breaking news
sandeep raj
-
ఇన్సెక్యూర్ నెపోటిజం.. అస్సలు సహించను: బండి సరోజ్ కుమార్
బండి సరోజ్ కుమార్.. ఈ తరం ఆడియెన్స్‌కి ఈ పేరు కాస్తోకూస్తో తెలుసు. అది కూడా ఇతడు హీరోగా చేస్తూ దర్శకత్వం వహించిన నిర్బంధం, నిర్బంధం 2 సినిమాలు వల్ల. వీటిని యూట్యూబ్‌లోనే రిలీజ్ చేశాడు. వాటికి వచ్చిన వ్యూస్ ద్వారానే ఇతడికి డబ్బులొచ్చాయి. సరోజ్ కుమార్ తొలిసారి నటించిన కమర్షియల్ మూవీ 'మోగ్లీ'. యాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ హీరోగా చేశాడు. రీసెంట్‌గానే గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో సరోజ్ కుమార్ చేసిన విలన్ క్యారెక్టర్‌కి ప్రశంసలు చాలా వస్తున్నాయి. అయితే మూవీ టీమ్ మాత్రం వాటిని డిలీట్ చేస్తూ, తనకు అన్యాయం చేస్తోందని, తన కెరీర్, భవిష్యత్తు గురించి భయమేస్తోందని సరోజ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశాడు. మూవీ టీమ్‌తో వివాదం గురించి మొత్తం బయటపెట్టాడు.(ఇదీ చదవండి: నా చెప్పుతో నేనే కొట్టుకుంటున్నా.. తెలుగు దర్శకుడి ఆవేదన)ఇంతకీ అసలేమైంది?'మోగ్లీ' గ్లింప్స్‌లో తనని మెచ్చుకుంటూ పెడుతున్న కామెంట్స్‌ని మూవీ టీమ్ డిలీట్ చేస్తోందని బండి సరోజ్ కుమార్.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్‌గా మారిపోయింది. 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అడ్మిన్స్ నా గురించి పెట్టిన 400కి పైగా కామెంట్స్ తొలగించారు. ఇంకా అదే పనిలో ఉన్నారు. నిర్మాత విశ్వప్రసాద్ దీన్ని తీవ్రంగా పరిశీలించాలని కోరుతున్నాను. ఇది కంటెంట్ ఫిల్మ్ అని, లాంచ్ ప్యాడ్ ఫిల్మ్ కాదని నాకు చెప్పారు. అందుకే నేను ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకొన్నాను. నా సర్వస్వం పెట్టాను. ఎలాంటి కండీషన్స్ లేకుండా పనిచేశాను. కానీ నాకు దక్కిన ఫలితం ఇదే. దీని వెనక ఓ సిండికేట్ ఉంది. ఇది ఆమోదయోగ్యమైనదేనా?' అని సరోజ్ కుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.'కామెంట్స్ ఏ కదా.. లైట్ తీసుకోమని చెప్పేవాళ్లకి. నేను ఇప్పటివరకు బయట సినిమాలు ఒప్పుకోలేదు. సందీప్ రాజ్ ఒత్తిడితో కథ విన్నాక, నా పాత్ర నచ్చి అందులో ఎలాంటి మార్పులు ఉండకూడదు అనే అగ్రిమెంట్‌తో ఈ సినిమాలో పారితోషికం లేకుండా ప్రాణం పెట్టి నటించాను. 8 నెలలు నా సమయాన్ని ఇచ్చాను. నాకు వస్తున్న రిసెప్షన్ చూసి ముందు థంబ్ నెయిల్స్ మార్చారు. తర్వాత కామెంట్స్ ఆఫ్ చేశారు. నేను దర్శకుడితో మాట్లాడాక మళ్లీ ఆన్ చేశారు. ఒక మూడు కామెంట్లని 3 బాట్ లైక్స్‌తో బూస్ట్ చేసి, నా పాత్రకి వస్తున్న ఆదరణని మ్యాచ్ చేయడానికి చూశారు. కుదరలేదు. ఇప్పుడు నా టాప్ కామెంట్స్ డిలీట్ చేశారు. ఇంకా డిటైల్డ్ ప్రూఫ్స్‌తో ముందుకు వస్తాను''ఇప్పటికీ అక్కడున్న 1600 కామెంట్లలో 99 శాతం నాపైన ప్రేక్షకుడు పలికించిన ప్రేమే. నాకు పీఆర్లు లేరు. ప్రేక్షకుడి బలమే నా పీఆర్. ఆ సునామీని ఎవ్వడూ ఆపలేరు. వీళ్లు ఇప్పుడు ఇలా చేస్తే, రేపు సినిమాలో ఎన్ని చేస్తారు. ఎవరిని నమ్మాలి. నిర్మాత వరకు వెళ్లే అవకాశం నాకు లేదు. నేను ఇండస్ట్రీలో బ్రతికేయడానికి రాలేదు. గత 5 సంవత్సరాలుగా నా కళతో నేను ప్రేక్షకుల్ని సంపాదించుకున్నాను. ఇలాంటి ఇన్సెక్యూర్ నెపోటిజం, పాలిటిక్స్‌ని అస్సలు సహించను. నిర్మాత విశ్వప్రసాద్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిశీలించాలని కోరుతున్నాను. ఇది మీ ప్రమేయం లేకుండా జరుగుతుందని అనుకుంటున్నాను. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చౌకబారు నెపోటిజంకి అడ్డాగా మారకూడదు. దీని వల్ల నా బాధ, నా భవిష్యత్తు కెరీర్ పట్ల ఉన్న భయాన్ని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను' అని సరోజ్ కుమార్ ట్వీట్ చేశాడు.అయితే సరోజ్ కుమార్ ట్విటర్ అకౌంట్ ప్రస్తుతం కనిపించట్లేదు. కానీ ట్వీట్స్ స్క్రీన్ షాట్స్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇతడికి మద్ధతుగా చాలామంది పోస్టులు పెడుతున్నారు. అలానే ఇతడు చెప్పినట్లు గ్లింప్స్ రిలీజ్ చేసినప్పుడు థంబ్ నెయిల్లో ఇతడి ఫొటో కనిపించింది. ఇప్పుడేమో హీరోహీరోయిన్ పెట్టి, అతడి ఫొటోని తొలగించారు. మరోవైపు సినిమా రిలీజ్‌కి ఇంకా చాలా సమయముంది. ఇప్పుడు ఈ గొడవ చూస్తుంటే.. ముందు ముందు ఇంకెంత రచ్చ అవతుందో అనే సందేహం కలుగుతోంది.(ఇదీ చదవండి: దీనస్థితిలో 'కేజీఎఫ్' నటుడు.. సాయం చేయాలని వేడుకోలు) -
వాడి ప్రేమకథలో వేలు పెడితే ఇలాగే ఉంటుంది.. 'మోగ్లీ' గ్లింప్స్
రోషన్ (Roshan Kanakala) హీరోగా నటిస్తున్న చిత్రం 'మోగ్లీ' (Mowgli).. తాజాగా ఈ చిత్రం నుంచి గ్లింప్స్ విడుదలైంది. రాజీవ్ కనకాల- సుమ వారసుడిగా చిత్రపరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన రోషన్ 'మోగ్లీ' ప్రేమకథతో వస్తున్నాడు. తాజాగా విడుదలైన గ్లింప్స్ నాని వాయిస్‌తో మొదలౌతుంది. 25 సంవత్సరాలు నిండని ఓ కుర్రాడు 30 మందిని తిండి, నిద్ర లేకుండా పరిగెత్తించాడంటూ నాని వాయిస్‌తో డైలాగ్ ప్రారంభమౌతుంది. వాడు గ్యాంగ్ స్టర్ కాదు, క్రిమినల్ కాదంటూనే వాడి కథేంటో తెలుసుకోవాలంటే మోగ్లీ చూడాలని చెప్పాడు. ఇందులో హీరోయిన్గా సాక్షి సాగర్ నటించారు. కలర్‌ఫోటో సినిమా దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. -
యాంకర్ సుమ తనయుడి రెండో చిత్రం.. 28న స్పెషల్ సర్ప్రైజ్!
యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల నటిస్తోన్న రెండో చిత్రం మోగ్లీ. ఈ సినిమాకు కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్గా ఆరంగేట్రం చేస్తోంది. బబుల్గమ్తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రోషన్ ఈ మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నారు.ఆగస్ట్ 28న ఈ మూవీ నుంచి ఓ స్పెషల్ సర్ప్రైజ్ను రిలీజ్ చేయబోతున్నట్లు డైరెక్టర్ సందీప్ రాజ్ రివీల్ చేశారు. ‘1850 రోజుల తర్వాత నా రెండో సినిమా మీ ముందుకు వస్తోంది.. ‘మోగ్లీ’ పేరుతో పాటు స్పెల్లింగ్‌ను గుర్తు పెట్టుకోండి’ అంటూ సందీప్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రాసుకొచ్చాడు. కాగా.. ఈ సినిమాకు కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించనున్నాడు. ఈ వినాయక చవితికి మోగ్లీ సందడి చేయనుంది. View this post on Instagram A post shared by Sandeep Raj (@sandeepraaaj) -
ఈ సారికి వదిలేయండి.. మళ్లీ తప్పు జరగకుండా చూసుకుంటా: కలర్ ఫోటో డైరెక్టర్
షార్ట్ ఫిల్మ్‌లతో కెరీర్ ప్రారంభించిన సందీప్ రాజ్.. కలర్ ఫోటో చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత నటుడిగా కూడా పలు సినిమాల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన డాకు మహారాజ్ చిత్రంలోనూ కీలక పాత్ర పోషించారు. తాజాగా సందీప్ ఓ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో అందుబాటులో ఉంది. అయితే ఈ సిరీస్ ఓ సన్నివేశంపై నెట్టింట పెద్ద ఎత్తున విమర్శలొస్తున్నాయి. దీంతో ట్విటర్ వేదికగా సందీప్ స్పందించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా వివరణ ఇచ్చారు.సందీప్ తన ట్వీట్లో రాస్తూ..' డియర్ బ్రదర్స్.. 2025 ఏడాదిని గొప్పగా ప్రారంభించా. డాకు మహారాజ్ వంటి భారీ బ్లాక్‌బస్టర్ చిత్రంలో భాగం కావడం చాలా సంతోషంగా అనిపించింది. ఆ సమయంలో నాకు లభించిన ప్రేమ, మరింత కష్టపడేందుకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.కానీ ఇప్పుడు అదే ఖాతాల నుంచి, అదే వ్యక్తుల నుండి ద్వేషాన్ని చూపటం నా హృదయాన్ని కలిచివేసింది. జనవరిలో అభినందనలకు అర్హుడినో కాదో తెలియదు.. జూలైలో వస్తోన్న ఈ ద్వేషానికి అర్హుడనా? అంటే స్పష్టంగా అవుననే అనిపిస్తోంది. నేను ఈ విషయాలను కప్పిపుచ్చడానికి, మేము చేసిన దానికి సమర్థించడానికి ఇక్కడ లేను. ఎల్లప్పుడూ ప్రేక్షకులే కరెక్ట్ అనే ఒకే ఒక నినాదాన్ని మాత్రమే ఒక చిత్రనిర్మాతగా నమ్ముతా. ఆ నిర్దిష్ట కంటెంట్ మిమ్మల్ని బాధపెడితే. అందులో భాగమైనందుకు చాలా చింతిస్తున్నా. నాకు ఎవరిపై ద్వేషం లేదు. ఎవరినీ లక్ష్యంగా చేసుకోలేదు. అంతే కాదు మిమల్ని ఇబ్బందిపెట్టిన ఆ సీన్‌ను తొలగించాం.' అని పోస్ట్ చేశారు.ప్రతి ఒక్కరూ తమ కెరీర్ ప్రారంభ రోజుల్లో తప్పులు చేస్తారని సందీప్ రాసుకొచ్చారు. ఇప్పుడు మేము కూడా అదే చేశామని.. అయితే వెంటనే దానిని సరిదిద్దుకున్నామని ట్వీట్లో ప్రస్తావించారు. ఇలాంటివీ మళ్లీ చేసే ఉద్దేశం అయితే తమకు అస్సలు లేదన్నారు. ఈ వెబ్ సిరీస్‌ను యువ ప్రతిభావంతులు వారి కెరీర్ ఆధారంగానే రూపొందించామని సందీప్ వివరణ ఇచ్చారు. ఇందులోని నాటకీయత, భావోద్వేగాలు కొత్తదనం కోసం మేము ఈ సిరీస్‌ను గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఇప్పటి నుంచి కంటెంట్ విషయంలో మరింత బాధ్యతాయుతంగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నా..ఈ వారాంతంలో మీ మనస్సులను బాధపెట్టినందుకు క్షమించండి... నాపై, నా బృందంపై మీ కోపాన్ని చల్లార్చడానికి మరో అద్భుతమైన కంటెంట్‌తో మీ ముందుకొస్తాను అంటూ సందీప్ పోస్ట్ చేశారు. 'ఈ సారికి వదిలేయ్ అన్నా… నిన్ను నొప్పించాలి అని చేయలేదు' అని మా టీమ్ తరఫున మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు.Dear brothers,2025 started on a greatest note for me by being part of such massive blockbuster film like Daaku Maharaj.The love i got in the name of tweets, gave me immense confidence to do more and more beautiful work.But now seeing the hatred from same accounts and same…— Sandeep Raj (@SandeepRaaaj) July 5, 2025 -
సుమ తనయుడి కొత్త చిత్రం.. ఫస్ట్ లుక్ పోస్టర్ చూశారా?
టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది బబుల్గమ్ మూవీతో టాలీవుడ్ హీరోగా అరంగేట్రం చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.అయితే తాజాగా మరో చిత్రానికి రెడీ అయ్యారు రోషన్. కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ డైరెక్షన్లో నటించనున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి మోగ్లీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తే రోషల్ వైల్డ్ లుక్‌ను తలపిస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ భామ సాక్షిసాగర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీని లవ్ స్టోరీగానే తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. 𝐓𝐇𝐄 𝐋𝐎𝐔𝐃𝐄𝐒𝐓 𝐖𝐀𝐑 𝐎𝐅 𝐀 𝐒𝐈𝐋𝐄𝐍𝐓 𝐋𝐎𝐕𝐄 𝐒𝐓𝐎𝐑𝐘 ❤🔥#Mowgli ’s Wild Adventure Begins 💥💥Stay tuned for more exciting updates!#Mowgli2025A @SandeepRaaaj directorial.🌟ing @RoshanKanakala & #SakshiMhadolkarA @Kaalabhairava7 musical 🎵… pic.twitter.com/vxtDMvAqU4— People Media Factory (@peoplemediafcy) December 19, 2024 -
'కలర్ ఫోటో' డైరెక్టర్ సందీప్ రాజ్ రిసెప్షన్.. హాజరైన నిహారిక (ఫొటోలు)
-
తిరుమలలో నటితో తెలుగు డైరెక్టర్ పెళ్లి.. హాజరైన ప్రముఖులు (ఫోటోలు)
-
తిరుమలలో నటిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ దర్శకుడు
టాలీవుడ్ దర్శకుడు సందీప్ రాజ్ తిరుమలలో వివాహం చేసుకున్నారు. 'కలర్ ఫోటో' సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చకున్న ఆయన తన తొలి మూవీలో చిన్న పాత్ర చేసిన చాందిని రావుతో కలిసి ఏడడుగులు వేశారు. కొద్దిరోజుల క్రితం వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి.షార్ట్ ఫిల్మ్‌లతో కెరీర్ ప్రారంభించిన సందీప్ రాజ్ .. కలర్ ఫోటో చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, తిరుమల వేదికగా నేడు చాందిని రావుతో ఆయన వివాహం ఘనంగా జరిగింది. సినిమా చిత్రీకరణ సమయంలో ఏర్పడిన వారిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారడం ఆపై మూడు ముళ్ల బంధం వరకు సాగడంతో వారు చాలా సంతోషంగా కనిపించారు. పెద్దల అంగీకారంతోనే జరిగిన ఈ వేడుకలో కలర్ ఫోటో సినిమాలో నటించిన హీరో సుహాస్, వైవా హర్ష పాల్గొన్నారు.'కలర్ ఫోటో' సినిమా ఉత్తమ తెలుగు చిత్రం విభాగంలో జాతీయ పురస్కారం సొంతం చేసుకుంది. చిరంజీవి వంటి స్టార్స్ కూడా ఈ చిత్రాన్ని చూసి మెచ్చుకున్నారు. సందీప్ రాజ్ ప్రస్తుతం సుమ- రాజీవ్ కనకాల తనయుడు రోషన్‌తో 'మోగ్లీ' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. 2025లో ఈ చిత్రం విడుదల కానుంది. -
నటితో టాలీవుడ్ డైరెక్టర్ ప్రేమ పెళ్లి.. గ్రాండ్‌గా ఎంగేజ్మెంట్! (ఫొటోలు)
-
'కలర్ ఫోటో' డైరెక్టర్ నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే?
ప్రస్తుతం టాలీవుడ్‌లోనూ పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. త్వరలోనే మరో దర్శకుడి ఇంట్లో పెళ్లి భాజా మోగనుంది. 'కలర్ ఫోటో' సినిమాతో గుర్తింపు తెచ్చకున్న దర్శకుడు సందీప్ రాజ్.. త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. తన తొలి మూవీలోనే చిన్న పాత్ర చేసిన చాందిని రావును ఆయన పెళ్లాడనున్నారు. తాజాగా వీరిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. తనకు కాబోయే భార్య చాందిని రావుకు సందీప్ రాజ్ రింగ్ తొడిగిన ఫోటోలను ఇన్‌స్టాలో పంచుకున్నారు. దీంతో ఈ జంట త్వరలోనే ఏడడుగులు వేయబోతున్నారు.కాగా.. షార్ట్ ఫిల్మ్స్‌తో నటుడు-దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన సందీప్ రాజ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అతడితో పాటు చాందిని రావ్ కూడా షార్ట్ ఫిల్మ్ నటిగా కెరీర్ ప్రారంభించింది. సందీప్ డైరెక్టర్ అయిన తర్వాత ఇతడు తీసిన 'కలర్ ఫొటో', 'హెడ్స్ అండ్ టేల్స్' వెబ్ సిరీస్‌లో చాందిని నటించింది. అలా వీళ్లిద్దరి పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఎప్పుడు ప్రేమలో పడ్డారో గానీ ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయ్యారు.వచ్చేనెల అంటే డిసెంబరు 7న తిరుపతి పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే పెళ్లి తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా యాంకర్ సుమ కొడుకుతో 'మౌగ్లీ' అనే సినిమాని తీస్తున్నాడు సందీప్ రాజ్. కొన్నిరోజుల క్రితమే ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించారు. View this post on Instagram A post shared by Sandeep Raj (@sandeepraaaj) -
నటితో ప్రేమ.. పెళ్లికి సిద్ధమైన 'కలర్ ఫోటో' దర్శకుడు!
టాలీవుడ్లో మరో పెళ్లి భాజా మోగనుంది. 'కలర్ ఫోటో' సినిమాతో గుర్తింపు తెచ్చకున్న దర్శకుడు సందీప్ రాజ్.. త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడట. తన తొలి మూవీలోనే చిన్న పాత్ర చేసిన చాందిని రావ్ అనే అమ్మాయితోనే ఏడడుగులు వేయబోతున్నాడని తెలుస్తోంది.(ఇదీ చదవండి: త్వరలోనే నాగచైతన్య-శోభిత పెళ్లి.. ఆ ఫోటోను డిలీట్ చేసిన చైతూ!)షార్ట్ ఫిల్మ్స్‌తో నటుడు-దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన సందీప్ రాజ్.. ఇప్పుడు దర్శకుడు అయిపోయాడు. ఇతడితో పాటు చాందిని రావ్ కూడా షార్ట్ ఫిల్మ్ నటిగా కెరీర్ ప్రారంభించింది. సందీప్ డైరెక్టర్ అయిన తర్వాత ఇతడు తీసిన 'కలర్ ఫొటో', 'హెడ్స్ అండ్ టేల్స్' వెబ్ సిరీస్‌లో చాందిని నటించింది. అలా చాన్నాళ్లుగా వీళ్లిద్దరూ ఒకరికి ఒకరు పరిచయమే. ఎప్పుడు ప్రేమలో పడ్డారో గానీ ఇప్పుడు పెద్దల అంగీకారంతో ఒక్కటి అయ్యేందుకు రెడీ అయినట్లున్నారు.నవంబర్ 11న విశాఖపట్నంలో సందీప్ రాజ్-చాందిని నిశ్చితార్థం జరుగనుందని, డిసెంబరు 7న తిరుపతి పెళ్లి చేసుకోనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇదంతా అనధికారిక సమాచారం మాత్రమే. సందీప్ రాజ్ వైపు నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఇకపోతే యాంకర్ సుమ కొడుకుతో 'మౌగ్లీ' అనే సినిమాని తీస్తున్నాడు సందీప్ రాజ్. కొన్నిరోజుల క్రితమే ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్) -
మాదాపూర్ లో స్నైల్స్ , హెయిర్, బ్యూటీ & నెయిల్స్ రెండవ బ్రాంచ్ ను ప్రారంభించిన జబర్దస్త్ రితు చౌదరి, డైరెక్టర్ సందీప్ రాజ్ (ఫోటోలు)
-
మరో ఊర మాస్ కాంబినేషన్ స్టోరీ కూడా లీక్?
-
ముఖచిత్రం మూవీ టీం తో " స్పెషల్ చిట్ చాట్ "
-
కలర్ ఫొటోకు వీళ్లను తీసుకుంటే చాలా చీప్‌గా చూశారు: డైరెక్టర్
కలర్ ఫొటో.. ఉత్తమ చిత్రంగా ఈ మధ్యే జాతీయ అవార్డు అందుకుంది. దీంతో సినిమా హీరో సుహాస్, దర్శకుడు సందీప్ రాజ్‌ల పేర్లు ఒక్కసారిగా మార్మోగిపోయాయి. తమ సినిమాకు ఇంతటి గౌరవం లభించినందుకు సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. తాజాగా సుహాస్, సందీప్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'కలర్ ఫొటో షూటింగ్ సమయంలో ఇది హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అని, ఇందులో సునీల్ హీరో అని చెప్పేవాడిని. నేను, హర్ష క్యారెక్టర్స్ వేస్తున్నామని మా వాళ్లందరికీ చెప్పేవాడిని. నేను హీరో అని చెప్పడం ఎందుకని అలా చేశాను' అని చెప్పుకొచ్చాడు సుహాస్. 'కలర్ ఫొటోకు చాందినిని హీరోయిన్గా తీసుకుందామనుకున్నప్పుడు చాలామంది వద్దన్నారు. ఆ అమ్మాయి ఇంతకుముందు చేసిన సినిమాలు చూశావు కదా! ఒక నిర్మాత అయితే సుహాసా... రాహుల్ రామకృష్ణతో చేయొచ్చు కదా, నేను బడ్జెట్ పెడతాను అన్నాడు. సుహాస్ ఎందుకు అని అడిగినా పర్వాలేదు, కానీ అతడు అవసరమా? అని కొందరు చీప్ లుక్ ఇచ్చారు అని ఆవేదన వ్యక్తం చేశాడు సందీప్ రాజ్. చదవండి: నాకేదైనా అయితే వాళ్లే కారణం, వదిలిపెట్టొద్దు: హీరోయిన్ రామారావు ఆన్ డ్యూటీ రివ్యూ -
బడా బ్యానర్లో ఛాన్స్ కొట్టేసిన కలర్ ఫోటో దర్శకుడు
తన మొదట చిత్రం ‘కలర్ ఫోటో’ తో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నదర్శకుడు సందీప్ రాజ్. ఆహా ఓటీటీ వేదికగా విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు అదిరిపోయే వ్యూస్ ను సంపాదించింది. నూతన దర్శకులకు కూడా ఈ మధ్య చాలా మంది స్టార్ హీరోలు, నిర్మాణ సంస్థలు అవకాశాలు ఇస్తున్నారు. కథ నచ్చితే వెంటనే వాళ్లతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు సందీప్ రాజ్‌కు కూడా స్టార్ హీరో నుంచి పిలుపు వచ్చిందని తెలుస్తుంది. నూతన దర్శకుడైన ‘కలర్ ఫోటో’ సినిమాను తెరకెక్కించిన తీరు ఇండస్ట్రీలో కూడా చాలా మంది ప్రముఖలకు నచ్చింది. అందుకే గీతా ఆర్ట్స్ నుంచి పిలుపు అందుకున్నాడు. ఇప్పటికే సందీప్ రాజ్‌కి గీత ఆర్ట్స్ వాళ్లు అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేశారు. ఈ సంస్థలో హిట్ అందుకుంటే ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం సందీప్ కి ఉండదు. ఇప్పటికే ఓ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. బహుశా ఈ స్టార్ హీరో ప్రాజెక్ట్ గీతా ఆర్ట్స్ సంస్థలోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ స్టార్ హీరో ఎవరనేది మాత్రం తెలియడం లేదు. ఏదేమైనా ఈ మధ్య టాలీవుడ్లో నూతన దర్శకుల హవా కొనసాగుతోందనే చెప్పాలి. ( చదవండి: ఒక రాత్రి... నాలుగు కథలు! ) -
కలర్ ఫొటో రివ్యూ
టైటిల్: కలర్ ఫొటో నటీనటులు: సుహాస్, చాందిని చౌదరి, సునీల్, వైవా హర్ష, తదితరులు రచనా, దర్శకత్వం: సందీప్ రాజ్ సంగీతం: కాళ భైరవ బ్యానర్: అమృత ప్రొడక్షన్&లౌఖ్య ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు: సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని విడుదల: 23 అక్టోబర్ (ఆహా) దసరా పండగకు కళకళలాడే థియేటర్లు ఈసారి మాత్రం వెలవెలబోయాయి. నువ్వానేనా అంటూ పోటీలో దిగే పెద్ద సినిమాలు ఈసారి పత్తా లేకుండా పోయాయి. కానీ ఓ చిన్న సినిమా మాత్రం దసరా బరిలో నిలిచింది. పడిపడి లేచే మనసు, మజిలీ, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాల్లో హీరో స్నేహితుడిగా కమెడియన్‌గా నటించిన సుహాస్ హీరోగా పరిచయమవుతున్న సినిమా కలర్ ఫొటో. తెలుగమ్మాయి చాందిని చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. యూట్యూబ్ వీడియోల ద్వారా పాపులర్ అయిన సందీప్‌రాజ్ తొలిసారిగా దర్శకుడి బాధ్యతలు ఎత్తుకున్నాడు. కానీ కథ మాత్రం సాయి రాజేష్ నీలం అందించారు. తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహాలో అక్టోబర్ 23న రిలీజైన ఈ చిత్రం వీక్షకుల మదిని క్లిక్మనిపించిందో లేదో చూసేద్దాం.... కథ 1997లో జరిగే కథ ఇది. మచిలీపట్నంలో జయకృష్ణ (సుహాస్) అనే కుర్రాడు ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదువుకుంటాడు. టీలో బిస్కెట్ పడటం ఎంత కామనో కాలేజీలో కుర్రాళ్లు ప్రేమలో పడటం కూడా అంతే కామన్. అలా జయకృష్ణ కూడా అదే కాలేజీలో చదువుతున్న దీప్తి వర్మ(చాందినీ చౌదరి)ని తొలిచూపులోనే ప్రేమించేశాడు. కానీ ఆ విషయాన్ని ఆమెతో చెప్పేందుకు చాలా మథనపడ్డాడు. కారణం.. నల్లగా ఉన్నాడని ఎక్కడ ప్రేమను కాదంటుందో అని. ఓ రోజు సీనియర్లు మనోడిని అందరిముందు చితక్కొట్టడంతో దీపుకు పరిచయం ఏర్పడుతుంది. కృష్ణ వ్యక్తిత్వం నచ్చి దీపు కూడా అతన్ని మనసారా ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. కానీ ఆమె అన్నయ్య ఇన్స్పెక్టర్ రామరాజు(సునీల్)కు ఈ ప్రేమాదోమా నచ్చదు. పైగా చెల్లెలిని మంచి అందగాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇంతలో దీప్తి ప్రేమ సంగతి అతడికి రామరాజుకు తెలుస్తుంది. నలుపంటే గిట్టని అతడు వాళ్ల ప్రేమకు శత్రువుగా మారతాడు. దీప్తికి తెలియకుండా అతడిపై దాడి చేయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? జయకృష్ణ, దీప్తి పెళ్లి చేసుకున్నారా? లేదా తెలియాలంటే సినిమా చూడాల్సిందే..! (పెంగ్విన్ మూవీ రివ్యూ) విశ్లేషణ ప్రేమ ఒక సముద్రం. దానిపై వచ్చిన సినిమాలు అలలవంటివి. చిన్నా పెద్దా తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేమను ఆధారంగా తీసుకుని వచ్చినవే. అయితే కుల, మత, ప్రాంతీయ వివక్షతో ప్రేమ కథలు వచ్చాయి. కానీ వర్ణ వివక్షను ఆధారంగా చేసుకొని మాత్రం సినిమాలు రాలేదనే చెప్పొచ్చు. దర్శకుడు సందీప్ రాజ్ తొలి ప్రయత్నంలోనే వైవిధ్యభరితమైన కథను ఎంచుకున్నారు. కామెడీ పండించే సుహాన్‌తో ఎమోషన్స్ పండించారు. కానీ ప్రేమకావ్యాన్ని రక్తికట్టించడంలో తడబడ్డారు. కథను సూటిగా సుత్తి లేకుండా చెప్పలేకపోయాడు. ఫస్టాఫ్ మొత్తం హీరో వన్‌సైడ్ లవ్, సెకండాఫ్‌లో ప్రేమ పట్టాలెక్కడం, ఓ రెండు పాటలేసుకోవడం, వీరి ప్రేమకు హీరో అన్నయ్య అడ్డు చెప్పడం, దాడి చేయడం మళ్లీ పాత వాసనలే కనిపిస్తాయి. అయితే అమ్మాయిలు అందంగా ఉన్న అబ్బాయిలను మాత్రమే ప్రేమిస్తారు అనే అపోహను ఈ సినిమా పోగొట్టే ప్రయత్నం చేసింది. కుల మత ప్రాంతాలే కాదు వర్ణం కూడా ప్రేమ సాగరానికి ఆనకట్ట వేయలేదనే సందేశాన్ని అందించారు. (నా కలర్‌ఫొటోకు విలన్ సునీల్) నటన సుహాస్ తొలిసారి హీరోగా చేసినప్పటికీ సినిమాలో అనుభవమున్న నటుడిగానే కనిపిస్తారు. దీప్తి పాత్రలో చాందినీ చౌదరి సహజంగా నటిస్తూ మెప్పించింది. సునీల్ విలన్ పాత్రలో ఒదిగిపోయారు. కానీ ప్రేక్షకుడికి మాత్రం అతడిని చూస్తే భయంకరమైన విలన్ అనిపించదు. అప్పుడప్పుడు నవ్వులు పూయించడానికే ప్రత్యేకంగా వచ్చే వైవా హర్ష కామెడీ ట్రాక్ నవ్విస్తుంది. కీరవాణి తనయుడు కాళ భైరవ అందించిన నేపథ్య సంగీతం, పాటలు బాగున్నాయి. (‘హిట్’ మూవీ రివ్యూ) ప్లస్ పాయింట్స్: సుహాస్ పరిపక్వత నటన కథ సంగీతం మైనస్ పాయింట్స్ కథను సాగదీయడం ప్రేమకథను మరింత లోతుగా, గాఢంగా చూపించలేకపోవడం చివరి మాట: ప్రేమకు కలర్ కూడా అడ్డు కాదన్న మంచి సందేశాన్ని అందించారు. అందుకని దీన్ని అందమైన అనకుండా రమ్యమైన ప్రేమకథ అనేద్దాం.. -
కేసు వాపస్ తీసుకోకుంటే యాసిడ్ పోసి చంపుతా ...
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఇంటి నుంచి గెంటేశాడో ప్రబుద్ధుడు. భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా... వాపస్ తీసుకోకుంటే యాసిడ్ పోసి చంపుతానని బెదిరిస్తున్నాడు. దీంతో ఆమె ప్రాణాలను అరిచేతులో పెట్టుకొని జీవిస్తోంది. ఒడిశాకు చెందిన మహేష్ ప్రసాద్ కుమార్తె ఎస్. నేహరాజ్ (27)ను ఖైరతాబాద్‌కు చెందిన సందీప్‌రాజ్ 2010 ఏప్రిల్ 21న ప్రేమవివాహం చేసుకున్నాడు. సందీప్ ప్రస్తుతం విజయవాడలోని ఎయిర్‌కోస్ట్ కాల్సెంటర్లో పని చేస్తున్నాడు. కాగా, పెళ్లైనప్పటి నుంచీ అదనపు కట్నం కోసం భర్తతో పాటు అత్తమామలు సుగుణ, బాల్‌సుందర్, మరదలు రీనారాజ్, భర్త స్నేహితుడు ఇలియాస్ వేధిస్తున్నారు. ఈ క్రమంలోనే నెల రోజు క్రితం ఆమెను ఇంటి నుంచి గెంటివేశారు. దీంతో ఆమె సీసీఎస్ మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు ఉపసంహరించుకుని ఒడిశాకు వెళ్లిపోవాలని, లేకపోతే యాసిడ్ పోసి చంపుతానని భర్త బెదిరిస్తున్నాడు. దీంతో బాధితురాలు సోమవారం మరోసారి భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త సందీప్ ప్రస్తుతం విజయవాడలో మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. భర్తనుంచి తనకు ప్రాణహాని ఉందని, వెంటనే అతడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది.