 PM

Bollywood Celebrities Deaths October 2025

వయసు పెరిగిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు తుదిశ్వాస విడువక తప్పదు. అయితే ఇండస్ట్రీలో గత కొన్నిరోజులుగా సంభవిస్తున్న సెలబ్రిటీల వరస మరణాలు మాత్రం చాలా విషాదాన్ని నింపాయని చెప్పొచ్చు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు వరకు రోజుల వ్యవధిలో మరణించారు. ఇప్పుడీ విషయం చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంతకీ ఆయా నటీనటులు ఎవరు?

నటి డ్యాన్సర్ మధుమతి.. అనారోగ్య సమస్యల కారణంగా 87 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. 1960, 70ల్లో పలు సినిమాలు చేసిన ఈమె.. అక్షయ్ కుమార్, గోవింద లాంటి స్టార్స్‌కి డ్యాన్స్ నేర్పించింది. ఈమె అక్టోబరు 15న చనిపోయింది.

మధుమతి చనిపోయిన రోజునే పంకజ్ ధీర్ అనే సీనియర్ నటుడు కూడా మృతి చెందారు. 'మహాభారతం'లో కర్ణుడిగా చేసిన ఈయన.. చాన్నాళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతూ కన్నుమూశారు. 'చంద్రకాంత'లో ఈయన యాక్టింగ్ చాలా పాపులర్.

నటుడు, కమెడియన్ గోవర్ధన్ అశ్రానీ(84).. ఈ అక్టోబరు 20న చనిపోయారు. ఊపిరితిత్తుల్లో నీరు చేరడం ఈయన మరణానికి కారణం. ఈయన షోలే సినిమాలో జైలర్ పాత్ర పోషించి ఫేమ్ సొంతం చేసుకున్నారు. ఈయన యాక్టర్, కమెడియన్, దర్శకుడిగా పలు విభాగాల్లో పనిచేశారు.

సింగర్ రిషభ్ టండన్.. దీపావళి పండగని కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకొనేందుకు ఢిల్లీ వెళ్లారు. కానీ అక్టోబరు 21న గుండెపోటుతో మరణించారు. ఈయన వయసు అయితే 35 ఏళ్లే. మరీ చిన్న వయసులో చనిపోవడంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మనం చూసిన ఎన్నో యాడ్స్ సృష్టించిన పీయూష్ పాండే.. అక్టోబరు 24న కన్నుమూశారు. గత కొన్ని వారాలుగా న్యూమోనియాతో పోరాడిన ఈయన 70 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. ప్రధాని మోదీ, సచిన్ టెండూల్కర్ తదితరులు ఈయనకు సంతాపం తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు.

ప్రముఖ నటుడు-కమెడియన్ సతీష్ షా.. 74 ఏళ్ల వయసులో ముత్రపిండాల సమస్యతో ఇబ్బంది పడుతూ అక్టోబరు 25న మరణించారు. సరాభాయ్ vs సరాభాయ్, దిల్ వాలియా దుల్హానియా లే జాయేంగే తదితర చిత్రాలతో ఈయన చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా ఈ నెల 15-25వ తేదీల్లో ఏకంగా ఆరుగురు బాలీవుడ్ సెలబ్రిటీలు చనిపోవడం బాధాకరమైన విషయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement