సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఈ ఏడాది చాలా ప్రత్యేకమైనది. నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో పాటు డిసెంబర్ 12న 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చెన్నైలోని పోయెస్ గార్డెన్ ప్రాంతంలో ఆయన నిర్మించిన కల్యాణ మండపం గురించి వైరల్ అవుతుంది. రాఘవేంద్ర కల్యాణ మండపం పేరుతో ఒక పెద్ద, విలాసవంతమైన సౌకర్యాలతో ఆయన మండపాన్ని నిర్మించారు. ఇది ఆయన సొంత నిధులతో నిర్మించారు. పలు కమ్యూనిటీ కార్యక్రమాలకు కూడా వేదికగా ప్రస్తుతం ఉపయోగపడుతుంది. ఈ మండపం విలువ దాదాపు రూ. 20 కోట్లు ఉంటుందని అంచనా.. అయితే ఈ వేదికపై మొట్టమొదటి ఎవరి వివాహం జరిగింది అనే అంశం గురించి ఎక్కువ మంది షేర్ చేసుకుంటున్నారు.

ప్రముఖ నటుడు శుభలేఖ సుదాకర్, సింగర్ శైలజల వివాహం 1989 డసెంబర్ 21న ఘనంగా జరిగింది. అయితే, వీరి పెళ్లి వేడుక రజనీకాంత్ కల్యాణ మండపంలో జరగడం విశేషం. ఆ వేదికపై జరిగిన ఫస్ట్ పెళ్లి కూడా ఈ జోడిదే కావాడం విశేషం. రాఘవేంద్ర స్వామి ఆశీస్సులతో చాలా లగ్జరీగా ఈ మండపాన్ని నిర్మించినట్లు అప్పట్లో రజనీ పేర్కొన్నారు. ఫుల్ ఏసీ కండీషన్‌తో నిర్మించిన హాల్‌లో ఓకేసారి 2వేల మంది కూర్చునే సౌకర్యం ఉంది. ఆ రోజుల్లో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఏసీ కళ్యాణమండపం ఇదే. వంద కార్లు పార్కింగ్ చేసే సౌకర్యం అక్కడ ఉంది. ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఆ కళ్యాణ మండపం ధర రూ. 30 కోట్లకు పైగానే ఉండొవచ్చు.


