సూపర్ స్టార్ రజనీకాంత్ యాక్షన్ మోడ్‌లో ఉన్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జైలర్ 2’. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘జైలర్’కి సీక్వెల్‌గా ‘జైలర్ 2’ రూపొందుతోంది. 2023 ఆగస్టు 10న విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘జైలర్ 2’ షూట్‌తో బిజీగా ఉన్నారు రజనీ. కాగా డిసెంబరు 12న రజనీకాంత్ పుట్టినరోజు.
75 ఏళ్లు పూర్తి చేసుకున్నారాయన. ఏడు పదుల వయసులోనూ యాక్షన్ సినిమాలకు సై అంటున్నారు రజనీ. ప్రస్తుతం ‘జైలర్ 2’ కోసం ఓ ఫైట్ సీక్వెన్స్‌లోపాల్గొంటున్నారాయన. ఇందులో భాగంగా ఓ సన్నివేశంలో ఆయన బరువైన వస్తువుని పైకి ఎత్తి తలకిందులుగా పెట్టాల్సి ఉందట. ఈ కష్టమైన సీన్‌ని డూప్‌తో చేయిద్దామని నెల్సన్ చెప్పినప్పటికీ... వద్దంటూ తనే ఆ సన్నివేశంలోపాల్గొన్నారట రజనీకాంత్. ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది.


