కొన్నేళ్ల క్రితం తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వరస సినిమాలు చేసిన కాజల్ అగర్వాల్.. ఇప్పుడు కొత్తగా సినిమాలేం చేయట్లేదు. ఈ ఏడాది 'కన్నప్ప'లో పార్వతి దేవిగా కనిపించింది గానీ ఈమెకు ఇదేం కలిసి రాలేదు. చేతిలో పలు చిత్రాలు ఉన్నప్పటికీ అందులో ఈమె లీడ్ రోల్స్ చేయట్లేదు. అలాంటిది ఇప్పుడు కాజల్.. ఓటీటీలోకి రీఎంట్రీకి ఇచ్చేందుకు సిద్ధమైపోయింది.
గతంలో 'లైవ్ టెలికాస్ట్' ఓ సిరీస్ చేసినప్పటికీ కాజల్‌కి ఇది పెద్దగా కలిసి రాలేదు. దీంతో సినిమా అవకాశాలు వస్తుండటంతో ఓటీటీలకు పెద్దగా ఆసక్తి చూపించినట్లు లేదు. ఇప్పుడు చేతిలో మూవీస్ లేకపోవడంతో వెబ్ సిరీస్ రీమేక్‌కి సై అన్నట్లు ఉంది. 'ఆర్య' పేరుతో హిందీలో ఓ వెబ్ సిరీస్ ఉంది. సుస్మితా సేన్ లీడ్ రోల్ చేసింది. ఇప్పటివరకు మూడు సీజన్లు వచ్చాయి. థ్రిల్లింగ్ అంశాలతో ఇది మెప్పించింది.
(ఇదీ చదవండి: 'అఖండ 2'కి హైదరాబాద్‌లోనే 3 కోట్ల టికెట్స్ సేల్.. ఇదెక్కడి అతి!?)
ఇప్పుడు ఈ సిరీస్ తెలుగు రీమేక్‌లోనే లీడ్ రోల్ కోసం కాజల్‌ని తీసుకున్నారట. తమిళంలో కూడా ఈమె తెలుసు. కాబట్టి దక్షిణాది వరకు ఈమెతో రీమేక్ చేయాలని ప్లాన్ చేశారట. ఇది ఖరారైనప్పటికీ త్వరలో అధికారికంగా వెల్లడించే అవకాశముంది.
రీసెంట్‌గానే హాట్‌స్టార్ 'సౌత్ బౌండ్' పేరుతో ఓ భారీ ఈవెంట్ నిర్వహించింది. ఓటీటీలో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి ఇచ్చింది. ఇందులో భాగంగానే కాజల్‌కి కూడా సిరీస్ రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఒరిజినల్‌లో ప్రధాన పాత్రకు ముగ్గురు పిల్లలు ఉంటారు. మరి ఇందులోనూ అలానే చూపిస్తారా లేదంటే ఏమైనా మార్పులు చేస్తారా అనేది చూడాలి?
(ఇదీ చదవండి: మమ్ముట్టి డిటెక్టివ్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..)


