
పాన్ ఇండియా సినిమాలతో అలరిస్తున్న రష్మిక.. రహస్యంగా నిశ్చితార్థం చేసుకుంది. హీరో విజయ్ దేవరకొండతో ఇది జరిగింది. అధికారికంగా బయటకు చెప్పలేదు. అయితే ఫిబ్రవరిలో డెస్టినేషన్ వెడ్డింగ్ ఉంటుందని విజయ్ టీమ్ చెబుతున్నారు. ఈ లెక్కన చూసుకుంటే త్వరలో రష్మిక పెళ్లి హడావుడిలో పడిపోతుంది. అంతకు ముందు ఈమె నటించిన ఓ రెండు మూవీస్... రెండు వారాల వ్యవధిలో రిలీజ్ కానున్నాయి.
(ఇదీ చదవండి: స్క్రిప్ట్ డిమాండ్ చేస్తేనే లిప్ కిస్.. ఈ రోజుల్లో పెద్ద జోక్!)
ఈ ఏడాది ఛావా, సికిందర్, కుబేర సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించిన రష్మిక.. ఈ నెల 21న 'థామా' అనే హారర్ మూవీతో థియేటర్లలోకి రానుంది. ఇప్పుడు ఈమె లీడ్ రోల్ చేసిన 'గర్ల్ ఫ్రెండ్' చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. నవంబరు 07న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నట్లు ఓ స్పెషల్ వీడియో విడుదల చేసి మరీ చెప్పుకొచ్చారు.
గీతా ఆర్ట్స్ నిర్మించిన 'ద గర్ల్ ఫ్రెండ్' సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకుడు కాగా.. రష్మిక సరసన దీక్షిత్ శెట్టి నటిస్తున్నాడు. ఇప్పటికే ఒకటి రెండు పాటలు రిలీజ్ కాగా రెస్పాన్స్ బాగానే వచ్చింది. నవంబరు 07న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పుడు ప్రకటించారు. ఆ తేదీన చెప్పుకోదగ్గ పెద్ద మూవీస్ అయితే ఏం లేవు.
(ఇదీ చదవండి: నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న మిరాయ్)