స్టార్ నటులు రణ్‌వీర్ సింగ్, మాధవన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ధురంధర్. ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఏకంగా రూ.200 కోట్ల క్లబ్‌లో చేరేందుకు సిద్ధమైంది. ఈ మూవీలో ఆయేషా ఖాన్ స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. శరారత్ అనే పాటలో స్టెప్పులేసింది. ఈ సినిమాలో భాగమవడాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతోంది.
సర్జరీ చేయించుకోమని సలహా
అయితే కెరీర్ తొలినాళ్లలో తన లుక్‌పై చాలా నెగెటివ్ కామెంట్లు వచ్చాయంటోంది. తాజా ఇంటర్వ్యూలో ఆయేషా మాట్లాడుతూ.. ఓ వ్యక్తి నా ముక్కును సరిచేయించుకోమన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. నాకు నా ముక్కంటే చాలా ఇష్టం. దాన్ని సర్జరీ చేయించుకోమని చెప్పడానికి అతడెవరు? ఇలాంటి వాళ్లు లైఫ్‌లో ముందుకెళ్లరు.. కానీ పక్కవాళ్ల మీద పడి ఏడుస్తారు!
ఫేమస్ డైరెక్టర్ మూవీ
ఒకసారి ఓ హారర్ సినిమా ఆడిషన్‌కు వెళ్లాను. ఆయన ఫేమస్ డైరెక్టర్. ఆడిషన్ పూర్తయింది. అది వాళ్లకు నచ్చింది. కచ్చితంగా నన్నే సెలక్ట్ చేస్తారని అక్కడున్నవాళ్లు చెప్పారు. అప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. కానీ అంతలోనే.. ఇది హారర్ సినిమా కాబట్టి సరిపోయింది.
తెలుగులో సినిమాలు
కానీ ఇలాంటి అవకాశాలు రావాలంటే నీ పళ్లవరస మార్చుకోవాలి అన్నారు. అది నాకెంతో ఇబ్బందిగా అనిపించింది అని ఆయేషా ఖాన్ చెప్పుకొచ్చింది. ఈ బ్యూటీ తెలుగులో ముఖచిత్రం, ఓం భీమ్ బుష్ సినిమాలు చేసింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో ఐటం సాంగ్ చేసింది. జాట్‌లో కానిస్టేబుల్ పాత్రలో మెరిసింది. ప్రస్తుతం కిస్ కిస్కో ప్యార్ కరూ 2 మూవీ చేస్తోంది. హిందీ బిగ్‌బాస్ 17వ సీజన్‌లోనూ పార్టిసిపేట్ చేసింది.


