టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మోగ్లీ’... డిసెంబర్ 13న ఈ చిత్రం విడుదల కానుంది. దర్శకుడు, నటుడు బండి సరోజ్‌కుమార్ ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నటం విశేషం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించారు. కొన్ని గంటల్లో ఈ మూవీ థియేటర్స్‌లోకి రానున్న సందర్భంలో తాజాగా మోగ్లీ ఫైట్ సీన్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. బండి సరోజ్‌కుమార్, బండి సరోజ్, హర్ష చెముడు వంటి వారు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు కాలభైరవ సంగీతం అందించారు.


