
యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల నటిస్తోన్న రెండో చిత్రం మోగ్లీ. ఈ సినిమాకు కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్‌గా ఆరంగేట్రం చేస్తోంది. బబుల్గమ్తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రోషన్ ఈ మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నారు.
తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను డైరెక్టర్ సందీప్ రాజ్ రివీల్ చేశారు. 1850 రోజుల తర్వాత నా రెండో సినిమా మీ ముందుకు వస్తోంది.. పేరుతో స్పెల్లింగ్ను గుర్తు పెట్టుకోండి అంటూ మోగ్లీ పోస్టర్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆగస్టు 28న థియేటర్లలో మోగ్లీ సందడి చేయనుందని వెల్లడించారు. కాగా.. ఈ సినిమాకు కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించనున్నాడు. ఈ వినాయక చవితికి మోగ్లీ సందడి చేయనుంది.